Mukesh Madhavan
-
ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్, నటుడు జయసూర్యలపై కేరళ పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నటి మిను మునీర్ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. తనను వేధించిన ముకేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వకూడదని కోరారు.మోహన్‌లాల్ రాజీనామా.. మంచి నిర్ణయంఅమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టుల)కు మోహన్‌లాల్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమేనన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ బాధ్యతలు చేపట్టే అర్హత పుష్కలంగా ఉందన్నారు. కాగా ముకేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను వేధించారంటూ మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. డబ్బు కోసం బ్లాక్మెయిల్వీరి వేధింపుల వల్ల మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానంది. హేమ కమిటీ నివేదిక వెలువడిన సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముకేశ్, జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మరో ఐదుగురిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముకేశ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని చెప్తున్నాడు.చదవండి: అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్ -
అర్ధరాత్రి తాగొచ్చి నటిని కొట్టేవాడు.. అలాంటి వ్యక్తిని గెలిపించారు!
ఇంటి ఇల్లాలిని చూసుకోలేనోడు సమాజాన్ని మాత్రం ఏం ఉద్ధరిస్తాడు? భార్య కంట నీళ్లు తెప్పించినవాడు ప్రజల గోసలు పట్టించుకుంటాడా? అసలు ఇంటినే గెలవలేనివాడికి అందరి మనసులో స్థానం సంపాదించుకునే అర్హత ఇంకెక్కడిది? కానీ ఇవన్నింటికీ విరుద్ధంగా ఓ వ్యక్తి మాత్రం దర్జాగా ఎమ్మెల్యే పోస్టు సంపాదించాడు. అది కూడా వరుసగా రెండుసార్లు! అతడే ముఖేశ్ మాధవన్..ప్రేమ పెళ్లి విఫలంముఖేశ్ నటుడు, నాయకుడు.. 1988లో సరితను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రానురానూ దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెద్దవి కావడంతో 2011లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో క్లాసికల్ డ్యాన్సర్ దేవికను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడాకులు తీసుకున్నారు.క్యారెక్టర్ లేనివాడుసీపీఎమ్లో కొనసాగుతున్న ఈయన 2016, 2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మాజీ భర్త ముఖేశ్ ఎలాంటివాడో చెప్పిన సరిత పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె ఏమందంటే.. ముఖేశ్‌కు క్యారెక్టర్ లేదు. ఎదుటివారికి కూసింత గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. పైగా నన్ను అనునిత్యం వేధించేవాడు. అతడి తండ్రి ముందే తాగొచ్చి కొట్టేవాడు. తండ్రి ముందే తాగొచ్చి..అలాగే అమ్మాయిలను వెంటేసుకుని సరాసరి ఇంటికి వచ్చేవాడు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే పనివాళ్లముందు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టి చీడపురుగులా చూసేవాడు. ఒకసారైతే ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కడుపులో తన్నాడు అంటూ సరిత ఎమోషనలైంది. ఇలాంటి వ్యక్తిని సమాజం నమ్మడం, తమనేదో ఉద్ధరిస్తాడని అందలం ఎక్కించడం నిజంగా విడ్డూరమే!చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్! -
నా భర్త కుట్ర పన్నుతున్నాడు: సరిత
చెన్నై : తనకు వ్యతిరేకంగా తన భర్త కుట్ర పన్నుతున్నాడని అలనాటి దక్షిణాది హీరోయిన్ సరిత ఆరోపించారు. సరిత మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మనస్పర్థలు కారణంగా చాలాకాలంగా విడిపోయి జీవిస్తున్న ఈ దంపతులు... తమ వివాహం రద్దు కోరుతూ కేరళలోని ఎర్నాకుళం కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు వ్యవహారంలో తనకు నోటీసులు సక్రమంగా అందటం లేదని నటి సరిత ఆరోపణలు చేశారు. వివాహ రద్దు విషయంలో తన వాదన చెప్పుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించటం లేదని ఆమె వాపోయారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పిల్లల చదువుల నిమిత్తం ఆమె దుబాయ్ లో నివసిస్తోంది. ప్రస్తుతం తన ఇద్దరు బిడ్డలు శ్రవణ్ ముఖేష్, తేజాస్ ముఖేష్ ఆలనా పాలనా కూడా తనే చూసుకుంటున్నానని సరిత పేర్కొన్నారు. -
ఆయన్ను చట్టపరంగా ఎదుర్కొంటా!
‘‘ఇండియాలో నేను లేని సమయం చూసి, నా భర్త ముఖేష్ మాధవన్ వేరే పెళ్లి చేసుకున్నాడు. నాకు విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్లి ఎలా చేసుకుంటాడు? ఈ వార్త విని చాలా షాక్ అయ్యాను’’ అంటూ సీనియర్ నటి సరిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘మరోచరిత్ర’తో కథానాయికగా ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సరిత ఆ తర్వాత పలు అద్భుతమైన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కొంత విరామం తర్వాత కేరక్టర్ నటిగా మారి, ‘అర్జున్’లాంటి చిత్రాల్లో నటించారామె. ఇదిలా ఉంటే నటుడు ముఖేష్ మాధవన్‌తో ఆమె వివాహం 1988లో జరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు కూడా. అయితే, ఆ తతంగం జరగలేదు. దానికి గల కారణాన్ని, తమ వైవాహిక జీవితంలో జరిగిన సంఘటనలను సరిత చెబుతూ - ‘‘మా పెళ్లయిన తర్వాత ముఖేష్ నన్ను పద్ధతిగా ఉండే మంచి పాత్రలు చేయడానికి కూడా అనుమతించలేదు. ఈ కారణంగానే ఎన్నో మంచి అవకాశాలు కోల్పోయాను. పోనీ, తన వైఖరి బాగుండి ఉంటే ఆనందపడేదాన్ని. నా పట్ల ముఖేష్ అనుచితంగా ప్రవర్తించేవాడు. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులుపెట్టాడు. అతని బాధ్యతారాహిత్యం, మద్యానికి బానిస అయిన వైనం.. ఇవన్నీ మా పిల్లలపై ప్రభావం చూపడం మొదలయ్యింది. దాంతో అతన్నుంచి విడిపోవాలనుకున్నాను. 2007లో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుకు విన్నవించుకున్నాను. అయితే విడాకులు ఇవ్వడానికి ముఖేష్ నిరాకరించాడు. ఆ తర్వాత అతను కూడా సమ్మతించాడు. దాంతో 2009లో మళ్లీ కేస్ ఫైల్ చేశాం. అయితే ముఖేష్ కోర్టుకి హాజరయ్యేవాడు కాదు. చివరికి కేసుని ఉపసంహరించుకున్నాను. ముఖేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎవరి బతుకులు వారు బతుకుతున్నాం. మా అబ్బాయి శ్రవణ్ ముఖేష్ దుబాయ్‌లో వైద్య విద్య చదువుతున్నాడు. అందుకని తన దగ్గరకు వెళ్లాను. ఇదే అదను అనుకున్నాడో ఏమో మెతిల్ దేవికాని పెళ్లి చేసుకున్నాడు. చట్టపరంగా నా నుంచి విడిపోకుండా రెండో పెళ్లి చేసుకునే అర్హత తనకు ఎక్కడుంటుంది? ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. ప్రస్తుతం తన ఇద్దరు బిడ్డలు శ్రవణ్ ముఖేష్, తేజాస్ ముఖేష్ ఆలనా పాలనా కూడా తనే చూసుకుంటున్నానని పేర్కొన్నారు సరిత.