
సమ్‌థింగ్ స్పెషల్
కేరళ త్రిసూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయంలో ఒక ఏనుగు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఇది సజీవమైన ఏనుగు కాదు. లైఫ్–సైజ్ మెకానికల్ ఎలిఫెంట్. ప్రముఖ సితారిస్ట్ అనౌష్క శంకర్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) కలిసి శ్రీకృష్ణస్వామి ఆలయానికి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్‌ల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది.
‘ఈ రోబోటిక్ ఏనుగు వల్ల సజీవమైన ఏనుగులను గొలుసులతో బంధించి, ఆయుధాలతో నియంత్రిస్తూ బాధ పెట్టడం అనేది ఉండదు. రోబోటిక్ ఏనుగులు సజీవ ఏనుగులకు మానవీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి’ అంటోంది పెటా. రబ్బర్, ఫైబర్, మెటల్, ఫోమ్, స్టీల్‌తో రూపొందించిన ఈ యాంత్రిక ఏనుగు సజీవ ఏనుగులా భ్రమింపచేస్తుంది. తల, కళ్లు, చెవులు, తోక, తొండాలను కదిలిస్తుంది. తొండాన్ని పైకి లేపి నీళ్లు చల్లుతుంది.
Comments
Please login to add a commentAdd a comment