yamuna river
-
కాలుష్యంతో నురగలు కక్కుతున్న యమున
-
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్.. ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్‌దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్ పడింది.చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్‌దేవను శనివారం(అక్టోబర్ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్‌మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.ఇదీ చదవండి: అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే -
హస్తినలో యమునా తీరం... కాలుష్య కాసారం!
చూసేందుకు పాల నురగలా తళతళా మెరిసిపోతూ కని్పస్తోంది కదూ! కానీ ఇదంతా దేశ రాజధానిలో యమునా నదిని నిలువెల్లా కబళించిన కాలుష్యం తాలూకు నురగ! ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నురగలో అమోనియా, పాస్పేట్ వంటివి ప్రమాదకర పాళ్లలో ఉన్నట్టు నిపుణులు తేల్చారు. ఇది శ్వాసతో పాటు పలురకాలైన చర్మ సమస్యలకు దారి తీస్తుందని వివరించారు. యమునలో కాలుష్యం కొంతకాలంగా ప్రమాదకర స్థాయికి పెరిగిపోతున్నా వర్షాకాలంలో ఈ స్థాయి నురగను ఎప్పుడూ చూడలేదంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ పొడవునా యమునలో కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్న 13 హాట్స్పాట్లను గుర్తించినట్టు రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. దుమ్ము, ధూళితో పాటు నురగను నియంత్రించేందుకు 80 చోట్ల యాంటీ స్మాగ్ గన్స్ మోహరిస్తామన్నారు. కానీ మాటలే తప్ప యమునలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆప్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. -
కాలుష్య కోరల్లో యమునా నది
-
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్‌కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్‌లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్‌కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?
దేశంలో ఒక పక్క సార్వత్రిక ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది. టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్ లాక్డౌన్ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం. తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు. Kalindi Kunj ... Yamuna Delhi . Beautiful poisonous pink water froth with chemicals ,, @ArvindKejriwal promised clean Yamuna in 2017 ,,nothing happened@SwatiJaiHind @AtishiAAP ... IIT quota admission , is useless pic.twitter.com/svcQ3wdYGw — No Conversion (@noconversion) May 19, 2023 నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ 99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్పోజ్ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మోకాలు లోతు నురగ నీటిలో ఛఠ్ పూజలు
ఢిల్లీ: యమునా నదిలో కలుషిత నీటిలోనే భక్తులు నేడు ఛఠ్ పూజలు నిర్వహించారు. కాళింది కుంజ్ వద్ద మోకాలు లోతు నురగ నీటిలో మహిళలు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యమునా నది కలుషిత నీటిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Delhi: Devotees stand in knee-deep toxic foam in Yamuna for Chhath Puja Read @ANI Story | https://t.co/M97YK6qIOn#Yamuna #ChhathPooja #Delhi #ToxicFoam pic.twitter.com/dPrvex1Esh — ANI Digital (@ani_digital) November 20, 2023 నాలుగు రోజుల పాటు సాగిన ఛఠ్ పూజా వేడుకల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు సోమవారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. యమునా నదిలో నురగలు వస్తున్నప్పటికీ తప్పనిస్థితిలో భక్తులు పూజా కార్యక్రమాలు చేశారు. అయితే.. యమునా నది నీటిలో అధిక పాస్పేట్ స్థాయిల కారణంగా నురగ నీరు ప్రవహిస్తోంది. యూపీ, హర్యానా సహా చుట్టుపక్కల రాష్ట్రాల పరిశ్రమల నుంచి కలుషిత నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా నది నీటిలో పాస్పేట్ స్థాయిలు అధికంగా ఉన్నాయి. ఛఠ్ పూజా కార్యక్రమాలు ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్, యూపీ, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నాలుగు రోజులపాటు జరుగుతున్న ఛఠ్ పండుగ శుక్రవారం ప్రారంభమైంది. స్వచ్ఛత, సద్భావన, విశ్వాసాలకు నిలయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం
న్యూఢిల్లీ: ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న వర్షాల ప్రభావానికి యమునా నది మరోసారి పోటెత్తింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఉత్తరాఖండ్ ఇటు హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ శాఖ తెలపడంతో అధికారులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత నెలలో దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. యమునా నది ప్రవాహమైతే జులై 13న అత్యధికంగా 208.66 మీ. రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే నెలకొంది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యమునా నది ప్రవాహం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 205.39 మీటర్లకు చేరినట్లు సెంట్రల్ వాటర్ కమీషన్(CWC) తెలిపింది. హర్యానాలోని యమునానగర్ హాత్నికుండ్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి నీటి ప్రవాహం ఉధృతి 30,153 క్యూసెక్కులకు చేరినట్లు చెబుతోంది సెంట్రల్ వాటర్ కమీషన్. హిణాచల్ ప్రదేశ్ లోనూ, ఉత్తరాఖండ్ లోనూ మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండీ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కొండతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ చరియలు జారి పడటం, వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించడంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. #WATCH | Water level of River Yamuna rises in Delhi again. Drone visuals from this morning show the current situation around Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/PATydIBQXZ — ANI (@ANI) August 16, 2023 యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టామని రహదారులపై చిక్కుకున్న వారిని విడిపించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. కల్క -షిమ్లా, కీరత్ పుర్-మనాలి, పఠాన్ కోట్ - మండి, ధర్మశాల - షిమ్లా రహదారులన్నీ మూసివేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎర్రకోట వేడుకకు హాజరుకాని మల్లికార్జున ఖర్గే.. నెట్టింట వైరల్‌గా ఖాళీ కుర్చి -
చినుకుతో వణుకు
యమునా నది ఢిల్లీ పరిధిలో 48 కి.మీ. మేరకు ప్రవహిస్తుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. జూలై 10న సంభవించిన వరదల కారణంగా రాజధాని నగరానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా. ఢిల్లీలో చిత్తడి నేలలు, బావులు, సరస్సులు వంటి జల వనరులు 1,040కి పైగా ఉన్నాయి. వీటికి అధికారిక గుర్తింపు లేదు. ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో అవి సులభంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా ఢిల్లీని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నిజానికి దేశంలోని అన్ని చిన్నా పెద్దా నగరాలదీ ఇదే సమస్య... ♦ ఢిల్లీలో మురుగునీటి పారుదల వ్యవస్థ 1970ల నాటిది. నాటితో పోలిస్తే నగర జనాభా కనీవినీ ఎరగనంతగా పెరిగిపోయింది. ♦ దాంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఇక అడ్డగోలు నిర్మాణాలతో డ్రైనేజీ వ్యవస్థ కుదించుకుపోయి సమస్య మరీ పెద్దదవుతోంది. ♦ ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతం దాదాపుగా 97 చదరపు కిలోమీటర్లుంటుంది. నగర భూభాగంలో ఇది 7%. ఇందులో అత్యధిక భూభాగాన్ని ఆక్రమణలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు కట్టడానికి కేటాయించడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతాలు 600కు పైగా ఉన్నాయి. వీటిలో 60% వరకు నీరు లేక ఎండిపోయాయి. ఒక్క రోజులోనే అతి భారీ వర్షం కురవడంతో అవన్నీ ఇప్పుడు నీట మునిగాయి. ♦ పైగా వీటిలో చాలా ప్రాంతాలు ఆక్రమణలకు లోనయ్యాయి. వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. మరెన్నో భూముల్ని అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించారు. 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం నిర్మించిన గ్రామం, అక్షరధామ్ ఆలయం వంటివెన్నో వరద ప్రాంతాల్లోని ఆక్రమిత భూములపై నిర్మించినవే. ♦ చిత్తడి నేలలు సహజసిద్ధంగా నీటిని పీల్చుకొని భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. కానీ ఢిల్లీలోని చిత్తడి నేలల్లో 200కు పైగా ఎండిపోయి ఆక్రమణలకు గురయ్యాయి. హతినికుండ్ వివాదం హరియాణాలో 1996లో కట్టిన ఈ ఆనకట్ట ద్వారా నీళ్లు యమున నది తూర్పు, పశ్చిమ కాలువల్లోకి ప్రవహిస్తాయి. హరియాణా ప్రభుత్వం ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తేయడంతో నేరుగా యమున నదిలోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా మారుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తాము నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తూ లక్ష క్యూసెక్కులు దాటితేనే నీటిని వదులుతున్నామని హరియాణా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నెల 10వ తేదీన హతినికుండ్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 3.59 లక్షల క్యూసెక్కుల నీరు యమునలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ నీట మునిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే 2010 వర్షాకాలంలో 7 లక్షల క్యూసెక్కుల నీరు హతినికుండ్ నుంచి విడదల చేసినప్పటికీ అప్పట్లో నగరానికి పెద్దగా ముప్పు రాలేదు. ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్కులకే ముప్పు రావడానికి ఆక్రమణలు, అడ్డగోలు నిర్మాణాలే కారణమని సౌత్ ఆసియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్, పీపుల్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ అభిప్రాయపడ్డారు. చిత్తడి నేలల పునరుద్ధరణ.. వరద ప్రభావాన్ని తగ్గించాలంటే ఆక్రమణలను తొలగించి నదీ తీర ప్రాంతాలను పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుందుకు ప్రభుత్వం కృషి చేయాలి. యమునా నది పొంగి పొర్లకుండా ఢిల్లీకి రక్షణ కవచంలా ఉండే చిత్తడి నేలలు, సరస్సులు, చెరువుల వంటివి తగ్గిపోతున్నాయి. అవి లేకుండా యమున ప్రవాహం సవ్యంగా సాగదన్న అభిప్రాయాలున్నాయి. ఈ సరస్సులు, చెరువులు, బావుల వంటివి నీటిని స్టోరేజ్ చేయడం వల్ల డ్రైనేజీలోకి వెళ్లే నీటి ప్రవాహం తగ్గుతుంది. ‘‘నదుల వరదను శాపంగా చూడకూడదు. పరివాహక ప్రాంతంలో గడ్డివాములు, చెట్లు పెంచడం వంటివి చేస్తే వరద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు’’ అని సీనియర్ సైంటిస్ట్ ఫయాద్ ఖుద్సర్ చెప్పారు. ఢిల్లీ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. నిర్మాణాలు పెరిగి కాంక్రీట్ జంగిల్‌గా మారింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సన్నద్ధత లేదు. అందుకే నగరం ఇలా వరద ముప్పుకు లోనవుతోంది. – రితేశ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్, సౌత్ ఏషియా – సాక్షి , నేషనల్ డెస్క్ -
మరోసారి యమునా నది ఉగ్రరూపం.. కేజ్రీవాల్ సర్కార్ అలర్ట్
ఢిల్లీ: ఉత్తరాదిన వానలు దండికొడుతున్నాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమ్తమైంది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హర్యానాలోని హత్నికుండ్ బరాజ్‌నుంచి ప్రభుత్వం 2 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. దీంతో, దిగువన ఉన్న ఢిల్లీకి వరద పోటెత్తింది. ఈ క్రమంలో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. మరోసారి రికార్డు స్థాయిలో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ◆दिल्ली में यमुना नदी का जलस्तर फिर बढ़ा ◆205.75 मीटर दर्ज किया गया जलस्तर #yamunariver #Delhi #abcnewsmedia pic.twitter.com/KXfKGtmbnI — Abcnews.media (@abcnewsmedia) July 23, 2023 ఈ సందర్బంగా యమునా నది ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది ప్రభుత్వం. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే గత కొన్నిరోజులుగా ఢిల్లీలో యమునా నది 205.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నదీ ప్రవాహం ప్రమాద స్థాయికి తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 13న యమునా నది 208.66 మీటర్లు ప్రవహించింది. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. Visuals of Yamuna river from Delhi's Loha Pul. A surge in discharge from the Hathnikund Barrage into the Yamuna following heavy rain in parts of Uttarakhand and Himachal Pradesh is expected to increase the water level of the river in Delhi. pic.twitter.com/rU8yC6jXFn — Press Trust of India (@PTI_News) July 23, 2023 ❗️#YamunaRiver Crosses Danger Mark – Delhi on #HighAlert! Following #HeavyRains in Himachal & Pradesh and Uttarakhand - the Hathnikund dam has been discharged into the river. Water levels are now almost even with the Old Railway Bridge. The #CentralWaterCommission (CWC) data… pic.twitter.com/bRUbTlSEp8 — RT_India (@RT_India_news) July 23, 2023 ఇది కూడా చదవండి: వీడియో: బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్‌గంగ.. 20కిమీ మేర ట్రాఫిక్ జామ్ -
డేంజర్ యమున.. తాజ్ మహల్‌ను తాకిన వరద
ఢిల్లీ: దేశ రాజధానిని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షంతో.. యమునా నది మళ్లీ ఉప్పొంగి డేంజర్ మార్క్‌ను చేరుకుంది. నది నీటి మట్టం 495.8 అడుగులకు చేరింది. దీంతో.. ప్రపంచ వింత ‘తాజ్‌మహల్’ ను యమునా వరద తాకగా.. ఓ గార్డెన్ నీట మునిగింది కూడా. సరిగ్గా 45 కిందట.. ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. 1978లో తాజ్‌మహల్‌ను యమునా వరద ముంచెత్తింది. అయితే ప్రస్తుత వరదతో ఈ చారిత్రక స్మారకానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు సాహసం చేయొద్దని స్థానికులను అధికారులు హెచ్చరిస్తున్నారు. #WATCH | Uttar Pradesh: The water level of the Yamuna River continues to increase in Agra. pic.twitter.com/pRRFoUirUU — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023 వరద వల్ల తాజ్ కు ప్రమాదం లేకపోయినప్పటికీ... చుట్టు పక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది. మరోవైపు యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. -
కాస్తంత తగ్గిన యమున నీటి మట్టం.. కోలుకుంటున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కుంభవృష్టి వర్షాలు లేకున్నా ఎగువప్రాంతాల నుంచి యమునా నది మోసుకొచి్చన వరదనీటితో అల్లాడిపోయిన దేశ రాజధాని నెమ్మదిగా తెరిపినపడుతోంది. గురువారం రాత్రి అత్యంత ప్రమాదకరంగా 208.66 మీటర్లుగా ఉన్న నది నీటిమట్టం శనివారం ఉదయం పదిగంటలకు 207.43 మీటర్లకు తగ్గడమే ఇందుకు కారణం. వరదముంపు ప్రాంతాల్లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయని డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్ చెప్పారు. ‘అవిశ్రాంతంగా శ్రమిస్తున్న అధికారులపై ఎన్నికైన ‘ప్రభుత్వం’ విమర్శలు చేయడం తగదు. ఇది అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది’ అని ఆప్ సర్కార్నుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. హరియాణాలోని హాతీ్నకుండ్ బ్యారేజీ నుంచి వరదనీటి ఔట్‌ఫ్లో తగ్గడంతో ఢిల్లీ పరిసరప్రాంతాల్లో వరదప్రభావం గంట గంటకు తగ్గుతోంది. అయితే భారతవాతావరణ శాఖ మాత్రం ఢిల్లీలో వచ్చే రెండ్రోజులు వర్షాలు పడతాయని సూచించింది. భీకరవర్షాల బారిన పడిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మరో ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలుపడే అవకాశం ఉందని అంచనావేసింది. దీంతో యమునా నీటిమట్టం మళ్లీ పెరుగుతుందనే భయాలు ఢిల్లీవాసుల్లో వ్యక్తమయ్యాయి. ఆక్రమణలే ముంచాయి ఢిల్లీలో వరదకు కారణం నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణ అని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సీనియర్ అధికారి ఒకరు విశ్లేíÙంచారు. ‘గతంలో వరదనీరు విస్తారమైన ప్రాంతం గుండా ప్రవహించేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఆక్రమణలతో ఇరుకైపోయింది. దీంతో ఇరుకుదారుల్లో ఎత్తుగా ప్రవహించి సుదూర ప్రాంతాలను వరదముంచెత్తింది. గతంతో పోలిస్తే ఈఏడాది హత్నీకుండ్ బ్యారేజీ నుంచి నీరు ఢిల్లీకి చాలా తక్కువ సమయంలో, ఎక్కువ పరిమాణంలో చేరుకుంది’ అని అధికారి విశ్లేíÙంచారు. ‘ యమున ఎగువ ప్రాంతం మొత్తంలో ఒకేసారి భారీవర్షాలు పడటం ఈసారి పెద్ద వరదకు మరో కారణం’ అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) భారత ప్రతినిధి యశ్వీర్ భట్నాగర్ చెప్పారు. -
Pritam Bull:కోటి రూపాయల ఎద్దును కాపాడారోచ్!
నోయిడా: యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు అరిగోస పడుతున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్) సైతం రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. నోయిడా తీరం వెంట ఎనిమిది గ్రామాలకు చెందిన ఐదు వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించింది ఎన్డీఆర్ఎఫ్. అలాగే.. గురువారం నుంచి ఇప్పటిదాకా పశువులు, కుక్కలు, కుందేళ్లు, గినియా పందులు.. ఇలా 6వేల దాకా మూగజీవాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారట. ఈ రెస్క్యూలో దేశంలోకెల్లా నెంబర్ వన్ ఎద్దును సైతం కాపాడరంట. ఈ విషయాన్ని స్వయంగా 8వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించింది. ప్రీతమ్ అనే గిర్ జాతి ఎద్దును నోయిడా కమలా నగర్లో వరద నుంచి రక్షించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. దీని ధర కోటి రూపాయలకు పైగా పలుకుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని వయసు ఏడేళ్లు?!. నడిచే బంగారంగా గిర్ పశువులకు దేశంలోనే ఓ పేరుంది. పాలకే కాదు.. ఎద్దులకూ మాంచి గిరాకీ. ఇక ప్రీతమ్ వంశ వృక్షంలో ముందుతరాల పశువులకూ అడ్డగోలు రేటు దక్కింది. దేశంలో ఇలాంటి కాస్ట్లీ పశువులు ఉన్నా.. ప్రీతమ్ మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 2019లో తొలిసారి ది నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. సంకరణంతో పాటు దీని వీర్యాన్ని కూడా ప్రత్యేకంగా అమ్ముతుంటారు. అయితే ఇది కూడా కాస్ట్లీ వ్యవహారమే!. భారత్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు ధర.. గరిష్టంగా 98లక్షల రూపాయలుగా ఉండడం గమనార్హం. అంటే ప్రీతమ్గాడి వెల అంతకన్నా ఎక్కువేనన్న మాట!!. #आपदासेवासदैवसर्वत्र Team @8NdrfGhaziabad has rescued 3 cattles including India's No.1 Bull "PRITAM" costing 1 Cr. from Noida. NDRF teams are working hard to save lives in flood affected areas.#animalrescue @ndmaindia @NDRFHQ @noida_authority @HMOIndia @PIBHomeAffairs pic.twitter.com/MdMRikYFVz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 #आपदासेवासदैवसर्वत्र#animalrescue Team @8NdrfGhaziabad conducting flood rescue and evacuation.This is our country's philosophy:-No one should be left behind in times of need.NdRF rescue people as well as animals at Noida@noida_authority@HMOIndia@NDRFHQ@ndmaindia@ANI pic.twitter.com/e7j8sTEixz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 -
Delhi Floods: ఇంకా జల దిగ్బంధంలోనే ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యమునా నది శుక్రవారం కొంత శాంతించింది. నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ పలు కీలక ప్రాంతాలు ఇంకా వరద ముట్టడిలోనే ఉన్నాయి. నది నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్ దాకా వరద నీరు చేరింది. యమునా నదిలో నీటమట్టం గురువారం 208.66 మీటర్లకు చేరుకోగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా 208.17 మీటర్లకు తగ్గిపోయింది. వరద ప్రవాహం ధాటికి దెబ్బతిన్న ఇంద్రప్రస్థ వాటర్ రెగ్యులేటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రెగ్యులేటర్ దెబ్బతినడం వల్లే నదిలోని వరద ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇసుక బస్తాలు, కంకరతో వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైనిక జవాన్లు, ఢిల్లీ అధికారులు శ్రమిస్తున్నారు. నగరంలోని రోడ్లపై వరద నీరు ఇంకా తగ్గలేదు. రహదారులు చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లలను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. వాహనాలను అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్మశానాలు సైతం జలమయం కావడంతో అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా పలు శ్మశాన వాటికలను మూసివేసినట్లు నగర మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. వరదలపై ఆరా తీసిన ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కేంద్ర మోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. మరో 24 గంటల్లో యమునా నదిలో ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, అతి త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోదీకి అమిత్ షా వివరించారు. -
సుప్రీంకోర్టుకు చేరిన వరద నీరు.. సైన్యం సహకారాన్ని కోరిన కేజ్రీవాల్..
ఢిల్లీ: యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రెయిన్ రెగ్యులేటర్ పాడవడంతో ఐటీఓ క్రాసింగ్ ఏరియా, నిత్య రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి యమునా నది వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీ సహాయం కోరాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సహాయం తీసుకుని రెగ్యులేటర్‌ను సరిచేయాలని కోరారు. ఇందుకోసం ఇంజినీరు బృందాలు రాత్రంతా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇంద్రప్రస్తా బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్ఓ బిల్డింగ్ మధ్య ఉండే డ్రెయిన్ రెగ్యులేటర్ పాడయిపోయిన కారణంగా వరద ఉద్దృతి ఈ ప్రాంతానికి చేరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. ఐటీఓ క్రాసింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌కు షాక్ వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX — Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023 సుప్రీంకోర్టుకు వరద నీరు.. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉప్పొంగిన యమునా నది ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్న యమునా నది 208.46 మీటర్ల మేర ప్రవహించింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానానికి 208.30కు తగ్గుతుందని కేంద్ర వాటర్ కమిషన్ అంచనా వేసింది. అయితే.. ఇప్పటికే వరద నీరు ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఢిల్లీలో వరద నేపథ్యంలో ఫ్రాన్స్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలువులు ప్రకటించారు. ఇదీ చదవండి: Delhi Rainfall Floods: యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం -
యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృత స్థిరంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా వజీరాబాద్, చంద్రావాల్, ఓక్లాలోని నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం మూసివేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనగానే వీటిని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు వరద తీవ్రత దృష్ట్యా నగరంలో విద్యా సంస్థలు, అత్యవసర కార్యకలాపాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం సెలవు ప్రకటించింది. ఆదివారం దాకా సెలవు అమల్లో ఉంటుందని పేర్కొంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలు రాకూడదని స్పష్టం చేసింది. రోడ్లపై నీరు పొంగిపొర్లుతుండడంతో తూర్పు ఢిల్లీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. మరికొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వరదల ప్రభావం మెట్రోరైలు వ్యవస్థపైనా పడింది. ముందు జాగ్రత్త చర్యగా యమునా నదిపై ఉన్న పట్టాలపై మెట్రోరైలు వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేశారు. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లోకి ప్రయాణికులను అనుమతించడంలేదు. పంజాబ్, హరియాణాల్లోనూ... చండీగఢ్: పంజాబ్, హరియాణాలనూ వర్షాలు, వరద ఇంకా వదల్లేదు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. విద్యా సంస్థలకు సెలవులను పంజాబ్ ప్రభుత్వం ఈ నెల 16 దాకా పొడిగించింది. ఢిల్లీలో యమునా నది వరదకు కారణమైన హరియాణాలోని హత్రికుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గించారు. వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 21 మంది మృతిచెందారు. హిమాచల్‌లో సురక్షిత ప్రాంతాలకు పర్యాటకులు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, కొండ చరియలు విరిగిపడడం వల్ల ఉన్నచోటే చిక్కుకుపోయిన పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం చందర్తాల్ నుంచి 256 మందిని తరలించారు. గత నాలుగు రోజుల్లో 60 వేల మంది పర్యాటకులను తరలించినట్లు అధికారులు చెప్పారు. కాసోల్, ఖీర్గంగలో 10 వేల మంది చిక్కుకుపోయారు. వారు తమ కార్లను వదిలేసి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. హిమాచల్‌లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 91కు చేరుకుంది. 14 మంది గల్లంతయ్యారు. కేజ్రివాల్ ఇంటి వద్దకు వరద నీరు ఢిల్లీలోని కీలక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. సెక్రెటేరియట్ ఏరియాలో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం జలమయంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసం వద్దకు వరద నీరు చేరింది. కాశ్మీరీ గేట్ బస్ టెరి్మనల్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను నిలిపివేశారు. ప్రఖ్యాత ఎర్రకోట గోడల వరకూ యమునా నది నీరు చేరుకుంది. ఇక్కడ మోకాళ్ల లోతు నీటిలో జనం నడిచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రాజ్‌ఘాట్, పురానా ఖిలా సైతం జలమయమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సుశ్రుత ట్రామా కేర్ సెంటర్ మునిగిపోవడంతో 40 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాల్లో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. -
యమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్ నివాసం
ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల కొనసాగుతుండటంతో యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. అయితే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు Rivers keeps reminding us that how powerful they are as Yamuna Ji flowing at its Record Levels#Delhi - #Noida pic.twitter.com/lzxw0JJBY9 — Weatherman Shubham (@shubhamtorres09) July 13, 2023 వరద గుప్పిట్లో కేజ్రీవాల్ నివాసం యమునా నది మహోగ్ర రూపంతో సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీని వరద నీరు చుట్టుముట్టింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలు చేరాయి. దీంతో మజ్ను కా తిలాను కశ్మీరీ గేట్ ఐఎస్బీటీతో కలిపే మార్గంపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. #WATCH | Civil Lines area of Delhi flooded, latest visuals from the area. Several areas of the city are reeling under flood and water-logging as the water level of river Yamuna continues to rise following heavy rainfall and the release of water from Hathnikund Barrage. pic.twitter.com/UecZsfIBwb — ANI (@ANI) July 13, 2023 ఇళ్లు జలమయం, పాఠశాలలకు సెలవులు యమునా నది ప్రళయంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలను ఖాళీ చేశారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. వరదల ప్రభావంతో మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు యమునా బజార్, ప్రసిద్ధ టిబెటన్ మొనాస్టరీ మార్కెట్, నిగంబోధ్ ఘాట్‌లో దహన సంస్కారాలను నిలిపివేశారు. చదవండి: Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి? Flood has caused massive devastation in northern India, now has reached Delhi - Modi left for Paris! pic.twitter.com/I8eTMulhmo — Ashok Swain (@ashoswai) July 13, 2023 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల మూసివేత 'యమునా నది నీటిమట్టం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీని వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతుంది. నది నీటిమట్టం తగ్గిన వెంంటనే ఈ ప్లాంట్లను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అదే విధంగా ఈ క్రమంలో హత్నికుండా బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం దాటేయడంతో, అదనపు నీటిని విడుదల చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. #WATCH | Delhi CM Arvind Kejriwal says, "We are at the Wazirabad Water Treatment Plant. For the first time in Delhi, Yamuna has touched this level. Three Water Treatment Plants have been shut down due to this as the water has entered pumps & machines...25% of the water supply in… pic.twitter.com/SAAhguqo45 — ANI (@ANI) July 13, 2023 -
ఆల్ టైం రికార్డుకు చేరిన యమునా నది వరద ప్రవాహం
-
Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి?
దేశ రాజధాని నీట మునిగింది. మూడురోజుల ఎడతెరిపి ఇవ్వని వర్షంతో.. ఢిల్లీకి ఈ దుస్థితి ఏర్పడింది. 205 మీటర్ల డేంజర్ మార్క్‌ను ఇప్పటికే దాటేసి మరీ యమునా నది మహోగ్ర రూపంతో ఉప్పొంగుతోంది. నీటి స్థాయి ఇంకా పెరుగుతూ పోవడంతో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఆందోళన నెలకొంది. అందుకే యమునా నది తీరం వెంట 144 సెక్షన్ విధించారు!. అయితే వర్షాలే రాజధాని ప్రాంతం నీట మునగడానికి కారణం కాదా? ఢిల్లీ.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం, దీనికి తోడు హర్యానా హర్యానాలోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్లే రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం వరద పరిస్థితి నెలకొంది. మోకాళ్ల లోతు నీటిపైనే నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే.. నిపుణులు మాత్రమే ఇవి మాత్రమే కారణాలు కాదని చెబుతున్నారు. ఢిల్లీ వరద పరిస్థితులపై సెంట్రల్ వాటర్ కమిషన్(CWC)కి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. హర్యానా యమునానగర్‌లోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి ఎన్నో ఏళ్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు. 180 కిలోమీటర్ల ప్రయాణం.. అదీ రెండు, మూడు రోజుల తర్వాత అది ఢిల్లీకి చేరుకునేది. అయితే.. ఈసారి తక్కువ టైంలో వరద నీరు ఢిల్లీ వైపునకు చేరింది. అదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో.. ఆ నీరు ఈ నీరు కలిసి ఢిల్లీని వరదలా ముంచెత్తాయి. అయితే.. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు, నేల కోత(కట్టడాలతో పాటు కాలుష్యమూ దీనికి కారణంగా చెబుతున్నారు). ఇంతకుముందు, నీరు ప్రవహించడానికి ఎక్కువ స్థలం ఉండేది. ఇప్పుడు నేల కోత, అక్రమ కట్టడాల కారణంగా అది కుంచించుకుపోయిందని చెబుతున్నారాయన. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH)లోని నేచురల్ హెరిటేజ్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మను భట్నాగర్.. యమునా నది ఇంతలా ఉప్పొంగడానికి విపరీతమైన వర్షపాతం కారణమని అభిప్రాయపడ్డారు. యమునా నదికి ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎక్కువ కాలం పడే వర్షాల వల్ల వరద ప్రభావం కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అందువల్లే దిగువన ఈ పరిస్థితి నెలకొందని మను భట్నాగర్ అంటున్నారు. నదీ డ్యామ్‌లపై అధ్యయనం చేసిన అనుభవం ఉన్న నిపుణుడు భీమ్ సింగ్ రావత్ యమునా నది నదీ కోత వల్ల.. నదీగర్భం ఎత్తు పెరిగిపోవడమేనని అభిప్రాయపడ్డారు. ‘‘వజీరాబాద్ నుంచి ఓక్లా వరకు 22 కిలోమీటర్ల నది విస్తీర్ణంలో.. 20 కంటే ఎక్కువ వంతెనలు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. తద్వారా నదీ కోతకు గురై.. ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కాలుష్య కారకాలూ కూడా నీటి ప్రవాహానికి అడ్డుతగులుతున్నాయి’’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలో యమునా నదీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పరిస్థితి ఇవాళ్టికి మరింత దిగజారే అవకాశం ఉండడంతో.. నదీ చుట్టుపక్కలకు వెళ్లకూడదని నిషేధాజ్ఞాలు జారీ అయ్యాయి. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో.. 208.46 మీటర్ల లెవల్‌కు నీటి స్థాయి చేరుకుంది. 1978లో ఇది 207.49 మీటర్లు దాటింది. జాతీయ విపత్తు స్పందన బలగాల(NDRF) నుంచి 12 బృందాలు ఇప్పటికే మోహరించాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో యమునా నది మరింత ఉధృతరూపం దాల్చింది. నదిలో నీటిమట్టం గురువారం ఉదయం నాటికి 208.46 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఉదయం 10 గంటల తర్వాత యమునా నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీనిని ‘తీవ్ర పరిస్థితి’గా కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇక నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ విభాగం సూచించింది. బుధవారం నది సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 అమిత్ షాకు కేజ్రివాల్ లేఖ ఢిల్లీలో వరద ఉధృతి పెరుగుతోందని, యమునలో నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో భీకర వరదలు రావడం ప్రపంచానికి మంచి సందేశం కాదని చెప్పారు. జి–20 సదస్సుకు త్వరలో ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర హోంశామంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. హరియాణాలోని హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఢిల్లీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసిందని తెలిపారు. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని ఆయన ట్వీట్ చేశారు. #WATCH | Delhi: Low-lying areas near Kashmiri gate flooded due to the rise in the water level of river Yamuna. pic.twitter.com/wgSNhB669c — ANI (@ANI) July 13, 2023 హిమాచల్‌లో 88 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నంకల్లా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 88కి చేరింది. మరో 16 మంది గల్లంతయ్యారు. 100 మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పశువుల కొట్టాలు కూలిపోయాయి. #WATCH | Traffic affected after GT Karnal road in Delhi gets flooded after rise in water level of Yamuna River pic.twitter.com/hoaKTR2ZCr — ANI (@ANI) July 13, 2023 మరోవైపు పంజాబ్, హరియాణాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 18కు చేరుకుంది. హరియాణాలో చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పంజాబ్‌లో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) హిమాచల్‌లోని మండీలో పూర్తిగా ధ్వంసమైన వంతెన -
యమునా నది ఉగ్రరూపం.. ఢిల్లీ హై అలర్ట్..
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాలు ఉత్తరాదినా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం నెలకొంది. నదులు, వాగులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. యమునా నది మహోగ్రం. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం పెరిగింది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం 207.25 మీటర్లుగా ఉంది. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ప్రమాదకర స్థాయిని అధిగమించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం నీటి మట్టం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్గలు ఉండగా బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh due to incessant heavy rainfall in the region. pic.twitter.com/z7dDd5qVSB — ANI (@ANI) July 12, 2023 పదేళ్లలో ఇదే తొలిసారి యమున నది ఇంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. చివరగా 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులోనూ యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. మరోవైపు పాత రైల్వే వంతెనపై అన్నీ రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. Delhi on high alert. Yamuna flowing above the danger mark. (@AnmolBali9/ @AkshayDongare_ )#Delhi #YamunaRiver #ITVideo pic.twitter.com/CZduuY2avD — IndiaToday (@IndiaToday) July 11, 2023 హిమాచల్‌లో జల విలయం మరోవైపు ఉత్తరాదిన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంటి మందు పార్క్ చేసిన బైక్‌లు, కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువులలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాదిన మరణించిన వారి సంఖ్య సెంచరీ దాటింది. మూడు రోజుల్లో 31 మంది ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే గత మూడురోజుల్లో వరద ఉద్ధృతికి, కొండ చరియలు విరగిపడిన ఘటనలో 31 మంది మరణించగా.. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 1,300 రోడ్లు, 40 ప్రధాన బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,284 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదలకు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో కారణంగా చండీగఢ్-మనాలి, సిమ్లా-కల్కా జాతీయ రహదారులు మూసివేయడంతో సిమ్లా మనాలితో సహా అనేక ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్‌లో చిక్కుకొన్న 300 మంది ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేత్రల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద బాధితులతో కలిసి సీఎం భోజనం కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులులోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40 దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. కులులో చిక్కుకుపోయిన పర్యాటకులతో ముఖ్యమంత్రి సంభాషించి, వారితో కలిసి భోజనం చేశారు. 15 వరకు స్కూల్స్ బంద్ న్ని ప్రభుత్వ పాఠశాలలను జూలై 15 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాంపిటీటివ్ (ప్రిలిమినరీ) పరీక్షను ఆగస్టు 20కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో సంభవించిన విపత్తుల నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. -
మహోగ్ర యమున
న్యూఢిల్లీ: ఎగువ హరియాణా ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరదనీటితో ఢిల్లీలో యమునా నది మహోగ్రంగా మారింది. దీంతో నది ప్రవాహంలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సోమవారం రాత్రి నుంచే ఈ తరలింపు ప్రక్రియ మొదలుపెట్టారు. సంబంధిత వివరాలను ఢిల్లీ రాష్ట్ర జలశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పత్రికా సమావేశంలో వెల్లడించారు. ‘ ముంపు ప్రాంతాల స్థానికుల కోసం వేలాది టెంట్లను ఈస్ట్, నార్త్, నార్త్ఈస్ట్, సౌత్ఈస్ట్, సెంట్రల్, షాదారా జిల్లాల్లో ఏర్పాటుచేశాం. హరియాణాలోని హాత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి వరదనీటిని దిగువకు వదలడం వల్లే ఢిల్లీలో ఈ అప్రమత్త పరిస్థితి దాపురించింది. అయితే ఢిల్లీకి వరదలు మాత్రం రాబోవు. నదీ పరివాహక ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వరదనీరు చేరదు. శిబిరాల్లో ఇప్పటికే ఆహారం, తాగునీరు, ఇతర వసతులు సిద్ధంచేశాం’ అని ఆయన చెప్పారు. -
ఉత్తరాదిలో వరద-బురద.. మన పాపమే... ఈ ప్రకృతి శాపం!
కనీసం నలభై, యాభై ఏళ్ళుగా ఎన్నడూ చూడనంతటి వర్షం. ఎడతెరిపి లేకుండా నాలుగు రోజులుగా వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ – కశ్మీర్‌లలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. ఉత్తర భారతావనిలో అనేక చోట్ల ఎత్తైన ఆలయ శిఖరాలను సైతం ముంచేస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు. పేరుకుపోయిన బురదలో కూరుకుపోయిన ఆవాసాలు. ఆకస్మిక వరదలతో సిమ్లాలో కుప్పకూలిన భవనాలు. చమోలీలో కొట్టుకుపోయిన బ్రిడ్జీలు. విరిగిపడ్డ కొండచరియలు, కోతపడ్డ రహదారులు. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నదితో దేశ రాజధాని ఢిల్లీకి సైతం వరద ముప్పు. హిమాచల్‌లో 70 మందికి పైగా దుర్మరణం. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే రూ.4 వేల కోట్లకు పైగా నష్టం. వరదలో చిక్కుకున్న వందలాది గ్రామాలు, వేలాది జనం. ప్రకృతి కోపిస్తే, మనిషి పిపీలకమేనని ఇవన్నీ మరోసారి ఋజువు చేస్తున్నాయి. వాతావరణ మార్పుతో పాటు అభివృద్ధి పేరిట మనం చేస్తున్న పర్యావరణ విధ్వంసమూ ఈ బీభత్సానికి కారణమని వెక్కిరిస్తున్నాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికలో మన డొల్లతనాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. హిమాలయ సానువుల్లోని పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్కేంద్రాలే మునిగిపోయి, మట్టి పేరుకుపోవడంతో కరెంట్ లేదు. సాయం చేసే మనిషి లేడు. అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయిన వేల మంది పర్యటకులు ఎలాగోలా బయటపడదామంటే బస్సులు లేవు. విమాన సర్వీసులు లేవు. దోవ, ధైర్యం చెప్పే నాథుడు లేడు. కాసింత రోడ్డు దాటడానికి సైతం వేలకు వేలు దోపిడీ చేస్తున్న కొందరు దళారుల నడుమ ప్రభుత్వ యంత్రాంగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.కుల్లూ, మనాలీ లాంటి ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది ధాటికి ఆపి ఉంచిన వాహనాలు సైతం లక్కపిడతల్లా కొట్టుకుపోయాయి. ఇరుకైన జనావాసాల మధ్య నుంచి భారీ వృక్షాలు, కొయ్య దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పదేళ్ళ క్రితం 2013 జూన్ మధ్యలో ఉత్తరాఖండ్‌ను వణికించిన ‘హిమాలయన్ సునామీ’ లాంటి ప్రళయ భీకర దృశ్యాలనే తాజా సన్నివేశాలూ తలపిస్తున్నాయి. దృశ్యాలే కాదు... ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణాలూ దాదాపు అప్పటి లాంటివేనని శాస్త్రవేత్తలు అనడం గమనార్హం. అప్పుడైనా, ఇప్పుడైనా ఒక పక్కన ఋతుపవనాలు, మరోపక్కన మధ్యధరా సముద్రంలో తలెత్తి, ఉత్తర భారతావనికి ఆకస్మిక వర్షాలు తెచ్చే తుపాను – రెండూ ఏకకాలంలో కలగలసి ఈ ముప్పు తెచ్చాయి. జూన్ చివరి వరకు వర్షపాతం 10 శాతం కొరవ పడితే, వారం రోజుల్లో ఈ వాతావరణ ఉత్పాతంతో 2 శాతం అధిక వర్షపాతం స్థాయికి చేరుకున్నామన్న లెక్క నివ్వెరపరుస్తోంది. అంతకన్నా కలవరమేమిటంటే, భూతాపం రోజురోజుకూ పెరుగుతున్నవేళ ఇలా ఉమ్మడిగా ముప్పు మీదపడడం పోనుపోనూ ఎక్కువవుతుందట! అలాగే, పర్యావరణ రీత్యా అతి సున్నిత హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ప్రాజెక్టుల పేరిట సాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చుకోకుంటే వినాశనం తప్పదనడానికి తాజా ఘటన మరో హెచ్చరిక. తాజా ఘటనలు ఋతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావానికీ అద్దం పడుతున్నాయి. వర్షం పడదు. పడితే కాసేపే భారీ వర్షం, ఆ వెంటే వరద. ఆకస్మిక వాన, వరదల్ని ముందుగా అంచనా వేయడం కష్టమే. వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తూ, ఆకస్మిక వరదలొచ్చే ప్రదేశాలను గుర్తించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదభరిత వాతావరణ ఘటనల్ని పసిగట్టా లంటే రాడార్ల వినియోగమే శరణ్యమని వాతావరణ శాస్త్రవేత్తల మాట. దానివల్ల 3 గంటల ముందే ముప్పును పసిగట్టవచ్చు. అయితే, ఇకపై హిమాలయాలు, పడమటి కనుమల లాంటి పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు, భూపతనాలు పెరుగుతాయన్న హెచ్చరికను చెవికెక్కించుకోవాలి. నిరుడు జనవరి మొదటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య మొత్తం 273 రోజుల్లో ఏకంగా 242 రోజుల్లో ఏదో ఒక ప్రకృతి విలయం తప్పలేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కథనం. అంటే, తరచూ ఎదురయ్యే ముప్పు రీత్యా దీర్ఘకాలిక ప్రణాళికలే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. ఇక, దేశ రాజధాని ఢిల్లీ సైతం మొన్నటి దాకా ఎర్రటి ఎండతో, ఆపైన ముంచెత్తిన వానతో చిగురుటాకులా వణికిపోయింది. వీవీఐపీలు తిరిగే ఇండియా గేట్, జనక్‌పురి సహా మూడు ప్రధానమైన చోట్ల గత వారంలో రహదారులు కుంగిపోయాయి. కొన్నిచోట్ల 8 అడుగుల లోతు గుంటలుపడ్డాయి. ఇవన్నీ మన పట్టణ ప్లానింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అద్దం పడుతున్నాయి. ఇప్పటికే ముంబయ్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో పదే పదే ఇలాంటి పరిస్థితులే చూస్తున్నాం. చెట్ల నరికివేత, చెరువులు – నదీతీరాల్ని ఆక్రమించేలా విచ్చలవిడి నిర్మాణాలకు అనుమతి వీటికి కారణం. కాసింత వానకే మురుగునీటి పారుదల వ్యవస్థ కుప్పకూలుతోంది. ఇవన్నీ మన పాపాల ఫలితమే. ఇకనైనా, పాలకులు ఉష్ట్రపక్షి స్వభావాన్ని విడనాడాలి. విచ్చలవిడి అభివృద్ధితో వినాశనమే అని గ్రహించాలి. అంతకంతకూ పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున పెరిగే అవసరాలకు తగ్గట్టు సరైన రీతిలో పట్టణాభివృద్ధి ప్రణాళిక చేయాలి. చెరువులు, కాలువలను మొత్తం పట్టణ స్వరూపంలో భాగమని గుర్తించాలి. వాటిని సవ్యంగా కాపాడి, నిర్వహిస్తేనే అర్బన్ ఫ్లడ్స్‌ను నివారించవచ్చు. అలాగే, ఇప్పటికే భారీ అప్పుల్లో పీకల లోతు కూరుకుపోయిన హిమాచల్ లాంటి రాష్ట్రాలు ఈ జలవిలయ నష్టాల నుంచి బయటపడాలంటే కష్టమైనా కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. -
ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున
న్యూఢిల్లీ/సిమ్లా/జైపూర్: ఉత్తరభారతంలో మూడో రోజూ వర్ష బీభత్సం కొనసాగింది. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. వానల ప్రభావం హిమాచల్ ప్రదేశ్‌పైనే ఎక్కువగా పడింది. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు 18 మంది, పంజాబ్, హరియాణాల్లో 9 మంది, రాజస్తాన్‌లో ఏడుగురు, యూపీలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఉత్తరాదిన వరదల్లో ఇప్పటిదాకా 37 మంది చనిపోయారు. హిమాచల్‌లోని వివిధ ప్రాంతాల్లో 200 మంది పర్యాటకులు చిక్కుబడిపోయారు. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ప్రధాని మోదీ సోమవారం సీనియర్ మంత్రులు, అధికారులతో కలిసి ఉత్తరాదిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ హిమాచల్, ఉత్తరాఖండ్ సీఎంలతో మాట్లాడి, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం మరో నలుగురు చనిపోయారు. సిమ్లా–కాల్కా హైవేలో కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా–కాల్కా మార్గంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం వరకు రైళ్ల రాకపోకలను ఆపేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 120 రోడ్లపై రాకపోకలు బందయ్యాయని, 484 నీటి సరఫరా పథకాలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. జూలై 1–9 తేదీల మధ్య సాధారణ వర్షపాతం 160.6 మిల్లీమీటర్లకు మించి 69 శాతం ఎక్కువగా 271.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌పుర విద్యుత్ప్లాంట్లోకి చేరిన నీరు ఎగువనున్న హరియాణాలోని హత్నికుండ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నదిలో వరద పెరుగుతోంది. సోమవారం మధ్యాహా్ననికి ప్రమాద స్థాయి దాటి 205.33 మీటర్లకు చేరింది. మంగళవారం మధ్యాహా్ననికి 206.65 మీటర్లకు చేరి, క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నదిలో నీరు 206 మీటర్ల మార్కును దాటితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. యమునా నదికి అత్యంత సమీపంలో సుమారు 41 వేల మంది నివసిస్తున్నట్లు అంచనా. గత ఏడాది సెపె్టంబర్లో రెండుసార్లు యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహించింది. పంజాబ్, హరియాణాల్లో వానల తీవ్రత సోమవారమూ కొనసాగింది. పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లాలోని రాజ్‌పుర విద్యుత్ ప్లాంట్‌లోకి వరద చేరడంతో 700 మెగావాట్ల యూనిట్‌ను అధికారులు మూసివేశారు. సట్లెజ్ యయునా లింక్ కెనాల్ పొంగిపొర్లి రాజ్‌పురలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలోకి నీరు చేరింది. ఆస్పత్రుల్లోకి చేరిన వరద రాజస్తాన్‌లోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్ రైల్వేస్టేషన్లో పట్టాలపైకి, జేఎల్ఎన్ ఆస్పత్రి వార్డుల్లోకి వరద నీరు ప్రవేశించింది. టోంక్‌లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్, బదౌన్ జిల్లాల్లో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. షహరాన్‌పూర్‌లో 15 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాదిన మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. -
యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మార్కా గ్రామంలోనే మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్‌కు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్లే ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు.. పడవలోని మహిళా ప్రయాణికులు రక్షాబంధన్ కోసం వెళ్తున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. ‘మార్కా గ్రామం నుంచి ఫతేపూర్ వెళ్తుండగా యమునా నదిలో పడవ బోల్తా పడింది. బోటులో ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.’ అని బాందా పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: అన్నమయ్య జిల్లా: కోడలి తల నరికిన అత్త.. వివాహేతర సంబంధమే కారణం?