elephant tusk
-
5 లక్షల ఏళ్ల నాటి ఏనుగు దంతం
ఏంటీ మొద్దు ఫొటో? ఇంత పెద్దగా పెట్టారు అనుకుంటున్నారా? అది మొద్దు కాదండి బాబు.. ఏనుగు దంతం. 5 లక్షల ఏళ్ల కిందటి ఈ ఏనుగుదంతం ఇజ్రాయెల్లో తవ్వకాల్లో బయటపడింది. 4 లక్షల ఏళ్ల కిందటే అంతరించిపోయిన అరుదైన ఏనుగు దంతం ఇది. సాధారణంగా ఆఫ్రికాలోని అతి పెద్ద ఏనుగుల దంతం సగటున ఐదు నుంచి ఆరడుగుల పొడవు, 25 నుంచి 30 కిలోల బరువు ఉంటుంది. కానీ.. ఎనిమిదన్నర అడుగుల పొడవు, 150 కిలోల బరువు ఉంది. దాని పక్కనే ఆ కాలంలో ఆదిమ మానవుడు జంతువులను, పెద్ద పెద్ద ఏనుగులను సైతం కోసేందుకు ఉపయోగించిన రాతి వస్తువు కూడా దొరికింది. దంతం సైజును బట్టి... ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న ఏనుగుల కంటే ఆ ఏనుగులు చాలా పెద్దవై ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. సాధారణంగా తినడానికి, నిల్వ చేసుకోవడానికైనా చిన్నచిన్న జంతువులను వేటాడతారు. ఇంత పెద్ద ఏనుగును వేటాడి ఆ మాంసం నిల్వ చేయడం కష్టసాధ్యమైన పని. అదో పెద్ద సామూహిక ఉత్సవం కోసం జరిగిన వధ అయి ఉంటుందని భావిస్తున్నారు. -
దంతాలు కోసుకెళ్లి.. ఏనుగును చంపి దహనం చేశారు...
సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఏనుగును హతమార్చారు. దంతాల్ని కోసి తీసుకెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా దహనం కూడా చేశారు. కోయంబత్తూరు జిల్లా వాల్పారై వరట్టు పారై ఎస్టేట్ కారి్మకులు అడవుల్లో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లారు. సేలయార్ డ్యాంపై భాగంలో సురక్షిత ప్రాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. కట్టెలు కొట్టుకుని తిరుగుపయనంలో ఉండగా దుర్వాసన రావడాన్ని గుర్తించారు. ఓ చోట ఏనుగు దహనం చేసిన స్థితిలో పడి ఉండడంతో అటవీశాఖ అధికారి జయచంద్రన్కు సమాచారం అందించారు. ఆయన నేతృత్వంలోని బృందం, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏనుగును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చి, ఆ దంతాలను కోసుకెళ్లి ఉండడం వెలుగు చూసింది. ఆధారాల్ని చెరిపేందుకు ఆ పరిసరాల్లో రసాయనం సైతం పోసి ఉండడం బయటపడింది. ఏనుగును దహనం చేసి ఉండడంతో, 90 శాతం మేరకు గుర్తు పట్టలేని పరిస్థితి. దీంతో అక్కడున్న రసాయనాలు, ఏనుగు మృతదేహంలోని కొంతభాగాన్ని పరిశోధనకు తరలించారు. ఈ కిరాతకానికి పాల్పడ్డ వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రణ -
43 లక్షల విలువైన ఏనుగు దంతాలు స్వాధీనం
బెంగళూరు: ఏనుగు దంతాలను విక్రయించడానికి యత్నించిన వ్యక్తిని ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... తమిళనాడులోని ఈరోడ్కు చెందిన పోచియప్పన్ గురువారం రాత్రి యశ్వంతపురం సమీపంలోని మారప్పనపాళ్యలో ఎనిమిది కేజీలకు పైగా బరువున్న ఏనుగు దంతాలను విక్రయించడానికి యత్నించాడు. గస్తీ పోలీసులకు అనుమానం వచ్చి అతడి వద్ద బ్యాగులను తనిఖీ చేశృ఼రు. బ్యాగ్లోని విలువైన ఏనుగు దంతాలు బయటపడటంతో అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడులో ఏనుగులను చంపి దంతాలను తీసుకు వచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించడాని పోలీసులు తెలిపారు. ఈ దందాలో ఎంత మంది ఉన్నారలో ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.