తుందుర్రు చుట్టుపక్కల 144 సెక్షన్ ఎత్తేయాలి..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారులపై కూడా వెంటనే కేసులు ఎత్తివేయాలని ఆయన అన్నారు.
అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణగొదక్కాలని అనుకోవడం అవివేకమని ఆళ్ల నాని శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. తుందుర్రు గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మెగా ఆక్వా ఫుడ్ పార్కును తీర ప్రాంతానికి తరలించారని ఆళ్ల నాని సూచించారు.