సాక్షి,ఏలూరుజిల్లా: ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న ఊహాగానాలతో ఏలూరు టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి.ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని ఏలూరు తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.నాని రాకను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో తెలుగుతమ్ముళ్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
తన 32 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణగదొక్కిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పకుండా నాని పార్టీలో చేరితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment