Bahujan Samaj Party
-
ఎన్నికల ‘మాయ’పై కాంగ్రెస్ చింత!
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన సాధారణ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు దాని నేతృత్వంలోని ఇండియా కూటమి విజయాలను అడ్డుకోవడంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కంట్లో నలుసులా మారుతుండటంపై కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. పార్టీ జయాపజయాలను నిర్ణయించే ఓట్లను చీల్చడంలో బీఎస్పీ తన పాత్రను సమర్ధంగా పోషిస్తోందని, ఇది పరోక్షంగా అధికార బీజేపీ కూటమికి లబ్ధి చేకూరుస్తోందన్న వాదనను బలంగా తెరపైకి తెస్తోంది. బీఎస్పీతో జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్ష్యంగా విమర్శలు గుప్పించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యూపీ సహా అనేక చోట్ల పనిచేస్తున్న ‘మాయ’ గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓట్లకు భారీ గండి కొట్టాలనే బలమైన లక్ష్యంగా సమాజ్‌వాదీతో ముందస్తు పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, బీఎస్పీని సైతం కూటమిలోకి ఆహ్వానించింది. దీనికి మాయవతి అంగీకరించకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 80 లోక్‌సభ స్థానాలకు గానూ 33.8 శాతం ఓట్లతో ఎస్పీ 37, 9.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. రెండె పార్టీల ఓట్ల వాటా 43.3 ఓట్ల శాతం. ఇదే సమయంలో బీఎస్పీ ఒక్క సీటు గెలవలేకున్నా పారీ్టకి మాత్రం 9.39 శాతం ఓట్లు వచ్చాయి. కూటమిలో భాగస్వామిగా ఉండుంటే ఓట్ల శాతం 52 శాతానికి పైగా పెరిగి మరిన్ని సీట్లు గెలిచే వారమని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో 16 సీట్లలో కూటమి అభ్యర్థుల విజయాన్ని బీఎస్పీ అడ్డుకుంది. 16 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఓడిన మార్జిన్ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అమ్రోహా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి డానిష్ అలీ 28 వేల ఓట్ల తేడాతో ఓడితే బీఎస్పీకి అక్కడ 1.20 లక్షల ఓట్లు వచ్చాయి. బాన్స్గౌవ్ స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లతో ఓడితే బీఎస్పీకి 64వేల ఓట్లు వచ్చాయి. ఇదే మాదిరి చాలా స్థానాల్లో బీఎస్పీ కూటమి అభ్యర్థుల విజయాలకు గండికొట్టింది. యూపీలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టు పట్టు ఉంది. దీనికి తోడు కాన్షీరాం వారసత్వ పారీ్టగా హిందీ రాష్ట్రాల్లోనూ బీఎస్పీ ప్రాబల్యం బలంగా ఉంది. దళితులు–ముస్లిం ఫార్ములాను ముందుపెట్టి గడిచిన రెండేళ్లలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, చత్తీస్‌గఢ్ వంటి రా్ర‹Ù్టరాల్లో పోటీ చేసి 2–4 శాతం ఓట్లను రాబట్టుకుంది. ఈ ఓట్లన్నీ పరోక్షంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఓటమికి కారణమయ్యాయి. మొన్నటి హరియాణా ఎన్నికల్లో బీఎస్పీ, ఐఎన్ఎల్డీ పారీ్టలు కలిసి పోటీచేసి ఏకంగా 5.96 శాతం ఓట్లను రాబట్టుకున్నాయి. ఇందులో బీఎస్పీకి 2 శాతం ఓట్లున్నాయి. ఈ ఓట్లే కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. మధ్యప్రదేశ్‌లోనూ కచి్చతంగా తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భావించినా 3.40 శాతం ఓట్లను రాబట్టుకున్న బీఎస్పీ కాంగ్రెస్‌ను భారీ దెబ్బకొట్టింది. ఈ ఏడాది నవబంర్‌లో జరిగే బిహార్ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిధ్దమవుతోంది. గత ఎన్నికల్లో బిహార్‌లో 78 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ 1.5 శాతం ఓట్లను రాబట్టుకుంది. దానికి మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎం మరో 2శాతం ఓట్లు రాబట్టుకుంది. దీంతో ఓట్లు చీలి జేడీయూ, బీజేపీకి అధిక సీట్లు వచ్చేందుకు మద్దతిచి్చనట్లయింది. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ బీఎస్పీ తమకు ఇక్కట్లకు గురిచేస్తుండటం కాంగ్రెస్ పారీ్టకి తలనొప్పి వ్యవహారంలా మారింది. ఈ నేపథ్యంలోనే యూపీలో పర్యటిస్తున్న రాహుల్ బీఎస్పీ అధినేత్రి మాయవతి లక్ష్యంగా విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిసి పనిచేసి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని, అయితే మాయావతి తమతో కలిసి రాలేదన్నారు. ఇది పరోక్షంగా బీజేపీ గెలుపుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. ఈ విమర్శలు ఇప్పుడు మాయావతి ప్రభావాన్ని మరోమారు చర్చకు పెట్టాయి. -
పదవికి ఎసరు పెట్టిన కొడుకు పెళ్లి.. బీఎస్పీ సీనియర్ నేత సస్పెండ్
లక్నో: అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న కొడుకు పెళ్లి.. తన పొలిటికల్ కేరీర్‌ను దెబ్బకొట్టింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కారణమైంది. ఇందుకు కారణం.. తనకు కాబోయే కోడలు మరో పార్టీ నాయకుడి కూతురు కావడమే. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నాయకుడు సురేంద్ర సాగర్ తన కుమారుడితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీకి చెందిన నేతతో వియ్యం అందుకోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సీరియస్ అయ్యారు. తక్షణమే సురేంద్ర సాగర్‌పై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఓ లేఖను ఇచ్చారు.ఈ సందర్భంగా సురేంద్ర సాగర్ స్పందిస్తూ.. పార్టీ వ్యతిరేక చర్యలకు నేను పాల్పడలేదు. ఎమ్మెల్యే త్రిభువన్ కూతురితో నా కుమారుడికి వివాహం జరిపించడం నేరమా?. నేను ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సురేంద్ర కుమార్.. బరేలీ డివిజన్లో బీఎస్పీకి కీలక నేతగా ఉన్నారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాగర్ పోటీ చేసి ఓడిపోయారు.ఇక, ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ త్రిభువన్ దత్ ప్రస్తుతం అంబేద్కర్ నగర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ మాయావతి ఇలాంటి నిర్ణయం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే పార్టీలో వచ్చినప్పుడు మాజీ డివిజనల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. -
Lok sabha elections 2024: దేవభూమిలో ఈసారీ... కమల వికాసమే!
హిమాలయ పర్వత సిగలో బద్రీనాథ్, కేధార్నాథ్ వంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన ‘దేవభూమి’ ఉత్తరాఖండ్. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాంచల్‌గా ఏర్పాటైన ఈ రాష్ట్రం పేరు 2006లో ఉత్తరాఖండ్గా మారింది. ఇక్కడి రాజకీయాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెసే చక్రం తిప్పుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా నిలిచిన ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ (యూకేడీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా కాస్త ప్రభావం చూపుతున్నాయి. పదేళ్లుగా ఉత్తరాఖండ్ పూర్తిగా కాషాయమయమైంది. అటు అసెంబ్లీలో, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ హవాయే నడుస్తోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన కమలనాథులు ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం చేతులు మారింది. 2012 నుంచీ మాత్రం రాష్ట్రం బీజేపీ గుప్పిట్లోనే ఉంది. 2002లో కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీ తివారీ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి చేపట్టిన తొలి, ఏకైక నేతగా చరిత్ర సృష్టించారు. 2007లో ఉత్తరాఖండ్‌లో మళ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీఎస్పీ, యూకేడీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ బహుగుణ, హరీశ్ రావత్ రూపంలో ఆ ఐదేళ్లలో ఇద్దరు సీఎంలను మార్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, రాష్ట్రపతి పాలన, సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ విశ్వాస పరీక్షలో నెగ్గడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 5 సీట్లను దక్కించుకున్న బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచి్చంది. మొత్తం 70 సీట్లలో ఏకంగా 57 స్థానాలను కొల్లగొట్టింది! 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ 47 సీట్లతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. 19 సీట్లతో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పూర్వ వైభవం కోసం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని 5 ఎంపీ సీట్లలో ఒకటి ఎస్సీ రిజర్వుడు స్థానం. సర్వేలు ఏం చెబుతున్నాయి... రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యంతో బీజేపీ మంచి జోరు మీదుంది. అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలతో హోరెత్తిస్తోంది. కాంగ్రెసేమో ఇండియా కూటమి దన్నుతో మొత్తం ఐదు స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ సర్కారు కుమ్మక్కు వంటివాటిని ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. కులగణన, సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు వంటి హామీలను గుప్పిస్తోంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా 5 సీట్లూ గెలుచుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ సస్పెండెడ్ ఎంపీ
లక్నో:పార్లమెంట్ ఎన్నికల వేళ పలువురు కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీలు మారుతూ రాజకీయ వేడిని పెంచుకుతున్నాయి. తాజాగా సస్పెండెడ్ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఐదు రోజుల కింద డానిష్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆరోజు నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు ఉచ్చాయి. అనుకున్నట్టుగానే ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. ఆయన అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి సీట్ల పంపణీలో పొందినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో డానిష్ అలీ జనవరిలో మణిపూర్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ ఈ సందర్భంగా నాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ రావటంతో నా మనసు కుదుటపడింది. నాకు రెండు మార్గాలు ఉన్నాయి. నాలో మార్పు లేకుండా దళితులు, వెనబడిన, గిరిజన, మైనార్టీలు, పేదల దోపిడీని విస్మరించడం. లేదా.. దేశంలో భయం, ద్వేషం, దోపిడడీ, విభజన వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించటం’ అని డానిష్ అన్నారు. మరోవైపు.. ‘కాంగ్రెస్ నేతలతో సన్నిహతంగా ఉంటుంన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు మరచిపోయారు. ఆ కారణంగా డానిష్ అలీని సస్పెండ్ చేస్తున్నాం’ బీఎస్పీ గతేడాది ఆయన సస్పెన్షన్‌పై వివరణ ఇచ్చింది. డానిష్ అలీపై బీఎస్సీ పార్టీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అలీకి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. -
ఇండియా కూటమికి షాక్.. మాయావతి కీలక ప్రకటన
లక్నో: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతున్నట్టు మాయావతి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాజకీయాల్లో తన రిటైర్మెంట్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మాయావతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తు ఉండదు. ఎన్నికల అనంతరం పొత్తుల విషయంపై ఆలోచిస్తాం. అప్పుడు పొత్తులు ఉంటే ఉండొచ్చు. ఇప్పటి వరకు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భంలో బీఎస్పీకి చేదు అనుభం ఎదురైంది. పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది. తమ ఓట్లు భాగస్వామ్యపక్షానికి బదిలీ అయినప్పటికీ.. అటు ఓట్లు మాత్రం ఇటు రావడం లేదు. కాబట్టి ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే ఈ సారి ఎన్నికలకు వెళతాం’ అని స్పష్టం చేశారు. VIDEO | "I want to clarify that our party (BSP) will go solo in the upcoming (2024) Lok Sabha polls. With the backing of people from backward community, Dalits, tribals and Muslims, we had formed a full majority government in UP in 2007, and that's why we have decided to contest… pic.twitter.com/oatnx167db — Press Trust of India (@PTI_News) January 15, 2024 దీంతో, తాము ఇండియా కూటమిలో చేరడం లేదని మాయవతి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మాయావతి తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టంచేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. ఇదే సమయంలో రామమందిర ప్రాణప్రతిష్టకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తమది సెక్యూలర్ పార్టీ అని చెప్పుకొచ్చారు. -
సిర్పూర్ పైనే ఏనుగంత ఆశ!
సాక్షి, హైదరాబాద్: బహుజన వాదం నినాదంతో రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని ఆశపడ్డ బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరి గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. సిర్పూరులో విజయం సాధిస్తామనే అంచనాతో పాటు పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా 10 శాతం ఓట్లు సాధించడం లక్ష్యంగా బరిలోకి దిగినట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెపుతూ వచ్చారు. ఇందులో భాగంగానే పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసి పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెట్టారనే చెప్పాలి. ఆ మూడు పార్టీలు చీల్చుకునే ఓట్లపై.. సిర్పూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు, కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్‌లకు పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రచారం నుంచే గట్టిపోటీ ఇచ్చారు. దళిత, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లతో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్ల నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అదే స్థాయిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్కు దీటుగా ఓట్లు పోలయినట్లు ఆపార్టీ అంచనా వేస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లు పంచుకుంటే బీఎస్పీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే పోలింగ్ రోజు బీజేపీకి భారీగా ఓట్లు పోలవడం కొంత అనుమానాలకు తావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో గట్టి పోటీ సిర్పూర్‌తో పాటు చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు నీలం మధు, పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన దాసరి ఉష, సూర్యాపేట నుంచి వట్టె జానయ్య యాదవ్, నకిరేకల్ నుంచి పోటీ చేసిన మేడి ప్రియదర్శిని, ఆలంపూర్ నుంచి బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్ సోదరుడు ఆర్. ప్రసన్న కుమార్ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు పార్టీ భావిస్తోంది. ఈ నియోజకవర్గాలలో గెలవక పోయినా ప్రత్యర్థి పార్టీల ఓటములను నిర్దేశించే స్థితిలో ఓట్లు సాధిస్తుందని భావిస్తున్నారు. కాగా పోటీ చేసిన ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ మెరుగైన ఓట్లను సాధించడం ద్వారా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ భావిస్తున్నారు. -
తెలంగాణలో అధికారంలోకి వస్తాం
సూర్యాపేట: తెలంగాణలో ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాం«దీనగర్‌లో బహుజన రాజ్యాధికార సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. అన్నీ సంపన్న వర్గాల కోసం నడుస్తున్న పార్టీలని అన్నారు. కానీ బీఎస్పీ ఒక్కటే బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుని నడుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. దేశంలో మిగిలిన పార్టీలన్నీ ఓట్ల ముందు తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఇది గమనించిన వట్టె జానయ్య యాదవ్ లాంటి వారు బహుజన జెండాను ఎత్తుకోవడం ఆహా్వనించదగిన పరిణామమని అన్నారు. వట్టె జానయ్యపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని.. అది బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు జరిపించిన వ్యూహాత్మక దాడి అని ఆరోపించారు. ‘మేము తక్కువగా చెప్పి.. ఎక్కువగా పనిచేస్తాం’అని పేర్కొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభలో సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ట్రాన్స్‌జెండర్‌కు బీఎస్పీ టికెట్
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కలి్పంచారు. వరంగల్ తూర్పు నుంచి చిత్రపు పుష్ప తలయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బరిలోకి దింపడం గమనార్హం. ఈ నెల 3న 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా 43 మందితో కూడిన రెండో విడత జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 63కు చేరింది. ఆ పార్టీలవి మాయమాటలు: ఆర్ఎస్ ప్రవీణ్.. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇతర రాజకీయ పారీ్టలు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మాయమాటలతో వంచించే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని నమ్మొద్దని ప్రజలను కోరారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. బీసీ కులాలకు చెందిన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేని ఆ పార్టీ... బీసీని సీఎం చేస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశంలో బీసీ ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీఎస్పీ జనబలం ముందు కేసీఆర్ ధనబలం పనికిరాదన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. -
పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు
లక్నో: బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్‌లోనూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ సభ్యులు అందరూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్ధులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా వెనకాడవని ప్రతి దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దీని కారణంగా మన ఎన్నికల ప్రణాళిక దెబ్బ తినకూడదని అన్నారు. అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై స్పందిస్తూ.. వారి పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం వంటి సమస్యలతో సహా ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో వారి వ్యవహారం ఉంటుందని అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రిజర్వేషన్‌ను ప్రతిపాదికగా తీసుకోకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బుల్డోజర్ యాక్షన్లపై ఆమె స్పందిస్తూ ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదని పూర్తి ప్రజా వ్యతిరేక విధానమని అన్నారు. 01-10-2023-BSP PRESS NOTE-UP MEETING pic.twitter.com/PVgb7KdhiA — Mayawati (@Mayawati) October 1, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన -
సభలో మాటలతో చంపేశారు: బీఎస్పీ ఎంపీ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఈ వివాదంపై మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ మా ఎంపీ చేసింది తప్పే కానీ అంతకుముందు డానిష్ అలీ చేసింది కూడా తప్పేనని దానిపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ మతపరమైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే రేపాయి. ఇతర పార్టీల ఎంపీల తోపాటు బీజేపీ నాయకులు కూడా రమేష్ బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తుండగా సహచర బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాత్రం బిధూరీ వ్యాఖ్యలను ఖండిస్తూనే డానిష్ అలీని కూడా విచారించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. आज भाजपा के कुछ नेता एक नैरेटिव चलाने का प्रयास कर रहे हैं कि संसद में मैंने श्री रमेश बिदूरी को भड़कया, जबकि सच्चाई यह है कि मैंने प्रधानमंत्री पद की गरिमा को बचाने का काम किया और सभापति जी को मोदी जी से संबंधित घोर आपत्तिजनक शब्दों को सदन की कार्रवाई से हटाने की माँग की थी। pic.twitter.com/s5u0Ptb0Ou — Kunwar Danish Ali (@KDanishAli) September 23, 2023 ఈ సందర్బంగా నిశికాంత్ దూబే ఏమన్నారంటే.. లోక్‌సభలో రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం ఆమోదించదగినవి కాదని, అదే సమయంలో డానిష్ అలీ ప్రధానిని కులం పేరుతో దూషించారు కాబట్టి రమేష్ ఆ విధంగా స్పందించారని.. డానిష్ అలీ వ్యాఖ్యలపై కూడా విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. లోక్‌సభ నియమావళి ప్రకారం ఒక సభ్యుడు మాట్లాడుతుండగా కూర్చుని ఉన్న మరో సభ్యుడు అదేపనిగా అడ్డుపడడం కూడా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. 15 ఏళ్లుగా నేను ఎంపీగా ఉన్నాను కానీ ఇలాంటి ఒకరోజును నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదన్నారు. #WATCH | Delhi: On BJP MP Ramesh Bidhuri's remark, BJP MP Nishikant Dubey says "...The words used by him are not acceptable. I was present in the Parliament when all this took place. BSP MP Danish Ali kept calling PM Modi 'neech'. I have written a letter to Lok Sabha Speaker Om… pic.twitter.com/TIg4A9bc1a — ANI (@ANI) September 23, 2023 నిశికాంత్ దూబే వ్యాఖలపై బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. సభలో నన్ను మొదట మాటాలతో చంపేశారు ఇప్పుడు సభ వెలుపల నన్ను శారీరకంగా చంపాలని చూస్తున్నారన్నారు. ఇక ఈ విషయంపై రమేష్ బిధూరీ స్పందించడానికి నిరాకరించారు.. మొదట డానిష్ ఆలీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కాబట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఏదేమైనా ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభాపతి కాబట్టి దానిపై తాను మాట్లాడదలచుకోలేదని చెప్పి వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! -
ఫాంహౌస్‌లలో నీలి జెండాలు పాతుతాం
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): రాజకీయ నాయకుల ఫౌంహౌస్‌లలో నీలి జెండాలు పాతేస్తామని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బహుజన్ సమాజ్ పార్టీయేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన బహుజన దండయాత్ర సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఉన్న బహుజనులందరూ బీఎస్పీకి ఓటు వేస్తారన్నారు. దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు, ఎస్టీబంధులతో పాటుగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుకాణాన్ని సైతం ప్రజలు బంద్ పెట్టడం ఖాయమని చెప్పారు. బహుజనులకు కావాల్సింది గొర్రెలు, చేపలు కాదని, బీఎస్సీ అధికారంలోకి వస్తే బహుజనులు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు గజ్వేల్ బహుజనులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
ఉద్యోగకల్పనలో బీజేపీ మాటలు ఉత్తవే..
కరీంనగర్ కల్చరల్: కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాంజీ గౌతమ్ విమర్శించారు. ఉద్యోగాలకల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దేశవ్యాప్తంగా పది లక్షలకుపైగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీ కులగణన చేసి, బీసీల రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ ఆధ్వర్యంలో రెండు నెలలుగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేవలం సెక్రటేరియట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టడం లేదా ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన ఇక్కడి పేదలు సంతోషకరమైన జీవితాన్ని గడపలేరని పేర్కొన్నారు. అంబేడ్కర్, పూలేæ, సాహు మహరాజ్ ఆశయాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని గుర్తు చేశారు. -
బహుజన రాజ్యస్థాపనే లక్ష్యం: ఆర్ఎస్పీ
నూతనకల్, అర్వపల్లి: ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని దూరం చేసి బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని వెంకెపల్లి, చిల్ప కుంట్ల, నూతనకల్, యడవెళ్లి, తాళ్లసింగారం గ్రామాల్లో నిర్వహించిన రాజ్యాధికార యాత్రలో ఆయన వివిధ చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరిం చారు. అనంతరం అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది బీఎస్పీలో చేరారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలకు అధికారం ఉండటం వల్ల ఆ వర్గాలకే ప్రయోజనాలు చేకూరాయన్నారు. సీఎం కేసీఆర్ ఇంతకాలం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసి ఇప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తామ నడం ఆ యన రాజకీయ ప్రయోజనాలకోసమేనని అన్నారు. జీఓ 111ను రద్దు చేయడం వల్ల అగ్రవర్ణాలకే ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ వాటి నిర్మాణాలను గాలికి వదిలేశారని, కొన్ని ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని పిల్లర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. -
మాయ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!
ఒకప్పుడు రాజసంతో యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత బిడ్డ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నేడెందుకో మౌన ప్రేక్షకురాలి పాత్రకు పరిమితమయ్యారు. ఆ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఎవరి ఊహకి అందని విధంగా యూపీ ప్రజల్ని మాయ చేశారు. అగ్రవర్ణాలు, దళితులు అనే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో ఎన్నికల్లో కాకలు తీరిన యోధులకే కొత్త పాఠాలు నేర్పించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆమె ఆప్త మిత్రులనైనా పక్కన పడేయగలరు. ఆగర్భ శత్రువులతోనైనా చేయి కలపగలరు. సామాజిక కార్డుతోనే యూపీతో సహా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అభిమానులు బెహన్జీ అని ఆప్యాయంగా పిలుచుకొనే మాయావతి శక్తిసామర్థ్యాలు ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారింది. ప్రస్తుతం ఆమె ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నారు. యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతూ ఎన్నికల కాక రగులుతూ ఉంటే మాయావతి వ్యూహాలేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞురాలు, అత్యంత శక్తిమంతమైన మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాయకురాలు, ఒకప్పుడు ప్రధాని పదవికి సైతం పోటీదారుగా నిలువాలని ఆశించిన మాయావతి.. ఈసారి మౌనం దాల్చడం వెనుక ఎలాంటి మాయ దాగుందోనన్న చర్చ జరుగుతోంది. ►ఢిల్లీలోని నిరుపేద దళిత కుటుంబంలో 1956 సంవత్సరం జనవరి 15న జన్మించారు. ►ఘజియాబాద్‌లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ చేసిన మాయావతి ఐఏఎస్ కావాలని కలలు కన్నారు. ►1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో టీచర్‌గా చేశారు ►దళిత నాయకుడు కాన్షీరామ్‌తో 1977లో పరిచయం ఏర్పడింది ►కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. ►రాజకీయ రంగప్రవేశంతో ఆమె జీవితమే మారిపోయింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ►మాయావతికి మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. 1985లో తొలిసారి లోక్‌సభకు పోటీపడినప్పుడు ఆమె ఓడిపోయారు. 1987లో మళ్లీ ఓటమిపాలయ్యారు. 1989లో యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు ►కాన్షీరామ్ అనారోగ్యం బారినపడడంతో 1995లో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. ►1998, 1999, 2004లో వరుసగా మూడుసార్లు లోక్‌సభకు, మరో మూడు పర్యాయాలు (1994–2012 మధ్య) రాజ్యసభకు ఎన్నికయ్యారు. ►తొలిసారిగా 1995 సంవత్సరం నాలుగు నెలల పాటు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దళిత మహిళ అత్యున్నత స్థాయి పదవిని అందుకోవడం అదే తొలిసారి. ►ఆ తర్వాత మరో రెండు సార్లు స్వల్పకాలం సీఎంగా కొనసాగారు. 1997లో ఆరు నెలలు, 2002–03లో 17 నెలలు సీఎం పదవిలో ఉన్నారు ►గురువు కాన్షీరామ్ 2006లో కన్నుమూసినప్పుడు మాయావతి స్వయంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ►2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టి పూర్తిగా అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు ►ఈ అయిదేళ్ల కాలంలో ఆమె ప్రభ మసకబారడం ప్రారంభించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు, అధికారాన్ని ఉపయోగించుకొని బల ప్రదర్శన, డజనుకు పైగా విమానాలు, హెలికాప్టర్లను ప్రచారానికి వినియోగించడం, తాజ్ హెరిటేజ్ కారిడార్‌లో అవకతవకలు వంటివెన్నో వివాదాస్పదమయ్యాయి. ►ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన విగ్రహాలు, పార్టీ చిహ్నం ఏనుగు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించడం, పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం, కార్యకర్తలు వేసే కరెన్సీ దండల్ని స్వీకరించడం, పాలనా వైఫల్యాలు వంటివన్నీ ఆమెపై తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచాయి. నిమ్నకులాలకి చేసిందేమిటన్న ప్రశ్నలు వచ్చాయి. ►2017 శాసనసభ ఎన్నికల్లో కేవలం 19 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ►2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగర్భ శత్రువైన ఎస్పీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ 10 స్థానాలు దక్కించుకోగలిగింది. ►ఈసారి ఎన్నికల్లో మాయావతి పార్టీ పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ, మ్యానిఫెస్టో విడుదలలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఎందులోనూ స్పీడ్ కనిపించడం లేదు. ►అయినప్పటికీ సంప్రదాయంగా తమకు వచ్చే 20% ఓటు బ్యాంకుపైనే మాయావతి ఆశలు పెట్టుకున్నట్టుగా బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. – నేషనల్ డెస్క్ సాక్షి -
కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!
భాగపట్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: ఐదేళ్ల పదవీ కాలం చివరి దశకు చేరడంతో ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారం కోసం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేస్తున్న ప్రయత్నాలు అంత తేలిగ్గా సఫలమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ విసురుతోంది. దానికితోడు ఇటీవలి రైతు ఉద్యమాలకు కేంద్రమైన పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, రాజకీయ పార్టీల ఎత్తులు బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల వైభవాన్ని నిలుపుకోవాలన్న ఆ పార్టీ ఆశలను కులాల సమీకరణతో చిత్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఉర్రూతలూగుతోంది. జాట్లు, ముస్లింలు, రైతులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కులాలు, వర్గాల వారీగా ఓట్లు కొల్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్ఎల్డీతో పొత్తు కుదుర్చుకొని జాట్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడంలో ఎస్పీ సఫలమైంది. జాట్లలో చీలిక తెచ్చి కూటమి వ్యూహాలను బద్ధలు కొట్టే ప్రణాళికలతో బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ముస్లిం–జాట్ల సోదరబంధం ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరీ తాత, మాజీ ప్రధాన మంత్రి చౌదరీ చరణ్‌సింగ్ ‘కిసాన్ నేత’గా కీర్తి గడించారు. ఆయన హయాం నుంచే ముస్లింలు జాట్లతో సత్సంసంబంధాలు కలిగి ఉన్నారు. ఎస్పీ– బీఎస్పీ పుట్టుకకు ముం దు పశ్చిమ యూపీ ముస్లింలు చరణం సింగ్ ఎవరికి మద్దతు ఇస్తే వారినే బలపరిచే వారు. అజిత్ సింగ్ కూడా వారిని కలుపుకుంటూ రాజకీయాలు సాగించారు. అయితే జాట్–ముస్లింల బంధాన్ని 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు దెబ్బ తీశాయి. అల్లర్ల అనంతరం రెండు వర్గాల మధ్య చీలక ఏర్పడి ముస్లింలు ఆర్ఎల్డీకి దూరమయ్యారు. ఈ కారణంగా ఆర్ఎల్డీ 2014, 2019 ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోలేదు. ‘మా రెండు వర్గాల మధ్య సత్సంబంధాలను దెబ్బ తీయడానికి జరిగిన కుట్ర అది. చిన్న ఘటనను ఆధారం చేసుకుని సాగిన హింసాకాండను ఏ రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకు వాడుకున్నదో అందరికీ తెలుసు’ అని భాగపట్లో ఎస్పీ తరపున చురుకుగా ప్రచారం చేస్తున్న రసూల్ అలీ ఖాన్ అన్నారు. ఇప్పటికీ అదే అల్లర్లను బూచీగా చూపి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నది అలీఖాన్ ఆరోపణ. జాట్–ముస్లిం–రైతులు కలిస్తే కనీసంగా 50 స్థానాలు గెలువచ్చన్న అంచనాతో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీకి ఎస్పీ 33 సీట్లు కేటాయించింది. ఇందులో ఆర్ఎల్డీ 5 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. మిగతా స్థానాల్లో ఎస్పీ పోటీలో నిలవగా ఇందులో 8 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. అయితే సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. ముఖ్యంగా సర్ధన, హస్తినాపూర్ సీట్లను ఎస్పీకి అప్పగించడంపై ఆర్ఎల్డీ జాట్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముజఫర్‌నగర్ జిల్లాలోని 6 స్థానాలకు గానూ 4 స్థానాల్లో ముజఫర్‌నగర్ సదర్, మీరాపూర్, ఖటోలీ, పుర్కాజీ స్థానాల్లో ఆర్ఎల్డీ గుర్తుపై ఎస్పీ తమ నేతలను బరిలోకి దింపింది. దీంతో ఆర్ఎల్డీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంతకు జాట్లు ఎటువైపు? పశ్చిమ యూపీలో పార్టీల గెలుపోటముల పాత్ర కీలకమైనది. గడచిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో జాట్లు మద్దతు ఇవ్వడంతో బీజేపీ సునాయసంగా విజయాలు దక్కించుకుంది. అయితే, రైతు ఉద్యమం నేపథ్యంలో జాట్లు బీజేపీకి వ్యతిరేకమయ్యారని,అది తమకు లాభిస్తుందని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విశ్వాసంతో ఉంది. ఎస్పీకి ఓట్ల బదిలీ అంత సులభం కాదని దాద్రి, భాగ్‌పట్, మీరట్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల పరిశీలనలో వెల్లడైంది. ఎస్పీ అధికారంలోకి వస్తే జయంత్ సింగ్ చౌధురి పాత్ర నామమాత్రమే అవుతుందంటూ బీజేపీ కేడర్ జాట్లకు నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. అంతే కాదు ముజఫర్‌నగర్ అల్లర్లను పదేపదే గుర్తు చేస్తోంది.‘జయంత్ చౌధురి పార్టీ పోటీ చేసే స్థానాల్లో మా మద్దతు ఉంటుంది. కానీ,అఖిలేశ్ పై మాకు పూర్తి నమ్మకం లేదు’ అని దాద్రి ప్రాంతానికి చెందిన రైతు కిషన్‌సింగ్ చౌదరి అన్నారు. ఆ ఎత్తుగడ.. రెండువైపులా పదునున్న కత్తి! ముస్లిం ఓట్లు కీలకమైన ముజఫర్‌నగర్ డివిజన్ లో ఎస్పీ ఒక్క ముస్లింను కూడా బరిలోకి దింపలేదు. ముస్లిం ఓట్లు ఎటూ తమకే దక్కుతాయన్న అంచనాతో హిందూ ఓట్ల చీలిక కోసం ఈ వ్యూ హం పన్నింది. ఇది సీట్లు ఆశించిన ముస్లిం నేతల అసంతృప్తికి కారణమైంది. మరోవైపు ఇదే అదునుగా మాయావతి ఏకంగా 17 మంది ముస్లింలను బరిలోకి దించింది. దాంతో బీజేపీని ఎదుర్కొనేందుకు గంపగుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలనుకున్న ముస్లింల మధ్య అయోమయం నెలకొంది. ‘మేము ఈ ఎన్నికలలో ఎస్పీకి మద్దతు ఇ వ్వాలనే భావించాం. కానీ ఎస్పీ మా మనోభావాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో మాకింకా స్పష్టత రాలేదు’ ముజఫర్‌నగర్ వాసి ఫరీద్ అన్నారు. ఇతరులను దువ్వేద్దాం! ఇక పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతంగా ఉన్నప్పటికీ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. గత ఎన్నికల్లోనూ ఒక్క సీటు ఇవ్వని బీజేపీ 76 స్థానాల్లో 66 స్థానాలనుగెలిచింది. కేవలం తనకున్న హిందుత్వ బలం, సంక్షేమ కార్యక్రమాలనే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ ప్రస్తుతం జాట్ల చీలికపై దృష్టి పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్ జ్ఞాపకార్థం ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్ అటు రైతు నేతలు, ఇటు జాట్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఎస్పీ–ఆర్ఎల్డీ పొత్తుల నేపథ్యంలో జాట్ వర్గం గంపగుత్తగా అఖిలేశ్ అండ్ కో వైపునకు వెళ్లకుండా జాట్ నేతలతో కేంద్ర హోమంత్రి అమిత్ షా జనవరి 26న కీలక సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌సింగ్ వర్మ ఇంట్లో 200 మంది పశ్చిమ యూపీకి చెందిన జాట్ నేతలతో నిర్వహించిన భేటీకి హాజరైన అమిత్ షా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆర్ఎల్డీ పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, అవసరమైతే ఎన్నికల తరువాత పొత్తుకు సిద్దమన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ప్లాన్–బి కింద బీజేపీ పశ్చిమ యూపీలో అధికంగా ఉండే షైనీలు, పాల్లు, కశ్యప్‌లు, ప్రజాపతిల ఓట్లను అభివృధ్ధి మంత్రంతో ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ‘జాట్లు మాత్రమే కాదు. ఇంకా మావి చాలా కులాలు ఉన్నాయి. మేను కూడా గెలుపోటములు నిర్ణయించగలము’అని భాగ్‌పట్ మార్కెట్లో టీ దుకాణం నడుపుతున్న శంకర్ లాల్ అన్నారు. -
బీఎస్పీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రుద్రవరం సునీల్
సాక్షి, హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థి రుద్రవరం సునీల్ నియమితులయ్యారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో– ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. రుద్రవరం సునీల్ సామాజిక ఉద్యమాలు, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన కోసం నిర్మాణాత్మక కార్యక్రమాలతో ముందుకు సాగుతానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. అణగారిన వర్గాలను సమీకరిస్తూ.. గ్రేటర్లో బీఎస్సీ బలోపేతానికి చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరిస్తానన్నారు. బీఎస్సీ రాష్ట్ర చీఫ్ కో– ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్: గ్రేటర్ జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే.. ముగ్గురూ ముగ్గురే..) -
Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!
మాయావతి గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణం కావొచ్చు’’ ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓ వైపు పార్టీల్లో చేరికలు, మరోవైపు నేతల మాటల యుధ్ధాలు, ఇంకోవైపును ప్రజలను ఆకట్టుకునేలా ప్రకటిస్తున్న హామీలతో ఎన్నికల కోలాహలం పెరిగినా.. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఎక్కడా పెద్దగా కనబడకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిధ్దమవుతుండగా, పార్టీ ప్రచారాలకు మాయావతి గైర్హాజరు అవుతుండటం, పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా, ఆమె మౌనం వీడకపోవడం పార్టీ క్రియాశీలక నేతలకు అంతుపట్టకుండా మారుతోంది. మాయావతి మౌనం నేపథ్యంలో ఆమెకు తొలినుంచి అండగా ఉంటూ వస్తున్న దళితవర్గాలు బీజేపీ, ఎస్పీ వైపుకు చూస్తుండటం ఆ పార్టీల గెలుపోటములను నిర్దేశించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ‘మాయ’ పనిచేయట్లేదా! బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగుమార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గానూ 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టు ఉంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకుపోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓటినప్పటికీ ఆమె వచ్చిన 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు. 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం19.3 శాతం ఓట్లనే రాబట్టుకుంది. అప్పటినుంచి పార్టీ కార్య్రమాలపై పెద్దగా ఆసక్తి చూపని మాయావతి ట్విట్టర్ ద్వారా మాత్రమే రాజకీయ సమస్యలపై గొంతు విప్పుతూ వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో దళితులు కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే మాయావతి మాత్రం పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ వర్గాలన్నీ పక్క పార్టీలకు మళ్లాయి. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో బీఎస్పీకి దళితులు దూరమయ్యారు. ఇదీగాక మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ కులాల భద్రత, నివాసం, ఉపాధికి పెద్దగా చేసిందేమీ లేదని, దళితులపై జరిగిన అఘాయిత్యాలను ఆపడంలో విఫలమయ్యారని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఎస్సీ వర్గాల్లో మాయావతి ప్రభ తగ్గిందని, అదీగాక ఆమె గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: (రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..) ఎవరికి కలిసొస్తుందో... ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ బలహీనంగా కనబడుతుండటంతో దళిత వర్గానికి చెందిన నేతలతో పాటు పార్టీలో పలుకుబడి గల నేతలను ఆకర్షించేందుకు బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి.ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ విభిన్న సంక్షేమ పథకాలను ముందుపెట్టి దళిత ఓట్లను ఆకర్షించడంతో పాటు వారిని హిందూత్వ గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2017 ఎన్నికల్లో 84 ఎస్సీ నియోజకవర్గాలకు గానూ బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. తిరిగి అదే స్థాయి సీట్లను రాబట్టుకునేందుకు దళిత కులాలన్నింటినీ కలుపుకుపోయే ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 75 జిల్లాల్లో దళితుల అభ్యున్నతికై నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు పార్టీకి అదనపు బలం చేకూర్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు తన ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయనని, ఎస్సీ మేధావుల సమావేశాల్లో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఓటర్ల సమీకరణ కోసం దళిత నాయకులను స్వాతగించిన అఖిలేశ్, వారిని రిజర్వ్డ్ స్థానాల్లో నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ ప్రభుత్వోద్యోగులను సంతోషపెట్టడానికి తిరిగి అధికారంలోకి వస్తే, ఎస్సీ అధికారులే తన ప్రభుత్వాన్ని నడిపిస్తానని అనేకసార్లు ప్రైవేట్ సమావేశాలలో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది బీఎస్పీ పార్టీ, ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు... ఎస్పీలో చేరిపోయారు. వారిలో ఇంద్రజీత్ సరోజ్ కౌశాంబి, డాక్టర్ కేకే గౌతమ్, మిథాయ్లాల్ భారతి, త్రిభువన్ దత్తా, మహేష్ ఆర్య, సర్వేశ్ అంబేద్కర్, వీర్ సింగ్ జాతవ్, తిలక్ చంద్ర అహిర్వార్, ఫెరాన్ లాల్ అహిర్వార్, అనిల్ అహిర్వార్, విద్యా చౌదరి, రమేష్ గౌతమ్, యోగేష్ వర్మ వంటి వారున్నారు. గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన సీట్లు, ఓట్లు.. ఎన్నికలు గెలిచిన సీట్లు ఓట్ల శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 -
సమాజ్‌వాదీ పార్టీలోకి ఏడుగురు ఎమ్మెల్యేలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీతోపాటు బహుజన సమాజ్ పార్టీకి(బీఎస్పీ) చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే, బీఎస్పీ నుంచి ఆరుగురు బహిష్కృత ఎమ్మెల్యేలు శనివారం మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ తమ పార్టీలో చేరారని, మరికొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు అస్లాం రైనీ, సుష్మా పటేల్, అస్లాం అలీ, హకీంలాల్ బింద్, ముజ్తబా సిద్దిఖీ, హరగోవింద్ భార్గవ ఎస్పీలో చేరారు. -
యూపీలో బాలికపై ఐదేళ్ల పాటు అత్యాచారం..
లలిత్పూర్: ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో లలిత్పూర్ జిల్లా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు తిలక్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) దీపక్ అహిర్వార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. తనపై ఐదేళ్లపాటు అత్యాచారం చేశారంటూ బాధితురాలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు సహా మొత్తం 25 మందిపై ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 12న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో బాలిక తండ్రి, మామ కూడా ఉన్నారు. శుక్రవారం మీర్జాపూర్లో తిలక్ యాదవ్, దీపక్ అహిర్వార్‌తో పాటు మహేంద్ర దూబే అనే ఇంజనీర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో తమ పార్టీ నేత అరెస్టు కావడంతో సమాజ్‌వాదీ పార్టీ లలిత్పూర్ జిల్లా పార్టీ యూనిట్‌ను రద్దు చేసింది. -
‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: ప్రజలు స్వచ్ఛందంగా లంచం ఇస్తే తీసుకోవాలనే గానీ, బలవంతంగా వసూలు చేయడం తగదంటూ అధికారులకు ఓ ఎమ్మెల్యే చెప్పడం వివాదాస్పదంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ఎమ్మెల్యే రాంబాయి సింగ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దామోహ్ జిల్లా పథారియా నియోజకవర్గం సతావువా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాయి పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధి పొందేందుకు తా చదవండి: నిజం కోసమే నా పోరాటం: నవజోత్ సింగ్ సిద్ధూ దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ... తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని వారికి సూచించారు. ప్రజలు రూ.500, రూ.1,000.. ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ, వారివద్ద ఉన్నదంతా లాగేసుకోవాలని చూడటం తగదని హితవు పలికారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపించి, లంచం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని దామోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య చెప్పారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాంబాయి సింగ్ సమర్థించుకున్నారు. సతావువా గ్రామ నిరుపేదలు ఎంత కష్టపడినా నెలకు రూ.6వేలు సంపాదించడం కష్టమని తెలిపారు. అటువంటి వారు ఎంతిచ్చినా తీసుకోవాలే గానీ రూ.10 వేల చొప్పున బలవంతంగా రాబట్టాలని చూడటం తగదని తాను చెప్పానన్నారు. చదవండి: పళ్లు ఊడిపోయాయని ఏకంగా ప్రధాని మోదీకే లెటర్, వైరల్ म.प्र: दमोह जिले के पथरिया की महिला विधायक रामबाई का यह वीडियो इस समय वायरल हो रहा है। रामबाई वही हैं जिनके पति पर हत्या का आरोप है। समय-समय पर उनके अपने क्षेत्र के लोगों की समस्या के निराकरण के दौरान उऩके संवादों के वीडियो वायरल होते रहते हैं #ViralVideo pic.twitter.com/TAcb6x65FT — Hindustan (@Live_Hindustan) September 28, 2021 -
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరపాలి
లక్డీకాపూల్ (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలకు గణన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జనగణనకు ఏర్పాటు చేసిన ఐక్య సదస్సు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ డేటా తన దగ్గర ఉంచుకుని కులం ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన అధికారులను ఎంతమందిని పెట్టుకున్నారో పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఖరి తేటతెల్లమవుతుందన్నారు. చివరికి కాళేశ్వరంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఎవ్వరూ లేరని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్ అంటే అందరి వాడని, కొందరి వాడు కాదన్నారు. గ్రామాల్లో ప్రతి ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ జన గణన కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అనిల్, శారద, కృçష్ణుడు, రియాజ్, నాగరాజు పాల్గొన్నారు. -
బీఎస్పీ తదుపరి చీఫ్ దళిత వర్గం నుంచే..
లక్నో: ‘నేనిప్పుడు ఫిట్‌గానే ఉన్నాను. అన్‌ఫిట్‌గా మారడానికి ఇంకా చాలా సంవత్సాలు పడుతుంది. కాబట్టి నా తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తిని ఇప్పుడే ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు దళిత వర్గం నుంచే ఎంపిక ఉంటుంది’ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ సతీశ్ మిశ్రా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా కరోనా ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడలేదని ఆమె అన్నారు. ఆరోగ్యం సహకరించనప్పుడే పార్టీ పగ్గాలను వేరేవారికి అప్పగిస్తానని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో పార్టీతో ఉన్న వారికే ఆ అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. బీఎస్పీ స్థాపకుడు కాన్షీరాం కూడా తన ఆరోగ్యం క్షీణించాకే తదుపరి చీఫ్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 24 పేజీల బుక్లెట్ గురించి ఆమె స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తమ ర్యాలీలకు, సమావేశాలకు డబ్బు, ఆహారం ఎరగా వేసి ప్రజలను రప్పిస్తుందని విమర్శించారు. ప్రజల మద్దతును కాంగ్రెస్ కోల్పోయిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో క్యాంపెయిన్‌కోసం పారిశ్రామి కవేత్తలపై ఆధారపడుతోందని, కానీ బీఎస్పీ మాత్రం ఆర్థికంగా స్థితిమంతులు కాని వారికి కూడా టికెట్లు ఇస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌లా తమ పార్టీ పెట్టుబడిదారుల పార్టీ కాదని పేదలు, అణగారిన వారి పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ వ్యవహరించే రెండు నాల్కల ధోరణి వల్లే ఆ పార్టీకి ఈ గతి పట్టిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లు వ్యాఖ్యానించారు. -
ఏనుగెక్కి ప్రగతి భవన్ పోవాలె..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మనం ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోవాలి. ఎర్రకోటపై మన నీలి జెండా (బీఎస్పీ జెండా)ను ఎగురవేయాలి’ అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బహుజనులకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి ఖర్చు చేయనున్న రూ. 1,000 కోట్లు ఎవరి పైసలని ప్రశ్నించారు. దళితులపై సీఎంకు నిజమైన ప్రేమే ఉంటే ఆయన సొంత ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఎన్.జి. కాలేజీ మైదానంలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ఆయనకు రాంజీ గౌతమ్ బీఎస్పీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. అలాగే ఆయన్ను బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా ప్రకటించారు. సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తన రాజకీయ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఆదివారం నల్లగొండలో జరిగిన రాజ్యాధికార సంకల్ప సభకు హాజరైన అశేష జనవాహిని మీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా... ‘ఈ సభను చూస్తుంటే దొరల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి భవన్ చాలా దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. బహుజనులు బానిసలు కాదు.. పాలకులుగా మార్చాలన్న బాధ్యతను నాపై పెట్టారు. మీ అందరి కోసమే ఆరున్నర ఏళ్ల సర్వీసు ఉన్నా రాజీనామా చేసి వచ్చా. లక్షల మంది బహుజనుల బతుకులు మార్చాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉందని అమ్మకు చెప్పా. రెక్కాడితే కానీ డొక్కాడని, ఆకలైతే అన్నం దొరకని కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ న్యాయం చేయాలి.. వారి గొంతుకను కావాలని చెప్పి వచ్చా. కొట్లాడి, 1,300 మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పాదాభివందనం చేశా. మేం కష్టపడి త్యాగాలు చేస్తే అధికారం మరొకరు చెలాయిస్తున్నారు. పంతం నెగ్గే వరకు వదలొద్దని అమరులు నాకు చెప్పి పంపించారు. గొప్పగా బహుజన రాజ్యం... జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా ఇవ్వాలి. ఇవ్వకపోతే గుంజుకుంటాం. మీరు గ్రామాలకు వెళ్లి మన బహుజన రాజ్యం ఎంత గొప్పగా ఉండబోతోందో మన వారికి చెప్పండి. బహుజన రాజ్యంలో అన్ని కులాల వారికీ సమాన అధికారం ఉంటుంది. లక్షల మంది అమెరికాకు వెళతారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. కల్లుగీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లుగా ఉంటారు. మైనారిటీలు మిలియనీర్లు అవుతారు. మాల మాదిగలు డాలర్లు సంపాదిస్తారు. బంజారా బిడ్డలు బంగళాలు కొంటరు. గిరిజన బిడ్డలు విదేశాలకు వెళతారు. రాళ్లు గొట్టిన వారు రాకెట్ ప్రయోగిస్తారు. చిందు కళాకారుల బిడ్డలు సినిమా రంగంలోకి వెళ్తారు. మన పిల్లలు కంపెనీలు పెట్టి సంపదను సృష్టించి, ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు రావాలి. అవి సాధించే వరకు నిద్రపోను. బహుజన రాజ్యం మీరంతా తలచుకుంటే వస్తుంది. తరతరాలుగా మనల్ని దోపిడీ చేసి సంపాదించిన ఆధిపత్య కులాల వారు రకరకాల పథకాలు, కుట్రల ద్వారా ఆ సొమ్మును మనపై చల్లుతారు. ఓటును అమ్ముకోవద్దు. నల్లగొండ సభ రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను మార్పు చేసే అవకాశం ఉంది. మీ ఆస్తులమ్మి ‘దళితబంధు’ ఇవ్వండి సీఎం కేసీఆర్ ‘దళితబంధు’కు రూ. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవి ఎవరి పైసలు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కష్టపడిన సొమ్ము కాదా? వాటిని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మాపై నిజమైన ప్రేమే ఉంటే మీ ఆస్తులు అమ్మి మాకు పెట్టండి. మా భవిష్యత్ మేమే నిర్ణయించుకునేలా చేయండి. 1,000 గురుకులాలు పెడితే మారిపోతుందా? అందులో చదివేది 4 లక్షల మందే. ఈ కొద్దిమంది చదివితే బంగారు తెలంగాణ అన్నట్టా? రాష్ట్రంలో వేల సంఖ్యలో పాఠశాలల ఉన్నాయి. సీఎం ఎన్నిసార్లు రివ్యూ చేశారు. వారికి ఏం ఒరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు 61.70 లక్షల మంది స్కూళ్లలో చదువుకుంటున్నారు. వాటిల్లోకి సీఎం ఎందుకు పోవడం లేదు? ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో వసతుల్లేవు. నియామకాలు లేవు. బడ్జెట్ ప్రకటనే కానీ నిధుల విడుదల ఏదీ? పేదల బిడ్డలు చదివే విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇచ్చారు. మాటల గారడీతో ప్రజలు ఏడున్నర ఏళ్లుగా మోసపోతున్నారు. ఇలాంటి వాటికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. అది నల్లగొండ నుంచే మొదలైంది. మీరే అపరజ్ఞానులా? సంపద 5 శాతం మంది చేతిలో ఉంటే 95 శాతం మంది పేదలే. 46 మందికి భారతరత్న వస్తే ఒక్కరే ఓబీసీ ఉన్నారు. దళితులు, బహుజనులు లేరు. 52 శాతం మంది ఓబీసీల్లో అర్హులే లేరా. మాకు చేతగాదా.. మీరే అపరజ్ఞానులా. 60 వేల బుక్కులు చదివారా? 11 మంది సీఎంలు అయ్యారు. అందులో పది మంది ఆధిపత్య కులాల వారే. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. -
బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్!?
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరతారన్న చర్చ ఊపందుకుంటోంది. స్థానిక మీడియాతోపాటు జాతీయ చానళ్లలోనూ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. బీఎస్పీ జాతీయస్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, అందులో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం పలువురు స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్‌మీడియాలో సందేశాలు వైరల్‌గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఎస్పీలో చేరాలా? లేదా స్వతంత్ర వేదిక ఏర్పాటు చేయాలా? అనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నిలుస్తామని స్వేరో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీడిత వర్గాలకు ఏకవచన సంబోధనా: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అగ్రవర్ణాల నాయకులను గారు అని సంబోధించి, పీడితవర్గాల నాయకులను ఏకవచనంతో సంబోధించారంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన దళిత సాధికారికత సమావేశంలో వేదికపైకి హుజూరాబాద్ నాయకులకు స్వాగతం పలుకుతూ కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్‌చేశారు. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌశిక్‌రెడ్డి కూడా ట్వీట్చేస్తూ.. ఎడిట్ చేసిన వీడియోను చూసి విమర్శలు చేయడం మీ స్థాయికి తగదని బదులిచ్చారు. త్వరలోనే రాజకీయ కార్యాచరణ భానుపురి(సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్వరలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి గౌరవిస్తున్నారని, కానీ, ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్లు ఆపి అగౌరవ పర్చుతున్నారన్నారు. -
BSP: మాయావతి కీలక నిర్ణయం
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయత్ ఎన్నికల్లో తాము పోటీచేయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నామని, అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాయావతి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నానన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘ఉత్తర్‌ప్రదేశ్ రక్షణే ధ్యేయం’’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గాలపై దృష్టి సారించి, కేడర్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాయావతి వెల్లడించారు. నిజానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే పోటీ చేసే విషయం గురించి ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా మాయావతి నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీకి సహకరించేందుకే మాయావతి పంచాయత్ ఎన్నికల బరిలో నిలవడం లేదని ఆరోపించింది. ఈ మేరకు... యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ ట్విటర్ వేదికగా... ‘‘బీజేపీకి ఎప్పుడు సాయం కావాలన్నా మాయావతి ఈ విధంగా ఎన్నికల నుంచి తప్పుకొంటూ ఉంటారు. జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయం అన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందినదే’’ అని విమర్శించారు. ఇందుకు స్పందనగా... బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లా పంచాయతీ సభ్యులు చచ్చినట్లు తమ పార్టీలో చేరతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి బదులిచ్చారు. కాగా జూలై 3న యూపీలో జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా... ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 3 వేల మంది సభ్యులు జిల్లా పంచాయతీ చీఫ్‌లను ఎన్నుకోనున్నారు. చదవండి: ఎంఐఎంతో పొత్తుండదని మాయావతి స్పష్టీకరణ -
యూపీలో ఒంటరిగానే పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుండదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ప్రకటించారు. అదేవిధంగా, యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు ట్వీట్లు చేశారు. ‘రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, అసదుద్దీన్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేస్తుందంటూ ఓ టీవీ చానెల్లో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదు. వాస్తవాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. బీఎస్పీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది’అని పేర్కొన్నారు. పంజాబ్‌ను మినహాయిస్తే, యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోము’అని మాయావతి స్పష్టం చేశారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌తో ఇటీవల బీఎస్పీ జత్తు కట్టిన విషయం తెలిసిందే. యూపీలో 100 స్థానాల్లో పోటీ: ఎంఐఎం వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆలిండియా మజ్లిస్–ఇ– ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), చిన్న పార్టీల కూటమి అయిన భాగీదారీ సంకల్ప్ మోర్చాతో కలిసి బరిలోకి దిగుతామన్నారు. ఎన్నికలకు సంబంధించి మరే ఇతర పార్టీలతోనూ తాము చర్చలు జరపలేదన్నారు. -
అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి
లక్నో: త్వరలో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులును ఓడించడానికి కృషి చేస్తామని.. అందుకు అవసరమైతే బీజేపీకి కూడా ఓటు వేస్తామంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన ప్రకటన చేశారు. గతేడాది సార్వత్రి ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న వీరు తర్వత బద్ధ శత్రువులుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. ఈ క్రమంలోనే మాయావతి బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఇక 1995 జూన్ 2 కేసును విత్‌డ్రా చేసుకోవడం తన జీవితంలో పెద్ద తప్పిదంగా వర్ణించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. అవసరమైతే బీజేపీకి ఓటు వేయడానికి కూడా సిద్ధం. లేదంటే మరో పార్టీకి. దీన్ని కచ్చితంగా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం’ అంటూ మాయావతి సంచలన ప్రకటన చేశారు. (చదవండి: ప్రియాంకపై మాయావతి ఫైర్) 1995 జూన్ 2 కేసును తాము వెనక్కి తీసుకుని చాలా పెద్ద తప్పు చేశామని, వారితో చేతులు కలపకపోతే బాగుండేదని మాయావతి పేర్కొన్నారు. ఎస్పీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో దిగాలని డిసైడ్ అయినప్పటి నుంచి తమ పార్టీ కార్యకర్తలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ఇలా చేతులు కలిపిన మొదటి రోజు నుంచే 1995 లో సమాజ్‌వాదీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని నేతలు తమపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారని ఆమె వెల్లడించారు. ఆ కేసును వెనక్కి తీసుకొని తాము పెద్ద తప్పే చేశామని మాయావతి వ్యాఖ్యానించారు. (చదవండి: బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై! ) ఇక యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మాయావతి ఈ సచంలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్‌జీ గౌతమ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రిటర్నింగ్ అధికారిని కలిసిన కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కలుసుకునేందుకు ఆయన పార్టీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాయావతి పై ప్రకటన చేశారు. -
రాజస్తాన్ సంక్షోభం : గహ్లోత్‌కు ఊరట
జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు స్వల్ప ఊరట. రాజస్తాన్‌లో బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ–కాంగ్రెస్ విలీనం కేసు మళ్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ముందుకే రానుంది. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా పరిగణించడంపై స్టే విధించేందుకు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. బీఎస్పీ తరఫున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్, బీఎస్పీ జాతీయ కార్యదర్శి సతీశ్ మిశ్రా వేసిన పిటిషన్లను జస్టిస్ మహేంద్రకుమార్ గోయెల్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం జూలై 30వ తేదీన విచారించింది. ఈ మేరకు స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం..ఆగస్టు 11వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సభ్యులుగా సభలో చలామణి కావడంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ ఆదేశాలపై బీజేపీ, బీఎస్పీ నేతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై డివిజన్ బెంచ్.. స్పీకర్‌కు బుధవారం నోటీసులు జారీ చేయగా ఎలాంటి సమాధానమూ రాలేదు. ఈ విషయమై స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. బీజేపీ, బీఎస్పీ నేతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడం చెల్లదన్నారు. ఎమ్మెల్యేల నోటీసులు అందుకోవడానికి అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం పోస్టాఫీసు కాదని సిబల్ పేర్కొన్నారు. ఆ నోటీసులను జైసల్మీర్ జిల్లా జడ్జి ద్వారా జారీ చేయాలని, జైసల్మీర్, బార్మెర్ జిల్లాల రెండు పత్రికల్లో ప్రచురించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు!
జైపూర్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. రాజస్తాన్‌లో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత తాము అధికార పార్టీలో చేరుతున్నట్లు రాజేంద్ర గడ్, జోగేంద్ర సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్‌చంద్ ఖేరియా....శాసనసభ స్పీకర్ సీపీ జోషికి లేఖ రాశారు. ఈ సందర్భంగా రాజేంద్ర గడ్ మాట్లాడుతూ...‘మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండటంలో... రాష్ట్రాభివృద్ధిలో మా వంతు పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నాం. అశోక్ జీ అత్యుత్తమ ముఖ్యమంత్రి. రాజస్తాన్‌ను ఆయన కంటే గొప్పగా పాలించే సీఎం మరెవరూ లేరు. బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు తెలిపే బదులు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం అని పేర్కొన్నారు.(చదవండి : కశ్మీర్ పర్యటన; కాంగ్రెస్‌పై మాయావతి ఫైర్!) కాగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరుగురు బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గతేడాది మార్చిలో 12 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడింది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనను సమర్థిస్తూ నరేంద్ర మోదీ సర్కారు తెచ్చిన బిల్లును మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ సమర్థించిన విషయం విదితమే. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్షాల బృందం కశ్మీర్ పర్యటనకు వెళ్లడాన్ని మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమెకు షాకిచ్చారు. కాగా ఈ అనూహ్య పరిమాణంపై మాయావతి ట్విటర్లో స్పందిస్తూ.. మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మరోసారి విశ్వాసఘాతక పార్టీగా నిరూపించుకుందని మండిపడ్డారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బేషరతుగా మద్దతు తెలిపిన మా పార్టీని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయాల్సింది పోయి.. మద్దతిచ్చిన వారికి హాని కలిగించడంపైనే కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. -
అఙ్ఞాతం వీడి కోర్టులో లొంగిపోయిన ఎంపీ!
లక్నో : అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ శనివారం లొంగిపోయారు. అతుల్ రాయ్ మద్దతుదారులు, పార్టీ శ్రేణులు వెంటరాగా పోలీసులు ఆయనను వారణాసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా అతుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ కాలేజీ విద్యార్థిని ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఘోసి నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ సంపాదించిన ఆయన మే1 నుంచి కనిపించకుండా పోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకున్న దశలో ఇలాంటి పరిణామం ఎదురుకావడంతో అతుల్ తరఫున పార్టీ శ్రేణులే ప్రచారం నిర్వహించాయి. ఇందులో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఆయనను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ పన్నిన కుట్రలో అతుల్ ఇరుక్కున్నారని, ఆయనకు కచ్చితంగా ఓటు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మే 23న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అతుల్ రాయ్ విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి కూడా అఙ్ఞాతంలో గడిపారు. అతుల్ మలేషియాలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఆయన అరెస్టుకై పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అయితే తాను కోర్టులో ఎదుటే లొంగిపోతానంటూ అతుల్ విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఎంపీగా ఎన్నికైన ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే లొంగిపోవడం గమనార్హం. -
స్వీటు బాక్సులో గన్ పెట్టుకుని వచ్చి..
లక్నో : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఆమేథీ ఎంపీ స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత ఘటన మరువక ముందే బీఎస్పీ, ఎస్పీ నేతల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నాయకుడు హజీ అహ్సన్(55), ఆయన మేనల్లుడు తమ ఆఫీసులోనే దారుణ హత్యకు గురయ్యారు. స్వీటు బాక్సులో తుపాకీ పెట్టుకుని లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు హజీని అతి సమీపం నుంచి కాల్చారు. ఈ క్రమంలో హజీని కాపాడేందుకు ప్రయత్నించిన అతడి మేనల్లుడు కూడా వారి తూటాలకు బలయ్యాడు. ఈ ఘటన బిజ్నూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ..‘ ఈ హత్యల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నాం. హజీని అభినందించాలంటూ స్వీటు బాక్సుతో ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్లగా ముగ్గురు బయట కాపుకాశారు. పథకం ప్రకారమే హజీని హత్య చేశారు. నిందితులకు మృతులతో వ్యక్తిగత కక్షలేమీ లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుపై లోతుగా విచారణ జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు. కాగా బీజేపీ నేత స్మృతి ఇరానీ అనుచరుడు సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి దుండగులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అదే విధంగా సోమవారం సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా బీఎస్పీ నాయకుడిపై కాల్పులు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
పూర్వాంచల్‌లో ఎవరిది విజయం?
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ఫలితాలను పూర్వాంచల్‌గా పిలిచే తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఎన్నికలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ ప్రాంతంలో 27 సీట్లు ఉండగా 2014 ఎన్నికల్లో బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్‌ను కలుపుకొని 26 సీట్లను గెలుచుకుంది. కనీసం పది సీట్లలో బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై 20 శాతం అధిక ఓట్లతో విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 36 శాతం ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తంగా 71 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు పూర్వాంచల్‌లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ. బద్ద వైరులైన ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపి మహా కూటమిగా పోటీ చేయడమే అందుకు కారణం. గత ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ రెండు పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతం మొత్తం బీజేపీకన్నా ఎక్కువ. గత ఎన్నికల్లో మొత్తంగా బీజేపీకి 42.23 శాతం ఓట్లు రాగా, ఎస్పీకి 20.82 శాతం, బీఎస్పీకి 26.25 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండింటి ఓట్ల శాతాన్ని కలిపితే దాదాపు 47 శాతానికిపైగా ఓట్లు, అంటే బీజేపీకన్నా దాదాపు ఐదు శాతం ఓట్లు ఎక్కువ. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి అనుకూల పవనాలు పెరిగితే సాధారణంగా బీజేపీకే ఓట్ల శాతం పెరిగి, ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమికి ఓట్ల శాతం తక్కువవుతాయి. అయితే అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రంతోపాటు దేశంలో గ్రామీణ ఆదాయం బాగా తగ్గిపోవడం, వేతనాలు పడిపోవడం, మున్నెన్నడులేని విధంగా నిరుద్యోగం పెరిగిపోవడం, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారులు నష్టపోవడం, లక్షల సంఖ్యలో కార్మికులు రోడ్డున పడడం, అభివద్ధి కార్యక్రమాలు అంతంత మాతంగానే విజయం సాధించడం ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రధాన కారణాలు. ఇక మోదీ వ్యక్తిగత ప్రతిష్ట, హిందూత్వ జాతీయ వాదం ఎంతమేరకు పనిచేస్తాయో చెప్పలేం! -
అత్యాచార కేసు; ఆయనను గెలిపించాల్సిందే!
లక్నో : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో బీఎస్పీకి చెందిన ఎంపీ అభ్యర్థి అతుల్ రాయ్ మిస్సయ్యారు. తనపై అత్యాచార కేసు నమోదైన నాటి నుంచి ఆయన అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలే ఆయన తరఫున ప్రచార సభలు నిర్వహిస్తూ.. అతుల్ రాయ్‌ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యూపీలో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ కూటమి సీట్ల పంపకంలో భాగంగా ఘోసి నియోకవర్గ ఎంపీ టికెట్‌ను బీఎస్పీ నేత అతుల్ రాయ్ దక్కించుకున్నారు. అయితే అతుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ కాలేజీ విద్యార్థిని ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మే1 నుంచి అతుల్ కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో అతుల్ తరఫున పార్టీ శ్రేణులే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నాటి కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. అతుల్ రాయ్‌ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కార్యకర్తకు ఉందన్నారు. బీజేపీ పన్నిన కుట్రలో అతుల్ ఇరుక్కున్నారని, ఆయనకు కచ్చితంగా ఓటు వేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. కాగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతుల్ మలేషియాకు పారిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక మే 23 వరకు అతుల్ అరెస్టును వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అతడి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మే 17న అతుల్ అభ్యర్థనపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది. కాగా సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌లో భాగంగా ఘోసిలో మే 19న ఎన్నికలు జరుగున్ను సంగతి తెలిసిందే. -
ముస్లింలకు మాయావతి ఓపెన్ అప్పీల్!
సాక్షి, దియోబంద్ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలకు బహిరంగంగా అప్పీల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. ముస్లిం ఓట్ల చీలికకు కారణం కావొద్దని, బీజేపీని ఎస్పీ, బీఎస్పీ నేతృత్వంలోని మహాకూటమి మాత్రమే ఓడించగలదని, కాబట్టి మహాకూటమికే ముస్లింలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. దియోబంద్‌లో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఉమ్మడిగా నిర్వహించిన ర్యాలీలో మాయావతి ఈ మేరకు ముస్లింలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీలో మాయావతితోపాటు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆరెల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ‘ముస్లింలకు నేను బహిరంగంగా పిలుపునిస్తున్నాను. బీజేపీని కాంగ్రెస్ కాదు మహాకూటమి మాత్రమే ఓడించగలదు. మహాకూటమి గెలువకూడదని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సహకరించేందుకు ప్రయత్నిస్తోంది’ అని మాయావతి మండిపడ్డారు. సహరాన్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘మొదట సహరాన్‌పూర్‌లో మేం ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాం. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ముస్లిం అభ్యర్థినే నిలబెట్టింది. మా కూటమికే వచ్చే ఓట్లను తగ్గించడానికే కాంగ్రెస్ ఇలా చేస్తోంది’ అని ఆమె మండిపడ్డారు. -
తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేస్తాం: మాయావతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని బలోపేతం చేస్తా మని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఆపార్టీ జాతీ య అధ్యక్షురాలు మాయావతి అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో తెలంగాణ బహుజన జనసేన యుద్ధభేరీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఎస్పీ ని బలోపేతం చేసే దిశగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులను నిలబెట్టిన ట్లు తెలిపారు. తమది కుటుంబ పాలన కాద ని, నిజమైన సామాజిక న్యాయం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో నూ అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు. చుక్కలు చూపేవాణ్ణి మాయావతి ప్రసంగం అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపేవాడిన న్నారు. ఆంధ్రా పాలకులు వేరు ఆంధ్రా ప్రజ లు వేరని తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌లాంటి వ్యక్తులకు విన్నవించిన విషయం గుర్తుచేశారు. తెలంగాణ వచ్చినందుకు ఆనందించిన వ్యక్తుల్లో తానే మొట్టమొదటి వ్యక్తినన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎంని చేస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్‌ను తిట్టిన తలసాని, ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి వ్యక్తులు నేడు అదేపార్టీలో చేరారని, అలాంటి వ్యక్తులు వారికోసం మాత్రమే పనిచేస్తారు తప్ప ప్రజలకోసం కాదని విమర్శించారు. మోదీ రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయారు సరికొత్త పాలకులు తెరమీదికి వచ్చినప్పుడే సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఏర్పడుతుందని పవన్ అన్నారు. 2014లో చాయ్‌వాలా అంటూ మోదీ ప్రజల ముం దుకు వచ్చినప్పుడు ఆయనలో మార్పును ఆశించానని, ఆయన మాత్రం రాజకీయ నాయకుడిగానే ఉండిపోయాడని తెలిపారు. జీఎస్టీ, నోట్లరద్దు వంటివి ఆందోళన కలిగించాయన్నారు. బహుజనుల సంక్షేమం కోసం పరితపించే మాయావతి లాంటి వ్యక్తి ప్రధా ని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించిన మాన్యశ్రీ కాన్షీరామ్ అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి మాయావతి అని కొనియాడా రు. అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను వేదికపై పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ, జనసేన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
బహుజన కిరణం మాయావతి
సాక్షి, వెబ్ ప్రత్యేకం : దేశంలోనే అత్యధిక లోక్సభస్థానాలున్న మెగా (ఉత్తరప్రదేశ్) రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికై ఖ్యాతికెక్కిన తొలి మహిళ మాయావతి. మూడుస్లారు సీఎంగా తన పాలనా దక్షత, శాంతి భద్రతల పరిరక్షణలో తెగువ చూపించి విపక్షాల ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. తన హయాంలో రాష్ట్రంలో కరుడు గట్టిన నేరస్తులకు ఆమె సింహ స్వప్నం. ముఖ్యంగా 2010లో అయోధ్య తీర్పు సందర్భంగా హై ప్రొఫైల్డ్, మాఫియా డాన్లను సైతం కటకటాల వెనక్కి పంపించారు. 2007లో భూమి ఆక్రమణ కేసులో సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించిన సాహసం ఆమెది. ఆమె ఏది చేసినా సంచలనమే. కోటానుకోట్లు ఖర్చు చేసి నివాస భవనాన్ని నిర్మించుకున్నా, తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక విమానంలో చెప్పులు తెప్పించుకున్నా, గెస్ట్ హౌస్ వివాదాన్ని ధీటుగా ఎదుర్కొన్నా.. కరెన్సీ మాల వేయించుకున్నా.. ప్రాజెక్టుల అమలులో ప్రపంచ బ్యాంకుకే చుక్కలు చూపించినా, ప్రతిపక్షాల విమర్శలకు సైతం వెరవకుండా వేలాది విగ్రహాలను ఏర్పాటు చేసినా ఆమెకు ఆమే సాటి. ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకురాలిగా ప్రస్తుతం దేశ ప్రధానమంత్రి పదవికి పోటీలో వినిపిస్తున్న పేరు మాయావతి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మాయావతి ఐఏఎస్ కావాలనుకుని అధినేత అయ్యారు. చిన్నప్పటినుంచి మాయావతికి ఐఏఎస్ కావాలని కనేవారు. అందుకే మూడు పరీక్షలు ఒకేసారి పాస్ కావాలని భావించి, అధికారులు అనుమతితో 9వ, 10వ ,11 వ తరగతి పరీక్షలను ఒకేసారి విజయవంతంగా పూర్తి చేశారు. అలా మూడేళ్లు జంప్ చేసి 16 ఏళ్ళ వయస్సులో (1972)12వ తరగతి పాసయ్యారు. అనంతరం ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తదనంతర కాలంలో పార్టీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టిన ఆమె రాజకీయ జీవితం నల్లేరు మీద నడకేమీకాదు. ఎంపీగా, డైనమిక్ సీఎంగా మాయావతి తన ప్రాధాన్యతను చాటుకున్నప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఒక దళిత మహిళగా జాతి, కుల వివక్షను ఎదుర్కోక తప్పలేదు. అయినా అనేక అడ్డంకులను, అవమానాలను తోసి రాజన్నారు. 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో 59వ స్థానంలో నిలిచారు. 20017లో న్యూస్ వీక్స్ విజయవంతమైన టాప్ మహిళల్లో ఒకరుగా బరాక్ ఒబామా ఆఫ్ ఇండియాగా మాయావతిని అభివర్ణించడం విశేషం వ్యక్తిగత వివరాలు 1956, జనవరి 15న రాంరాఠి, ప్రభుదాస్ దంపతులకు జన్మించారు. బీఈడీ, అనంతరం లాకోర్సు చదివారు. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలోఢిల్లీలో కొంతకాలం ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. తన తాతాగారు మంగళసేన్ తనకు ఆదర్శమని మాయావతి స్వయంగా చెప్పేవారు. ఆయన చూపించే మానవతా దృక్పథం, కుటుంబంలోని పిల్లలపట్ల ఆడ, మగ అనే వివక్ష లేకుండా సమానంగా చూసే విధానం తనను ప్రభావితం చేసిందనేవారు. రచనలు బహుజన్ సమాజ్ ఔర్ ఉస్కి రాజ్‌నీతి (హిందీ). బహుజన్ సమాజ్ ఔర్ ఉస్కి రాజ్‌నీతి (ఇంగ్లీషు) మేరా సంఘర్ష్ మే జీవన్ అవమ్ బహుజన్ మూమెంట్ కా సఫర్నామా (హిందీ). దీనితోపాటు సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ జమీల్ అక్తర్‘ ఐరన్ లేడీ కుమారి మాయావతి’ అనే పుస్తకాన్ని రాయగా, మరో ప్రఖ్యాత జర్నలిస్టు అజయ్ బోస్ ‘బెహన్జీ’ అనే పొలిటికల్ బయోగ్రఫీని ప్రచురించారు. వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలతోపాటు, తమ పార్టీ వ్యవప్థాపకుడు కాన్షీరాం, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు, మాయావతి ఏర్పాటు చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీం కోర్టు మొట్టికాయలేసింది. మరోవైపు ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చక్కెర మిల్లులను అతి తక్కువ ధరకు అమ్మేశారన్న కేసూ ప్రస్తుతం కోర్టులో ఉంది. అలాగే ఆమె సోదరుడు ఆనంద్ కుమార్ నకిలీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడన్న కేసులు ఎదుర్కొంటున్నారు. - టి. సూర్యకుమారి -
కాంగ్రెస్ కోసం ఎదురుచూడలేం
లక్నో: మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయాన్ని కాంగ్రెస్ తొందరగా తేల్చాలని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ స్పందించకుంటే బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కలిసి పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోబోమని బీఎస్పీ ప్రకటించడం తెల్సిందే. ‘పొత్తు విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కోసం ఇప్పటికే చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఇలా ఎంత కాలం వేచి చూడాలి? అని ప్రశ్నించారు. బీఎస్పీతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్న గోండ్వానా గణతంత్ర పార్టీతో చర్చలు జరుపుతామన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగీతో బీఎస్పీ జట్టు
లక్నో: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కాంగ్రెస్‌కు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో అజిత్ జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జేసీసీ)తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ విషయమై బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నోలో మాట్లాడుతూ.. ‘జేసీసీతో పొత్తు కుదుర్చుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. అజిత్ జోగీ మా కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. మొత్తం సీట్లలో జేసీసీ 55 చోట్ల, బీఎస్పీ 35 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. గౌరవప్రదమైన సీట్లు ఇచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు మాకు అభ్యంతరం లేదు’ అని తెలిపారు. తమ కూటమి బీజేపీని గద్దె దించగలదని ఆమె వ్యాఖ్యానించారు. -
కూటమిపై ఓటమి ప్రభావం ఉండదు: మాయావతి
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో తమ పొత్తు కొనసాగుతుందని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమి పొత్తుపై ఎటువంటి ప్రభావం చూపబోదన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మరింత పట్టుదలతో కలిసి పనిచేస్తామన్నారు. ఇటీవలి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపును అధికార బీజేపీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ కుట్రపన్నిందని ఆరోపించారు. -
కర్ణాటకలో బీఎస్పీతో జేడీఎస్ జట్టు
సాక్షి, బెంగళూరు / న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేస్తామని జనతాదళ్(సెక్యులర్), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు ప్రకటించాయి. ఈ పొత్తు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని జేడీఎస్ నేత డ్యానిష్ అలీ, బీఎస్పీ నేత సతీశ్‌చంద్ర మిశ్రా తెలిపారు. కర్ణాటకలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో(8 రిజర్వ్డ్) బీఎస్పీ పోటీచేస్తుందనీ, మిగిలిన 204 సీట్లలో జేడీఎస్ అభ్యర్థులు పోటీచేస్తారన్నారు. జేడీఎస్, బీఎస్పీ జాతీయ అధ్యక్షులు దేవెగౌడ, మాయావతిలు ఫిబ్రవరి 17న బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారన్నారు.దాదాపు 22 శాతం ఎస్టీ జనాభా ఉన్న కర్ణాటకలో తమ పార్టీకి మంచి పట్టు ఉందని మిశ్రా అన్నారు. -
మాయావతి రాజీనామా ఆమోదం!
న్యూఢిల్లీ: బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజ్యసభ స్వభ్యత్వానికి చేసిన రాజీనామాను పెద్దలసభ గురువారం ఆమోదించింది. మరో ఆరు నెలల్లో ఆమె పదవీకాలం ముగియనుంది. రాజ్యసభలో దళితుల అంశంపై మాట్లాడేందుకు తనకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మాయావతి మంగళవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తేందుకు మాయావతి ప్రయత్నించగా.. సభాపతి అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆమె రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దళితులపట్ల కేంద్రంలోని మోదీ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. ఆమె రాజీనామాను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీల నేతలు కోరారు. అయినా మాయావతి వెనుకకు తగ్గలేదు. మాయావతి రాజీనామా వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అలహాబాద్‌కు సమీపంలోని ఫూల్పూర్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో ఆమె పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: మాయా రాజీనామా.. భారీ వ్యూహం! -
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
బీఎస్పీ అధినేత్రి మాయావతి అనూహ్యంగా తన రాజ్యసభ స్వభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక భారీ రాజకీయ వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో వరుస ఎదురుదెబ్బలతో కాస్తా వెనుకబడినట్టు కనిపించిన ఆమె.. మళ్లీ రాజకీయంగా తన సత్తా ఏమిటో చాటాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఉన్నట్టుండి మాయావతి ఈ ఉగ్రరూపం దాల్చారని లక్నో రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలహాబాద్‌కు సమీపంలోని ఫూల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య రాజీనామా చేస్తే ఈ స్థానంలో ఉప ఎన్నికలు రానున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం మౌర్య తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారు ఆగిపోయారు. ఆరు నెలల్లో ఈ ఇద్దరూ ఎంపీ స్థానాలకు రాజీనామా చేసి.. ఎమ్మెల్యేగా గెలుపొందడం లేదా ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టడం చేయాల్సి ఉంటుంది. మంగళవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమంటూ మాయావతి సంకేతాలు ఇచ్చారు. 'నేను నాలుగుసార్లు సీఎంగా ఉన్నాను. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాను. ఎమ్మెల్యె ఎన్నికల్లో సైతం గెలుపొందాను. అవసరమైనప్పుడే రాజ్యసభకు వచ్చాను' అని ఆమె వివరించారు. నిజానికి ఇటీవల మాయావతి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నది లేదు. 2007లో బీఎస్పీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ ఆమె మండలి సభ్యురాలిగా సీఎం పదవిలో కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2012లో రాజ్యసభకు వచ్చారు. కానీ, ఇప్పుడు మాయావతి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయిస్తే అది పెద్ద రాజకీయ నిర్ణయమే అవుతుంది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఆమె పోటీచేసే అవకాశముంది. ఇదే జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో మహాకూటమికి బీజం పడుతుంది. దేశవ్యాప్తంగా కూడా బీజేపీయేతర ప్రతిపక్షాల ఐక్యతకు ఇది దారితీయొచ్చు. ఇక ఫూల్పూర్ నియోజకవర్గానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యముంది. ఇక్కడి నుంచే దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సహా అనేకమంది ప్రముఖ నేతలు పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గంలో విజయమంటే జాతీయంగా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ దళిత, మైనారిటీ, వెనుకబడిన తరగతుల ఓటర్లు అధికం. కాబట్టి ఇక్కడి నుంచే బీఎస్పీ పునర్వైభవానికి మాయావతి పునాది వేయాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
బీఎస్పీ వ్యూహం ‘దళిత్–ముస్లిం’
-
బీఎస్పీ వ్యూహం ‘దళిత్–ముస్లిం’
దాదాపు సగం సీట్లు ఆ వర్గాలకే.. లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధిక శాతం ఉన్న దళితులు, ముస్లింల ఓటు బ్యాంక్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా దాదాపు సగం సీట్లను ఆయా వర్గాలకు కేటాయించింది. 300 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. ఆదివారం మరో 101 స్థానాల్లో పోటీ చేసే వారి జాబితాను విడుదల చేసింది. ఇందు లోనూ 12 మంది ముస్లింలే కావడం గమ నార్హం. మిగిలిన రెండు స్థానాలను జనరల్ లేదా ఎస్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 403 స్థానాల్లో 97 ముస్లింలకు, 87 దళితులకు కేటాయిం చారు. ముస్లిం ఓటర్లు 20% ఉండటం.. 2012లో వీరు ఎస్పీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఎస్పీలో రగడ నేపథ్యంలో ఇప్పుడు ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని బీఎస్పీ ఎత్తు వేస్తోంది. -
రాజకీయ పార్టీలకు ఈసీఐ కొత్త మార్గదర్శకాలు
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) శనివారం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వ నిధులను పార్టీ పనులకు వినియోగించొద్దని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ స్థలాలను రాజకీయ అవసరాలకు వినియోగించుకోవద్దని పార్టీలకు సూచించింది. కామన్ కాస్ వర్సెస్ బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఎన్నికల కమిషన్ ను కొన్ని వివరాలపై స్పష్టత కోరింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈసీఐ ఈ విషయాలను వెల్లడించింది. ప్రభుత్వ స్థలాలలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల సొమ్మును పార్టీకి ఖర్చు చేయడం, ఎన్నికల గుర్తులు వినియోగించకూడదని పేర్కొంది. లేనిపక్షంలో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లేనని వివరించింది. -
ఆమె వృద్ధురాలు.. ఆయన ఊసరవెళ్లి!
లక్నో: అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియామకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి తేలికచేసి పారేశారు. ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌ను తన సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ యూపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆమె పేర్కొన్నారు. 'కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె వృద్ధురాలు' అని విమర్శించారు. మాయావతి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. షీలా ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు దళితుల అభివృద్ధికి చేసేందేమీ లేదని దుయ్యబట్టారు. ఇక యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాజ్ బబ్బర్ నియామకాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు. తరచూ పార్టీలను మార్చే రాజ్ బబ్బర్ ఒక ఊసరవెళ్లిలాంటి వారని, ఆయనకు ఒక రాజకీయ పార్టీ మీదగానీ, రాజకీయ భావజాలంపైగానీ విశ్వాసం లేదని విమర్శించారు. -
'మాయావతి దళితురాలు కాదు'
'మాయావతి దళిత్ నహీ, దౌలత్ కి బేటీ హై' (మాయావతి దళితురాలు కాదు).. అంటూ సీనియర్ నేత స్వామి ప్రసాద్ మౌర్య మాయావతిపై ధ్వజమెత్తారు. బీఎస్పీ తరఫున ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఎస్పీలో చేరుతారని భావిస్తున్న మౌర్య బీఎస్పీకి రాజీనామా చేసిన సందర్భంగా మాయావతిపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల టికెట్లను ఆమె ఇప్పుడే వేలంలో అమ్మేస్తున్నారని ఆరోపించారు. వెళ్లిపోయాడు.. అదే ఆనందం! మరోవైపు సీనియర్ నేత మౌర్య పార్టీని వీడటంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తనపై చేసిన విమర్శలను కొట్టిపారేశారు. పార్టీని వీడటం ద్వారా మౌర్య బీఎస్పీకి గొప్ప మేలు చేశాడని, ఇది పార్టీకి మేలు చేస్తుందని అన్నారు. మౌర్య తన పిల్లలకు టికెట్లు అడిగాడని, బీఎస్పీ వారసత్వ రాజకీయాలను ఎంతమాత్రం అంగీకరించబోదని, అందుకే అతన్ని పార్టీ నుంచి గెంటేద్దామని అనుకుంటుండగానే.. ఆయనే వెళ్లిపోయాడని ఆమె పేర్కొన్నారు. -
ఖాతా తెరిచిన బీఎస్పీ
నిర్మల్, న్యూస్‌లైన్ : జిల్లాలో జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) తన ఖాతా తెరిచింది. జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన సత్తాను మరోసారి చాటారు. బీఎస్పీ నిర్మల్ అసెంబ్లీ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బీఎస్పీ సిర్పూర్ అభ్యర్థిగా కోనేరు కోనప్పలు గెలుపొంది ప్రత్యేక గుర్తింపు పొందారు. జిల్లాతోపాటు తెలంగాణలో బీఎస్పీ తన ఖాతా తెరిచింది. నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావుపై 8,628 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక సిర్పూర్లో కోనేరు కోనప్ప తన సమీప అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జిల్లాలో ఇప్పటి వరకు బీఎస్పీ విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే ఐకే.రెడ్డి ఆ పార్టీ నుంచి పోటీ చేయడంతోపాటు అదే బాటలో కోనేరు కోనప్ప సైతం నడిచి పార్టీ గుర్తును రెండు నియోజకవర్గాలో ఎగురవేసి తమ పేరును నిలుపుకున్నారు. తద్వారా జిల్లాలోనే కాకుండా త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలోనూ పాగా వేసినట్లయింది. సత్తా నిరూపించుకున్న ఐకేరెడ్డి... జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరున్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మరోసారి తన సత్తా నిరూపించుకున్నారు. 1987లో జెడ్పీ చైర్మన్‌గా, 1991-96 వరకు ఎంపీగా, 1999, 2004లో ఎమ్మెల్యేగా, 2008లో ఎంపీగా పనిచేసిన ఆయ న 2000 సంవత్సరంలో టీసీఎల్‌ఎఫ్ కన్వీనర్‌గానూ వ్యవహరించారు. ఇటీవల జరిగిన రాజ కీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీ నామా చేసిన ఐకే.రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీలో చేరారు. అనంతరం పార్టీని వీడి కొన్ని రోజులపాటు ఏ పార్టీలోకి వెళ్లకుండా తటస్థంగా ఉంటూ వచ్చారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా తన అనుచరులందరికీ ఒకే గుర్తు రావలన్న ఉద్దేశంతో బీఎస్పీ నుంచి టిక్కెట్లు తీసుకొచ్చి వారిని బరిలో నిలపడమే కాకుండా 16 సీట్లలో పార్టీ గెలుపునకు పాటుపడ్డారు. మున్సిపల్ చైర్మన్ స్థానాన్నీ కైవసం చేసుకోబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి నియోజకవర్గంలో 14 స్థానాలను కైవసం చేసుకున్నారు. అనంతరం ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయ గురువుగా ఐకే.రెడ్డిని భావించే కోనేరు కోనప్ప సైతం బీఎస్పీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన అనుచర గణాన్ని బరిలో నిలిపి ఒక జెడ్పీటీసీతోపాటు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యేగానూ కోనప్ప విజయబావుటా ఎగురవేశారు. -
‘మహా’వీరులెవ్వరో..!
- ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేస్తున్న ప్రధాన పార్టీలు - డీఎఫ్‌కు గడ్డుకాలమే అంటున్న సర్వేలు - ఎమ్మెన్నెస్ దెబ్బ కొడుతుందన్న ఆందోళనలో మహాకూటమి - అంచనాలకు అందని ఆప్ ప్రభావం సాక్షి, ముంబై: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. మూడు దశల్లో 48 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 900 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో నిక్షిప్తమైంది. ఓటరు ఎవరివైపు మొగ్గుచూపారన్న దానిపైనా అన్ని పార్టీ నేతల్లో ఆందోళన ఉన్నా, పైకి మాత్రం గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే మే 16వ తేదీన ‘మహా’ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఈసారి ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17, మిత్రపక్షమైన ఎన్సీపీ ఎనిమిది స్థానాలు, శివసేన 11, బీజేపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి సర్వేలు, రాజకీయ విశ్లేషకుల అంచనాల మేరకు అత్యధిక స్థానాలు శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని, శివసంగ్రామ్ పార్టీల మహాకూటమి కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సర్వేలు కూడా అవే చెప్పాయి. దీంతో మహాకూటమిలో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలోకంటే ఐదు నుంచి ఎనిమిది స్థానాలు కోల్పోతుందన్న సర్వేలతో ప్రజాసామ్య కూటమిలో ఆందోళన కనిపిస్తోంది. అయితే ఈ రెండు కూటమి నాయకులు మాత్రం తామే అధిక స్థానాలను గెలుచుకుంటామని ఎవరికివారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రముఖ పార్టీల అభ్యర్థులకు ఈసారి ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. తిరుగుబాటు అభ్యర్థులు, బీఎస్పీ, ఎస్పీలతో పాటు మొదటిసారి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చారు. వీరు ఒకటి నుంచి మూడు స్థానాలలో విజయం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డీఎఫ్‌కు గడ్డుకాలమే... కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమికి ఈసారి సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలు ఈ కూటమి నేతల భవితవ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ముంబైలోని ఆరు ఎంపీ స్థానాల్లో ఐదు స్థానాలు కాంగ్రెస్, ఒక సీటు ఎన్సీపీ గెలుచుకుంది. అయితే ఈసారి ఆ పార్టీ నేతలు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు మహాకూటమితో పాటు ఇతర పార్టీ నాయకుల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో ముంబైలో డీఎఫ్ కొన్ని స్థానాలను చేజార్చుకునే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ డీఎఫ్ కూటమి నుంచి ముఖ్య నేతలు, మహా కూటమి నుంచి బరిలో నిలిచిన ప్రధాన నేతల మధ్య గట్టిపోరు జరిగిందని తెలుస్తోంది. మహాకూటమి.... ప్రభుత్వ వ్యతిరేకత, అధికార కూటమిపై వచ్చిన అవినీతి ఆరోపణలు తమకు లాభిస్తాయన్న సంతోషంలో మహా కూటమి ఉంది. అయితే పార్టీల్లోని అంతర్గత విభేదాలతోపాటు ఎమ్మెన్నెస్ ప్రభావం ఉంటే మాత్రం ఆశించిన సీట్ల కన్నా తక్కువ స్థానాలు వచ్చే అవకాశముందన్న ఆందోళన కూడా కనబడుతోంది. శివసేన పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలిపిన ఎమ్మెన్నెస్ వల్ల మహా కూటమికి నష్టం వాటిల్లే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖాతా తెరిచేనా... రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ గత లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. అయితే ఈసారి ఖాతా తెరుస్తామన్న ధీమాతో ఆ పార్టీ కనబడుతోంది. తొలిసారిగా పోటీచేసిన కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అయితే కొన్ని స్థానాల్లో మంచి పోటీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అస్థిత్వం కోసం... రాష్ట్రంలో రాజకీయ అస్థిత్వం కోసం పలు పార్టీలు పోరాడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటునూ దక్కించుకోలేకపోయిన బహుజన్ సమాజ్‌వాది పార్టీ , సమాజ్‌వాది పార్టీలు ఈసారి ఎలాగైన ఖాతా తెరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఈ పార్టీల అభ్యర్థులు గట్టి పోటీనిచ్చినా, విజయం సాధిస్తారా అన్న దానిపై స్పష్టత కనబడటం లేదు. అయితే ఈ సారి తాము విజయం సాధిస్తామని ఆ పార్టీ అభ్యర్థులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
లౌకికవాదం ఓ ముసుగు
కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ లక్నో: కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లపై బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఈ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి లౌకికవాదం అనే ముసుగు ధరించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. ‘‘నిరుద్యోగం, సాగునీరు, ధరల పెరుగుదల, పేదరికం, కనీసం.. బడిలో పిల్లల అడ్మిషన్ల గురించి ప్రజలు అడుగుదామన్నా.. ఈ పార్టీలు పట్టించుకోవు. వారు చెప్పేదొకటే.. ‘వీటన్నింటినీ పక్కన పెట్టండి... వీటికంటే ముందు లౌకికవాదానికి ముప్పు పొంచి ఉంది. దాని గురించి మాట్లాడండి’ అని అంటారు.. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటారు’’ అని అన్నారు. ఆయన ఆదివారం లక్నోలో భారీ స్థాయిలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు.వివరాలు ఆయన మాటల్లోనే.. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు.. లౌకికవాదం అన్న పదాన్ని ఒక ఎన్నికల నినాదంగా, ఆధికారాన్ని చేజిక్కించే పనిముట్టుగా వాడుకుంటున్నా యి. కానీ బీజేపీ విషయంలో లౌకికవాదం అంటే.. ప్రజలను ఐక్యం చేయడం, వారికి అభివృద్ధిని అందించడం. ఎన్నికల వేడి ఇంకా రగలకముందే.. బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక వాటి (ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) వినాశనం తప్పదు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ ఏడాది పాలనలో యూపీలో 150కిపైగా అల్లర్లు జరిగాయి. అదే గుజరాత్లో అయితే గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదు. కనీసం కర్ఫ్యూ కూడా విధించలేదు. మరి యూపీ లో అంతలా అల్లర్లు జరగడానికి కారణమేంటో నేతాజీ(ములాయంనుద్దేశించి) చెప్పాలి. అభివృద్ధి విషయంలో గుజరాత్‌ను, యూపీని పోల్చకండి. యూపీలో శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయి. దేశంలోని నేరాల్లో 45 శాతం ములాయం కళ్లెదుటే జరిగాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి ఒక్క యూపీలోనే 20 వేల కేసులు నమోదయ్యాయి. కాన్పూర్‌లో అయితే ఎమ్మెల్యే అనుచరులు వైద్య విద్యార్థులపై దౌర్జన్యం చేయడంతో వారు ఆందోళనకు దిగారు కూడా. ఈ గూండాగిరీ రాజకీయాలను ఇక సహించేది లేదు. నా ర్యాలీలకొచ్చే జనం విషయంలో తాము పోటీపడలేమంటూ ఈ రోజు నేతాజీ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లకు ఆయన కూడా అభివృద్ధి గురించి మాట్లాడేలా మేం చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ములాయం ఊరికే మా రాష్ట్రంలో అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు నాదో విన్నపం. ఒకసారి గుజరాత్ వచ్చి చూడండి. అక్క డ 365 రోజులూ 24 గంటలపాటు కరెంటు ఉం టుంది. అదే యూపీలో నేతాజీ ఉన్న ప్రాంతాల్లో కరెంటు ఉంటుంది.. మిగతా చోట్ల ఉండదు. ము లాయం ఇకనైనా యూపీకేం చేశారో చెబితే మేలు. ఆ ఘనత బీజేపీదే: నేను వెనుకబడిన వర్గం నుంచి వచ్చాను. పేదరికంలో పెరిగిన నన్ను, టీ అమ్ముకుని బతికిన నన్ను.. ప్రధాని అభ్యర్థిని చేసిన ఘనత బీజేపీది మాత్రమే. దేశంలో మరే ఇతర పార్టీ ఇలా చేయదు. వచ్చే పదేళ్లూ వెనుకబడిన వర్గాలకు, దళితులకు, పేదలకు చాలా కీలకం. వారి జీవితాల్లో మార్పు రాబోతోంది. ఢిల్లీ ఖజానాకు నేను కాపలాదారుగా ఉండబోతున్నాను. దానిపై ఇక ఎవరూ చేయి( కాంగ్రెస్ గుర్తు) వేయలేరు. సైకిల్(ఎస్పీ గుర్తు) తొక్కేవారైనా, ఏనుగుపై(బీఎస్పీ గుర్తు) వచ్చే వారైనా.. ఎవరూ అందులో చేయి పెట్టలేరు. మూడో కూటమి ప్రయోగంతో దేశానికి నష్టం న్యూఢిల్లీ: ‘‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోగలిగే ప్రభుత్వం దేశానికి అవసరం. ఇలాంటి సమయంలో మూడో కూటమి ప్రయోగం అంటే.. దాని వల్ల దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని నరేంద్ర మోడీ.. దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కడతామంటున్న పార్టీలు.. ఏదో ఒక సమయంలో రాజకీయ అవకాశవాదం వల్ల ఆ పార్టీతోనే చేతులు కలుపుతున్నాయన్నారు. మోడీ ర్యాలీలకు డబ్బులెక్కడివి: కాంగ్రెస్ మోడీ యూపీలోను, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ చేపట్టిన ‘విజయ్ శంఖానాద్’ ర్యాలీలకు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ ప్రశ్నిం చింది. ‘ఈ రోజు(ఆదివారం) మోడీ ర్యాలీ కోసం 29 రైళ్లు ఏర్పాటు చేశారు. వాటికి రూ.5 కోట్లు ఖర్చవుతుంది. అలాగే 5వేల బస్సులు, 15 వేల జీపులు, లాడ్జింగ్, ఆహారం, డెకరేషన్ తదితర ఖర్చులు కూడా కలుపుకొంటే మొత్తం రూ.40 కోట్లు దాటుతుంది. ఈ డబ్బు ఎక్కడిదో బీజేపీ చెప్పాలి’ అని ప్రశ్నించింది. -
బీఎస్పీ ఎంపీపై అత్యాచారం కేసు నమోదు
పనిమనిషి హత్యకేసులో జైలు పాలైన బహుజన్ సమాజ్ పార్టీ (బీస్పీ) ఎంపీ ధనుంజయ్ సింగ్ పై తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం అత్యాచార కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశారని మహిళ చేసిన ఆరోపణలపై ఎంపీ ధనంజయ్ పై సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు. 2005, 2009 సంవత్సరాల మధ్యకాలంలో ఎంపీని తన భర్త డిన్నర్ కు ఆహ్వానించారని, ఆ సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేసింది అని పోలీసు అధికారి వెల్లడించారు. అత్యాచార విషయం ఎవరికైనా తెలియచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో ఆసమయంలో ఎంపీపై ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయలేదని పోలీసులు తెలిపారు. ఎంపీతోపాటు ఆయన సతీమణి జాగృతి సింగ్ ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని జాన్ పూర్ లోకసభ నియోజకవర్గం నుంచి ధనుంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
'యూపీలో రాష్ట్రపతి పాలన విధించండి'
శాంతి భద్రతలు క్షీణించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రణబ్‌ను మాయావతి కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని ప్రణబ్‌కు వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవల ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకున్న మత ఘర్షణలే అందుకు ఉదాహరణ అని మాయావతి చెప్పారు. ముజఫర్‌నగర్ ఘర్షణలను అరికట్టడంలో అఖిలేష్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. అలాగే ఆ ఘర్షణల అనంతరం స్థానికంగా శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ఆ ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో మాయావతి మీడియా ముఖంగా ఏకరువు పెట్టారు. ముజఫర్‌నగర్ ఘర్షణలో దాదాపు 48 మరణించారని, వందలాది మంది గాయాలపాలైయ్యారని ఈ సందర్భంగా మాయావతి వివరించారు. మతఘర్షణల వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయిన అఖిలేష్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారించిందని మాయావతి మండిపడ్డారు.