నదీ ప్రమాదాలు.. 21 మంది మృతి
నదీ ప్రమాదాలు.. 21 మంది మృతి
Published Thu, Sep 14 2017 9:45 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
సాక్షి, యూపీ: గురువారం ఉదయం ఉత్తర భారతదేశంలో సంభవించిన రెండు వేర్వేరు నదీ ప్రమాదాల్లో 21 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ బఘ్ పట్ వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మొత్తం 15 మృతి చెందగా, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయ చర్యలను ప్రారంభించారు. 12 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
ఇక బిహార్‌లోని మరంచి వద్ద గంగానదిలో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement