
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో తమ పొత్తు కొనసాగుతుందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమి పొత్తుపై ఎటువంటి ప్రభావం చూపబోదన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మరింత పట్టుదలతో కలిసి పనిచేస్తామన్నారు. ఇటీవలి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపును అధికార బీజేపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ కుట్రపన్నిందని ఆరోపించారు.