tundurru
-
షరతులకు లోబడే ఆ పరిశ్రమను నిర్వహిస్తున్నారా?
సాక్షి, న్యూఢిల్లీ : తుందుర్రు మెగా ఆక్వా పుడ్ పార్క్‌ను వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడుతున్న కాలుష్యం, దుర్వాసనపై సంయుక్త తనిఖీలు చేపట్టాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో మెగా ఆక్వా పుడ్ పార్క్ నిర్మాణం చేపట్టారని ఎస్‌సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ మండలి విధించిన షరతులకు లోబడే పరిశ్రమను నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని తనిఖీలు చేయడాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలను ఆదేశించింది. అనుమతులకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మెగా పుడ్ పార్క్ వ్యర్థాలను పంపేందుకు పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్‌లైన్ అంశంపై తమ స్పందనను తెలియజేయాలని ఏపీ ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమ నుంచి వచ్చే దుర్వాసన, కాలుష్యంకు సంబంధించిన నివేదికలు ఎన్టీటీకి సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలకు సూచించింది. -
రాష్ట్రంలో ఆటవిక పాలన
నరసాపురం : రాష్ట్రంలో చంద్రబాబునాయుడి ఆటవిక పాలన సాగుతోందని చెప్పడానికి తుందుర్రు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలే నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. సోమవారం నాని ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్న తుందుర్రు గోదావరి ఆక్వాఫుడ్పార్కు ఉద్యమకారులను పరామర్శించారు. జైలులో ఉన్న 22 మంది ఉద్యమకారులతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన నాని అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. కాలుష్య కారకమైన ఫ్యాక్టరీ ఇళ్ల మధ్య కట్టడం వల్ల తమ ఉపాధి పోతుంది, ఆరోగ్యాలకు ముప్పు కలుగుతుందని రెండేళ్లుగా 40 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే వారిపై తప్పుడు కేసులు పెట్టించి జైళ్లకు పంపడం దారుణమన్నారు. ప్రభుత్వం మాది, అధికారంలో ఉన్నాము కాబట్టి మా మాటే వినాలి అనే నియంతృత్వ ధోరణితో టీడీపీ సర్కారు వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమేనన్నారు. రెండు సార్లు కలిసిన తుందుర్రు ఆక్వాపార్కు బాధితుల పట్ల ముఖ్యమంత్రి కర్కశంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే తుందుర్రు రొయ్యల ఫ్యాక్టరీకి కాపలా దారుడిగా, గుత్తేదారుడిగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. లేకపోతే పాత కేసులు తిరగతోడి జనాన్ని జైళ్లలోకి నెట్టి, వందలమంది పోలీసుల పహారా మధ్య ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సాగించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక ఫ్యాక్టరీ విషయంలో ఇంతమంది జనాన్ని ఎందుకు బాధపెడుతున్నారో ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పితాని సీఎం మెప్పుకోసం పాకులాడుతున్నారు కార్మిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పితాని సత్యనారాయణ తుందుర్రు ఆక్వాపార్కు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశించామని నాని పేర్కొన్నారు. అయితే ఆయన తీరు నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేల కంటే అధ్వానంగా ఉందన్నారు. నేనున్నాను..సమస్యను పరిష్కరించేస్తానని మాయమాటలు చెప్పి బాధితులను రెండుసార్లు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. తీరా ముఖ్యమంత్రి బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోగా, సంబంధం లేకుండా జగన్ రెచ్చగొడుతున్నారంటూ పితాని ముందే, బాధితులకు సీఎం చివాట్లు పెట్టడం దారుణమన్నారు. మంత్రి పితాని సీఎం మెప్పుకోసం పాకులాడుతున్నారే తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో విషవాయువులు చిమ్మి ఐదుగురు ప్రాణాలు విడిచినప్పడు మంత్రి పితాని కమిటీ వేస్తానన్నారని చెప్పారు. తుందుర్రు ఫ్యాక్టరీ విషయంలో కూడా కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనలను వైఎస్సార్ సీపీ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. మరి ఆ మాటలన్నీ ఏమైపోయాయో, ముఖ్యమంత్రి వద్దకు బాధితులను తీసుకెళ్లి ఏం ఒరగబెట్టారో కూడా మంత్రి పితాని చెప్పాలన్నారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన నేతలు వైఎస్సార్ సీపీ నాయకుల బృందం సబ్‌జైలుకు వచ్చే సమయంలో జైలులో ఉన్న వారి కుటుంబ సభ్యులు అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నారు. మహిళలు పిల్లలతో సహా వచ్చి జైలులో ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఆళ్ల నాని, పార్టీ ఇతర నాయకులు ముందుగా వారితో మాట్లాడారు. లక్కు వరలక్ష్మి తన ఇద్దరు చిన్నారులు అవినాష్, దిలీప్‌లతో కలసివచ్చి జైలు బయట కూర్చుని ఉంది. తన భర్త రామకృష్ణను జైలులో పెట్టారని నాన్న కావాలని ఏడుస్తుంటే, చూపిద్దామని జైలుకు తీసుకొచ్చానని వరలక్ష్మి రోదిస్తూ నాని ముందు వాపోయింది. వైఎస్సార్సీపీ నాయకులు ఆమెకు, ఇదే తరహాలో జైలువద్దకు వచ్చిన మరికొంత మందికి ధైర్యం చెప్పారు. తుదివరకూ పోరాడుదామని, ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని నచ్చజెప్పారు. నరసాపురం, భీమవరం మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు గుణ్ణం నాగబాబు, కవురు శ్రీనివాస్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సాయిబాలపద్మ తదితరులు ఉన్నారు. -
పల్లెలపై ప్రతాపం
తుందుర్రు పరిసర గ్రామాల్లో పోలీసుల దమనకాండ భారీగా మోహరింపు 144 సెక్షన్ కొనసాగింపు ఇంటికో పోలీస్ భయం గుప్పెట ప్రజలు గడపదాటేందుకూ వణుకు ఎక్కడ చూసినా ఖాకీలే ఆక్వా ఫుడ్‌పార్క్‌కు నిర్మాణ సామగ్రి తరలింపు కోసం తుందుర్రు పరిసర గ్రామాల్లో శుక్రవారం పోలీసులు భయోత్పాతం సృష్టించారు. లాఠీలు, తుపాకులు చేతబట్టి ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. బూటుచప్పుళ్లతో భీతావహ వాతావరణాన్ని తలపించారు. ప్రజలను బయటకు రాకుండా ఇళ్లలోనే నిర్బంధించారు. ఫలితంగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే మగ్గారు. యుద్ధసామగ్రి తరలింపును తలపించేలా ఆక్వాఫుడ్‌పార్క్‌కు కంటెయినర్లలో సామగ్రిని దగ్గరుండి భారీబందోబస్తు మధ్య తరలించారు. నరసాపురం, నరసాపురం రూరల్ /భీమవరం : నరసాపురం మండలం కె.బేతపూడి, భీమవరం మండలం తుందుర్రు గ్రామాల మధ్యలో ఉన్న పల్లెల్లో శుక్రవారం పోలీసులు బీభత్సం సృష్టించారు. ప్రతి ఇంటి వద్దా మోహరించారు. ప్రజలను గడపదాటనివ్వలేదు. తుందుర్రులోని ఆక్వా ఫుడ్‌ఫ్యాక్టరీకి సామగ్రి తరలింపును దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం జరిగిన పోలీసుల దమనకాండకు నిరసనగా ప్రదర్శనకు పిలుపునిచ్చిన ప్రజాసంఘాలపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. నిర్ధాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందంటూ భయోత్పాతం సృష్టించారు. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే నిలబడి కంటెయినర్ల తరలింపును చూస్తూ ఉండిపోయారు. యుద్ధ యంత్రాలు తరలించినట్టుగా.. ఉదయం 11 గంటల నుంచీ యంత్రాలతో కంటెయినర్లు తుందుర్రు ఫ్యాక్టరీ వైపు బయలుదేరాయి. వీటిని భారీ బందోబస్తు మద్య పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేర్చారు. మత్స్యపురి నుంచి తుందుర్రు వరకూ భారీగా మొహరించారు. ఒక్కో కంటైనర్ వెనుకా ఓ డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. మొత్తం వంద మంది సిబ్బంది కంటెయినర్ల తరలింపులో నిమగ్నమయ్యారు. వీరుకాక అడుగడుగునా మోహరించేందుకు 800 మంది సిబ్బందిని వినియోగించినట్టు సమాచారం.వీరిని రాజధాని, అమరావతి, కృష్ణాజిల్లా నుంచి రప్పించినట్టు తెలుస్తోంది. ఇదంతా యుద్ధ సామగ్రి తరలింపు ప్రక్రియను తలపించింది. వీరవాసరం, మత్స్యపురి మీదుగా ఈ కంటెయినర్లను తరలించారు. అడుగడుగునా తనిఖీలు కంటెయినర్ల తరలింపు సందర్భంగా పోలీసులు గ్రామాల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగించారు. దీంతో పనులపై బయలుదేరిన వారు వాయిదాలు వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. నిరసనపైనా ఉక్కుపాదం.. గురువారం నాటి పరిణామాలకు నిరసనగా శుక్రవారం నరసాపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో సీపీఎం నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు మంతెన సీతారామ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ సెంటర్లో ఆందోళన చేసే యత్నం చేశారు. అయితే అక్కడికి సిబ్బందితో కలిసి చేరుకున్న టౌన్ ఎస్సై కె.చంద్రశేఖర్ ఆందోళన విరమించాలని సూచించారు. దీనికి నిరసనకారులు అంగీకరించకపోవడంతో సీతారామ్తోపాటుగా తెలగంశెట్టి సత్యనారాయణ , బూడిద జోగేశ్వరరావు తదితరులను పోలీసులు లాక్కెళ్లి జీపులో పడేసి స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు ఉదయంపూట ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ, సీపీఎం నాయకుడు పొన్నాడ రాములను ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. పక్కా పోలీస్ వ్యూహం యంత్రాలను ఫ్యాక్టరీలోకి తరలించడానికి పోలీసులు పక్కా వ్యూహంతో పని చేసినట్టుగా తెలుస్తోంది. బుధవారం నుంచే ఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక కమిటీ నాయకులను, ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. వీరిని నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే మరికొంత మంది ముఖ్య నాయకులు పోలీసులకు చిక్కలేదు. దీంతో ఆ నాయకుల ఆధ్వర్యంలో గురువారం యంత్రాల తరలించే సమయంలో ఆందోళన జరిగింది. తోపులాటల్లో కొందరు కారం చల్లడం, కిరోసిన్ క్యాన్లు తీసుకురావడంతో సీన్ మారిపోయింది. దీనిని బూతద్దంలో చూపించి పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. ఉద్యమకారులు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని పోలీసులు 353, 307, 143, 149, 108 తదితర బలమైన సెక్షన్లతో 14 మంది కీలక నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో మరికొంతమందిని చేర్చడానికి రంగం సిద్ధం చేశారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా ఒకరోజు ముందు అదుపులోకి తీసుకున్న వారిపైనా పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఇలా బయట నాయకులు లేకుండా చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేయడం ద్వారా ఫ్యాక్టరీలోకి యంత్రాలను పంపగలిగారు. -
తుందుర్రులో టెన్షన్ టెన్షన్
-
తుందుర్రులో టెన్షన్
తుందుర్రు: స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ పనులు కొనసాగిస్తోంది. సర్కారు సహకారంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ యంత్ర సామాగ్రి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణ ప్రదేశానికి తరలించారు. ఇవాళ కూడా కంటైనర్ల ద్వారా మరికొంత సామాగ్రి తరలించే అవకాశముందని తెలుస్తోంది. ఆక్వాఫుడ్ పార్క్‌ను నిలిపి వేయాలని గత నెలలో సీఎం చంద్రబాబును కలిసి బాధితులు కోరినా ఆయన పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాలతో ముందుస్తుగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమపై దాడి చేశారంటూ 14 మంది ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలచెరువులో 144 సెక్షన్ విధించి ఆంక్షలు పెట్టారు. బాధిత గ్రామాల్లోకి ఇతరులు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. పోలీసు బలగాలతో ఆక్వాఫుడ్ పార్క్‌ను ఎన్నిరోజులు నడుపుతారని ప్రశ్నించారు. దీన్ని తీర ప్రాంతాలకు తరలించాలన్న విజ్ఞప్తిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. -
తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత
-
తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత
-
తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం మండలం తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా మహిళలు రాస్తారోకోకు దిగారు. గురువారం అర్దరాత్రి సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు తిరిగి ప్రారంబించేందుకు సన్నాహాలు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీలోపలికి వెళ్లేందుకు వచ్చిన లారీలను అడ్డుకుని కిరోసిన్ డబ్బాలతో రోడ్ పై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ నినాదాలు చేశారు. గ్రామస్దుల ఆందోళనలతో ఎట్టకేలకు లారీలు వెనుదిరిగాయి. లారీలు వెనుదిరగడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
తుందుర్రులో ఉద్రిక్తత
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో ఉద్రిక్తత ఏర్పడింది. ఆక్వాఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్నవారిని పోలీసులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. -
పతాక స్థాయికి పోరాటం
ముదునూరి దీక్షతో వేడేక్కిన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం మేధా పాట్కర్ పర్యటనతో జాతీయ స్థాయికి ’తుందుర్రు’ అంశం ఫ్యాక్టరీ యాజమాన్యానికి చంద్రబాబు అమ్ముడుపోయారంటూ రోజా ధ్వజం ప్రజాస్వామ్యం ముసుగులో అరాచక పాలన సాగిస్తున్నారంటూ అంబటి విసుర్లు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన తీరం రాష్ట్ర సర్కారు వెన్నులో వణుకు నరసాపురం : ఏడాదిన్నరగా ఉధృతంగా సాగుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలంటూ ప్రజలు సాగిస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల సాయంతో ప్రభుత్వం దమనకాండకు దిగుతున్న విషయం విదితమే. సర్కారు తీరు, ఆక్వా పార్క్ యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరి, నిత్యం ముట్టడిస్తున్న పోలీసు బలగాల నడుమ 40 గ్రామాల ప్రజలు సుమారు ఏడాది కాలంగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగిస్తున్న అరాచకాలతో వణికిపోతున్నారు. తమ జీవనాన్ని కాపాడుకునేందుకు.. భవిష్యత్ తరాలను కాలుష్యం బారినుంచి రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు అన్నిటినీ భరిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ రోడ్డెక్కని మహిళలు లాఠీదెబ్బలు సైతం తిన్నారు. చివరకు జైళ్లకు కూడా వెళ్లారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు పొరుగునే ఉన్న మొగల్తూరులోని నల్లంవారి తోటలో గల ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడటంతో వణికిపోయారు. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే ఇంతకంటే తీవ్రమైన దుర్ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తుందుర్రు ప్రాంత ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఉద్యమ తీవ్రతను పెంచింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షతో ఉద్యమం మరింత వేడెక్కింది. నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది. రాజకీయాలకు అతీతంగా జనం, సీపీఎం, ప్రజా సంఘాలు ముదునూరి దీక్షకు మద్దతు తెలిపాయి. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు, వీరవాసం మండలాల పరిధిలోని గొంతేరు డ్రెయిన్ పరీవాహక ప్రాంతాల్లో గల దాదాపు 40 గ్రామాల ప్రజలు తరలివచ్చి ముదునూరి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్ కాలుష్య కాసారం అవుతుందని జనం మరోసారి గగ్గోలు పెట్టారు. పంటలు నాశనమైపోతాయని రైతులు, ఉపాధి కరువవుతుందని మత్స్యకారులు, ఆరోగ్యాలు పాడవుతాయని దీక్షా వేదిక సాక్షిగా ప్రజలు కన్నీటి పర్వంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు బాధిత గ్రామాల్లో మిన్నంటాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే సత్తా చూపుతామని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముదునూరి చేపట్టిన దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. ఈ పోరాటం ఇక్కడితో అంతం కాదని, ఇకపై మరింతగా ఆరంభమవుతుందని దీక్ష అనంతరం ముదునూరి ప్రసాదరాజు ప్రకటించారు. నిప్పులు చెరిగిన రోజా ఆక్వా పార్క్ విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానం, ప్రజలపై సాగిస్తున్న దమనకాండపై వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు లంచాలు తీసుకున్నారు కాబట్టే ఆక్వా పార్క్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ’మహిళా దినోత్సవం రోజునే మహిళలను కొట్టిస్తావా చంద్రబాబూ.. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లాకు నీవిచ్చే బహుమతి ఇదేనా’ అంటూ నిలదీశారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు ప్రాంతం నుంచి జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు. మొగల్తూరు నల్లంవారి తోటలో ఇదే యాజమాన్యం నిర్వహిస్తున్న 10 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని.. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మించి ఇంకెంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దలుపుకుంటే ప్రభుత్వం సరిపోతుందా అని ప్రశ్నించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం, ఫ్యాక్టరీ లైసెన్స్‌లు రద్దు చేయడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టం ప్రభుత్వ కనీస బాధ్యత అని గుర్తు చేశారు. మేధా పాట్కర్ రాకతో.. వైఎస్సార్ సీపీ పోరాట తీవ్రతతో ఒక్కసారిగా మళ్లీ రగిలిన ఉద్యమం ప్రముఖ పర్యావరణవేత్త, నర్మదా బచావో ఉద్యమ నిర్మాత మేధా పాట్కర్ శనివారం రాత్రి కంసాలి బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో పర్యటించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలతో భేటీ అయ్యారు. తుందుర్రులోని ఆక్వా పార్క్‌ను సందర్శించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొగల్తూరులో ఆనంద ఆక్వా ప్లాంట్‌లో వెలువడిన విషవాయువుల వల్ల మరణించిన యువకుల కుటుంబాల వారితో మాట్లాటాడు. తుందుర్రు, కంసాలిబేతపూడి తదితర గ్రామాల్లో ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను తెలుసుకున్న ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో అరాచకాలు, పర్యావరణ ముప్పునకు రాష్ట్ర ప్రభుత్వమే బీజాలు వేసే ప్రయత్నాలపై జాతీయ స్థాయిలో చర్చ పెడతానని ప్రకటించారు. మొత్తంగా తుందుర్రు ఆక్వా పార్క్ ఉద్యమంలో వేడి మరింత రాజుకుంది. -
నిరాహార దీక్ష విరమించిన ప్రసాదరాజు
-
నిరాహార దీక్ష విరమించిన ప్రసాదరాజు
నరసాపురం: తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ నరసాపురం నియోజకవర్గ నమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. పార్టీ నేతలు ఆళ్లనాని, అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అంతకు ముందు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తుందుర్రు ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ తీర ప్రాంతానికి తరలే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆక్వా ఫుడ్‌ను నిరసిస్తూ ప్రసాదరాజు చేపట్టిన దీక్షకు అంబటితోపాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, పాతపాటి సర్రాజులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో అంబటి మాట్లాడుతూ 30 టన్నుల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అయిదుగురు చనిపోతే 3000 టన్నుల సామర్ద్యంతో నిర్మిస్తున్న తుందుర్రు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ఎంత నష్టమో తలుచుకుంటేనే ఆందోళన కలిగిస్తోందన్నారు. రెండేళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఉండదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలుసుకోవాలన్నారు. గతంలో పరిపాలించిన తొమ్మిదేళ్ల చంద్రబాబుకు నేటి బాబుకు చాలా తేడా ఉందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టాలని ఆలోచన చేయడం దుర్మార్గమని విమర్శించారు. రెండేళ్ల తర్వాత వైఎస్ జగన్ వస్తారు...ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలిస్తాం అని అంబటి చెప్పారు. -
ప్రసాదరాజు దీక్షకు రోజా సంఘీభావం
నరసాపురం: తుందుర్రు మెగా ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించాలన్న డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేపడుతున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రసాదరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల మీద లేదన్నారు. ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రులు గన్మెన్లు లేకుండా తుందుర్రుకు వస్తే ప్రజల ఆందోళన తీవ్రత అర్థమౌతుందన్నారు. మొగల్తురు ఘటనలో ఐదుగురు చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల లంచాలు తీసుకోబట్టే యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. -
ప్రసాదరాజు దీక్షకు రోజా సంఘీభావం
-
అచ్చెన్నాయుడూ.. నీ అబద్ధాలకు సాక్ష్యాలివిగో
మొగల్తూరు ఆనంద ప్లాంట్ వ్యర్థాలు గొంతేరులో నేరుగా కలుపుతున్నారు పెప్‌లైన్లను మీడియాకు చూపించిన వైఎస్సార్ సీపీ, సీపీఎం నేతల బృందం తుందుర్రు ఆక్వా పార్క్ పనులు ఆపేవరకు పోరాటం ఆగదని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ధనదాహానికి ఐదుగురు కార్మికులు బలైపోగా.. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. చనిపోయినవారి కుటుంబాలను కించపరిచే విధంగా, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు..’ అంటూ వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వంలోని బృందం మండిపడింది. ఆనంద రొయ్యల ఫ్యాక్టరీ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, ఫ్యాక్టరీ వ్యర్థాలను కలిపేందుకు గొంతేరు డ్రెయిన్‌లో వేసిన పైప్లైన్లను ఎప్పుడో పీకేశారని మంత్రి చెప్పారని.. ఫ్యాక్టరీ పైప్‌లైన్ గొట్టాలు ఇంకా గొంతేరు డ్రెయిన్‌కు అనుసంధానంగానే ఉన్న దృశ్యాలను చూపిస్తూ ఇదేంటని ప్రశ్నించారు. ఆళ్ల నానితోపాటు నరసాపురం, పాలకొల్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, గుణ్ణం నాగబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, ఇతర పార్టీ నేతలు మీడియాతో కలసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్‌ను మంగళవారం సందర్శించారు. ఇప్పటికీ ఉన్న ఈ పైప్లైన్లను ఐదునెలల కిందటే తొలగించేశారని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. తరు వాత ఈ బృందం కార్మికుల ప్రాణాలను బలిగొన్న ప్లాంట్ ఆవరణలోని ట్యాంక్‌ను పరిశీలించింది. ఆ ట్యాంక్ నుంచి విషవాయువులకు సంబంధించిన దుర్వాసన ఇంకా తగ్గకపోవడాన్ని గమనించింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగినట్టుగా మసి పూసే ప్రయత్నం ఎలా చేస్తున్నారని ఆళ్ల నాని ప్రశ్నించారు. తరువాత ఈ బృందం గొంతేరు డ్రెయిన్‌ను పరిశీలించి వ్యర్థాలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయనే దానిని చూసింది. ఇక్కడకు వచ్చే దమ్ముందా.. అసెంబ్లీలో అబద్ధాలతో ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నకు దమ్ముంటే మీడియాతో కలసి ఫ్యాక్టరీ వద్దకు రావాలని నాని సవాల్ విసిరారు. ‘నీ అబద్ధాలకు రుజువులు అలాగే ఉన్నాయి. చూసైనా కళ్లు తెరుస్తావా’ అని ప్రశ్నించారు. తుం దుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం నిలిపేయాలంటూ ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో స్థానిక రైతులు, మత్స్యకారులు, ప్రజలు ప్రభుత్వానికి మొగల్తూరులోని ఆనంద ప్లాంట్ విషయమై ఫిర్యాదు చేశారని చెప్పారు. తుందుర్రులో వైఎస్ జగన్ పర్యటించిన అనంతరం ప్రభుత్వంలో కాస్త చలనం వచ్చి.. నవంబర్‌లో అధికారుల కమిటీ ఆనంద ఆక్వా ప్లాంట్‌ను పరిశీలించిందని చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు నివేదిక ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. పరిస్థితిలో మార్పు రాకపోతే నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయాలని ఆదేశించిందని తెలిపారు. మరి అప్పుడు కార్మిక, పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్న ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. -
అచ్చెన్నాయుడూ.. నీ అబద్ధాలకు సాక్ష్యాలివిగో
-
ఆగ్రహ జ్వాల
నరసాపురం రూరల్/భీమవరం అర్బన్ : భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కె.బేతపూడి గ్రామాల్లో శుక్రవారం యుద్ధ వాతావరణం నెలకొంది. మొగల్తూరు ఘటనలో ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఘటన నేపథ్యంలో తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆక్వా పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పెద్దఎత్తున మోహరించిన పోలీసులు పోలీసులు అడ్డుకున్నారు. సుమారు రెండు గంటలపాటు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్వీ గోపాలన్, కవురు పెద్దిరాజు, ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ తదితరుల నేతృత్వంలో ప్రజలు ఆక్వా పార్క్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కె.బేతపూడి పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మొగల్తూరు ఘటనతో అయినా ప్రభుత్వం, అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌన్, పోలీసు జులుం నశించాలి, ఫ్యాక్టరీని తరలించాలి అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో పంచాయతీ కార్యాలయ ప్రాంతం నుంచి ఆక్వా పార్క్ వద్దకు వెళ్లేందుకు వందలాది మంది ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ కాలికి గాయమైంది. పోలీసులు ఫ్యాక్టరీ యజమానులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరును దుయ్యబడుతూ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పిన అనంతరమే రోడ్డెక్కినప్పటికీ అడ్డుకోవడం ఏమిటంటూ సీపీఎం నాయకులు పెద్దిరాజు, త్రిమూర్తులు తదితరులు డీఎస్పీ స్థాయి అ«ధికారులను, ఎస్సైలను ప్రశ్నించారు. ఇదిలావుంటే కొందరు యువకులు, మహిళలు పంచాయతీ కార్యాలయం వెనుక వైపు ఉన్న వాటర్ ట్యాంకు వద్దకు చేరుకుని ఆక్వా పార్క్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ’కేవలం 30 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లోనే ఐదుగురు చనిపోతే.. తుందుర్రులో 350 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ నుంచి వెలువడే కాలుష్య భూతం వల్ల ఎంతమంది మరణిస్తారో మేరే గమనించండి. పోలీసులుగా కాకుండా.. సాధారణ ప్రజలుగా ఆలోచించండి’ అంటూ ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ’మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే యాజమాన్యాలు.. మేమంతా కలిసి ఎంతిస్తే వారు చనిపోవడానికి సిద్ధమో తెలపాలి’ అంటూ పలువురు ఆవేశంతో ఊగిపోయారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొత్తపల్లి కాశీవిశ్వనాథం, బెల్లపు సత్యనారాయణ, మామిడిశెట్టి రామాంజనేయులు, బెల్లపు భవానీ, జవ్వాది సత్యవతి, పోతురాజు మంగతాయారు, ముచ్చర్ల కనకమహాలక్ష్మి,సత్యవతి, సముద్రాల సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. మళ్లీ రగిలిన ’తుందుర్రు’ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా ప్లాంట్ నుంచి విష వాయువులు వెలువడి ఐదుగురు కూలీలు మృత్యువాత పడిన ఘటనతో గోదావరి మెగా ఆక్వా ఫుడ్పార్ నిర్మిస్తున్న తుందుర్రు, కె.బేతపూడి తదితర గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలనే డిమాండ్ంతో తుందుర్రు, కె. బేతపూడి, జొన్నలగరువు గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని ముట్టడించే ప్రయత్నం చేశారు. వ్యూహం ప్రకారం ముందుగానే భారీగా మోహరించిన పోలీసు బలగాలు ప్రజలను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సుమారు రెండు గంటలపాటు పోలీసులకు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌన్, పోలీసు జులుం నశించాలి, ఫ్యాక్టరీని తరలించాలి అంటూ ప్రజలు పెద్దపెట్టున నినదించారు. నరసాపురం మండలం కె.బేతపూడి పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న వందలాది మంది జనం ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అ క్రమంలో ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ కాలికి బలమైన గాయమైంది. మహిళలపై మగ పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ప్రజలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కొందరు పంచాయతీ కార్యాలయం వెనుక నుంచి ఆక్వా పార్క్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు మరోసారి వారిని అడ్డుకున్నారు. కేవలం 30 టన్నుల సామర్థ్యం ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురు చనిపోతే ఇక్కడి గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన 350 టన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలో రోజూ ఎంతమొత్తంలో విషవాయువులు వెలువడతాయో గుర్తించాలంటూ పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ ఫ్యాక్టరీని అడ్డుకునేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారంతా హెచ్చరించారు. -
తుందుర్రు గ్రామాల్లో సర్కారు దాష్టీకం
-
ఈడ్చేశారు
వ్యాన్లలోకి విసిరేశారు తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నల గరువు గ్రామాల్లో సర్కారు దాష్టీకం ఆందోళనకారులపై పిడిగుద్దులు కురిపించిన పోలీసులు మహిళల్ని బూటుకాళ్లతో తన్ని లాఠీలు ఝళిపించిన ఖాకీలు ఆక్వా పార్క్‌ను ముట్టడించాలనే ప్రయత్నానికి అడ్డుకట్ట వందమందికి పైగా నిరసనకారుల అరెస్ట్ భీమవరం/భీమవరం అర్బన్/నరసాపురం రూరల్ : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ప్రభావిత గ్రామాలైన తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు రణరంగంగా మారాయి. భారీగా తరలివచ్చిన పోలీసులతో సోమవారం అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. ఆక్వా పార్క్‌ను ముట్టడించేందుకు సమాయత్తమైన పోరాట కమిటీ, సీపీఎం నాయకులతోపాటు ఆ గ్రామాల ప్రజలపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. నాయకులతోపాటు మహిళలను, వృద్ధులను సైతం ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి విసిరేశారు. తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఆక్వా పార్క్ వల్ల తీవ్రస్థాయిలో కాలుష్యం వెదజల్లుతుందని, దీనివల్ల పంటలు, పర్యావరణంతోపాటు ప్రజారోగ్యం దెబ్బతింటాయని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం విదితమే. ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలని, ఫ్యాక్టరీ ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ నెలకొల్పాలని భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు మూడేళ్లగా కోరుతున్నారు. అక్కడ ఆక్వా పార్క్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోరాట కమిటీ పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. వారికి సీపీఎం, వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తూ వేధింపులు, లాఠీచార్జి, అరెస్ట్‌లు భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయినా.. ఉద్యమ తీవ్రత పెరుగుతోందే తప్ప ఆ ప్రాంత ప్రజలు వెనుకడుగు వేయడం లేదు. ఇందులో భాగంగానే ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని అక్కడి ప్రజలు నిర్ణయించుకోగా వేలాదిమంది పోలీసులు మోహరించి ఉద్యమకారులతోపాటు మహిళలు, గర్భిణులు, వృద్ధులను సైతం పోలీసులు దమనకాండకు దిగి అరెస్ట్ చేశారు. ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలు వెల్లువెత్తాయి. అనంతరం మానవ హక్కుల వేదిక నాయకురాలు విమల, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకుడు బి.రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిజనిర్థారణ బృందం ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించింది. ఆక్వా పార్క్ వల్ల తీవ్ర అనర్థాలు ఏర్పడతాయని, తక్షణం పనులు నిలిపివేసి వేరే ప్రాంతాలనికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఫుడ్‌పార్క్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. సీపీఎం నాయకులు ముందుగానే తుందుర్రు చేరుకుని కార్యాచరణ రూపొందించారు. భారీగా మోహరించిన పోలీసులు విషయం పోలీసులకు తెలియడంతో ఆదివారం రాత్రికే ఆయా గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి బయటి ప్రాంతాల నుంచి తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల నుంచి ఏడుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, వందలాది మంది పోలీస్ కానిస్టేబుల్స్ పోరాట కమిటీ నాయకుల కోసం జల్లెడ పట్టారు. వారి జాడ తెలియకపోవడంతో నిఘా కొనసాగించారు. సోమవారం ఉదయం కంసాలి బేతపూడిలో మహిళలు, పోరాట కమిటీ నాయకులు రోడ్డుపైకొచ్చి ఆక్వా పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని చుట్టుముట్టి రోడ్లుపై ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలోకి విసిరేశారు. వారందరినీ మొగల్తూరు, నరసాపురం స్టేషన్లకు తరలించారు. అనంతరం తుందుర్రులో లేసుపార్కు వద్దకు ఒక్కసారిగా ఆందోళనకారులు రావడంతో సీపీఎం, పోరాటకమిటీ నాయకులు వారితో జతకలసి ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్వీ గోపాలన్, ఐద్యా నాయకురాలు డి.కల్యాణి, పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది వెంకటరమణ, ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి సత్యవతి, జవ్వాది సత్యనారాయణ తదితర 100 మందిని అరెస్ట్ చేశారు. భయాందోళనకు గురైన ప్రజలు, పిల్లలు, వృద్ధులు ఇళ్లల్లోంచి బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. పిడిగుద్దుల వర్షం ఉద్యమకారులను అరెస్ట్ చేసే నెపంతో రోడ్లవెంట ఈడ్చుకెళ్లిన పోలీసులు వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కె.బేతపూడి రామాలయం వీధినుంచి పంచాయతీ కార్యాలయం రోడ్డుపైకి వస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నరసాపురం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ తదితరులతోపాటు గ్రామంలోని మహిళలు సైతం ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లు చేతులూ పట్టుకుని గాల్లోకి ఎగరేసిట్టుగా వాహనాల్లోకి విసిరేశారు. మహిళల్ని సైతం బూటు కాళ్లతో తన్నుతూ లాఠీలు ఝళిపించారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ పని చేసింది నిజమైన పోలీసులు కాదని.. ఖాకీ దుస్తుల్లో వచ్చిన రౌడీలు ఈ దాష్టీకానికి దిగారని పలువురు మహిళలు ఆరోపించారు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు గ్రామాల్లో ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఆక్వా పార్క్ యాజమాన్యం పురమాయించిన 10 మంది వ్యక్తులు మూడు గ్రామాల్లోను ప్రతి వ్యక్తిని ఫొటో, వీడియోలు తీశారు. ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టి జైళ్లలో బంధిస్తామంటూ బెదిరించారు. ఆదివారం రాత్రి నుంచే పోరాట కమిటీ నాయకుల కోసం గ్రామాల్లో జల్లెడ పట్టిన పోలీసులు కవురు పెద్దిరాజు, మామిడిశెట్టి రామాంజనేయులును అరెస్ట్ చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్‌తోపాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయంటూ ఆటోలకు మైక్‌లు కట్టి ప్రచారం చేశారు. ఎక్కడైనా ఇద్దరు, ముగ్గురు కనబడితే లాఠీలకు పనిచెప్పి బెదిరించారు. ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున పోలీసులను కాపలాగా పెట్టారు. -
తుందుర్రులో ఉద్రిక్తత
భీమవరం: పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలంలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా ఫుడ్ పార్క్‌ను ముట్టడిస్తామని సీపీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ 144వ సెక్షన్ విధించి పోలీసులను భారీగా మోహరించారు. గ్రామానికి చెందిన ముగ్గురు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తుందుర్రుతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. -
తుందుర్రులో ఉద్రిక్తత
-
ఆక్వాపార్క్‌తో జీవన ప్రమాణాలకు దెబ్బ
భీమవరం : గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యకారకంగా మార్చి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీసేలా తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ను నిర్మిస్తున్నారని న్యాయవాది, మానవహక్కుల వేదిక నాయకురాలు ఎం.విమల, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సభ్యుడు బి.రామకృష్ణంరాజు అన్నారు. ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాలైన తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు, మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లిలో శనివారం వీరు పర్యటించారు. బాధిత ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆక్వాపార్క్ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే అంశాలు, కాలుష్యంపై జాతీయ మానవహక్కుల వేదిక, పర్యావరణ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనున్నట్టు విమల చెప్పారు. మూడేళ్లుగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా 40 గ్రామాలకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఫుడ్‌పార్క్ వల్ల ఎటువంటి కాలుష్యం బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పిన ప్రభుత్వం ఫ్యాక్టరీలోని కలుషిత నీటిని సముద్రంలో కలపడానికి రూ.12 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు మంజూరు చేసిందని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో రొయ్యలను శుద్ధిచేయడానికి రోజూ 1.15 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తారని, తర్వాత దీనిని బయటకు వదలడం ద్వారా భూగర్భ జలాలకు ముప్పుతప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1,200 మందికి ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తూ లక్షల మంది భవిష్యత్‌ను విస్మరించడం దారుణమన్నారు. అనర్థాలు తప్పవు ఆక్వా ఫుడ్‌పార్క్ వల్ల అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం అడ్డగోలుగా మద్దతు ఇవ్వడం దారుణమని కృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీతో విచారణ చేయించి ఫ్యాక్టరీ నిర్మాణంపై ముందుకు సాగాలని సూచించారు. ప్రజా ఉద్యమాల జాతీయ కన్వీనర్ మీరా సంగమిత్ర మాట్లాడుతూ ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్దంటున్న ప్రజలపై నిర్బంధాన్ని ఆపాలని, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బృందంలో రోహిత్, రాహుల్ ఉన్నారు. -
అడుగడుగునా ఆంక్షల కత్తి
భీమవరం: తుందుర్రు అంటే ఉలికి పడుతున్న ప్రభుత్వం.. ఆక్వా ఫుడ్‌పార్క్ పేరెత్తితే ఆగమేఘాలపై రంగంలోకి దిగుతున్న పోలీసులు.. అరెస్టులు, నిర్బంధాలు షరా మామూలైపోయాయి. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న కాలుష్య కారక గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను సముద్ర తీరప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా దాదాపు 40 గ్రామాల ప్రజల పోరాటం చేసూ్తనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌పార్క్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేసేలా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలిసి వినతిపత్రం అందించాలని సోమవారం అమరావతి వెళ్లిన సీపీఎం, పోరాట కమిటీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరోసారి పో రాటంపై అక్కసు వెళ్లగక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుందుర్రులో గోదావరి మెగా ఫుడ్‌పార్క్ వల్ల కలిగే అనర్థాలను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు వివరించేందుకు సీపీఎం నాయకులు వి.ఉమామహేశ్వరరా వు, జేఎన్వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ ముందుగా అసెంబ్లీ గేట్‌పాస్‌లు తీసుకున్నారు. దీనికిగాను సోమవారం అనుమతి లభించింది. గేట్పాస్తో పాటు వినతిపత్రాన్ని తీసుకుని బ యలుదేరిన వారిని అసెంబ్లీలోనికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదేమని ప్రశ్నించగా అసెంబ్లీలో ఎటువంటి వినతిపత్రాలు ఇవ్వడానికి అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. వినతిపత్రాన్ని మీకే ఇచ్చేస్తామని పాస్‌లు ఉన్నందును తమను లోనికి అనుమతించాలని సీపీఎం, పోరాట కమిటీ నాయకులు పోలీసులను కోరారు. అయినా వినిపించుకోకుండా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారని గోపాలన్ చెప్పారు. సాయంత్రం ఐదు గంటల వరకు స్టేషన్లో నిర్బంధించి సొంత పూచీకత్తులతో విడుదల చేశారని తెలియజేశారు. అసెం బ్లీలో ప్రవేశించేందుకు పాస్‌లు ఇచ్చినా పోలీసులు వ్యవహించిన తీరు బాధాకరమని గోపాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. తుందుర్రు అంటేనే ప్రభుత్వం ఉలికిపాటుకు గురవుతుందని వేలాదిమంది ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. అధికారికంగా పాస్‌లు పొందినా అనుమతించకపోవ డం చూస్తుంటే ప్రజలపై పాలకులకు ఉ న్న శ్రద్ధ తేటతెల్లమవుతోందని గోపాలన్ విమర్శించారు. అక్రమ అరెస్ట్‌లపై నిరసన గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్కు నిర్మాణాన్ని నిలుపుదల చేయా లని కోరుతూ రాజధాని అమరావతి వెళ్లిన పోరాట కమిటీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పట్టణం లోని మెంటేవారితోటలోని సీపీఎం కా ర్యాలయం నుంచి ప్రదర్శనగా పోలీస్ బొమ్మ సెంటర్ మీదుగా ప్రకాశం చౌక్ కు చేరుకుని నిరసన తెలిపారు. సీపీఎం ఆక్వాఫుడ్ పార్కు వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాట కమిటీ, సీపీఎం నేతలు అసెంబ్లీ వద్దకు వెళ్లారని పట్టణ కార్యదర్శి బీవీ వర్మ అన్నారు. ఇందుకు ముందస్తు అనుమతులు తీసుకున్నా పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. సమస్య వినేం దుకు పిలిచి అరెస్ట్ చేయించడం దారుణమన్నారు. నిరసనలో చేబోలు సత్యనారాయణ, ఎం.వైకుంఠరావు, చెల్లబో యిన వెంకటేశ్వరరావు, కె.అప్పన్న, ఎన్.రాము తదితరులు పాల్గొన్నారు. -
కడితే..కాష్టమే
భీమవరం :తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి మధ్య గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు హెచ్చరించారు. పచ్చని పొలాలు, జనావాసాల మధ్య నిర్మి స్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సముద్ర తీరానికి తరలించేంత వరకు రాజీలేని పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆక్వా పార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి కడవరకూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీపీఎం, వైఎస్సార్ సీపీ, సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ), ఫార్వార్డ్ బ్లాక్, జనసేన, పౌరహక్కుల సం ఘం, దళిత సంఘ నాయకులు, పర్యావరణ వేత్తలతో కూడిన బృందం మంగళవారం తుందుర్రు, కంసాలి బేతపూడి, ముత్యాలపల్లి గ్రామాల్లో పర్యటించింది. ఆ మూడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో అఖిలపక్ష నేతలు మాట్లాడారు. ప్రజాభీష్టానికి వ్యతి రేకంగా.. పోలీసులను ప్రయోగించి మహిళలపై నిరంకుశ దాడులు చేయిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మహిళలు ఉద్యమించటం ద్వారా విజయం సాధించారన్నారు. వారి పోరాట పటిమ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మన్ననలు పొందిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరికొంతకాలం ఉద్యమిస్తే ఆక్వా పార్క్ పునాదులు కదలడం ఖాయమన్నారు. కడవరకు పోరాడదాం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు పొందటం ద్వారా ఇక్కడి మహిళలు ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమంలో తొలి విజయం సాధించారన్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని.. ఫ్యాక్టరీని సముద్ర తీర ప్రాంతానికి తరలించే వరకూ కొనసాగుతుందన్నారు. ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమానికి కడవరకు అండగా ఉంటామని ప్రకటించారు. వేలాది ఎకరాల్లో పంటలను, ప్రజారోగ్యాన్ని తుడిచిపెట్టే ఆక్వా పార్క్‌ను ఇక్కడ నిర్మించవద్దని ప్రజలంతా కోరుతున్నా.. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం, యాజమాన్యం వ్యవహరిస్తున్నాయన్నారు. ఆక్వా పార్క్ పునాదులు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, అప్పటివరకు ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని సూచిం చారు. బుడబుక్కల టీడీపీ, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం కారణంగా జిల్లాలోని కాలుష్యకారకమైన అన్ని పరిశ్రమలకు ముప్పు వాటిల్లిందన్నారు. కాలుష్య నివారణకు త్వరలోనే భీమవరంలో నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు. ఇది స్వచ్ఛమైన పోరాటం ప్రముఖ పర్యావరణవేత్త ఎం.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలు సాగిస్తున్న స్వచ్ఛమైన పోరాటమని అభివర్ణించారు. గతంలో పర్యావరణం కంటే డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని.. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందనడానికి తుందుర్రు ఉద్యమమే ఉదాహరణ అన్నారు. విషం కక్కే ఫ్యాక్టరీలను జనావాసాల మధ్య పచ్చటి పొలాల్లో నిర్మించడం దారుణమన్నారు. ఆక్వా పార్క్ యాజమాన్యం కాలుష్య నియంత్రణకు ఎటువంటి హామీ పత్రాలు ఇవ్వకపోయినా ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలబడటాన్ని చూస్తే ప్రజాశ్రేయస్సుపై ప్రభుత్వానికున్న శ్రద్ధ ఏపాటిదో అవగతం అవుతోందన్నారు. ప్రభుత్వ దివాళాకోరుతనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమవరం పట్టణ శాఖ కన్వీనర్ కోడే యుగంధర్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ వద్దని ప్రజలు ఉద్యమం చేస్తుంటే.. ప్రజాధనాన్ని వెచ్చిస్తూ పోలీసులను ఫ్యాక్టరీకి కాపలా పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంసీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రజలు ఉద్యమిస్తుంటే అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నడం దుర్మార్గమన్నారు. అధికారులు సైతం ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా వారిపై కేసులు బనాయించడం దారుణమని విమర్శించారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎ¯ŒS.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆక్వా పార్క్ నిర్మాణం వద్దం టున్న ప్రజలపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి అక్రమ అనుమతులిచ్చిన మంత్రులపైన, అధికారులపైన కేసులు పెట్టాలన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పచ్చటి పొలాల మధ్య కాలుష్యం వెదజల్లే ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమానికి అందరి మద్దతు ఉంటుందన్నారు. సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకుడు సురేష్ మాట్లాడుతూ ఆక్వా పార్క్ నిర్మాణాన్ని 99 శాతం ప్రజలు వద్దంటుంటే ప్రభుత్వం, యాజమాన్యం మొండిగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు సుందరరామరాజు మాట్లాడుతూ వ్యవసాయ జోన్లో విషం కక్కే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జనజీవనంతో చెలగాటమాడటం దారుణమన్నారు. దళిత సంఘం నాయకుడు ఫ్రాన్సిస్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో కూలీలు, ప్రజలు పడుతున్న కష్టాలు తుందుర్రు ప్రాంత ప్రజలకు తప్పలేదన్నారు. ఇక్కడి ఉద్యమాన్ని తాము కూడా స్ఫూర్తిగా తీసుకుంటామని మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ సభలకు పెద్దఎత్తున హాజరైన మహిళలు, విద్యార్థులు ఆక్వాపార్క్ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, డివిజన్ నాయకుడు జేఎన్వీ గోపాలన్, రైతు సంఘం నాయకుడు ఎం.నాగరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు తిరుమాని ఏడుకొండలు, పేరిచర్ల సత్యనారాయణరాజు, ఎంపీటీసీ జవ్వాది వెంకటరమణ, ఆక్వాపార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ముచ్చర్ల త్రిమూర్తులు, జవ్వాది సత్యనారాయణ, బీవీ వర్మ పాల్గొన్నారు. -
ఇంకా ఆంక్షల మధ్యే..
భీమవరం : భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్‌ను సడలించలేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదేమైనా సరే.. తమ ప్రాణాలు పోయినా ఆక్వా పార్క్‌ను నిర్మించనీయబోమని కరాకండీగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అఖిలపక్షనాయకులు బాధిత గ్రామాల్లో పర్యటించనున్నారు. సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు భీమవరం మండలం తుందుర్రుతోపాటు నరసాపురం మండలం జొన్నలగరువు, కంసాలిబేతపూడి, శేరేపాలెం, ముత్యాలపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రజల గోడు వినేందుకు తాము వెళ్తున్నామని, అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఎస్పీ, డీఎస్పీలకు వినతిపత్రాలు ఇచ్చారు. గ్రామాల్లో శాంతియుతంగా పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల వారికి కలిగే ఇబ్బందులు తెలుసుకుంటామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావుండదని అధికారులకు విన్నవించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో హడల్ ఈనెల 8న ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాటకవిుటీ, సీపీఎం సిద్ధం కాగా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం పెద్దఎత్తును పోలీసు బలగాలను మోహరించి బాధితులపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కిన పోలీసుల దమనకాండ గుర్తుచేసుకుని ఇప్పటికీ బాధిత గ్రామ ప్రజలు హడలెత్తిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ధైర్యం నింపేందుకే.. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెసుకుని వారిలో ధైర్యం నింపేందుకు అఖిపక్షం నాయకులు సిద్ధమయ్యారు. 9న విజయవాడలో వివిధ పార్టీల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి ఈనెల 14న ఫుడ్‌పార్క్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఐదు గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను తెలుసుకోనున్నారు. దీంతో తమ వద్దకు వచ్చే నాయకులకు తమ గోడు వినిపించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా గతంలో తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామాల్లో పర్యటించిన పర్యావరణవేత్తల అభిప్రాయాలను, రొయ్యల ప్యాక్టరీ వల్ల తాగు, సాగునీటి ఇబ్బందులు, వాతావరణ కాలుష్యం వంటి అంశాల గురించి ప్రముఖులు చెప్పిన వివరాలను అఖిలపక్ష బృందానికి తెలియజేయాలని నిశ్చయంచుకున్నారు. సర్కారుపై ఆగ్రహం ఇదిలా ఉంటే ఫుడ్‌పార్క్ వల్ల తలెత్తే నష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడంపై బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్ వల్ల గ్రామాల్లోని మంచినీటి చెరువులు, గొంతేరు డ్రెయిన్ కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొంతేరు డ్రెయిన్‌లో సహజసిద్ధంగా పెరిగే మత్స్యసంపద హరించుకుపోతోందని, దీనివల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సర్కారుకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా.. మొండిగా ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఫుడ్‌పార్క్ కలుషిత నీరు చుక్క కూడా బయటకు రాదని, ఫ్యాక్టరీ ఆవరణలో ఆ నీటితో మొక్కలు పెంపకం చేపడతామని యాజమాన్యం చెప్పగా, ఉద్యమం తీవ్రరూపం దాల్చిన తర్వాత కలుషిత జలాలను సముద్రంలో కలిపేలా ప్రత్యేకంగా పైప్‌లైన్ వేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కలుషిత నీరు రాదని చెప్పి.. ఇప్పుడు పైపులైన్లు ఎలా వేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అఖిలపక్ష నాయకులు తమ గోడు విని ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. -
ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు దారుణం
భీమవరం అర్బన్ : మా ఓట్లతో గెలుపొంది, మా సమస్యలను పరిష్కరించాల్సిన నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పులపర్తి రామాంజనేయులు గోదావరి ఫుడ్‌పార్కుసై మాట మార్చడం దారుణమని ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామంలో శుక్రవారం ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది సత్యనారాయణ, మహిళలు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదిన ప్రపంచం మొత్తం మహిళల హక్కులను, మహిళల గౌరవ మర్యాదలను కీర్తిస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తుందుర్రులో మహిళలపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమన్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఫ్యాక్టరీ యజమానులకు కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫుడ్‌పార్కును ఈ ప్రాంతంలో వ్యతిరేకిస్తున్నా టీడీపీ ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చటి పొలాల మధ్య కెమికల్స్ కలిగిన ఫ్యాక్టరీ పెట్టేందుకు అధికారులు సైతం వంతపాడటం దారుణమన్నారు. ఎమ్మెల్యే స్థలాల్లో ఇటువంటి ఫుడ్‌పార్కు ఫ్యాక్టరీని కట్టుకోవాలని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీ యజమానుల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ మొత్తంలో నగదు లాబీయింగ్ చేసుకుని వారికి కొమ్ముకాయడం దారుణమన్నారు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ వద్దని శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా నిర్మాణ పనులు ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మమ్మల్ని వ్యతిరేకించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసినా ఏదో రూపంలో నిరసనలు చేసి ఫ్యాక్టరీ ఉత్పత్తులను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో చీడే నాగమణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లిలా!
భీమవరం : జనావాసాలను ఆనుకుని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య పచ్చటి పొలాల్లో విషం చిమ్మే గోదావరి మెగా ఆక్వా పార్క్ నిర్మిస్తుండటాన్ని మూడేళ్లుగా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అధికారమే అండగా చెలరేగిపోతూ, దమనకాండకు పాల్పడుతున్న ప్రభుత్వం.. ప్రజలను చల్లార్చాల్సింది పోయి పుండుమీద కారం చల్లినట్టుగా వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ‘ఇందేం దారుణమయ్యా’ అని అడిగిన వాళ్లపై అరాచకానికి తెగబడుతోంది. ఇంటింటికీ పోలీసుల్ని పంపించి భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మగవాళ్లను ఊళ్లో ఉండనివ్వకుండా తరిమేస్తోంది. ఇంటి తలుపులు తీసుకుని బయటకొచ్చే మహిళల్ని, చిన్నారులను సైతం పోలీస్ జీపుల్లో కుక్కి ఠాణాలకు తీసుకెళ్లి బండబూతులు తిట్టిస్తోంది. తమ కష్టాలను చెప్పుకుందామని వెళితే.. ప్రజాప్రతినిధులు మొహం చాటేస్తున్నారు. అధికారులకు గోడు వెళ్లబోసుకుందామంటే మాట వినడం లేదు. ప్రభుత్వానికి విజ్ఞాపనలు పం పిస్తే ఎదురు దాడికి దిగుతోంది. ఇలాం టి పరిస్థితుల నడుమ అక్కడి సామాన్య జనం విసిగిపోయారు. పోరాటమే శరణ్యమంటూ ఉద్యమబాట పట్టారు. ఏడాదిన్నర క్రితం సాదాసీదాగా మొదలైన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వ దమనకాండ కారణంగా ఉధృతరూపం దాల్చింది. ఇది చివరకు సమరశీల (మిలిటెంట్) పోరాటానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన కలిగి స్తోంది. ఉద్యమం చల్లారాలంటే ప్రజ లకు నచ్చచెప్పి.. వారిని ఒప్పించి నిర్మా ణ పనులకు మార్గం సుగమం చేయాలి. కానిపక్షంలో అక్కడి సామాన్యులు సైతం కోరుతున్నట్టు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించడం తప్ప మరో మార్గం లేదు. ఈ రెండు విషయాలను ఇటు ప్రజాప్రతి నిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం మొహం చాటేయగా, శాంతిభద్రతల సమస్యగా చూపిస్తూ పోలీస్ యంత్రాంగం భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మొత్తంగా సమస్యను పరిష్కరించడం మానేసి పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళుతోంది. ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తుందుర్రు సమీపంలోని 40 గ్రామాలు కాలుష్యం బారినపడతాయని.. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని.. పంట పొలాలు నాశనమవుతాయని సుమారు మూడేళ్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏడాది క్రితం వరకూ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనంతరం ప్లేటు ఫిరాయించారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం కలగదంటూ యాజమాన్యానికి వంత పాడారు. ఇదిలావుంటే.. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నోరు విప్పటం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను బాధిత గ్రామాల ప్రజలు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి నివాసంలో బాధితులతో సమావేశమై ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పితాని సత్యనారాయణ ఆనక మొహం చాటేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడులను జన్మభూమి గ్రామసభలకు సైతం రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన కానరావడం లేదు. అధికారుల వైఫల్యం సమస్యను పరిష్కరించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం ఈ అంశాన్ని గాలికొదిలేశారు. ఆక్వా పార్క్ వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్న అధికారులు ఆ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లకుండా భీమవరంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థ జలాలు బయటకు రావని, ఆ నీటిని వినియోగించడానికి ఎక్కువ విస్తీర్ణంలో యాజమాన్యం మొక్కలు పెంచుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కలుషిత జలాలను సముద్రంలో కలిపే విధంగా ప్రజాధనంతో పైప్‌లైన్ నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ప్రభుత్వం, యాజమాన్యం చెప్పినదంతా బూటకమేనని నిర్థారణకు వచ్చిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాన్ని అడ్డుకుని తీరతామని భీష్మించారు. తమపై కేసులు బనాయించి జైళ్లపాలు చేసినా వెనక్కి మళ్లేది లేదని.. ప్రజలపై ఉక్కుపాదం మోపి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసినా.. భవిష్యత్‌లో దాని ఉనికికే ప్రమాదమని బాధిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. -
ఎన్నాళ్లిలా!
వీడని చిక్కుముడిలా తుందుర్రు ఆక్వా పార్క్ సమస్య ఆందోళనకారులుఽ, ఫ్యాక్టరీ యాజమాన్యం మధ్య సమస్యగా పేర్కొంటూ గుడ్లప్పగించి చూస్తున్న ప్రజాప్రతినిధులు తెరవెనుక నుంచి యాజమాన్యానికి సహకారం పోలీసులను ఉసిగొల్పి చిన్నారులు, వృద్ధులను సైతం నడిరోడ్డుపై ఈడ్చేస్తున్న పోలీసులు మూడేళ్లుగా ఉద్యమం నడుస్తున్నా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టని సర్కారు ప్రభుత్వ కర్కశ చర్యలను తాళలేక.. ఎప్పుడూ ఇల్లు దాటి ఎరుగని సామాన్య మహిళలు సైతం ఉద్యమ పంథాలోకి భీమవరం : జనావాసాలను ఆనుకుని తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మధ్య పచ్చటి పంట పొలాల్లో విషం చిమ్మే గోదావరి మెగా ఆక్వా పార్క్ నిర్మిస్తుండటాన్ని మూడేళ్లుగా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అధికారమే అండగా చెలరేగిపోతూ.. పోలీసులను ఉసిగొల్పి దమనకాండకు పాల్పడుతూ.. పుండుమీద కారం చల్లినట్టుగా ప్రజల మనోభావాలను సాక్షాత్తు ప్రభుత్వమే దెబ్బతీస్తోంది. ’ఇందేం దారుణమయ్యా’ అని అడిగిన వాళ్లపై అరాచకానికి తెగబడుతోంది. ఇంటింటికీ పోలీసుల్ని పంపించి భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మగవాళ్లను ఊళ్లో ఉండనివ్వకుండా తరిమేస్తోంది. ఇంటి తలుపులు తీసుకుని బయటకొచ్చే మహిళల్ని, చిన్నారులను సైతం పోలీస్ జీపుల్లో కుక్కి ఠాణాలకు తీసుకెళ్లి బండబూతులు తిట్టిస్తోంది. తమ కష్టాలను చెప్పుకుందామని వెళితే.. ప్రజాప్రతినిధులు మొహం చాటేస్తున్నారు. అధికారులకు గోడు వెళ్లబోసుకుందామంటే మాట వినడం లేదు. ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపిస్తే ఎదురు దాడికి దిగుతోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అక్కడి సామాన్య జనం విసిగిపోయారు. పోరాటమే శరణ్యమంటూ ఉద్యమబాట పడుతున్నారు. ఏడాదిన్నర క్రితం సాదాసీదాగా మొదలైన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ కారణంగా ఉధృతరూపం దాల్చింది. ఇది చివరకు సమరశీల (మిలిటెంట్) పోరాటానికి దారి తీస్తుందేమో అనే ఆందోళన కలిగిస్తోంది. ఉద్యమం చల్లారాలంటే ప్రజలకు నచ్చచెప్పి.. వారిని ఒప్పించి నిర్మాణ పనులకు మార్గం సుగమం చేయాలి. కానిపక్షంలో అక్కడి సామాన్యులు సైతం కోరుతున్నట్టు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించడం తప్ప మరో మార్గం లేదు. ఈ రెండు విషయాలను ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం, ప్రజాభీష్టాన్ని శాంతిభద్రతల సమస్యగా చూపిస్తూ పోలీస్ యంత్రాంగం భీతావహ వాతావరణం సృష్టిస్తోంది. మొత్తంగా చూస్తే సమస్యను పరిష్కరించడం మానేసి పరోక్షంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళుతోంది. ప్లేటు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల తుందుర్రు సమీపంలోని 40 గ్రామాలు కాలుష్యం బారినపడతాయని.. పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని.. పంట పొలాలు నాశనమవుతాయని సుమారు మూడేళ్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారు ఏడాది క్రితం వరకూ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇచ్చిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనంతరం ప్లేటు ఫిరాయించారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎటువంటి నష్టం కలగదంటూ యాజమాన్యానికి వంత పాడారు. ఇదిలావుంటే.. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)నోరు విప్పటం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను బాధిత గ్రామాల ప్రజలు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి నివాసం బాధితులతో సమావేశమై వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పితాని సత్యనారాయణ ఆనక మొహం చాటేశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు అంజిబాబు, మాధవనాయుడులను జన్మభూమి గ్రామసభలకు సైతం రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధుల్లో ఎటువంటి స్పందన కానరావడం లేదు. అధికారుల వైఫల్యం సమస్యను పరిష్కరించే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం ఈ అంశాన్ని గాలికొదిలేశారు. ఆక్వా పార్క్ వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్న అధికారులు ఆ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లకుండా భీమవరంలో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థ జలాలు బయటకు రావని, ఆ నీటిని వినియోగించడానికి ఎక్కువ విస్తీర్ణంలో యాజమాన్యం మొక్కలు పెంచుతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కలుషిత జలాలను సముద్రంలో కలిపే విధంగా ప్రజాధనంతో పైప్‌లైన్ నిర్మిస్తామని ప్రకటించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని ప్రభుత్వం, యాజమాన్యం చెప్పినదంతా బూటకమేనని నిర్థారణకు వచ్చిన ప్రజలు ఎట్టి పరిస్థితిల్లో నిర్మాణాన్ని అడ్డుకుతీరతామని భీష్మీంచారు. తమపై కేసులు బనాయించి జైళ్లపాలు చేసినా వెనక్కి మళ్లేది లేదని.. ప్రజలపై ఉక్కుపాదం మోపి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసినా తరువాత దాని ఉనికికే ప్రమాదమని బాధిత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. -
ఖాకీ గుప్పెట్లో తుందుర్రు
ఆంక్షల వలయంలో ఆక్వాపార్క్ బాధిత గ్రామాలు భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా ఫుడ్‌పార్క్ బాధిత గ్రామాల్లో ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసు ఆంక్షలు కొనసాగుతుండటంతో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. బుధవారం నాటి ఘటనలతో భీతిల్లిపోయిన మహిళలు, వృద్ధులు, పిల్లలు గురువారం కూడా ఆ భయాందోళన నుంచి బయటకు రాలేదు. తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు తదితర గ్రామాల్లోకి బయటి వ్యక్తులను పోలీసులు అనుమతించలేదు. అప్రకటిత కర్ఫ్యూ కొనసాగింది. దీంతో విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లడా నికి భయపడ్డారు. బుధవారం ఆక్వా ఫుడ్‌పా ర్క్ బాధిత గ్రామాల్లో భీతావహ పరిస్థితిని సృష్టించిన పోలీసులు.. మహిళలు, బాలింత లు, వృద్ధులని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దొరికినవారిని దొరికినట్టు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రోజంతా తిండీ తిప్పలు లేక చంటి పిల్లలు, చిన్నారులు అలమటిం చారు. అరెస్టయిన వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై అర్ధరాత్రి వదిలిపెట్టారు. ఆ సమయాన ఇల్లు చేరుకున్న తల్లులు పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటికప్పుడు వంట చేసి పిల్లలకు నాలుగు మెతుకులు తినిపించారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం ప్రభుత్వం తమపై పోలీసులను ప్రయోగించడం పట్ల గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు తమ పట్ల ఇంత రాక్షసంగా వ్యవహరించడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిç ³రిస్థితు ల్లోనూ ఆక్వా ఫుడ్ పార్క్ కట్టనీయబోమని, ప్రాణాలు పోయినా.. ఎన్నిసార్లు పోలీసులను ప్రయోగించినా తమ వైఖరి మారదని మహిళలంతా మూకుమ్మడిగా తేల్చి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తామేంటో నిరూపిస్తామని శపథం చేస్తున్నారు. -
ప్రజా ప్రభుత్వమా ? గూండా ప్రభుత్వమా ?
-
తుందుర్రు గ్రామంలో అడుగడుగునా ఆంక్షలు
-
తుందుర్రులో కదం తొక్కిన ప్రజలు
ఆక్వా పార్క్ ఏర్పాటుపై వ్యతిరేకత 200 మంది ఆందోళనకారుల అరెస్ట్ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం మండలాల మధ్య గల తుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. వాటిని ధిక్కరించి ధర్నాలో పాల్గొన్న సుమారు 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరిసర గ్రామాల్లో 144 సెక్షన్.. ప్రజల ఆందోళనతో తుందుర్రులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 1,300 మంది పోలీసు సిబ్బందితో గ్రామం నిండిపోయింది. ప్రధాన రహదారులపై బారీకేడ్లు, తనిఖీలతో పోలీసులు ఉదయం నుంచి ఎవరినీ బయటి గ్రామాల నుంచి రాకుండా నియంత్రించారు. పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. పెద్దఎత్తున పోలీసు బలగాల పహారా ఉండగానే సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థులు, మహిళలు పార్క్ నిర్మాణం ఏర్పాటుపై తమ వ్యతిరేకతను నిర్భయంగా వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని నర్సాపురం రూరల్ పోలీస్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన ఉద్యమకారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం పార్క్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగున పోలీసులు మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా దర్శనిమిస్తున్నాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ్వలేదు. -
తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్
-
అట్టుడుకుతున్న గోదావరి పల్లెలు
పశ్చిమగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. ఆక్వా ఫుడ్‌పార్కు పెడితే దాన్నుంచి వెల్లువెత్తే కాలుష్యం కారణంగా తమ జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుందని గగ్గోలు పెడుతున్న తుందుర్రు పరిసర గ్రామాల వాసులను పోలీసులు ఈడ్చిపారేశారు. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలను మహిళా దినోత్సవం అని కూడా చూసుకోకుండా లాఠీలతో కుమ్మేశారు. గర్భిణులను కూడా ఎత్తుకెళ్లి జీపుల్లో వేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించరా? ప్రజల మనోభావాలను గుర్తించకుండా.. తీరప్రాంత ప్రజలను దారుణంగా నిర్బంధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. నిర్బంధాల ద్వారా ప్రజావ్యతిరేకతను ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ఈ ఫ్యాక్టరీ కడితే నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని, మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చి తుందుర్రు పరిసర ప్రాంత వాసులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీలకు తాము వ్యతిరేకం కాదని, సముద్రతీర ప్రాంతానికి ఇదే నియోజకవర్గంలో కట్టాలని తామంతా కూడా కోరామని.. దాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పామని అన్నారు. కానీ ప్రభుత్వం మొండివైఖరితో ఆరు నెలల నుంచి ఈ గ్రామాల్లో పోలీసులను మోహరిస్తున్నారని, 144 సెక్షన్ పెట్టి ప్రజలను నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో ఎవరికీ నష్టంలేని చోట తీరప్రాంతంలో కడితే, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడివారికే వస్తాయని తెలిపారు. రాష్ట్రమంతా రౌడీరాజ్యం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రమంతటినీ రౌడీ రాజ్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. ఇక్కడ దాదాపు 2వేల మంది పోలీసులను పెట్టారని, తమ సొంత ఊళ్లలో తిరగాలన్నా కూడా ఆధార్ కార్డులు పట్టుకుని తిరగాల్సి వస్తోందని అన్నారు. అసలు తొలుత పబ్లిక్ హియరింగ్ జరిపించి, ప్రజల అనుమతితోనే ఫ్యాక్టరీ కడతామని అందరూ చెప్పారని, కానీ అసలు పబ్లిక్ హియరింగ్ అన్నదే చేయలేదని తెలిపారు. పోలీసులు మఫ్టీలో ఉండి ప్రజల్లో కలిసిపోయి దారుణాలు చేస్తున్నారని, మహిళలను కూడా అరెస్టు చేసి ఈడ్చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి వంతపాడుతోందని మండిపడ్డారు. పోలీసులను అడుగుదామని అనుకుంటే తమను పొద్దుట నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయనీయకుండా హౌస్ అరెస్టు చేశారన్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏం చెప్పాలని ఆయన అన్నారు. -
తుందుర్రు పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
-
తుందుర్రు పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
తుందుర్రు (పశ్చిమగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్వాఫుడ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ 30 గ్రామాల ప్రజలు బుధవారం ఆందోళన బాటపట్టారు. అక్వాఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వచ్చి పంట కాలువలు, పంట పొలాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పార్కు నిర్మాణం చేపట్టొద్దని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తుందుర్రు గ్రామం పోలీస్ పహారాలో ఉంది. 1100 మంది పోలీసులతో భారీ భద్రతను చేపట్టారు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతు తెలిపాయి. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహిళా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నర్సాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, నాయకులు త్రిమూర్తులు, పెద్దిరాజు, పూర్ణ, పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కె.బేతపూడి, జొన్నలగరువు, తుందుర్రు గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడే పరిసస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. ప్రతి గ్రామంలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ బయటకు రానివ్వలేదు. -
పోలీస్ పంజా
ఆక్వా పార్క్ బాధిత గ్రామాల్లో నిర్బంధాల పర్వం భయంతో పొలాల గట్ల వెంట పరారైన ప్రజలు చంటి బిడ్డలతో బిక్కుబిక్కుమంటున్న మహిళలు పోరాట కమిటీ నాయకుల అరెస్ట్ భీమవరం/భీమవరం అర్బన్ : తుందుర్రు పరిసర గ్రామాలపై పోలీసులు పంజా విసిరారు. సామాన్య జనంపై మరోసారి దమనకాండ మొదలైంది. పోలీసులు ఇంటింటికీ వెళ్లడం.. స్నానాల గదుల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేయడం.. మహిళలను బెదిరించడం.. చిన్న పిల్లలను భయపెట్టడం వంటి వికృత చేష్టలకు దిగటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఒక్కరినీ వీడియో తీయడం, ఎలాంటి ఆందోళన జరిగినా మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరిస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. తుందుర్రు వద్ద నిర్మిస్తున్న కాలుష్య కారక గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలనే డిమాండ్‌తో భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన సుమారు 30 గ్రామాల ప్రజలు కొంతకాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అయినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తూ నిర్మాణ పనులను కొనసాగిస్తోంది. దీంతో పనులను ఈనెల 8వ తేదీలోగా నిలుపుదల చేయాలని.. లేనిపక్షంలో తామే అడ్డుకుంటామని ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ, సీపీఎం ప్రకటించాయి. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఆక్వా పార్క్ యాజమాన్యానికి కొమ్ముకాస్తూ సామాన్యులపై మరోసారి దమనకాండకు దిగుతోంది. తుందుర్రు పరిసర గ్రామాల్లో సోమవారం రాత్రి నుంచే వేలాది మంది పోలీసులు మోహరించాయి. మంగళవారం ఉదయం నుంచీ పౌర హక్కులను కాలరాస్తూ నిర్బంధకాండను మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. మహిళలను, చిన్న పిల్లలను సైతం ఇళ్లల్లోంచి బయటకు రానివ్వడం లేదు. కంసాలి బేతపూడి, తుందుర్రు, జొన్నల గరువు గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఆక్వా పార్క్ చుట్టుపక్కల వెయ్యి మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో చోటుచేసుకున్న ఘటనల దృష్ట్యా కొంతమంది పొలాలు గట్ల మధ్య దాక్కొంటుంటే.. మరికొందరు పొలాల్లోంచి పారిపోతున్నారు. ఉద్యమకారుల అరెస్ట్ తుందుర్రు గ్రామంలో మోదారమ్మ గుడివద్ద ఉన్న పోరాట కమిటీ కన్వీనర్ ఆరేటి వాసు, కొట్టు ప్రసాద్‌ను పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేశారు. శేరేపాలెంకు చెందిన కొత్తపల్లి ఆంజనేయులు, కొత్తపల్లి రాయుడు, ముత్యాలపల్లికి చెందిన నాగిడి రాంబాబు, బి.శ్రీనివాస్, కంసాలి బేతపూడికి చెందిన పాలి నారాయణ, సముద్రాల వెంకటేశ్వర్లును ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పి దమనకాండకు పాల్పడుతోందని.. అయినా ఉద్యమాన్ని విరమించేంది లేదని.. ఆక్వా పార్క్ నిర్మాణానికి అడ్డుకుని తీరతామని పోరాట కమిటీ నాయకులు ప్రకటించారు. ఆక్వా పార్క్ వల్ల తలెత్తే సమస్యలివీ ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల జల వనరులు, వాతావరణం కాలుష్యం బారిన పడతాయని.. ఈ కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడతారని నిపుణులు హెచ్చరించడంతో ఉద్యమం మొదలైంది. దీంతో సీపీఎం ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఏవీవీ స్వామి, రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన రంగరాజన్ వద్ద సలహాదారుడిగా పనిచేసిన ఎం.కృష్ణప్రసాద్ వంటి పర్యావరణ ప్రముఖులు ఈ ప్రాంతంలో పర్యటించారు. పరిసరాలను పరిశీలించిన నిపుణులు ఆక్వా పార్క్‌ను ఇక్కడ నిర్మించడం శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పారు. రొయ్యలను ప్రోసెసింగ్ చేసే సందర్భంలో టన్నులకొద్దీ అమ్మోనియం వినియోగిస్తారని.. ఈ గ్యాస్ లీక్ అయితే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని స్పష్టం చేశారు. రొయ్యల ప్రోసెసింగ్ నిమిత్తం రోజుకు కనీసం రోజుకు 50 వేల లీటర్ల నీటిని వాడతారని, ఆ నీరంతా గొంతేరు డ్రెయిన్‌లో కలుస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల డ్రెయిన్ కలుషితమై అందులోని మత్స్యసంపద అంతరించిపోవడంతోపాటు ఈ ప్రాంతంలోని జల వనరులన్నీ కలుషితమవుతాయని స్పష్టం చేశారు. చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదముందని, ఆక్వాపార్క్ పరిసర ప్రాంతాల్లోని పంట భూములకు నష్టం వాటిల్లుతుందని వివరించారు. వాతావరణ కాలుష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడతారని, గర్భిణులు గర్భకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి -
తుందుర్రులో నేతల సమావేశం
-
వద్దనడం లేదు.. తరలించమంటున్నాం
ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధుల మనోగతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడి సాక్షి ప్రతినిధి, ఏలూరు : ’తుందుర్రులో తలపెట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వద్దనడం లేదు. కాలుష్య కారకమైన ఆ పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించమంటున్నాం. మమ్మల్ని అభివృద్ధి నిరోధకులుగా, తీవ్రవాదులుగా చూపించి దమనకాండకు దిగుతున్నారు. మాపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో బంధించారు. అయినా మేం భయపడటం లేదు. ఎన్ని సంవత్సరాలైనా జైళ్లలో మగ్గడానికి సిద్ధమే. మా త్యాగాలు వృథా కావు. మొన్నటివరకూ మూడు గ్రామాల ప్రజలు చేసిన ఉద్యమం ఇప్పుడు 30 గ్రామాల పోరాటంగా మారింది. అందరి నుంచి వచ్చిన మద్దతు ఉత్సాహాన్నిచ్చింది. మరీ ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మాకు మద్దతుగా నిలవడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపగలమన్న మనోధైర్యం వచ్చింది. అరెస్టులు చేసి జైలుకు పంపినా మేం వెనకడుగు వేసేది లేదు. ప్రజల నుంచి. ముఖ్యంగా మా గ్రామాల మహిళల నుంచి వచ్చిన స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా’మని గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు స్పష్టం చేశారు. జైలు నుంచి ఇటీవల విడుదలైన పోరాట కమిటీ నాయకుల మనోగతం వారి మాటల్లోనే.. బెదిరించారు రెండున్నరేళ్లుగా ఇక్కడ ఇక్కడ నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నన్ను మర్యాదగా డ్రాప్ అవ్వమని బెదిరించారు. నేను వినకపోవడంతో అక్రమంగా, అన్యాయంగా హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మా నాన్న గారికి అమ్మ ఆపరేషన్ చేయించి తీసుకువచ్చింది. ఇంట్లో ఆయనకు సపర్యలు చేస్తూ ఉంది. నన్ను జైలుకు పంపడంతో కుటుంబ సభ్యులంతా ఉద్వేగానికి లోనయ్యారు. నేను జైలులో ఉండగా ఆక్వాపార్క్ యాజమాన్యం కొంతమంది మఽధ్యవర్తులను పంపించి కాంప్రమైజ్ కోసం ప్రయత్నించింది. నేను ఒప్పుకోకపోవడంతో మా అమ్మను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 307 సెక్షన్ కేసులో అయినా 14 రోజుల్లో బెయిల్ రావాల్సిన మాకు 53 రోజుల వరకూ బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. విజిటర్స్‌పై కూడా ఆంక్షలు విధించారు. జైలులో ఉన్న వారందరికీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ఫోన్ ఇచ్చేవారు. మాకు మాత్రం ఆ అవకాశం లేకుండా చేశారు. ఆరేటి వాసు, కన్వీనర్, ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నిద్రలేని రాత్రులు గడిపాను నా భర్త పేషెంట్‌గా ఉన్నారు. ఆయనను చూసే దిక్కులేదు. పగలూ, రాత్రి నిద్రలేకుండా కాలం వెళ్లదీశాను. ఆయనను ఆసుపత్రికి తీసుకవెళ్లాల్సి ఉంది. నేను, నా కుమారుడు జైలులోనే ఉన్నాం.ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లలేని దుస్థితిలో ఉండిపోయాం. పాలకొల్లులో నిర్వహించిన ధర్నాలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు అరెస్టు చేశారు. గ్రంధి శ్రీనివాస్ దగ్గరకి వెళ్లి చెప్పుకునేంత నాయకురాలివి అయిపోయావా అంటూ డొక్కల్లో పొడిచి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. చంద్రబాబుకు ఓటు వేసినందుకు మాకు ఈ తిప్పలా. అడపడుచుల ఉసురుపోసుకుంటాడని చెప్పి జీపు ఎక్కాను. అక్కడికి వెళ్లాక గాజులు తీసేయి, గొలుసులు తీసేయమంటూ వేధించారు. వైఎస్ జగన్ నా దగ్గరికి వచ్చి ఓదార్చారు. నా పెద్దకొడుకు నా దగ్గరకు వచ్చినట్టు అనిపించి ధైర్యం వచ్చింది. ఫ్యాక్టరీ ఆపివేయిద్దామని ఆయన హామీ ఇచ్చారు. ఒక్క సత్యవతిని అరెస్ట్ చేశారు. వేలాది మంది సత్యవతులు రోడ్డెక్కుతారని ఫ్యాక్టరీ యాజమాన్యం ఊహించలేదు. ఆరేటి సత్యవతి, ఉద్యమకారిణి ఆఫర్లిచ్చారు తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల మద్య ఆక్వా పుడ్ పార్క్ పెట్టడం వల్ల గ్రామాల్లో జల, వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడతారని ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. పోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ప్రభుత్వం మా పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది. మా బంధువులను బెదిరించారు. మాకు ఆఫర్లు కూడా ఇచ్చారు. అయినా మేం దేనికీ లొంగలేదు. అందుకే మాపై అక్రమ కేసులు పెట్టారు. 307 కేసు పెట్టడమే కాకుండా మేం బయటకు రాకుండా ఉండటం కోసం పదే పదే పెండింగ్ ట్రైల్ పేరుతో పీటీ వారెంట్లు వేశారు. బెయిల్ ప్రొసీడింగ్స్ సమయంలో కూడా ఏడు కేసులు కట్టి పీటీ వారెంట్లు వేయడానికి ప్రయత్నం చేసినా మేజిస్ట్రేట్ అంగీకరించకపోవడంతో బయటకు వచ్చాం. ఇప్పుడు కూడా తప్పుడు ఫిర్యాదులతో కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్ బోర్డర్ తరహాలో ఇంకా 144 సెక్షన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ముచ్చర్ల త్రిమూర్తులు, పోరాట కమిటీ ప్రతినిధి ఈ ప్రభుత్వ పతనం తప్పదు నేను కంసాలి బేతపూడి గ్రామ పెద్దగా ఉన్నాను. నీటి సంఘం డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. ఈ కంపెనీ పెట్టడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతుంది. అసలే మాది శివారు గ్రామం. నీరు పూర్తిగా రాదు. ఇటువంటి పరిస్థితిలో ఫ్యాక్టరీ వద్దని కోరాం. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుటి నుంచి అందులోనే పని చేస్తున్నాను. నరసాపురం నియోజకవర్గంలో ఎక్కడా రానంత మెజారిటీ మా గ్రామం నుంచి ఇచ్చాం. విశ్వనాథరాజు భార్య, రంగరాజు భార్య కనీసం ఓటు వేయడానికి కూడా రారు. అటువంటి వారికి మద్దతు ఇచ్చి, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే మమ్మల్ని అరెస్టు చేయడానికి కూడా వెనుకాడలేదు. నా తమ్ముడి కూమారుడి పెళ్లి. కనీసం వధూవరులను ఆశీర్వదించే అవకాశం లేకుండా చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు నెగ్గారంటే మేం పనిచేయబట్టే. మమ్మల్ని బయటకు రాకుండా హింస పెట్టారు. మీ ఉద్యమం ఎంత, మీరెంత అంటూ పోలీసులు దారుణంగా మాట్లాడారు. అన్నం పెట్టిన చేతిని కరిచినట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. ఇంకా ఆ ఫ్యాక్టరీని కట్టాలనుకుంటే, ముందుగా నన్ను కాల్చి చంపి కట్టుకోండి. సముద్రాల వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పనికి వెళ్తుంటే అరెస్ట్ చేశారు మాది జొన్నలగరువు దళితపేట. మా ఇంటి ఎదురుగానే ఫ్యాక్టరీ కడుతున్నారు. అందుకే వద్దన్నాం. నేను యూత్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నాను. పనికి వెళ్తేగాని పొట్టగడవని పరిస్థితి. ఆ రోజు భీమవరంలో పనికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నన్ను అరెస్టు చేశామన్నారు. ఏఎస్సైకి ఫోన్ చేసి నా పేరు చెప్పగా, కేసులో పేరు లేదన్నారు. అయినా పోలీసులు వినకుండా నన్ను అరెస్ట్ చేసి లోపల వేశారు. ఽఅక్రమ కేసు బనాయించారు. నా భార్య జైలుకు వచ్చి చాలా ఏడ్చింది. మూడు రోజులు భోజనం కూడా చేయలేదు. నేను జైలులో ఉన్నన్ని రోజులు కుటుంబం గడవక నా భార్య, ఇద్దరు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. కొయ్యే మహేష్, జొన్నలగరువు బాధ లేదు.. భయపడుతున్నాం మేం చేసేది న్యాయమైన పోరాటం. అందుకే బాధపడటం లేదు. అయితే మళ్లీ అరెస్టులు చేస్తారన్న భయం వెంటాడుతోంది. పిల్లల్ని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా ఆధార్ కార్డు అడిగారు. ఇంతకంటే దారుణం మరేమైనా ఉంటుందా. మా వారిని జైలులో పెట్టినప్పుడు మేం పడిన బాధ అంతాఇంతా కాదు. ఇద్దరు చంటిబిడ్డలతో ఎన్నో అవస్థలు పడ్డాను. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొయ్యే కీర్తన, మహేష్ భార్య -
మత్స్యకారుల జలదీక్ష
మొగల్తూరు : తుందుర్రు ఆక్వా పరిశ్రమను మూసివేయాలని చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని మత్య్సకార నాయకులు హెచ్చరించారు. ఆదివారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరులో జలదీక్ష చేసి మత్స్యకారులు పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ అనేక ఉద్యమాలు చేశామని, అయినా ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయడంలేదని, తమ పొట్టకొట్టేందుకు సిద్ధమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి శ్రీనువాస్, వైదాని మహలక్షి్మరావు, కొల్లాటి నాగరాజు, ఎస్.కలకంఠేశ్వరరావు, గిరిబాబు, సింహాద్రి, పోతురాజు, వాటాల నర్సింహరావు, అద్దంకి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇటుక పేర్చినా యుద్ధమే
నరసాపురం :‘గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ పేరుతో మా ఇళ్లమధ్య కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ కడుతున్నారు. మా పంటలు పాడైపోతాయి. మా ఆరోగ్యాలు గాలిలో కలిసిపోతాయి. భూములు బీడువారి రైతులు బికారులవుతారు. మత్స్యకారులు, కూలీలు ఉపాధి కోల్పోయి ఊళ్లొదిలి పోవాల్సి వస్తుంది. ఆక్వా పార్క్ ఇక్కడ కట్టొద్దని రెండేళ్లుగా పోరాటం చేస్తున్నాం. మా వేదనపై పోలీస్ జులుం ప్రదర్శించారు. హత్యానేరాలు మోపి జైళ్లలో పెట్టించారు. ఇంతాచేసి మాకు నచ్చజెప్పడానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తారా. ధైర్యముంటే పోలీస్ బందోబస్తు లేకుండా రండి. చెప్పులు, చీపుర్లతో సమాధానం చెబుతాం’ అని ఆక్వాపార్క్ ప్రభావిత గ్రామాల ప్రజలు హెచ్చరించారు. ‘ఇకముందు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇటుక పేర్చినా యుద్ధమే. ప్రజలు కావాలో.. ఇద్దరు పారిశ్రామిక వేత్తలు కావాలో చంద్రబాబు తేల్చుకోవాలని అఖిల పక్షం నాయకులు చంద్రబాబుకు సవాల్ విసిరారు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం, నరసాపురం, వీరవాసరం, మొగల్తూరు మండలాలకు చెందిన వేలాది మహిళలు శుక్రవారం నరసాపురం తరలివచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని కొనసాగిస్తామని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ, వామపక్ష, ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. బాధితులకు అండగా నిలుస్తామని, పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాదిమంది నినాదాలు చేయ డంతో చేయడంతో సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతం దద్దరిల్లింది. ఫ్యాక్టరీ తరలిస్తే శ్రమదానం చేస్తాం : ఆళ్ల నాని మహాధర్నా సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. ఆక్వా పార్క్ కాలుష్యాన్ని సముద్రంలోకి తరలించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి పైప్‌లై¯ŒS వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ‘ఫ్యాక్టరీ నీదా.. నీ అనుయాయులదా.. లేక భారీగా వాటాలున్నాయా. ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీకి ప్రభుత్వ సొమ్ముతో పైప్‌లై¯ŒS వేయాలనే ఉత్సాహం ఎందుకని ప్రశ్నిం చారు. పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని, పరిశ్రమలు రావాలని, అభివృద్ధి జరగాలన్నదే తమ అభిమతమని నాని చెప్పారు. అయితే, ప్రజల కడుపుపై కొట్టి అదే అభివృద్ధి అంటే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఇదే ఫ్యాక్టరీని సముద్రతీరానికి తరలిస్తే తామూ శ్రమదానం చేస్తామని చెప్పారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, గ్రామాల్లో 144 సెక్ష¯ŒS ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. తుందుర్రు ఆక్వాపార్క్ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి ఒకే నిర్ణయంతో ఉన్నారన్నారు. తుందుర్రు రావద్దని ఆయనపై ఎన్నో ఒత్తిళ్లు తెచ్చారని, ఇక్కడ ఏ సమస్యా లేదని చెప్పారని అన్నారు. తనకు పార్టీ ప్రయోజనాలతో పనిలేదని, జనం అభిప్రాయమే ముఖ్యమని భావించి వైఎస్ జగ¯ŒS తుందుర్రు పర్యటనకు వచ్చారని వివరించారు. ఆక్వాపార్క్‌ను ఇక్కడి నుంచి తరలించేవరకు వైఎస్సార్ సీపీ నిద్రపోదన్నారు. నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడాలని, లేదంటే చంద్రబాబుతోపాటు వాళ్లూ బంగాళాఖాతంలో కలుస్తారని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఆక్వా పార్క్ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదన్నారు. అన్ని స్థానాలనూ కట్టబెట్టిన జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకుంటానంటూ కక్షగట్టి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తుం దుర్రు ఫ్యాక్టరీ కారణంగా గొంతేరు కాలుష్యం అవుతుందన్నారు. వేలాదిమంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని, పంట భూములు బీడుగా మారి రైతులు బికారులుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము గడపగడపకూ తిరుగుతున్నామని, దాదాపు ప్రతి గడపలోనూ చంద్రబాబు రాక్షస పాలనతో కన్నీరే కనిపిస్తోందని చెప్పారు. 40 గ్రామాల వారు ఫ్యాక్టరీ వద్దు బాబోయ్ అని ముక్తకంఠంతో చెబుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ మోసపూరిత కబుర్లు చెప్పడం, పరిశ్రమల పేరుతో దోచుకోవడమే పరమావధిగా ముఖ్యమంత్రి ముందుకెళుతున్నారని విమర్శించారు. పరిశ్రమల వ్యతిరేకివి నువ్వే : ఉమామహేశ్వరరావు పరిశ్రమల పేరుతో సాగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే సీపీఎం వాళ్లు టెర్రరిస్టులు.. వైఎస్సార్ సీపీ వాళ్లు పరిశ్రమలకు అడ్డుతగులుతున్నారంటూ చంద్రబాబు నోరు పారేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూతపడ్డ 15వేల పరిశ్రమలను తెరి పించడంలో ముఖ్యమంత్రి ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. వాటిని తెరిపిస్తే కమీషన్లు పెద్దగా రావని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం పెట్టి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారని, ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయని నిలదీశారు. పరిశ్రమల ఏర్పాటుకు తామెవరూ వ్యతిరేకం కాదని, చంద్రబాబే వ్యతిరేకి అని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, అంజిబాబు, మాధవనాయుడు చంద్రబాబు ఆదేశాలతో మీ వద్దకు వచ్చి ఫ్యాక్టరీ కట్టాలని నచ్చజెబుతారంట. మరి మీరేం చేస్తారు’ అని ప్రజలను ప్రశ్నించారు. మహిళలు చేతులు పైకెత్తి చెప్పులు, చీపుర్లతో సమాధానం చెబుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ భీమవరం ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ తుందుర్రు గ్రామానికి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జనసేన జిల్లా నాయకుడు సాగర్‌బాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలని పవ¯ŒSకల్యాణ్ బుద్ధుడుగా సూచన చేశారని, తరలించకపోతే ఆయన రుద్రుడుగా మారతారని హెచ్చరించారు. పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ తాము ఎంతకాలమైనా జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్.సత్యనారాయణరాజు, సీపీఐ నాయకుడు నెక్కంటి సుబ్బారావు, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినా«థ్ ప్రసాద్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, ప్రచార కమిటీ కన్వీనర్ ఎల్.సుధీర్‌బాబు, అధికార ప్రతినధి ఎం.జయప్రకాశ్, సీపీఎం నేతలు జేఎ¯ŒSవీ గోపాలన్, కవురు పెద్దిరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి కమల తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా
-
తుందుర్రు చుట్టుపక్కల 144 సెక్షన్ ఎత్తేయాలి..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారులపై కూడా వెంటనే కేసులు ఎత్తివేయాలని ఆయన అన్నారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణగొదక్కాలని అనుకోవడం అవివేకమని ఆళ్ల నాని శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. తుందుర్రు గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మెగా ఆక్వా ఫుడ్ పార్కును తీర ప్రాంతానికి తరలించారని ఆళ్ల నాని సూచించారు. -
ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా
నరసాపురం(పశ్చిమ గోదావరి): తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఎం ధర్నా నిర్వహించింది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేత ముదునురి ప్రసాదరాజు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ అండ వెయ్యి ఏనుగుల బలానిచ్చింది..
-
వైఎస్ జగన్ అండ వెయ్యి ఏనుగుల బలానిచ్చింది..
తణుకు అర్బన్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తుందుర్రు బాధితులకు అండగా నిలవడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని తుందుర్రు బాధితురాలు ఆరేటి సత్యవతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్‌జైలు నుంచి ఆమె సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తుందుర్రు బాధితులను పరామర్శించేందుకు స్వయంగా వైఎస్ జగన్ రావడం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అన్నారు. ఈనెల 19వ తేదీన వైఎస్ జగన్ నన్ను తణుకు సబ్‌జైలులో కలిసిన సందర్భంగా తమ్ముడికి (ఆరేటి సత్యవతి కొడుకు వాసు) నీతోపాటు మిగిలిన బాధితులకు నేను అండగా ఉంటానని చేతిలో చెయ్యేసి చెప్పడం ఉద్యమానికి మరింత బలం ఇచ్చిందన్నారు. మాయమాటలు చెప్పి అందలమెక్కిన చంద్రబాబునాయుడు ఒక మహిళను అక్రమంగా హత్యాయత్నం కేసులో ఇరికించిన ఘనత మూటకట్టుకున్నాడని ఇదే అతని పతనానికి నాంది పలుకుతుందని విమర్శించారు. ఉద్యమాన్ని ఎటువంటి పరిస్థితుల్లోను ఆపేదిలేదని చంద్రబాబు పోలీసులతో నియంత పాలన చేసినా బెదిరేదిలేదన్నారు. ప్రస్తుతం 50 రోజులు జైలులో ఉన్నానని ఉద్యమంలో భాగంగా సంవత్సరం పాటు ఉంచినా గ్రామాలు కాలుష్యం బారినపడకుండా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు. ఘటన అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు చెప్పారు. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ సంక్షేమంతో రాష్ట్రంలోని మహిళలను ఉద్దరిస్తానని చెప్తున్న చంద్రబాబునాయుడు ఒక సాధారణ మహిళపై హత్యాయత్నం కేసుపెట్టించి 50 రోజులపాటు జైలులో ఉంచిన రోజులు ఎవ్వరూ మరచిపోరని రానున్న రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనన్నారు. మా గ్రామాలు, మా పొలాలు, మా ఆరోగ్యాన్ని, మా కుటుంబాలను రక్షించండంటూ న్యాయమైన పోరాటం చేస్తున్న వారిని జైళ్లలో పెట్టించడం దారుణమన్నారు. 60 గ్రామాల ప్రజలు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా వారిని పట్టించుకోకుండా పెట్టుబడిదారీలైన ఇద్దరు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో ఎదురులేని ఆధిక్యం వచ్చిందని మురిసిపోతున్న చంద్రబాబు ఈ జిల్లా నుంచే ఆయన పతనం ప్రారంభమై రాష్ట్రానికి పాకుతుందన్నారు. సెప్టెంబరు 20వ తేదీన తణుకు సబ్‌జైలుకు వచ్చిన సత్యవతి సోమవారం నరసాపురం కోర్టులో హాజరై ఆర్డర్ కాపీని తణుకు సబ్‌జైలులో సమర్పించారు. విడుదలైన సత్యవతిని అఖిలపక్షాల ఆధ్వర్యంలో పూల దండలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో అఖిల పక్షం తరపున ఐలూ జిల్లా కమిటీ సభ్యులు కామన మునిస్వామి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పీవీ ప్రతాప్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీఐటీయూ స్టేట్ కౌన్సిల్ మెంబరు పీఎల్ నరసింహారావు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి పొట్ల సురేష్, నాయకులు అనుకుల రమేష్, వైసీపీ నాయకులు కౌరు వెంకటేశ్వర్లు, ఆకుల కిరణ్, కాంగ్రెస్ నాయకులు దిర్సిపో రామకృష్ణ, ఆరేటి సత్యవతి కుమార్తె కల్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా ఆంక్షల మధ్యే..
► 144 సెక్షన్ ఎత్తివేతపై మీనమేషాలు ► సీఎం ప్రటించినా అమలుకాని వైనం ► ఆక్వాపార్క్ బాధిత గ్రామాల్లో దుస్థితి ► విపక్షాలపై కొత్తరకం దుష్ప్రచారం ఆక్వాపార్క్ బాధిత గ్రామాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ ఎత్తివేతపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈనెల 17న పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేస్తామని, కేసుల ఎత్తివేత అంశాన్నీ పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ చర్యలు చేపట్టలేదు. దీనిపై ప్రశ్నిస్తే రెవెన్యూ, పోలీసు అధికారులు పొంతనలేని ప్రకటనలు ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఫలితంగా తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం 144 సెక్షన్ ఎత్తివేసి, పార్కును సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు. దీనివల్ల సుమారు 40 గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆ ప్రాంతవాసులు పోరాటానికి దిగారు. దీనిని జీర్ణించుకోలేని సర్కారు ఫుడ్‌పార్కు నిర్మితమవుతున్న తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్ విధించింది. 600 పోలీసులను మోహరించింది. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్ట్ చేసి, వారిపై హత్యాయత్నం కేసులు బనాయించింది. నరసాపురం, తణుకు సబ్‌జైలుకు తరలించింది. గ్రామీణులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించింది. పాశవిక చర్యలకు పాల్పడింది. ఆ తర్వాత పోలీసు బందోబస్తు నడుమ ఫుడ్‌పార్కు నిర్మాణ సామగ్రిని అక్కడికి తరలించింది. ఆ ప్రాంతాన్ని ఇండో–పాక్ సరిహద్దులా మార్చేసింది. ఆ గ్రామాల్లోకి ఎవరన్నా వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఆధార్ కార్డు చూపించాల్సిదేనంటూ పోలీసులు హుకుం జారీ చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ నిర్బంధకాండను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం రంగంలోకి దిగాయి. ఆ గ్రామాలకు వెళ్లేందుకు జిల్లాకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన పోరాడేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం తరపున మాజీ మంత్రులు కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ ఈ గ్రామాలకు వచ్చారు. ఈ సమయానికి పోలీసులు ఆ గ్రామాల్లో కొంతవరకూ బలగాలను దాదాపుగా ఉపసంహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి బాధితులకు సంఘీభావం ప్రకటించి, ఆ గ్రామాల్లో పర్యటించడంతో పోలీసులు అక్కడ పూర్తిగా బలగాలను ఉపసంహరించారు. అయితే అధికారికంగా 144 సెక్షన్‌ను మాత్రం కొనసాగిస్తున్నారు. పలువురిపై కేసులూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 17న పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆక్వాపార్క్ బాధిత గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. అయినా ఆ దిశగా ప్రయత్నం జరగలేదు. దీంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే రెండుమూడురోజుల్లో ఎత్తివేస్తామని రెవెన్యూ అధికారులు, ఇప్పటికే పూర్తిగా ఎత్తేశామని పోలీసులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ బాధితుల గోడు పట్టించుకోని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఇటీవల వరుసగా రెండుసార్లు ఆక్వాపార్క్ బాధిత గ్రామాలను సందర్శించేందుకు యత్నించారు. అయితే బాధితులు తిరస్కరించడంతో ఆయన వెనుకడుగు వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి 144 సెక్షన్ ఎత్తివేయాలని, ఆక్వాపార్కును సముద్రతీర ప్రాంతానికి తరలించాలని ఆ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని ఇక్కడ కట్టడానికి అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. కొత్తరకం ప్రచారం ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోగా, బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీపై విమర్శలకు దిగుతోంది. కొత్తరకం వాదనను తెరపైకి తెస్తోంది. గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కుకు అరెంజ్ కేటగిరి ఇచ్చారని, సిమెంట్ ఫ్యాక్టరీలకు కాలుష్య నియంత్రణ మండలి రెడ్ కేటగిరి ఇస్తుందని, వాటితోపోలిస్తే ఫుడ్‌పార్కు నుంచి తక్కువ స్థాయిలోనే కాలుష్యం వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే సిమెంట్ ఫ్యాక్టరీలను ఎక్కడైనా జనావాసాల మధ్య, పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేశారా అన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఇటువంటి ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు 17 ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఓ విషయాన్ని విస్మరిస్తోంది. అదేంటంటే విపక్షాలు ఈ పరిశ్రమలను వద్దనడం లేదు. జనావాసాల మధ్య, పచ్చని పొలాల మధ్య మాత్రం పెట్టవద్దని సూచిస్తున్నాయి. సముద్ర తీరంలో నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నాయి. అయితే సర్కారు ఈ విషయాన్ని ప్రస్తావించకుండా దీనివల్ల కాలుష్యం ఉండదని మాత్రమే చెబుతోంది. 144 సెక్షన్ వెంటనే ఎత్తివేయాలి తుందుర్రు, జొన్నలగరువు, కంసాల బేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్‌ను వెంటనే అధికారికంగా ఎత్తివేయాలి. దీంతోపాటు ఆక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. తాము ఆ పరిశ్రమను ప్రజల అభీష్టం మేరకు అక్కడి నుంచి తరలించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టి తాము పరిశ్రమలకు వ్యతిరేకం అన్నట్టు ప్రకటనలు ఇవ్వడం సరికాదు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం లేనప్పుడు ముఖ్యమంత్రి వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేలా పైపులైన్ వేస్తామని ఎందుకు ప్రకటించారు. అంటే కాలుష్యం వస్తుందని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నట్లే కదా. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ మొండి వైఖరి విడనాడి ఫుడ్‌పార్కును తరలించాలి. -ఆళ్ల నాని, వైఎస్సార్ సీపీ, జిల్లా అధ్యక్షుడు -
నేడు తుందుర్రుకు వైఎస్ జగన్
– ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో ముఖాముఖి – తణుకు సబ్జైల్లో సత్యవతికి పరామర్శ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలను కలుసుకుని వారితో ముఖాముఖి నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తుందుర్రు గ్రామానికి వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రోగామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా తణుకు పట్టణానికి వస్తారు. 36 రోజులుగా అక్కడి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని పరామర్శిస్తారు. అక్కడి నుంచి అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు చేరుకుంటారు. అక్కడ ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కలుసుకుని ముఖాముఖి మాట్లాడతారు. -
'తుందుర్రులో నియంత పాలన'
ఏలూరు: తుందుర్రులో నియంత పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని లేని వాతావరణం తుందుర్రులో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలోపు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలన్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. మోషేన్ రాజు, వంకా రవీంద్ర, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, కొఠారు రామచంద్రరావు, కావూరు నివాస్, తలారి వెంకట్రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
పచ్చని గ్రామాల మధ్య ప్రాజెక్ట్ చిచ్చు
– తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్, బాధితులపై కేసులు ఎత్తివేయాలి – ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం విషయంలో పునరాలోచన చేయాలి – ప్రజల అంగీకారంతోనే పరిశ్రమలు స్థాపించాలి – తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు – వైఎస్సార్ సీపీ నాయకుల బృందం హెచ్చరిక – వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధిత గ్రామాల్లో పర్యటన సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తూ ఒంటెత్తు పోకడలతో పచ్చని గ్రామాల మధ్య చిచ్చుపెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టిన గ్రామాలపై పోలీసుల దమనకాండ, అణచివేత చర్యలు కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, మాజీమంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ సీఈసీ సభ్యుడు వంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు తదితరులతో కూడిన బందం బాధిత గ్రామాల్లో బుధవారం పర్యటించింది. తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామాల్లో ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. అనంతరం మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ నరసాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణం కోసం పచ్చని గ్రామాల మధ్య ప్రభుత్వం చిచ్చుపెట్టి, అలజడి వాతావరణం సష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని నిర్మాణం విషయంలో 4 మండలాలకు చెందిన సుమారు 30 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. పంట భూములు కాలుష్యం బారినపడి నష్టపోతామని రైతులు, జీవనాధారం పోతుందని మత్స్యకారులు, కాలుష్యం వల్ల భవిష్యత్ తరాలకు ఇబ్బందులు వస్తాయని ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. ఆక్వాపార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం విషయంలో గ్రామసభలు పెట్టడం, ప్రజల సందేహాలు, భయాలను నివత్తి చేయడం వంటి ప్రయత్నాలను ప్రభుత్వం చేయలేదన్నారు. మొండిగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అడుగడుగునా పోలీస్ క్యాంప్‌లు పెట్టారని అన్నారు. బాధిత గ్రామాల నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలన్నా.. గ్రామాల్లోకి రావాలన్నా ఆధార్ కార్డులు చూపించాల్సిన పరిస్థితి కల్పించారంటే, చంద్రబాబు పాలన ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతోందని అన్నారు. గ్రామాల్లో తక్షణమే 144 సెక్షన్ ఎత్తివేయాలని, ఆందోళనకారులపై పెట్టిన సెక్షన్ 307 సహా అన్ని కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. పొల్యూషన్ బోర్డు కార్యదర్శి రావాలి : మాజీ మంత్రి కొలుసు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి స్వయంగా తుందుర్రు పరిసర గ్రామాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇక్కడి పరిస్థితులు అనుకూలమా.. కాదా, కాలుష్య ప్రభావం ఎంతవరకూ ఉంటుందనే విషయాలు పరిశీలన చేయాలని కోరారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించక ముందే గ్రామసభలు నిర్వహించి పరిశ్రమ వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, దీనివల్ల కాలుష్య సంబంధ ఇబ్బందులేమిటనే విషయాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఇక్కడ ఇవేమీ చేయలేదంటే తప్పు జరుగుతున్నట్టే అర్థమవుతోంది కదా అని ప్రశ్నించారు. ‘మీకు అనుకూలంగా ఉన్న పారిశ్రామిక వేత్తల కోసం కుటిల రాజకీయాలు చేస్తారా’ అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఇదేమిటని అడిగితే వైఎస్సార్ సీపీ అభివద్ధిని నిరోధిస్తోందంటూ అభాండాలు వేయడం ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారన్నారు. ఆక్వా ఫుడ్‌పార్క్ విషయంలో ప్రజల్లో ఉన్న ఆందోళనలు, భయాలు తొలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఉందన్నారు. ప్రజల అంగీకారంతో పరిశ్రమలు స్థాపిస్తే వైఎస్సార్ సీపీ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. ఆక్వా పార్క్ నిర్మించడానికి తుందుర్రు అనుకూలం కాకపోతే వేరేచోటకు తరలించాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
తుందుర్రులో పోలీస్ క్యాంప్స్ ఎత్తివేయాలి
భీమవరం : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణంలో ఉన్న తుందుర్రులో పోలీస్ క్యాంప్‌లను తక్షణం ఎత్తివేసి పనులను నిలుపుదల చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం తరఫున ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం భీమవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కమిటీ సభ్యులు తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నల గరువు గ్రామాల్లో పర్యటించి అక్కడ చోటు చేసుకున్న ఘటనలపై నిజనిర్ధారణ చేసినట్టు ఆయన చెప్పారు. తుందుర్రులో గత 22 రోజులుగా 144 సెక్షన్ పెట్టి పెద్దెత్తున పోలీసులను మోహరించడంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజనిర్ధారణకు వెళ్లిన తమ కమిటీపైనే నిర్భంధించి ఉన్నతాధికారులతో మాట్లాడేంత వరకూ అక్కడికి వెళ్లనీయమంటూ అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. అక్కడి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారని, ఎప్పుడూ గడపదాటని మహిళలు సైతం పోలీసు కేసులు,సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారÆ టే వారిని పోలీసులు ఎంతగా వేధిస్తున్నారో అవగతమౌతుందన్నారు. ఫుడ్‌పార్కు యాజమాన్యంతో ప్రభుత్వం అధికారులు, కుమ్మక్కై చట్ట వ్యతిరేకంగా పార్కు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చంద్రశేఖర్ ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో పోలీస్ క్యాంప్‌లను ఎత్తి వేయాలని అక్కడ జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని నిష్పక్షపాతంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని డిమాండ్ చేశారు. సమావేÔ¶ ంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ, జిల్లా కార్యదర్శి కేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. -
తుందుర్రులో పోలీసు రాజ్యం
– వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడికి మహిళల మొర – పార్టీ పరంగా అండగా ఉంటామంటూ నాని భరోసా భీమవరం: ఆక్వాఫుడ్‌పార్క్ నిర్మాణం పేరుతో తమ గ్రామంలో పోలీసు రాజ్యమేలుతోందని పోలీసుల బూట్లు చప్పుళ్లతో గజగజ వణికిపోతూ ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయనకవాతావరణంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని భీమవరం మండలం తుందుర్రు గ్రామ ప్రజలు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానికి మొరపెట్టుకున్నారు. ఆదివారం భీమవరం వచ్చిన నానిని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. విషవాయువులను వెదజల్లే గోదావరి మెగా ఆక్వాఫుడ్ నిర్మాణం వల్ల తాగు, సాగునీరు కలుషితం కావడమేగాక పచ్చని పంటపొలాలు సర్వనాశనమయ్యే ప్రమాదముందని ఫుడ్‌పార్క్‌ను ప్రజలకు ఇబ్బందిలేని సముద్రతీరంలో నిర్మించుకోవాలంటూ గత రెండున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిని పెట్టి ఫుడ్‌పార్క్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి తమను ఇంటిలోనుంచి బయటకు రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అక్రమ కేసులను బనాయించి మగవారిని జైలులో పెట్టారని నాన్న ఏడంటూ పిల్లలు అడిగే ప్రశ్నకు సమాదానం చెప్పలేక జీవచ్చవంలా కాలం వెళ్లదీస్తుమని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి నుంచి ఏ ఇతర అవసరాలకు బయటకు వెళ్లాలన్నా ఆధార్‌కార్డు చూపించాలంటూ నిబంధనలు విధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఇదే ప్రశ్నించే అందరిపై అక్రమంగా కేసులు బనాయించి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎప్పుడు పోలీసులను చూడని తాము నిత్యం పోలీసు జీప్ హారన్లు, బూట్లు చప్పుళ్లుతో బెంబేలెత్తిపోతున్నామని తక్షణం గ్రామంలో 144 సెక్షన్‌ను ఎత్తివేసే విధంగా కృషిచేయాలని కోరారు. తమకు మేలు చేస్తారని ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఫుడ్‌పార్క్ యాజమన్యానికి తొత్తులుగా మారి ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పుడ్‌పార్క్ నిర్మాణం కారణంగా గ్రామంలో ప్రశాంత వాతావరణం కరువైందని బంధువులు, మిత్రులు కూడ గ్రామంలోనికి రావడానికి బయపడుతున్నారన్నారు. దీనికి స్పందించిన నాని మాట్లాడుతూ ఇక్కడి సమస్యను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దష్టికి తీసుకువెళ్లి అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని భరోసా ఇచ్చారు. బాధిత గ్రామాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అధైర్యపడవద్దంటూ ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉండగా ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల జీవనోపాధి పొందుతున్నామని దీనిని అడ్డుకోవద్దంటూ ఫుడ్‌పార్క్ పరిరక్షణ కమిటీ నాయకులు కొంతమంది నానికి విన్నవించారు. దీనికి స్పందించిన నాని మాట్లాడుతూ పరిశ్రమలస్ధాపనకు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ వ్యతిరేకం కాదని అయితే తుందుర్రులో చేపట్టిన చర్యలనే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఉత్పన్నమయ్యే ఇబ్బందుల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరించి వారిని ఒప్పించి పార్క్ నిర్మించాలని తాము చెబుతున్నామని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులేని ప్రాంతంలో ఫుడ్‌పార్క్ నిర్మిస్తే తామ పార్టీ పరంగా పూర్తిగా సహకరిస్తామని నాని స్పష్టం చేశారు. -
ప్రభుత్వానికి తొత్తుల్లా రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు
తణుకు అర్బన్ : తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ ఏర్పాటులో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తూ మహిళలపై కూడా అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.రమాదేవి విమర్శించారు. తుందుర్రు ఘటనలో అరెస్ట్ చేసిన కొంతమంది బాధితులు తణుకు సబ్‌జైలులో ఉన్నారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన ఆమె సోమవారం తణుకులో విలేకరులతో మాట్లాడారు. తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామా ల్లో ప్రభుత్వం మెగా ఆక్వాఫుడ్ నిర్మాణం కోసం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందన్నారు. చట్టాలకు విరుద్ధంగా ముందుగానే ప్రైవేట్ వ్యక్తులు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి స్థానిక ప్రజలు ఆమోదించారనే తప్పుడు కాగితాలతో మెగా ఆక్వాఫుడ్ నిర్మాణానికి ఒడిగట్టారన్నారు. ఈ ప్రాంతానికి దిగువన ఉన్న 30 మత్స్యకార గ్రామాలు, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాల ప్రజలు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫ్యాక్టరీ కారణంగా నీరు, గాలి వాతావరణ కాలుష్యం ఉంటుందని, గతం లో ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఇప్పటికీ పలురకాల వ్యాధులతో బాధపడుతున్న సందర్భాలున్నాయని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించిన ఐద్వా మహిళ ఆరేటి సత్యవతిపై పోలీ సులు 307 సెక్షన్‌తో కేసు నమోదు చేసి జైలులో పెట్టడం దారుణమన్నారు. ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఈ నిర్మాణం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా ప్రజానీకానికి, పంట భూములకు నష్టంవాటిల్లుతుందని తేల్చినా ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి కమిషన్‌ను వేయకుండా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఉద్యోగాల ద్వారా ఉపాధి కలుగుతుందని ప్రచారం చేయిస్తుండడం బాధాకరమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు జీపులోనే కొందరిని ఫ్యాక్టరీకి అనుకూలంగా పోరాటం చేయిస్తుండడం దిగజారుడు రాజకీయమేనన్నారు. గతంలో భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తామని మాటిచ్చి ఇప్పుడు మాట్లాడకపోవడం దారుణమన్నారు. 144 సెక్షన్, పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తక్షణమే పోలీస్ బలగాలను తొలగించాలని రమాదేవి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా శ్రామిక మహిళా నాయకురాలు అడ్డగర్ల అజయకుమారి, తణుకు డివిజన్ ఐద్వా కార్యదర్శి కె.నాగరత్నం, టి.సుమ, టి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు -
స్వదేశంలో శరణార్థులుగా మారాం
భీమవరం అర్బన్: స్వదేశంలో తమ పరిస్థితి శరణార్థులుగా మారిందని గోదావరి మెగా ఫుడ్‌పార్కు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మేం తీవ్రవాదులమా, దేశ ద్రోహులమా.. ఇంటి నుంచి కాలు బయట పెడితే పోలీసులకు సవాలక్ష అనుమానాలను నివృత్తి చేయాల్సి వస్తోంది. ప్రశాంతమైన గ్రామాలు పోలీస్ రాజ్యంలా మారాయి’ అంటూ తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది పొత్తూరి నాగ సురేష్‌కుమార్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. హైదరాబాద్lనుంచి వచ్చిన పొత్తూరి నాగ సురేష్‌కుమార్ ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని నాగసురేష్కుమార్ అన్నారు. ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే బ్రిటీష్ పాల నను తలపిస్తోందన్నారు. ఎక్కడ చూసిన పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం పౌరహక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పారు. ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తక్షణమే గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పరిస్థితులను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. చర్చినీ వదలని పోలీసులు విశ్వాçÜులు చర్చిలకు వెళితే అక్కడ చర్చలు జరుపుతారనే ఉద్దేశంతో పోలీసులు అడ్డుకున్నారు. చర్చి ఆరుబయట ప్రార్థనలు చేసుకోవాలని ఆదేశించారు. దైవ కార్యక్రమాలకు సైతం పోలీసులు అడ్డుపడటం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకచవితి వేడుకలకు కూడా తాము దూరమయ్యాయని పలువురు గ్రామస్తులు వాపోయారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు తన భర్తను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారని జొన్నలగరువు గ్రామానికి చెందిన కీర్తన అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనిచేసుకుని తనతో పాటు ముగ్గురు పిల్లల్ని పోషిస్తున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లు గడవడం కష్టంగా ఉందని, తన భర్తను విడుదల చేయాలని కోరారు. -
ఆక్వా పార్క్ ఏర్పాటుకు సీఎం సుముఖం
నరసాపురం : తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పూర్తి సుముఖంగా ఉన్నారని నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం, ఇతర విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్ పార్కు విషయంలో జరుగుతున్న ఆందోళనలు, లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మధుసూదనరావు, మత్స్యశాఖ ఏడీ పి.రామ్మోహన్రావు, ఆంధ్రా యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఫ్రొఫెసర్ ఎస్.సందీప్‌లను నియమించినట్టు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారని చెప్పారు. ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ద్వారా ఎలాంటి హానికరమైన వ్యర్థాలు వెలువడవని సబ్‌కలెక్టర్ వివరించారు. అది ఆరెంజ్ గ్రేడ్ ఫ్యాక్టరీగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించిందన్నారు. వ్యర్థాలను పైప్లైన్ల ద్వారా సముద్రంలో కలపడానికి యాజమాన్యం అంగీకరించందిన్నారు. రూ.11 కోట్లతో పైప్లైన్లు నిర్మించనున్నారని సబ్ కలెక్టర్ చెప్పారు. ప్రత్యక్షంగా ఫ్యాక్టరీ ద్వారా 2 వేల మందికి, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంట్‌గా అందిస్తుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలకు ఈ విషయాలను చెప్పి ఒప్పిస్తామని తెలిపారు. -
ఆక్వా ఫుడ్ పార్క్‌కు పూర్తిగా వ్యతిరేకం
భీమవరం అర్బన్ : తుందుర్రులో జనావాసాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు తామంతా పూర్తి వ్యతిరేకమని తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల పెద్దలు తేల్చిచెప్పారు. శుక్రవారం తుందుర్రులో ఆరేటి కనకయ్య అధ్యక్షతన తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు పెద్దలు, పోరాట కమిటీ నాయకులు సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా గ్రామాల పెద్దలు ఆరేటి అబ్బులు, కాండ్రేగుల నరసింహరావు, కొట్టు త్రినాథ్, తాడి దానియేలు, నన్నేటి నాగరాజు మాట్లాడుతూ ఇటీవల సబ్ కలెక్టర్, డీఎస్పీ విడివిడిగా గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి ఫుడ్‌పార్కు నిర్మాణంపై పలు అంశాలపై చర్చించి గ్రామస్తులకు వివరించారన్నారు. అయితే ఇంకా పలు అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అందువల్ల ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గతంలో ఫ్యాక్టరీ నిర్మించవద్దని పంచాయతీ తీర్మానాలు చేశామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం, యాజమాన్యం వాటిని పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి ఇక్కడే ఫుడ్పార్కుని నిర్మించాలని చూడడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఫుడ్‌పార్కు నిర్మాణానికి మూడు గ్రామాల ప్రజలు వ్యతిరేకమని చెప్పారు. సమావేశంలో సముద్రాల వెంకటేశ్వరరావు, బెల్లపు సత్యనారాయణ, యర్రంశెట్టి అబ్బులు, కొత్తపలి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. -
ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధమే
మెగా ఆక్వా ఫుడ్ పార్కుపై రాజకీయ, రైతు, మత్స్యకార నేతల అల్టిమేటం నరసాపురం అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణానికి ఇంకో ఇటుక పేర్చినా.. యుద్ధం తప్పదని రాజకీయ, రైతు, మత్స్యకార నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఆదివారం మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో భారీ బహిరంగ సభ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభ దద్దరిల్లింది. సభ జరపడానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించినా.. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళనకారుల లక్ష్యం ముందు అవేమీ నిలబడలేదు. సభలో ఆక్వా ఫుడ్‌పార్కు పోరాటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, రైతు, మత్స్యకార సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. పార్కు నిర్మాణం విషయంలో ప్రభుత్వం నాటకాలాడుతోందని వారు విమర్శించారు. ఓవైపు తాత్కాలికంగా పనులు ఆపుతున్నామని చెబుతున్న సర్కారు.. మరోవైపు కలెక్టర్‌తో.. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులేమీ ఉండవని ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించడంపై వారు మండిపడ్డారు. ఫుడ్‌పార్కు పనులను శాశ్వతంగా నిలిపేయాలని డిమాండ్ చేశారు. సభకు అధికార పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఇక పనులు జరగవని చెప్పి వెళ్లిపోయారు. తమ మాటలు కూడా వినాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరుతున్నా.. వినకుండా ఎమ్మెల్యే వేదిక దిగిపోవడంపై మధు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాటలు కాదు రాతపూర్వకంగా తెలియజేయాలని ఎమ్మెల్యేకు ఆయన సవాల్ విసిరారు. సభలో మాజీ ఎమ్మెల్యే ఆర్.సత్యనారాయణరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెక్కంటి సుబ్బారావు, ఐద్వాజిల్లా కార్యదర్శి కమల, పాలంకి ప్రసాద్, బొమ్మిడి నాయకర్ తదితరులు మాట్లాడారు. ఇద్దరు పాశ్రామికవేత్తలకు కొమ్ముకాయడం కోసం, నాలుగు మండలాల ప్రజల జీవితాలను సర్కారు ఫణంగా పెడుతోందని వారు విమర్శించారు. సభకు మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బర్రె ప్రసాద్ అధ్యక్షత వహించారు. నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం, భీమవరం మండలాలకు చెందిన ప్రజలు, రైతులు, మత్స్యకారులు 3 వేల మందికిపైగా పాల్గొన్నారు. రాతపూర్వకంగా ఇవ్వాల్సిందే: మధు ఫుడ్‌పార్కు నిర్మాణం చేపట్టబోమని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ వచ్చేవరకూ ప్రజా పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. నాలుగు మండలాల ప్రజలు ఫుడ్‌పార్కు వల్ల కాలుష్యం పెరుగుతుందని, జీవనోపాధి కోల్పోతామని ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలికంగా పనులు ఆపేస్తామని, ఈ నిర్మాణం వల్ల నష్టమేమీ జరగదని మభ్యపెట్టేందుకు యత్నించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటన చేయాలి: కొత్తపల్లి గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు పేరుతో ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో నిర్మించనివ్వబోమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. సభలో కొత్తపల్లి ప్రాజెక్టు వల్ల గ్రామాలు ఎలా నష్టపోతాయో వివరించారు. ప్రాజెక్ట్‌ను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదన్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదు: మాజీమంత్రి మోపిదేవి అభివృద్ధి అనేది ప్రజల అంగీకారంతో జరగాలని, అధికారం ఉంది కదాని ప్రజలపై దౌర్జన్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హెచ్చరించారు. కంపెనీలో తమ జీవితాలు బుగ్గవుతాయని ప్రజలు మొత్తుకుంటున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పరిశ్రమలకు పచ్చని పొలాలు కావాలా: సీపీఐ రామకృష్ణ ముఖ్యమంత్రికి పరిశ్రమలు పెట్టడానికి, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని పంటలు పండే పచ్చని పొలాలు, విలువైన భూములే కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చవగ్గా భూములు దొరికే రాయలసీమలో ఎందుకు పరిశ్రమలు పెట్టడం లేదని ప్రశ్నించారు.