
ముసలిమడుగు వద్ద రోడ్డుపై ఒంటరి ఏనుగు
పలమనేరు: మండలంలోని మొసలిమడుగు వద్ద పలమనేరు–గుడియాత్తం రహదారిపై శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ ఒంటరి ఏనుగు రోడ్డుపైకి వచ్చేసింది. దీంతో ఏనుగును చూసి రోడ్డుపై వాహనాలను దూరంగా ఆపేశారు. కొందరు ఆకతాయిలు ఏనుగు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. గురువారం ఏటిగడ్డ గ్రామ సమీపంలో హల్‌చల్ చేసిన ఒంటరి ఏనుగు కౌండిన్య నదిని దాటి శుక్రవారం మెయిన్ రోడ్డుపైకి వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment