మత్స్యకారుల జలదీక్ష
Published Mon, Nov 7 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
మొగల్తూరు : తుందుర్రు ఆక్వా పరిశ్రమను మూసివేయాలని చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని మత్య్సకార నాయకులు హెచ్చరించారు. ఆదివారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరులో జలదీక్ష చేసి మత్స్యకారులు పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ అనేక ఉద్యమాలు చేశామని, అయినా ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయడంలేదని, తమ పొట్టకొట్టేందుకు సిద్ధమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి శ్రీనువాస్, వైదాని మహలక్షి్మరావు, కొల్లాటి నాగరాజు, ఎస్.కలకంఠేశ్వరరావు, గిరిబాబు, సింహాద్రి, పోతురాజు, వాటాల నర్సింహరావు, అద్దంకి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement