Thrissur
-
ఇది ఏనుగు... కానీ కాదు!
కేరళ త్రిసూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయంలో ఒక ఏనుగు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఇది సజీవమైన ఏనుగు కాదు. లైఫ్–సైజ్ మెకానికల్ ఎలిఫెంట్. ప్రముఖ సితారిస్ట్ అనౌష్క శంకర్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) కలిసి శ్రీకృష్ణస్వామి ఆలయానికి ఈ యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఇది మూడు మీటర్ల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది.‘ఈ రోబోటిక్ ఏనుగు వల్ల సజీవమైన ఏనుగులను గొలుసులతో బంధించి, ఆయుధాలతో నియంత్రిస్తూ బాధ పెట్టడం అనేది ఉండదు. రోబోటిక్ ఏనుగులు సజీవ ఏనుగులకు మానవీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి’ అంటోంది పెటా. రబ్బర్, ఫైబర్, మెటల్, ఫోమ్, స్టీల్‌తో రూపొందించిన ఈ యాంత్రిక ఏనుగు సజీవ ఏనుగులా భ్రమింపచేస్తుంది. తల, కళ్లు, చెవులు, తోక, తొండాలను కదిలిస్తుంది. తొండాన్ని పైకి లేపి నీళ్లు చల్లుతుంది. -
‘సినిమా లేకుండా ఉండలేను.. కేంద్రమంత్రి పదవి ఎక్కువేం కాదు’
కేంద్ర మంత్రిత్వ పదవి, సినిమాల్లో నటించడంపై నటుడు సురేషి గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీ కేబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేషి గోపి.. ఇటు సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. మంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటించినందుకు తనను కేంద్ర సహాయ మంత్రిగా తొలగిస్తే.. తనను తాను రక్షించుకున్నట్లేనని పేర్కొన్నారు. అదే విధంగా తన తదుపరి చిత్రం 'ఒట్టకొంబన్' సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరానని.. ఇంకా దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అయితే సెప్టెంబర్ 6న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.కాగా సురేషి గోపి ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి ఉన్నారు. అటు సినిమాల్లోనూ నటన కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రస్తుతం తన వద్ద అనేక స్క్రిప్ట్‌లు ఉన్నాయని, వీటిలో 20 నుంచి 22 సినిమాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. సినిమాల్లో నటించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అనుమతి కోరగా.. ఆయన ఎన్ని సినిమాల్లో నటించాలని అడిగారని చెప్పారు.@నేను 22 సినిమాల్లో నటించాల్సి ఉందని అమిత్ షాకు చెప్పాను. అయితే దీనిని ఆయన పక్కన పెట్టారు. ప్రస్తుతం సినిమాల్లోకి నటించేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు. ఇప్పుడైతే సెప్టెంబర్ 6 నుంచి షూటింగ్లో పాల్గొంటాను’ అని కేరళలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.‘మంత్రి పదవిని నిర్వహించేందుకు సహకరించడానికి మంత్రివర్గానికి చెందిన ముగ్గురు, నలుగురు అధికారులను నా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సినిమా సెట్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా వీలు కాకపోతే.. వారు నన్ను కేంద్ర పదవి నుంచి తీసివేస్తే, అది నాకు మేలు చేసిన వాడిగా భావిస్తాను. నేను మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ ఆ కోరిక లేదు. నా కోసం కాకుండా నన్ను ఎన్నుకున్న త్రిసూర్ ప్రజల కోసం నాకు మంత్రి పదవి ఇస్తున్నామంటూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి నేను తలవంచి అంగీకరించాను. ఇప్పటికీ నేను మా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. కానీ నా అభిరుచి (సినిమా) లేకుండా ఉండలేను’ అని పేర్కొన్నారు. -
త్రిసూర్‌లో కాంగ్రెస్ ఓటమి.. కొట్టుకున్న కార్యకర్తలు
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. కేరళలోని త్రిసూర్‌లో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేష్ గోపి గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్ధి కే మురళీధరన్ ఓటమి చెందారు.అయితే పార్టీ ఓటమికి డీసీసీ చీఫ్ జోస్ వల్లూర్, త్రిసూర్ మాజీ ఎంపీ టీఎన్ ప్రతాపన్యే కారణం అంటూ జూన్ 4 తరువాత స్థానికంగా పలు పోస్టుల వెలువడ్డాయి. ప్రతాపన్, జోస్ వల్లూర్ రాజీనామా చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా ఓటమిపై త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) తాజాగా సమావేశమైంది. ఈ భేటీలో పోస్టర్ల అంశంపై కార్యకర్త సురేష్‌ను వల్లూరు ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది.డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిర, వల్లూర్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కొందరు కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో త్రిసూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జోస్ వల్లూరుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీసీసీ కార్యదర్శి సంజీవన్ కురియచిరా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 19 మందిపై కేసు బుక్ చేశారు. వల్లూరుతో పాటు అతని మనుషులు డీసీసీ ఆఫీసులో తనపై దాడి చేసినట్లు కురియచిర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.అయితే వల్లూరు వల్లే మురళీధరన్ ఓడిపోయినట్లు కురియాచిర ఆరోపించారు. కౌంటింగ్ రోజు సైతం జిల్లా, రాష్ట్ర నాయకత్వం తన ప్రచారానికి రాలేదని మురళీధరన్ ఆరోపించారు. -
కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ.. నటుడికి భారీ విజయం
2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మలయాళ నటుడు తన ప్రత్యర్థిపై గెలుపొందారు. ఆయన విజయంతో భాజపా కేరళలో తన ఖాతా తెరిచింది. తన సమీప ప్రత్యర్థి వీఎస్ సునీల్ కుమార్‌పై(సీపీఐ) ఘనవిజయం సాధించారు. దాదాపు 73 వేలకు పైగా మెజార్టీతో సురేశ్ గోపి గెలిచారు. -
జాతరలో గజరాజుల కొట్లాట.. పలువురికి గాయాలు
కోలాహలంగా జాతర జరుగుతుందనుకున్న టైంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది. జనాలు ఉరుకులు పరుగులతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అందుకు కారణం.. రెండు గజరాజులు తలపడడమే!. కేరళ త్రిస్సూర్ జిల్లాలో తరక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు జాతరలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జాతర ముగింపు సమయంలో అమ్మవారిని ఉరేగిస్తున్న ఏనుగు.. ఒక్కసారిగా అలజడి సృష్టించింది. మావటి మీద మూడుసార్లు దాడికి యత్నించగా.. ఆయన స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ ఏనుగు అక్కడితో ఆగలేదు. అక్కడే ఉరేగింపు కోసం తీసు కొచ్చిన మరో ఏనుగుపై దాడికి దిగింది. ఈ క్రమంలో ఆ రెండు తలపడడంతో.. అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్లు కింద పడి గాయాలపాలయ్యారు. ఏనుగుల పోరాటంతో భయపడి.. ఉరుకులు పరుగులు పెట్టడంతో కిందపడి చాలా మందికి సైతం దెబ్బలు తగిలించుకున్నారు. అతికష్టం మీద మొదటి ఏనుగును మావటివాళ్లు నిలువరించగలిగారు. అయితే గాయపడ్డ ఏనుగు కిలోమీటర్ దూరం పరుగులు తీయగా.. అతికష్టం మీద మావటివాళ్లు దానిని పట్టుకోగలిగారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. An elephant which was brought for the arat ritual at #Mandarakadavu in connection with the #ArattupuzhaPooram in #Kerala's #Thrissur, attacked a fellow elephant. pic.twitter.com/6OXptgdjnl — Hate Detector 🔍 (@HateDetectors) March 23, 2024 -
MR Jyothy: తండ్రి మెచ్చిన తనయ
ఎంబీఏ చేసిన ఎంఆర్ జ్యోతి వ్యాపార పాఠాలను కళాశాలలో కంటే తండ్రి రామచంద్రన్ అడుగు జాడల్లో నుంచే ఎక్కువగా నేర్చుకుంది. అయిదువేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ‘జ్యోతి ల్యాబ్స్’ను వేల కోట్ల టర్నోవర్‌కి తీసుకువెళ్లాడు ఎంపీ రామచంద్రన్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కంపెనీని మరోస్థాయికి తీసుకువెళుతోంది. ‘తండ్రి మెచ్చిన తనయ’ అనిపించుకుంది... తండ్రి అయిదు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు జ్యోతి వయసు అయిదు సంవత్సరాలు. త్రిసూర్ (కేరళ)లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో జ్యోతికి కళ్లకు కట్టినట్లుగా గుర్తుంది. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న తండ్రి ఇటుకా ఇటుకా పేర్చి కంపెనీని బలోపేతం చేశాడు. సెలవు అంటూ లేకుండా వారానికి ఏడు రోజులూ పనిచేసేవాడు. ప్రాడక్ట్స్ లోడింగ్ నుంచి పత్రికలకు ఇచ్చే అడ్వరైజ్మెంట్ల వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. సింగిల్ ప్రాడక్ట్ ‘ఉజాల’తో మొదలైన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘జ్యోతి ల్యాబ్స్’ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో ఆరుగురు మహిళల బృందం ఇంటింటికీ తిరిగి ‘ఉజాల’ అమ్మేవారు. కట్ చేస్తే... 2005లో కంపెనీ మార్కెటింగ్ విభాగంలో చేరింది జ్యోతి. ఆ తరువాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. 2020లో కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బాధ్యతలు చేపట్టడానికి ముందు తరువాత అనే విషయాకి వస్తే ఎండీగా కంపెనీ ఆదాయాన్ని పెంచింది. నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి రెండో తరం ఎంటర్ ప్రెన్యూర్ అయిన జ్యోతి నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రాడక్ట్ ఇన్నోవేషన్స్. అడ్వర్టైజింగ్ ప్లాన్స్ వరకు ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధాన ఆధారం... ఫ్యాబ్రిక్ కేర్, డిష్ వాషింగ్ ప్రాడక్ట్స్. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది జ్యోతి. గత సంవత్సరం కంపెనీ మార్గో సోప్ మూడు వేరియంట్స్‌ను లాంచ్ చేసింది. పర్సనల్ కేర్‌కు సంబంధించి ఇతర విభాగాలను కూడా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కంపెనీ. బహుళజాతి సంస్థల నుంచి పోటీ తట్టుకొని మార్కెట్లో ఛాలెంజర్ బ్రాండ్‌గా నిలవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ‘ఇక తిరుగులేదు’ అంటూ ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మార్కెట్లో ఒక్కో మెట్టు కిందకు దిగక తప్పదు. అందుకే ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుంది జ్యోతి. గతంలోలాగా భవిష్యత్ ఉండకపోవచ్చు. భారీ సవాళ్లు ఎదురు కావచ్చు. జ్యోతి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దార్శనిక దృష్టితో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో చేరిన కొత్తలో తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లు, రిటైలర్లు, స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించి ఎన్నో మీటింగ్‌లలో పాల్గొంది. ప్రతి మీటింగ్ ఒక పాఠశాలగా మారి తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ‘గతమెంతో ఘనకీర్తి’ అని గతంలోనే ఉండిపోకుండా ‘ట్యూన్ విత్ ది చేంజింగ్ టైమ్స్’ అంటున్న జ్యోతి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం (ఉదా: రియల్–టైమ్ డేటాను ఉపయోగించడం) ఆటోమేటింగ్ ప్రాసెస్, ఓపెన్ డోర్ కల్చర్ వరకు ఎన్నో ఆధునిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలంతో గొంతు కలుపుతూనే ఉంది. గెలుపుదారిలో కొత్త ఉత్సాహంతో ప్రయాణిస్తూనే ఉంది. -
Devananda: ఇలాంటి కూతురు ఉండాలి!
‘ఈ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు ఉండాలి’ అని సాక్షాత్తు కేరళ హైకోర్టు 17 ఏళ్ల దేవనంద గురించి అంది. ఎందుకో చదవండి! కేరళలోని త్రిసూర్‌లో కాఫీ హోటల్ నడుపుకునే 48 ఏళ్ల ప్రతీష్‌కు నిన్న మొన్నటి దాకా జీవితం సాఫీగానే సాగింది. భార్య ధన్య, కూతురు దేవనంద, కొడుకు ఆదినాథ్... అందరిలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ మధ్య కాలు వాపు తరచూ కనిపిస్తుండేసరికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేశాక డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు– లివర్ కేన్సర్. వైద్యం అంటూ లేదు... లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనే శరణ్యం అని తేల్చి చెప్పారు. అది కూడా వెంటనే జరగాలని చెప్పారు. ఆ మధ్యతరగతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్ వారు మీరు డోనర్ని తెస్తే మేము ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం అని భరోసా ఇచ్చారు. కాని లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డోనర్ దొరకడం అంత సులభం కాదు. దొరికినా సూట్ కావాలి. సమయం లేదు... మరి ఏం చెయ్యాలి? నేనే ఎందుకు ఇవ్వకూడదు అనుకుంది కూతురు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న దేవనంద తండ్రిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రి వర్గాల దగ్గరకు పోయి తనే లివర్‌లోని కొంత భాగం డొనేట్ చేయవచ్చా అని అడిగింది. చేయచ్చు గాని ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994’ ప్రకారం మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. దేవనంద ఇంటర్నెట్ జల్లెడ పట్టింది. గతంలో ఇలాంటి కేసులో ఒక మైనర్‌కు ఆర్గాన్ డొనేట్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా చదివింది. అయితే ఆ మైనర్ నుంచి ఆర్గాన్ డొనేషన్ జరగలేదు. ఆ తీర్పు ఆధారంగా తాను హైకోర్టుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. జడ్జి పూనుకొని హైకోర్టులో జస్టిస్ వి.జి.ఆరుణ్ సమక్షానికి ఈ కేసు వచ్చింది. ప్రత్యేకమైన కమిటీని వేసి ఆర్గాన్ యాక్ట్‌లో ఏదైనా మినహాయింపుతో దేవనంద తన తండ్రికి లివర్ ఇవ్వొచ్చోకూడదో సూచించమని ఆదేశించాడాయన. కమిటీ అధ్యయనం చేసి చిన్న వయసులో ఇవ్వడానికి ఏ మాత్రం వీలు లేదని, దేవనందను ఇందుకు అనుమతించ వద్దని తేల్చి చెప్పింది. కాని దేవనంద కమిటీ రిపోర్టును మళ్లీ సవాలు చేసి తండ్రిని కాపాడుకునే హక్కు తనకు ఉందని కోర్టుకు చెప్పింది. ‘నాన్నను కోల్పోతే మేము దిక్కులేని వాళ్లం అవుతాం’ అని చెప్పింది. జస్టిస్ వి.జి.అరుణ్ దేవనంద పట్టుదలను, తండ్రి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని ఎంతో ప్రశంసించారు. ‘ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి’ అన్నారు. ఈసారి మరో కమిటీని వేశారు. ఆ కమిటీ దేవనందకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో డిసెంబర్ 2022లో అనుమతి ఇస్తూ తీర్పు చెప్పారు. అన్ని విధాలా సిద్ధమయ్యి ఈ విషయం తెలిసి బంధువులు వారించినా దేవనంద వెనక్కు తగ్గలేదు. తండ్రికి ఆరోగ్యకరమైన లివర్ ఇవ్వడానికి జిమ్‌లో చేరింది. మంచి పోషకాహారం తీసుకుంది. తండ్రి కోసం ఫిబ్రవరి 9న ఆపరేషన్ బల్ల ఎక్కింది. పెద్ద వైద్యుల బృందం ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్లకు సర్జరీ చేసి లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన రాజగిరి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల బృందం దేవనందకు ఫ్యాన్స్ అయ్యా రు. తండ్రీ కూతుళ్లు డిశ్చార్జ్ అవుతుంటే అందరూ వచ్చి జ్ఞాపికతో వారిని సాగనంపారు. అంతేనా? దేవనంద పట్టుదల, ప్రేమను చూసి తండ్రి ఆపరేషన్ ఖర్చులను మాఫీ చేశారు. కూతురు ప్రేమ సాధించిన ఘన విజయంగా దీనిని అభివర్ణించవచ్చు. -
వైరల్ వీడియో: పెళ్లిలో వధువు చర్య.. గర్వంగా ఆ తండ్రి..
-
పెళ్లిలో వధువు చర్య.. గర్వంగా ఆ తండ్రి..
వైరల్: పెళ్లి వేడుకలో జరిగే ఘటనలు సోషల్ మీడియా ద్వారా తరచూ వైరల్ అవుతుండడం చూస్తుంటాం. సరదా నుంచి విషాదాల దాకా.. ప్రతీది వీడియోనో, ఫొటోల రూపంలో ఈరోజుల్లో అందరి చెంతకు చేరుతున్నాయి. అయితే పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పటి కంటే.. ఆ పుత్రుడ్ని నలుగురు పొగిడినప్పుడే కలుగుతుందని అంటారు. అయితే.. అది పుత్రుడే అయ్యి ఉండాలా?.. ట్విటర్లో ఓ నవవధువు వీడియో దుమ్ము రేపుతోంది. తన పెళ్లిలో తానే సంప్రదాయ వాయిద్యాన్ని వాయిస్తూ హుషారుగా గడిపిందామె. తోటి బృందంతో కలిసి లయబద్ధంగా ఆమె డ్రమ్స్ వాయిస్తూ అక్కడున్నవాళ్లలో జోష్ నింపింది. అది చూసి ఆ తండ్రి ఆనందంతో పొంగిపోయాడు. సోమవారం త్రిస్సూర్ జిల్లా గురువాయూర్ ఆలయంలో ఒక వివాహం జరిగింది. వధువు తండ్రి కేరళ సంప్రదాయ వాయిద్యం చెండా మాస్టర్. ఆయన పొన్నన్స్ బ్లూ పేరుతో ఒక మ్యూజిక్ ట్రూప్ నడుపుతున్నారు. దీంతో.. తన కూతురి పెళ్లికి ఆయన నేతృత్వంలోనే కార్యక్రమం జరిగింది. తండ్రి అలా డ్రమ్స్ వాయిస్తుంటే.. కూతురు ఊరుకుంటుందా?. వేదిక దిగి.. చండాను భుజాన వేసుకుంది. పెళ్లి కూతురి హుషారు చూసి పెళ్లి కొడుకు కూడా రంగంలోకి దిగాడు. ఆమె డ్రమ్స్ వాయిస్తుంటే.. అతను చిడతలు వాయిస్తూ బృందంతో కలిశాడు. చివర్లో.. తండ్రి తన కూతురి పక్కన చేరాడు. హుషారుగా తండ్రి బృందంతో కలిసి ఆ వధువు చేసిన హడావిడి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఆ వాయిద్యం ఆమెకు కొత్త కాదు. మెకానికల్ ఇంజినీరింగ్ చదవిన శిల్పా శ్రీకుమార్ 12 ఏళ్లుగా తండ్రి వద్ద చెండా నేర్చుకుంది. దుబాయ్‌లో ఈ కుటుంబం స్థిరపడగా.. ఈ తండ్రీకూతుళ్లు అక్కడ ప్రదర్శనలు కూడా ఇచ్చారట. పొన్నన్స్ బ్లూ మ్యాజిక్ ట్రూప్‌తో కలిసి గతంలో ఓ మలయాళ చిత్రానికి సైతం ఆమె చండా వాయించింది. అయితే తన పెళ్లిలో తాను ప్రదర్శన ఇస్తానని ఆమె ఊహించలేదట. తండ్రి శ్రీకుమార్ పలియథ్తో వధువు శిల్ప, పెళ్లి కొడుకు దేవానంద్(మధ్యలో) తండ్రిని అలా సంతోషంగా చూసేసరికి.. ఉండబట్టలేక అలా చేశానని అంటోంది శిల్ప. ఇక కూతురి సత్తా తనకు తెలిసినప్పటికీ.. తన పెళ్లిలో తానే స్వయంగా ప్రదర్శన ఇవ్వడం ఎంతో గర్వకారణంగా అనిపిస్తోందని అంటున్నారు శ్రీకుమార్ పలియథ్. -
షాకింగ్.. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించిన బాలుడు
తిరువనంతపురం: కేరళ త్రిస్సూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలుడు ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించాడు. అనంతరం దాన్ని 8 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. చివరకు ఎలాగోలా పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకుని ఆపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏం జరిగిందంటే..? పదో తరగతి చదువుతున్న ఈ బాలుడు జ్వరం రావడంతో త్రిస్సూర్ జనరల్ హాస్పిటల్లో చేరాడు. వారం రోజులుగా ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇతని తండ్రి కూడా ఈ ఆస్పత్రిలోనే పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఆస్పత్రి బయట అంబులెన్స్ ఆగి ఉంది. డ్రైవర్ నీళ్ల కోసం వెళ్తూ తాళం వేయలేదు. ఇది గమనించిన బాలుడు క్షణాల్లో అంబులెన్సులోకి వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. అనంతరం దాన్ని స్టార్ట్ చేసి ఎంచక్కా డ్రైవ్ చేసుకుంటూ 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంబులెన్స్ డ్రైవర్ సీట్లో బాలుడ్ని చూసిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు రంగంలోకి అంబులెన్సును వెంబడించి ఎలాగోలా ఆపారు. మరోవైపు అంబులెన్స్ డ్రైవర్ తన వాహనాన్ని ఎవరో దొంగిలించారని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టాడు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
Bharat Jodo Yatra: దేశ పునర్నిర్మాణం కోసమే ‘జోడో’
త్రిసూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలోని తిరూర్ నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. వందలాది మంది కార్యకర్తలు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉదయం వడక్కంచెరీలో పాదయాత్ర ముగిసిన తర్వాత రాహుల్ హెలికాప్టర్లో నీలంబూర్‌కు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అర్యదన్ మొహమ్మద్(87)కు నివాళులర్పించారు. మొహమ్మద్ ఆదివారం మృతిచెందారు. పార్టీకి ఆయన అందించిన సేవలను రాహుల్ గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. దేశ పునర్నిర్మాణం కోసం తాము చేపట్టిన చరిత్రాత్మక భారత్ జోడోయాత్రలో ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. బలమైన, స్వావలంబన భారత్ మనకు కావాలని పేర్కొంది. ఆదివారం రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. మహిళలు, పిల్లలు సెక్యూరిటీ వలయాన్ని చేధించుకొని రాహుల్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. -
ప్రధాన సమస్యల నుంచి పక్కదారి
త్రిసూర్(కేరళ): విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల ధాటికి ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలను సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ సర్కార్ శతథా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎగసిన ధరల అంశాలను గాలికొదిలేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వయం సమాజంలో విద్వేషాన్ని పెంచి హింసకు తావు కల్పిస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రను శనివారం ఆయన త్రిసూర్ దగ్గర్లోని పెరంబ్రలో ప్రారంభించారు. త్రిసూర్‌లో భారీ జనసందోహానుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘గత ఏడు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఏం చేసిందని తరచూ ప్రధాని మోదీ అడుగుతుంటారు. అయితే, మోదీ జీ, మేం ఎన్నడూ దేశంలో నిరుద్యోగిత ఇంతటి గరిష్ట స్థాయికి తేలేదు. నిత్యావసరాల ధరలూ ఈ స్థాయికి పెరగలేదు. మా యూపీఏ హయాంలో వంటగ్యాస్ కోసం రూ.400 సరిపోయేవి. ఆ ధరే ఎక్కువ అన్నట్లు ఆనాడు మీరు మాట్లాడారు. కానీ, ఇప్పుడు రూ.1,000 దాటేసింది. ఇప్పుడు ఒక్క ముక్క కూడా మాట్లాడరేం?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇంధన ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల సొమ్మును అన్యాయంగా లాక్కుంటున్నారు. కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తల బోషాణంలో పోస్తున్నారు. హింస, విద్వేషం పెరిగేలా చేసి ప్రజా సమస్యల నుంచి పౌరుల దృష్టిని కేంద్రం మళ్లిస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘పట్టణ నిరుద్యోగిత రేటు దేశంలో కేరళలోనే అత్యధికం. రాష్ట్ర ప్రభుత్వ పాలనను విమర్శించడం నా ఉద్దేశంకాదు. సీఎం విజయన్‌కు నా విజ్ఞప్తి ఒక్కటే. యువత భవితను పట్టించుకోండి’’ అని రాహుల్ అన్నారు. -
స్మార్ట్ ఫిల్మ్; ఉమెన్ @ 40
మానసిక కల్లోలం, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు.. 40 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు ఈ లక్షణాలన్నీ లేదా వీటిలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంటారు. మెనోపాజ్‌కి కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నందువల్లనో, ప్రీ మెనోపాజ్ దశను అధిగమించలేకనో నాలుగుపదులు దాటిన వారి జీవితం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గి@40 (ఉమన్ ఎట్ ఫార్టీ) పేరుతో 12 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌ను తీశారు స్మితా సతీష్. స్మితా సతీష్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ ట్రైనర్. గతంలో స్మిత జువైనల్ జస్టిస్ బోర్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఉంటారు ఈమె. 43 ఏళ్ల స్మిత తన వ్యక్తిగత జీవితంలో చూసినవి, తనను కలిసిన కొంత మంది మహిళల సమస్యలను ఉదాహరణగా తీసుకుని 40 ఏళ్లు దాటిన గృహిణి పరిస్థితులతోబాటు, వారికి కుటుంబ మద్దతు ఎంత వరకు అవసరమో గి@40 షార్ట్ ఫిల్మ్‌లో కళ్లకు కడుతుంది. హాట్ ఫ్లాష్ ఈ ఏడాది మొదట్లో ‘హాట్ ఫ్లాష్’ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు స్మిత. ముందస్తు మెనోపాజ్ లక్షణాలలో ఒకటైన హాట్ ఫ్లాష్‌తో (అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, తీవ్రమైన చమట పట్టడం) ఉన్న నలభై ఏళ్ల గృహిణి గురించి వివరించారు. ఉన్నట్టుండి చిరాకుగా మారడం, కోపం తెచ్చుకోవడం లేదా కారణం లేకుండా ఏడవడం, అందరూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించడం .. ఇవన్నీ డాక్టర్, సైకాలజిస్ట్ సహాయంతో అధిగమించడం వరకు పాత్ర భావోద్వేగ ఎత్తుపల్లాల గుండా వెళుతుంది. ‘శరీరం మార్పులకు లోనవుతుంటుంది. రుతుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో నలభై దాటిన వారి ప్రతి చర్యలను గమనించిన తర్వాత ఏదైనా చేయాలనుకున్నాను. అలా ఈ లఘు చిత్రాన్ని తీశాను’ అంటారామె. ఈ ఫిల్మ్‌కి స్మిత ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఇతర నటీనటులు వివిధ రంగాలలో ఉన్నవారు మొదటిసారి నటించారు. మహిళలకు అవగాహన తప్పనిసరి నలభై ఏళ్ల దాటిన మహిళల రోజువారీ సాధారణ లక్షణాలను హైలైట్ చేయడానికి ఆమె వివిధ పాత్రల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ‘మీరు బాగున్నారా?’ అనే ప్రశ్న సాధారణంగా మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ, సమస్య ఏంటంటే, ఈ దశలో ఉన్న మహిళలు తాము ఎందుకు కష్టంగా ఉన్నారో వారికై వారే అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులకు కూడా ఈ మహిళల మానసిక కల్లోలం, ప్రవర్తనలో మార్పుల గురించి ఏ మాత్రం తెలియదు’ అంటారు స్మిత. అలాంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫిల్మ్ సాయపడుతుంది. ‘చాలామంది ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం డిప్రెషన్ గురించి ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. అలాగే, ప్రీ మెనోపాజ్ లేదా మెనోపాజ్ గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరి పరిస్థితులలో అవసరం అనుకుంటే వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల చికిత్సను సూచిస్తారు. (క్లిక్ చేయండి: తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...) ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వారి ప్రపంచం అందంగా మారుతుంది. అభిరుచులను పెంచుకోవడానికి, సృజనాత్మకమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుటుంబం, స్నేహితులు వారికి అండగా ఉండాలి. వారి సమస్యలు అందరి చెవికెక్కాలి’ అనే విషయాన్ని స్మిత తన ఫిల్మ్ ద్వారా వివరించారు. డబ్ల్యూ ఎట్ ఫార్టీ ఫిల్మ్ నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలకు చక్కటి సూచికలా ఉపయోగపడుతుంది. (క్లిక్ చేయండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి) -
దేశంలో తొలి మంకీపాక్స్ మరణంపై ప్రకటన.. పాజిటివ్ అని తెలిసినా గప్‌చుప్‌గా భారత్‌కు!
తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ మరణంపై అనుమానాలు వీడాయి. కేరళ త్రిస్సూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌తోనే మృతి చెందినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో యూఏఈ నుంచి వచ్చిన యువకుడు మృతి చెందాడన్న విషయం తెలిసే ఉంటుంది. అయితే అతనిలో మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయ్యిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్, రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. యూఏఈ నుంచి జులై 22న సదరు యువకుడు భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆపై తన కుటుంబంతో గడిపాడు. స్నేహితులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడాడు కూడా. నాలుగు రోజుల తర్వాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ మరుసటి రోజు..అంటే జులై 27న అతను ఆస్పత్రిలో చేరాడు. జులై 28వ తేదీన అతన్ని వెంటిలేటర్ మీదకు షిఫ్ట్ చేశారు. చికిత్స పొందుతూ.. జులై 30వ తేదీన అతను కన్నుమూశాడు అని తెలిపారు మంత్రి వీణాజార్జ్. అయితే.. జులై 19వ తేదీన యూఏఈలోనే అతనికి మంకీపాక్స్ టెస్టులు జరిగాయని, భారత్‌కు వచ్చే ముందు రోజు అంటే జులై 21వ తేదీనే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మంత్రి వీణాజార్జ్ తెలిపారు. అయితే ఆ యువకుడు విషయాన్ని దాచిపెట్టి.. మామూలుగానే ఉన్నాడని, భారత్‌కు చేరుకుని చివరికి వైరస్ ప్రభావంతో మరణించాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వైద్యం సమయంలోనూ అతను తన రిపోర్ట్ వివరాలను వెల్లడించాలేదని, చివరకు మృతుడి శాంపిల్స్‌ను అలప్పుజాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా అతనిలో మంకీపాక్స్ వైరస్ ఉన్నట్లు తేలిందని వీణాజార్జ్ వెల్లడించారు. అయితే కేరళ అధికారిక ప్రకటనపై కేంద్రం స్పందించాల్సి ఉంది. అదే సమయంలో అలపుజ్జా వైరాలజీ సెంటర్ నుంచి శాంపిల్స్‌ను పూణెకు పరీక్షల కోసం పంపింది. A young boy returned from UAE on July 22, he was with his family when on July 26 he developed a fever & was admitted on July 27. On July 28 he was moved to a ventilator. He got tested on July 19 for monkeypox in UAE, the result of which was positive:Kerala Health min Veena George pic.twitter.com/43VGAtkoB5 — ANI (@ANI) August 1, 2022 కాంటాక్ట్ ట్రేసింగ్.. ప్రొటోకాల్ ప్రకారం.. ప్రస్తుతం హై రిస్క్ జోన్లో ఉన్న 20 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, మెడికల్ స్టాఫ్ కూడా అందులో ఉన్నట్లు ఆమె తెలిపారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. మంకీపాక్స్ బాధితుడు బయట తిరిగాడు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సైతం ఆడాడు. అంతేకాదు త్రిస్సూర్‌తో పాటు చావక్కాడ్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ అతన్ని తిప్పారని, ఆ కాంటాక్ట్ లిస్టింగ్ కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని వీణాజార్జ్ వెల్లడించారు. ఆసియాలో మొదటిది ఇదిలా ఉంటే.. ప్రపంచంలో ఆఫ్రికాలోనే మంకీపాక్స్ మరణాలు చోటు చేసుకున్నాయి ఇప్పటిదాకా. తాజాగా ప్రపంచంలో తొలి ఆఫ్రికన్‌యేతర దేశంగా బ్రెజిల్లో మంకీపాక్స్ మరణం సంభవించింది. ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్న వ్యక్తి మంకీపాక్స్‌తో చనిపోయాడు కూడా. అలాగే స్పెయిన్‌లో రెండు మరణాలు వెనువెంటనే సంభవించాయి. తాజాగా కేరళ మరణంతో.. ప్రపంచంలో నాలుగో ఆఫ్రికన్‌యేతర మంకీపాక్స్ మరణం భారత్‌లో నమోదు అయ్యింది. అంతేకాదు ఆసియాలోనే తొలి మంకీపాక్స్ మరణానికి భారత్ కేంద్ర బిందువు అయ్యింది. అయితే కేరళ త్రిస్సూర్ యువకుడు కావడం, అతనిలో ఇతర సమస్యలేవీ లేకపోవడం, అంతకు ముందు కూడా వ్యాధులు లేకపోవడంతో కేరళ ఆరోగ్య శాఖతో పాటు కేంద్రమూ అప్రమత్తమైంది. -
వైరల్ వీడియో: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్
-
అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జూలై మాసంలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు జలాశయాలు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్‌లో మైమరిపించే అతిరాపల్లి వాటర్ ఫాల్స్ వద్ద జలకళ పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. వీకెండ్ కావడంతో పర్యాటక ప్రదేశాల్లో రద్దీ ఏర్పడింది. కాగా ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో కృష్ణానది జలకళను సంతరించు కుంది. శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లనుశనివారం ఉదయం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నా పెద్దా అంతా డ్యామ్ సౌందర్యాన్ని, ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు #WATCH | Tourists throng Thrissur in Kerala to witness mesmerizing Athirappilly Water Falls pic.twitter.com/U4jBJqWRq7 — ANI (@ANI) July 23, 2022 -
Kerala: ఆమె రాకతో మహిళా కలెక్టర్ల సంఖ్య 10కి చేరింది.. అరుదైన ఘనత
మహిళ చదువు దేశానికి వెలుగు ఎలా అవుతుందో చూడాలనుకుంటే ఓసారి కేరళవైపు దృష్టి సారించాల్సిందే. భూతల స్వర్గంగా పేరున్న కేరళ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉన్నాయి. వీటిలో 10 జిల్లాల కలెక్టర్లు మహిళలే కావడం గమనార్హం. రాజకీయాలు, రక్షణ, అనేక ఇతర కీలకరంగాలలో పురుషులతో పోలిస్తే మహిళా ప్రాతినిధ్యం తక్కువ ఉన్న ఈ దేశంలో ఇది అరుదైన ఘనతగా అంతా పేర్కొంటున్నారు. ప్రజాసేవ చేయడానికి పరిపాలనలో భాగంగా ఉన్నతాధికారులలో మెజారిటీ సంఖ్య ఇప్పటివరకు పురుషులదే. కానీ, కేరళలో మాత్రం ఆ సంఖ్య మహిళలదయ్యింది. డాక్టర్ రేణు రాజ్ అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతుండటంతో కేరళలో ఇప్పుడీ మహిళా కలెక్టర్ల సంఖ్య పదికి చేరింది. మూడింట రెండొంతులు రాష్ట్ర పరిపాలనలో దాదాపు మూడింట రెండొంతుల మంది మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండగా, ఇప్పుడు కేరళలో పరిపాలనా సేవల్లో మహిళా కలెక్టర్లు 71.4 శాతం ఉన్నారు. కేరళలోని ఇతర జిల్లా మహిళా కలెక్టర్లలో హరిత.వి.కుమార్ (త్రిసూర్), దివ్య ఎస్ అయ్యర్ (పథనం తిట్ట), అఫ్సానా పర్వీన్ (కొల్లం), షీబా జార్జ్ (ఇడుక్కి), డాక్టర్ పికె జయశ్రీ (కొట్టాయం), భండారి స్వాగత్ రణవీర్ చంద్ (కాసర్ గోడ్), నవజోత్ ఖోసా (తిరువనంతపురం), మృణ్మయీ జోషి (పాలక్కాడ్), డాక్టర్ ఎ.గీత (వాయనాడ్)లు ఉన్నారు. వీరిలో రేణురాజ్, దివ్య.ఎస్.అయ్యర్, హరిత వి.కుమార్, పి.కె.జయశ్రీ, షీబా జార్జ్, గీత కేరళ వాసులే. 35 ఏళ్ల డాక్టర్ రేణురాజ్ మార్చి 2న అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిరీత్యా రేణు వైద్యురాలు. 2015లో యుపిఎస్సి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే రెండవ ర్యాంక్ సాధించారు. జిల్లా కలెక్టర్‌గా ఆమెకు ఇదే తొలి పోస్టింగ్. భిన్నరంగాలలోనూ ప్రతిభ గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్‌గా విధులను చేపట్టిన ఈ కలెక్టరమ్మల్లో వివధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న వారున్నారు. వారిలో పథానంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్యా ఎస్ అయ్యర్ ఒకరు. డాక్టర్, ఎడిటర్, రైటర్, యాక్టర్, సింగర్‌గా కూడా దివ్య పేరొందారు. మలయాళీ వెండితెర మీద క్రిస్మస్ ప్రధాన అంశం గల సినిమాలోనూ నటించారు. గతంలో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్‌లో డాక్టర్‌గా విధులను నిర్వర్తించారు. ఆ తర్వాతి జాబితాలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ హరిత వి.కుమార్ చేరుతారు. 2012లో కేరళలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో టాపర్‌గా నిలిచారీమె. ఎలక్ట్రానిక్స్ విభాగం లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన హరిత ‘విజయం అనేది ఒక వస్తువు కాదు, ఒక రోజు కష్టంలో రాదు’ అంటారు. మలయాలీ సినిమాలంటే ఇష్టపడే హరిత మోహినీయాట్టం, భరతనాట్యం, కర్ణాటక సంగతంలోనూ ప్రావీణ్యురాలు. పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ మృణ్మయి జోషి కలెక్టర్ అవడానికి ముందు ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. పుణేవాసి. ముంబయ్ హై కోర్టు మాజీ జడ్జి షాలినీ ఫన్సల్కర్ జోషి కూతురు. తల్లి లాగే న్యాయవాద చదువును పూర్తి చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలిసీలో మాస్టర్స్ చేశారు. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ నవ్‌జోత్ ఖోసా అమృతసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి బీడీఎస్ చేశారు. యూనివర్శిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ‘ఐఎఎస్ ముందు నా తండ్రి కల. అదే నా లక్ష్యం అయ్యింది’ అంటారీమె. రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్నతాధికారులుగానే కాదు 2020 కేరళ స్థానిక ఎన్నికల్లో మహిళలు 50 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించారు. పితృస్వామ్య సమాజంలో ఇది అంత తక్కువ విషయమేమీ కాదు. దేశ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చదవండి: Mystery- Lansa Flight 508: 10 వేల అడుగుల పైనుంచి ఆమె కూర్చున్న కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా -
వైరల్: చీర కట్టులో చూడముచ్చటైన కేరళ యువతుల డ్యాన్స్ ..
సరదా, డ్యాన్స్, కామెడీ, ఫ్రంక్ వీడియోలకు సోషల్ మీడియా నిలయంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. వీటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరిన్ని థ్రిల్ చేస్తుంటాయి. ఇక తాజాగా కేరళకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిని మిని నాయర్ అనే యువతి తన ట్విటర్లో షేర్ చేయడంతో రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఆరోపణలు, చాలెంజ్‌లు! ఈ వీడియోలో పదుల సంఖ్యలో యువతులు ఒక్కచోట చేరి అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. యువతులందరూ సంప్రదాయబద్దంగా చీరలు కట్టుకొని చూడముచ్చటగా రెడీ అయ్యి పాటకు స్టెప్పులేశారు. వాస్తవానికి ఈ వీడియో 2019 ఓనమ్ పండగకు ముందు ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజీ విద్యార్థులు చేసిన డ్యాన్స్‌కు చెందినది. కేరళలోని త్రిస్సూర్ పూరం ఆలయ జాతరకు సంబంధించిన ‘కంత నింజానుం వరం’ డ్యాన్స్. దీనిని చూసిన నెటిజన్లు.. పాట అర్థం కాలేదు కానీ యువతుల్లో ముఖాల్లో ఆనందం, ఉత్సహం వెలిగిపోతుందని కామెంట్ చేస్తున్నారు. భారతీయ సంస్కృతికి కేరళ పుట్టినిల్లు అని ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నారు. చదవండి: ‘వాలీ’ దొరికిందోచ్!.. 22 రోజుల్లో 900 కిలోమీటర్లు ఈదేసింది Hope springs eternal. We can. Keralam. A song on the fabled Thrissur Pooram!#home H/t @phenomenon75 pic.twitter.com/bdGAIhMy7s — Mini Nair (@minicnair) September 25, 2021 -
ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’
‘మనసుంటే మార్గమూ ఉంటుంది’ అనే నానుడి మరోసారి నిజమైంది. కేరళ, త్రిశూర్ అమ్మాయి మారియా కురియాకోస్ ఎంబీఏ చేసింది. ముంబయిలో ఒక సోషల్ ఎంటర్ ప్రైజ్‌లో ఉద్యోగం చేసింది. ‘తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించలేకపోతే జీవితానికి పరమార్థం ఏముంటుంది?’ అని కూడా అనుకుంది. ఉద్యోగం మానేసి సొంతూరు త్రిశూర్కి వచ్చేసింది. ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలనే స్పష్టత రావడం లేదు. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయి? అలా ఊరంతా తిరిగి నలుగురిని చూస్తే కదా తెలిసేది... అనుకుంది. త్రిశూర్‌లో ఏమున్నాయి? ఏమి లేవు అనేది కూడా తెలుసుకోవాలి కదా! అనుకుంటూ త్రిశూర్‌లోని రోడ్లన్నీ చుట్టిరావడం మొదలుపెట్టింది. తనకు తెలిసిన ఊరే అయినా, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఒక కొబ్బరి నూనె మిల్లు కనిపించింది. కేరళ అమ్మాయికి కొబ్బరి నూనె మిల్లును చూడడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆమె దృష్టిని ఆకర్షించింది కొబ్బరి నూనె కాదు, నూనె కోసం కొబ్బరి వలిచిన తర్వాత మిగిలిన ఖాళీ కొబ్బరి చిప్పలు. రాశులుగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారని అడిగింది. పొయ్యిలో వంటచెరకుగా వాడతారు, ఇటుకలను కాల్చడానికి బట్టీల్లో వాడతారని తెలుసుకుంది. అంత గట్టి మెటీరియల్ బొగ్గుగా కాలిపోవడమేంటి? వీటిని ఉపయోగించే తీరు ఇది కాదు, మరింత ఉపయుక్తంగా ఉండాలని ఆలోచించింది మారియా. కోకోనట్ కప్ కొబ్బరి చిప్పలు కిందపడినా పగలవు. ఇంకేం! సెంటెడ్ క్యాండిల్ తయారు చేయడానికి గాజు కుండీలకంటే కొబ్బరి పెంకులే మంచి బేస్ అనుకుంది మారియా. సూప్ తాగడానికి కూడా పింగాణీ కప్పుల కంటే కొబ్బరి పెంకు కప్పులే సేఫ్. అంతే కాదు, హ్యాంగింగ్ గార్డెన్‌కి కూడా కొబ్బరి కుండీలే. ఫోర్క్‌లు, స్పూన్లు కూడా. మన్నిక ఓకే, మరి కొబ్బరి పెంకును అందంగా తీర్చిదిద్దడం ఎలా? తండ్రి మెకానికల్ ఇంజనీర్. రిటైరయ్యాడు కాబట్టి ఆయన కూతురికి అవసరమైన యంత్రాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. పూర్వం స్టీలు గరిటెలు, గిన్నెలు లేని రోజుల్లో గరిటలుగా కొబ్బరి చిప్పలనే వాడేవారని తెలుసుకున్న తర్వాత మారియా ఆ వృత్తి పని వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పని అన్నానికి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ఇతర ఉపాధి పనులకు మారిపోయారు. త్రిశూర్, కొట్టాయం, వయనాడుల్లో విస్తృతం గా సర్వే చేసి, ఆ వృత్తిదార్లను సమీకరించింది. ఇప్పుడామెతో కలిసి పదిమంది పని చేస్తున్నారు. గతంలో అయితే కొబ్బరి చిప్పలను ఉలి సహాయంతో చేత్తోనే నునుపుగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మారియా డిజైన్ చేయించుకున్న మెషీన్‌తో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ‘తెంగ’ పేరుతో ఆమె రిజిస్టర్ చేసుకున్న పరిశ్రమ ఇప్పుడు స్థిరమైన రాబడినిస్తోంది. తెంగ ఉత్పత్తులకు కేరళతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లకు పేర్లు ముద్రించి ఇవ్వడం ఆమె ఎంచుకున్న మరో చిట్కా. అమెజాన్ ద్వారా జర్మనీలో అమ్మకాలకు కూడా రంగం సిద్ధమైంది. కేరళలో కొబ్బరి వలిచిన ఖాళీ కొబ్బరి చిప్పలు సూప్ బౌల్స్‌గా జర్మనీకి చేరనున్నాయి. తండ్రితో మారియా కురియాకోస్ -
ఆమెకు సముద్రమే అన్నం ముద్ద
భారతదేశంలో చేపలు పట్టే లైసెన్సు ఉన్న ఏకైక మహిళ రేఖ కోవిడ్ విసిరిన మృత్యుకెరటాలకు ఏమాత్రం చలించలేదు. లాక్డౌన్ వల్ల, తుఫాన్ల వల్ల, గుండె ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ వేటకు రాలేని నిస్సహాయ భర్త వల్ల ఆమె ఓడిపోదలుచుకోలేదు. ఇంత పెద్ద సముద్రం అమ్మలా ఉంది నాకేం భయం అనుకుంది. రోజూ తీరంలో దొరికే సముద్రపు చిప్పలను ఏరి బతుకు వెళ్లమారుస్తుంది. నలుగురు ఆడపిల్లలు ఉన్నారామెకు. భర్తతో కలిపి ఐదుగురు పిల్లలు అనుకుంటూ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటోందామె. కేరళ త్రిచూర్ జిల్లాలోని ఎత్తాయి సముద్రతీరం లో రోజూ తెల్లవారు జామున ఆమె కనిపిస్తుంది. ఒక నీలిరంగు ప్లాస్టిక్ బాస్కెట్‌ను పట్టుకుని కెరటాల వెంట సాగుతూ దేనినో అన్వేషిస్తూ ఉంటుంది. దేనిని? సముద్రపు చిప్పల్ని (సాధారణ ఆల్చిప్పలు/అయిస్టర్ షెల్స్). ఆమె వాటిని ఏరుకుంటూ ఆ బుట్ట నిండేవరకూ అక్కడే తిరుగుతుంది. బుట్ట నిండితే 60 రూపాయలు వస్తాయి. ‘ఒక్కోసారి సగం బాస్కెట్ కూడా దొరకవు. అమ్మ ముఖం చాటేస్తుంది’ అని నవ్వుతుంది. ఆమె పేరు రేఖ. ఆమె అమ్మ అంటున్నది సముద్రాన్ని. నిజానికి ఆమె సముద్రంలో చేపలు పట్టాలి. కాని సముద్రపు చిప్పల్ని ఏరాల్సి వస్తోంది. ‘సముద్రంలో కెరటాలకు నేను ఎప్పుడూ భయపడలేదు. కాని జీవితంలో కెరటాలకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది’ అంటుంది నలభై ఏళ్ల రేఖ. సముద్రంలో రేఖ తొలి డీప్ ఫిషింగ్ లైసెన్స్ హోల్డర్ డీప్ ఫిషింగ్ లైసెన్స్‌ను పొందడం చాలా కష్టం. దానికి యోగ్యత సాధించాలంటే అనుభవం, అర్హత ఉండాలి. దానిని పొందడం మగవారికే సొంతం. కాని దేశంలో మొదటిసారి ఆ లైసెన్స్‌ను పొందిన ఏకైక మహిళ రేఖ. ‘సముద్రంలో నేను 50 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టేదాన్ని’ అంటుంది రేఖ. ఇంటర్ వరకూ చదువుకున్న రేఖ 2016లో త్రిచూర్ నుంచి దేశంలో తొలి మహిళగా డీప్ ఫిషింగ్ లైసెన్స్ పొందినప్పుడు మీడియాలో చాలా కవరేజీ వచ్చింది. ఒక స్త్రీ చేపల వేటకు వెళ్లడం విశేషం అని అందరూ మెచ్చుకున్నారు. ‘పడవలో నా భర్త చేపల వేటకు వెళ్లే ప్రతిసారీ సహాయకులు వస్తారా రారా అని టెన్షన్ పడేవాడు. సముద్రంలో చేపల వేటలో... చేపలు పట్టడానికి పడవలో కనీసం ముగ్గురు ఉండాలి. నిజానికి వాళ్లకు కూలి ఇచ్చే స్థితి కూడా కాదు మాది. ఈ టెన్షన్ అంతా ఎందుకు.. నేను వస్తాను కదా అని తోడు బయలుదేరేదాన్ని. అలా భార్యను తీసుకుని వేటకు వెళ్లడానికి మగవాళ్లు ఇష్టపడరు. కాని నా భర్త సమ్మతించాడు. తోడు తీసుకుని వెళ్లి వేట చేయడం నేర్పాడు. నేను బాగా నేర్చుకున్నాను. నాకు సముద్రంలో ప్రతి అల ఆనుపానులు తెలుసు.’ అంటుంది రేఖ. కేరళలో చాలామంది స్త్రీలు బ్యాక్‌వాటర్స్‌లో చేపలు పడతారు. కాని సముద్రం మీదకు వెళ్లరు. ఇంకా చెప్పాలంటే సముద్రం మీదకు వెళ్లేందుకు వారిని ఎవరూ ప్రోత్సహించరు. రేఖ ఆ ధైర్యం చేయడం వారికి పెద్ద స్ఫూర్తిగా మారింది. ‘మా దగ్గర సాంకేతిక పరికరాలు, ఆధునిక జాకెట్లు ఏమీ ఉండవు. మాకు తెలిసిందల్లా సముద్ర దేవత కడలమ్మే. ఆమె మమ్మల్ని చూసుకుంటుంది’ అంటుంది రేఖ. కుటుంబ సభ్యులతో... ‘సముద్రంలో వేటకు వెళ్లాలంటే వలను నిర్వహించడం తెలియాలి. చాలాసార్లు చేపలు పడకపోగా వలల్ని సముద్రపు పందులు (స్కాటోప్లేన్స్) కొరికేస్తాయి. నిరాశ పడక ఆ వలను రిపేరు చేసుకొని మళ్లీ వెళ్లాలి. సముద్రంలో వేట చావు–బతుకు, ఆశ నిరాశల మధ్య సాగుతుంది’ అంటుంది రేఖ. సెకండ్ వేవ్ సవాలు రేఖ జీవితం సజావుగా సాగుతుండేది. భర్త కార్తికేయన్‌తో వేటకు వెళ్లేది. ‘రాత్రంతా వేట చేసి తిరిగి వచ్చి పడ్డ చేపలను హార్బర్‌కు తీసుకెళ్లి అమ్మితే రోజుకు ఎంత లేదన్నా రెండు మూడు వేలు వచ్చేవి’ అంటుంది రేఖ. అయితే ఇలా రోజూ చేపలు పడలేదు. అయినా సగటున ముప్పయి వేల ఆదాయం అయితే వచ్చేది. రేఖకు నలుగురు ఆడపిల్లలు. సముద్ర తీరంలోనే ఆమెకో కచ్చా ఇల్లు ఉంది. పిల్లలను చదివించుకుంటూ జీవితం లాక్కువస్తుంటే హటాత్తుగా భర్త గుండెజబ్బు బయటపడింది. దానికి సర్జరీ అవసరం అని డాక్టర్లు అన్నారు. ఈలోపు సెకండ్ వేవ్ వచ్చి ఆ సర్జరీ కాస్త పోస్ట్‌పోన్ అయ్యింది. భర్త వేటకు వచ్చేలా లేడు. లాక్డౌన్ వల్ల సరుకు లావాదేవీలు స్తంభించి వేట సాగడం లేదు. తుఫాన్లు, భారీ వానలు కూడా పనికి అంతరాయం. ఏం చేయాలి? ఇల్లైతే గడవాలి. ‘సముద్రాన్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉన్నాను’ అంటుంది రేఖ. తీరంలో దొరికే సాధారణ అయిస్టర్ షెల్స్‌ను కాల్షియం ముడిసరుకుగా కొంటారు. ఆ సముద్రపు చిప్పల్ని ఏరి అమ్మే పనిలోకి దిగింది రేఖ. ఒకోసారి రెండు మూడు డబ్బాలు దొరుకుతాయి. ఒక్కోసారి దొరకవు. కాని ధైర్యంగా జీవితం గడుపుతోందామె. కొత్త సముద్రం ‘సముద్రం కూడా రంగు మార్చుకుంటుంది. పాత చేపలు వెళ్లి కొత్త చేపలు వస్తాయి. ఈ కష్టాలు కూడా పోతాయి. మళ్లీ మాకు మంచి జీవితం వస్తుంది’ అంటుంది రేఖ. ఆమె దగ్గర ఇప్పుడున్నదల్లా ఒక పాత పడవ. ఆ పడవతో సముద్రంలో వెళ్లాలంటే భర్త కోలుకోవాలి. ‘కొట్టాయం ఆస్పత్రిలో డాక్టర్లు డేట్ ఇచ్చారు. పోస్ట్‌పోన్ అయ్యింది కరోనా వల్ల’ అందామె. చాలామంది కష్టాలు వస్తే ‘ఏ సముద్రంలో దూకి చావను’ అంటుంటారు. రేఖ సముద్రం దగ్గరే ఉంది. సముద్రంతోనే ఉంది. కాని ఆమె సముద్రంలో దూకి చావదల్చుకోవడం లేదు. సముద్రాన్నే ఆధారం చేసుకుని అనుక్షణం బతకాలనిపిస్తోంది. ‘కెరటం ఆదర్శం నాకు. పడినందుకు కాదు. పడినా లేచినందుకు’ అన్న కవి వాక్కు రేఖ జీవితాన్ని ఒక సజీవ వ్యాఖ్యానంలా ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. న్యాయం కోసం సీఎంపై పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ సీఎం పినరయి విజయన్‌పై స్వతంత్ర అభ్యర్థిగా ‘వలయార్ సిస్టర్స్’ తల్లి పోటీ చేస్తున్నారు! నాలుగేళ్ల క్రితం 13, 9 ఏళ్ల వయసున్న ఆమె కూతుళ్లపై అత్యాచారం జరిగింది. రెండు నెలల వ్యవధిలోనే వారిద్దరూ ప్రాణంలేని బొమ్మలై కనిపించారు! నాటి నుంచీ న్యాయం కోసం ఆమె పోరాడుతూనే ఉన్నారు. పోలీసులతో పోరాటం, లాయర్లతో పోరాటం, ప్రభుత్వంతో పోరాటం, చివరికి ఇప్పుడు సీఎంతో పోరాటం! ఈ తల్లికి న్యాయం జరుగుతుందా? అదే పనిలో ఉన్నామని, కేసును సీబీఐకి అప్పగించామని కేరళ ప్రభుత్వం అంటోంది. మొదట ఆమె ఫిబ్రవరి 27న శిరోముండనం చేయించుకున్నారు. తర్వాత మార్చి 16న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ధర్మదం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండూ కూడా తన న్యాయ పోరాటంలో భాగంగా ఆమె తీసుకున్న నిర్ణయాలే. ఆమె ఒక సామాన్య దళిత మహిళ. దళిత మహిళ అనే కన్నా.. బిడ్డల్ని కోల్పోయిన తల్లి అనాలి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. నాలుగేళ్ల క్రితం ఆ ఇద్దరు మైనరు కూతుళ్లపై అత్యాచారం జరిగింది. తర్వాత వాళ్లిద్దరూ వాళ్లింట్లోనే దూలాలకు ఉరి వేసుకున్నట్లుగా వేలాడుతూ కనిపించారు. పాలక్కాడ్ జిల్లా వాయలూర్‌లో ఉంటుంది ఆ తల్లీకూతుళ్ల కుటుంబం. 2017 జనవరి 13న పెద్ద కూతురు (13), అదే ఏడాది మార్చి 4న చిన్న కూతురు (9) ఆ పెంకుటింటి పైకప్పును అవమానపడిన తమ ముఖాలపై మృత్యువస్త్రంలా కప్పుకున్నట్లుగా కనిపించారు. కానీ అది వాళ్లకై వాళ్లు తీసుకున్న నిర్ణయం, చేసుకున్న పనైతే కాదని తల్లిదండ్రులకు స్పష్టంగా తెలుస్తోంది. విషాద స్మృతులు : కూతుళ్ల చెప్పులు, గజ్జెలు దుఃఖానికి విరామం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ. ఆ తల్లి విలవిల్లాడింది. ఇప్పటికీ ఇంటి పైకప్పును చూసుకుంటూ తల్లడిల్లిపోతూనే ఉంది. రెండు బొమ్మలు ఇంటి పైకప్పులో చిక్కుకున్నట్లుగా ఆమె ఇద్దరు కూతుళ్లు అనుదినం కళ్లకు కనిపిస్తూనే ఉన్నారు. వాళ్లపై అత్యాచారం చేసి, ఉరి వేసి వెళ్లినవారికి శిక్ష పడేలా చేసేందుకు నాలుగేళ్లుగా ఆమె నిద్రాహారాలు మాని, అదే జీవితావసరంగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటూనే ఉంది. అనేక విధాలుగా తన నిస్సహాయ నిరసనలను వ్యక్తం చేసింది. ఆక్రోశంతో శిరోముండనం చేయించుకుంది. ఆఖరి అస్త్రంగా ఇప్పుడు అసెంబ్లీఎన్నికల్లో ముఖ్యమంత్రిపై పోటీ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అప్పుడైనా ముఖ్యమంత్రికి తనొకరంటూ ఉన్నట్లు తెలుస్తుందని, తను తెలిస్తే తన కూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి తెలుస్తుందనీ, దోషుల్ని తప్పించేందుకు పోలీసులు చేసిన అక్రమాల గురించి తెలుస్తుందని ఆమె ఆశ. అంతే తప్ప అధికారం కోసం కాదు. వలయార్ సిస్టర్స్‌కి న్యాయం జరిపించాలని కోరుతూ కొచ్చిలో ప్రదర్శనలు మైనర్లు కనుక ఆమె కూతుళ్ల పేర్లు బయటికి చెప్పడానికి లేదు. బాధితురాలు కనుక ఆమె పేరునూ ప్రస్తావించకూడదు. నిర్భయ తల్లిలా విజయం సాధించిప్పుడు, దోషులకు శిక్షపడి వలయార్ సిస్టర్స్‌కి న్యాయం జరిగినప్పుడు విజయం సాధించిన తల్లిలా ఆమె పేరు ప్రతిధ్వనించవచ్చు. అప్పటి వరకు ఆమె పేరు ‘అమె’. ఆమె కూతుళ్ల పేర్లు ‘వలయార్ సిస్టర్స్’. ‘‘నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నాను. ‘దోషులకు శిక్ష పడి తీరుతుంది’ అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకోలేదు. ఒక తల్లిగా ఇప్పటి వరకు న్యాయపోరాటం చేశాను. ఇక రాజకీయ పోరాటం చేస్తాను’’ అని ఆమె అంటున్నారు. పోస్ట్‌మార్టంలో ఇద్దరు పిల్లలూ చనిపోవడానికి ముందు వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. ‘‘మా బంగారు తల్లులను పాడుచేసి, చంపేశారు. వాళ్లది ఆత్మహత్య కాదు’’ అని ఆమె ఫిర్యాదు చేసినట్లే, శవ పరీక్ష నివేదిక కూడా సరిగ్గా వచ్చింది. ఆ తల్లిదండ్రుల తరఫున కేరళ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. అప్పటికప్పుడు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు గత ఏడాది పోలీసు విచారణలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ‘‘కొంతమంది పోలీసులు నేరస్థులతో కుమ్మక్కయి కేసును బలహీనపరిచి ప్రమోషన్లు పొందారు. సీఎం చూస్తూ ఊరుకున్నారు. ఈ సంగతి ప్రజలకు తెలియాలి. ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లికి ఈ ముఖ్యమంత్రి న్యాయం చేయలేకపోయారని ప్రజలందరికీ తెలియాలి’’ అని తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఆమె అన్నారు. నేరస్థులలో కొందరికి అధికార పార్టీలోని వారితో సంబంధాలు ఉండటంతో కేసు నీరు కారిపోయిందని ప్రతిపక్షాలు మొదట్నుంచీ ఆరోపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె.. తన వెనుక ఏ పార్టీవారూ లేరని, తల్లిగా తనకు తాను మాత్రమే ఉన్నానని, అందరు తల్లుల తరఫున ఎన్నికల్లో నిలబడుతున్నానని కూడా ప్రకటించవలసి వచ్చింది. ఎన్నికల్లో తను నిలబడుతున్న కారణాన్ని ఆమె వెల్లడించగానే అధికార పార్టీ తక్షణం స్పందించవలసి వచ్చింది. ‘‘ఆ తల్లి బాధను అర్థం చేసుకోగలం. ఈ కేసులో ఆమెకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం చేయవలసినదంతా చేసింది. ప్రస్తుతం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది’’ అని న్యాయశాఖ మంత్రి ఎ.కె.బాలన్ వివరణ ఇచ్చారు. కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులిద్దరూ భవన నిర్మాణ కార్మికులు. వాళ్లిద్దరూ పనికి వెళ్లినప్పుడు పెద్దకూతురు ఇంట్లో పై కప్పు కొక్కేనికి వేలాడుతూ కనిపించడాన్ని మొదట చూసింది వాళ్ల చిన్న కూతురు. ఇద్దరు మనుషులు ముసుగులు వేసుకుని ఇంట్లోంచి పరుగున వెళ్లడాన్ని కూడా ఆ చిన్నారి చూసింది. తర్వాత చిన్న కూతురు కూడా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే దర్యాప్తు బృందానికి సారథ్యం వహించిన పోలీస్ ఆఫీసర్ ప్రత్యేక పదోన్నతిపై బదలీ అయి వెళ్లారు. ఐదుగురు నిందితులలో ఒకరి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది జిల్లా బాలల సంక్షేమ కమిటీకి అధ్యక్షులు అయ్యారు. ఆ వరుసలోనే 2019 అక్టోబర్‌లో పోక్సో కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్లారు. ఈ జనవరిలో హై కోర్టు.. పోక్సో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి కేసు పునర్విచారణను సీబీఐకి అప్పగించింది. చంపేశారు మొర్రో అంటున్నా వినకుండా ‘అసహజ మరణాలు’ గా పోలీసులు కేసు నమోదు చేసినప్పుడే తమకు న్యాయం జరగదని అర్థమైపోయిందని అంటున్న ఆ తల్లి.. ‘‘ప్రభుత్వం అసహాయుల తరఫున ఉండాలి తప్ప, అధికారం, బలం ఉన్న వారివైపు కాదు’’ అని చేతులు జోడించి చెబుతున్నారు. -
పుట్టిన శిశువు ఆడ, మగ కాకపోయినా సరే..
త్రిస్సూర్: ఇంటర్ సెక్స్ వ్యక్తులు జీవశాస్త్ర పరంగా మగ లేదా ఆడవారు కాదు. జన్యుపరంగా, హార్మోనుల పరంగా, లైంగిక భాగాల తయారీలో తప్పులున్నప్పుడు మగ, ఆడ రెండు లక్షణాలతో జన్మిస్తారు. వీరిలో కొంతమందిలో ఆపరేషనుల ద్వారా, మందుల ద్వారా సరి చేయవచ్చు. అయితే సమాజంలో వీరు ఎంతగానో వివక్షకు గురవుతున్నారు. కొన్నిచోట్ల ఇలాంటి పిల్లలను పురిటిలోనే చంపేస్తున్నారు. దీంతో ఇంటర్ సెక్స్ పిల్లలకు కూడా ప్రేమ పంచాల్సిన అవసరం ఉందంటూ కేరళలోని త్రిస్సూర్‌లో హిజ్రా హక్కుల కార్యకర్త, రచయిత్రి విజయరాజా మల్లిక కవితా ఆల్బమ్‌ను రూపొందించారు. 'ఇది శాపమో, పాపమో కాదు.. నా బంగారు పాప.. నువ్వు నా అదృష్టానివి. నా తొలి చుక్కానవి' అంటూ మలయాళీ భాషలో ఈ కవిత్వం సాగుతుంది. ఇందులో నటి తువ్వాలలో చుట్టుకొన్న బిడ్డను ఎత్తుకొని కన్న మమకారం చూపిస్తూ ప్రేమను కురిపిస్తుంది. (చదవండి:కవి మనసు ఖాళీగా ఉండదు) 'నా రంగుల హరివిల్లా, నువ్వు అబ్బాయి కాకపోయినా, అమ్మాయి అవకపోయినా నీకు నా రొమ్ము పాలు పడతాను' అంటూ సమాజం చూపే వివక్షను అణిచివేస్తూ తల్లిప్రేమను పంచుతుంది. ప్రస్తుతం ఈ పాట అందరి మనసులను కదిలిస్తోంది. విజయరాజా మల్లిక రచించిన ఈ కవిత్వానికి కరీంభుజా సంగీతం అందించగా, శిని అవంతిక మనోహరంగా ఆలపించి పాటగా రూపొందించారు. ఈ వీడియోలో మల్లిక, తన భర్త జషీంతో కలిసి నటించారు. ఈ ఆల్బమ్‌ను డ్యాన్సర్ రాజశ్రీ వారియర్ ఆదివారం ఆన్లైన్లో విడుదల చేశారు. "ఇంటర్‌సెక్స్ పిల్లలను చెత్తకుప్పల్లో పడేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఈ పాటలో ఉన్న తల్లి మాత్రం పుట్టిన బిడ్డ ఆడో, మగో తెలియకపోయినా శిశువును గుండెలకు హత్తుకుంటోంది" అని తెలిపారు. ఇంటర్‌సెక్స్ శిశువులపై మలయాళంలో వచ్చిన తొలి కవిత్వం ఇదేనని పలువురు పేర్కొంటున్నారు. (చదవండి: ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!) -
శత చిత్ర పద్మం
శత చిత్ర పద్మం అంటే... వంద చిత్రాల్లో నటించారని కాదు. శత వసంతాలు పూర్తి చేసుకున్నారామె. ఊరికే వందేళ్లు నిండితే కూడా ఇంత పెద్ద సెలబ్రేషన్ ఉండేది కాదేమో! ఆమెలో ఒక చిత్రకారిణి ఉన్నారు. ఒక వ్యాపారవేత్త ఉన్నారు. అంతకు మించి జీవితానికి సుపథం వేయగలిగిన గొప్ప తాత్వికవేత్త ఉన్నారు. చీర మీద చెట్టు పద్మావతి నాయర్ (పద్మమ్) 1920లో కేరళ రాష్ట్రం, త్రిశూర్‌లో పుట్టారు. ఈ నెలతో వందేళ్లు నిండాయి. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తారు. టీ తాగడం, న్యూస్ పేపర్ చదవడం పూర్తయిన తర్వాత తన స్నానపానాదులు, ఉపాహారం ముగించుకుని పదిన్నరకు ఉద్యోగానికి వెళ్లినంత కచ్చితంగా రోజూ తన డెస్క్‌కు చేరుతారు. ఒంటి గంట వరకు తన ప్రపంచంలో మునిగిపోతారామె. ఆమె ప్రపంచంలో చిలుకలుంటాయి, చెట్టు కొమ్మ మీద వాలిన జంట పక్షులుంటాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకుని విహరిస్తున్న కొంగలుంటాయి. పురి విప్పిన నెమళ్లుంటాయి. రేకులు విచ్చుకున్న పువ్వులుంటాయి. ఇవన్నీ చీర మీద రంగుల బొమ్మలుగా ఉండవచ్చు, వాల్ హ్యాంగింగ్స్గానూ ఉండవచ్చు. రోజూ పెయింటింగ్ కోసం మూడు గంటల సమయాన్ని కేటాయిస్తారామె. వందేళ్ల వయసులో చేతి వేళ్లు పట్టు దొరకడం కష్టమే. బ్రష్‌ను కదలకుండా పట్టుకుని డిజైన్‌కు తగినట్లు స్ట్రోక్స్ ఇవ్వడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అదే మాట అన్నప్పుడు ఆమె నవ్వుతూ ‘‘నేను పెయింటింగ్స్ మొదలు పెట్టిందే అరవై దాటిన తర్వాత. అప్పటి నుంచి రోజూ వేస్తూనే ఉన్నాను. అలా వేస్తూ ఉండడమే వేళ్లకు శక్తి. అయితే టస్సర్ మీద పెయింటింగ్ చేయడం కొంచెం కష్టమే’’ అన్నారు. పెయింటింగ్ చేసిన చీరకు ఆమె పదకొండు వేల రూపాయలు చార్జ్ చేస్తారు. పద్మమ్ బామ్మ వేసిన పెయింటింగ్ దుపట్టా మూడు వేలు. ‘‘నేనింత వరకు నా ఖర్చులకు పిల్లల దగ్గర చేయి చాచలేదు. నేను మనుమలు, మనుమరాళ్ల పుట్టిన రోజులకు నా డబ్బుతోనే బహుమతులిస్తాను కూడా’’ అంటారామె ఒకింత గర్వంగా. ఎవరికి వారే ఆధారం పద్మావతి నాయర్ బాల్యం కేరళలోని త్రిశూర్ జిల్లాలోని వడకంచెర్రిలోనే గడిచింది. పదిమందిలో తొమ్మిదో సంతానం. ఫోర్డ్ మోటార్స్ ఉద్యోగి కేకే నాయర్‌ను పెళ్లి చేసుకుని 1945లో ముంబయికి వెళ్లారామె. వారికి ఐదుగురు పిల్లలు. ఆ పిల్లలందరి దుస్తులూ తానే మెషీన్ మీద కుట్టేవారు. ఆడపిల్లల దుస్తుల మీద ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ కూడా చేసేవారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యేటప్పటికి అరవై దాటాయి. అప్పటి వరకు హాబీగా చేసిన పెయింటింగ్ కోసం పూర్తి సమయం కేటాయించారామె. తన సొంత సంపాదన మొదలు పెట్టింది కూడా అప్పుడే. మూడు దశాబ్దాలుగా విజయవంతంగా సాగుతోంది ఆమె పెయింటింగ్ కుటీర పరిశ్రమ. వందేళ్ల వయసులో కూడా డబ్బు సంపాదిస్తున్నాను. అవును, ఎందుకు సంపాదించకూడదు? అని ప్రశ్నిస్తారు పద్మమ్. ఆడపిల్లలనే కాదు ఎవరూ మరొకరి మీద ఆధారపడకూడదు. తమ మీద తాము ఆధారపడి జీవించాలి... అని ఆమె పేరెంటింగ్ ఫిలాసఫీ చెప్పారు. పద్మమ్కి ఏడుగురు మనుమలు– మనుమరాళ్లు, నలుగురు ముని మనుమళ్లు–మనుమరాళ్లు. ఆమెకు రోజూ ఒంటి గంట వరకు పెయింటింగ్స్‌తో గడిచిపోతుంది. మధ్యాహ్నం కొంత విశ్రాంతి. సాయత్రం కొంత సేపు టీవీ చూసిన తర్వాత మనుమలు– మనుమరాళ్ల నుంచి వచ్చిన వాట్సప్ మెసేజ్‌లు చూసుకోవడం, వాటికి బదులివ్వడం ఆమె వ్యాపకం. పిల్లల సెలవు రోజుల్లో వాళ్లకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాల్లో విస్తరించిన బంధువులందరినీ సోషల్ మీడియా వేదికగా పలకరిస్తుంది. స్నేహితులకు ఈ మెయిల్స్ చేస్తుంది. జీవితంలో ఏమున్నాయి? ఏమి లేవు? అని బేరీజు వేసుకుంటూ ఉంటే సంతోషాల కంటే కష్టనష్టాల తక్కెడ బరువెక్కుతుంది. ‘నా జీవితంలో నేనున్నాను’ అనుకుంటే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అదే ఆయుష్షును పెంచే ఔషధం. ఆనందంగా జీవించడానికి సాధనం. – మంజీర -
కోవిడ్ దళం
తమిళనాడు పోలీసులు లాక్డౌన్ సమయాన్నిఉల్లంఘించారని ఒక తండ్రీ కొడుకుల ప్రాణాలను బలిగొన్నారు. కాని కేరళలో అలాంటి ఘటనలు లేవు. ఎందుకంటే అక్కడ పర్యవేక్షిస్తున్నది స్త్రీలు కనుక. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కేరళలోని త్రిచూర్‌లో మొదలెట్టిన మహిళా ఆఫీసర్ల దళం నచ్చ చెప్పడంలో, బుద్ధి చెప్పడంలో మంచి ఫలితాలు సాధించింది. దాంతో ఇప్పుడు కేరళ అంతా ఇలాంటి స్త్రీ దళాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కరోనాపై పోరాడడానికి కేరళ రాష్ట్రం అంతా ఒక స్త్రీ రూపాన్ని తీసుకున్నదా అని అనిపిస్తున్నది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో కేరళ ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలజ ఎంత సమర్థంగా పని చేసిందో, ఐక్యరాజ్య సమితి గర్తించేంతగా ఆమె కృషి ఎలా సాగిందో, సాగుతున్నదో అందరికీ తెలుసు. ఆమె మాత్రమే కాదు పాలనా రంగంలో, వైద్య రంగంలో ఎందరో స్త్రీలు కేరళలో కోవిడ్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వీరితో పాటు అంతే సమర్థంగా పని చేస్తున్నారు అక్కడి మహిళా పోలీసులు. ఇందుకు అక్కడి ‘బుల్లెట్ స్క్వాడ్’ ఒక ఉదాహరణ. భారతదేశం లాక్డౌన్ దశను దాటి అన్‌లాక్ అయ్యే దశలలో ఉంది. ఈ సమయంలో ప్రజలను సదా అప్రమత్తంగా ఉంచాలి. ఐసొలేషన్ వార్డులను, హోమ్ క్వారంటైన్లో ఉన్నవారిని, సమూహాలలో భౌతికదూరం పాటించనివారిని, అనుమతించిన సమయాలకు మించి బయట తిరిగేవారిని వీరందరినీ పర్యవేక్షించాలి. కొన్నిచోట్ల మెత్తగా చెప్పాలి. కొన్నిచోట్ల గట్టిగా కేకలు వెయ్యాలి. ఈ పని మగవారి కంటే స్త్రీలు సమర్థంగా చేయగలని అనుకున్నారు కేరళ డి.జి.పి లోక్‌నాథ్ బెహరా. అనుకున్న వెంటనే ప్రయోగాత్మకంగా త్రిచూర్ పట్టణంలో 40 మంది మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పది కొత్త బుల్లెట్లు సమకూర్చారు. ప్రత్యేకంగా ఎర్రరంగు హెల్మెట్లు ఇచ్చారు. ఒక్కో బుల్లెట్ మీద ఇరువురు చొప్పున రోడ్ల మీద ఎప్పుడూ 20 మంది రౌండ్లలో ఉండేలా డ్యూటీలు విధించారు. ‘చూద్దాం... ఏమవుతుందో’ అనుకున్నారు. కాని మహిళా ఆఫీసర్లు తాము ఏం చేయగలరో చేసి చూపించారు. ఈ దళం రోడ్ల మీదకు వచ్చాక త్రిచూర్‌లో గొప్ప క్రమశిక్షణ సాధ్యమైంది. కోవిడ్ హాస్పిటల్స్ దగ్గర, క్వారంటైన్ సెంటర్ల దగ్గర, హోమ్ క్వారంటైన్లో ఉన్న పేషెంట్ల గృహాల దగ్గర, వర్తక సముదాయాల దగ్గర వీరి పహారా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. బుల్లెట్ చప్పుడు వినిపించగానే ఎక్కడి వాళ్లక్కడ సర్దుకుంటున్నారు. లేదా బుల్లెట్ చప్పుడు ఎప్పుడు అవుతుందా అని బుద్ధిగా ఉంటున్నారు. మెత్తగా ఉండాల్సిన చోట మెత్తగా ఉన్నా తోక జాడిస్తే మాత్రం వీరు చలాన్లు విధిస్తున్నారు. ‘మా బుల్లెట్ స్క్వాడ్ పని తీరు చాలా బాగుంది. ఇది త్రిచూర్ వరకే అనుకున్నాం మొదట. ఈ ఫలితాలు చూశాక రాష్ట్రమంతా మహిళా స్క్వాడ్లను తీసుకురానున్నాం’ అని కేరళ డి.జి.పి. చెప్పారు. ఈ స్క్వాడ్‌ను పర్యవేక్షిస్తున్న త్రిచూర్ పోలిస్ కమిషనర్ ఆర్.ఆదిత్య కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘ఈ స్క్వాడ్‌కు చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయి అని కోవిడ్ పేషెంట్లు అనుకోవడం మంచి పరిణామం’ అని ఆయన అన్నాడు. మరోవైపు ఈ స్క్వాడ్ వల్ల ‘బుల్లెట్ బండ్ల’ కు పెరుగుతున్న గౌరవాన్ని చూసి వాటి విక్రయదారులు ఆనందపడుతున్నారు. ఇప్పటివరకూ కూడా దాదాపుగా బుల్లెట్ అంటే మగవారి వాహనం కిందే లెక్క. చాలా తక్కువ మంది స్త్రీలు వీటిని నడుపుతారు. అయితే ఈ మహిళా స్క్వాడ్ వీటిని ఉపయోగిస్తుండటంతో ఇకపై స్త్రీలు కూడా వీటిని కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నారు. ఏమైనా దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ఇలాంటి స్క్వాడ్స్ అవసరం చాలా ఉంది. ప్రతి ఊళ్లో, ప్రతి నగరంలో ఇలాంటి మహిళా దళాలు తిరుగుతూ ఉంటే ఒక అప్రమత్తత ఉంటుంది. కేరళ విధానాన్ని ఇతర అన్ని రాష్ట్రాలు స్వీకరిస్తాయని ఆశిద్దాం. -
ప్రముఖ దర్శకుడు సాచీ కన్నుమూత
త్రిస్సూర్: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం చెందగా బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తనువు చాలించాడు. తాజాగా ప్రముఖ మలయాళ దర్శకుడు సాచీ కన్నుమూశారు. త్రిస్సూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం మరణించారు. కొద్ది రోజుల క్రితం సాచీ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో అతనికి జూన్ 16న గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం కేరళలోని త్రిస్సూర్‌లో జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు. (బాయ్‌కాట్ సల్మాన్) ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యానికి ఆయన శరీరం స్పందించకపోవడంతో గురువారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా సాచీ పూర్తి పేరు కెఆర్ సచ్చిదానందన్. 2015లో ఆయన దర్శకుడిగా వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఆయన చివరిసారిగా పృథ్వీ సుకుమారన్ హీరోగా నటించిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" చిత్రానికి పని చేశాడు. ఇది సంచలన విజయాన్ని నమోదు చేసుకుని సాచీకి మంచి పేరును తెచ్చిపెట్టింది. (నిరాడంబరంగా నటుడి పెళ్లి) -
షాక్ : నీటికి కటకట.. నల్లాల్లో మద్యం వరద..!
తిరువనంతపురం : రోజూలానే ఉదయం నిద్రలేవగానే నీటి కుళాయిలు తిప్పిన కేరళలోని ఓ కాలనీ వాసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నల్లా పైపుల్లోంచి నీటికి బదులు మద్యం రావడంతో ఆశ్చర్యంలో మునిగిపోయారు. త్రిశూర్‌లోని సోలోమన్ అవెన్యూలో ఈ విశేషం వెలుగుచూసింది. అక్కడ దాదాపు 18 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన చుట్టపక్కలవారు ఇదేం వింతరా బాబూ.. నీటికి కటకట తెలిసిందే కానీ... నల్లాల్లో మందు సరఫరా అవుతోందని తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. (చదవండి : వైరల్ : ఎర్రచీరలో ఇరగదీసింది) ఈ ఘటనపై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. రచనా బార్‌పై ఆబ్కారీ పోలీసుల దాడి గురించి తెలిసింది. ‘ఆరేళ్ల క్రితం సోలోమన్ అవెన్యూకు సమీపంలో ఉండే రచనా బార్లో అక్రమంగా వేల లీటర్ల మద్యం నిల్వలు ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. దాదాపు 6 వేల లీటర్ల మద్యం బాటిళ్లను నాశనం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. బార్లోనే ఓ గొయ్యి తీసి మద్యాన్ని దాంట్లో నింపేశాం. అది భూమిలో ఇంకిపోయింది. కానీ, బార్‌కు సమీపంలోనే ఈ అపార్ట్మెంట్ నిర్మించడంతో... అక్కడి బోరుబావిలోకి మద్యం చేరింది. నీటితో కలసి కుళాయిల్లోకి ప్రవహించింది’అని ఆబ్కారీ పోలీసులు చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదని పేర్కొన్నారు. అయితే, అబ్కారీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు మున్సిపల్ అధికారులను కోరారు. (చదవండి : కరోనా కలకలం : ఈ-వీసాల నిలిపివేత) -
‘తను వెళ్లిపోయాడు; రెండేళ్లు నరకం అనుభవించా’
తిరువనంతపురం : ‘మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం’ అంటూ కేరళకు చెందిన నికేశ్ ఉషా పుష్కరన్, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్ శ్రీకృష్ణ గుడిలో తాము వివాహబంధంతో ఒక్కటయ్యామని, తమ బంధానికి దేవుడు మాత్రమే సాక్షి అని తెలిపారు. ఈ విషయం గురించి నికేశ్ చెబుతూ..‘ మాది త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్. నేను గతంలో ఓ వ్యక్తితో పద్నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాను. పెళ్లి చేసుకుని మన బంధం గురించి అందరికీ చెప్పమని అతడిని అడిగాను. కానీ సమాజానికి భయపడి తను నాకు దూరంగా వెళ్లిపోయాడు. అలా దాదాపు రెండేళ్లపాటు నరకం అనుభవించాను. అందరిలాగా మాకు ప్రత్యేక మ్యాట్రిమొనీలు లేవు. అందుకే వ్యాపారంలో కాస్త తీరిక దొరికితే చాలు బెంగళూరు, తిరువనంతరపురం వెళ్లి నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడేమోనని వెదికేవాడిని. అలా ఓ ఎల్జీబీటీ సంస్థ ద్వారా సోను పరిచయమయ్యాడు. తను నాకంటే ఐదేళ్లు చిన్నవాడు. రెండు రోజుల చాటింగ్ చేసిన తర్వాత ప్రత్యక్షంగా తనను చూశాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం గురించి మా అమ్మకు చెప్పినపుడు చాలా భయపడింది. అమెరికా లేదా యూకేకు వెళ్లి అక్కడే ఉండమని సలహా ఇచ్చింది. ఇండియాలో మాలాంటి వాళ్లను సమాజం గేలి చేస్తుందని, కుటుంబాన్ని వెలి వేస్తుందని ఆమె భయం. కానీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నా హక్కు. అందుకే మేమిద్దరం గుడిలో దేవుడి ఎదుట ఉంగరాలు మార్చుకున్నాం. కారు పార్కింగ్ ఏరియాలో ఒకరి మెడలో ఒకరం తులసిమాలలు వేసుకుని దంపతులమయ్యాం’ అని ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సోను.. తన 29వ ఏట వధువు వెతుకుతున్న సమయంలో తల్లిదండ్రులకు తన గురించిన నిజాన్ని చెప్పాడన్నాడు. మొదట వాళ్లు భయపడినప్పటికీ.. తన వల్ల ఏ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని ఆలోచించిన తనను ప్రశంసించారని చెప్పుకొచ్చాడు. నికేశ్, తాను ప్రస్తుతం కొత్త జీవితం గడుపుతున్నామని, అయితే పిల్లలు లేని లోటు, చట్టబద్ధత లేని వివాహం తమను వేదనకు గురిచేస్తుందన్నాడు. కాగా ఈ విషయమై ఎల్జీబీటీ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయని, తాము కూడా ఇందులో సగర్వంగా భాగస్వాములమవుతామని నికేశ్, సోను పేర్కొన్నారు. తాము ఇప్పుడు అనుభవించే కష్టాలు భవిష్యత్ తరాలు పడకూడదనే తమ పోరాటం ఉధృతం చేస్తామని వెల్లడించారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సెప్టెంబరు 6 తమ జీవితాల్లో వెలుగునింపిందని అయితే తమ మనుగడకు ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. కాగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377 రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబరులో తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
‘వాళ్ల వల్లే నా భర్త చనిపోయాడు’
తిరువనంతపురం : ఉన్నత అధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేరళకు చెందిన ఓ పోలీసు అధికారి భార్య ఆరోపించారు. గిరిజనులమైన కారణంగానే తమకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన చెందారు. అట్టాపడి ప్రాంతంలోని ఓ తండాకు చెందిన కుమార్ అనే వ్యక్తికి పాలక్కాడ్‌లోని ఆర్మ్డ్ విభాగంలో పోస్టింగ్ వచ్చింది. అయితే విధుల్లో చేరిన కుమార్ గత గురువారం ఓ రైల్వేట్రాక్ వద్ద శవమై తేలారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో కుమార్ పోస్టుమార్టం నివేదిక వెల్లడైన తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో తన భర్త మృతిపై స్పందించిన కుమార్ భార్య సాజిని మీడియాతో మాట్లాడారు. సూసైడ్‌లో నోట్లో ఉన్నది తన భర్త చేతిరాతే అని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉన్నత స్థాయి అధికారులు తన భర్తను వేధించేవారని ఆరోపించారు. ‘ నా భర్తను అకారణంగా పొట్టనబెట్టుకున్నారు. తనను వేధించిన అధికారుల పేర్లను ఆయన సూసైడ్ నోట్లో స్పష్టంగా రాశాడు. తన నేపథ్యం గురించి పై అధికారులు హేళనగా మాట్లాడేవారని నాతో చెప్పి తరచూ బాధపడేవాడు. ఇటీవలే ఆయన కొత్త క్వార్టర్‌కు మారాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి పాలక్కాడ్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని సాజిని తెలిపారు. కాగా త్రిస్సూరు రేంజ్ డీఐజీ ఇప్పటికే ఈ కేసు దర్యాప్తునకై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. -
మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!
తిరువనంతపురం : కేరళలో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్ల అధ్వాన్న స్థితిని ప్రశ్నిస్తూ పీడబ్ల్యూడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన ఆమెను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా అవమానించారు. ఆమె కూర్చున్న చోటి నుంచి వెళ్లి పోయాక ఆవు పేడతో ఆ స్థలాన్ని శుద్ధి చేశారు. కేరళలోని త్రిసూరు జిల్లా నట్టికా ఎమ్మెల్యే గీతా గోపి శనివారం పీడబ్యూడీ కార్యాయలం వద్ద నిరసనకు దిగారు. గుంతలు పడిన రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి సీఎం పినరయి విజయన్ దృష్టికి తీసుకువెళ్తానని అధికారులను హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ యువ నాయకులు కొంతమంది గీతా గోపి కూర్చున్న స్థలాన్ని నీళ్లతో కడిగి ఆవు పేడతో శుద్ధి చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆమె ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితురాలైన కారణంగానే వారు తనను ఇలా అవమానించారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనను కేరళ కళలు, సాంస్కృతిక మంత్రి ఏకే బాలన్ తీవ్రంగా ఖండించారు. ఉత్తర భారత దేశంలో సాధారణంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని... ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని పేర్కొన్నారు. -
దొరికిన ఫోటో.. నెరవేరిన ఆనంద్ మహింద్ర కోరిక
తిరువనంతపురం : ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్ర తన మొబైల్లో స్క్రీన్ సేవర్‌గా ఓ సాధారణ బాలిక ఫోటోను పెట్టుకున్నారు. అది కూడా ఆ బాలిక ఫోటో కోసం దాదాపు నాలుగు రోజులపాటూ ఎదురు చూసి చివరికి ఆ బాలిక ఫోటోను సాధించారు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి క్రిష్ణ అనే బాలిక స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లడం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలిక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన ఆనంద్ మహింద్ర ట్విటర్ వేదికగా బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. 'త్రిశూర్‌లో ఆమె ఎవరికన్న తెలుసా? నాకు ఆమె ఫోటో కావాలి. నా మొబైల్ స్క్రీన్ సేవర్‌గా ఆమె గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను పెట్టుకుంటా. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది. బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్ కావల్సిన అవసరం ఉంది' అని ఏప్రిల్ 7న ట్వీట్ చేశారు. అయితే శుక్రవారం ఆనంద్ మహీంద్ర కోరిక నెరవేరింది. ఆ బాలిక గుర్రపు స్వారీ చేస్తున్న ఓ ఫోటోను తన మొబైల్ స్క్రీన్ సేవర్‌గా పెట్టుకున్నారు. 'త్రిశూరు జిల్లాలో స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ పదవ తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లిన అందరికీ స్పూర్తినిచ్చే క్రిష్ణ అనే బాలిక గురించి నేనో వీడియోను ట్వీట్ చేశా. ఎవరికైనా ఆమె తెలిసుంటే నా మొబైల్ స్క్రీన్ సేవర్‌గా క్రిష్ణ ఫోటోను పెట్టుకుంటానని అడిగా. ఈ రోజే ఆ బాలిక ఫోటో మొయిల్‌లో వచ్చింది. పంపినందుకు సుబిన్‌కు కృతజ్ఞతలు' అని ఆనంద్ మహింద్ర ట్వీట్ చేశారు. I had tweeted a video about Krishna, the inspiring young lady who rode her horse to her school exam in Thrissur. I asked if anyone knew her since I wanted a pic to use as a screensaver. I received this in my mail today. Many thanks Subin! pic.twitter.com/4BMu1JHxSL — anand mahindra (@anandmahindra) April 11, 2019 చదవండి : గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి.. -
రెండేళ్ల నరకం తర్వాత...
వేరే మతానికి చెందిన యువకుడితో సన్నిహితంగా ఉందన్న కారణంతో కన్నకూతురితో కర్కశంగా ప్రవర్తించిందో తల్లి. రెండేళ్లుగా నానా హింసలకు గురి చేయగా.. చివరాఖరికి ఓ వీడియో సందేశం ఆ యువతికి విముక్తి లంభించింది. కేరళలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... సాక్షి, తిరువనంతపురం: త్రిస్సూర్‌కు చెందిన అంజలి పాటిల్(26) తండ్రి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. పొరుగున ఉండే ఓ ముస్లిం యువకుడు ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అంజలికి ఆ యువకుడికి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పారు. అయితే అంజలి తల్లి మాత్రం అందుకు ససేమిరా చెప్పింది. చివరకు అంజలి మామలు, అత్త సాయంతో ఆమెను బంధించి హింసించసాగింది. పిచ్చాసుపత్రిలో చేర్చి మరీ... ఆగష్టు 17, 2016 నుంచి అంజలిని ఆమె తల్లి వినీత ఇంట్లో బంధించింది. ఆ తర్వాత ఆరెస్సెస్, వీహెచ్‌పీకి చెందిన కొందరు వ్యక్తుల సాయంతో ఆమెను ఇతర ప్రాంతాలకు తరలించి మరీ హింసించారు. తొలుత ఆమెపై దాడి చేసిన కుటుంబ సభ్యులు.. ఎర్నాకులం, ఎడపల్లిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు ఆమెను తరలించారు. అక్కడ డాక్టర్ దినేశ్ సాయం తీసుకుని ఆమెను మానసిక వ్యాధి పెషెంట్‌గా చిత్రీకరించే యత్నం చేశారు. డ్రగ్స్ ఎక్కించి మరీ 45 రోజులపాటు కరెంట్ షాక్ ఇవ్వటంతో ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. ఆ తర్వాత ఆమెను బీజేపీ, వీహెచ్‌పీ నేతలకు చెందిన ఇళ్లకు మార్చి మార్చి వేధింపులకు గురి చేశారు. చివరాఖరికి మంగళూర్‌లోని ఓ వీహెచ్‌పీ నేత ఇంటికి ఆమెను తరలించి, అక్కడే ఆమెను బంధించారు. చివరాఖరికి ఓ పిల్లాడి ద్వారా ఫోన్ తెప్పించుకున్న ఆమె ఓ వీడియో తీసి ఫేస్బుక్లో అప్ లోడ్ చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రయత్నంలో ఆమె స్నేహితుడు కూడా ఆమెకు సాయపడటం విశేషం. సెర్చ్ ఆపరేషన్.. ఫేస్ బుక్ వీడియో వైరల్ కావటంతో మంగళూర్ మహిళా పోలీసు విభాగం రంగంలోకి దిగింది. మే 1 నుంచి 22 రోజులపాటు ఏకధాటిగా వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చివరాఖరికి ఆమెను రక్షించిన పోలీసులు విముక్తి కల్పించారు. కోర్టు ఆదేశాల మేరకు అంజలిని ఆమె అత్త ఇంటికి పంపించారు. తల్లి వేధింపులపై... ‘పరాయి మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకు నా తల్లి రాక్షసిలా మారిపోయింది. రెండేళ్లుగా నన్ను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. డ్రగ్స్ ఇచ్చి, రోజుకు పది రకాల ఇంజెక్షన్లు ఇచ్చి నన్ను నిద్రపుచ్చేవారు. డాక్టర్ దినేశ్ వెనుక పెద్ద ముఠా నడుస్తోంది. నాలాగా వేరే మతానికి చెందిన యువతులు అక్కడ చాలా మంది ఉన్నారు. వారందరికీ హెవీగా డ్రగ్స్ ఇచ్చి, కరెంట్ షాకిచ్చే వారు. ఎవరెవరో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. కొందరైతే అత్యాచారయత్నానికి కూడా గురి చేశారు. నా తల్లిలాంటి వాళ్లు ఉండకూడదనే దేవుడ్ని ప్రార్థిస్తున్నా. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నా. నా స్నేహితుడితో కొత్త జీవితం ప్రారంభిస్తా’ అని అంజలి తెలిపారు. సీఎంకు ఫిర్యాదు... ఈ వ్యహారంపై కేరళ డీజీపీని కలిసిన(మే 28వ తేదీ) అంజలి.. సీబీ-సీఐబీ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత సీఎం పినరయి విజయన్‌కు కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సీఎం కార్యాలయం ఈ ఘటనపై ఇంతదాకా స్పందించలేదు. మరోవైపు గురువాయర్ పోలీసులు ఆమె ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించగా, కోర్టు జోక్యంతో కేసు నమోదు చేశారు. మంగళూర్లోనూ ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు కేరళ డీజీపీ కార్యాలయం పేర్కొంది. మొత్తం 14 మంది నిందితులపై కేసు నమోదు కాగా, ఏ-1గా అంజలి తల్లి వినీత, అంజలి మావయ్యలు, అత్త, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, మరో ముగ్గురు వీహెచ్‌పీ కార్యకర్తలు, డాక్టర్ దినేశ్ తదితరుల పేర్లను నిందితులుగా చేర్చారు. -
చనిపోతా.. అనుమతివ్వండి
తిరువనంతపురం : గౌరవప్రదమైన జీవితం పొందలేకపోతున్న కారణంగా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ థర్డ్ జెండర్ త్రిసూర్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. త్రిసూరుకు చెందిన 51 ఏళ్ల సుజీ అనే వ్యక్తి తాను థర్డ్ జెండర్నని పేర్కొన్నారు. ఈ కారణంగానే తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేదరికం, ఆకలితో అలమటించడం కన్నా చచ్చిపోవడమే ఉత్తమం. ఆకలితో అలమటిస్తూ నేను బతకలేను. అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. కారుణ్య మరణం పొందేలా నాకు అనుమతి ఇవ్వండి’ అని లేఖలో సుజీ పేర్కొన్నారు. ఉపాధి కల్పించమని వేడుకున్నా... నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన సుజీ కొన్నాళ్ల పాటు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశారు. కానీ ఆమె గురించి అసలు నిజం తెలియడంతో ఆస్పత్రి వర్గాలు లింగ నిర్థారణ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అందుకు సుజీ నిరాకరించడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో సుజీ కేరళకు తిరిగి వచ్చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో కాలికట్ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ పూర్తి చేసిన తనకు ఉద్యోగం కల్పించాల్సిందిగా త్రిసూర్ కలెక్టర్‌కు మూడుసార్లు లేఖలు రాశారు. కానీ కలెక్టర్ నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. దీంతో ఆవేదన చెందిన సుజీ.. ఈసారి తనకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతివ్వాలంటూ లేఖ రాశారు. తండ్రి మరణంతో కుటుంబానికి దూరంగా... కేరళలోని త్రిప్రాయర్‌కు చెందిన సుజీ తన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో కలిసి జీవించేవారు. బాల్యంలో అందరూ తన గురించి హేళనగా మాట్లాడుతున్నప్పటికీ తండ్రి సహకారంతో పాఠశాల విద్యతో పాటు, నర్సింగ్ కూడా పూర్తి చేశారు. అయితే తండ్రి మరణించిన తర్వాత కుటుంబం సుజీని ఇంటి నుంచి వెలివేసింది. 1989లో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన సుజీ.. అక్కడ సంపాదించిన కొద్దిపాటి సొమ్ముతో కేరళలోని ఇడమట్టంలో చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ థర్డ్ జెండర్ అనే కారణంగా ఆమెకు ఎక్కడా ఉద్యోగం లభించలేదు. సహాయం కాదు..ఉద్యోగం కావాలి కారుణ్య మరణం గురించి సుజీ కలెక్టర్‌కు లేఖ రాసిన విషయం మీడియాలో ప్రచారం అయింది. ఇందుకు స్పందించిన పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు ఆమెకు ఎందుకు ఉద్యోగం నిరాకరిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సుజీ.. ‘యునైటెడ్ నర్స్ అసోసియేషన్ నాకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. శుక్రవారంలోగా నా ఇంటికి చెక్కు కూడా పంపిస్తామని తెలిపింది. అయితే నాకు కావాల్సింది డబ్బు కాదు. గౌరవప్రదంగా జీవించడానికి ఉద్యోగం కావాలి. ఎంతో మంది నాకు ఉద్యోగం కల్పిస్తామని చెప్తున్నారే తప్ప.. ఆ విషయంగా నన్ను ఎవరు సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కళ్ల ముందు తగలబెడుతున్నా కాపాడలేదు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళను ఆమె భర్త తగలబెడుతుంటే.. జనాలు చూస్తూ ఉండిపోయారు. ఘటన తర్వాత కూడా ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర గాయాలతో ఆ మహిళ రెండు రోజుల తర్వాత కన్నుమూసింది. హేయనీయమైన ఈ ఘటన త్రిస్సూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జీతూ(29) తన భర్త విరాజ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉండగా విరాజ్ తన భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఓ లోన్ పని నిమిత్తం ఆమె తన తండ్రితో కలిసి చెంగళూరులోని కుదుంబశ్రీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో మాట్లాడుతున్న సమయంలో భర్త విరాజ్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్ పోయటంతో ప్రాణాల కోసం ఆమె పరుగెత్తారు. జీతూ తండ్రి తన కూతురిని కాపాడాలంటూ అక్కడున్న వారందరి కాళ్ల వేళ్ల పడ్డారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. చివరకు ఆమె మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. కనికరం చూపలేదు... ఘటన తర్వాత విరాజ్ అక్కడి నుంచి పారిపోగా.. తీవ్ర గాయాలపాలైన జీతూను ఆస్పత్రికి తరలించేందుకు తండ్రి అక్కడున్న వారి సాయం కోరారు. కాళ్లా వేళ్లా పడ్డ ఎవరూ కనికరం చూపలేదు. చివరకు ఓ ఆటోడ్రైవర్ సాయంతో జీతూ తండ్రి ఆమె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జీతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ ఘటనలో స్థానిక వార్డు మెంబర్ హస్తం కూడా ఉందని జీతూ తండ్రి వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక వేసి తన కూతురిని అక్కడికి రప్పించి మరీ హత్య చేయించారని ఆయన ఆరోపిస్తున్నారు. ‘ఉగ్రవాదులకు కూడా మన దేశంలో మంచి ఆతిథ్యం ఇస్తారు. అలాంటిది నా కూతురు తగలబడి పోతున్నా సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విరాజ్‌ను బుధవారం రాత్రి ముంబైలో అరెస్ట్ చేశారు. -
ఫొటో’.. తలరాతను మార్చేసింది!
-
‘తలకిందులు ఫొటో’.. తలరాతను మార్చేసింది!
త్రిసూర్: ‘‘జీవితంలో మరుపురాని గుర్తులంటే పెళ్లి ఫొటోలే కదండి! అందుకే వాటిని మరికాస్త వినూత్నంగా తియ్యాలనుకుంటాను. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహాలో ఆలోచించక తప్పదుమరి!’’ అంటున్నాడు 23 ఏళ్ల విష్ణు. చెట్టు పైకెక్కి తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీసిన ఆ వీడియో ఏ రేంజ్లో వైరల్ అయిందో మీరంతా చూసే ఉంటారు. విచిత్ర విన్యాసాలు చేస్తూ అతను తీసిన తలకిందులు ఫొటో.. ఇప్పుడతని తలరాతను మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన విష్ణుకు ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయట! సరదాగా తీసిన వీడియో: విష్ణు స్వస్థలం కేరళలోని త్రిసూర్. ‘వైట్‌ర్యాంప్’ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్స్ గ్రూప్‌లో సభ్యుడు. ఏప్రిల్ 15న త్రిసూర్‌కే చెందిన ‘షియాజ్-నవ్య’ల పెళ్లిని కవర్ చెయ్యడానికి వెళ్లాడు. కొత్త తరహాలో ఫొటోలు తీస్తానంటూ కొత్త జంటను కన్విన్స్ చేయడం, చెట్టుకొమ్మకు తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీయడం.. అలా విష్ణు చేసిన విచిత్ర విన్యాసాలను వాళ్ల గ్రూప్ మెంబర్ ఒకరు షూట్ చేశారు. సరదాగా తీసిన ఆ వీడియోను త్రిసూర్ ఫొటోగ్రాఫర్స్ వాట్సప్ గ్రూప్‌లో అప్లోడ్ చేశారు. విపరీతంగా నవ్వుపుట్టించే ఆ వీడియో గంటల్లోనే వైరల్ అయింది. దాదాపు అన్ని సైట్లూ, పత్రికలూ ఫొటోగ్రాఫర్ విచిత్ర విన్యాసం గురించి వార్తలు రాశాయి. విష్ణు ది వివ్వల్ ఫొటోగ్రాఫర్: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన విష్ణును త్రిసూర్ వాసులంతా ముద్దుగా ‘వివ్వల్(గబ్బిలం) ఫొటోగ్రాఫర్’ అని పిలుచుకుంటున్నారట. ఫొటోలు బాగా రావడంతో షియాజ్-నవ్యలు కూడా ఫుల్‌ఖుష్. పైసా ప్రచారం ఖర్చు లేకుండా ఫేమస్ అయిపోయిన విష్ణు అండ్ గ్రూప్‌కి ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్నాయట. ‘‘నిజానికి ఇంతకు ముందు కూడా నేను చెట్లెక్కి ఫొటోలు తీశాను. చిన్నప్పుడు కోతికొమ్మచ్చి బాగా ఆడేవాణ్ని. ఆ ఎక్స్పీరియన్స్ బాగా కలిసొచ్చింది..’ అని నవ్వేస్తాడు విష్ణు. -
ఒక్కటైన భావన, నవీన్
హీరోయిన్ భావన్, నిర్మాత నవీన్ ల వివాహం ఈరోజు ఉదయం కేరళలోని త్రిసూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులు బందు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన భావన ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. భావన హీరోయిన్ గా నటించిన ఓ సినిమాను నవీన్ నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డా ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. భావన తెలుగులోనూ మహాత్మా, ఒంటరి లాంటి సినిమాలతో అలరించింది. -
గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం
సందర్శనీయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన కృష్ణాలయాల్లో ఒకటైన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం కేరళలో ఉంది. త్రిసూర్ జిల్లాలోని చిన్నపట్టణమైన గురువాయూర్‌లో గల ఈ ఆలయం ఐదువేల ఏళ్ల నాటిదని అంచనా. అయితే, ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవు. క్రీస్తుశకం 14-16 శతాబ్దాలకు చెందిన ‘కోకసందేశం’, ‘నారాయణీయం’ వంటి తమిళ సాహిత్య గ్రంథాలలో గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయ వర్ణన ఉంది. ప్రస్తుతం ఉన్న గర్భాలయం క్రీస్తుశకం 1638లో పునర్నిర్మాణానికి నోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లోనే ఇది దక్షిణ భారత దేశంలో ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. సర్పయాగం చేసిన జనమేజయుడు సర్పాల శాప ఫలితంగా కుష్టువ్యాధిగ్రస్థుడయ్యాడని, దత్తాత్రేయుడి సూచన మేరకు గురువాయూర్‌లో మహావిష్ణువు కోసం తపస్సు చేసి, శాపవిమోచనం పొందాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి ఉత్తరాన గల రుద్రతీర్థం వేల ఏళ్ల నాటి నుంచి ఉందని చెబుతారు. సాక్షాత్తు పరమశివుడు సకుటుంబ సమేతంగా ఇక్కడ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడని ప్రతీతి. శ్రీకృష్ణ జన్మాష్టమి, డోలాపూర్ణిమ సహా వైష్ణవ పర్వదినాలన్నీ ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి.