special attraction
-
ఇది ఏనుగు... కానీ కాదు!
కేరళ త్రిసూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయంలో ఒక ఏనుగు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఇది సజీవమైన ఏనుగు కాదు. లైఫ్–సైజ్ మెకానికల్ ఎలిఫెంట్. ప్రముఖ సితారిస్ట్ అనౌష్క శంకర్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) కలిసి శ్రీకృష్ణస్వామి ఆలయానికి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది.‘ఈ రోబోటిక్ ఏనుగు వల్ల సజీవమైన ఏనుగులను గొలుసులతో బంధించి, ఆయుధాలతో నియంత్రిస్తూ బాధ పెట్టడం అనేది ఉండదు. రోబోటిక్ ఏనుగులు సజీవ ఏనుగులకు మానవీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి’ అంటోంది పెటా. రబ్బర్, ఫైబర్, మెటల్, ఫోమ్, స్టీల్‌తో రూపొందించిన ఈ యాంత్రిక ఏనుగు సజీవ ఏనుగులా భ్రమింపచేస్తుంది. తల, కళ్లు, చెవులు, తోక, తొండాలను కదిలిస్తుంది. తొండాన్ని పైకి లేపి నీళ్లు చల్లుతుంది. -
'ధూం ధాం' సక్సెస్ మీట్.. చీరలో హెబ్బా సూపర్! (ఫొటోలు)
-
తెర వెనక 'సరిపోదా శనివారం'.. నాని-ప్రియాంక ఇలా (ఫొటోలు)
-
IPL 2024: ఫ్రాంఛైజీ ఓనర్ల పేర్లు తెలుసా? వీరు స్పెషల్ అట్రాక్షన్!
-
Niharika Konidela: వరుణ్ - లావణ్య రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిహారిక (ఫొటోలు)
-
అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి!
సాక్షి,హిందూపురం(అనంతపురం): ఐదు నుంచి ఆరు అంగుళాల గోధుమ వర్ణంతో వంపు తిరిగిన పొడవాటి ముక్కు.. తెలుపు రంగులో మెడ, తల, వీపు.. ఎరుపు, గుళాబీ మిళితమైన రెక్కల కొనలు.. రెక్కల మధ్య, మెడ కింద ముదురు ఆకుపచ్చ రంగు, కాళ్లు తొడల వరకు తెలుపు రంగుతో కూడిన పక్షులు చిలమత్తూరు మండలం వీరాపురంలో సందడి చేస్తున్నాయి. ఇవి రష్యా దేశంలోని సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు. సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం వేల మైళ్ల దూరం నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి. ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వీరాపురంతో పాటు వెంకటాపురం, పరిసర ప్రాంతాల చెరువుల్లో నీరు చేరింది. అటవీ శాఖ అధికారులు చెరువుల్లోకి చేప పిల్లలను సైతం వదిలారు. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలలోపు ఇక్కడకు పక్షులు వలస వచ్చి చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. నెలరోజుల తర్వాత ఆడ పక్షి మూడు లేదా నాలుగు గుడ్లు పెడుతుంది. గుడ్ల వద్ద ఒక పక్షి కాపలా ఉంటే.. మరో పక్షి ఆహారం సేకరించుకుని వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో గుడ్లు పొదుగుతాయి. రెండు నెలలు పాటు పిల్లలకు ఆహారం అందజేస్తాయి. పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక అవే ఆహారం కోసం వెళ్లి వస్తాయి. సంతానం ఎదిగిన తర్వాత అన్నీ కలిసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. -
ఈటలకు మార్మోగిన చప్పట్లు: అమిత్ షా సభలో స్పెషల్ అట్రాక్షన్
సాక్షి, నిర్మల్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఈటల రాజేందర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటల పేరు ఎత్తగానే పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి స్పందన లభించింది. సభ ప్రారంభంలోనే అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఈటల రాజేందర్ పేరు పలికారు. వెంటనే ఈటల లేచి నిలబడగా ‘ముందుకు రాజేందరన్న’ అంటూ అమిత్ షా పిలిచారు. ఈటల కోసం ప్రత్యేకంగా చప్పట్లు కొట్టించారు. ‘రాజేందర్ ఎన్నిక వస్తోంది. రాజేందర్‌ను గెలిపిస్తున్నాం కదా! వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాం కదా’ అని అమిత్ షా ఈటలకు కార్యకర్తలతో జేజేలు పలికించారు. ఈ బహిరంగ సభ ఈటల ఎన్నిక సభ మాదిరి కనిపించింది. ఈ సభ ఉత్సాహంతో బీజేపీ, ఈటల రాజేందర్ వర్గం హుజురాబాద్‌లో ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? -
టోక్యో ఒలింపిక్స్: వీరి విన్యాసాలు తప్పక చూడాల్సిందే
అంతర్జాతీయ టోర్నీలలో ఎన్ని పతకాలు గెలిచినా రాని గుర్తింపు ఒలింపిక్స్ క్రీడల్లో సాధిస్తే రాత్రికి రాత్రే వస్తుంది. విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగురవేయాలని... అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటికే తమదైన ముద్ర వేసిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఒకటికంటే ఎక్కువ పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరికొందరు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేరు గడించాలని ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాభిమానులు తప్పక చూడాల్సిన కొందరు క్రీడాకారులు ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా... –సాక్షి క్రీడా విభాగం మెరుపుతీగ... సిమోన్ బైల్స్ అమెరికా జిమ్నాస్ట్ మెరుపుతీగ సిమోన్ బైల్స్. జిమ్నాస్టిక్స్‌పై ఆసక్తి ఉన్నవారికి సిమోన్ విన్యాసాలు బాగా తెలుసు. ముఖ్యంగా కరోనా కారణంగా లభించిన వాయిదా సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ఈ ఒలింపిక్స్‌లో కను రెప్ప వేయకుండా చూసే ఈవెంట్ ఏదైనా ఉంటే అది బైల్స్ విన్యాసమే అవుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన 24 ఏళ్ల బైల్స్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. టోక్యోలోనూ ఆమె ఐదు స్వర్ణాలపై గురి పెట్టింది. బ్రొమెల్... బోల్ట్ వారసుడవుతాడా! బీజింగ్ (2008) మొదలు రియో (2016) ఒలింపిక్స్ దాకా స్ప్రింట్‌లో జమైకన్ ఉసేన్ బోల్ట్ హవానే నడిచింది. అతనేమో రిటైరయ్యాడు. మరి ఇప్పుడెవరా పందెం కోడి అంటే... ట్రేవోన్ బ్రోమెల్ పేరు బాగా వినిపిస్తోంది. 25 ఏళ్ల ఈ అమెరికన్ స్ప్రింటర్ వేగంలో మరో చిరుతను, బోల్ట్‌ను తలపిస్తున్నాడు. ఇటీవల జరిగిన అమెరికా ట్రయల్స్‌లో అతను 100 మీటర్ల పరుగు పందెంను 9.80 సెకన్లలో పూర్తిచేసి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. టోక్యోలోనూ ఈ వేగం నమోదైతే మూడు ఒలింపిక్స్‌ల తర్వాత విజేతగా నిలిచిన అమెరికన్ చిరుతగా నిలుస్తాడు. 2004 ఏథెన్స్లో గ్యాట్లిన్ పసిడి అనంతరం మరో అమెరికన్ గోల్డెన్ చాన్స్ కొట్టలేకపోయారు. లేడీ చిరుత... షెల్లీ జమైకన్ లేడీ చిరుత ఫ్రేజర్. గత రియో ఒలింపిక్స్‌లో స్ప్రింట్ (100 మీ.)లో కాంస్య పతకం పొందిన ఈ జమైకా అథ్లెట్ తన పరుగుకు ఈ నాలుగేళ్లలో మరింత వేగాన్ని జోడించింది. మహిళల 100 మీటర్ల పరుగులో విజయమైనా, స్వర్ణమైనా తనదేనని చెబుతున్నారంతా. ఆమె పసిడిపై కన్నేసింది. మనం ఆమె పరుగుపై కన్నేద్దాం. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న షెల్లీ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. బంగారు చేప... కెటీ లెడెక్కీ మహిళల ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో కేటీ లెడెక్కీకి అద్భుతమైన రికార్డు ఉంది. మూడోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన లెడెక్కీ మరిన్ని స్వర్ణాలు తన మెడలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఆమె ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. మనం కూడా లెడెక్కీ విన్యాసంపై ఓ లుక్కెద్దాం. గోల్డెన్ స్లామ్ దారిలో... ‘గోల్డెన్ స్లామ్’ వేట ఈ ఏడాది ఆస్ట్రేలియాలో మొదలైంది. ఫ్రెంచ్ ఓపెన్ మీదుగా వింబుల్డన్ దాకా సాగింది. ఇప్పుడు టోక్యో దగ్గరకు వచ్చింది. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా... బలమైన ప్రత్యర్థులు లేని కారణంగా జొకోవిచ్‌కు ఒలింపిక్స్ స్వర్ణం దూరం కాబోదు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి సెప్టెంబర్‌లో జరిగే యూఎస్ ఓపెన్‌లో జొకోవిచ్ విజేతగా నిలిస్తే... పురుషుల టెన్నిస్‌లో గోల్డెన్‌స్లామ్ సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టిస్తాడు. సూపర్ ఫెలిక్స్... అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మహిళా అథ్లెట్. షార్ట్ డిస్టెన్స్‌లో అసమాన ప్రదర్శన కనబరుస్తున్న 35 ఏళ్ల అలీసన్ పోటీని టోక్యోలో తప్పకుండా చూడాల్సిందే. అమెరికాలో నిర్వహించిన ట్రయల్స్‌లో మెరుపు వేగంతో పోటీల్ని ముగించిన ఫెలిక్స్ తాజా ఒలింపిక్స్‌లో మేటి రన్నర్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా ఐదో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఫెలిక్స్ ఇప్పటివరకు ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించింది. ఒలింపిక్స్ మహిళల అథ్లెటిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా ఫెలిక్స్ గుర్తింపు పొందింది. ‘హ్యాట్రిక్’పై టెడ్డీ గురి... ఫ్రాన్స్ జూడో ప్లేయర్ టెడ్డీ రినెర్ హ్యాట్రిక్ స్వర్ణం లక్ష్యంగా టోక్యో బరిలోకి దిగుతున్నాడు. లండన్, రియో విశ్వక్రీడల్లో బంగారు పతకాలు సాధించిన 32 ఏళ్ల రినెర్కు ఇది నాలుగో ఒలింపిక్స్. బీజింగ్ (2008) ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు. ప్లస్ 100 కేజీల కేటగిరీలో పోటీపడే ఈ ఫ్రెంచ్ జూడోకా గత 154 బౌట్లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా ఎదిగాడు. -
కశ్మీర్ మేక.. ధర కేక!
కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో శనివారం జరిగిన గొర్రెల సంతలో కశ్మీర్ మేకపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరో వారంలో బక్రీద్ పండుగ రానుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో మేలు జాతి మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు కొనేందుకు పోటీపడ్డారు. అయితే కశ్మీర్ మేకపోతులు ఒక్కోటి రూ.50 వేలపైన పలకడం విశేషం. -
నితిన్ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు
సాక్షి, హైదరాబాద్ : తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నితిన్. నేడు (మార్చి30)న 38వ ఏటలోకి అడుగుపెట్టాడు. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డే కావడంతో భార్య షాలిని సహా అత్యంత సన్నిహితుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి నితిన్ ఇంట్లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సునీత-రామ్ దంపతులకు ఇటీవలె పెళ్లి అయిన సంగతి తెలిసిందే. వీరి ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఓ పార్టీని హీరో నితిన్ స్వయంగా ఏర్పాటు చేశాడు. సునీత భర్త రామ్‌తో నితిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా నితిన్ బర్త్‌డే వేడుకల్లో అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు. ఈ లిస్ట్‌లో సింగర్ సునీత దంపతులు కూడా ఉండటం విశేషం. కాగా ఈ ఏడాది చెక్సినిమాతో వచ్చిన నితిన్..రంగ్‌దే చిత్రంతో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. చదవండి : నితిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? రామ్ అలా ప్రపోజ్ చేశాడు : సింగర్ సునీత -
గణతంత్ర వేడుకల్లో రఫేల్ జిగేల్
న్యూఢిల్లీ: భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా ఆంక్షల మధ్య జరగనున్నాయి. ఈ నెల 26న దేశ సైనిక సత్తా చాటడానికి త్రివిధ బలగాలు సిద్ధమయ్యాయి. అయితే కోవిడ్–19 కారణంగా భారీగా మార్పులు చేర్పులు చేశారు. ప్రజా సందర్శనకి ఆంక్షలతో పాటు ఎన్నో కొత్త శకటాలు ఈ ఏడాది దర్శనమివ్వనున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఈ ఏడాది పెరేడ్లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్ లెఫ్ట్‌నెంట్ భావనాకాంత్ ఈ సారి ప్రదర్శనలో పాల్గొంటారు. భారత వాయుసేనకు చెంది తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్ ప్రాతినిధ్యం వహించబోతోంది. లేహ్ జిల్లాలో చారిత్రక థిక్సే మఠాన్ని ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. థిక్సే కొండలపై ఉన్న ఈ మఠం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమివ్వబోతోంది. భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ 1971 భారత్–పాక్ యుద్ధ సమయంలో నావికా దళ ఆపరేషన్‌ను శకటంగా ప్రదర్శిస్తోంది. ఇక వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు భారీ ర్యాలీకి సిద్ధం కావడంతో ఎలాంటి పరిణామలు ఎదురు కాబోతాయా అన్న ఆందోళనైతే నెలకొంది. కరోనా ఆంక్షల ప్రభావం కోవిడ్–19 ఆంక్షల ప్రభావంతో ఈ సారి ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తొలుత రావడానికి అంగీకరించినప్పటికీ కరోనా విజృంభణతో పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో అయిదు దశాబ్దాల తర్వాత ముఖ్య అతిథి లేకుండానే వేడుకలు జరగనున్నాయి. గతంలో 1952, 1953, 1966లలో ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి కరోనా కారణంగా సందర్శకుల సంఖ్యని బాగా తగ్గించారు. గత ఏడాది లక్షా 50 వేల మందికి అనుమతినిస్తే ఈ సారి 25 వేల మంది హాజరుకానున్నారు. ఇక మీడియా సిబ్బంది సంఖ్య 300 నుంచి 200కి తగ్గించారు. ఈ సారి పాఠశాల విద్యార్థులు పెరేడ్లో ఉండరు. ఇక 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని ఇండియా గేట్ లాన్స్‌లోకి మాత్రమే అనుమతినిస్తారు. పెరేడ్ సమయాన్ని కూడా తగ్గించారు. ఇండియా గేట్ దగ్గర నేషనల్ స్టేడియం వరకు మాత్రమే పెరేడ్‌కు అనుమతినిచ్చారు. ఇక శకటాలు మాత్రం ఎర్రకోట వరకు వెళతాయి మాజీ సైనికాధికారులు, మహిళా అధికారులు పాల్గొనే కార్యక్రమాలను రద్దు చేశారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించే మోటార్ సైకిల్ స్టంట్స్ కూడా ఈ సారి ఉండవు. శనివారం రాజ్‌పథ్‌లో ఫుల్ డ్రెస్ రిహార్సల్లో భారత యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రి -
నిహారిక పెళ్లిలో వీళ్లదే స్పెషల్ అట్రాక్షన్..
మెగా డాటర్ నిహారిక పెళ్లివేడుక సందర్భంగా కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇప్పటికే ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయ్‌పూర్‌కు చేరుకొని ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న పవన్ కల్యాణ్ కూడా కొడుకు అకిరా నందన్‌తో కలిసి ఉదయ్‌పూర్ చేరుకున్నారు. నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలు అందరూ సందడి చేస్తున్నారు. అయితే నిహారిక పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్, అల్లుఅర్జున్ దంపతుల కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్న రాత్రి జరిగిన సంగీత్ వేడుకల్లో రామ్‌చరణ్ వైట్ కలర్ సూట్, ట్రౌజర్ ధరించగా, దీనికి మ్యాచింగ్‌లా ఉపాసన చిక్ వైట్ ఫుల్ స్లీవ్టాప్, పింక్ లెహంగాను ధరించి ఆకట్టుంది. మరోవైపు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వైట్ అండ్ పింక్ కుర్తా- పైజామా ధరించగా, స్నేహ ఆఫ్- ఫోల్డర్ టాప్, లెహంగాను ధరించింది. ఇందుకు మ్యాచింగ్ డిజైనర్ వ్యాలెట్‌తో ఎంతో స్టయిలిష్‌గా కనిపించింది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (నిహారికకు మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి View this post on Instagram A post shared by Hyderabad Times (@hyderabad_times) బన్నీ, చరణ్ దంపతులు నిహారిక పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలాచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నిహారిక పెళ్లికి ఎలాంటి డిజైనర్ దుస్తులను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. ఈ రోజు రాత్రి 7.15 నిమిషాలకు గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. మరికొద్దిసేపట్లో మిస్ నిహారిక జొన్నలగడ్డ నిహారికగా మారనున్నారు. రాజస్తాన్ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్లో మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట’ పాటకు చిరు, అల్లు అర్జున్‌ల స్టెప్పులు వేశారు. అదే పాటకు చిరు భార్య సురేఖ, అల్లు అరవింద్ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (నిహారిక హల్దీ వేడుక: వీడియో వైరల్ ) View this post on Instagram A post shared by Hyderabad Times (@hyderabad_times) -
వేమయ్యా.. వస్తావయ్యా..!
కడప కార్పొరేషన్ : సంక్రాంతి పండుగ వస్తుందంటే పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, తలపాగా చుట్టి, నుదుట ఎర్రటి బొట్టుతో గుర్రాలపై వచ్చే వేమయ్యలు, గంగిరెద్దులవారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు... వడ్లు, బియ్యం, బట్టలు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటే మంచి జరుగుతుందని పెద్దలు భావిస్తారు. పూర్వం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. ఇటీవలి కాలంలో వేమయ్యల రాక తగ్గిపోయింది. గంగిరెద్దులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయంతే. ఈ ఆధునిక యుగంలో కూడా కొన్ని కుటుంబాలు అదే వృత్తిగా జీవిస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తున్న తరుణంలో కడపలో ఆర్టీసీ బస్టాండు వద్ద వేమయ్యలు సందడి చేశారు. కదిరికి చెందిన వీరయ్య, రామయ్య వేమయ్యల వేషధారణలో గ్రామాలు తిరుగుతూ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఆ చిత్రాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
తెలుగు మహాసభలకు వేదికే ప్రత్యేక ఆకర్షణ
-
జీఈఎస్ సదస్సులో ఆకట్టుకున్న కేటీఆర్
-
సదర్ ఉత్సవాలకు ’షెహన్షా’ ప్రత్యేక ఆకర్షణ
-
జై..జై గణేశా!