న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాలస్తీనాలోని గాజాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందనే వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఇక, తాజాగా గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. దీంతో, ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
గాజాగా విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ స్పందించారు. ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్ వ్యతిరేకించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా గుటేరస్..‘పాలస్తీనా ప్రజలకు వారి సొంత భూమిలో మనుషులుగా జీవించే హక్కు ఉంది. ఐక్యరాజ్యసమితి.. అక్కడ శాంతి, స్థిరత్వం మరియు పాలస్తీనా ప్రజల విడదీయరాని హక్కులకు పూర్తిగా కట్టుబడి ఉంది. గాజాపై పరిష్కారాల అన్వేషణలో, మనం సమస్యను మరింత దిగజార్చకూడదు. అంతర్జాతీయ చట్టం పునాదికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఏ రూపంలోనైనా జాతి ప్రక్షాళనను నివారించడం చాలా అవసరం. గాజా ప్రజలపై భయంకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగించారు. ఇప్పటికైనా పాలస్తీనియన్లకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
The Palestinian people have the right to simply live as human beings in their own land.
The @UN is fully committed to peace, stability, and the inalienable rights of the Palestinian people.— António Guterres (@antonioguterres) February 5, 2025
మరోవైపు.. గాజా ప్రాంతంలో తమ దేశ సైన్యాన్ని మోహరించడానికి ట్రంప్ సిద్దంగా లేరని వైట్ హౌస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. గాజా పునర్ నిర్మాణంలో అమెరికా భాగస్వామ్యం అవసరమని ట్రంప్ విశ్వస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు.
In the search for solutions on Gaza, we must not make the problem worse.
It is vital to stay true to the bedrock of international law.
It is essential to avoid any form of ethnic cleansing.— António Guterres (@antonioguterres) February 5, 2025
ఇదిలా ఉండగా.. అంతకుముందు, సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.
గాజాను వీడబోం: స్థానికులు
ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది.
పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment