samajvadi party
-
దురదృష్టం అంటే ఈమెదే.. కూటమికి కూడా!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఖజురహో అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్‌కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో 'సిగ్నేచర్ మిస్సింగ్' అభ్యర్థి పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది. రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఒకసారి గెలిచిన మీరా యాదవ్.. తర్వాత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఖజురహో లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తొలుత మనోజ్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత ఈ సీటును మీరా యాదవ్‌కు ఇచ్చింది. దీంతో ఆఖరి రోజున గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈమె నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారని మీరా యాదవ్ భర్త, ఉత్తర ప్రదేశ్‌నుంచి రెండుసార్లు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అయిన దీప్ నారాయణ్ యాదవ్ చెప్పారు. తర్వాత రోజు సవరించిన ఓటరు జాబితాను సమర్పించకపోవడంతో పాటు ఒక చోట అభ్యర్థి సంతకం లేదని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. కాగా ఈ ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ప్రస్తుత ఎంపీ వీడీ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించడం "ప్రజాస్వామ్య హత్య"గా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. -
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్‌పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్‌పై సమాజ్‌వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్‌సింగ్‌ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్‌పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది
లక్నో: 2014లో అధికారంలోకి వచ్చిన నాయకుడు 2024లో పదవి నుంచి దిగిపోతాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జర్మనీ నియంత హిట్లర్ కేవలం 10 సంత్సరాలే అధికారంలో ఉన్నాడని గుర్తుచేశారు. మన దేశంలోని నాయకుడు పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడని, ఇక ఆయన ఇంటికి వెళ్లే సమయం వచ్చేసిందని తేల్చిచెప్పారు. ఆ నాయకుడికి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఘన స్వాగతం పలికారని, రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు అంతే ఘనంగా వీడ్కోలు చెబుతారని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను, మన ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు. -
‘కరసేవకులపై కాల్పులు సబబే’.. ఎస్పీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నేత, మాజీ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన యూపీలోని కాస్గంజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు అరాచకవాదులను కాల్చిచంపాలనే ఉద్దేశంలో అప్పటి ప్రభుత్వం కరసేవకులపై కాల్పులకు ఆదేశాలు జారీ చేసిందని’ వ్యాఖ్యానించారు. అయోధ్యలో మసీదు కూల్చివేత సంఘటన జరిగినప్పుడు న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థలను పట్టించుకోకుండా అరాచకవాదులు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారని స్వామి ప్రసాద్ మౌర్య ఆరోపించారు . అప్పటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించేందుకు, శాంతిని కాపాడేందుకు కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Kasganj (UP): On Ram temple, Samajwadi Party leader Swami Prasad Maurya says, "...To safeguard the constitution and the law and to protect peace, the then government gave shoot at sight orders. The government merely did its duty..." pic.twitter.com/tpYf8wdMnJ — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2024 -
అఖిలేష్ యాదవ్ శ్రీకృష్ణ జపం ఫలిస్తుందా?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేచింది. అయితే మిగతా నాలుగు రాష్ట్రాల విషయం పక్కనబెట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం విషయంలో దేశంలో ప్రత్యేక చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి, ప్రతిష్ఠకు ఒక అగ్ని పరీక్ష లాంటివనీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించడం సులభవుతుందనీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులూ, ఆ పార్టీలకు అనుకూలంగా విశ్లేషణ చేసే మోదీ వ్యతిరేకులూ తల పోస్తు న్నారు. అఖిలేష్ యాదవ్ అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన ‘శ్రీకృష్ణ జపం’ (శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి కలలోకి వచ్చి ‘నీవు రామరాజ్య స్థాపన చేస్తావు, ఈ ఎన్నికల్లో విజయం నీదే’ అంటున్నాడని అఖిలేష్ యాదవ్ చెప్పుకోవడం) ఈ ఎన్నికల్లో బాగా పని చేస్తుం దనీ, హిందువుల ఓట్లు చీలిపోతాయనీ, యాదవ కులపు ఓట్లు, ముస్లింల ఓట్లు గుండుగుత్తగా సమాజ్‌వాది పార్టీకి పోలవుతాయనీ మోదీ వ్యతిరేకులు ముందుస్తు అంచనాలు వేస్తున్నారు. (చదవండి: అయోధ్య రాముడా? మధుర కృష్ణుడా?) లౌకిక భావాలకు ప్రాతినిధ్యం వహించే సమాజ్‌వాది పార్టీ అనాలోచితంగా, అసందర్భంగా మథుర శ్రీకృష్ణుణ్ణి నెత్తికి ఎందుకు ఎత్తుకున్నట్లు? ముస్లిం పరిపాలనలో మథురలో శ్రీకృష్ణ ఆలయానికి అపచారం జరిగిందనీ, ఇది హిందూ సమాజానికి అవమానమనీ, ఈ అవమానాన్ని తుడిచి పెడతామనీ హిందూ సంస్థల ప్రతినిధులు, వారి మద్దతుతో రాజకీయాలు నడిపే భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తుందనే విషయం హిందువులకు బాగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న ఈ కృష్ణ నినాదం ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? (చదవండి: అధికారానికి ‘నిచ్చెన’ప్రదేశ్!) ఈ దేశ చరిత్రలో హిందూ సంస్కృతికి, హిందువులకు జరిగిన కష్టనష్టాలపై అఖిలేష్ యాదవ్‌గానీ, ఆయన తండ్రి ములాయంగానీ ఎప్పుడూ మాట్లాడలేదు. కాగా వారిద్దరూ హిందూ వ్యతిరేకులనీ, జిహాదీ ఉగ్రవాదుల మద్దతుదారులను, సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించారనే వ్యూహాత్మక ప్రచారాన్ని హిందుత్వ శక్తులు... హిందుత్వ అభిమాన ఓటర్ల మెదళ్ళలోకి బాగా ఎక్కించారనే విషయం సత్యదూరమైనదేమీ కాదు. గత నెలలో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ ప్రతినిధుల సమావేశంలో హిందుత్వ ప్రతినిధుల మాటలు... జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపకుండా పోతాయా? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!) ఇక ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ... మోదీ, యోగీ తర్వాత హిందువులను రక్షించేవారెవరని అడిగిన మాటల వల్ల... ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హిందుత్వ శక్తులు ఏకమవ్వడానికి దోహదం చేస్తాయి. మోదీ, యోగీ వ్యతిరేకుల దుష్ప్రచారాలు హిందు త్వాన్ని బలహీన పరుస్తాయా లేక బలపరుస్తాయా, లేదా సమాజ్‌వాది పార్టీ ఎన్నికల విజయాలను దెబ్బ తీస్తాయా అనే విషయాలను విశ్లేషకులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. - ఉల్లి బాల రంగయ్య రాజకీయ సామాజిక విశ్లేషకులు -
ఓబీసీ రిజర్వేషన్లపై మోదీకి లేఖ
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ క్రిమీలేయర్‌ను రూ.8లక్షల నుంచి రూ.15లక్షల ఆదాయ పరిమితికి పెంచాలని ఎంపీ విశంభర్ పేర్కొన్నారు. గత నెల సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఒబీసీ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాగా త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓబీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
యూపీలో యోగికి షాక్
లక్నో: యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా అయ్యేంతవరకు ఆయనకు కుడిభుజంగా ఉన్న హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ) మాజీ అధ్యక్షుడు సునీల్ సింగ్ శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. సునీల్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 2017లో హిందూ యువ వాహిని నుంచి బహిష్కరించడంతో అప్పట్నుంచి వేరే సంస్థను నెలకొల్పి దానికి జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. యోగి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఇక ఆ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష నేతలపై యోగి సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకొచ్చాక హిందూ ముస్లిం వర్గ విభేదాలను ప్రోత్సహిస్తోందన్నారు. -
పాకిస్తాన్‌లోని హిందువులను కాపాడడానికే..
లక్నో: మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ మండిపడ్డారు. ఎన్పీఆర్(జాతీయ జనాభా రిజిస్టర్), ఎన్ఆర్సీ(జాతీయ పౌర పట్టిక)లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న అఖిలేష్‌కు పాకిస్తాన్‌లోని హిందువులపై జరుగుతున్న అరాచకాల గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఓ నెల రోజులు నివసించాలని అన్నారు. బుధవారం దేవ్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్పీఆర్ వల్ల ఎలాంటి నష్టం లేదని, వ్యక్తులకు సంబంధించిన స్ధానికతను తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. వ్యక్తి స్థానికతను నిర్ధారించేందుకు ఆదార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పొరుగునే ఉన్న ముగ్గురు స్థానికుల నిర్ధారణ మాత్రమే అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా కుటుంబ సభ్యులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అశిలేష్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కు సంబంధించి ప్రజలకు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఏఏ పేద ప్రజలకు ఉపయోగపడే చట్టమని..ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలని ప్రియాంకా గాంధీకి సూచించారు. పాకిస్తాన్లో అరాచకాలకు గురవుతున్న హిందువులను ఆదుకోవడానికి సీఏఏ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ చట్టాల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృషి అభినందనీయమని కొనియాడారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ..సీఏఏను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, సమాజ్‌వాద్ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్‌వాద్ పార్టీలు(బీఎస్పీ)లకు ముస్లీం, హిందువులు ఓటేయరని విమర్శించారు. సీఏఏ గురించి అవగాహన పెంచుకోవాలని జేఎన్‌యు విద్యార్థులకు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు సూచించారు. కాగా, పేద ప్రజలు, మైనారిటీలకు వ్యతిరేకంగానే ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలు చేశారంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గత కొద్దిరోజులుగా బీజేపీని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. -
బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో మంగళవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎస్పీకి దూరంగా ఉంటున్న నీరజ్ సోమవారమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే నీరజ్‌ను ఉత్తర ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. దీనిపై ముందే ఒప్పందం కుదుర్చుకోని పార్టీలో చేరినట్లు సమాచారం. 2007లో చంద్రశేఖర్ మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన స్థానంలో తొలిసారి లోక్‌సభ ఎన్నికయ్యారు. -
కాంగ్రెస్ కొత్త ఖాతా తెరుస్తుందా?
లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ సహా 14 స్థానాలకు మే 6న పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గెలిచిన అమేఠీ, రాయ్‌బరేలీ మినహా మిగిలిన పన్నెండు స్థానాలను కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన అవధ్ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాలున్న ఈ దశ ఎన్నికల్లో ఈసారి కూడా అత్యధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి అత్యవసరం. దళితులు, బీసీలు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న బహుజన్ సమాజ్‌వాదీపార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూటమికి కూడా ఈ ప్రాంతంలో గట్టి పునాదులున్నాయి. అగ్రనేతలు మళ్లీ పోటీచేస్తున్న రెండు సీట్లతోపాటు మరో మూడు స్థానాలైనా సంపాదించాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని లక్నో నియోజకవర్గం నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఫతేపూర్ నుంచి కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పోటీ చేస్తున్నారు. మందిర్–మసీదు వివాదానికి కేంద్ర బిందువు అయిన అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానానికి కూడా గట్టి పోటీ ఉంది. బీజేపీ తర్వాత బలమైన కూటమి మహాగuŠ‡బంధన్ 2014 ఎన్నికల్లో ఈ 14 యూపీ సీట్లలో పది చోట్ల ఎస్పీ, బీఎస్పీలు రెండో స్థానంలో నిలిచాయి. అనేక నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే అవి బీజేపీకి పడిన ఓట్లను మించిపోతాయి. ధౌరహ్రా, బారాబంకీ, ఫైజాబాద్, సీతాపూర్ స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 14 సీట్లలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో తల్లీ కొడుకుల స్థానాలే కాంగ్రెస్ పరువు నిలబెట్టాయి. లక్నోలో రాజ్‌నాథ్‌పై పోటీచేస్తున్నవారిలో శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా(ఎస్పీ) ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూ మతాచార్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ పోటీచేస్తున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై బహారాయిచ్(ఎస్సీ రిజర్వ్డ్) స్థానం నుంచి గెలిచిన సావిత్రీబాయి ఫూలే ఈసారి కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం చేయడం లేదంటూ సావిత్రీబాయి బీజేపీ నాయకత్వాన్ని విమర్శించాక పార్టీకి దూరమయ్యారు. లక్నోలో రాజ్‌నాథ్‌కు పోటీయే లేదా? తొలి ప్రధాని నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్, కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్, బీజేపీ తొలి ప్రధాని ఏబీ వాజ్‌పేయి అనేకసార్లు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లక్నో. యూపీ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరఫున హిందూ పీఠాధిపతి(సంభల్ కల్కి మఠం) ప్రమోద్ కృష్ణం, ఎస్పీ–బీఎస్పీ కూటమి తరఫున పూనమ్ సిన్హా పోటీచేస్తున్నారు. అయితే, ఎస్పీ, కాంగ్రెస్ చివరి నిమిషంలో బయటి నుంచి అభ్యర్థులను ‘దిగుమతి’ చేసుకోవడాన్ని బట్టి చూస్తే రాజ్‌నాథ్‌కు సునాయాసంగా గెలిచే అవకాశం ఇస్తున్నట్టు భావించాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఠాకూర్ వర్గానికి చెందిన రాజ్‌నాథ్‌కు అన్ని వర్గాల మద్దతు ఉంది. నియోజకవర్గంలోని 19.6 లక్షల మంది ఓటర్లలో 4 లక్షల మంది కాయస్థులు, లక్ష మంది సింధీలు, నాలుగు లక్షల మంది బ్రాహ్మణులు, మూడు లక్షల మంది ఠాకూర్లు, నాలుగు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. పూనమ్ సింధీ కావడం, ఆమె భర్త శత్రుఘ్న కాయస్థ కుటుంబంలో పుట్టిన కారణంగా ఈ వర్గాల ఓట్లన్నీ తమ అభ్యర్థికి పడతాయనే ఆశతో ఎస్పీ నేతలు ఉన్నారు. అమేఠీలో రాహుల్ అమేఠీ అవతరించినప్పటి నుంచీ జరిగిన 15 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్ గెలిచింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకులు, కోడలు, మనవడు విజయం సాధించిన కాంగ్రెస్ కంచుకోట ఇది. ఇందిర చిన్న కొడుకు సంజయ్‌గాంధీ 1977లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. 1980 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1998లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి అమేఠీ మాజీ సంస్థానాధీశుని కొడుకు సంజయ్‌సింగ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సతీష్‌శర్మను ఓడించారు. 2004 నుంచీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడుసార్లు అమేఠీ నుంచి ఎన్నికయ్యారు. 2014లో రాహుల్ చేతిలో ఓడిన బీజేపీ ప్రత్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీకి దిగారు. పాత ప్రత్యర్థుల మధ్యే 2019లో ఎన్నికల పోరు జరుగుతోంది. రాహుల్‌పై స్మృతి తొలిసారి పోటీచేసి ఓడినా ఆయన మెజారిటీని 3 లక్షల 70 వేల నుంచి లక్షా ఏడు వేలకు తగ్గించగలిగారు. రాజ్యసభ సభ్యురాలైన స్మృతి మళ్లీ అమేఠీ బరిలోకి దిగడంతో రాహుల్ ఎందుకైనా మంచిదని కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేస్తున్నారు. అమేఠీలో ఓటమి భయంతోనే రాహుల్ కాంగ్రెస్‌కు సురక్షితమైన రెండో సీటు నుంచి పోటీకి దిగారని ఆమె వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ కారణంగానే సంజయ్ ఓడిపోయారుగాని గాంధీ–నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ నేడు అమేఠీలో ఓడిపోయే అవకాశం లేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున బీజేపీ అగ్రనేతలందరూ ప్రచారానికి వస్తున్నారు. బిహార్‌కు చెందిన ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాస్వాన్ సైతం అమేఠీలో స్మృతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ చెల్లెలు ప్రియాంకా గాంధీ కూడా ఇక్కడ విస్తృతంగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటూ, గెలుపుపై తన అన్నకు అనుమానమే లేదనీ, వయనాడ్ ప్రజల కోరిక మేరకే అక్కడ నుంచి పోటీచేస్తున్నారని ధీమాగా చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా నాలుగోసారి పోటీ మామ ఫిరోజ్ గాంధీ, అత్త ఇందిర, ఇందిర మేనత్త షీలాకౌల్ వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆరోసారి పోటీచేస్తున్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్‌సింగ్ పోటీకి దిగారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. అమేథీతోపాటు రాయ్‌బరేలీలో కూడా ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థిని నిలబెట్టలేదు. సోనియా తొలిసారి 1999లో అమేఠీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004 నుంచి ఆమె రాయ్‌బరేలీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ సాంకేతిక సమస్య కారణంగా సోనియా 2006లో రాజీనామా చేశాక మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేసి గెలిచారు. కిందటి ఎన్నికల్లో ఆమె తన బీజేపీ ప్రత్యర్థి అజయ్ అగర్వాల్‌పై మూడున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004లో దాదాపు రెండున్నర లక్షలు, 2006 ఉప ఎన్నికలో 4 లక్షల 17 వేలు, 2009లో 3 లక్షల 72 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సోనియా తన ప్రత్యర్థులపై విజ యం సాధించారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి దినేష్ప్రతాప్ సింగ్ 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా తరఫున సహాయకునిగా పనిచేసి 2016లో ఎమ్మెల్సీ అయ్యారు. కిందటేడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోనియా గెలుపుపై అనుమానాలు లేకున్నా ఈసారి గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కూతు రు ప్రియాంక కూడా తల్లి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ధౌరహ్రాలో జితిన్ ప్రసాద మరో ప్రయత్నం! కాంగ్రెస్ దివంగత నేత జితేంద్ర ప్రసాద కొడుకు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్న స్థానం ధౌరహ్రా. జితిన్ తండ్రి జితేంద్ర గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా, మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియాగాంధీపై పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన జితిన్ తొలిసారి 2004లో షాజహాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఎన్నికయ్యారు. 2008లో అవతరించిన ధౌరహ్రా నుంచి 2009లో గెలిచి 2011 నుంచి 2014 వరకూ మన్మోహన్సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రెండోసారి ఇదే సీటు నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ తన సమీప బీఎస్పీ ప్రత్యర్థి దావూద్ అహ్మద్‌ను లక్షా పాతిక వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి కొన్ని వందల ఓట్ల తేడాతో మూడో స్థానంలో నిలిచారు. బీసీ కులమైన కుర్మీలు ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున అర్షద్ సిద్దిఖీ(బీఎస్పీ) పోటీచేస్తున్నారు. ఆయన తండ్రి ఇలియాస్ సిద్దిఖీ గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఫైజాబాద్‌లో త్రిముఖ పోటీ ప్రాచీన నగరం అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో మరోసారి ప్రతిష్టాత్మక పోటీ జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు లల్లూ సింగ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ నిర్మల్ ఖత్రీ, ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి ఆనంద్‌సేన్ యాదవ్(ఎస్పీ) పోటీలో ఉన్నారు. 2014లో లల్లూ సింగ్ తన సమీప ప్రత్యర్థి మిత్రసేన్ యాదవ్‌ను 2 రెండు లక్షల 82 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి ఆనంద్‌సేన్ తండ్రి మిత్రసేన్ మొదటిసారి 1989లో సీపీఐ టికెట్‌పైన, 1998లో ఎస్పీ తరఫున, 2004లో బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. తండ్రీకొడుకులిద్దరికీ నేరమయ రాజకీయాలతో సంబంధాలున్నాయి. తండ్రి మాదిరిగానే ఆనంద్‌సేన్ కూడా బీఎస్పీలో ఉన్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక మాయావతి కేబినెట్లో మంత్రిగా కొన్ని రోజులు పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ ఖత్రీ కూడా గతంలో రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఫైజాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయోధ్య ప్రాంతంలో నిరుద్యోగం, పరిశ్రమల స్థాపన జరగకపోవడం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యాయి. ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆయోధ్య ఎన్నిక ప్రచారానికి వచ్చినా రామజన్మభూమి వివాదంపై మాట్లాడలేదు. మహా కూటమి నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ కూడా ఆయోధ్యకు 70 కిలో మీటర్ల దూరంలో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మోదీపై నియోజకవర్గ ప్రజలకు అభిమానం తగ్గలేదనీ, ఎంపీగా లల్లూ సింగ్ పనితీరును పట్టించుకోకుండా ప్రధానిపై మోజుతోనే బీజేపీకి ఓట్లేస్తారని ఫైజాబాద్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. బహరాయిచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత సావిత్రీబాయి ఫూలే పోటీచేయడంతో బహరాయిచ్ నియోజకవర్గం ఎన్నికపై ఆసక్తి పెరిగింది. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్‌చేసిన ఈ స్థానం నుంచి 2014లో సాధ్వీ సావిత్రీబాయి ఫూలే బీజేపీ టికెట్‌పై పోటీచేసి తన సమీప ఎస్పీ ప్రత్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మికీపై 95 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీ బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హనుమంతుడి కులం గురించి మాట్లాడి సమాజాన్ని చీల్చివేస్తున్నారంటూ సావిత్రీబాయి కిందటి డిసెంబర్లో బీజేపీ నుంచి వైదొలిగారు. ఇటీవల ఆమె కాంగ్రెస్‌లో చేరగానే బహరాయిచ్ టికెట్ ఇచ్చారు. ఆమె స్థానంలో బీజేపీ టికెట్ అక్షర్‌వర్ లాల్‌కు లభించింది. మొదట బీఎస్పీలో ఉన్న సావిత్రీబాయి బౌద్ధమతాన్ని అనుసరిస్తూ ప్రజా సేవ ద్వారా గుర్తింపు పొందారు. తర్వాత బీజేపీలో చేరి 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటికే పేరు సంపాదించిన ఆమెకు కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఎలాంటి ప్రయత్నం లేకుండానే దక్కింది. ఎస్సీ అభ్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మీకీ రెండోసారి పోటీచేస్తున్నారు. ఎస్పీ కులమైన వాల్మికీ వర్గానికి చెందిన ఆయన పేరులోని మొదటి రెండు పదాల కారణంగా ఆయన హిందూ దళితుడు కాదనీ, ముస్లిం అని కొందరు కోర్టు కెక్కగా నడిచిన కేసులో ఆయన తాను హిందువునని నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ కొత్త అభ్యర్థి తరఫున ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థికి మొగ్గు ఉన్నట్టు కనిపిస్తోంది. పూనమ్ సిన్హా, దినేష్ ప్రతాప్‌సింగ్, అర్షద్ సిద్దిఖీ -
మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ
వారణాసి: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. భద్రతాబలగాలకు పెట్టే ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేస్తూ ఆన్లైన్లో వీడియో పెట్టడంతో 2017లో తేజ్ బహదూర్‌ను విధుల నుంచి తొలగించారు. ఆయన సమర్పించిన రెండు జతల నామినేషన్ పత్రాల్లో తేడాలున్నట్లు గుర్తించిన వారణాసి రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకూడదనే బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. -
ప్రధాని X మాజీ కానిస్టేబుల్
లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని మార్చింది. భద్రతాదళాలకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో ఫిర్యాదు చేసి విధుల నుంచి తొలగిన బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ నేత ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) లతో కూడిన ఎస్పీ కూటమి వారణాసి నుంచి మొదట తన అభ్యర్థిగా షాలిని యాదవ్‌ను ప్రకటించింది. ‘అవినీతిపై ప్రశ్నించినందుకు నన్ను విధుల నుంచి తొలగించారు. భద్రతా దళాల్లో ఉన్న అవినీతిని తొలగించడమే నా ప్రధాన ధ్యేయం’అని తేజ్ బహదూర్ విలేకరులకు వెల్లడించారు. మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అయిన తేజ్ బహదూర్ యాదవ్ జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు అందించే ఆహారంలో నాణ్యత లేదని ఫిర్యాదుచేస్తూ 2017లో సోషల్ మీడియాలో ఓ వీడియో అప్లోడ్ చేశారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. 7వ దశ ఎన్నికల్లో భాగంగా వారణాసిలో మే 19న ఎన్నికలు జరుగనున్నాయి. -
24 ఏళ్లకు ఒకే వేదికపై..
మైన్‌పురి / న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత 24 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఒకే వేదికను పంచుకున్నారు. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. యూపీలోని మైన్‌పురిలో క్రిస్టియన్ కాలేజీ గ్రౌండ్ ఇందుకు వేదికైంది. ఎస్పీ కంచుకోట అయిన మైన్‌పురిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ములాయం, బీఎస్పీ చీఫ్ మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, మద్దతుదారులను ఉద్దేశించి ములాయం మాట్లాడుతూ.. ‘చాన్నాళ్లకు మేమిద్దరం ఒకే వేదికపై మాట్లాడుతున్నాం. మాయావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు మద్దతివ్వాలని ఆమెను కోరుతున్నా’ అని అన్నారు. ప్రధాని మోదీ నకిలీ బీసీ: మాయావతి ములాయం అనంతరం మాయావతి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘గెస్ట్ హౌస్ ఘటన తర్వాత కూడా నేను ములాయం జీ తరఫున ప్రచారం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కొన్నికొన్ని సార్లు ప్రజా, దేశ, పార్టీ ప్రయోజనాల రీత్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ములాయం జీ సమాజంలోని అన్నివర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకున్న మోదీ, తన అగ్రకులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. కానీ ప్రధాని మోదీలా ములాయం నకిలీ వ్యక్తి, అబద్ధాలకోరు కాదు. ఆయన వెనుకబడ్డ కులంలోనే జన్మించారు. ములాయం నిజమైన నేత’ అని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా యూపీలోని 80 లోక్‌సభ సీట్లకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో కలిసి పోటీచేస్తున్నాయి. రాయ్‌బరేలీ(సోనియాగాంధీ), అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం ఈ ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీ పొత్తు: బీజేపీ ములాయం–మాయావతి కలిసి మైన్‌పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై బీజేపీ మండిపడింది. ఈ విషయమై బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, తుపాను లాంటి మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. యూపీలో ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీలు చేతులు కలిపాయని దుయ్యబట్టారు. ఇందుకోసం తన జీవితంలో జరిగిన అతిపెద్ద అవమానాన్ని(గెస్ట్‌హౌస్ ఘటన) మాయావతి దిగమింగారన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావగా తయారైందని చతుర్వేదినుద్దేశించి అన్నారు. పాతికేళ్లనాటి పంచాయితీ! ములాయం, మాయావతి బద్ధ విరోధులుగా మారడానికి కారణమైన గెస్ట్‌హౌస్ ఘటన 1995 జూన్‌లో జరిగింది. ములాయం నేతృత్వంలోని ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం యూపీలో కొనసాగుతోంది. కొత్త సర్కార్ కొలువుదీని అప్పటికి ఏడాదిన్నర. అంతలోనే బీఎస్పీ అధినేత కాన్షీరాం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తారని ములాయంకు జూన్ 1న సమాచారం అందింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బీఎస్పీని చీల్చాలనీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయాలని కొంతమంది ఎస్పీ నేతలు భావించారు. అదేసమయంలో అప్పటి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మాయావతి రాష్ట్రప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో జూన్ 2న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఎస్పీ ఎమ్మెల్యేలు, జిల్లాల నేతలు అనుచరులతో కలిసి ఆయుధాలతో గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను చితక్కొట్టారు. గదిలో దాక్కోవడంతో మామావతి తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఎస్పీ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకోవడం, బీజేపీ, జనతాదళ్ పార్టీల బయటినుంచి మద్దతు ఇవ్వడంతో మాయావతి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. -
మాయా వ్యూహం.. మహా తంత్రం
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి రాజకీయ వర్గాలను సందిగ్ధంలో పడేశారు. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ అధినేత ఎన్నికలకు దూరంగా ఉండటం వ్యూహాత్మకమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థి రేసులో ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేయరాదని మాయావతి నిర్ణయించుకోవడం వెనక రాష్ట్రంలో పార్టీని పూర్వ వైభవం తేవాలన్న పట్టుదల ఉందని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక మాయావతి పోటీ చేస్తే బీజేపీ తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఆమెను నియోజకవర్గానికే పరిమితం చేస్తుందని, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉండదని, మిత్రపక్షాలైన సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) తరఫున కూడా ప్రచారం చేయడానికి వీలుండదని అది కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మాయావతి పోటీలో లేకపోవడం అంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకపోవడమేనని బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలను చేసినా ఆమె పోటీకి దూరంగా ఉండటం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కింగ్ మేకర్ కావాలనే.. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీఎస్పీ 38 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో వీలైనన్ని సీట్లను గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని మాయావతి ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలి ఎన్నికల్లో ఆమె పార్టీ దారుణంగా దెబ్బతింది. 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 300కుపైగా సీట్లలో పోటీ చేస్తే 19 సీట్లు మాత్రమే వచ్చాయి. తాడోపేడో తేల్చుకోవాల్సిన వేళ.. గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో వీలైనన్ని సీట్లు గెలవాలి. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి. అందుకే దృష్టంతా పార్టీ అభ్యర్థుల గెలుపుపై పెట్టాల్సిన పరిస్థితి. 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని బీజేపీని దెబ్బకొట్టారు మాయావతి. ఆ విజయాన్ని పునరావృతం చేయాలన్న లక్ష్యంతో ఈసారీ ఎస్పీ, ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. సంకీర్ణ ధర్మంలో భాగంగా ఆమె మిత్రపక్షాల తరఫున కూడా ప్రచారం చేయాల్సి ఉంది. ఈ కారణాలన్నీ మాయావతిని ఎన్నికల బరికి దూరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి 2022లో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాయావతి ఇప్పుడు పోరుకు దూరంగా ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీఎస్పీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ సహకారంతో బెహన్జీ కచ్చితంగా గెలుస్తారు. దాంతో ఐదేళ్లు ఢిల్లీలోనే ఉండాల్సి వస్తుంది. ఆమె పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి ఒక సీటు పోవడం తప్ప పెద్దగా నష్టమేమీ ఉండదు. మాయావతి ఇక్కడే ఉండటం వల్ల 2022 అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవి కోసం అఖిలేశ్‌తో బేరాలాడే అవకాశం ఉంటుంది’ అని ఆయన వివరించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేసి మాయావతి లోక్‌సభకు వెళ్లిపోతే, ఇక్కడే ఉన్న అఖిలేశ్ వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ముందుంటారు. ఆ అవకాశం దక్కించుకోవడానికే మాయావతి పోటీ చేయడం లేదు’ అని ఆయన అన్నారు. మాకే లాభమంటున్న బీజేపీ మాయావతి ఎన్నికలకు దూరంగా ఉండటాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ద్వారా తాను ప్రధానమంత్రి రేసులో లేనని మాయావతి చెప్పకనే చెప్పినట్టయింది. దీనివల్ల జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీగా నిలిచేది కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్‌పై మాయావతి గుర్రుగా ఉన్నారు. ప్రధానమంత్రి రేసులో కాంగ్రెస్ నేతలు ఉండటాన్ని మాయావతి సమ్మతించరు. కాబట్టి ఎటు చూసినా ఓటర్లకు ప్రధాని పదవికి మోదీ మినహా మరొకరు కానరారు. అందువల్ల మాయావతి నిర్ణయం తమకే లాభిస్తుందని బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఓటమి.. ఆపై అన్నీ గెలుపే మాయావతి 1985లో తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో మీరా కుమార్ (కాంగ్రెస్)తో పోటీచేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత అదే స్థానంలో కాంగ్రెస్‌ను ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆమె ఇంత వరకు లోక్‌సభకు నాలుగు సార్లు (1989, 1998, 1999, 2004) ఎన్నికయ్యారు. రాజ్యసభకు మూడు సార్లు (1994, 2004, 2012) ఎన్నికయ్యారు. అయితే, మూడుసార్లూ రాజ్యసభ సభ్యత్వ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేశారు. -
బీజేపీలో చేరిన జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత ఉపేంద్ర యాదవ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం తన జీవితంలోనే ప్రధానమైన ఘట్టం అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నప్పుడు జయప్రద ఆ పార్టీ సీనియర్ నేత అమర్‌సింగ్ శిష్యురాలిగా ఉన్నారు. అనంతరం పార్టీ పగ్గాలు అఖిలేష్ యాదవ్ చేతికి అందడం, సొంతపార్టీకి చెందిన సీనియర్ నేత ఆజంఖాన్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం వంటి కారణాల వల్ల కొంత కాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాంపూర్ నుంచే బరిలోకి.. తెలుగుదేశం పార్టీ నుంచి 1994లో రాజకీయ అరంగేట్రం చేసిన జయప్రద.. రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈసారి కూడా ఆమె అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ తరఫున రాంపూర్ నుంచి ఆజంఖాన్ పోటీలో ఉండటం గమనార్హం. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. -
ప్రధాని కావాలంటే మా దగ్గరికి రావాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని కావాలని లేదని, కానీ ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయించే సత్తా ఉందని అన్నారు. కేంద్రంలో ఎవరుండాలని నిర్ణయించడంలో యూపీ ఓటర్లదే కీలక పాత్ర కావడంతో ఏ ప్రధాని తమ వద్దకు వస్తారని.. ప్రధాని మోదీ కూడా అలాగే వచ్చారని తెలిపారు. ఆదివారం జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో అఖిలేష్ పాల్గొని ప్రసంగించారు. మరి బీఎస్పీ చీఫ్ మయావతి ప్రధాని రేసులో ఉన్నారా..? అనే ప్రశ్నకు ..‘మా రాష్ట్రం నుంచి ప్రధాని ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరని ఇప్పుడే చెప్పలేను’ అన్నారు. కాగా, 80 ఎంపీ స్థానాలున్న యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఎప్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. మోదీ మరోసారి ప్రధాని కావాలని తన తండ్రి ములాయం చేసిన వ్యాఖ్యలపై మట్లాడనని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని పేర్కొన్నారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో ప్రధాని మోదీకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే జట్టు కట్టామని తెలిపారు. యూపీలో బీజేపీని ఓడించే ఉద్దేశంతోనే దీటైన ఎన్నికల ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్‌ను దూరం చేశామని అఖిలేష్ చెప్పారు. కాంగ్రెస్‌తో తమకు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. -
అలాగైతే ఇప్పుడే చస్తా..
లక్నో : సమాజ్‌వాది పార్టీ నేత ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి అస్థికలశ్ యాత్రను ప్రస్తావించిన ఆజం ఖాన్ మరణించిన తర్వాత అంతటి గౌరవం ఇస్తామంటే తాను ఈ క్షణమే మరణిస్తానని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఎస్పీ నేత పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. కాగా వాజ్‌పేయి అస్థికలను వారణాసిలో పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేశారు. బీజేపీ దిగ్గజ నేతకు వేలాది మంది నివాళులు అర్పించారు. దివంగత నేత అస్థికల యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. దేశంలోని 100 ప్రధాన నదులలో వాజ్‌పేయి అస్థికలను కలపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. మరోవైపు వాజ్‌పేయి మృతిపై రాజకీయంగా లబ్ధిపొందాలనే బీజేపీ హడావిడి చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
మా ఫ్రంట్ ఆషామాషీ చిల్లర రాజకీయం కాదు
సాక్షి, హైదరాబాద్ : ఎవరిని ప్రధాని చేయాలనేది ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం కానే కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల కోసం రాజకీయ పార్టీలను ఏకం చేయటం లేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో జరుపుతున్న సంప్రదింపులపై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని, ఇది ఆషామాషీ చిల్లర మల్లర రాజకీయం కానే కాదని తేల్చి చెప్పారు. తమది థర్డ్, ఫోర్త్.. ఫిఫ్త్ ఫ్రంట్ కానే కాదని, రైతులు, ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి కొత్త మార్పు దిశగా దేశాన్ని నడిపించే యత్నమని అన్నారు. ‘‘ఇది ఆషామాషీ ప్రయత్నం కాదు. రాజకీయాలకు మాత్రమే పరిమితం కాదు. పరిపాలనా, ఆర్థిక రంగాలన్నింటిలో మార్పు రావాలి. ఇంత పెద్ద దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా పెద్ద ప్రయత్నం జరగాలి. రాజకీయ పార్టీలే కాదు. చాలా మందిని కలుపుకొని వెళ్లాల్సి ఉంది’’అని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రగతి భవన్లో సీఎంతో సమావేశమయ్యారు. మధ్నాహ్నం భోజనం తర్వాత ఇద్దరూ దాదాపు రెండు గంటల పాటు ప్రత్యామ్నాయ కూటమిపై చర్చించారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్‌కు అఖిలేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మంత్రులు కేటీఆర్, తలసాని, ఎంపీలు కె.కేశవరావు, బి.వినోద్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్, అఖిలేశ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ప్రారంభం మాత్రమే. ఇది పొలిటికల్ గేమ్ కాదు. అభ్యుదయ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కలిసొచ్చే పార్టీలు, నేతలందరినీ కలుపుకుంటాం. మా ద్వారాలు తెరిచే ఉన్నాయి. మరో రెండు నెలల్లో ఎజెండాకు రూపకల్పన చేసి ప్రజల ముందుపెడతాం. త్వరలోనే ఢిల్లీ వెళ్లి మరికొందరు నేతలతో భేటీ అవుతా. ఇంత పెద్ద దేశానికి ఎజెండా తయారు చేయటం ఒక్కరితో సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాల సూచనలు తీసుకుంటాం. తర్వాత రాజకీయ దృఢ సంకల్పంతో ముందుకెళ్తాం’’అని సీఎం కేసీఆర్ తన కార్యాచరణను వెల్లడించారు. దేశంలో అన్ని వర్గాల్లో అసంతృప్తి దేశంలో పరివర్తన, గుణాత్మక మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నానని, అఖిలేశ్ యాదవ్‌తో నెల రోజులుగా చాలాసార్లు ఫోన్లో మాట్లాడానని సీఎం చెప్పారు. ‘‘ఇటీవల వివిధ పార్టీల నేతలతో సమావేశమైనప్పుడు అన్ని విషయాలు తెలియజేశాను. ఇప్పుడు నేరుగా భేటీ కావటంతో అఖిలేశ్‌తో సమగ్రంగా చర్చలు జరిపాం. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఎలా ముందుకు వెళ్లాలనేది మాట్లాడుకున్నాం. దేశ రాజకీయాలు, పరిపాలనలో గుణాత్మక మార్పు రావాలి. కొంత ఆర్థికంగా వృద్ధి సాధించినప్పటికీ ఆశించిన తీరుగా లేదు. దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. రైతులు, దళితులు, నిరుపేదలు, మైనారిటీలందరూ నిరాశతో ఉన్నారు. అందుకే మార్పు రావాలి. ఈ పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నం మొదలైంది. పొరుగున ఉన్న చైనా మూడు దశాబ్దాల కిందట భారత్ కంటే అన్నింట్లో వెనుకబడి ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే పోటీ పడే స్థాయికి వృద్ధి చెందింది. భారత్ కూడా గుణాత్మకంగా అభివృద్ధి చెందాలి. ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉండాలి. నా ప్రయత్నాలకు అఖిలేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు’’అని అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశాభివృద్ధి: అఖిలేశ్ కేసీఆర్‌తో చర్చలు తనకు సంతృప్తినిచ్చాయని, ఆనందంగా ఉందని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘‘కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తన సుపరిపాలనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని చూరగొన్నారు. ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీటిని అందించే ప్రయత్నాలతో ప్రజల్లో భరోసా నింపారు. దేశంలో జరగాల్సిన ఆర్థిక వృద్ధి ఆ స్థాయిలో లేదు. స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ సాగు, తాగునీటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రైతులు సంతోషంగా లేకుంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. గత ప్రభుత్వాలు ప్రజల ఆశలు నెరవేర్చలేక పోయాయి. మన శక్తి సామర్థ్యాలకు కొదవ లేదు.. విదేశాల్లో మన యువత సత్తా చాటుతోంది. మేం ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాం. రానున్న రోజుల్లో బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది. బీజేపీ అనేక హామీలు ఇచ్చినా ఏవీ నెరవేర్చలేదు. ఎన్నికలకు ఇంకా ఏడాదే ఉంది. వారిచ్చిన హామీలు ఎలా నెరవేరుతాయి? నోట్ల రద్దుతో పెద్ద మార్పు వస్తుందని బీజేపీ చెప్పింది. అది నిజమైందా? యూపీలో ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దేశంలో మార్పునకు బీజం పడింది. కేసీఆర్ తలపెట్టిన గుణాత్మక మార్పును సమాజ్‌వాదీ పార్టీ సమర్థిస్తోంది. మళ్లీ కలుస్తాం. చర్చలు జరుపుతాం. దేశంలోని రైతులు, పేదలు, యువతకు మార్పు దిశగా బీజం పడింది’’అని అఖిలేశ్ వెల్లడించారు. హైదరాబాద్‌తో తనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి వచ్చిన అఖిలేశ్‌కు బేగంపేట విమానాశ్రయంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్వాగతం పలికారు. సీఎంతో భేటీ తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన లక్నోకు తిరుగుపయనమయ్యారు. -
యూపీలోనే పొత్తు.. బయట లేదు : ఎస్పీ
లక్నో: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ- బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధికారం ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమిగా పోటీ చేసి బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. ఇకముందు కూడా యూపీలో బీఎస్పీ-ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని అఖిలేష్, మాయావతి ఇదివరకే స్పష్టంచేశారు. కర్ణాటకలో మాత్రం రెండు పార్టీలు వేరువేరుగా పోటిచేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి జేడీఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటి చేస్తున్నట్లు ఎన్నికల ముందే ప్రకటించారు. జేడీఎస్‌తో పొత్తుపెట్టుకున్న బీఎస్పీ కర్ణాటకలో 20 స్థానాల్లో పోటిచేస్తుంది. ఎస్పీ ఒంటరిగా 27 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపినట్లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రాబిన్ మాథ్యుస్ తెలిపారు. కర్ణాటకలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పర్యటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నా... ఇంతవరకూ అభిలేష్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మాయావతి కర్ణాటకలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడతో కలిసి మైసూర్, చిత్రదుర్గ ప్రాంతాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎస్పీ- బీఎస్పీ కూటమి ఉత్తరప్రదేశ్‌కే పరిమితమని, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూటమిలేదని రాజేంద్ర చౌదరి స్పష్టం చేశారు. -
‘కూటమితో బీజేపీని ఓడించగలం’
లక్నో : రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ కూటమి చాలా అవసరమని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఆదివారం మీడియాతో ముచ్చటించిన అఖిలేష్ పలు అంశాలను ప్రస్తావించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిపై మాట్లాడుతూ...‘ప్రస్తుత పరిస్థితిలో కూటమి అవసరం చాలా ఉంది. నేను కూటమిని నడిపించగలనని విశ్వసిస్తున్నా. బీఎస్పీతో కలిసి పనిచేయడానికి నేను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. ఇద్దరిలో ఎవరు సీనియర్, జూనియర్ అనేది ముఖ్యంకాదని, ఇద్దరి లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టంచేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్ధుల గెలుపునకు మాయావతి కీలకంగా వ్యవహరించారని, మాయావతి సహకరించడంతోనే యోగి సొంత నియోజకవర్గంలో గెలుపు సాధ్యమైందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కూటమిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌కు 100 సీట్లు ఇస్తే వారు మాకు మిగిలిన 300 స్థానాల్లో మద్దతు తెలిపారని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రభావం, మిత్ర పక్షాల సహాయంతో 325 సీట్లతో విజయం సాధించి యోగి సీఎం కాగలిగారని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ మా కూటమి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. బీఎస్పీ అభ్యర్థిని గెలిపించడానికి మాయావతి తీవ్రంగా శ్రమించారని, ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా.. బీజేపీ అధికారం బలంతో మోకాలోడ్డిందని విమర్శించారు. ఎస్పీ అభ్యర్థి జయా బచ్చన్ ఓటమి చెందినా... బీఎస్పీ అభ్యర్థి విజయం సాధించాలని ఆమె తనని కోరారని దానికి తాను అంగీకరించలేదని అఖిలేష్ తెలిపారు. మరో నెల రోజుల్లో మండలిలో తన పదవి కాలం ముగుస్తుండటంతో తిరిగి పోటిచేయట్లేదని ప్రకటించారు. కాగా మండలిలో ఏప్రిల్ 26న 13 మంది సభ్యులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీఎస్పీకి అవకాశం ఇస్తూందా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందని అఖిలేష్ తెలిపారు. -
కూటమిపై ఓటమి ప్రభావం ఉండదు: మాయావతి
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో తమ పొత్తు కొనసాగుతుందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమి పొత్తుపై ఎటువంటి ప్రభావం చూపబోదన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మరింత పట్టుదలతో కలిసి పనిచేస్తామన్నారు. ఇటీవలి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపును అధికార బీజేపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ కుట్రపన్నిందని ఆరోపించారు. -
‘ఖిల్జీని చూస్తే అజంఖాన్ గుర్తొచ్చాడు’
రాయ్‌పూర్: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజంఖాన్‌ను ఉద్దేశించి మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను చూస్తే తనకు అజంఖానే గుర్తొచ్చాడని ఆమె వ్యాఖ్యానిం చారు. ‘‘అజంఖాన్‌ను నేను సోదరునిగా భావించాను. కానీ అతను నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాడు’ అని రాయ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు. -
సమాజ్‌వాదీ పార్టీ ఏపీ అధ్యక్షుడి నియామకం
హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన జగదీశ్ యాదవ్‌ను నియమించినట్లు ఆ పార్టీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 15 రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.