అర్ధరాత్రి తాగొచ్చి నటిని కొట్టేవాడు.. అలాంటి వ్యక్తిని గెలిపించారు! | Actor Saritha About Her Ex Husband Mukesh Behavior, Old Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

మాజీ భార్యను టార్చర్‌ పెట్టిన నటుడు నాయకుడిగా.. ఇదీ మన సమాజం!

Published Mon, Aug 26 2024 12:16 PM | Last Updated on Mon, Aug 26 2024 12:46 PM

Actor Saritha About Her Ex Husband Mukesh Behavior, Old Video Goes Viral

ఇంటి ఇల్లాలిని చూసుకోలేనోడు సమాజాన్ని మాత్రం ఏం ఉద్ధరిస్తాడు? భార్య కంట నీళ్లు తెప్పించినవాడు ప్రజల గోసలు పట్టించుకుంటాడా? అసలు ఇంటినే గెలవలేనివాడికి అందరి మనసులో స్థానం సంపాదించుకునే అర్హత ఇంకెక్కడిది? కానీ ఇవన్నింటికీ విరుద్ధంగా ఓ వ్యక్తి మాత్రం దర్జాగా ఎమ్మెల్యే పోస్టు సంపాదించాడు. అది కూడా వరుసగా రెండుసార్లు! అతడే ముఖేశ్‌ మాధవన్‌..

ప్రేమ పెళ్లి విఫలం
ముఖేశ్‌ నటుడు, నాయకుడు.. 1988లో సరితను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రానురానూ దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెద్దవి కావడంతో 2011లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో క్లాసికల్‌ డ్యాన్సర్‌ దేవికను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడాకులు తీసుకున్నారు.

క్యారెక్టర్‌ లేనివాడు
సీపీఎమ్‌లో కొనసాగుతున్న ఈయన 2016, 2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మాజీ భర్త ముఖేశ్‌ ఎలాంటివాడో చెప్పిన సరిత పాత వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె ఏమందంటే.. ముఖేశ్‌కు క్యారెక్టర్‌ లేదు. ఎదుటివారికి కూసింత గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. పైగా నన్ను అనునిత్యం వేధించేవాడు. అతడి తండ్రి ముందే తాగొచ్చి కొట్టేవాడు. 

తండ్రి ముందే తాగొచ్చి..
అలాగే అమ్మాయిలను వెంటేసుకుని సరాసరి ఇంటికి వచ్చేవాడు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే పనివాళ్లముందు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టి చీడపురుగులా చూసేవాడు. ఒకసారైతే ప్రెగ్నెంట్‌ అని కూడా చూడకుండా కడుపులో తన్నాడు అంటూ సరిత ఎమోషనలైంది. ఇలాంటి వ్యక్తిని సమాజం నమ్మడం, తమనేదో ఉద్ధరిస్తాడని అందలం ఎక్కించడం నిజంగా విడ్డూరమే!

చదవండి: దసరా బాక్సాఫీస్‌.. రజినీకాంత్‌ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement