agitation
-
నిలిచిన ఇథనాల్ ఫ్యాక్టరీ
నిర్మల్/దిలావర్పూర్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో రగిలిన ‘ఇథనాల్’ మంట చల్లారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు, గ్రామస్తులు రోడ్డెక్కి చేపట్టిన ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.దిలావర్పూర్–గుండంపల్లి మధ్య నిర్మాణంలో ఉన్న పీఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆయా గ్రామాల ప్రజలు తాత్కాలికంగా తమ పోరును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులపై రాళ్లు రువ్వి.. అంతకుముందు దిలావర్పూర్ మండల కేంద్రంలో ‘ఇథనాల్’ మంట రెండోరోజైన బుధవారమూ కొనసాగింది. దిలావర్పూర్, గుండంపల్లిలో పొద్దున్నే పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండంపల్లిలో అరెస్టులు చేయడానికి వచ్చిన పోలీసులను భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అడ్డుకున్నారు. మరోసారి 61వ నంబర్ జాతీయ రహదారిపై ఆందోళన చేసేందుకు గ్రామస్తులు గుమిగూడగా ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో వజ్ర వాహనంతోపాటు వచ్చిన పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలు ఉండటంతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బలగాలు వెనుదిరగడం మొదలుపెట్టారు. ఈలోగా కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. అయినప్పటికీ పోలీసులు లాఠీచార్జీ చేయకుండా సంయమనం పాటిస్తూ దిలావర్పూర్ నుంచి 2 కి.మీ. వెనక్కి వెళ్లిపోయారు. దీంతో దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం తదితర గ్రామాల ప్రజలు మళ్లీ ఎన్.హెచ్. 61పై బైఠాయించారు. పిల్లలతోపాటు మహిళలు తమ ఎదుట పురుగు మందుల డబ్బాలను పెట్టుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేసుకున్నారు. ‘లగచర్ల’ ప్రభావంతో ప్రభుత్వం అప్రమత్తం ఇటీవల వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో చోటుచేసుకున్న రైతుల ఆందోళనల నేపథ్యంలో దిలావర్పూర్ మండలంలో జరుగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకారులు దాడి చేయొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వారు రాస్తారోకో చేస్తున్న ప్రాంతానికి వెళ్లలేదు.అలాగే ఆందోళనకారులు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించొచ్చన్న సమాచారంతో ఆయా కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని మధ్యాహ్నంలోగా ఖాళీ చేయించారు. జిల్లా కేంద్రంలోనే ఉన్న ఆర్డీవో కార్యాలయానికి ఏకంగా తాళం వేశారు. ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనలకు విరామంఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వచ్చిన ప్రకటనతో ఆందోళనకారులు చల్లబడ్డారు. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షరి్మల ఆయా గ్రామాల రైతులు, పెద్దలతో సాయంత్రం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. అనంతరం ఫ్యాక్టరీ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించేందుకు జిల్లా ఎస్పీ, పోలీసులు దిలావర్పూర్ మండల కేంద్రానికి చేరుకోగా ప్రజలు వారికి పూలతో స్వాగతం పలికారు. ‘ఎస్పీ జిందాబాద్..’ అంటూ నినాదాలు చేశారు. పటాకులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న యువకులందరినీ పోలీసులు తిరిగి గ్రామాల్లో వదిలిపెట్టారు. -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్‌ల సిట్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్‌కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు
వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్‌లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్ హెడ్ కార్లోస్ మజోన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్‌ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే. 80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్ వాతావరణ సంస్థ అక్టోబర్ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్‌పై గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు. – వాలెన్సియా -
ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం: ఇసుక ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారని.. తీసుకెళుతుంటే మాత్రం అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటూ శుక్రవారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం జల్లేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేసేందుకు 8 ట్రాక్టర్లు వెళ్లాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు జల్లేరు వాగు సమీపానికి వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దుర్గారావు అనే ట్రాక్టర్ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు దుర్గారావును నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఎస్ఐ ఎస్కే జబీర్, సీఐ వి.కృష్ణబాబులు బైపాస్ రోడ్డుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబితే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు ఓట్లేసి ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం వచ్చాక ఆ హామీని విస్మరించారని, ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్ వెంకటే‹Ù, ట్రాక్టర్ యజమాని దుర్గారావు చెప్పారు. నమ్మి ఓట్లు వేశాం ఇసుక ఉచితంగా ఇస్తే గ్రామాల్లో ఉపాధి పెరుగుతుందని నమ్మి కూటమి పార్టీలకు ఓట్లేశాం. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు చెబుతున్న మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ట్రాక్టర్లు కొనుకున్న ఉపాధి పొందుతున్న యువతను సైతం నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలున్నాయి. ఇకనైనా మేలుకోకుంటే కూటమి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. –కుక్కల సత్యనారాయణ, వేగవరం, జనసేన ఎంపీటీసీ -
రోడ్డెక్కిన గ్రూప్–1 అభ్యర్థులు
చిక్కడపల్లి (హైదరాబాద్)/కరీంనగర్ టౌన్: మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని, జీఓ నంబర్ 29 రద్దు చే యాలని డిమాండ్ చేస్తూ గ్రూప్–1 అభ్యర్థులు శుక్రవారం మరోసారి నిరసనలకు దిగారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహిస్తూ రావడంతో నగరంలోని అశోక్‌నగర్, గాం«దీనగర్, ఆంధ్రా కేఫ్, జవహర్‌నగర్‌లలో రోడ్లు కిక్కిరిసిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే అభ్యర్థులను అదుపు చేయడం వారికి కష్టతరంగా మారింది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు సీతయ్య, రాంబాబు, ఎస్ఐలు, సిబ్బంది లాఠీలకు పనిచెప్పారు.దీంతో విద్యార్థులు వీధుల్లోకి పరుగెత్తారు. పోలీసులు వారిని తరుముతూ వెళ్లి చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. కొందరు అభ్యర్థులు సమీపంలోని దుకాణాలు, బేకరీల్లోకి, చాయ్ దుకాణాల్లోకి వెళ్లగా, పోలీసులు వాటిల్లోకి సైతం వెళ్లి బయటకు లాక్కొచ్చి పోలీస్స్టేషన్లకు తరలించారు. పరుగెత్తకుండా మొండికేసి బైఠాయించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీచార్జిపై గాం«దీనగర్‌లోని ఎస్బీఐ బ్యాంకు, ఆంధ్రాకేఫ్ సమీపంలో, ఆర్టీసీక్రాస్‌రోడ్డు, ఇందిరాపార్కు రోడ్డులో నిరుద్యోగ అభ్యర్థులు నిరసనకు దిగగా.. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ఇతర నేతలు మద్దతు పలికారు. అయితే పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. న్యాయం జరిగేవరకు పోరాడతా: బండి సంజయ్ గ్రూప్–1 పరీక్షల రీ షెడ్యూల్‌కు పట్టుపడుతున్న అభ్యర్థులకు కేంద్రమంత్రి బండిసంజయ్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం పలువురు గ్రూప్–1 అ భ్యర్థులు కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవడంతో పాటు గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన తప్పిదాలను సవరించాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాడతానని హెచ్చరించారు. పరీక్ష రీషెడ్యూల్ చేయాలి: డా.కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని జీవో నంబర్ 29ని రద్దు చేయడంతో పాటు గ్రూప్–1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరించారు.వాయిదా వేసేలా చూడండి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అభ్యర్థుల వినతిగ్రూప్–1 మెయి న్స్ పరీక్షను వాయిదా వేసేలా, జీవో నంబర్ 29ను రద్దు చేసేలా చూ డాలని పలువురు అభ్యర్థులు శుక్రవారం గాం«దీనగర్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. తమకు న్యాయంచేయా లని విజ్ఞప్తి చేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్–1 ప్రశ్నపత్రాల లీకేజీల కా రణంగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లాఠీచార్జ్ దారుణం: కేటీఆర్గ్రూప్– 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణమని, అరెస్ట్ చేసిన విద్యార్థులు, గ్రూప్ –1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసులు జులుం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్‌నగర్‌కు వచ్చి అడ్డగోలు హామీలు ఇచి్చన రాహుల్‌గాం«దీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత పత్తా లేకుండా పోవడం దుర్మార్గమన్నారు. -
అట్టుడికిన కామారెడ్డి
కామారెడ్డి టౌన్ / కామారెడ్డి క్రైం: ఆరేళ్ల చిన్నారిపై పీఈటీ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డిని అట్టుడికించింది. న్యాయం కావాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్‌తో దాదాపు ఆరుగంటల పాటు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పట్ల అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలియడంతో çపలు విద్యార్థి సంఘాల వారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్యాంకురియన్, వైస్ ప్రిన్సిపాల్ వీసీ థామస్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల లోపలికి దూసుకెళ్లారు. ప్రిన్సిపాల్ చాంబర్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పీఈటీపై ఫిర్యాదు చేసినా... పలుమార్లు ఫిర్యాదు చేసినా సదరు పీఈ టీని తొలగించలేదన్నారు. ఈ విషయాన్ని గతంలోనే డీఈవో, ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటికే పాఠశాలకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయిస్తున్న సమయంలోనే బయట నుంచి పెద్దఎత్తున యువకులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నా వినలేదు. పలుమార్లు పోలీసులకు, ఆందోళన చేస్తున్న వారితో తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఉన్న కొందరు పాఠశాల భవనంపై రాళ్లు రువ్వడంతో కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ తలకు రాయి బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సీఐని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తోపులాటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కాళ్లు విరగడంతో పాటు, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ రాజారాం సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ సింధుశర్మ ఆందోళకారులను సముదాయించారు. సాయంత్రం ఆరుగంటల వరకు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
అస్థిరత ఏర్పడినప్పుడల్లా... హిందువులే టార్గెట్
అంటారియో: బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న హింసపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులతో సహా మతపరమైన మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ఆయన ఎత్తిచూపారు. కెనడా పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు. బంగ్లాలో అస్థిరత ఏర్పడినప్పుడల్లా ఈ సమూహాలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా అవుతున్నారని, ఎక్కువగా హింసకు గురవుతున్నారని వాపోయారు. 1971లో బంగ్లాకు స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచీ జనాభాలో మతపరమైన మైనారిటీల సంఖ్య భారీగా తగ్గిందని వెల్లడించారు. కెనేడియన్ హిందువులు బంగ్లాదేశ్‌లోని తమ బంధువులు, ఆస్తుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆర్య తెలిపారు. దీనిపై అవగాహన కలి్పంచేందుకు సెపె్టంబర్ 23న కెనడా పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలున్న కెనేడియన్ బౌద్ధులు, క్రిస్టియన్ల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారు. హిందువులపై దాడులు బంగ్లాదేశ్‌లో ఇటీవలి తిరుగుబాటు తర్వాత దేశవ్యాప్తంగా హింస చెలరేగడం తెలిసిందే. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో హిందువులు దాడులను ఎదుర్కొంటున్నారు. హిందూ దేవాలయాలను భారీగా టార్గెట్ చేశారు. ప్రార్థనా మందిరాలతో సహా మతపరమైన మైనారిటీలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నట్టు బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ అంగీకరించింది. దీనికితోడు రాజీనామా చేసి దేశం వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ నాయకులను హతమార్చడం, వారి ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి పెద్దపెట్టున జరిగాయి. మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న హింసపై విచారణకు ఐరాస మానవ హక్కుల నిజ నిర్ధారణ బృందం తాజాగా ఢాకా చేరుకుంది. ఎవరీ ఆర్య? ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటకకు చెందినవారు. రెండేళ్ల క్రితం కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంటారియోలోని నేపియాన్ ఎలక్టోరల్ జిల్లాకు కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఆర్య కెనడా రాజకీయాల్లో పనిచేస్తూనే తన భారత మూలాలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. -
నేటి నుంచి పీహెచ్‌సీల్లో వైద్య సేవలు బంద్
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన ఆందోళనను తీవ్రం చేశారు. శనివారం నుంచి పీహెచ్‌సీల్లో అత్యవసర వైద్య సేవలు, మినహా మిగిలిన సేవలను అందించబోమని ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌సర్వీస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 10 నుంచి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం వైద్యులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ హరికిరణ్ వైద్యులతో సచివాలయంలో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారంపై అధికారులు కనీస ఆసక్తి చూపించలేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉంది అని చెబుతూ తాము చూపిన ప్రత్యామ్నాయాల్లో వేటినీ స్వీకరించకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని సంఘం తెలిపింది. ప్రభుత్వంలోకంటే ప్రైవేటులో మెరుగైన సేవలు అందుతున్నాయని అధికారులు అనడం శోచనీయమంది. ఈ క్రమంలో ఆదివారం చలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని తెలిపింది. మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని వెల్లడించింది. పీహెచ్సీ వైద్యులు కోల్పోతున్న మొత్తం సీట్లు 336336 సీట్లు నష్టపోతున్న వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్యను పెంచడం కోసం పీహెచ్‌సీల్లో సేవలు అందించే ఎంబీబీఎస్ వైద్యులను ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ చేయించి, అనంతరం వారి సేవలను ఆస్పత్రుల్లో వినియోగిస్తుంటారు. కాగా, గత ప్రభుత్వంలో అన్ని ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో స్పెషలిస్ట్‌లను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఇన్‌సర్వీస్ కోటాను పెంచారు. -
NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమరి్పంచింది. నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్లో స్పష్టంచేసింది. బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్‌తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది. -
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్‌కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్‌మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్‌కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్‌కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్‌పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్‌కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్‌బగాన్, ఈస్ట్‌బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కోల్‌కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్‌కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్‌కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్‌తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్‌ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్‌కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్‌కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు కర్ణాటకలో కాంగ్రెస్ నిరసనలు
బెంగళూరు: మైసూరులో భూకేటాయింపుల వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం ప్రకటించారు. ‘‘ ఏం లేకున్నా గవర్నర్ దీన్నొక కేసులా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నిరసన బాటలో పయనిస్తుంది. తాలూకా, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ మెమొరాండం అందజేస్తారు’’ అని నిరసన కార్యక్రమ వివరాలను డీకే వివరించారు. 22న సీఎల్పీ భేటీగవర్నర్ నిర్ణయాన్ని ఐకమత్యంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చాటేందుకు 22వ తేదీన సీఎల్పీ భేటీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ‘‘ ముడా భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో చర్చిస్తారు. చట్టబద్ధంగా ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నామో ఆయన వివరిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాదించనున్న సింఘ్వీ, సిబల్ !మైసూరు భూకేటాయింపుల కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదించే అవకాశముంది. ఈ మేరకు వీరిద్దరూ నేడు బెంగళూరుకు వస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. -
వైద్యుల భద్రతపై కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. తదనంతరం దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన, నిరసన కార్యక్రమాల ఉధృతం అవుతుండడం, ఆసుపత్రల్లో వైద్య సేవలు నిలిచిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచి్చంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి తగిన భద్రత కలి్పంచడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. వారి భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సిఫార్సులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలన్నీ ఈ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని, అభిప్రాయాలు తెలియజేయవచ్చని వెల్లడించింది. వైద్య సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని, రోగులకు చికిత్స అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్న సమయంలో డాక్టర్లు అందుబాటులో వైద్య సేవలు నిలిపివేయడం సరైంది కాదని సూచించింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఐఎంఏ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనను నిశితంగా పరిశీలిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలియజేసింది. అ న్ని రాష్ట్రాల్లోని తమ ప్రతినిధులతో చర్చించి, తమ నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టంచేసింది. హాస్పిటల్స్‌ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బందిపై హింస జరగకుండా ఒక చట్టం తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల విషయలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరింది. రెండో రోజు విచారణకు హాజరైన సందీప్ ఘోష్ జూనియర్ డాక్టర్ పట్ల జరిగిన అమానవీయ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అనుమానితులను పిలిపించి ప్రశి్నస్తోంది. ఘాతకం జరిగిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ వరుసగా రెండో రోజు శనివారం కూడా సీబీఐ ఎదుట హారయ్యారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్‌కి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అదికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల కోసం ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ బృందం కోల్‌కతాకు చేరుకుంది. దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం రోడ్డెక్కారు. తమకు భద్రత కలి్పంచాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అత్యవసరం కాని ఇతర వైద్య సేవలను నిలిపివేశారు. ఢిల్లీ, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడి శా తదితర రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలావరకు నిలిచిపోయాయి. -
తల్లడిల్లిన జన హృదయాలు
సాక్షి, అమరావతి/గన్నవరం: ప్రతి ఇంటికీ పెద్ద కొడుకయ్యాడు.. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నగా తోడయ్యాడు.. అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ తీరుస్తున్నాడు.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అంటూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు.. అలాంటి సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలిసి రాష్ట్ర ప్రజల్లో ఆందోళన మొదలైంది. అభిమానుల హృదయం తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఎలా ఉన్నాడోనని ఓ తల్లి.. కొడుకు ఏం చేస్తున్నాడోనని ఓ తండ్రి.. అన్నకేమైందోనని ఓ చెల్లి, తమ్ముడు.. ఇలా జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా సమాదరించే వందలాది మంది ఒకసారి తమ నేతను చూడాలని తాపత్రయపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్‌పై విజయవాడలోని సింగ్‌నగర్ వద్ద హత్యాయత్నం జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు. అయినా ఇంటికి వెళ్లిపోకుండా కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద రాత్రి బస చేసిన ప్రాంతంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను చూడాలని, పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం నుంచీ వస్తున్న జన ప్రవాహాన్ని పోలీసులు నిలువరించారు. గాయం తీవ్రత కారణంగా జగన్ ఎవరినీ కలిసే పరిస్థితుల్లో లేరని, ఈ ఒక్కరోజు ఆగితే బస్సుయాత్రలో మరలా ఆయన మీ ముందుకు వస్తారని నచ్చజెప్పి అందరినీ వెనక్కు పంపించారు. ‘జగనన్నా. నీకేం కాదన్నా. మేమంతా నీవెంటే ఉంటామన్నా. మీరు క్షేమంగా మా మధ్యకు రావాలన్నా. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామన్నా’ అని నినాదాలు చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తూ వారంతా అక్కడి నుంచి తరలివెళ్లారు. బస ప్రాంతానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బస చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పరామర్శించేందుకు ఆదివారం పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జోగి రమేష్, విడదల రజని, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు. -
ఎల్లో కల్లోలం
సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం/శ్రీకాకుళం/ద్వారకా తిరుమల/ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతితో అట్టుడుకుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ 30కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ల అనుచరులు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పలుచోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ... సీనియర్ నేతలను వారి వద్దకు పంపుతూ... కొందరితో రాయబారాలు నడుపుతూ... సర్దిచెప్పేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు. కొందరైతే అధినేతను కలిసేందుకు కూడా ఇష్టపడటంలేదు. కాదూకూడదని వెళ్లినవారు ఆయన ముందు పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా బయటకు వచ్చాక తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇవి కాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనూ అనేక చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులను ఓడిస్తాం... మా సత్తా చూపిస్తాం... టికెట్లు దక్కించుకున్నవారిని ఓడించి తమ సత్తా చూపిస్తామని పలువురు నేతలు బాహాటంగానే సవాల్ విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏలూరు జిల్లా నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్‌గా ప్రచారం ప్రారంభించగా... విజయనగరం జిల్లా గజపతినగరంలో కె.అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వైరిచర్ల వీరేశ్‌దేవ్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. చింతలపూడి, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మద్దతు దొరకడంలేదు. కొవ్వూరు సీటు తనకు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపాలపురం సీటును మద్దిపాటి రాజుకు ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్ నేతలు ముళ్లపాటి బాపిరాజు తదితరులు తమను కాదని టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు. దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్‌కు ఇవ్వడం చలుమోలు అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, మాగంటి రవళితోపాటు అక్కడి పార్టీ సీనియర్ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. వారంతా చింతమనేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దేవినేనిపైనా పెరుగుతున్న అనుమానాలు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహించలేకపోతున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నట్లు పైకి చెబుతున్నా వసంతను ఓడించడమే తన ధ్యేయమని ఆయన అంతర్గతంగా పార్టీ క్యాడర్‌కూ సంకేతాలు ఇస్తున్నారు. అంతేనా... ఆదివారం రాత్రి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం గ్రామంలో బల ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల క్రితం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోనూ బలప్రదర్శన చేపట్టారు. అంటే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి రెడ్డిగూడెం వచ్చిన దేవినేని ఉమా టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి రాఘవాపురంలోని పద్దమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 500 మంది పాల్గొన్నారు. టీడీపీ జెండాలు లేకుండానే సాగిన ర్యాలీలో దేవినేని ఉమా నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వడాన్ని కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నర్సరావుపేటలో కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము తదితరులు అరవింద్‌బాబు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడంలేదు. పెదకూరపాడు సీటును పారాచూట్ నేత భాష్యం ప్రవీణ్‌కు కేటాయించడంతో అక్కడి ఇన్చార్జి కొమ్మాలపాటి శ్రీధర్ అలకబూని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బూదాల అజితారావు, మన్నె రవీంద్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అభ్యర్థులకు గడ్డు పరిస్థితి నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానాన్ని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడాన్ని కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి సీటును బడా కాంట్రాక్టర్ కావ్య కృష్ణారెడ్డికి దక్కడాన్ని మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి గట్టిగా పనిచేస్తోంది. శ్రీకాళహస్తిలో ఎస్.సి.వి.నాయుడు, సత్యవేడులో జె.డి.రాజశేఖర్ తమను చంద్రబాబు మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సీటును అక్కడి పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి కాకుండా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ అంతా భగ్గుమంటోంది. కదిరిలో అత్తార్ చాంద్‌బాషా తనకు సీటు ఇవ్వలేదని తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్దే ఆందోళన చేయించారు. చివరికి బాలకృష్ణకూ అసమ్మతి తప్పలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రమేష్‌కుమార్‌రెడ్డి అలుక వీడటం లేదు. తంబళ్లపల్లె, అమలాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి బెడద ఎక్కవగానే ఉంది. శ్రీకాకుళం ఆగని ఆందోళనలు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టికెట్ రాని టీడీపీ నాయకులు అధిష్టానంపై దుమ్మెత్తిపోతున్నారు. శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించిన గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణ దంపతులు అచ్చెన్నకు తమపై ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. అధిష్టానం తీరు మారకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పారు. అలాగే కొత్తూరు మండలం నివగాం వద్ద అనుచరులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లపై పరోక్షంగా విమర్శలు చేశారు. సైట్లు ఇస్తామని చెప్పి కొన్ని వేలమంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఒక 420 అయిన మామిడి గోవిందరావుకు ఎమ్మెల్యేగా గెలిపించమంటే ఒప్పుకునేది లేదన్నారు. మద్దిపాటిపై సీనియర్ల మండిపాటు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం స్థానాన్ని గ్రాఫ్ పడిపోయిన మద్దిపాటికి కేటాయించడంపై అక్కడి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజర్లలోని ఒక ఫంక్షన్ హాల్లో నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులు సమావేశమై మద్దిపాటి తప్ప వేరెవ్వరైనా తమకు ఓకే అని తేల్చిచెప్పారు. గ్రాఫ్ పడిపోయిన వ్యక్తిని గెలిపించమంటే తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తానేటి వనితను ప్రకటించారనీ, ఆమెను ఢీకొనాలంటే గట్టి క్యాండిడేట్ అవసరమని తెలిపారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సందర్భంలో మద్దిపాటి వెంకట్రాజు నాలుగు రోజులుగా చేపట్టిన పాదయాత్రకు ఒక వర్గం నాయకులు, కార్యకర్తలు దూరంగానే ఉన్నారు. ఏలూరు ఎంపీ సీటుపై వెనక్కి తగ్గని బీజేపీ ఏలూరు పార్లమెంటు సీటు స్థానిక నేత గారపాటి చౌదరికే ఇవ్వాలని జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం చేరుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కడప నాయకుడికి అక్కడ సీటు కేటాయించడం సరికాదని వారు పట్టుపడుతున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బి.నిర్మలా కిశోర్, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కె.కృష్ణప్రసాద్, వివిధ అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి, నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య, యేసు వరప్రసాద్, గాది రాంబాబు, రామకృష్ణ తదితరులున్నారు. -
రైతును మరిచి రాజకీయమా?
కాంగ్రెస్ ప్రభుత్వ ఖడ్గం మొదటి వేటు రైతన్న మీదనే పడ్డది. ఘనత వహించిన కాంగ్రెస్ సోకాల్డ్ ప్రజా పాలనలో రైతన్నల బతుకులు గాలిలో దీపాలు అయిపోయినయి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అన్నదాతల ఆక్రందనలు, ఆర్తనాదాలే వినిపిస్తున్నయి. మొన్నటి దాకా పొలాల్లో నీళ్లు పారితే, ఇప్పుడు రైతుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నయి. మూడు నెలల్లోనే పరిస్థితి ఎందుకు తలకిందులైంది? బీఆర్ఎస్ పరిపాలనలో ఆత్మవిశ్వాసంతో మెరిసి పోయిన రైతన్నల ముఖాల్లో ఎందుకు ఇప్పుడు నిస్సహాయత, ఆందోళన కనిపిస్తున్నది? అటు ఎండిపోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయినపంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను చిత్తశుద్ధితో త్వరగా అమలు చేయాలి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న బాధలు ఒకవైపు, కొద్దోగొప్పో పండిన పంట వడగండ్ల వానకు సర్వనాశనమై పోయిన ఘోష మరొకవైపు... రైతన్న బతుకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా అయిపోయింది. వడ గండ్ల వాన దెబ్బకు రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. నేల రాలిన పంటను చూసి రైతులు భోరుభోరున ఏడుస్తున్న దృశ్యాలు హృదయాలను కలచి వేస్తున్నాయి. అంత దుఃఖంలోనూ కేసీఆర్ ఉండగా, మా పరి స్థితి ఇంత అగాథంగా లేకుండేనని చెబుతూ మరి కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదు. ఏమీ జరగనట్లుగానే ఎన్నికల ప్రచారాల్లో, రాజకీయ ప్రసంగాలను దట్టించి కొడుతున్నరు కాంగ్రెస్ పాలకులు. రైతు గుండె చీరుకపోయి విలవిల లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం పక్క పార్టీ నాయకుల చేరికల మీద పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సౌభాగ్యం లేని సర్కారు, పార్టీ గేట్లు ఎత్తి నాయకులను చేర్చుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తాగునీరు గతిలేక మహిళలు ఖాళీ బిందెల ప్రదర్శనలు చేశారు. ముఖ్యమంత్రి అటువైపు తొంగి చూసిన పాపాన కూడా పోలేదు. పేగులు మెడలో వేసుకుంటా అనే రాక్షస వ్యాఖ్యలే తప్ప, పొలాలకు నీళ్లు మలుపుతా, ప్రజల గొంతు తడుపుతా అనే మానవీయ వ్యాఖ్యలు ఈ ముఖ్యమంత్రి నోటి వెంట రావడం లేదు. రైతులు విధిలేని పరిస్థితుల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నరు. సాగునీళ్లు లేక,కరెంట్ సరిగా రాక రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఎండిన పంట చేలల్లో పశువులను మేపుతున్న దీనస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ పల్లెల్లో మాయమైన బోరు బండ్లు మళ్లా దర్శనమిస్తున్నవి. పూడిక తీసే క్రేన్లకు గిరాకీ పెరిగింది. లో ఓల్టేజీ కరెంట్‌తో మోటార్లు కాలిపోతున్నయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతు న్నయి. మోటారు వైండింగ్ మెకానిక్‌ల షాపులు కళకళలాడుతుంటే, మునుపటి కాంగ్రెస్ రాజ్యం మళ్లా కళ్లకు కడుతున్నది. బీఆర్ఎస్ పరి పాలనలో ఎండాకాలంలో సైతం చెరువు, చెక్ డ్యాంకులు మత్తళ్లుదుంకిన మంచిరోజులను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నరు. ఆ రోజు నిండుగా పారిన కాల్వలు ఈ రోజు ఎండిపోయి ఎక్కిరిస్తు న్నయి. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్‌తో రైతు ఇంట్ల కాలు మీద కాలేసుకొని కూర్చొన్నా పొలం పారింది. నేడు అర్ధరాత్రి కరెంట్ పెట్టేందుకు బాయి కాడికి పోవాల్సిన బాధ మళ్లా మొదలైంది. బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు నిరందిగ ఉన్నరు. ఇప్పుడు కరెంట్ కోత మల్లా ఒక సమస్యగా వ్యవసాయం వాకిట్లో నిలిచింది. బీఆర్ఎస్ పరిపాల నలో స్థిరపడ్డ వ్యవసాయం కాంగ్రెస్ పుణ్యమా అని మెల్లమెల్లగా చెదిరిపోతున్నది. ఇప్పటి వరకు అందుతున్న లెక్కల ప్రకారం,కాంగ్రెస్ తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం మూడు నెలల వ్యవధిలో 180 మంది రైతుల ఉసురు తీసింది. ఇటీవల కురిసిన వడగండ్ల వాన పంట నష్టాన్ని అంచనా వేసే పని కూడా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రారంభించలేదు. అదే పనిగా బీఆర్ఎస్ వెంట పడితే, అప్పుడు సోయి తెచ్చుకొని అయిష్టంగానే ఎకరాకు రూ. 10 వేల పంట నష్టపరిహారం ఇస్తామని గాలి మాటలు చెబుతున్నరు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారానికి రాగానే మాట మార్చారు. వంద రోజులు దాటినా రుణమాఫీ ఊసెత్తకుండా కాలం గడిపేస్తు న్నారు. నమ్మి రుణాలు తెచ్చుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి, ఎకరాకు ఇచ్చే పెట్టుబడిని రూ. 15 వేలకు పెంచుతామని బడాయిలు చెప్పిన ప్రభుత్వం, పెంచడం మాట అటుంచి అసలు పెట్టుబడి సాయం ఇప్ప టికీ ఎంతోమంది ఖాతాల్లో జమ చేయనేలేదు. పెంచేదెప్పుడో చెప్పడం లేదు. రైతు బంధు సాయాన్ని కౌలు రైతులకు కూడా అంది స్తామని అబద్ధపు హామీలు గుప్పించారు. అసలు ఇప్పటి వరకు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో, వాళ్లకు పెట్టుబడి సాయం ఏ విధంగా చేస్తారో మార్గదర్శకాలు రూపొందించే పనికి కూడా పూనుకోవడం లేదు. ఇగ రైతులను, కౌలు రైతులను మోసగించిన కాంగ్రెస్ పార్టీ, రైతు కూలీలను మాత్రం విడిచి పెడుతుందా? వాళ్లకు ఇచ్చిన హామీకి అదే గతి పట్టిచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వ్యవ సాయ కూలీలకు 12 వేలు అందించే పథకం ప్రారంభిస్తామని చెప్పి, ఆ పథకం అమలు గురించిన ప్రస్తావన కూడా చేయడం లేదు. అంటే రైతు కూలీలకు ఇచ్చిన హామీకి కూడా ఎగనామం పెట్టిందనే అను మానాలకు తావిస్తున్నారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో కేటాయింపులే లేకపోవడం ఈ అనుమానాలను మరింత బలపర్చు తుంది. రాతపూర్వకంగా ఇచ్చిన గ్యారెంటీలకే దిక్కు లేకుండాపోతుంటే, పంట నష్టం పదివేలు ఇస్తాననే నోటి మాటకు విలువె క్కడిది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా అకాల వర్షాలతోపంట నష్టపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పంటలు దెబ్బతిన్న ఊర్లు పర్యటించారు. అప్పటికప్పుడు ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారాన్ని ప్రకటించి, వేగంగా అమలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటువంటి ప్రయత్నమేది కనిపించడం లేదు. అసలు కాంగ్రెస్ అంటేనే ఒక చెడగొట్టు వాన లాంటిదని రైతులు మాట్లాడుకుంటున్నరు. సమైక్య పాలనలో విధ్వంసమైపోయిన తెలంగాణ వ్యవసా యాన్ని తిరిగి నిలబెట్టడానికి బీఆర్ఎస్ ఎంతో శ్రమించింది. పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా చేసింది. కొత్త ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపింది. భారీ రిజర్వాయర్లు నిర్మించి నిండుగా నింపింది. వాగుల్లోకి, వంకల్లోకి నీళ్లు వదిలితే భూగర్భ జలాలు మిక్కుటంగా పెరిగినయి. దుక్కి దున్ని నాటిన నుంచి పంట కొనుగోళ్ల దాకా అడుగడుగునా రైతుకు అండగా నిలిచింది. రైతు బంధుతో పెట్టుబడికి పైకమిచ్చింది. పండిన పంటనంతా మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీన్ రివర్సై పోయింది.ఎండాకాలం రాకముందే చెరువులు ఎండిపోయినయి. భూగర్భ జలాలు పడిపోయినయి. బోర్లు ఎత్తి పోయినయి. రైతు బతుకు దిగ జారడం మొదలైంది. ఇదీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు. మార్పు మార్పు అని చెప్పి రైతుల బతుకుల్లో మంట పెట్టిన్రు. రైతులు హాహాకారాలు చేస్తుంటే, భ్రష్ట రాజకీయాలతో పొద్దు పుచ్చడం ప్రమాదకరం. కాంగ్రెస్ ప్రభుత్వ నైజాన్ని ప్రజలు గుర్తిస్తు న్నారు. ఆదిలోనే హంసపాదులా తయారైన విధానాన్ని తిట్టుకుంటున్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. అటు ఎండి పోయి దెబ్బతిన్న పంటలకు, ఇటు వడగండ్లతో నష్టపోయిన పంటకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి. చిత్తశుద్ధితో ఆరు గ్యారెంటీల్లో చెప్పిన 13 అంశాలను త్వరగా అమలు చేయాలి. ధైర్యం కోల్పో తున్న రైతు గుండెల్లో భరోసాను నింపాలి. రాక్షస వ్యాఖ్యలు చేయడం మాని రైతులను రక్షించుకునే విధానాన్ని చేపట్టాలి. లేని పక్షంలో తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ మరొక మహోద్య మానికి శ్రీకారం చుట్టడం ఖాయం. - వ్యాసకర్త మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే -తన్నీరు హరీశ్ రావు -
స్వ‘ప్రజాగళం’తో కూటమి ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సీతంపేట(విశాఖ ఉత్తర): తెలుగుదేశం పార్టీలో సీట్ల మంటలు ఆరడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో ఆ పార్టీ అట్టుడుకుతోంది. నియోజకవర్గాల్లోనే కాకుండా చంద్రబాబు ఇళ్ల వద్దకు కూడా వచ్చి టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం ఉండవల్లి, హైదరాబాద్‌లలోని చంద్రబాబు ఇళ్ల వద్ద తెలుగు తమ్ముళ్లు నిరసన గళం విప్పారు కర్నూలు జిల్లా ఆలూరు సీటును కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె మద్దతుదారులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఆలూరు సీటును బయట వ్యక్తులకు ఇస్తే అంగీకరించేది లేదని హెచ్చరించారు. బాబును కలిసి తమ ఆవేదనను తెలుపుతామని లోపలకు పంపాలని గొడవ చేశారు. పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. దీంతో వారు సుజాతమ్మకే ఆలూరు సీటు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఉండవల్లి నివాసం వద్ద కూడా కదిరి నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషాకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని, ఐదేళ్లు ఆయన నియోజకవర్గంలోనే ఉండి పని చేశారని, ఇప్పుడు వేరే వారికి సీటు ఎలా ఇస్తారని నిలదీశారు. కదిరి అసెంబ్లీ సీటు ఇవ్వలేనప్పుడు హిందూపురం ఎంపీ స్థానమైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంట్లో లేకపోవడంతో కనీసం లోకేశ్‌ను కలవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కొందరిని లోపలకు పంపించారు. ఆయన వారితో సరిగా మాట్లాడకుండానే తిప్పి పంపించివేశారు. లోకేశ్‌ను కలిసిన కోడెల శివరామ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేత కోడెల శివరామ్ ఉండవల్లిలో మంగళవారం టీడీపీ నేత లోకేశ్‌ను కలిశారు. ఆయనకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరించడంతో కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు పిలిచిన లోకేశ్ అధికారంలోకి వస్తే మంచి ప్రాధాన్యం ఇస్తామని సముదాయించారు. అయితే శివరామ్ నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. ♦ విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. నేనే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌పై పలువురు జనసైనికులు, వీరమహిళలు మండిపడుతున్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో వంశీకృష్ణ శ్రీనివాస్ చిత్రపటాన్ని దహనం చేశారు. వంశీ వద్దంటూ నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు. కార్పొరేటర్ మహ్మద్ సాధిక్కుగానీ, డాక్టర్ మూగి శ్రీనివాసరావులలో ఎవరికి టికెట్ ఇచ్చినా తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ♦ పాడేరు అసెంబ్లీ స్థానం బీజేపీకేనని అధిష్టానం తేల్చిచెప్పడంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈనెల 13న తన అనుచరులతో తన నివాసం వద్ద అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈనెల 15న తన అనుచరులతో పాడేరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, బల ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీలోని ఆశావహులంతా ఒక్కటై తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా సమ్మతమేనని, బీజేపీకి మాత్రం సీటు వదలొద్దని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బాబును కలవాలని విజయవాడ వెళ్లి అధినేత దర్శనభాగ్యం కోసం ఐదురోజులుగా అక్కడే ఎదురుచూస్తున్నారు. ఇంకా సీటుపై సందిగ్ధం వీడకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ సీపీ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ♦ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జనసేన బలప్రదర్శన చేస్తోంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కంటే తానే బలమైన అభ్యర్థినంటూ సీటు దక్కించుకోవడానికి జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్ పావులు కదుపుతున్నారు. ఇటీవల ఆ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బీజేపీకి గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువే ఓట్లు వచ్చాయని, తనకు మెరుగైన ఓట్లు వచ్చాయని ఉషాకిరణ్ వాదిస్తున్నారు. సీటు విషయం పునరాలోచించాలని పార్టీకి లేఖ రాశారు. -
నమ్మించి ముంచేశారు
సాక్షి, గుత్తి/పెద్దతిప్పసముద్రం/నిడదవోలు/పిఠాపురం/నెల్లూరు: నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్న చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇంతవరకు పార్టీని అంటిపెట్టుకున్న తాము అంటరానివారైపోయామని ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నేతల అనుచరవర్గాలు దీన్ని జీర్ణించుకోలేక రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గుమ్మనూరుకు సీటిస్తే ఓడిస్తాం మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టీడీపీ టికెట్ ఇస్తే డిపాజిట్లు రాకుండా ఘోరంగా ఓడిస్తామని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు గుత్తిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లా నుంచి గాందీ, రాయల్, ఎన్టీఆర్ సర్కిళ్ల వరకు ర్యాలీ చేశారు. ‘గుమ్మనూరు వద్దు, జితేందర్ గౌడ్ ముద్దు’, ‘ఆలూరులో పనికి రాని చెత్త గుంతకల్లులో పనికి వస్తుందా’, ‘పేకాట, మద్యం గుమ్మనూరు మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ... గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ఎమ్మెల్యే సీటు ఇస్తే డిపాజిట్లు రాకుండా దారుణంగా ఓడిస్తామన్నారు. రౌడీ భావజాలమున్న గుమ్మనూరుకు సీటు ఇస్తే ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. 35 సంవత్సరాల పాటు జితేందర్ గౌడ్ కుటుంబం టీడీపీకి సేవలు చేసిందని, అలాంటి కుటుంబాన్ని పక్కన పెట్టి పేకాట నిర్వాహకుడు గుమ్మనూరుకు ఎలా సీటు కేటాయిస్తారని ప్ర శ్నించారు. టి.సదుంలో ఉద్రిక్తత అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని టీడీపీలో విభేధాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌కే అసెంబ్లీ టికెట్ దాదాపుగా ఖరారైందని అనుకుంటున్న సమయంలో రాజకీయ అరంగేట్రానికి తెర లేపిన జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో శంకర్ వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంపై పునరాలోచించి ప్రజాదరణ ఉన్న శంకర్‌కు టికెట్ కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు ఇటీవల రోడ్లెక్కి నిరసనలకు దిగారు. తాజాగా గురువారం టి.సదుంలో జయచంద్రారెడ్డి ఇంటింటా ప్రచారానికి రావడంతో ఆగ్రహంతో ఉన్న ఓ వ్యక్తి జయచంద్రారెడ్డి కారు అద్దాలను పగులగొట్టాడు. దీంతో కొంతసేపు గ్రామంలో ఘర్షణ నెలకొంది. ఎస్ఐ రవీంద్రబాబు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి జయచంద్రారెడ్డి నిరాకరించారు. ఆయన వెంట ప్రచారం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆలయంలో పూజలు నిర్వహించి వెనుదిరిగారు. నిడదవోలులో ఆందోళన పొత్తులో భాగంగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు నిడదవోలు టికెట్ కేటాయిస్తున్నారనే ప్రచారంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిడదవోలు పట్టణంలో ఆందోళన చేపట్టారు. నిడదవోలు పట్టణం, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు మద్దతుగా ప్లకార్డులతో పాదయాత్ర చేపట్టారు. గణేష్ చౌక్ సెంటర్, గణపతి సెంటర్ మీదుగా యర్నగూడెం రోడ్డులోని టీడీపీ పట్టణ కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. శేషారావు నాయకత్వం వర్థిల్లాలి, శేషారావు జిందాబాద్, నిడదవోలు గడ్డ – శేషారావు అడ్డా అంటూ నినదించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, నిడదవోలు టికెట్ శేషారావుకు కాకుండా బయటి వ్యక్తులకు ఎవరికిచ్చినా మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. టీడీపీ అధిష్టానం పునరాలోచించుకోవాలని సూచించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాచమళ్ళ శ్రీనివాస్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కారింకి సాయిబాబు, పార్లమెంటరీ అధికార ప్రతినిధి బుగ్గే శివరామకృష్ణశాస్త్రి, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల టీడీపీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, అతికాల శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. పిఠాపురంలో అసమ్మతి సమావేశం చంద్రబాబుకే క్లారిటీ లేదు.. ఇంక మా భవిష్యత్తుకేం గ్యారెంటీ ఇస్తాడు’ అంటూ కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ వర్గాలు ఆందోళనకు దిగాయి. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ లేఖలను తగులబెట్టారు. తనకు టికెట్ నిరాకరించి, జనసేనకు కేటాయిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మకు సమాచారం అందడంతో.. టీడీపీ వర్గాలు గురువారం పిఠాపురంలో ఆందోళనకు దిగాయి. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో వర్మకు టికెట్ నిరాకరించడంతో టీడీపీలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతామని హెచ్చరించారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలను సైతం పట్టుకునేది లేదని చెప్పారు. రాజీనామాలకు సంతకాలు సేకరించారు. వర్మ మాట్లాడుతూ ‘నేనేమన్నా నేరం చేశానా? నా ఆస్తులు అమ్ముకుని రాజకీయం చేశాను’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తాను చేసిన సేవను గుర్తించి చంద్రబాబు తనకే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ, పిఠాపురం వర్మ అడ్డా అని, దానిని వేరేవారికి కేటాయించడానికి ఎవరికీ హక్కు లేదని వ్యాఖ్యానించారు. కోవూరులో పోలంరెడ్డి కుటుంబం కుతకుత కోవూరు టికెట్ విషయంలో రెండు దశాబ్దాల కాలంగా టీడీపీని నమ్ముకున్న పోలంరెడ్డి కుటుంబానికి చంద్రబాబు హ్యండిచ్చారు. ఇటీవలే పార్టీ ఫిరాయించిన వేమిరెడ్డి కుటుంబానికి కోవూరు సీటు ఖరారు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో పోలంరెడ్డి వర్గం మండిపడుతోంది. నిన్నటి వరకు సీటు తనదేనంటూ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి పార్టీ వ్యవహారాల్లో మునిగితేలారు. ఇటీవల పార్టీ అధినేత పర్యటనల సమయంలో చేతిచమురు కూడా వదిలించుకుంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కోవూరు సీటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఖరారు చేస్తున్నట్లు లీకులిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు టీడీపీలో కీలకనేతగా ఉన్నారు. మూడు సార్లు టీడీపీ తరుపున పోటీచేసి రెండుసార్లు విజయం సాధించారు. పోలంరెడ్డికి అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం తన రాజకీయ వారసుడిగా తనయుడు దినేష్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధిష్టానం కూడా దినేష్ రెడ్డిని ప్రోత్సహించింది. ఈ క్రమంలో సీటు విషయంలో చంద్రబాబు పేచీ పెట్టడంతో దినేష్ రెడ్డి రాజకీయ జీవితం సందిగ్థంలో పడింది. ఆత్మ గౌరవం దెబ్బతిన్నదంటూ పార్టీ ఫిరాయించిన ఎంపీ వేమిరెడ్డి భార్యకు కోవూరు సీటు ఖరారు చేస్తుండడంపై పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి అందలం ఎక్కించడం వెనుక కేవలం డబ్బుమూటలే పనిచేస్తున్నాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. -
యూరప్ దేశాల వ్యవసాయ సంక్షోభం వెనక...
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడి దారీ విధానం వలన ఆ యా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందో ళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశా లతో పాటు, ఆ కూటముల్లో ఉన్న దేశాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గుర య్యారు. నేటి ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వలన రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈయూ దేశాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి – పంటలకు న్యాయమైన ధరలూ, వాటి విక్ర యాలూ! రష్యా యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు చాలా దేశాలకు ఆగిపోయిన సందర్భంలో అమెరికా సూచనల మేరకు యూరప్ దేశాలు ఉక్రెయిన్ నుంచి పెద్దయెత్తున చౌకగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక రైతాంగం వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి నష్టాలను ఎదుర్కొంటు న్నాయి. ఆహార దిగుమతులతో పాటు ఈయూ పర్యావరణ నిబంధనలు రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తించాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు 4 శాతం సాగు భూమిని శాశ్వతంగా ఖాళీగా వదిలివేయాలన్న నిబంధన యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ఇంతే కాకుండా ప్రతి ఏడాదీ పంట మార్పిడి తప్పనిసరి చేశాయి. సాగు అవసరాలకు విని యోగిస్తున్న పెట్రోల్, డీజిళ్లపై ఇస్తున్న సబ్సిడీ ఎత్తి వేయాలని ఈయూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైతాంగం సాగు వ్యయం విపరీతంగా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందు తున్నారు. యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతాంగం తమ పాలకుల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తమ పుట్టి ముంచుతాయని స్పెయిన్ రైతాంగం భయపడుతున్నది. కొద్ది సంవత్సరాలుగా ఈయూ దేశాల్లో వాతావరణ పరిస్థితులు సేద్యానికి అనుకూలంగా లేవు. నదుల్లో నీటిమట్టం తగ్గి సేద్యానికి నీటి లభ్యత తగ్గింది. ఫలితంగా రైతాంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నారు. నెదర్లాండ్స్‌లో ‘వాల్’ నది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. స్పెయిన్ ప్రధాన నదుల్లో ఒకటైన ‘గ్వాదల్ క్విలిర్’ నదిలో సాధారణ నీటిమట్టంలో నాలుగవ వంతు నీరు మాత్రమే ఉంది. స్పెయిన్‌లో వ్యవసాయం విస్తృతంగా ఉండటంతో నీటి అవసరాలు ఎక్కు వగా ఉన్నాయి. ఇటలీ లోనూ నీటి లభ్యత తగ్గింది. ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి పాలకులు దిగుమతులు పెంచడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి. దీంతో రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఫ్రాన్స్‌లో 10 నుంచి 15 శాతం పొలాలపై ఒక బిలియన్ యూరోలకు మించి రుణాలు ఉండటంతో రైతులు దివాళా స్థితిలో ఉన్నారని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రే అంచనా వేశారు. పాల ధరల పతనంపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రధానంగా చర్చించింది. ఈయూ దేశాల రైతు వ్యతిరేక విధానాలను నిర సిస్తూ ఈక్రింది డిమాండ్లకై రైతాంగం ఆందోళన బాట పట్టారు. ఆహారోత్పత్తుల దిగుమతులను ఈయూ అరికట్టాలి. ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ఆసియా దేశాలకు మళ్లించేలా చేయాలి. ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులు నిలిపి వేయాలి. సాగుపై ప్రభుత్వ పరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. 4 శాతం భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధన ఎత్తివేయాలి. పర్యావరణ నిబంధనలు సడలించాలి. పెట్రోల్, డీజిళ్లపై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. పంటల బీమా పథకం ప్రీమియం పెంచరాదు. నష్టపోయిన రైతులకు పరి హారం చెల్లించాలి వంటి అనేక డిమాండ్లతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలెండ్, స్పెయిన్, రుమేనియా, హంగరీ, గ్రీస్, పోర్చుగల్, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా దేశాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. జర్మనీలో అధిక ఇంధన ధరలకు వ్యతిరేకంగా వారం రోజుల నిరసన కార్యక్రమంలో తమ ట్రాక్టర్లతో 10వేల మంది రైతులు సెంట్రల్ బెర్లిన్ వీధుల్లోకి వచ్చి ఆర్థిక మంత్రి క్రిష్టియన్ విండన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 2న ఉక్రెయిన్‌కు తాజాగా నిధులు మంజూరు చేయడానికి ఈయూ నాయకులు సమావేశం నిర్వహించగా బెల్జియం పార్లమెంట్ ఆవరణ వెలుపల వందలాది మంది రైతులు నిరసన తెలియ చేశారు. గ్రీస్‌లో రెండవ అతిపెద్ద నగరమైన థెస్సులోనికి రైతులు ట్రాక్టర్లతో కవాతు తొక్కారు. ఫ్రాన్స్‌లో నిరసన తెలుపు తున్న రైతులు ప్యారిస్ వెలుపల, లియోన్, టౌలేస్ నగరాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. యూరప్ దేశాల పాలకులకు వ్యతిరేకంగా రైతాంగ ఆందోళనకు మద్దతుగా 73 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కూ ఇతర దేశాల పాలకులకూ తీవ్ర ఆందోళన కలిగించింది. ఫలి తంగా యూరప్ వ్యవసాయ సంక్షోభ నివారణ కోసమంటూ ఈయూ 500 మిలియన్ల యూరోలను విడుదల చేసింది. యుద్ధాలకు, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ సంక్షోభాలకు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానమే కారణం. రెండు ప్రపంచ యుద్ధాలు దీన్నే రుజువు చేశాయి. పెట్టుబడిదారీ వ్యవ సాయం కూడా సంక్షోభానికి మినహాయింపు కాదనీ, అమెరికా ప్రపంచ ఆధిపత్య వ్యూహాత్మక విధానం వలన పెట్టుబడిదారీ దేశాలు కూడా సంక్షోభానికి గురౌతున్నాయనీ గ్రహించాలి. - వ్యాసకర్త రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతుకూలీ సంఘం (ఏపీ) ‘ 98859 83526 - బొల్లిముంతసాంబశివరావు -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ నీటి పోరు యాత్ర
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. తర్వలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి -
టీడీపీకి ‘తూర్పు’ సెగ
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు. రాజోలు టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు. కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజాన‘గరం’ రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పుడు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహార శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తర్వాత నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకాణం కొన్నాళ్లు బంద్ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. రాజానగరం టికెట్ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫేక్ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. -
Israel-Hamas war: గాజాలో పౌరుల మరణాలను నివారించాలి
ది హేగ్: ఇజ్రాయెల్ ఆర్మీ– హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణనష్టం సంభవిస్తుండటం, ప్రజలు అంతులేని వేదనకు గురికావడంపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా అక్కడ అమాయక ప్రజల మరణాలను, నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణహోమానికి పాల్పడుతోందన్న ఆరోపణలను కొట్టివేయరాదని ఐసీజే నిర్ణయించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలన్న ఉత్తర్వులను మాత్రం ఐసీజే ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు మధ్యంతర తీర్పు మాత్రమేనని చెబుతున్నారు. గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా, అక్కడి ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా చూడాలని దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. దీని విచారణకు ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. -
నిధులైనా... విధులైనా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. ఊర్లలో పనులు చేయించి.. రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు. గడువు ముగుస్తుండటంతో.. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్ఎస్కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వారినే ఇన్చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. ‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్‌లుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ ఏడాదికిపైగా పెండింగ్ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్ పెట్టడంతో పెండింగ్ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి. కొనసాగిస్తే భరోసా! గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్ ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
Russia: రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు.. కారణమిదే
మాస్కో: మైనారిటీ ఉద్యమ నేత ఫెయిల్ అల్సినోవ్‌కు మద్దతుగా రష్యాలో వందల మంది ఆయన మద్దతు దారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బాష్కోర్టోసాన్ ప్రాంతంలో అల్సినోవ్ కోసం భారీ సంఖ్యలో మద్దతుదారులు నిరసనకు దిగారు. వీరిలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిరసనకారులు వెంటనే ఆందోళన విరమించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పోలీసులకు, నిరసనకారులకు వాగ్వాదం, తోపులాట జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్సినోవ్‌కు మద్దతుగా ఇది ఈ వారంలో ఆందోళకారులు చేసిన మూడవ నిరసన కావడం గమనార్హం. విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అల్సినోవ్‌కు ఇటీవలే నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. బాష్కిర్ మైనారిటీ వర్గానికి అల్సినోవ్ ఒక హీరో. వారి భాష, సంస్కృతి కోసం అల్సినోవ్ తీవ్ర ఉద్యమం చేశాడు. బాష్కిర్ వర్గం వారు పవిత్రంగా భావించే కొండపై మైనింగ్ జరగకుండా 2020లో ఉద్యమం నడిపి విజయవంతమయ్యాడు. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చిలో జరగనుండగా ఈ నిరసనలు జరుగుతుండటం గమనార్హం. In #Ufa, #Bashkortostan republic, #Russia, some 1,000 people joined a #protest rally in support of imprisoned activist Fail Alsynov; police are reportedly detaining protesters. pic.twitter.com/u0rn8HBchD — Alex Kokcharov (@AlexKokcharov) January 19, 2024 ఇదీచదవండి.. గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్‌ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.