తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత | Aqua Food Park agitation at tundurru | Sakshi
Sakshi News home page

తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత

Published Fri, Jun 30 2017 8:09 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత

తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత

భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం మండలం తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా మహిళలు రాస్తారోకోకు దిగారు. గురువారం అర్దరాత్రి సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు తిరిగి ప్రారంబించేందుకు సన్నాహాలు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఫ్యాక్టరీలోపలికి వెళ్లేందుకు వచ్చిన లారీలను అడ్డుకుని కిరోసిన్ డబ్బాలతో రోడ్ పై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ నినాదాలు చేశారు. గ్రామస్దుల ఆందోళనలతో  ఎట్టకేలకు లారీలు వెనుదిరిగాయి. లారీలు వెనుదిరగడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement