
సాధారణ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఓట్లకు బీఎస్పీ గండి
హరియాణా, రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా చాలా రాష్ట్రల్లో ఇండియా కూటమికి బీఎస్పీతో ఇక్కట్లు
యూపీ ఎన్నికల్లో 9 శాతం ఓట్లతో 16 స్థానాల్లో ఇండియా అభ్యర్థుల విజయాన్ని అడ్డుకున్న బీఎస్పీ
ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై రాహుల్ వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన సాధారణ ఎన్నికలు సహా అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు దాని నేతృత్వంలోని ఇండియా కూటమి విజయాలను అడ్డుకోవడంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కంట్లో నలుసులా మారుతుండటంపై కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. పార్టీ జయాపజయాలను నిర్ణయించే ఓట్లను చీల్చడంలో బీఎస్పీ తన పాత్రను సమర్ధంగా పోషిస్తోందని, ఇది పరోక్షంగా అధికార బీజేపీ కూటమికి లబ్ధి చేకూరుస్తోందన్న వాదనను బలంగా తెరపైకి తెస్తోంది. బీఎస్పీతో జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్ష్యంగా విమర్శలు గుప్పించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
యూపీ సహా అనేక చోట్ల పనిచేస్తున్న ‘మాయ’
గత సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓట్లకు భారీ గండి కొట్టాలనే బలమైన లక్ష్యంగా సమాజ్‌వాదీతో ముందస్తు పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, బీఎస్పీని సైతం కూటమిలోకి ఆహ్వానించింది. దీనికి మాయవతి అంగీకరించకుండా ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 80 లోక్‌సభ స్థానాలకు గానూ 33.8 శాతం ఓట్లతో ఎస్పీ 37, 9.5 శాతం ఓట్లతో కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. రెండె పార్టీల ఓట్ల వాటా 43.3 ఓట్ల శాతం. ఇదే సమయంలో బీఎస్పీ ఒక్క సీటు గెలవలేకున్నా పారీ్టకి మాత్రం 9.39 శాతం ఓట్లు వచ్చాయి.
కూటమిలో భాగస్వామిగా ఉండుంటే ఓట్ల శాతం 52 శాతానికి పైగా పెరిగి మరిన్ని సీట్లు గెలిచే వారమని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో 16 సీట్లలో కూటమి అభ్యర్థుల విజయాన్ని బీఎస్పీ అడ్డుకుంది. 16 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఓడిన మార్జిన్ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అమ్రోహా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి డానిష్ అలీ 28 వేల ఓట్ల తేడాతో ఓడితే బీఎస్పీకి అక్కడ 1.20 లక్షల ఓట్లు వచ్చాయి. బాన్స్‌గౌవ్ స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి 3 వేల ఓట్లతో ఓడితే బీఎస్పీకి 64వేల ఓట్లు వచ్చాయి. ఇదే మాదిరి చాలా స్థానాల్లో బీఎస్పీ కూటమి అభ్యర్థుల విజయాలకు గండికొట్టింది.
యూపీలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టు పట్టు ఉంది. దీనికి తోడు కాన్షీరాం వారసత్వ పారీ్టగా హిందీ రాష్ట్రాల్లోనూ బీఎస్పీ ప్రాబల్యం బలంగా ఉంది. దళితులు–ముస్లిం ఫార్ములాను ముందుపెట్టి గడిచిన రెండేళ్లలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, చత్తీస్‌గఢ్ వంటి రా్ర‹Ù్టరాల్లో పోటీ చేసి 2–4 శాతం ఓట్లను రాబట్టుకుంది. ఈ ఓట్లన్నీ పరోక్షంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఓటమికి కారణమయ్యాయి. మొన్నటి హరియాణా ఎన్నికల్లో బీఎస్పీ, ఐఎన్‌ఎల్‌డీ పారీ్టలు కలిసి పోటీచేసి ఏకంగా 5.96 శాతం ఓట్లను రాబట్టుకున్నాయి.
ఇందులో బీఎస్పీకి 2 శాతం ఓట్లున్నాయి. ఈ ఓట్లే కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. మధ్యప్రదేశ్‌లోనూ కచి్చతంగా తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భావించినా 3.40 శాతం ఓట్లను రాబట్టుకున్న బీఎస్పీ కాంగ్రెస్‌ను భారీ దెబ్బకొట్టింది. ఈ ఏడాది నవబంర్‌లో జరిగే బిహార్ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిధ్దమవుతోంది. గత ఎన్నికల్లో బిహార్‌లో 78 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ 1.5 శాతం ఓట్లను రాబట్టుకుంది. దానికి మిత్రపక్షంగా పోటీ చేసిన ఎంఐఎం మరో 2శాతం ఓట్లు రాబట్టుకుంది.
దీంతో ఓట్లు చీలి జేడీయూ, బీజేపీకి అధిక సీట్లు వచ్చేందుకు మద్దతిచి్చనట్లయింది. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ బీఎస్పీ తమకు ఇక్కట్లకు గురిచేస్తుండటం కాంగ్రెస్ పారీ్టకి తలనొప్పి వ్యవహారంలా మారింది. ఈ నేపథ్యంలోనే యూపీలో పర్యటిస్తున్న రాహుల్ బీఎస్పీ అధినేత్రి మాయవతి లక్ష్యంగా విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిసి పనిచేసి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని, అయితే మాయావతి తమతో కలిసి రాలేదన్నారు. ఇది పరోక్షంగా బీజేపీ గెలుపుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. ఈ విమర్శలు ఇప్పుడు మాయావతి ప్రభావాన్ని మరోమారు చర్చకు పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment