లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్‌పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది.
ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్‌పై సమాజ్‌వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్‌సింగ్‌ను పోటీకి నిలబెట్టింది.
పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్‌పట్‌లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్‌పాల్ శర్మను బరిలోకి దింపింది.
ప్రత్యర్థుల విమర్శలు
సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment