న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై మంగళవారం హర్యానాలో ఓ కేసు నమోదైంది.
ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. దీంతో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగి మరీ కేజ్రీవాల్ విమర్శలను తిప్పికొట్టారు. అదే సమయంలో.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ(PM Modi), కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దాకా కూడా చేరింది. అయితే..
అయితే.. ఈ అంశంపై తాజాగా షాబాద్(Shahbad)కు చెందిన జగ్మోహన్ మంచందా అనే లాయర్, కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగ్మోహన్ పేర్కొన్నారు. దీంతో బీఎన్‌ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment