
లైంగిక దాడికి యత్నించి, చెవులు కోశారు..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భాగ్‌పట్‌కు చెందిన ఓ బాలికపై నలుగురు దుండగులు దాడి చేశారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా, అరుస్తూ, కేకలు వేస్తూ తనను కాపాడుకునేందుకు ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమె పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఆ బాలిక రెండు చెవులు కోయడమే కాకుండా, అడ్డువచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.