Baghpat
-
Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈరోజు (మంగళవారం) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆదినాథుని నిర్వాణ లడ్డూ పండుగ సందర్భంగా మానస్తంభ్ కాంప్లెక్స్‌లో నిర్మించిన చెక్క నిర్మాణం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటన గురించి బాగ్పత్ పోలీసు అధికారి అస్మితా లాల్ మాట్లాడుతూ ‘బరౌట్లో జైన సమాజ ఉత్సవం జరుగుతుండగా, ఒక చెక్క నిర్మాణం కూలిపోయింది. ఫలితంగా 40 మంది గాయపడ్డారు. చికిత్స తర్వాత 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు మృతి చెందారు’ అని తెలిపారు.ఈ ప్రమాదం మంగళవారం ఉదయం బరౌత్‌లోని గాంధీ రోడ్డులో జరిగింది. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే డిఎం అస్మితా లాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.#बागपत l भगवान आदिनाथ के निर्वाण लड्डू पर्व पर मान स्तम्भ परिसर में बना लकड़ी से बना पैड ढह गया। इसमें सात श्रद्धालुओं की मौत की खबर है। जबकि 75 से अधिक घायल हैं। मृतकों की संख्या में इजाफा हो सकता है। #baghpat #upnews pic.twitter.com/0BHLOjFYdE— Sudhir Chauhan (@sudhirstar) January 28, 2025బాగ్‌పత్‌లో జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే -
కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు!!
దేశంలో అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. కఠిన చట్టాలు.. శిక్షలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పసికందుల నుంచి పండు ముసలి దాకా.. హత్యాచారాలకు బలైపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే.. కోతుల గుంపు ఓ అఘాయిత్యాన్ని నిలువరించాయన్న వార్త ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఉత్తర ప్రదేశ్ భాగ్పట్లో ఆసక్తికరమైన ఘటన చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిని ఓ మానవ మృగం చిదిమేందుకు ప్రయత్నించగా.. హఠాత్తుగా హీరో మాదిరి ఎంట్రీ ఇచ్చిన కోతుల గుంపు అతనిపై దాడి చేసి ఆ ఘోరాన్ని ఆపాయి!!.బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. దౌలా గ్రామంలో సెప్టెంబర్ 20వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పాడుబడ్డ ఓ భవనంలోకి తీసుకెళ్లి బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించబోయాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతుల గుంపు.. నిందితుడిని బెదరగొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టాయి. అయితే ఈ క్రమంలో ఆ చిన్నారిని మాత్రం అవి గాయపర్చలేదు.అక్కడి నుంచి పరిగెత్తి ఇంటికి చేరుకున్న చిన్నారి.. జరిగిన ఘటనను.. కోతులు తననెలా రక్షించాయో తల్లిదండ్రులకు చెప్పింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. కోతుల గుంపు రాకపోయి ఉంటే తమ బిడ్డ పరిస్థితి ఏమైపోయేదో అని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. -
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్‌పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్‌పై సమాజ్‌వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్‌సింగ్‌ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్‌పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
సెటిల్ అవ్వగానే పెళ్లి చేస్తామన్నారు! ఇంతలోనే..
మంచిని మెదడుకి ఎక్కించుకోవడం మనిషికి కొంచెం కష్టమైన పనే. తెలిసీ తెలియని వయసులో కలిగిన ఆకర్షణను అర్థం చేసుకున్న ఆ పెద్దలు.. ముందు వాళ్లకు బాధ్యతలు గుర్తు చేద్దామనుకున్నారు. కొన్నాళ్లు ఆగాలంటూ ఇద్దరికీ సర్దిచెప్పబోయారు. అమ్మాయి అర్థం చేసుకుంది. కానీ, ఆ అబ్బాయే మూర్ఖంగా ఆలోచించాడు. ఫలితమే.. ఊహించని ఘోరం జరిగింది. లైఫ్‌లో సెటిల్ కాగానే పెళ్లి చేస్తామని హామీ ఇచ్చిన పెద్దల మాటల్ని ఆ యువకుడు నమ్మలేదు. ప్రేమించిన అమ్మాయిని.. వెంటనే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడిని ఆమె తట్టుకోలేకపోయింది. ప్రియుడిని తిట్టిపోసింది. ఇగో దెబ్బ తిన్న ఆ ప్రియుడు.. కత్తితో ప్రియురాలిని కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీపా సింగ్, రింకూ ఇద్దరికీ ఎనిమిదేళ్ల పరిచయం. స్కూల్‌డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. బుధవారం పెద్దలను తీసుకుని దీప(20) ఇంటికి వెళ్లి మాట్లాడాడు రింకూ. అయితే డిగ్రీనే చదువుతుండడంతో దీప వాళ్ల ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. ఇద్దర్ని ముందు చదువులు పూర్తి చేయమని, జాబ్ల్లో సెటిల్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేస్తామని మాటిచ్చారు. దీప అందుకు అంగీకరించింది. అయితే రింకూ మాత్రం అన్యమనస్కంగా తలూపాడు. గురువారం గురుద్వారా మార్కెట్‌కు వెళ్లిన దీపను రింకూ ఆటకాయించాడు. ఇప్పుడే పారిపోయి పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. కోపంతో ఆమె అతన్ని తిట్టిపోసింది. అది తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి కత్తి తెచ్చుకున్నాడు. ఆమె గొంతు కోసి, ఇష్టమొచ్చినట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డాడు.రక్తపు మడుగులో ఉన్న దీపను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన రింకూ.. నేరుగా బాగ్పట్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తొలుత ఇది ప్రేమోన్మాది పని అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇద్దరూ ఇష్టపడ్డారని, పెద్దలు పెళ్లికి అంగీకరించారని, అయితే పెళ్లి వాయిదా పేరుతో తనని దీపకు దూరం చేస్తారనే ఆలోచనతోనే నిందితుడు రింకూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ప్రైవేట్ కాలేజీలో అటెండర్‌గా పని చేస్తున్న దీప తండ్రి నైన్ సింగ్.. కూతురు జాబ్ చేసి కొన్నాళ్లు తమను పోషిస్తుందని, ఆపై ఇష్టపడ్డ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాట. కానీ, రింకూ ఆవేశంతో.. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి. -
కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి
బాగ్పట్: ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు ఊపిరాడక కన్నుమూసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సింగౌలి తాగ అనే గ్రామంలో అనిల్ త్యాగి అనే వ్యక్తికి చెందిన కారులో అడుకోవడానికి ఐదుగురు చిన్నారులు ఎక్కారు. అనంతరం కారు డోర్లు లాక్ అయిపోవడంతో వారంతా ఊపిరాడక మరణించారని పోలీసులు వెల్లడించారు. మరణించిన చిన్నారులను నియతి (8), అక్షయ్ (4), వందన (4), క్రిష్ణ (7)లుగా గుర్తించారు. వీరితో పాటే కారులో ప్రవేశించిన శివాన్(8) మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగళ్ సింగ్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే చిన్నారులు ఊపిరాడక మరణించినట్లు ఉందన్నారు. అయితే చుట్టుపక్కల వారు మాత్రం కారు ఓనర్ అనిల్ త్యాగి నిర్లక్ష్యం వల్లే పిల్లలు మరణించారని ఆరోపించారు. చదవండి: నకిలీ రెమిడెసివిర్ వ్యాక్సిన్లు.. హెచ్చరిస్తున్న పోలీసులు -
యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేత కాల్చివేత
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బాగ్పత్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత సంజయ్ ఖోఖర్‌ను ముగ్గురు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం ఉదయం.. తన పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై కాల్పులకు దిగారు. ఈ సంఘటన బాగ్పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. (చదవండి : వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పుల కలకలం) ఘటన జరిగిన సమయంలో సంజయ్ ఖోఖర్ ఒంటరిగా వెళుతున్నారని తెలుస్తోంది. సమాచారం అంతుకున్న వెంటనే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. విచారణను వేగవంతం చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. కాగా, ఇదే ప్రాంతంలో గత నెలలో రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకుడు దేశ్పాల్ ఖోఖర్‌ను కూడా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. -
‘ఉన్నావ్’ కంటే దారుణంగా చంపుతా!
లక్నో: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా అవసరమైతే బాధితుల ప్రాణాలు తీయడానికి కూడా మానవ మృగాలు వెనుకాడట్లేదు. గత గురువారం ఉన్నావ్ బాధితురాలు కోర్టు విచారణకు హాజరవటానికి వెళుతుండగా మార్గం మధ్యలో కాపుకాసిన నిందితులు ఆమెను సజీవదహనం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అత్యాచార బాధితురాలిని కూడా చంపేస్తామంటూ ఆమె ఇంటిపై లేఖ అతికించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని భగపట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏడాది క్రితం అత్యాచారానికి గురైంది. దీనిపై జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతడిని బెయిల్‌పై వదిలేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో నిందితుడు బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘నువ్వు కోర్టు విచారణకు హాజరయ్యావంటే ఉన్నావ్ కంటే దారుణంగా చంపుతా’ అని ఆమె ఇంటి ముందు వార్నింగ్ లెటర్ అతికించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలికి భద్రత ఏర్పాటు చేశారు. -
జవాన్లపై దాడి చేసిన హోటల్ సిబ్బంది
-
గ్యాంగ్‌స్టర్ హత్యకు 10 కోట్ల సుపారీ..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ జైల్లో దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ మున్నా భజరంగీ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ రాతి, భజరంగీ తనను హేళన చేయడం వల్లే అతన్ని హత్య చేశానని చెప్పడం కట్టుకథ అనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. భజరంగీని హత్య చేయడానికి తూర్పు యూపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు(మాజీ ఎంపీ) పది కోట్ల రూపాయల సుపారీ అందించినట్టు తెలిందన్నారు. భజరంగీ హత్యకు ముందురోజు జౌన్‌పూర్‌లోని రెండు బ్యాంక్‌ల్లో ఈ మొత్తం జమ అయినట్టు గుర్తించామన్నారు. అదే విధంగా ఈ రెండు ఖాతాలతో ఆ రాజకీయ నాయకుడికి పరోక్షంగా సంబంధం ఉందని పేర్కొన్నారు. భజరంగీ హత్యకు కొన్ని రోజుల ముందు అతని భార్య సీమా నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా అతని పేరు వెల్లడించారని సూచన ప్రాయంగా తెలిపారు. ఆ రాజకీయ నాయకుడు కూడా ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ అని, దీంతో భజరంగీకి అతనికి మధ్య పాత కక్షలు ఉన్నట్టు తమ విచారణలో తెలిందన్నారు. అంతేకాకుండా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయంలో ఆ నాయకుడు భజరంగీపై కోపం పెంచుకున్నాడని.. దీంతోనే అతన్ని హత్య చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తోందన్నారు. భజరంగీ హత్య అనంతరం తనకు సుఫారీ ఇచ్చిన వారితో సునీల్ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలు లభించాయని ఆయన వెల్లడించారు. విచారణ బృందం కూడా జైల్లోకి మొబైల్, తుపాకీ ఎలా వచ్చాయనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. కాగా భాగ్‌పత్ జైల్లో ఉన్న సునీల్‌ను ఫతేఘర్ సెంట్రల్ జైలుకు తరలించాలని శుక్రవారం యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
గ్యాంగ్‌స్టర్ హత్య కేసు.. షాకింగ్ నిజాలు
బాఘ్పట్ : ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్పట్ జైలులో సోమవారం జరిగిన గ్యాంగ్‌స్టర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. తనను లావుగా ఉన్నాడని అవహేళన చేశాడని మరో గ్యాంగ్‌స్టర్ మున్నా బజరంగీ అలియాస్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్(51)ని హత్య చేయాల్సి వచ్చిందని గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతి చెప్పినవన్నీ కట్టు కథలేనని వెల్లడైంది. ఈ కేసు విచారణలో నిజాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బజరంగీని హత్య చేశాక ఆధారాలు దొరక్కుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేసినట్లు నిందితుడు సునీల్ రాతి తెలిపాడు. హత్య చేసిన వెంటనే ముందుగా తుపాకీని జైలు ఆవరణలోని 8 అడుగుల లోతున్న డ్రైనేజీలో పడేశానని, ఆపై తన దుస్తులు ఉతికి.. స్నానం చేసి ఏం తెలియనట్లుగా నటించానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. తుపాకీ తూటాలకు బజరంగీ మరణించడంతో జైలును దాదాపు 10 గంటలు జల్లెడ పట్టిన పోలీసులు హత్యకు సునీల్ ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బజరంగీ ప్రాణాలు తీసింది ఆ తుపాకీ తూటాలేనని నిపుణులు తేల్చారు. వేలి ముద్రలు కనుక్కునే ఛాన్స్ ఉండకూడదని డ్రైనేజీలో తుపాకీ పడేశానని, అందులో భాగంగానే దుస్తులపై ఉన్న రక్తపు మరకలు గుర్తించవద్దని వాటిని వెంటనే ఉతికేసినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ముందుగానే తుపాకీ తెప్పించుకుని! మరో గ్యాంగ్‌స్టర్ బజరంగీని హత్య చేయడం అనేది తొలుత క్షణికావేశంలో జరిగిపోయిందని.. తనను లావుగా ఉన్నాడని అవమానించినందుకే హత్య చేశానని పోలీసులను నమ్మించాడు సునీల్ రాతి. కానీ సుదీర్ఘ విచారణలో మాత్రం.. ప్లాన్ ప్రకారమే ఆహార ప్యాకెట్లలో తుపాకీ, బుల్లెట్లతో పాటు కొన్ని పుస్తకాలను తెప్పించుకున్నట్లు అంగీకరించాడు. దీంతో అసలు జైల్లోకి కోర్టు అనుమతి లేకుండా బయటి నుంచి ఆహారం, తనకు ఇష్టమైన వస్తువులు ఎలా తెప్పించుకున్నాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది కొరతే పెద్ద సమస్య బాఘ్పట్ జైల్లో ఉన్న 816 మంది ఖైదీలకుగానూ 80 మంది పోలీసు సిబ్బంది ఉండాలి. కానీ 30 మంది మాత్రమే ఉండటంతో ఖైదీల వద్దకు ఏం వస్తువులు వెళ్తున్నాయి, వారితో ఆయుధాలు ఉన్నాయా అన్న తనిఖీలు జరగక పోవడం ఓ సమస్యగా మారిందిని ఓ ఐపీఎస్ తెలిపారు. హత్య జరిగిన సమయంలో మరో ముగ్గురు ఖైదీలు మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతికి సాయం చేయడంతో బజరంగీ హత్య జరిగిందని భావిస్తున్నాం. హత్య చేసిన తర్వాత నిందితుడు సునీల్ ఆధారాలు లేకుండా చేయాలని యత్నించాడని.. దీంతో కోర్టులో సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోయామని వివరించారు. అయితే నిందితుడి కదలికలు, కొందరు ఖైదీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సునీల్ నిందితుడని గుర్తించినట్లు చెప్పారు. -
జైల్లో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య
బాగ్పట్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ జైలులో ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో మృతి చెందింది అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ మున్నా బజరంగీ అలియాస్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్(51). 2017లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసుకు సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టేందుకు గాను బజరంగీని ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి బాగ్పట్ జైలుకు తీసుకువచ్చారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జైల్లో తన గదిలోనే ఉంటున్న మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీతో గోడవ జరిగిందని.. ఈ క్రమంలో బజరంగీపై సునీల్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బజరంగీ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. బజరంగీపై ఒకటి కంటే ఎక్కువ సార్లు తుపాకీతో సునీల్ కాల్పులు జరిపాడని.. అనంతరం తుపాకీని మురుగుకాలువలో విసిరేశాడని బాగ్పట్ ఎస్పీ జయప్రకాశ్ వెల్లడించారు. తుపాకీ జైలులోకి ఎలా వచ్చిందన్న దానిపైనా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. దర్యాప్తుకు ఆదేశించారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. గత నెలలో బజరంగీ భార్య సీమా సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. తన భర్తను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే ఈ క్రమంలోనే బజరంగీ హత్యకు గురి కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. -
మోదీ ఏది చేసినా ఓ లెక్కుంటుంది!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు అట్టహాసంగా నగరంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కేరింతలు కొడుతూ ఆయనపై పూరేకులు విరజిమ్మారు. ఢిల్లీ–మీరట్ మధ్య పూర్తయిన 82 కిలోమీటర్ల జాతీయ రహదారిని ప్రారంభించిన మోదీ అదే రహదారిపై 9 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతరం ఆయన హెలికాప్టర్ ఎక్కి ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్పట్ వెళ్లారు. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభోత్సవం చేయడానికే అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అట్టహాసంగా రిబ్బన్ కత్తిరించి ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. తాను లేకపోతే అసలు అభివృద్ధే లేదన్నట్టుగా అక్కడ ఆయన ఫోజిచ్చారు. వాస్తవంగా ఢిల్లీ నగరం గుండా కాకుండా ఢిల్లీ వెలుపలి నుంచి వెళ్లే విధంగా ఓ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాల్సిందిగా 2015లో సుప్రీం కోర్టు అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సంవత్సరం ఈ రోడ్డు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 11 వేల కోట్ల రూపాయలతో 17 నెలల కాలంలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నా విషయంలో సరైన సమయం కోసం మోదీ ఎదురు చూస్తున్నారు. గత ఏప్రిల్ నెలలోనే ఈ రోడ్డు నిర్మాణం విషయమై సుప్రీం కోర్టు జాతీయ రహదారుల అథారిటీ ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ప్రధాని మోదీకి సమయం చిక్కక పోవడం వల్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించలేక పోయామని అథారిటీ సమాధానం ఇచ్చింది. అధికారిక ప్రారంభోత్సవం జరిగినా, జరక్కపోయినా ఫర్వాలేదు, మే 31వ తేదీలోగా హైవేలోకి వాహనాలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు మే 10వ తేదీన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. అయినా మోదీ వీలున్నా వెంటనే స్పందించకుండా ఆదివారం నాడు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను అధికారికంగా ప్రారంభించారు. దీనికి ఓ లెక్కుంది.మోదీ ప్రారంభోత్సం చేసిన బాఘ్‌పట్‌కు పక్కనే ఉన్న కైరానా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం ఉప ఎన్నికలుండడమే ఆ లెక్క. మోదీ దేన్ని ప్రారంభోత్సవం చేసినా అందుకు పక్కా లెక్కలుంటాయనడంలో సందేహం లేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ‘రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఫెర్రీ’ని ప్రారంభించడం కూడా అందులో భాగమే. ఆయన దాన్ని ప్రారంభించి ఆరేళ్లు గడిచాక ఇటీవల వాహనాలను తీసుకెళ్లే ఫెర్రీ ఇప్పుడు వచ్చింది. దానికి రిబ్బన్ కత్తిరించేందుకు కూడా మోదీ వెళ్లవచ్చు. -
మహాభారతం నిజంగా జరిగిందా?
మహాభారతం.. భారతీయ ఇతిహాసాల్లో అత్యంత విలువైనది. ఇది కల్పన అని కొందరు.. కాదు వాస్తవం అని మరికొందరు.. దశాబ్దాలనుంచి వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. మీరట్ : ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతం దగ్గర పాండవులు నివసించి లక్షాగృహం ఉందని కొన్నేళ్లుగా వాదనలు ఉన్నాయి. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని పురాతత్వ శాస్త్రవేత్తలు, స్థానిక చరిత్రకారుల అభ్యర్థనల మేరకు.. ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (భారత పురావస్తు శాఖ పరిశోధనా సంస్థ) తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది. లక్షాగృహం ఉందని భావిస్తున్న ప్రాంతం.. ఉత్తర ప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లాలోని బర్నవా ప్రాంతంలో ఉంది. బర్నవా ప్రాంతంపై మాజీ పురాతత్వ శాఖ ఉన్నతాధికారి కేకే శర్మ మాట్లాడుతూ.. ఇక్కడ లక్షాగృహం ఉందనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మహాభారాతాన్ని మలుపు తిప్పడంలో లక్షాగృహానిది కీలక పాత్ర అని ఆయన చెప్పారు. బర్నావా ప్రాంతాన్నే మహాభారతంలో వరుణవిరాట్ అని పిలుస్తారని చెప్పారు. బర్నవా ప్రాంతంలో తవ్వకాలు జరపాలని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు అందాయని.. అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ, పురావస్తు తవ్వకాల శాఖ సంయుక్తంగా పరిశోధనలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ నెల మొదటి వారంలో తవ్వకాలను మొదలు పెడతామని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (తవ్వకాల విభాగం) డైరెక్టర్ జితేందర్ నాథ్ తెలిపారు. దీనిపై ఇప్పుడే ఎటువంటి ప్రకటన చేయడం సముచితం కాదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే ముంజాల్ తెలిపారు. చండయాన్ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న సమయంలో ఎరుపురాయితో కూడిన పూసలు, రాగి కిరీటం బయటపడిందని ఆయన చెప్పారు. ఈ కిరిటాన్ని స్థానిక పురావస్తు శాఖ అధికారి అమిత్ రాయ్ కనుగొన్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో బురదతో కూడిన పెద్ద నీటి మడుగు, దాని కింద భారీ సొరంగం ఉన్నాయని అమిత్ రాయ్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ సొరంగం ద్వారానే పాండవులు లక్షాగృహం నుంచి తప్పించుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పూర్తి పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎస్కే ముంజాల్ తెలిపారు. -
యూపీలో ఆగని పరంపర?
-
యూపీలో ఆగని నేరాలు
ముజఫర్‌నగర్/భాగపట్: ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళల మీద లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. అత్యాచార అవమానాన్ని తట్టుకోలేని యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోచోట.. ఒంటరిగా మహిళ కనిపిస్తే మృగాళ్లు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాగపట్‌లోని 15 ఏళ్ల యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతిపై నాలుగు నెలల కిందట ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిమీద పోలీస్ కేసు పెట్టగా.. నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు సోను, మను, రోహిత్, సాగర్, పప్పులు తరువాత తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి కేస్‌ను వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపే ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. కేసు ఉపసంహరించుకోకపోతే మళ్లీ అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో అవమాన భారంతో ఈ యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఇక, ముజఫర్‌నగర్‌కు సమీపంలోని పచేంద అనే గ్రామంలో నివసించే ఒక దళిత బాలికపై జాట్ తెగకు చెందిన నలుగురు యువకులు ఆదివారం ఉదయం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గ్రామంలోని దళిత మైనర్ బాలిక ఆదివారం ఉదయం ఇంటికి వస్తోంది. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెపట్ల తొలుత అసభ్యంగా మాట్లాడి అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. దళిత యువతిపై లైంగిక దాడి జరగడంతో గ్రామంలో దళితులు, జాట్ల ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం
-
నదీ ప్రమాదాలు.. 21 మంది మృతి
సాక్షి, యూపీ: గురువారం ఉదయం ఉత్తర భారతదేశంలో సంభవించిన రెండు వేర్వేరు నదీ ప్రమాదాల్లో 21 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ బఘ్ పట్ వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మొత్తం 15 మృతి చెందగా, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయ చర్యలను ప్రారంభించారు. 12 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇక బిహార్‌లోని మరంచి వద్ద గంగానదిలో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
లైంగిక దాడికి యత్నించి, చెవులు కోశారు..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భాగ్పట్కు చెందిన ఓ బాలికపై నలుగురు దుండగులు దాడి చేశారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా, అరుస్తూ, కేకలు వేస్తూ తనను కాపాడుకునేందుకు ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమె పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఆ బాలిక రెండు చెవులు కోయడమే కాకుండా, అడ్డువచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
బీజేపీ పరివర్తన్ యాత్రలో అశ్లీల నృత్యాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్‌లో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ యాత్ర వివాదాస్పదం అయ్యింది. బహిరంగ సభకు విచ్చేసిన జనాన్నిఅలరించేందుకు స్థానిక నేతలు మంగళవారం బార్ డాన్సర్‌తో అశ్లీల నృత్యాలు చేయించారు. భాగ్‌పత్‌లో బీజేపీ పరివర్తన్ యాత్ర ఏర్పాటు చేయగా.. కేంద్రమంత్రి సంజీవ్ బలయాన్, ఎంపీ సత్యపాల్ సింగ్ దీనికి హాజారు కావాల్సి ఉంది. అయితే సీనియర్ నేతలు సభాస్థలికి చేరుకోవడం కాస్త ఆలస్యం అయ్యింది. ఈలోపు వేదిక వద్దకు చేరుకున్న జనాన్ని అలరించేందుకు ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. బీజేపీ నిర్వాకంపై మిగిలిన రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.