
2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి, నటుడు సురేశ్ గోపి విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన మలయాళ నటుడు తన ప్రత్యర్థిపై గెలుపొందారు. ఆయన విజయంతో భాజపా కేరళలో తన ఖాతా తెరిచింది. తన సమీప ప్రత్యర్థి వీఎస్ సునీల్ కుమార్‌పై(సీపీఐ) ఘనవిజయం సాధించారు. దాదాపు 73 వేలకు పైగా మెజార్టీతో సురేశ్ గోపి గెలిచారు.
