slams
-
ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఆగ్రహం !
వాషింగ్టన్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో రష్యాతో జరుగుతున్న చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘జెలెన్స్కీ ఒక అసమర్థ నేత. అసలు రష్యా,ఉక్రెయిన్ యుద్ధం మొదలవడానికి కారణమే జెలెన్స్కీ. యుద్ధానికి ముగింపు పలికేందుకు జెలెన్స్కీ రష్యాతో ఎప్పుడో డీల్ కుదుర్చుకోవాల్సింది.సౌదీలో చర్చలకు తమను పిలవలేదని జెలెన్స్కీ అంటున్నాడు. మూడేళ్ల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు. ఈ నెలలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడతా. యుద్ధం ఆపేందుకు పుతిన్,జెలెన్స్కీ ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నా’అని ట్రంప్ తెలిపారు.కాగా, రష్యా,ఉక్రెయిన్ల మధ్య యుద్ధంపై సౌదీఅరేబియాలో జరుగుతున్న చర్చలకు తమను పిలవకపోవంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము లేకుండా తమ దేశానికి సంబంధించిన చర్చలు ఎలా జరుగుతాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు లేకుండా తాము ఎక్కువ రోజులు మనుగడ సాధించలేమన్నారు. -
గౌరవ్ గొగొయ్ భార్యపై ఆరోపణలు..అస్సాం సీఎంపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ:అస్సాం సీం హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత,లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్‌పై హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేత రషీద్ అల్వీ తీవ్రంగా స్పందించారు. గొగొయ్ భార్యకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయని ఏ ఆధారాలతో మాట్లాడారని రషీద్ అల్వీ ప్రశ్నించారు. ఒకవేళ ఇదే నిజమైతే ఎలిజబెత్‌పై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలన్నారు. హిమంత సీఎంగా ఉండి ఇంత దిగజారడమేంటన్నారు.ప్రతిపక్షనేతలపై ఆరోపణలు చేయడానికి ఓ పరిమితి ఉండాలని హితవు పలికారు. కాగా,పాకిస్తాన్ జాతీయుడు అలీ షేక్‌పై కేసు నమోదు చేయాలని అస్సాం క్యాబినెట్ ఆదివారం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.అయితే అలీషేక్ కాంగ్రెస్ నేత గౌరవ్‌గొగొయ్ భార్య,బ్రిటన్ జాతీయురాలు ఎలిజబెత్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, ఇది దేశ భద్రతకు ఏదైనా ముప్పు తెస్తుందా అన్నదానిపై విచారణ చేయాలని కూడా డీజీపీకి సూచించారు. దీనిపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. -
డీఎంకే ప్రభుత్వంపై విజయ్ ఫైర్
చెన్నై:తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తమిళగ వెట్రి కజగమ్(టీవీకే) అధినేత, హీరో విజయ్ ఫైర్ అయ్యారు.ఫెంగల్ తుఫాను సహాయక చర్యలపై విజయ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శలు గుప్పించారు. తుఫాను రిలీఫ్‌లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ తాత్కాలికమైనవేనని,దీర్ఘకాలిక పరిష్కారాలేమీ చూపడం లేదన్నారు. ఏదైనా విపత్తు జరిగినపుడు ఒక సంప్రదాయం లాగ కొన్ని ప్రాంతాలు సందర్శించి ఆహారం పంపిణీ చేయడం ఫొటోలు దిగడం తప్ప ఏమీ చేయడం లేదని ఫైరయ్యారు. ఇవి కూడా కేవలం మీడియా ఫోకస్ ఉన్నంతవరకేనన్నారు. తుపానుకు సంబంధించి ముందస్తు హెచ్చరికలున్నా నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం ఎంతమాత్రం తీసుకోలేదన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే బీజేపీ ఏజెంట్లని ఎదురుదాడి చేయడం సర్వసాధారణమైపోయిందన్నారు.తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలని టీవీకే క్యాడర్‌కు విజయ్ పిలుపిచ్చారు. -
ఆళ్లనానిపై భగ్గుమంటున్న తెలుగుతమ్ముళ్లు
సాక్షి,ఏలూరుజిల్లా: ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న ఊహాగానాలతో ఏలూరు టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి.ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని ఏలూరు తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.నాని రాకను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో తెలుగుతమ్ముళ్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.తన 32 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణగదొక్కిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పకుండా నాని పార్టీలో చేరితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. -
బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:బీఆర్ఎస్పార్టీ, కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి మరోసారి ఫైరయ్యారు. మేడిగడ్డ కూలినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం(నవంబర్22) మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,సీతక్కలతో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘ఆలేరు,భువనగిరి నియోజకవర్గాలకు తాగు నీరు ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రాలేదు. కేసీఆర్ పాపాలు చేసిండు కాబట్టే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి శపించి ఫాంహౌజ్‌కు పంపించాడు.కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు రేవంత్ సీఎం అయ్యేవాడు కాదని హరీష్‌రావు అంటున్నాడు. హరీష్‌రావుకి బుద్ది ఉండే మాట్లాడుతున్నాడా? మతి భ్రమించి బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు’అని కోమటిరెడ్డి మండిపడ్డారు. -
ప్రభుత్వ స్కూల్లో ఫుడ్‌పాయిజన్.. హరీశ్‌రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. తాజాగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం(నవంబర్20) ఒక ప్రకటన విడుదల చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు.‘నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.రేవంత్ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా
థానే: జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇందుకు నాటి 26/11 ముంబై ఉగ్రదాడులే ఉదాహరణ అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముంబై దాడుల్లో దోషిగా తేలి, మరణశిక్ష పడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ వడ్డించిందని నడ్డా ఆరోపించారు.మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ఉదాశీన వైఖరి అవలంబించిందని నడ్డా ఆరోపించారు. 26/11 దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు. అయితే ఉరీ, పుల్వామా ఉగ్రదాడుల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ప్రశంసనీయమైనవని నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగంలోని ఏబీసీ కూడా అర్థం కావడం లేదని నడ్డా ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించదనే విషయం రాహుల్‌కు తెలియనట్లున్నదన్నారు. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో రాజ్యాంగ ప్రతులను చూపిస్తూ, ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ కోరుకుంటున్నదని ఓటర్లకు చెప్పడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. తెలంగాణ, కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా రద్దు చేసి, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ ఎప్పుడూ ఎవరిపైనా వివక్ష చూపలేదని నడ్డా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం! -
‘నేతలు గోల్గప్పాలు అమ్ముకోవాలా?’: కంగనా
బాలీవుడ్ నటి కంగన రాజకీయాల్లోకి ప్రవేశించాక తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె జ్యోతిర్మఠం(ఉత్తరాఖండ్)నకు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల ముంబైలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని ఆరోపించారు. సనాతన ధర్మంలో ద్రోహం పెద్ద పాపమని పేర్కొన్నారు. అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యల నేపధ్యంలో కొందరు ఆయనను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఈ ఉదంతంపై బాలీవుడ్ క్వీన్, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ కూడా స్పందించారు. ఎంపీ కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మద్దతు పలుకుతూ, అవిముక్తేశ్వరానందపై విమర్శలు చేశారు. శంకరాచార్య తన పదజాలంతో మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని కంగనా ఆరోపించారు.కంగనా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో..‘ రాజకీయాల్లో పొత్తు, పార్టీ విభజన అనేవి చాలా సాధారణమైన, రాజ్యాంగబద్ధమైన విషయాలని, 1907లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని, 1971లోనూ ఇలానే జరిగిందని, నేతలు రాజకీయాలు చేయకపోతే గోల్గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను దేశద్రోహి అని వ్యాఖ్యానించిన శంకరాచార్య హిందూ ధర్మం గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा? शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024 -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
‘అభివృద్ధిని ఇండియా కూటమి ఓర్వలేదు’: ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో రూ.42 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘అజంగఢ్‌లో గతంలో మాఫియా పాలన ఉండేదని, ఇప్పుడు ఇక్కడి ప్రజలు చట్టబద్ధమైన పాలనను చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ‘ఇండియా కూటమి’కి నిద్రపట్టడంలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అజంగఢ్ అభివృద్ధికి బాటలు వేస్తుందని, నక్షత్రంలా వెలిగిపోతుందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నేతలు కేవలం పథకాలను మాత్రమే ప్రకటించేవారని విమర్శించారు. మోదీ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, దేశాభివృద్ధే లక్ష్యంగా తన ప్రయాణం సాతున్నదని అన్నారు. అజంగఢ్ అభివృద్ధికి చిహ్నంగా మారుతుందని మోదీ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల కళ్లలో దుమ్ము కొట్టిందని ఆరోపించారు. తాము దేశంలో అనేక రైల్వే స్టేషన్లు ఏకకాలంలో నిర్మిస్తున్నామన్నారు. దేశం మొత్తం మీద అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఇక్కడ నుండే ప్రారంభమవుతున్నాయని, ఈరోజు దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అజంగఢ్ నుంచి ప్రారంభించామన్నారు. నేడు ఆజంగఢ్ కొత్త చరిత్ర నాందిపలుకుతోందని అన్నారు. కులతత్వం, బంధుప్రీతి, ఓటు బ్యాంకుపై ఆధారపడిన ఇండియా కూటమి ఇంతటి అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. అజంగఢ్, పూర్వాంచల్ ప్రజలకు రాజా సుహెల్దేవ్ స్టేట్ యూనివర్శిటీ, మండూరి విమానాశ్రయంతో సహా అనేక ప్రాజెక్టులను కానుకగా ఇచ్చారు. पूर्वी उत्तर प्रदेश समेत पूरे देश के परिवारजनों के जीवन को आसान बनाने के लिए हमारी सरकार दिन-रात काम रही है। आजमगढ़ में विकास कार्यों के शिलान्यास और लोकार्पण कार्यक्रम को संबोधित कर रहा हूं।https://t.co/fGxt3QsZt4 — Narendra Modi (@narendramodi) March 10, 2024 -
కాంగ్రెస్ చెత్త రాజకీయాలకు దేవుడే గుణపాఠం చెప్తాడు
-
సుందర్ పిచాయ్‌పై గూగుల్ మాజీ ఉద్యోగి ఘాటు వ్యాఖ్యలు
గూగుల్ మాజీ ఉద్యోగి ఒకరు అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఘాటు విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది.. దార్శనిక నాయకత్వం లేకపోవడమే కంపెనీ క్షీణతకు దారి తీసిందని విమర్శించారు. విజనరీ లేని లీడర్షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ అంటూ సుందర్ పిచాయ్‌పై అసంతప్తి వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బంది మధ్య పారదర్శకతను గూగుల్ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకపుడు సంస్థ కోసం, వినియోగదారుల ప్రయోజనాలకు తీసుకునే నిర్ణయాల కాస్త ఇపుడు ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో వారి ప్రయోజనాలుగా మారిపోయాయంటూ ధ్వజమెత్తారు. గూగుల్ పాతికేళ్ల ప్రస్థానంలో 18 ఏళ్లు పనిచేసిన తాను ఈ నెలలో కంపనీకి రాజీనామా చేసినట్టు ఇయాన్ హిక్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా తన బ్లాగ్‌పోస్ట్‌లో సుందర్ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంస్థలో భారీగా ఉద్యోగులు తొలగింపు, నైతిక ప్రమాణాలు, కల్చర్ లాంటి అంశాలను తన పోస్ట్‌లో ప్రస్తావించారు. విజనరీ లేని పిచాయ్ నాయకత్వంలో గూగుల్ సంస్కృతి క్షీణించి పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో చేరిన తొలి రోజులు బావుండేవని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని పేర్కొన్నారు. సంస్థలో కీలక ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బందితో నిజాయితీగా, పారదర్శకంగా ఉండేవారు. ప్రతిష్టాత్మక ప్రయోగాలకు ప్రోత్సాహమిచ్చేవాంటూ రాసుకొచ్చారు. తొలి తొమ్మిదేళ్లు Googleలో HTMLలోనూ, చివరి తొమ్మిదేళ్లు గూగుల్‌లో యాప్‌లను అభివృద్ధి చేసే ప్లాట్‌ఫారమ్ ఫ్లట్టర్లో పని చేశానంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కానీ ఇపుడు గూగుల్‌లో కంపెనీ విజన్ ఏమిటో వివరించే చెప్పగలిగే వాళ్లెవరైనా ఉన్నారా అనే సందేహాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు. నైతికత అంతంత మాత్రంగానే ఉందన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని థెరపిస్ట్‌లతో మాట్లాడితే, వారు తమ Google క్లయిట్లందరూ అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుందని రాసుకొచ్చారు. ఈ సమస్యంతా పిచాయ్ విజనరీ లేని లీడర్షిప్ కారణంగానే ఉత్పన్నమైందనీ, అసలు ఆయనకు ప్రారంభ గూగుల్ ప్రమాణాలను పాటించడంపై ఏ మాత్రం ఆసక్తి లేదంటూ ధ్వజమెత్తారు. ఇది అసమర్థమైన మిడిల్ మేనేజ్మెంట్ వ్యాప్తికి దారితీసిందన్నారు. ఈ సందర్భంగా ఫ్లట్టర్, డార్ట్, ఫైర్‌బేస్ వంటి ప్రాజెక్టులను కవర్ చేసే విభాగాన్ని నిర్వహిస్తున్న జీనైన్ బ్యాంక్స్‌పై మండిపడ్డారు. అయినా కంపెనీ వృద్ధిపై ఆశాభావాన్ని వ్యక్తం చేసిన హిక్సన్, నాయకత్వ స్థాయిలో కొంత 'షేక్-అప్' అవసరమని సూచించారు. దీర్ఘకాలిక, స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారాన్ని అప్పగిస్తే, కంపెనీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుదని వ్యాఖ్యానించారు. అయితే హిక్సన్ వ్యాఖ్యలపై గూగుల్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. -
ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్
70 Hour Week Remark controversy: వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువత వారానికి 70 గంటలు కచ్చితంగా పని చేయాలన్న వ్యాఖ్యలపై అటు నెటిజన్లు నుంచి ఇటు పలు టెక్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లలభవిష్యత్‌ను సక్రమంగా తీర్చిదిద్దుతూ చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్ టైంని డిమాండ్ చేయకుండానూ అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై చాలామంది సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ స్పందిస్తూ నిజానికి, తన భర్త, తానూ కూడా తమ కుమారుడి పెంపకంలో చాలా సాయం చేశారు. అలాగే ముంబై లాంటి మహానగరాల్లో పనికంటే మనం అందరం ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటూ పరోక్షంగా మూర్తి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్ చేశారు. అవును అమ్మకు ఆదివారం లేదు.. వారాంతంలో కూడా పనిచేయాలని ఒకరు, ఆఫీస్ పని లేకపోయినా కూడా భారతీ మహిళలు కుటుంబ పోషణ కోసం వారానికి 72 గంటలకు పైగానే పని చేస్తున్నారు. చాలా కరెక్ట్‌గా చెప్పారు..అలుపెరుగని ఆడవారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇప్పటికైనా వారి కమిట్మెంట్ను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మరో యూజర్. అందరికంటే ముందు లేచేది అమ్మ.. అందరికంటే చివర్లో తినేది అమ్మే.. ఆఖరికి చివరగా నిద్రపోయేదీ అమ్మే అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. పితృస్వామ్యం అంతరించేంత వరకు ఈ వివక్ష పోదు. వెస్ట్రన్‌లో కూడా పూర్తి సమయం ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లో బానిసలుగా ఉన్నారు. వీకెండ్లో పురుషులంతా పార్టీలు చేసుకుంటారు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూసే వరకు...ఏదీ మారదు మరోయూజర్ వ్యాఖ్యానించారు. Between offices and homes, many Indian women have been working many more than seventy hour weeks to build India (through our work) and the next generation of Indians (our children). For years and decades. With a smile, and without a demand for overtime. Funnily, no one has… — Radhika Gupta (@iRadhikaGupta) October 29, 2023 కాగా ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్‌దాస్ పాయ్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా మన దేశం కూడా ఆర్థికంగా పుంజుకోవాలంటే యువత వారానికి 70 గంటలు తప్పనిసరిగా పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారంటూ మీడియాలో పలు కథనాలు వెలు వడ్డాయి. దీంతో నెటిజన్లు చాలావరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భవిష్ అగర్వాల్, జేఎస్‌డబ్ల్యూ సజ్జన్‌సిందాల్ సహా కొంతమంది పరిశ్రమ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. Infosys employee pic.twitter.com/FN8y5BgGTu — Gabbar (@GabbbarSingh) October 28, 2023 -
ఇషాన్ కిషన్ కు పాకిస్థాన్ క్రికెటర్ సపోర్ట్..
-
అవినీతే కాంగ్రెస్ ఊపిరి
రాయ్‌పూర్/గోరఖ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఊపిరి, ముఖ్య సిద్ధాంతం అవినీతేనని పేర్కొన్నారు. అవినీతి లేకుండా ఆ పార్టీ బతకలేదని విమర్శించారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ ఏటీఎంలా మార్చేసుకుందని వ్యాఖ్యానించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, అవినీతి పరులపై చర్యలకు తనదీ గ్యారెంటీ అని అన్నారు. ‘కుంభకోణాల్లో మునిగిన కాంగ్రెస్ ప్రభుత్వం దుష్పరిపాలనకు ఆదర్శంగా మారింది. అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచింది. ప్రజల హక్కుల్ని లాగేసుకుని, రాష్ట్రాన్ని లూటీ చేసి, నాశనం చేసేందుకు పూనుకుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’అని ప్రధాని నిప్పులు చెరిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన మద్య నిషేధం తదితర 36 వాగ్దానాలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయింది. మద్య నిషేధానికి బదులుగా కోట్లాది రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడింది. ఈ డబ్బంతా కాంగ్రెస్ ఖాతాలోకే చేరింది. ఒక్క మద్యానికే కాదు. ప్రతి శాఖలోనూ అవినీతే. అవినీతి కాంగ్రెస్‌కు ఊపిరిగా మారింది. అది లేకుండా ఆ పారీ్టకి శ్వాస ఆడదు. అవినీతే కాంగ్రెస్ ముఖ్య సిద్ధాంతం’అని అన్నారు. కాంగ్రెస్ అవినీతికి గ్యారెంటీ అని నేను విమర్శిస్తే కొందరు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానర్థం, అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లే. కాంగ్రెస్ అవినీతికి గ్యారెంటీ అయితే, అవినీతిపై చర్యలకు మోదీ గ్యారెంటీ’అని ఆయన స్పష్టం చేశారు. అవినీతి పరులు, గతంలో పరస్పరం దూషించుకున్నవారు ఇప్పుడు దగ్గరవుతున్నారంటూ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. ఇటువంటి వాటికి భయపడేది లేదన్నారు. ‘తప్పుడు పనుల్లో మునిగి తేలేవారు తప్పించుకోలేరు. నా దగ్గర ఉన్నదంతా మీరు (ప్రజలు), ఈదేశం ఇచి్చనవేనని ధైర్యంగా చెబుతున్నా. నాపై కుట్రలు పన్నుతున్న వారికి, నా సమాధి తవ్వాలని చూస్తున్న వారికి భయపడను. భయపడితే మోదీనే కాను’అని ప్రధాని చెప్పారు. రాష్ట్రం నుంచి నక్సలిజంను లేకుండా చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని తెలిపారు. నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 70కి తగ్గిపోయిందన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంకేర్ జిల్లా అంతగఢ్– రాయ్‌పూర్ రైలుకు వర్చువల్‌గా జెండా ఊపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కార్డులను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న వారికి ఆధునిక సౌకర్యాలు కలి్పంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శంకుస్థాపన చేసిన రాయ్‌పూర్– ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్, రాయ్‌పూర్–విశాఖపట్టణం ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులతో ఈ ప్రాంత రూపురేఖలే మారనున్నాయన్నారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని శుక్రవారం ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతా ప్రెస్ కేవలం పుస్తకాలను ముద్రించే ముద్రణాలయం కాదు, ప్రజల విశ్వాసం, దేవాలయమని పేర్కొన్నారు. మహాత్మాగాం«దీకి గీతా ప్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గీతా ప్రెస్ ఆధ్వర్యంలో నడిచే కల్యాణ్ మేగజీన్ కోసం ఆయన వ్యాసాలు రాసే వారని చెప్పారు. ప్రధాని రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. అక్కడ రూ.12 వేల కోట్ల 29 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. గత ప్రభుత్వాలహయాంలో ఏసీ గదుల్లో కూర్చుని సంక్షేమ పథకాలను తయారు చేసే, ప్రభావం ఏమిటనే దానిపై అప్పటి నాయకులకు అవగాహన లేదని ప్రధాని అన్నారు. -
టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారు
-
క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ఫైర్..!
-
100 సీట్లు గెలుస్తాం..!
-
దేశ మనోభావాలను కించపర్చారు
అజ్మీర్: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ మనోభావాలను కాంగ్రెస్ కించపర్చిందని, 60,000 మంది కార్మికుల కఠోర శ్రమను అగౌరవపర్చిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో బుధవారం ఓ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించుకున్నామని, ప్రజలంతా గర్విస్తున్నారని, దేశ ప్రతిష్ట మరింత పెరగడంతో వారంతా సంతోషిస్తున్నారని మోదీ తెలిపారు. అన్నింటిలోనూ బురదజల్లే రాజకీయాలు చేసే కాంగ్రెస్, ఇతర పార్టీలు పార్లమెంట్ కొత్త భవనం విషయంలోనూ అదే పని చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కొత్త భవవాన్ని ప్రారంభించుకొనే అవకాశం కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని, కాంగ్రెస్ దాన్ని ‘స్వార్థపూరిత నిరసన’ కోసం వాడుకుందని ఆరోపించారు. మన దేశం సాధిస్తున్న ప్రగతిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. వారి అవినీతిని, కుటుంబ వారసత్వ రాజకీయాలను తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే తమపై కోపంగా ఉన్నారని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వారి ఆరాచకాలను ఒక ‘నిరుపేద బిడ్డ’ సాగనివ్వడం లేదని, అది వారు తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి వ్యవస్థ ‘‘పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని 55 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, పేదలను దగా చేసింది. పేదలను తప్పుదోవ పట్టించడం, వారిని ఎప్పటికీ పేదలుగానే ఉంచడం కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్ ప్రజలు ఎంతగానో నష్టపోయారు. తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాసేవకు, సుపరిపాలనకు, నిరుపేదల సంక్షేమానికి అంకితం చేస్తున్నాం. 2014కు ముందు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చేవారు. నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగేవి. అప్పట్లో రిమోట్ కంట్రోల్‌తో పాలన సాగేది. కాంగ్రెస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చే అవినీతి వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ గురించి మాట్లాడుకుంటోంది. దేశంలో పేదరికం అంతమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మన దేశం సాధించిన ప్రతి విజయం వెనుక ప్రజల చెమట చుక్కలు ఉన్నాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతీయులు ప్రదర్శిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. కొందరు వ్యక్తులకు మాత్రం ఇది అర్థం కావడం లేదు’’ అని ప్రధాని మోదీ తప్పుపట్టారు. అజ్మీర్‌లో సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
‘మీ బుల్డోజర్లతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్’
ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ తీరుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్‌లో.. తల్లికూతుళ్లు మరణించిన ఘటనను ప్రస్తావించారు బీఎస్పీ చీఫ్ మాయావతి. తాజాగా యూపీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కంటే.. తల్లీకూతుళ్ల మరణం ఘటనే వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిందంటూ మండిపడ్డారామె. బీజేపీ చేస్తున్న బుల్డోజర్ రాజకీయాలు అమాయకులైన పేదల ప్రాణాలు తీస్తున్నాయని, ఇది చాలా బాధకరమన్నారు. ఇలాంటి వాటివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందంటూ.. సోషల్ మీడియా వేదికగా యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ హిందీలో ట్వీట్ చేశారు. కాగా, బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చడంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ యోగి 'బుల్డోజర్ బాబాగా' ప్రజల నోళ్లల్లో నానుతుండటం గమనార్హం. 1. देश व खासकर उत्तर प्रदेश जैसे गरीबी, बेरोजगारी, महंगाई व पिछड़ेपन आदि से त्रस्त विशाल राज्य में भाजपा सरकार की लोगों को अति-लाचार एवं आतंकित करने वाली बुल्डोजर राजनीति से अब निर्दोष गरीबों की जान भी जाने लगी हैं, जो अति-दुखद व निन्दनीय। सरकार अपना जनविरोधी रवैया बदले। 1/2 — Mayawati (@Mayawati) February 15, 2023 (చదవండి: ఎవరైనా సీన్ క్రియేట్ చేస్తే నడుములు విరిగిపోతాయ్!: మధ్యప్రదేశ్ మంత్రి వార్నింగ్) -
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి 2022 విజయనామ సంవత్సరం : మంత్రి జోగి రమేష్
-
యనమల ఓ సైకో : మంత్రి దాడిశెట్టి రాజా
-
కేవలం హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంగ్ల విద్యను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పాఠశాలలో ఆంగ్ల విద్యను బోధించొద్దని గొడవ చేస్తున్నారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లోనే చదివిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుని మంచి పొజిషన్లో ఉండాలని కలలు కంటారని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన రాజస్తాన్‌లో అల్వార్‌లో భారత్ జోడోయాత్రలో భాగంగా పర్యటిస్తున్నప్పుడూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేవలం హిందీ మాత్రమే నేర్చుకుంటే..ప్రపంచంలో ఇతరులతో మాట్లాడటం సాధ్యం కాదని, కేవలం ఆంగ్ల విద్యతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. కాబట్టి మాకు రైతులు, కూలీల పిల్లలు అమెరికన్లతో పోటీపడి ఇంగ్లీష్‌ని నేర్చుకుని తాము అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాని చెప్పారు. రైతులు పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదవకూడదని కూడదని బీజేపీ కోరుకుంటోందంటూ రాహుల్ ఆరోపణలు చేశారు. అంతేగాదు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ..హిందీ, తమిళం వంటి ఇతర భాషలను చదవకూడదని చెప్పడం లేదు. ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ తెలుసుకోవాలని అన్నారు. రాజస్తాన్‌లో తాము దాదాపు 1700 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికన్ పిల్లలకు సవాలు విసురుతూ... విద్యార్థులు ధీటుగా ఇంగ్లీష్ చదవాలని కోరుకుంటున్నాను అని రాహుల్ గాంధీ చెప్పారు. (చదవండి: విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు) -
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్పై పవర్ఫుల్ పంచ్‌లు
సాక్షి, ఏలూరు: తమ్మిలేరులో తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత, శాసన సభా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించి తనపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే లండన్ నుంచి వచ్చా. నిజయోకవర్గానికి చెందిన యువతకు వేలాది ఉద్యోగాలు ఇప్పించా. అయినా చంద్రబాబు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.కానీ, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దెందులూరులో రూ.1,700 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రగతి యాత్రలో(మంగళవారం) అదే విషయం మేం చెప్పాం. కానీ, ప్రతిపక్ష పార్టీ మితిమీరి విమర్శలు చేస్తోంది. అయినా మీ హయాంలో చేసిన ఒక్క మంచిపని చెప్పండి అంటూ బాబుకు సవాల్ విసిరారు అబ్బయ్య చౌదరి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది వైఎస్ జగన్మోహన్రెడ్డినే అని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. ‘‘ఈ మూడున్నరేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై శాతం హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరవేర్చారు. కానీ, మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత చంద్రబాబుది. సీఎంగా వైఎస్ జగన్.. ఎన్నో అభివృద్ధి .. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చేశార’’ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అలాగే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. కనీసం నాలుగు లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అదే సీఎం జగన్.. ఈ మూడున్నరేళ్లలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఏపీలో రైతులు పండించిన ప్రతీ గింజను కొనేలా చేసిన వ్యక్తి వైఎస్ జగన్. మరి 44 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతులను పట్టించుకున్నావా? అంటూ చంద్రబాబును నిలదీశారు. డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కానీ, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం మా ప్రభుత్వం పై బురద చల్లాలనీ చూస్తున్నాయి. అది చూసి రాష్ట్ర ప్రజలు అంతా ‘బాబూ.. మాకు ఈ కర్మ ఏమిట’ని అనుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని.. అర్హులకు సంక్షేమం అందుతోంది గనుకే ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నామని అబ్బయ్య చౌదరి తెలిపారు. ఓటమి భయం తో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఇసుక మాఫియాకు పాల్పడింది చింతమనేని కాదా? అని నిలదీసిన అబ్బయ్య చౌదరి.. వచ్చే ఎన్నికల్లో ఫలితంతో చింతమనేనిని కూడా తన వెంట హైదరాబాద్‌కు చంద్రబాబు తీసుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. -
ట్విటర్ డీల్: మస్క్‌పై ధ్వజమెత్తిన అమెరికా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. తప్పుడు సమాచారాన్ని అవాస్తలను వ్యాప్తి చేస్తున్న ట్విటర్‌ను కొనుగోలు చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా, అసత్య ప్రచారాలతో విషాన్ని చిమ్ముతున్న ట్విటర్‌ను కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అసత్య వార్తలను, విషప్రచారాన్ని చేస్తున్న ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడం విచారకరమన్నారు. ట్విటర్‌కి అసలుఎడిటర్లే (నియంత్రణ) లేరు ఇక ప్రమాదంలో ఉన్నదాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారని ఎలా విశ్వసించాలని బిడెన్ ప్రశ్నించారు. ముఖ్యంగా సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురి కీలక ఎగ్జిక్యూవ్ల తొలగింపు, సంస్థలో దాదాపు సగం ఉద్యోగులపై వేటు, డైరెక్టర్ బోర్డును చేసి, ఏకైక డైరెక్టర్‌గా మస్క్ కొనసాగుతున్న నేపథ్యంలో బిడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నవంబర్ 8న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం చికాగోలో జరిగిన నిధుల సమీకరణ మీట్లో దీని ప్రభావంపై డోనర్లను హెచ్చరిస్తూ బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల మధ్య ఈ ఎ న్నికలు బైడెన్ సర్కార్‌కు పెద్ద సవాల్. (ElonMusk రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం! అయినా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నా!) మరోవైపు ట్విటర్ టోకోవర్పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్ట్ ట్రంప్ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాగా బిడెన్‌పై మస్క్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు బైడెన్‌ను ఎన్నుకోలేదనీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రామాను తట్టుకోలేకే ఆయన్ను గెలిపించారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
పార్టీ నాయకుడిపై లాలు యాదవ్ కొడుకు ఫైర్.. సమావేశం మధ్యలోనే...
న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలు యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తరుచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఢిల్లీల జరిగిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) సమావేశానికి హజరయ్యారు. ఐతే ఆ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రజాక్‌ని దుర్భాషలాడుతూ...సమావేశం మధ్యలోంచే బయటకు వచ్చేశారు. ఈ విషయమై తేజ్ ప్రతాప్‌ని మీడియా ప్రశ్నించగా...ఆయన సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు నిరాకరించారు. తాను బలహీనమైన వ్యక్తిని అని, చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నారు. అదీగాక రెండు రోజుల క్రితమే తన మేనల్లుడు చనిపోయాడని అయినప్పటికీ సమావేశానికి వచ్చానంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. తాను సమావేశం షెడ్యూల్ గురించి అడిగితో కార్యదర్శి శ్యామ్ రజాక్ తన సోదరిని, వ్యక్తిగత సహాయకుడి దుర్భాషలాడరని, ఆడియో రికార్డు కూడా ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇలానే ఇటీవల తన తండ్రి కోసం మధురలో పూజలు చేసే విషయమై వచ్చి నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కి మీడియాలో నిలిచారు. (చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన) -
మంత్రి హరీష్ రావు తీరుపై తెలంగాణ ఉపాధ్యాయులు ఫైర్
-
దుమారం రేపిన మోదీ వ్యాఖ్యలు... మాటల తూటలు పేల్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.... దేశంలో చిరుతలు అంతరించిపోయాయని, తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టేలా... దశాబ్దాలుగా ఎలాంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరగలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. అయితే, ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ దగాకోరు! అంటూ మాటల తుటాలు పేల్చింది. అంతేకాదు ఇది మోదీ క్రెడిట్ కాదని, ఆయన చేసిన చారిత్రక ఘట్టానికి తామే ముందు అంకురార్పణ చేశామని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించింది. ఈ మేరకు 2009లో ప్రాజెక్టు చిరుత ప్రారంభించిన లేఖను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సీనియర్ నాయకుడు జై రామ్ రమేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో యూపీఏ హయాంలో పర్యావరణ అటవీ శాఖలను నిర్వహించిన జై రాం రమేష్ చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టేందుకు వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులను రోడ్‌మ్యాప్ సిద్ధం చేయమని కోరారు. తాను భారత్ జోడో యాత్రలో ఉండటం వల్లే ఈ లేఖను వెంటనే పోస్ట్ చేయలేకపోయానని జై రామ్ రమేశ్ వివరణ ఇచ్చారు. మెరుపు దాడికి ప్రసిద్ధి చెందిన చిరుతలు 1940లలో అంతరించుకుపోయాయి. అయితే 2012 లో యూపీఏ ప్రభుత్వం చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టే ప్రణాళిక దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేగాదు కొంతమంది పరిరక్షకులు భారత్‌లోకి ఆఫ్రికన్ చిరుతలు దిగుమతి చేసుకోవడం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ కమిటీ (ఐయూసీఎన్) మార్గదర్శకాలకు విరుద్ధమని వాదించారు. అయితే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2017లో కోర్టులో ఈ విషయమై దరఖాస్తులు చేసింది. చిరుతలను భారత్‌లోకి ప్రవేశ పెట్టే ప్రాజెక్టు చట్టబద్ధమేనని ఐయూసీఎన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని కాంగ్రెస్ వాదిస్తోంది. వాస్తవానికి ఇదంతా తమ పార్టీ హయాంలోనే జరిగిందని మోదీ ఘనతేమీ కాదని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. This was the letter that launched Project Cheetah in 2009. Our PM is a pathological liar. I couldn’t lay my hands on this letter yesterday because of my preoccupation with the #BharatJodoYatra pic.twitter.com/3AQ18a4bSh — Jairam Ramesh (@Jairam_Ramesh) September 18, 2022 (చదవండి: చిరుతల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు) -
చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)కి సంబంధించిన బహుళ బిలియన్ డాలర్ల కనెక్టివిటీ కారిడార్ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా చైనా ఈ సీపెక్ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మూడో దేశాన్ని భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీంతో భారత్ ఆగ్రహంతో పాక్, చైనా చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇటువంటి కార్యకలాపాలు స్వభావసిద్ధంగా 'చట్ట విరుద్ధం' అని నొక్కి చెప్పింది. ఇది ఆమోద యోగ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే భారత్ తదను గుణంగా వ్యవహరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గట్టిగా హెచ్చరించారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూభాగంలోని ఈ ప్రాజెక్టులను భారత్ దృఢంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అంతేగాదు ఇవి నేరుగా భారత్ సార్వ భౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్యలని అన్నారు. వాస్తవానికి సీపెక్ అనేది చైనాకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగం. ఈ సీపెక్ 2013లో ప్రారంభమైంది. ఇది పాకిస్తాన్ రోడ్డు, రైలు ఇంధన రవాణా అవస్థాపనను మెరుగుపరచడమే కాకుండా సముద్రపు నౌకాశ్రయం గ్వాదర్‌ను చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతుంది. ఐతే సీపెక్ చొరవలో భాగంగా ఈ బీఆర్ఐని ఆది నుంచి భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. (చదవండి: యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్!) -
యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్
దేశంలో బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి వరక ఢిల్లీలో బుల్డోజర్లకు పనిచెప్పగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజరుతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా మసీద్‌ల వద్ద ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీతో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి సర్కార్ కూల్చివేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కచ్ నగరంలో ఓ ర్యాలీలో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సీఎం యోగిపై విరుచుకుపడ్డారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "Close the courts, lock them down": Asaduddin Owaisi lashes out after UP Police demolish Muslim activist Afreen Fatima's house. Watch: https://t.co/jSSc5C5nSD#StandWithAfreenFatima #AfreenFatima #AsaduddinOwaisi pic.twitter.com/vPAIfsoW5b — The Cognate (@TheCognate_) June 13, 2022 ఇది కూడా చదవండి: గాంధీ ఫ్యామిలీపై ఈగ వాలినా అంతుచూస్తాం -
చైనా అధ్యక్షుడి పై విమర్శలు... కలకలం రేపుతున్న లేఖ!
Covid diagnosis and treatment plan is violated: కరోనా పుట్టినిల్లు అయినా చైనా ఆది నుంచి జీరో కోవిడ్ పాలసీ విధానం అంటూ గొప్పలు చెప్పుకుంది. ఎంత కఠినతరమైన ఆంక్షలు విధించినా కరోనా కేసులు పెరుగుతూ.. ఊహించని ఝలక్ ఇస్తూనే ఉంది ఈ కోవిడ్ మహమ్మారి. దీంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీరో కోవిడ్ పాలసీ విధానాన్ని డబుల్ చేస్తానంటూ ప్రకటించాడు. వృద్ధులు, చిన్నారులు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఈ విధానం వద్దని చైనా అధికారులు చెబుతున్నా వినకుండా నియంతలా వ్యవహరించాడు జిన్‌పింగ్. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి కూడా చైనా పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి . ఈ నేపథ్యంలో చైనా యుద్ధ వీరుడు, జనరల్ లువో రుయికింగ్ కుమార్తె లువో డయాండియన్ కరోనా మహమ్మారి విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ రాసిన లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో ఆమె చైనా అధ్యక్షుడి పేరు ఎత్తకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పై పరోక్షంగా ఆరోపణలు చేసింది. ఐసోలేషన్ అంటూ జనాలను బంధిస్తూ చైనా ప్రభుత్వం తనకు తెలియకుండానే కరోనా వచ్చిన వారిని, రానివారిని కూడా బంధీలుగా మార్చింది. దీని వల్ల ప్రజల మానసిక స్థితి దెబ్బతింటుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ తిట్టిపోసింది. బాధ్యతరాహిత్యంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆరోగ్య కార్యకర్తలను అధికారులను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించింది. ఇలాంటి విపత్కర సమయంలో పాటించాల్సిన కనీస ప్రాథమిక విధానాలను కూడా ఉల్లంఘించిందంటూ ఘాటు విమర్శలు చేసింది. ఇది ప్రజల నిత్య జీవన విధానానికి విఘాతం కలిగించేలా తప్పుడూ విధానాన్ని అనుసరించిందని చెప్పింది. ఇంత అన్యాయం జరుగుతున్న అధికారంలో ఉన్నవారెవరు నోరెత్తకపోవడం విచిత్రం అంటూ చైనా తీరుని నిందిస్తూ రాసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: విజృంభిస్తున్న కేసులు... జీరో కోవిడ్ పాలసీని వదలనంటున్న చైనా!) -
‘ప్రజల్లో ఆదరణ ఉంటే చంద్రబాబు ఒంటరిగా ఎందుకు పోటీ చేయరు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు టూర్లో జన స్పందన లేకపోయినప్పటికీ అద్భుత ప్రజాదరణ అంటూ ఎల్లో మీడియా బాకాలు పలుకుతోందని జల వనరుల శాఖ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజల్లో అంత ఆదరణ ఉంటే చంద్రబాబు ఒంటరిగా ఎందుకు పోటీ చేయరని, అందరూ కలిసి రండి అని ఎందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము లేక కలిసి పోటీ చేయడానికి వేదిక సిద్ధం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా.. గతంలో చంద్రబాబు పన్నులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారా’ అంటూ ప్రశ్నించారు. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని కుట్రలో భాగంగానే ఈ రాద్దాంతమంతా చేస్తుంటే, దానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. -
జగన్ స్కీములు చంద్రబాబుకు సవాలే!
శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటూ ఆ దేశానికి వెళ్లి వచ్చింది చంద్రబాబే. తన పదవీకాలం ముగిసేనాటికి వంద కోట్లు మాత్రమే నిధిని మిగిల్చి వెళ్లారు. అంటే ఆయన అప్పటికే ఏపీని శ్రీలంకలాగా మార్చేశారనా? ‘మనమే ఆర్థిక వ్యవస్థను గందరగోళం చేశాం కదా, అయినా జగన్ ప్రభుత్వం ఎలా నడుస్తోంది?’ అన్నది వారి సంశయం అనుకోవాలి. ఆర్థికంగా ఎన్ని అవరోధాలున్నా, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్ మూడేళ్లుగా విజయవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతుండటం వారికి నచ్చడం లేదు. వైసీపీ పాలనలో ఏపీ శ్రీలంకలా మారితే బాగుండు, వైసీపీని కాదని మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవడానికి ఇది ఉపయోగపడితే బాగుండు అని టీడీపీ కోరుకుంటున్నట్టు అనిపిస్తోంది. ‘ఆర్థిక అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారబోతోంది, దివాళా తీయబోతోంది’... ఇదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఆయనకు పవన్ కల్యాణ్ వంత పాడుతారు. చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నేత ఏదైనా వ్యాఖ్య చేస్తే అది సీరియస్‌గా ఉండాలి. దురదృష్టవశాత్తు ఆయన అలా చేయడం లేదు. గమ్మత్తు ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఏ స్కీమ్‌నూ వ్యతిరేకించే ధైర్యం చంద్ర బాబు చేయలేరు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వాటన్నిటిని రద్దు చేస్తానని చెప్పి, తాను తేబోయే వాటి గురించి చెప్పలేరు. ఇలా డబుల్ గేమ్ ఆడటమే ఆయన బలంగా భావించేవారు ఉండవచ్చు. అది అన్నిసార్లూ కుదరదని 2019 శాసనసభ ఎన్నికలు రుజువు చేశాయి. ఏ సంక్షేమ స్కీమ్‌లోనైనా ఏదైనా మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తే వెంటనే పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తారు. పోనీ ఆ స్కీమ్ కింద ఎలాగోలా డబ్బులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం తలపెడితే అందుకు ఆయా వ్యవస్థల ద్వారా అడ్డుపడుతుంటారు. జగన్ తాను మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమ్మ ఒడి, చేయూత, పేదలకు ఇళ్ల స్థలాలు, చేనేత నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆటో డ్రైవర్లకూ, క్షురకులకూ ఇలా వివిధ వర్గాలవారికి ఆర్థిక సాయం ప్రకటించే పథకాలను అమలు చేస్తున్నారు. అవన్నీ వృథా అని చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ గానీ భావిస్తే ఆ మాట చెప్పాలి కదా? స్కూళ్లను బాగు చేయడానికి నాడు–నేడు అమలు చేయడం ఖర్చు దండగ అని టీడీపీ అనుకుంటే ఆ సంగతి వివరిం చాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల అదనపు ఖర్చు అని భావిస్తే ఆ సంగతి చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే వాటిని తీసివేస్తామని సవాల్ చేయాలి. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్ వంటివి అనవసరం అనుకుంటే ధైర్యంగా ఆ విషయం తెలపాలి. అలా చేయకపోగా, తమ పాలన వస్తే వలంటీ ర్లుగా టీడీపీ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తుంటారు. తాను చేయలేకపోయిన జిల్లాల విభజన జగన్ చేస్తే తప్పు పడతారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమనీ, తాము అధికారంలోకి వచ్చాక వాటిని సరిదిద్దుతామనీ అంటారు. అంత నమ్మకం ఉంటే కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని ఎందుకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు? ఆయన దానిని మంజూరు చేశారే. తాను అధికారంలోకి వచ్చేవరకు ఆగి ఉండవచ్చు కదా? అంటే అధికారం లోకి వస్తామన్న నమ్మకం ఆయనకే లేదన్నమాట. ప్రభుత్వం చెత్త పన్ను వేసిందని చెత్త ప్రచారం జరిగింది. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మున్సిపల్ సంస్కరణలలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం కోసం చెత్త కోసం ప్రత్యేక రుసుము వసూలు చేయాలని చెప్పింది. దానిని చంద్రబాబు హయాంలోనే జీవోగా ఇచ్చారు. ఆ సంగతి మరుగుపరచి ప్రస్తుత ప్రభుత్వం ఏదో చేసిందని ప్రచారం చేస్తారు. అసలు ఆస్పత్రులలో గానీ, ఇతరత్రా యూజర్ చార్జీలను ప్రవేశపెట్టిందే చంద్ర బాబు. అప్పట్లో తానే దేశంలోకల్లా సంస్కర ణల ఛాంపియన్ అని ప్రచారం చేసుకునేవారు. ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌ను ఉచితంగా ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవలసిందే నని చెప్పేవారు. చివరికి వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ ఇస్తున్నా, మీటర్లు పెడతారా అంటూ హూంక రిస్తారు. కేంద్రాన్ని మాత్రం ఏమీ అనరు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 23 శాతం కాదు, 29 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ సమయంలో మాత్రం ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగిందని అంటారు. వెంటనే టీడీపీ మీడియా ఏవేవో లెక్కలు తీసి, ‘అవును, ఆదాయం పెరిగిం’దని ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం అప్పులు చేయగానే అమ్మో, ఆర్థిక వ్యవస్థ అంతటినీ నాశనం చేస్తున్నారంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పులు చేయకుండా ఉందా? కేంద్రమే ఏటా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నదో తెలియనిదా? పోనీ చంద్రబాబు టైమ్‌లో అప్పులు తీసుకురాకుండా ఉన్నారా? సెస్‌లు వేయలేదా? వాటిని ఆయన చేస్తే అదంతా అభి వృద్ధి కోసం చేసినట్లు జనం భావించాలి. ఎదుటి వారు చేస్తే అంతా నాశనం అని ప్రచారం చేయాలి. ఏపీని శ్రీలంకతో పోల్చే ఈ పెద్ద మనిషి 2014 ఎన్నికల సమ యంలో రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలన్నిటినీ సుమారు లక్ష కోట్లకు పైగా ఎలా మాఫీ చేస్తానని చెప్పారు? లక్షల కోట్లతో అమరావతిని నిర్మించడానికి ఎందుకు పూనుకున్నారు? సాధ్యా సాధ్యాలతో నిమిత్తం లేకుండా వందల హామీలను ఇచ్చి, వాటిని అమలు చేయలేక ఎందుకు చతికిల పడ్డారు? దానిని కదా శ్రీలంక తోనో, మరే దేశంతోనో పోల్చుకోవలసింది! శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటూ ఆ దేశానికి వెళ్లి వచ్చింది చంద్రబాబే కదా? మరి జగన్ ఏమి చేశారు! తాను చెప్పినవి చెప్పినట్లు చేస్తూ పేద ప్రజలకు ఊతం ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్లను ఇళ్లకు తీసుకువెళ్లి ఇచ్చే వ్యవస్థను తెచ్చారు. దానిని తీసి వేస్తామని చంద్రబాబు చెప్పగలరా? కరోనా కాలంలో జగన్ స్కీములు పేదలకు ఎంతగానో మేలు చేయడం వల్లే ఏపీ ప్రజలు సంక్షోభంలో పడలేదన్న సంగతి అర్థం అవుతూనే ఉంది. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ ఇచ్చింది. ఆ కోటాకు అదనంగా ఏపీ ప్రభుత్వం కూడా బియ్యం అందజేసింది. ఆ విషయాలను విస్మరించ గలమా? ప్రజల చేతిలో నగదు చలామణి అవ్వాలని నిపుణులు సూచించేవారు. అప్పటికే జగన్ దానిని అమలు చేశారు. దానికి తగినట్లు సుస్థిరాభివృద్ధి, జీఎస్టీ వంటి వాటిలో దేశం లోనే ఏపీ అగ్రభాగాన ఉంది. చంద్రబాబు పదవీకాలం ముగిసేనాటికి వంద కోట్లు మాత్రమే నిధిని మిగిల్చి వెళ్లారు. అంటే ఆయన అప్పటికే ఏపీని శ్రీలంకలాగా మార్చే శారని అనుకోవాలా? విద్యుత్ డిస్కమ్‌లకు వేల కోట్ల బకాయిలు పెట్టి అధికారం నుంచి దిగిపోయారు. టీడీపీ హయాంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, అధికారం కోల్పోయాక జగన్ ప్రభుత్వానికి అప్పు ఎవడు ఇస్తాడని చంద్రబాబు, యనమల అన్నా... జగన్ విజయవంతంగా మూడేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతుండటం వారికి సుతరామూ నచ్చడం లేదు. ‘మనమే ఆర్థిక వ్యవస్థను గందరగోళం చేశాం కదా, అయినా జగన్ ప్రభుత్వం ఎలా నడుస్తోం’దన్నది వారి సంశయమనుకోవాలి. నిజానికి ఒక దేశం దెబ్బతినడానికి ఆ దేశ కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణం అవుతాయి. శ్రీలంకలో పేదలకు సంక్షేమ ప«థకాలు అమలు చేయడం వల్ల సంక్షోభం రాలేదు. కరోనా మహ మ్మారి, బాంబు పేలుళ్లు వంటివి వారి ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజంను దెబ్బతీశాయి. వాటికి తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరిన్ని ఇబ్బందులలోకి నెట్టింది. చైనా నుంచి అప్పులు తెచ్చి మౌలిక వసతుల భారీ ప్రాజెక్టులు చేపట్టడం స్థోమతుకు మించినవి కావడంతో రుణాలు తీర్చలేకపోతున్నారు. ఇలాంటి కార ణాలు అనేకం ఉంటే ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్ పైనే ఆరోపణలు చేస్తూ తన అక్కసు వెళ్లగక్కుకుంటోంది. మన దేశంలో అప్పులు ఎంత మేర చేయాలో అన్నదానికి నిర్దిష్ట చట్టాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఇష్టారాజ్యంగా అప్పులు చేయాలని ఎవరూ సలహా ఇవ్వరు. ప్రభుత్వం తన ప్రాధాన్యత ప్రకారం అప్పులు చేసినా వాటిని సకాలంలో తీర్చే స్థితికి వెళ్లాలి. ప్రభుత్వానికి ఆయా సేవలు అందించినవారికీ, చిన్న చిన్న కాంట్రా క్టర్లకూ బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు తీర్చివేయాలి. పథకాల అమలుతో పాటు ఇలాంటివి కూడా ముఖ్యమే. తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక సూచనలు చేయకపోయినా ఫర్వాలేదు గానీ సంక్షో భంలో కూరుకుపోయిన శ్రీలంకతో పోల్చి ఏపీ ప్రజలను అవమా నించవద్దని చంద్రబాబును కోరుకుందాం. కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్
ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర విషయంలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కౌంటర్ పడింది. ఇంతకీ ఢిల్లీ ప్రభుత్వం తరపున ట్యాక్స్ ఫ్రీ ఉందా? లేదా? అని నిలదీశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. ‘మమ్మల్ని అవమానించడమో, కించపర్చడమో చేసే హక్కు మీకు లేదు. ఇంతకీ మీ రాష్ట్రం తరపున కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు సీఎం హిమంత. ‘‘ఏం చేయాలనుకుంటున్నారో చేయండి.. అంతేకానీ హిందూ వ్యతిరేకిగా మారకండి’’ అంటూ కేజ్రీవాల్‌కు హితవు పలికారు హిమంత. మన హిందూ సమాజం (సమాజం) ఈ స్థితిలో ఉందంటే.. హిందూ కుటుంబంలో ఎక్కువ హిందూ వ్యతిరేకులుగా ఉండడమే కారణం. లేకుంటే.. ఒకప్పటిలా హిందూ నాగరికత.. ప్రపంచానికి మార్గాన్ని చూపేదే అంటూ పేర్కొన్నారు హిమంత. గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఎన్నో సినిమాలకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. ఆ టైంలో మరి ఆయన ఆ సినిమాలను యూట్యూబ్‌లో ఎందుకు అప్లోడ్ చేయమని అడగలేదు? కేవలం కశ్మీర్ ఫైల్స్ విషయంలోనే ఆయన అక్కసు ఎందుకు? అంటూ నిలదీశారు అస్సాం సీఎం హిమంత. సంబంధిత వార్త: కశ్మీర్ ఫైల్స్‌ను యూట్యూబ్‌లో పెట్టండి -
ఉక్రెయిన్ యుద్ధంతో కష్టాలు పడుతుంటే.. వారికి మాత్రం బిరియానీలు, పాయసాలు!
మైసూరు: ప్రజలు కరోనాతో పాటు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు మేకెదాటు పాదయాత్ర పేరుతో రోడ్ల పైన నృత్యాలు చేస్తూ బిరియానీలు తింటు, పాయసాలు తాగుతూ ఉత్సవాలు జరుపుకుంటున్నారని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ విమర్శించారు. గురువారం మైసూరు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అవేమీ పట్టించుకోకుండా రోడ్లపై ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మేకెదాటు పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత నాశనం అవుతుందని అన్నారు. -
‘భారత్‌కే కాదు.. ఉక్రెయిన్‌కి కూడా కేసీఆర్ ప్రధాని అవుతారు’
సాక్షి,హైదరాబాద్: ప్రశాంత్ కిషోర్ బీజేపీకి అవసరం లేదని బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలోని బూత్ స్థాయి కార్యకర్త ఒక పీకేతో సమానమని మండిపడ్డారు. భారతదేశానికి కాదు.. ఉక్రెయిన్ కి కూడా కేసీఆర్ ప్రధాని అవుతారని సెటైర్లు వేశారు. తెలంగాణను వదిలేసి కేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్లా తిరుగుతున్నాడని, ఢిల్లీ సీఎంతో సమావేశం అయినంత మాత్రాన ఆయన బీజేపీని ఏమీ చేయలేరని తెలిపారు. కేసీఆర్ అవినీతిని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆయన ముఖంలో భయం కనిపిస్తోందన్నారు. యుద్ధం కేసీఆర్, బీజేపీ మధ్య కాదని తెలంగాణను కాపాడేందుకే మా పోరాటమని చెప్పారు. -
మీరు అయన వారసులా: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి.. పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాగుతున్నారని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారని, ఇంతటి మహా విషాదాన్ని తమ పార్టీయే కాక రాష్ట్రమంతా భరించలేకపోతోందని... ఈ దశలో ఇంతకు దిగజారి తాగుబోతు మాటలు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు తమ నాయకులను మరీ ఇంత నీచంగా మద్యం తాగించి మాట్లాడించటం బాధాకరమన్నారు. టీడీపీ దిగజారుడుతనానికి ఇంతకన్నా పరాకాష్ట ఏం ఉంటుందని ప్రశ్నించారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి ఏపీలో రూ.5 వేల కోట్లు పైచిలుకు ఒప్పందాలు చేసుకొని విజయవంతంగా వచ్చారని, అసలైన ఎంవోయూలు ఎలా ఉంటాయో చూపిద్దామని తన సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించారని, ఇలా సంతోషంగా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించటం బాధాకరమన్నారు. ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు... తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఇదేనా సంస్కారం?: బీజేపీపై కేసీఆర్ మండిపాటు
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దారుణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబానికి చెందిన ఎంపీ, జాతీయ పార్టీ ప్రతినిధి పుట్టుకపై వ్యాఖ్యలు చేయడం బీజేపీ సంప్రదాయమా? అని నిలదీశారు. ప్రధాని మోదీకి ఏమాత్రం సంస్కారమున్నా అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ అని, దానిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. శనివారం యాదాద్రి జిల్లా నూతన సమీకృత కార్యాలయ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. తర్వాత టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భువనగిరి శివార్లలోని రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాహుల్‌గాంధీపై అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఒక ఎంపీ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా మాట్లాడుతారా? బీజేపీ అధ్యక్షుడు నడ్డా దీనిపై స్పందించాలి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబానికి చెందిన ఎంపీ, జాతీయ పార్టీ ప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ సంప్రదాయమా, హిందు ధర్మమా మోదీ చెప్పాలి. రాహుల్‌గాంధీ తాత నెహ్రూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశానికి దీర్ఘకాలం ప్రధానిగా పనిచేశారు. వాళ్ల నాయనమ్మ, నాన్న కూడా ప్రధాన మంత్రులుగా పనిచేసి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ను ‘నువ్వు ఏ అయ్యకు పుట్టినవో’అని వ్యాఖ్యలు చేస్తారా? ఇలా మాట్లాడడం మర్యాదేనా? ఇది దేశానికి మంచిదేనా? భారతం, రామాయణం మనకు నేర్పింది ఇదేనా మోదీ చెప్పాలి. పిచ్చి ముదిరి.. పిచ్చి పాలసీలు.. దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి, ప్రధాని మోదీకి పిచ్చి ముదిరి పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నారు. వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఏడిపించారు. పోరాటం చేస్తున్న రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి కొడుకు కారుతో గుద్ది రైతులను చంపారు. వందలాది మంది రైతులను బలితీసుకున్న ప్రధాని మోదీ.. చివరికి క్షమాపణలు చెప్పి సాగుచట్టాలను ఉపసంహరించుకున్నారు. రైతుల జోలికి వస్తే అధోగతి పడుతుంది.. తస్మాత్ జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి సా«ధించలేదు. జీడీపీ పతనమైంది. ఆరోగ్య రంగం దెబ్బతిన్నది. డబ్బా కొట్టుకోవడం, మంది మీద ఏడ్వడం తప్ప సాధించిందేమీ లేదు. నేను ఒప్పుకొంటానా? మోదీ సంçస్కరణల పేరుతో రైతుల మెడ మీద మీటర్ల కత్తిపెట్టారు. ఆయన దోస్తుల కరెంట్ కొనడానికే దీనిని తెరపైకి తెచ్చారు. సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులు ఇస్తానని పేచీపెట్టారు. నేను ఒప్పుకుంటానా? చచ్చినా కరెంట్ సంస్కరణలు అమలు కానివ్వను. రైతులకు అండగా ఉంటా. మతపిచ్చి విధానాలతో జీడీపీ తగ్గింది బీజేపీ మతపిచ్చి విధానాలతో శాంతిభద్రతలు దెబ్బతిని దేశంలోకి పెట్టుబడులు తగ్గాయి. మోదీ సిగ్గు పడాలి. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది నిజం కాదా? మోదీ ఫెయిల్యూర్ వల్ల 15, 16 లక్షల పరిశ్రమలు దేశంలో మూతపడడం నిజం కాదా? మీ ఉజ్వల పరిపాలనకు ఇది తార్కాణమా? పోలీసు లాఠీచార్జీలు మనకు అవసరమా? ఈ గొడవల వల్ల కడుపు నిండుతదా.. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉన్నా ఏనాడూ మత గొడవలు పెట్టుకోలే. ఆ దేశం అభివృద్ధి చెందింది. ఇవాళ బీజేపీ దమననీతితో దేశం అల్లకల్లోలం అయ్యేలా ఉంది. ఇది బాధ అనిపిస్తోంది. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉంటే రెండు లక్షల మెగావాట్లే వాడుతరు. ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వరు. 65 వేల టీఎంసీల నీరుంటే 35వేల టీఎంసీలకు మించి వాడుకోవడం లేదు. నీళ్లు, కరెంట్ ఇచ్చే సోయి బీజేపీకి లేదు. ప్రపంచ ఆకలి రాజ్యాల నివేదికలో మన దేశం 101 స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌లు మన కంటే మెరుగైన పరిíస్థితిలో ఉన్నాయి. మోదీ తెలివి తక్కువతనం వల్లనే లాక్డౌన్ పెట్టి ప్రజలను అరిగోస పెట్టించాడు. కరోనా సమయంలో గంగా నదిలో శవాలు తేలడం సిగ్గుచేటు కాదా.. ఢిల్లీదాకా పోరాటం చేద్దాం.. కేంద్రం, మోదీ తెలంగాణతో ఎందుకు గోక్కుంటున్నారు. కేసీఆర్ ఎందుకు భయపడతాడు. దొంగ ఆస్తులు, దొంగ సంపాదన లేదుకదా. నాకు తెలంగాణ ముఖ్యం. చచ్చినా సరే వెనకడుగు వేయను. తెలంగాణ సమాజం బీజేపీ దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ ఒక్కడే పోట్లాడుతడా.. అందరూ సిద్ధంగా ఉండాలి. ఢిల్లీ దాకా పోరాటం చేద్దాం. ఇతర రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, స్టాలిన్ నాతో మాట్లాడారు. ఇంకా కొందరు మాట్లాడుతారు. తెలంగాణలో సంపద పెరుగుతోంది... పోరాడి తెలంగాణ తెచ్చుకున్నట్లే.. ఇప్పుడు ప్రగతి కోసం ముందుకుపోదాం. తెలంగాణ ధనవంతం అవుతోంది. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడా భూముల ధరలు ఎకరానికి రూ.30 లక్షలకు తక్కువ లేవు. మూడెకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడయ్యాడు. నారాయణపేట, మహబూబ్‌నగర్, దేవరకొండ, సంస్థాన్ నారాయణపురంలలోనూ ఎకరం భూమి రూ.30 లక్షలకు లభించే పరిస్థితి లేదు. భువనగిరి, యాదాద్రిలో సాధారణ భూములేకాదు గుట్టలు కూడా ఎకరం ధర కోట్లకు చేరింది. ఏమైనా మాయ చేస్తే ఇలా పెరిగాయా? మంత్రివర్గ నిర్ణయాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల మడమ తిప్పని కృషితో తెలంగాణ ఆర్థికశక్తిగా అద్భుతంగా పురోగమిస్తోంది. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీళ్లు అందుతున్నాయి. ఆసరా పెన్షన్లు, గురుకులాలు, సాగునీరు, నాణ్యమైన 24 గంటల కరెంటు..ఇలా అన్నింటిలో విజయం సాధించాం. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచాం. ఉద్యోగుల సర్వీస్‌రూల్స్ సరళీకరించాలి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ బైండింగ్ బుక్లా కాకుండా పదోన్నతి, పదవీ విరమణ వంటి ప్రధానమైన అంశాలు ఉంటే చాలు. ఇందుకోసం ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను సరళీకరించాల్సి ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు సీఎస్‌తో సమావేశమై విధివిధానాలు రూపొందించాలి. సర్వీసు రూల్స్ మారిస్తే బదిలీలకు, ప్రమోషన్లకు పైరవీలు చేసే బాధ తప్పుతుంది. ఉద్యోగులు చిన్నచిన్న విషయాలకు ఆందోళన బాట పట్టవద్దు. రాష్ట్ర సంక్షేమ రంగంలో ఉద్యోగుల కృషికి ప్రజలపక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా. దేశానికి రోల్‌మోడల్ తెలంగాణ: జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమేగాకుండా.. అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని మంత్రి జగదీశ్‌రెడ్డి కితాబిచ్చారు. పరిపాలన ఎలా ఉండాలో దేశానికే రోల్ మోడల్ గా చూపించారని కొనియాడారు. ఆయన రాయగిరిలో సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలంగాణలో బీడు భూములను కేసీఆర్ సస్యశామలం చేశారని.. మూసీ ఆధునీకరణ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు పూర్తిచేసి, యాదాద్రికి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, నోముల భగత్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకను కశ్మీర్ చేశారు కేంద్రంలో ప్రగతి ప్రభుత్వం ఉండాలిగానీ మత విద్వేషాలు రేపే ప్రభుత్వం అవసరమా? కర్ణాటకలో ఇవాళ ఏం జరుగుతోందో చూడాలి. సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీ చేశారు. బెంగళూరులో ఆడబిడ్డలపై అలా వ్యవహరించడం సరైనదేనా? దీనికి బీజేపీ మొనగాళ్లు సమాధానం చెప్పాలి. నా సంగతి ఏం చూస్తావో చూడు! కేసీఆర్ సంగతి చూస్తా.. అని మోదీ అంటున్నరు. ఏం చూస్తావో చూడు బిడ్డా. నీ బెదిరింపులకు భయపడేది లేదు. నేను నీ తెరువు రాలేదు.. నువ్వే మా తెరువు వస్తున్నావ్. గుర్తు పెట్టుకో.. కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చేదా? దమ్ముంటే బీజేపీ మొగోళ్లు సమా«ధానం చెప్పాలి. వారి చిల్లర వ్యవహారాలు తెలంగాణలో చెల్లవు. మరో ఉద్యమానికి సిద్ధం కావాలి ఈ దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచిది. న్యాయం పక్షాన నిలబడటానికి తెలంగాణ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కేంద్రంలో మతపిచ్చి మోదీ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రగతికాముక ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఇందుకు తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. బీజేపీని తన్నితన్ని తరిమికొట్టాలి. చెప్పడం నా బాధ్యత, ధర్మం కాబట్టి, ప్రజల్లో ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నా. బీజేపీ దరిద్రపుగొట్టు వ్యవహారం చూడలేక, భరించలేక ఇలా చెప్తున్నానే తప్ప నాది వేరే ఉద్దేశం కాదు. -
సాక్షి కార్టూన్ 09-02-2022
ప్రతిపక్షాలున్నన్ని రోజులు మాకు అభివృద్ధి చేయడం సాధ్యపడదు! -
వట్టి శుష్క వాగ్దానాల బడ్జెట్
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉపద్రవాలను దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకాశాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటాయించిన నిధులు పేదలను, కార్మికులను, వలస కూలీలను వంచించాయనే చెప్పాలి. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలకులు దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మరోసారి చిదిమివేశారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 కేంద్ర బడ్జెట్ పూర్తిగా దిశారహితం గానూ, పేదలకు, రైతులకు వ్యతిరేకం గానూ రూపొందింది. ఇది ఆర్థికరంగంలో బీజేపీ పాలకుల వైఫల్యంపై శ్వేతపత్రం మాత్రమే. గత కొన్నేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపయిందంటూ కేంద్రప్రభుత్వం ఊదరగొడు తోంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల పెరిగిన ఆదాయంపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న 100 విశ్వనగరాల పురోగతి మాట ఏమిటి? బడ్జెట్లో చూపించిన కేటాయింపులు కొత్త సీసాలో పోసిన పాత సారా తప్ప మరేమీ కాదంటే అది అసందర్భ వ్యాఖ్య కాదు. కరోనా మహమ్మారి ద్వారా కలిగిన నష్టాలను పూరించ డానికి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు సహాయాన్ని అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించు కుంది. కానీ, దీనికి ప్రత్యామ్నాయంగా 2023 మార్చి వరకు చిన్న కార్పొరేషన్లకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. అయితే ద్రవ్య సమస్యల్లో ఇప్పటికే కూరుకు పోయిన చిన్న సంస్థలు క్రెడిట్ స్కోర్‌ని మెయిన్‌టెయిన్ చేసే స్థితిలో లేవన్న ఇంగితజ్ఞానం ప్రదర్శించడంలోనూ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు నిజంగా చేయవలసింది ఏమిటంటే చిన్న తరహా సంస్థలను ప్రోత్స హించడమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 14 నుంచి 15 శాతంగా ఉంటోంది. ఈ తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచగలిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్‌గా పనిచేస్తుంది. వ్యవసాయ పనుల్లో విస్తృతంగా పాల్గొం టున్న రైతులు తమ రాబడికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కనీస మద్దతు ధర పథకాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక్క పదం కూడా తాజా బడ్జెట్ ప్రతిపాదనలో కనిపించదు. గ్రామీణ భారతావనికి ఘోరమైన అన్యాయం చేయడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం సాధించింది. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా ఈ తాజా కేంద్ర బడ్జెట్లో కేటాయిం చలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే మరి. గంగానది పొడవునా రసాయన రహిత స్వచ్ఛ వ్యవ సాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ ఛత్తీస్‌గఢ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనికి పూను కున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతుల ఖాతాలకు బదలాయించాలని నిర్ణయించింది.. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నదానికి కొనసాగింపు మాత్ర మేనని చెప్పాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఇప్పటికే కనీస మద్దతు ధరను రైతుల ఖాతాకు నేరుగా బదిలీ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గరి దారి ఏమిటంటే ప్రత్యక్ష నగదు బదిలీని అమలుపర్చటమే! ఈవిధంగానే కరోనా మహమ్మారి కాలం పొడవునా ఆర్థిక మాంద్యం నుంచి చత్తీస్‌గఢ్ తన్ను తాను కాపాడుకోగలిగింది. కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని విస్తరిస్తున్నట్లు చెబుతూ వచ్చింది కానీ బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా తేలేదు. పసలేని వాగ్దానాలను చేయ డంలో నరేంద్ర మోదీ నేతృత్వం లోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాటుదేలి పోయింది. ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసం గంలో ఏడు చోదక శక్తుల గురించి మాట్లాడారు. అవేమిటంటే – రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జల మార్గాలు, నిర్మాణ రంగం. వీటితో ఆర్థికవ్యవస్థను ముంద డుగు వేయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. కానీ వీటికి సరిపడా నిధుల కేటాయింపు బడ్జెట్లో కనిపించలేదు. ఎంత వెచ్చిస్తారనే సంఖ్యలనూ పేర్కొనలేదు. గతంలోని కొన్ని బడ్జెట్లను మనం పరిశీలించినట్లయితే, పెద్ద పెద్ద బులెటిన్లను ప్రకటించారు. సమర్థ మౌలిక వసతుల మిషన్, జాతీయ వ్యాప్తంగా డిజిటల్ వెల్ బీయింగ్ మిషన్ వంటివి వీటిలో కొన్ని. కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం ఊహించినంత పరిమాణంలో లేదు. పోతే, ప్రధాని గతిశక్తి పథకం మార్గంలో మౌలిక వసతులపై వ్యయాన్ని పెంచుతారా అంటే అదీ స్పష్టం కావడం లేదు. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉప ద్రవాలను మన దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకా శాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రాధాన్యం ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటా యించిన నిధులు భారత ప్రజలను ప్రత్యేకించి పేదలను, కార్మికులను, వలస కూలీలను, మహమ్మారి కాలంలో పూర్తిగా మూతపడిన ఆర్థిక సంస్థలను వంచించాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ‘పనికి ఆహార పథకా’నికి నిధుల కేటాయింపును పెంచలేదు. ఎప్పటిలాగే ఇది ఎన్నికల సంవత్సరంలో మాత్రమే పట్టించుకునే అంశంగా ఉండిపోయింది. దీంతో అసలే కరోనా దెబ్బతో జీవితాలు అతలాకుతలమైన పేదప్రజలపై పిడుగు పాటు తప్పదు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి వస్తూత్పత్తితో లింక్ చేసిన ప్రోత్సాహక పథకం ద్వారా, కొత్తగా 60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు కానీ దీనికి సంబంధించిన గణాంకాలు కానీ, ఎలా ఉద్యోగాలను çసృష్టిస్తా రన్న ఎరుక కానీ బడ్జెట్లో కనిపించలేదు. కేంద్రప్రభుత్వం ఉపాధి కల్పనపై ఎలాంటి నమూనా ఇవ్వనందున నిరు ద్యోగితకు వ్యతిరేకంగా రోడ్లమీదికి వస్తున్న లక్షలాది మంది యువతకు ఇది పూర్తిగా నిరాశపరిచే అంశమే అవుతుంది. నిరుద్యోగ పరిస్థితులతో ఎలా వ్యవహరించాలనే విషయమై కేంద్రం మా ఛత్తీస్‌గఢ్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మా రాష్ట్ర నిరుద్యోగితా రేటు దేశ సగటు నిరుద్యోగ రేటు కన్నా తక్కువగా ఉందని నివేదికలు ఇప్పటికే తేటతెల్లం చేశాయి కూడా! ఆర్థిక వ్యవస్థను నిధుల లేమి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది కాబట్టే కొనుగోలుదారుకు సాధికారత కల్పించాలని కేంద్రం కోరుకుంటోంది. కానీ ఈ భావన కూడా ఇప్పుడు డిమాండ్ లేని సరకుగా మారిపోయింది. ప్రభుత్వం ఏమి చేస్తోందో అంతుబట్టడం లేదు. వేళ్లమీద లెక్కబెట్టగల కార్పొ రేట్లకు సంపద ధారపోయడం కంటే కేంద్ర ప్రభుత్వాధికారులు అధిక జనాభా చేతుల్లోకి డబ్బు వచ్చిపడేలా ప్రత్యామ్నాయ లక్ష్యాలను ఇకనైనా రూపొందించుకోవాలి. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందనే చెప్పాలి. కంపెనీలపై పన్నును 18 నుంచి 15 శాతానికి తగ్గించారు కానీ అదే సమ యంలో ఆదాయ పన్ను విభాగంలో వేతన జీవులకు ఎలాంటి ఊరటనూ అందించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తాజా కేంద్ర బడ్జెట్ ఒక దిశా దశా లేని శుష్క వాగ్దానాల బడ్జెట్. మధ్య తరగతికి మొండిచెయ్యి చూపిన బడ్జెట్. అంతకుమించి నిరు పేదల మాడు పగలగొట్టిన బడ్జెట్! భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి –కాంగ్రెస్ నాయకుడు -
రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తాం.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ పాత్రధారి అయితే మోదీ సూత్రధారి అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ పేరుతో గాంధీభవన్‌లో చేపట్టిన రెండు రోజుల దీక్షను శుక్రవారం ఆయన విరమింపజేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్‌కు ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజీవ్ లిలోతియాతో కలసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. దేశాన్ని పాలిస్తున్న మోదీకి పుతిన్, జిన్‌పింగ్‌లు ఆదర్శమని చెప్పారు. 68 ఏళ్లకు రిటైర్ కావాలని, రెండుసార్ల కంటే ఎక్కువ అధ్యక్షుడిగా పోటీ చేయకూడదన్న నిబంధనలను మార్చి తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకునేందుకు జిన్‌పింగ్ చైనా రాజ్యాంగాన్ని సవరించారని, అలాగే 2036 వరకు అధ్యక్షునిగా ఉండేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యాంగాన్ని సవరించుకున్నారని.. ఇప్పుడు మోదీ కూడా అందుకే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్.. ఓ కిమ్‌జోంగ్ ఉన్.. రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్‌కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదర్శమని పేర్కొన్నారు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం అన్ని జిల్లాల్లోని పోలీస్స్టేషన్లలో ఆయనతోపాటు టీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు చేయాలన్నారు. ఆదివారం రాష్ట్రంలోని అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని సూచించారు. సోనియా, రాహుల్‌తో మాట్లాడి పార్లమెంట్ ఎదుట రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలం దీక్ష చేసి నిరసన తెలుపుతామని చెప్పిన రేవంత్.. రాజ్యాంగం గురించి ఇంకోసారి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తామని, ప్రగతిభవన్‌లో ఇటుక ఇటుక పీకేస్తామని హెచ్చరించారు. సీఎంవి ప్రమాదకర వ్యాఖ్యలు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి ఇంతటి ప్రమాదకరమైన వ్యాఖ్యలను ఎవరూ చేయలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజ్యాంగమంటే కేవలం దళితులు, గిరిజనుల రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదని, రాజ్యాంగం లేకపోతే రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవ ని చెప్పారు. రాజ్యాంగం పనికిరాదని చెప్పి నసీఎంను తొలగిస్తే తప్ప రాజ్యాంగానికి గౌరవం దక్కదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నేతలు షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, గీతారెడ్డి, వి.హనుమంతరావు, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సోము వీరా.. అది నోరా?: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): కడప ప్రజల మనోభావాలను గాయపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు దారుణమని, ఇది ఆయన పార్టీ అజెండానా? లేక సొంత అజెండానా? అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయ ప్రాంగణంలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గడికోట మీడియాతో మాట్లాడుతూ.. ఆంగ్లేయుల హయాంలోనే కడపలో ఎయిర్‌పోర్టు ఉందనే విషయాన్ని ఇలాంటి కుహనా నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మానవత్వం కడప సొంతం.. ఒక మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేని సంప్రదాయం.. తమ కడుపు మాడ్చుకొని ఇతరులకు అన్నం పట్టే సహృదయం కడప ప్రజల సొంతమని గడికోట పేర్కొన్నారు. సోము వీర్రాజు పద్ధతి మార్చుకోకుంటే తమ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కును సైతం కోల్పోతారని హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కడప గూండాలు, రౌడీలు, పులివెందుల పంచాయతీ అంటూ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. సీమలో ఆయా పార్టీల జెండాలు మోసే వ్యక్తులు ఇలాంటి కుహనా వ్యాఖ్యల పట్ల సిగ్గు పడాలన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చారని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు నినాదాన్ని తీసుకొచ్చారని వివరించారు. దిక్కుతోచకే బాబు విమర్శలు.. దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని తరచూ చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో దిక్కుతోచని చంద్రబాబు ఈర‡్ష్యతోనే విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. బీజేపీ క్షమాపణ చెప్పాలి: వామపక్షాలు రాయలసీమకు విమానాశ్రయాలు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలను వామపక్ష రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీర్రాజు చేసిన అవమానకర వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ విమర్శించారు. విజయవాడ లబ్బీపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, విషప్రచారాల్లో నిమగ్నమై వికృత క్రీడ ఆడుతుందన్నారు. చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’ -
'అనసూయ.. మిమ్మల్ని అక్కా అని పిలవాలా? లేక ఆంటీనా'?
యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూనే అవకావం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మరింత పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించిన ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే ఓ నెటిజన్ అడిగిన కొంటె ప్రశ్నకు ఘాటుగా బదులచ్చింది. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ( అప్ బ్రింగింగ్) ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్ షేమింగ్ చేసినట్లే. గౌరవం ఇవ్వండి' అంటూ అనసూయ పేర్కొంది. అయితే దీనికి కౌంటర్‌గా.. 'ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్ షేమింగ్ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు' అంటూ సదరు నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి అనసూయ బదులిస్తే.. 'అయ్యుండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం ఇక్కడ. అయినా కాంప్లిమెంట్స్(ప్రశంసలు) తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం కదా' అంటూ ట్రోలర్ నోరు మూయించింది. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. లక్ష కోట్ల ప్రజల సొమ్ముతో ఆ ప్రాజెక్టును ఎందుకు కట్టినట్టు అని నిలదీశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. ఇబ్రహీంపట్నంకు చెందిన మాజీ ఎమ్మార్వో రవికుమార్, నారాయణపేట్ జిల్లాకి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మదివల కృష్ణ, ముషీరాబాద్ టీఆర్ఎస్ నాయకుడు మహ్మద్ ముజాహిద్, నాగసముద్రంకు చెందిన ఎల్లప్ప తమ అనుచరులతో కలసి షర్మిల సమక్షంలో పార్టీ కండు వా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార పార్టీ నిరంకుశ పాలనతో విసిగిపోతున్న టీఆర్ఎస్ నాయకులు సైతం వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరేందు కు ముందుకొస్తున్నారన్నారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్టీపీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. -
ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు
సాక్షి, దూద్‌బౌలి(హైదరాబాద్): తనకు సలాం చేయలేదంటూ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన చెంపపై కొట్టారని ఓ వ్యక్తి హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం...పంచ్ మొహల్లా ప్రాంతానికి చెందిన గులాం గౌస్ జిలానీ (45) శనివారం రాత్రి తన ఇంటి వద్ద ఉండగా... తన ఇంట్లోకి వెళుతున్న ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తనను చూసి సలాం చేయలేదంటూ తన చెంపపై కొట్టాడని హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా.. -
ఎస్సైని చితక్కొట్టిన యువకుడు..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఒక యువకుడు పోలీసు అధికారిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన లఖన్‌పూర్‌లో చోటుచేసుకుంది. లఖన్‌పూర్‌లోని హసన్గంజ్కు పనిమీద వచ్చిన ఎస్సై వినోద్‌పై.. నడిరోడ్డు మీద ఒక యువకుడు చెంప ఛేళ్లు మనిపించాడు. పిలిభిత్ ప్రాంతానికి వచ్చిన ఎస్సై వినోద్.. ఒక వాహనాన్ని తప్పించపోయి పక్కనే పార్కింగ్‌లో ఉన్న ఒక కారును ఢీకొట్టారు. దీంతో స్థానికులు ఎస్సైను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆశిష్ అనే యువకుడు ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. అందరు చూస్తుండగానే ఎస్సై వినోద్‌ను కొట్టాడు. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశిష్‌ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అఖిలేశ్‌పై అమిత్ షా మాటల దాడి
ఆజంగఢ్: పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను గాంధీజీ, పటేల్, నెహ్రూతో సమానంగా పోల్చుతూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలేశ్ జిన్నాలో గొప్పతనం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేశ్ సొంత లోక్‌సభ నియోజకవర్గం ఆజంగఢ్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ఇక్కడి ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ‘జేఎఎం’ జన్‌ధన్, ఆధార్, మొబైల్ ఫోన్లు ఇవ్వగా, సమాజ్‌వాదీ నేతలు మాత్రం ‘జేఏఎం’..జిన్నా, ఆజంఖాన్, ముఖ్తార్(డాన్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ)లను తెరపైకి తెచ్చారు’ అంటూ విమర్శించారు. సీఎం యోగి తీసుకుంటున్న కఠిన చర్యలతో పూర్వాంచల్ ప్రాంతంలో మాఫియా ముఠాలే కాదు, దోమలు కూడా పరారయ్యాయన్నారు. -
‘రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది’
సాక్షి, తూర్పు గోదావరి: రాజమండ్రిలో పవన్ కల్యాణ్ ప్రవర్తన చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందని వైఎస్సార్సీపీ నేత పండుల రవీంద్రబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులాల పై మాట్లాడే వారిని సభ్య సమాజంలో తిరగనీయకూడదన్నారు. దళితులపై ఆశలు మానుకోండని, కులాలపై రాజకీయాలు చేయడం ఆపండంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మమోహన్‌రెడ్డిని దళితులు నమ్మారు. అందుకే ఆయన వారికి పెద్ద పీఠ వేశారని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు సమస్యే మీకు కనిపించిందా? అంతకు ముందు రెండు సార్లు వచ్చిన కోవిడ్ సమస్య కనిపించలేదా? రోడ్ల గురించి ఇంతగా తపించిపోతున్న నువ్వు కోవిడ్‌తో చనిపోయినా ఏ ఒక్క కుటుంబాన్నైనా కనీసం పరామర్శించావా? అంటూ ప్రశ్నించారు. తల.. గెడ్డం పెంచుకోవడం వల్ల కార్ల్ మార్క్ అవ్వరని పవన్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి: బాలినేని -
‘మహిళల భద్రతపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు’
సాక్షి, అనంతపురం: మహిళల భద్రత పై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్ ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నారాలోకేష్, వర్లరామయ్య అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, హోంమంత్రి, డీజీపీలపై విమర్శలు అర్థరహితంగా పేర్కొన్నారు. మహిళల రక్షణకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశ చట్టాన్ని తెచ్చారన్నారు. దీని ద్వారా నేరం జరిగిన 7 రోజుల్లో ఛార్జిషీట్ వేస్తున్న ఘనత ఏపీ పోలీసులకే దక్కుతుందని కొనియాడారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కావాలని, అప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడుతాయని తెలిపారు. ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు దిశ చట్టం ఆమోదం పొందేలా కేంద్రానికి ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థకు టీడీపీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. చదవండి: విద్యార్థి మృతిపై లోకేశ్ తప్పుడు ప్రచారం -
చంద్రబాబు చేనేతల గురించి మాట్లాడే అర్హత లేదు : వేణుగోపాల్
-
దళితులపై చంద్రబాబుది కపట ప్రేమ : మేరుగ నాగార్జున
-
సీఎం కేసీఆర్ కుండలు పెట్టి బిందెలు ఎత్తుకెళ్లే రకం
జగిత్యాల (కరీంనగర్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుండలు పెట్టి బిందెలు ఎత్తుకుపోయే రకమని, రూ.2 వేల పింఛను ఆశ చూపి డబుల్బెడ్రూం ఇళ్లకు ఎసరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. జగిత్యాలలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే..ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. బీజేపీకి బద్ధశత్రువైన మమతా బెనర్జీ కూడా పశ్చిమబెంగాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించారని, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి ఇచ్చారని తెలిపారు. మాజీ ఎంపీ కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించి జగిత్యాలకే 4 వేల ఇళ్లు మంజూరు చేయించి ఉంటారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కారణాలతో కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, ఎంపీగా పోటీచేస్తే టీఆర్ఎస్ వారే ఓడించారని వ్యాఖ్యానించారు. -
గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
కోల్‌కతా: తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్లో పర్యటించారని మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడు. 1996 నాటి జైన్ హవాలా కేసు చార్జీషీట్లో ఆయన పేరు ఉంది. అవినీతి మకిలి అంటిన ఇలాంటి గవర్నర్‌ను ఇంకా ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’అని మమత డిమాండ్ చేశారు. గవర్నర్‌ను› తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా స్పందించలేదని విమర్శించారు. ఆ ఆరోపణలు నిరాధారం: గవర్నర్ సీఎం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని గవర్నర్ ధన్కర్ దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి తరహాలో మమత వ్యవహరించడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాను చేయాల్సిన ప్రసంగంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తానని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైన్ హవాలా కేసుకు సంబంధించిన ఏ చార్జిషీట్లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని చెప్పారు. -
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై జపాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీని ప్రకారం.. ఒలంపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, కోచ్‌లు, సిబ్బందిపై విధించిన ఆంక్షలను తప్పక పాటించాలని తెలిపింది. టోక్యోకు వచ్చే ముందు అందరూ కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని, వారంపాటు ప్రతిరోజు టెస్టు చేసుకోవాలని ఆదేశించింది. ఇదే క్రమంలో టోక్యో చేరిన తర్వాత 3 రోజులపాటు భారత క్రీడాకారులు ఎవరినీ కలవకూడదని ఆదేశించింది. కాగా జపాన్ ఆంక్షలను భారత ఒలింపిక్ సంఘం( ఐఓఏ) తప్పుపట్టింది. చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక! -
'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శవాలను చూడండి'
సిడ్నీ: ఆసీస్ మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు. కరోనా విజృంభణతో భారత్ అల్లాడిపోతుంటే.. ఐపీఎల్ రద్దుతో అక్కడే ఉండిపోయిన ఆసీస్ ఆటగాళ్లను వెనక్కి రప్పించే విషయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ట్విటర్లో వరుస ట్వీట్లు చేశారు.'మానవ సంక్షోభం వంటి అంశంపై ఒక దేశ ప్రధానికి చెప్పాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతీ ఆస్ట్రేలియన్ భయంలో ఉన్నారన్నది నిజం. నువ్వు నీ ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో ఉన్న శవాలను చూడండి. ఈ విషయంలో మీతో డిబేట్ చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటాను' అంటూ విరుచుకుపడ్డాడు. మరోవైపు కరోనాతో పోరాడుతున్న భారతీయులకు సంఘీభావం తెలుపుతూ మరో ట్వీట్ చేశాడు. ''కరోనాపై మీరు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది. కరోనా బారీన పడిన ప్రతీ భారతీయుడు క్షేమంగా కోలుకోవాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. ఐపీఎల్లో కామెంటేటర్‌గా పనిచేసినన్నాళ్లు మీరు చూపిన ప్రేమ అద్భుతంగా కనిపించింది.దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి'' అంటూ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో కామెంటేటర్‌గా పనిచేసిన మైకెల్ స్లేటర్ కరోనా విజృంభణ దృశ్యా సొంత దేశానికి పయనమయ్యాడు. అయితే ఆస్ట్రేలియా భారత్ నుంచి వచ్చేవారిపై మే 15 వరకు నిషేధం విధించింది. దీంతో ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి ఆసీస్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఐపీఎల్‌కు కరోనా సెగ తగిలి రద్దు కావడంతో లీగ్‌లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లు కూడా డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోవడంతో శ్రీలంక మీదుగా మాల్దీవ్స్ చేరుకొని అక్కడినుంచి ఆస్ట్రేలియా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: ఐపీఎల్ 2021: ఆసీస్ క్రికెటర్లకు షాక్ Amazing to smoke out the PM on a matter that is a human crisis. The panic, the fear of every Australian in India is real!! How about you take your private jet and come and witness dead bodies on the street! — Michael Slater (@mj_slats) May 5, 2021 I challenge you to a debate anytime PM. — Michael Slater (@mj_slats) May 5, 2021 Above all my love and prayers to every Indian. You have been nothing but amazing to me every time I've been there. Please stay safe. Xx — Michael Slater (@mj_slats) May 5, 2021 -
లోకేష్‌బాబుకు మినహా బాబు ఎవరికైనా ఉద్యోగమిచ్చారా?
విజయనగరం: రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న ప్రజలు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరిని ఛీ కొడుతున్నా, ఆయన బుద్ధి మాత్రం మారడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న కుతంత్రాలు బట్టబయలవుతున్నా ఆయనలో కనీస పశ్చాత్తాపం అనేది కూడా లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇచ్చినా బాబు ఆలోచనా విధానంలో ఏమాత్రం మార్పులేదని చురకలు వేశారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన హయాంలో లోకేశ్‌బాబుకు మినహా ఎవరికి ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. కమీషన్ల కోసం అమరావతిని, దోపిడీ నిమిత్తం పోలవరం ప్రాజెక్ట్‌ను వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. పేదలకు ఏనాడైనా ఇళ్ల పట్టాలిచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే బాబుకు ఎందుకు అంత ఆక్రోశం అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సస్ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేని చంద్రబాబు.. ట్రస్ట్ అంతర్గత విషయాల్లో తల దూర్చడం తగదన్నారు. ఆనంద గజపతి రాజు ట్రస్ట్ చైర్మన్ గా ఉండటం ఇష్టం లేని అశోక గజపతి రాజు మాన్సస్ రద్దు కోసం లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. క్షమాపణ చెప్పండి
సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలకు చెందిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పలు సంఘాలు ఫైర్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగ సంఘాల నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాస్‌గౌడ్‌ను కించపరిచేలా మాట్లాడినందుకు జగ్గారెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, గౌడ సంఘంతో పాటు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ స్కాలర్ కేశబోయిన రవికుమార్ నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కొందరు గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి: టీజీవో ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోరును అదుపులో పెట్టుకోవాలని, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీవో) సూచించింది. ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భంగా సీఎంకు గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్‌గా స్వీట్ తినిపిస్తే తప్పేముందని, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి నోటికొచ్చినట్లు, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని టీజీవో ప్రధానకార్యదర్శి ఎ.సత్యనారాయణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. జగ్గారెడ్డి బీసీ వ్యతిరేకి: జాజుల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కించపరిచేలా మాట్లాడటాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు, సైద్ధాంతిక విభేదాలు సాధారణమని, ఈ క్రమంలో వ్యక్తిగత విమర్శలు, దూషణలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని శనివారం ఒక ప్రకటనలో హితవు పలికారు. జగ్గారెడ్డి బీసీ వ్యతిరేకి అని, 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే బీసీలంతా ఒక్కటై ఆయన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని హెచ్చరించారు. శ్రీనివాస్‌గౌడ్‌ను విమర్శిస్తే ఊరుకోం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తోన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ హెచ్చరించారు. జగ్గారెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి నడిచిన శ్రీనివాస్ గౌడ్‌ను విమర్శించే అర్హత జగ్గారెడ్డికి లేదన్నారు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే జగ్గారెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. -
రూ.7 వేల కోట్లిచ్చాం.. ఏంచేశారు?
కైలాస్‌నగర్(ఆదిలాబాద్): కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మంది కరోనా బారినపడి బాధపడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని తన ప్రాణాలు బాగుంటే చాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని, సరైన వైద్యం అందక ప్రతీరోజు కరోనా మరణాలు పెరుగుతున్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దోపిడీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేంద్రం నుంచి నయాపైసా రాలేదని రాష్ట్ర మంత్రులు విమర్శిస్తూ ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ కార్మికులు, నిరుద్యోగులను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ కింద రూ.90 వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. అందులోంచి తెలంగాణకు రూ.7,650 కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చూస్తోందని దుయ్యబట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు ఇబ్బంది పడకుండా జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు వేశామని..ఉచితంగా వంటగ్యాస్ ఇచ్చామని, నిరుద్యోగులకు, చిరువ్యాపారులకు స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించామన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కలిపిస్తూ.. పంట బీమా కోసం రూ.64 కోట్లు కేటాయించామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించేందుకు 14 ప్రభుత్వ ల్యాబ్‌లు, 21 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. అంతే కాకుండా 42 లక్షలు పీపీఈ కిట్లు, 6.49లక్షల మాస్కులు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. ఇంత చేసినా కేంద్రం నుంచి ఏమి రాలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతోనే ఆస్పత్రి పూర్తి కాలేదు.. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. జిల్లా ప్రజలకు కరోనా సమయంలో ఇది ఎంతో ఉపయోగపడేదన్నారు. రెండేళ్ల క్రితం పూర్తి కావాల్సిన ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. కరోనా కట్టడికి నిధులు కేటాయించకుండా మూఢనమ్మకాలకు పోయి సచివాలయాన్ని కూలగొట్టి దానికి రూ.600 కోట్లు కేటాయించారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, పార్లమెంటు కన్వీనర్ వకుళాభరణం ఆదినాథ్, పట్టణ అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్, నాయకులు జోగు రవి, లోక ప్రవీణ్‌రెడ్డి, లాలామున్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే... విషం చిమ్ముతారా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని, మంత్రులు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైన విషం చిమ్ముతోందని మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారే తెలంగాణ సొంత బిడ్డలయిన కాంగ్రెస్ పార్టీ నేతలపై విషం చిమ్ముతున్నారని బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇప్పుడు వందల కోట్లు పెట్టి సచివాలయం ఎందుకు కడుతున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వైద్య సౌకర్యాలు కల్పించడానికి నిధులు సక్రమంగా కేటాయించని ప్రభుత్వం సచివాలయాన్ని కట్టడం అవసరమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి వాస్తు సరిగా లేదని ప్రజలకు చెందిన వేల కోట్ల ఆస్తులతో భవనాలు నిర్మించడం, దాన్ని మంత్రులు సిగ్గులేకుండా సమర్థించడం దౌర్భాగ్యమని అన్నారు. విభజన చట్టాన్ని తామే తయారు చేశామని కేసీఆర్ చెప్పుకున్నారని, మరి ఆ చట్టంలో సెక్షన్ 8 ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులకు చట్టం, రాజ్యాంగం తెలియడం లేదని, చట్టంలో ఉన్నది కాబట్టే తాము అడుగుతున్నామని, అది ఆమలు చేయమని అడగడం బానిసత్వం అవుతుందా అని ప్రశ్నించారు. మంత్రులకు కనీసం సోయి లేకుండా పోయిందని, చదువు, సంస్కారం, వివేకం, విచక్షణ ఉంది కాబట్టే తాము సెక్షన్ 8 గురించి అడుగుతున్నామని, అవేమీ మంత్రులకు లేవు కాబట్టి తమను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఎక్కడ ఉంటే ఏందని మంత్రులు అంటున్నారని, కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయన ప్రజల బాగోగులు తెలుసుకొని ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని, ఆ సమయంలో కేసీఆర్ కనిపించకుండా పోతే ఎలా అని అన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కరోనా అంటున్నారని, మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే తాము చేతల్లో చూపించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కరోనా కాదని, టీఆర్ ఎస్ పార్టీ ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనదని సంపత్ వ్యాఖ్యానించారు. -
ఇంధన ధరలతో కేంద్రం దగా
శంషాబాద్: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కష్టకాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను దగా చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా గత మూడు మాసాలుగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై ధరల పెంపు భారం మోపడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్న సమయంలో దేశంలో మాత్రం ఇం«ధన రేట్లు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 108 డాలర్లు ఉండగా, ఇక్కడ లీటరు పెట్రోలు రూ.71.40, డీజిల్ ధర రూ. 59.49 ఉందని.. అదే క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 41 డాలర్లు ఉన్నా.. పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. గత ఆరేళ్ల కాలంలో పదకొండు సార్లు ఎక్సైజ్ పన్ను పెంచిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కిందన్నారు. రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని తెలిపారు. అనంతరం తహసీల్దార్ జనార్దన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, పార్టీ సీనియర్ నాయకురాలు మైలారం సులోచన తదితరులు పాల్గొన్నారు. శనివారం శంషాబాద్ తహసీల్ ఎదుట జరిగిన ధర్నాలో ఉత్తమ్, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు -
చైనా నిజ స్వరూపం ఇదే: ట్రంప్
వాషింగ్టన్: భారత్‌తో చైనా వ్యవహరిస్తున్న దుందుడుకు వైఖరితో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ నిజరూపం స్పష్టంగా తెలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నట్లు ఆయన ప్రెస్ సెక్రటరీ పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా గమనిస్తోందని, ఆ వివాదం శాంతియుతంగా పరిష్కారమవ్వాలనే తాము కోరుకుంటున్నామని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీ వ్యాఖ్యానించారు. భారత్ సహా పలు దేశాలపై చైనా అనుసరిస్తున్న ఆక్రమణపూరిత వైఖరిని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ వైఖరి చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అసలు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని ఆయన భావిస్తున్నారని కేలీ మెక్ఎనానీ తెలిపారు. అమెరికా కాంగ్రెషనల్ సమావేశంలోనూ భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తమైంది. ‘చైనా తీరుతో ఇటీవల వాస్తవాధీన రేఖ వెంట తీవ్ర హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఆ ఘర్షణల్లో పెద్ద సంఖ్యలో భారతీయ సైనికులు చనిపోయారు. చైనా వైపు కూడా భారీగా మరణాలు సంభవించాయి’ అని కరోనా వైరస్, అమెరికా చైనా సంబంధాలపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడమ్ షిఫ్ తెలిపారు. కరోనా వైరస్, తాజా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో సంబంధాల విషయంలో భారత్ పునరాలోచిస్తోందని ఆకమిటీకి బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ సభ్యుడు తాన్వి మదన్ వివరించారు. పరిస్థితులను బట్టి భారత్ అమెరికా నుంచి ఏం ఆశించనుందో అంచనా వేస్తుండాలన్నారు. -
ఎకిల్‌స్టోన్ ఓ అజ్ఞాని: హామిల్టన్
పారిస్: ‘తెల్లవారికంటే నల్లవారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు’ అంటూ ఫార్ములావన్ (ఎఫ్1) మాజీ చీఫ్ బెర్నీ ఎకిల్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలపై వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మండి పడ్డాడు. అతను ఒక అజ్ఞాని అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇటీవలి జాతి వివక్ష నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఎకిల్‌స్టోన్... ‘ఈ వివాదం ప్రభావం ఫార్ములావన్‌పై ఏ రకంగానూ ఉండదు. అయితే అందరూ ఆలోచించే తీరు మాత్రం మారుతుంది. తెల్లవారైనా, నల్లవారైనా అవతలి వారి గురించి తప్పుగానే ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే నల్లజాతివారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు. దీనికి నేను రుజువులు చూపించలేనుగానీ ఇన్నేళ్లుగా నాకు అలాగే అనిపించింది’ అన్నాడు. 89 ఏళ్ల ఎకిల్‌స్టోన్ వ్యాఖ్యలు హామిల్టన్‌కు ఆగ్రహం తెప్పించాయి. దాంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. ‘బెర్నీ ఆటకు దూరమై చాలా కాలమైంది. అతను పాత తరానికి చెందినవాడు. అయితే ఏమీ తెలియని ఇలాంటి అజ్ఞానులు చేసే వ్యాఖ్యలు చూస్తుంటేనే జాతి వివక్ష విషయంలో అంతరాలు తొలగించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. సుదీర్ఘ కాలం ఒక క్రీడకు పరిపాలకుడిగా వ్యవహరించిన వ్యక్తికి దిగువ స్థాయిలో తీవ్రంగా ఉన్న సమస్య గురించి ఇలాంటి అవగాహన ఉంటే అతని వద్ద ఇన్నేళ్లుగా పని చేసినవారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఎఫ్1 మేనేజ్మెంట్ మాత్రం ఎకిల్‌స్టోన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన ఏ హోదాలో లేరని స్పష్టం చేసింది. -
విద్వేషాలు రెచ్చగొడుతోంది ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొడుతోంది ఎవరని, భైంసాలో అల్లర్లకు కారణం ఏమిటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం ఆన్లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. మొన్నటివరకు కఠినంగా ఆంక్షలను అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని విమర్శించారు. భైంసాలో ఒక మత ప్రార్థనకు ఎందుకు అనుమతి ఇచ్చారని నిలదీశారు. ఒక వర్గం వారిపై అత్యాచారం కేసులు, విద్వేషాలు రెచ్చగొ ట్టారన్న కేసులు పెట్టారని, అదే మరో వర్గం వారిపై చిన్న కేసులను పెట్టి వదిలేశారని దుయ్యబట్టారు. అక్కడి ఎస్పీ, సీఐలపై చర్యలు చేపట్టాలని, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొందరు పోలీసుల వైఖరి చూసి ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. -
పోతిరెడ్డిపాడుపై తలో వైఖరి
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు అంశంలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికో వైఖరి అవలంబిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రెండు ప్రధాన పార్టీలు ఈ అంశంపై ప్రధాన మంత్రిని కలిసి లేఖలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి గురువారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డి పాడు అంశంపై కాంగ్రెస్ నేతల తీరు హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై మాట్లాడుతున్న విపక్ష నేతలు గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేతలు రాయలసీమకు నీటి తరలింపుపై అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కుమ్మక్కయితే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ కోసం టీఆర్ఎస్ నేతలు పదవీ త్యాగం చేస్తే కాంగ్రెస్ నేతలు దొంగ రాజీనామాలు చేశారని, ఏపీ నేతలతో తాము కుమ్మక్కయి ఉంటే తెలంగాణ వచ్చేదా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. పదవుల కోసం కుమ్మక్కయ్యే అలవాటు, కాంగ్రెస్ ఇతర విపక్షాలకు ఉందన్నారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలను చేతనైతే కాంగ్రెస్ నేతలు తిరిగి ఇప్పించాలని డిమాండు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రకటనలు చేసి. నయా పైసా ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందనే ఆలోచన మానుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలకు సత్తా ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు చెప్పిన తర్వాతే పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో ఇచ్చామని ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు రాజకీయమైనవిగా శ్రీనివాస్‌గౌడ్ కొట్టిపారేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలూ పనిచేస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. -
డబ్ల్యూహెచ్‌వో సిగ్గుపడాలి
వాషింగ్టన్: కరోనా వైరస్ దాటికి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై విమర్శల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత తీవ్రతరం చేశారు. చైనాకు పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీగా డబ్ల్యూహెచ్‌వో వ్యవహరిస్తోందని, అందుకు ఆ సంస్థ సిగ్గుపడాలన్నారు. గురువారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌పై ప్రపంచదేశాలను అప్రమత్తం చేయకుండా లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణభూతమైన డబ్ల్యూహెచ్‌ఒని క్షమించకూడదని అన్నారు. అమెరికా ఏడాదికి 50 కోట్ల డాలర్లు ఇస్తే, చైనా వారికి 3.8 కోట్ల డాలర్ల నిధులు ఇస్తోందని అయినప్పటికీ ఆ సంస్థ చైనాకు పీఆర్‌గా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఇప్పటికే అమెరికా డబ్ల్యూహెచ్‌వోకి నిధులు నిలిపివేసింది. వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకి వచ్చి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిందని ట్రంప్ మరోసారి ఆరోపించారు. ఈ విషయంలో సమగ్రమైన విచారణ జరుగుతోందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఆయన నిరాకరించారు. కరోనా వైరస్ మానవ సృష్టి కాదని అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్ ఈ ఆరోపణలు దిగారు. వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ వచ్చిందని మీరు విశ్వసిస్తున్నారా అన్న విలేకరి ప్రశ్నకు బదులిచ్చిన ట్రంప్ ‘అవును అవును. నేను అదే నమ్ముతున్నాను’’అని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదికను బయట పెడతామని అన్నారు. చైనా నుంచే వచ్చిన ఈ వైరస్ విస్తరించకుండా ఆ దేశం కట్టడి చేసి ఉండాల్సిందని, ప్రపంచమంతా అదే అంటోందని అన్నారు. కరోనా మానవుడు సృష్టించిన జీవాయుధం కాదని, అయితే అది వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ బయటపడిందా ? జంతువుల నుంచి మనుషులకి సంక్రమించిందా అన్నది తేలాల్సి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్న విషయం తెలిసిందే. చైనాలో జరుగుతున్న పరిశోధనలు కరోనా వైరస్ ఎలా బయటపడిందన్న అంశంపై చైనాలో కూడా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. చైనా వెట్ మార్కెట్ నుంచే వచ్చిన ఈ వైరస్ ఎలా మనుషులకు సంక్రమించిందో జరుగుతున్న పరిశోధనల్లో భాగస్వామ్యం కావడానికి చైనా ప్రభుత్వం తమను ఆహ్వానిస్తుందని ఆశించినట్టు డబ్ల్యూహెచ్‌వో అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ► అమెరికాలో కోవిడ్–19తో 24 గంటల్లో రెండు వేలకు పైగా మరణించారు. ► కోవిడ్ నుంచి అమెరికా కోలుకోవాలంటే వ్యాక్సిన్ రావడం ఒక్కటే మార్గమని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. ► పాకిస్తాన్ పార్లమెంటు స్పీకర్ కైజర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రంజాన్ని పురస్కరించుకొని ఆయన ఈ వారం మొదట్లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఇతర ఉన్నతాధికారుల్ని కూడా పలుమార్లు కలుసుకున్నారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. -
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: ఇండియా–పాకిస్తాన్, హిందూ–ముస్లిం అనడం.. చలికాచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా బీజేపీ దగ్గర లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు విమర్శించారు. బీజేపీ నేతలకు మత రాజకీయాలు తప్ప దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని లేదన్నారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు. రైతుబంధు, రైతుభరోసా, విద్యార్థులకు సన్నబియ్యపు భోజనం, కల్యాణలక్ష్మీ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరమైపోయిందని, అందుకే ఏ ఎన్నికైనా టీఆర్ఎస్సే గెలుస్తోందన్నారు. టీఆర్ఎస్ వరుస విజయాలతో కాంగ్రెస్, బీజేపీలకు మతిపోయిందని అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున గెలిచిన 8 మంది కౌన్సిలర్లు టీడీపీ నేత గణేశ్ గుప్తా నేతృత్వంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అడ్డిమారి గుడ్డిదెబ్బలా 4 సీట్లు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పేరుకే జాతీయ పార్టీలని, వాటికి నీతి, నిజాయితీ, సిద్ధాంతం లేదని కేటీఆర్ మండిపడ్డారు. అడ్డిమారి గుడ్డిదెబ్బ లాగా బీజేపీ రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలవడంతో లక్ష్మణ్ రోజూ ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌ను తిట్టే పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రంలో గెలవాలంటే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి జాతీయ హోదా నిధులు తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇది చేతకావడం లేదన్నారు. ఫార్మాసిటీ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి నిధులు, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా నయాపైసా కేటాయించలేదని తెలి పారు. బీజేపీ కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన అన్నిసార్లూ రాష్ట్రానికి అన్యాయమే చేసిందని మండిపడ్డారు. 3 పురపాలికల కోసం కాంగ్రెస్, బీజేపీ పొత్తు.. కాంగ్రెస్, బీజేపీలు తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి బండ్లగూడ, మణికొండ, నార్సింగ్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాల కోసం పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఏం బతుకు అయింది రా.. 3 మున్సిపాలిటీల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చిం దని స్వయంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు విమర్శించారని గుర్తుచేశారు. శంషాబాద్ మున్సిపాలిటీలో 25 వార్డులుంటే 14 వార్డులను టీఆర్ఎస్ గెలిస్తే, 8 వార్డులను గణేశ్ గుప్త నేతృత్వంలోని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుచుకున్నారని, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకే వార్డు మాత్రమే దక్కిందని కేటీఆర్ అన్నారు. 130 పురపాలికలకు ఎన్నికలు జరిగితే 122 పురపాలికలను టీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. మొత్తం 3,148 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 1800–1900 డివిజన్లను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిస్తే, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు, స్వతంత్రులు కలసి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా రెండో స్థానంలో నిలిచారని తెలిపారు. డైలాగులు చెప్పడంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అదరగొడుతున్నా, మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్టీలు కనీసం రెండో స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయాయని ఎద్దేవా చేశారు. 45 శాతం బీసీలకు.. మున్సిపల్ ఎన్నికల్లో 45% సీట్లు బీసీలకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. మహిళలకు 244 చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ స్థానాలు కేటాయించడం ద్వారా వారికి 57% కోటా అమలు చేశామన్నారు. రాజకీయంగా వెనకబడిన వర్గాలకు పదవుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిస్తున్నామని, ఆర్యవైశ్యులకు 11 చైర్పర్సన్ పదవులు కేటాయించామని తెలి పారు. అభివృద్ధి, సంక్షేమం అనే జోడెద్దులతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థ, కోర్టులపై నమ్మకం లేదని ఫలితాల తర్వాత ఉత్తమ్ పేర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించా రు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగిస్తామని, దీంతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ, రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధికి చాలా చేస్తామని హామీ ఇచ్చారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా కేంద్రం మొండిచేయి చూపిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఏపీ అభివృద్ధికి చంద్రబాబే అడ్డంకి
-
‘ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలోనే’
సాక్షి, వైఎస్సార్ కడప: ధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతుందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేవలం రెండు పేజీల్లో యూనిక్‌గా నవరత్నాల అమలకు.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాంది పలికారని తెలిపారు. ఆదేవిధంగా జగన్మోహన్రెడ్డిని ప్రకృతి ఆశీర్వదించిదని, వాతావరణం పులకరించి.. అన్ని డ్యాంలు నిండు కుండలా ఉన్నాయన్నారు. కాగా తొట్టిగ్యాంగ్ పార్టీ అయిన టీడీపీ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ‘70 ఏళ్లు ఉన్నాయి. పెద్ద మనిషివి కొంచెం మైండ్ పెట్టు. పదేళ్ల వెనక్కి వెళ్లావు’ అంటూ పరోక్షంగా చంద్రబాబుపై కొరముట్ల విమర్శలు చేశారు. -
టీఆర్ఎస్ బీటీ బ్యాచ్, ఓటీ బ్యాచ్‌గా విడిపోయింది..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. జై తెలంగాణ అన్నవారిని అణచివేసి, తెలంగాణ వద్దన్న వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి బంగారు తెలంగాణ నిర్మిస్తామంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం లక్ష్మణ్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే ‘దొంగే దొంగా.. దొంగా..’ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. వారి తప్పిదాలను ఎదుటి వారిపై రుద్ది ప్రజలను నమ్మించే నాటకానికి కేటీఆర్ తెర తీశారన్నారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను, అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యనాయకుల చేరికలను చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కష్టనష్టాలను ఓర్చుకొని తెగించి పోరాడిన ఉద్యమకారులను పూర్తిగా విస్మరించడంతో వారు బయటకు వచ్చి టీఆర్ఎస్ విధానాలను తప్పు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో నేతలు బీటీ బ్యాచ్‌గా, ఓటీ బ్యాచ్‌లుగా విడిపోయారన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు బీజేపీ ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ‘బీజేపీ సభ్యత్వం ఇప్పటికే 18 లక్షలు ఉండగా, కొత్తగా 12 లక్షలు కలుపుకొని 30 లక్షలకు చేరుకుంది. ఇంకా 6 లక్షల సభ్యత్వ నమోదు కావాల్సి ఉంది’ అని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి చెందిన నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. అవినీతికి పాల్పడిన చిదంబరాన్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు గుండెలు బాదుకుంటున్నారని లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. జైల్లో ఉండాల్సిన కాంగ్రెస్ నేతలు బెయిల్‌పై తిరుగుతున్నారని.. అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని చిదంబరం చిట్టాయే కాదు.. మిగతా వారి చిట్టా కూడా బయటకు వస్తుందని తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్‌ను పాతర పెట్టాలని బీజేపీ శ్రేణులకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. -
‘బాబు’కు మతి భ్రమించింది
సాక్షి, అనంతపురం : చంద్రబాబుకు మతి భ్రమించిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరాతో కలిసి శుక్రవారం ఆయన విలేకరుతో మాట్లాడారు. పాలిచ్చే ఆవును కాదని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలను హేళనగా మాట్లాడడం చంద్రబాబుకు తగదని మండిపడ్డారు. చంద్రబాబు దోపిడీ పాలనను చూసిన ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారనే వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్‌తో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. చంద్రబాబు చేసిన కుట్రలు, కుతంత్రాలకు సమర్థవంతంగా ఎదుర్కొని 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలను ఒంటి చెత్తో గెలిపించుకున్నారన్నారు. వైఎస్ జగన్ 50 రోజుల్లోనే హామీలను నేరవేర్చేలా అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి వాటి అమలుకు చర్యలు తీసుకున్నారన్నారు. భారతదేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్‌కు మూడో స్థానం దక్కిందనే విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు గుర్తించాలని హితవుపలికారు. -
‘ఐటీ హబ్’ గా విశాఖపట్నం..
సాక్షి, నెల్లూరు: విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చబోతున్నామని.. వైజాగ్- చెన్నై కోస్టల్ కారిడార్‌ను అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తారని స్పష్టం చేశారు. కాగా గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ప్రచారంతోనే కాలం గడిపిందని విమర్శించారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం పరిశ్రమల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని.. దీంతో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని మండిపడ్డారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ నిర్వహిస్తూ.. వీటి ద్వారా పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. వైఎస్సార్ నవోదయం ద్వారా 36 వేల చిన్న తరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వీటితోపాటు మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో పలు పరిశ్రమలు స్థాపిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో నూతనంగా స్థాపించనున్న పారిశ్రామిక వాడల్లో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
పొనుగుపాడు ఘటనపై స్పందించిన హోంమంత్రి
సాక్షి, గుంటూరు: అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేసి రాద్దాంతం చేయటం తెలుగుదేశం పార్టీ వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలోని గోడ వివాదాన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం వారికే చెల్లిందన్నారు. అది ఒక చిన్న గ్రామ సమస్యని, దాన్ని కూడా టీడీపీ నేతలు అనుకూలంగా మార్చుకోవడం దౌర్భాగ్యమన్నారు. గుంటూరులో జరిగిన జడ్పీ సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత...ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూస్తున్నామన్నారు. జిల్లాలోని సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. అదేవిధంగా గత అయిదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుబడిందని విమర్శించారు. పొనుగుపాడులోని గోడ వివాదం ఒక గ్రామ సమస్య అని తెలిపారు. దీనిపై అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ క్రమంలో గ్రామ సమస్యను.. టీడీపీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే ముందుగానే అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీంతోపాటు గ్రామంలోని గోడ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
‘శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు’
అమరావతి: రాష్ట్ర శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం ఏపీ శాసన మండలిలో ‘శాంత్రి భద్రతల’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం ఆరు హత్యలు మాతమే జరిగాయన్నారు. ఆ ఆరు హత్యలు సైతం కేవలం వ్యక్తిగత, ఇతర కారణాలతో జరిగాయని వెల్లడించారు. ఈ హత్యలను తమ ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని విమర్శించారు. అదేవిధంగా ‘కోడెల కె ట్యాక్స్’ బాధితుల కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయన్నారు. కాగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ చూడమని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన రాజకీయ హత్యలు, దాడులపై హోంమంత్రి వివరిస్తుండగా.. టీడీపీ సభ్యులు మధ్యలోనే వాకౌట్ చేశారు. మంత్రి వివరణ ఇస్తుంటే మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్ చేయడంపై వైఎస్సార్సీపీ శాసన సభ్యులు తీవ్రంగా ఆక్షేపణ తెలిపారు. -
‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం తీరుతో సుబాబుల్ రైతులకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుబాబుల్ రైతుల విషయంలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. సుబాబుల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనకు చెప్పారని తెలిపారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి వసంత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా సుబాబుల్ రైతులను దేవినేని సోమరిపోతులని విమర్శలు చేశారని మండిపడ్డారు. అదేవిధంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. సుబాబుల్ రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభలో మంచి శుభవార్త చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుబాబుల్ రైతులకు రూ.5.40 కోట్ల బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు రూ. 12, 500 ఇస్తామని సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగం మరింత విస్తరించనుందని సామినేని ఉదయభాను ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘నకిలీ విత్తనాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని.. రైతు అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని, వాళ్లు చేసిన పాపాన్ని తాము మోయాల్సి వస్తోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో విత్తనాల సమస్య పునరావృతం కాకుండా సమగ్ర విత్తన విధానాన్ని తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీలేని రుణాలు, రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్ధితి వచ్చిందని మండిపడ్డారు. కాగా నకిలీ విత్తనాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో విజిలెన్స్ దాడుల్లో భారీగా నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయని వెల్లడించారు. -
సీఎం కేసీఆర్‌ది మేకపోతు గాంభీర్యం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని బీజేపీ ఎంపీలు విమర్శించారు. ఓటమి భయంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణను కేసీఆర్ ఏకపక్షంగా ముందుకు జరిపారని ఆరోపించారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపూరావు బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అరవింద్ మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయంతోనే కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారని, అలాగే అసెంబ్లీ ఫలితాలు వెల్లడికాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లారన్నారు. ఇప్పుడు కూడా మన్సిపల్ ఎన్నికలను ముందుకు జరిపారని ధ్వజమెత్తారు. ఒకవైపు బీజేపీని సీరియస్‌గా తీసుకోవద్దు, వారికున్నది నలుగురు ఎంపీలే అని చెబుతూనే బీజేపీ, ప్రధాని మోదీ అంటే కేసీఆర్ వణికిపోతున్నారని విమర్శించారు. తాము ఉన్నది నలుగురు ఎంపీలే అయినా తెలంగాణలో నాలుగు దిక్కు ల్లో టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం తేలకముందే, ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకగా ఉన్నా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. -
అంచనాలు పెంచి దోపిడీ చేశారు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర శాసనసభలో సోమవారం దుమారం రేగింది. అధికార పక్షం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రతిపక్ష సభ్యులు మౌనం దాల్చాల్సి వచ్చింది. ‘ఈ ప్రాజెక్టు అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడిన మాట నిజం కాదా? మాజీ ఆర్థిక మంత్రి వియ్యంకునితో సహా పలువురు కావాల్సిన వాళ్లకు నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టులు అప్పగించింది వాస్తవం కాదా? అడుగుకు ఒక ఫొటో, గజానికొక శిలాఫలకంతో ప్రచార హోరెత్తించిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క నిర్వాసితునితోనైనా ఫొటో ఎందుకు దిగలేదు’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టుకు నీళ్లిస్తాం.. రాస్కో జగన్మోహన్రెడ్డీ.. అని ఆనాడు శాసనసభలో ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, శ్రీ బాల వీరాంజనేయ స్వామి అడిగిన ప్రశ్నపై సుదీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ నిర్వాకం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదు పోలవరం అంచనా వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ.55 వేలకు పెరిగిన మాట వాస్తవమేనని మంత్రి అనిల్ యాదవ్ సమాధానం చెప్పిన తర్వాత గోరంట్ల అనుబంధ ప్రశ్న వేస్తూ.. అంచనాల పెంపును కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించినప్పుడు గత టీడీపీ ప్రభుత్వం రూ.33 వేల కోట్లు దోచేసిందని ఎలా అంటారని ప్రశ్నించడంతో దుమారం రేగింది. అధికార పార్టీ సభ్యుడు పార్థసారథి జోక్యం చేసుకుంటూ పోలవరంతో పాటు మొత్తం ప్రాజెక్టులపై చర్చకు ప్రభుత్వం సిద్ధమన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుంటూ వైఎస్‌కు ముందు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఏనాడూ పోలవరాన్ని పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాకే పోలవరం ప్రాజెక్టు చేపట్టి, అన్ని అనుమతులు తీసుకువచ్చి.. కుడి, ఎడమ కాల్వలు కూడా పూర్తి చేశారన్నారు. ఆయనే గనుక కాల్వలు తవ్వి ఉండకపోతే భూసేకరణకు ఇప్పుడు వేల కోట్ల రూపాయల భారం పడి ఉండేదన్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పోలవరం కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350 కోట్లు కొట్టేశారన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా బస్సుల్లో ప్రజలను తరలించి రూ.వందల కోట్లు దోచేశారన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఆర్ అండ్ ఆర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుంటూ స్పిల్ వే కు తామే భూమి సేకరించామని, ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ ధరలు 11 రెట్లు పెరిగాయని, వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టుల్లో వెసులుబాటు కాని వాటి ధరలను తాము సవరించి చేపట్టామని వివరిస్తూ స్వల్పకాలిక చర్చ పెట్టాలని కోరారు. దీనికి మంత్రి సంసిద్ధత వ్యక్తం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టులో అంచనాలు పెంచి రిత్విక్ అనే సంస్థకు అప్పగించిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన ప్రకారం ప్రాజెక్టు కింద భూమి కోల్పోయి తక్కువ పరిహారం పొందిన రైతులకు మొత్తాన్ని పెంచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిల్ వివరించారు. -
కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?
సాక్షి, అమరావతి: గోరంట్ల బుచ్చయ్యా.. ఇక మీ అసత్యాలు ఆపండయ్యా.. అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కాకి లెక్కలు, చేపల లెక్కలతో వ్యవసాయ వృద్ధి రేటు పెరిగిందన్న టీడీపీ వాదనలో పస లేదని తేల్చి చెప్పారు. అంకెల గారడీతో ఎంత కాలం మోసం చేస్తారని నిలదీశారు. 2019–20 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సోమవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను బుగ్గన ఖండించారు. అంతకుముందు గోరంట్ల మాట్లాడుతూ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా లేదన్నారు. వాస్తవ పరిస్థితుల్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానన్నారు. 2014లో రూ.1,12,000 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఇప్పుడు రూ.2,26,000 కోట్లకు చేరిందని, గత ఐదేళ్లలో అభివృద్ధి లేకపోతే ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. 2013–14లో 5.3 శాతంగా ఉన్న అభివృద్ధి 2019 నాటికి 11.5 శాతానికి చేర్చిన ఘనత తమదేనని వివరించారు. ఆర్థిక సర్వేలో అభివృద్ధి సాధించామని చెబుతూ బడ్జెట్‌లోనేమో లేదనడం ఎలా సాధ్యమన్నారు. ప్రస్తుత బడ్జెట్ పార్టీ ఎన్నికల ప్రణాళికగా ఉందని, తాము ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలను మూత వేయిస్తున్నారని ఆరోపించారు. దీనికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ అభ్యంతరం తెలిపారు. ప్లానింగ్ విభాగం తయారు చేసిన ఆర్థిక సర్వేకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాకి లెక్కలు చెప్పవద్దన్నారు. వ్యవసాయాభివృద్ధిని కొలవడానికి నిర్ధిష్టమైన పద్ధతులు లేవనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. పథకాల పేర్ల మార్పును గోరంట్ల తప్పుబడుతున్నారని, వాస్తవానికి ఆరోగ్య శ్రీ,, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, సామాజిక పింఛన్ల పెంపు వంటివి డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టినవేనని, అందుకే వాటికి ఆయన పేరు పెట్టామని చెప్పినప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది. రాష్ట్రంలో తాము ఏ ఫ్యాక్టరీని ఆపలేదని, కర్నూలులో ఏ సీడ్ ఫ్యాక్టరీని ఆపామో చెప్పాలని నిలదీశారు. ఈ ఏడాదికి సున్నా వడ్డీ డబ్బులను వచ్చే బడ్జెట్లో కేటాయిస్తారన్న విషయం తెలియకపోతే ఎలా? అని నిలదీశారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడతారని వివరిస్తూ వచ్చే ఉగాదికి కచ్చితంగా 23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. చంద్రబాబు మాదిరిగా నిరుద్యోగులను మోసం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రస్తుతం ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంటే టీడీపీ సభ్యులు దుర్బుద్ధితో అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ దశలో టీడీపీ, అధికార పార్టీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మీరు చేసిన అప్పును మేము తీర్చాం చంద్రన్న కానుక అని టీడీపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుందిగానీ పౌర సరఫరా శాఖకు రూ.100 కోట్లు బకాయి పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. ఆ అప్పును తాము తీర్చామన్నారు. విత్తనాల కొనుగోలుకు గత ప్రభుత్వం డబ్బులు చెల్లించనే లేదని, తమ ప్రభుత్వం వచ్చాక రూ.400 కోట్లు చెల్లించి విత్తనాలు సమీకరించామన్నారు. 2014 నుంచి 2017వరకు పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 2017–18లో మాత్రం రూ.69.94 కోట్లు కేటాయించి, 2018–19లో మొండి చేయి చూపిందని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.1,500 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతి నిర్మాణానికి రూ.1,777 కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఇచ్చిందని, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.277 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. తమ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.500 కోట్లు కేటాయించిందని తెలిపారు. పింఛన్ల కోసం టీడీపీ ఐదేళ్లలో సగటున రూ.5 వేల కోట్లు వెచ్చిస్తే తమ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రూ.15,746.58 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో దీన్ని మరింత పెంచుకుంటూ పోతామన్నారు. రాజధానిలో కి.మీ. రోడ్డుకు రూ.32 కోట్ల చొప్పున తమ సన్నిహితులకు కాంట్రాక్టులు ఇచ్చి చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని, ఈ తరహా దోపిడీని అడ్డుకునేందుకే రివర్స్‌టెండరింగ్ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. నీరు–చెట్టు పథకం పేరిట కూడా దోచుకున్నారని మండిపడ్డారు. -
చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఉండగా గత ఐదేళ్లలో చంద్రబాబు విదేశీ టూర్లకు వెళ్లడం, దానిపై రూ. కోట్లు వ్యయం చేయడంపై సోమవారం అసెంబ్లీలో రభస జరిగింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే పలువురు అధికార పార్టీ సభ్యులు స్పందిస్తూ.. విదేశీ పర్యటనల పేరుతో విలాసాలకు ఖర్చు చేసిన వ్యయానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంత మేలు జరిగిందో చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. సీఎంగా చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చుపై విచారణ జరిపిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సభ ప్రారంభం కాగానే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు రూ.38.83 కోట్లు వ్యయం చేశారని చెప్పారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ల పేరుతో దావోస్ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వెనుక గుట్టు ఏమిటో తెలియాలంటే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. రాత్రి 11 వరకూ కష్టపడ్డా... మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పెట్టుబడుల కోసమే కష్టపడ్డానని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ట పెరగడానికే విదేశీ పర్యటనలకు వెళ్లానని, ప్రధాని దేశాలు తిరగడం లేదా అని ప్రశ్నించారు. కావాలనే నాపై బురదజల్లుతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో 16 ఒప్పందాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు విదేశీ పర్యటనలంటూ చేసిన వ్యయంపై విచారణ జరిపిస్తామని, దీనిపై ఇప్పటికే సబ్ కమిటీ వేశామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2014 జూన్ నుంచి 2019 ఏప్రిల్ వరకూ సీఎం, మంత్రులు, అధికారులు, కన్సల్టెంట్లు విదేశీ పర్యటనల కోసం రూ.38,83,10,772 వ్యయం చేశారని, 16 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారన్నారు. వీటిన్నిటిపైనా సమగ్రంగా విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గత ఐదేళ్లలో 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని, చంద్రబాబులా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేదని చెప్పారు. విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీచేశారని మండిపడ్డారు. -
విత్తన సమస్య పాపం బాబు సర్కారుదే
సాధారణంగా ఈ సంవత్సరం జూన్‌లో పంట వేయాలంటే గత ఏడాది నవంబర్లోనే విత్తనాల సేకరణ ప్రారంభించి ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలి. మే నెలలో వాటిని పంపిణీ చేయాలి. కానీ, గత ప్రభుత్వం అలా చేయకపోవడం వల్లే రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం ఇక్కట్లు పడుతుండటానికి గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే కారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శాసనసభలో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు. సాధారణంగా ఈ సంవత్సరం జూన్‌లో పంట వేయాలంటే గత ఏడాది నవంబర్లోనే విత్తనాల సేకరణ ప్రారంభించి ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని, మే నెలలో పంపిణీ చేయాలని చెప్పారు. వాస్తవంలో అలా జరగక పోవడం వల్లే రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ప్రభుత్వం జూన్‌లో వచ్చింది. అంటే మా ప్రభుత్వం వచ్చినప్పటికే విత్తన సేకరణ పూర్తయి రైతులకు పంపిణీ జరుగుతుండాలి. అలా జరగనందునే రైతులు రోడ్డు మీదకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. మేం బాధ్యతలు స్వీకరించిన నాటికి 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది. తీరా చూస్తే కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లేఖలు రాసినా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని అధికారులు చెప్పార’ని వివరించారు. నిధులు ఇవ్వాలంటూ ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గత ప్రభుత్వానికి రాసిన లేఖతోపాటు మరో లేఖను కూడా స్పీకర్ అనుమతితో టీవీ స్క్రీన్‌పై చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంగ్లంలో చదివి వినిపించారు. అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఇన్నిన్ని లేఖలు రాశారంటూ లేఖల కట్టను చేత్తో పట్టుకుని పైకెత్తి చూపించారు. గత ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పని సమయానికి చేయకపోవడం వల్ల రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం ఉంటే కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితిలో మేం అధికారంలోకి వచ్చాం. ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించనందున ఏమీ చేయలేకపోయామని అధికారులు చెబుతుంటే చాలా బాధనిపించిందని సీఎం వివరించారు. -
ట్రోల్స్‌కు బదులిచ్చిన ఎంపీ నుస్రత్ జహాన్
న్యూఢిల్లీ: హిందువులు ధరించే సిందూరాన్ని పెట్టుకొని, చీర ధరించి ఇటీవల పార్లమెంట్లో గత నెల ప్రమాణస్వీకారం చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ను నెటిజన్లు ట్రోల్ చేయగా ఆమె వాటికి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. తాను సమ్మిళిత భారత్‌ను సూచించేలా సిందూరాన్ని ధరించానని ధీటుగా జవాబిచ్చారు. అది మతం, కులం, వివక్షలకు అతీతమైనదని అన్నారు. హింసను, పగను రెచ్చగొట్టే ఉన్మాదుల కామెంట్లను తాను పట్టించుకోన్నారు. తాను ముస్లింగానే ఉంటానని, కానీ అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టంచేశారు. తానేం ధరించాలో తన ఇష్టమని తెలిపారు. ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, నుస్రత్ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించిందని అన్నారు. సహారాన్పూర్లోని జమీమా షేక్ ఉల్ హింద్‌కు చెందిన మత పెద్ద అసద్ క్వాస్మి మాట్లాడుతూ ఇస్లాంలో ఇతర మతాల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధమన్నారు. అయిప్పటికీ ఆమె జైన్ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని అన్నారు. సిందూరం ధరించడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి అని తనకు తెలిసిందని, సినిమా రంగంవారు మత సంప్రదాయాలను పాటించరన్నారు. ఆమెను తమ మతంలోకి ఆహ్వానిస్తున్నామని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారు. భవిష్యత్తు తమ మతంతోనే సురక్షితంగా ఉందని, హిందూ మతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్ గుర్తించిందన్నారు. -
చదువు‘కొనేలా’ మార్చిన ఘనత కేసీఆర్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వస్తే కామ న్ స్కూల్ విద్యావిధానం తీసుకొస్తానని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. తన మనుమడు, తన డ్రైవర్ కొడుకు ఒకే పాఠశాలలో చదివే విద్యావిధానం తెస్తానన్న కేసీఆర్ ఇప్పుడేం చేస్తున్నారని, ఆయన చెప్పిన కామన్ స్కూల్ విధానం ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, కార్పొరే ట్ విద్యా విధానానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. ‘చదువుకుందాం’నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఫీజుల కలెక్షన్ విషయంలో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటివరకు దాదాపు 400 శాతం ఫీజు పెరిగిందని చెప్పారు. విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న నియమాన్ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డీటెయిన్ చేస్తున్నారన్నారు. మూడేళ్ల పిల్లలకు బ్యాగు బరువు తప్పడం లేదని, విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుంటోందని అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలను తమ యువజన విభాగం సేకరించిందని చెప్పారు. వారంలోగా ఆయా విద్యాసంస్థలు తగిన చర్యలు తీసుకోకపోతే వారి పనిపడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని లక్ష్మణ్ ఆరోపిం చారు. గత పాలకులు 60 ఏళ్లలో చేసిన అప్పులని కేసీఆర్ ఆరేళ్లలోనే చేశారన్నారు. మజ్లిస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
జనం మాట: బాబు మారోసారి కాపులను మభ్యపెట్టే ప్రయత్నం
-
ఆర్బీఐ వర్సెస్ ఆరెస్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 19న ఆర్బీఐ బోర్డు కీలక భేటీ నేపథ్యంలో కేంద్ర బ్యాంక్‌పై ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, ఆర్బీఐ పార్ట్‌టైమ్ డైరెక్టర్ స్వామినాథన్ గురుమూర్తి విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థ స్ధితిగతులపై ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న గురుమూర్తి ఆర్బీఐ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరపతి నిబంధనల సరళీకరణ వంటి మోదీ సర్కార్ చర్యలను సమర్ధిస్తూ మాట్లాడారు. మొండి బకాయిల కోసం నిధులు కేటాయింపుపై ఆర్బీఐ విధానం సహేతుకం కాదని విమర్శించారు. 2009 నుంచి నిరర్థక ఆస్తులు పెరగడం ఊపందుకుందని, ఆ సమయంలో బ్యాంకులను అప్రమత్తం చేయని ఆర్బీఐ 2015లో వీటికి కేటాయింపులు చేపట్టాలని బ్యాంకుకు సూచించాయని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కిందటే ఎన్పీఏలకు కేటాయింపులపై ఆర్బీఐ బ్యాంకులకు సంకేతం పంపితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని అన్నారు. ఎన్పీఏ నిబంధనల విషయంలో ఆర్బీఐ సమతూకంతో వ్యవహరించలేదని, విధాన నిర్ణయాలతో సంక్షోభాలను అధిగమించాలని, విధానాలతోనే సంక్షోభాలను తీసుకురాకూడదని చురకలు వేశారు. మూలధన నిబంధనల విషయంలో భారత్‌లో స్థూల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని, గుడ్డిగా అమెరికా తరహాలో వ్యవహరించరాదని చెప్పుకొచ్చారు. మనది జపాన్ తరహాలో బ్యాంకింగ్‌పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థని, అమెరికా తరహాలో మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదన్నది గుర్తెరగాలన్నారు. చిన్నతరహా వ్యాపారాలకు నిధులు అందుబాటులో ఉంచకపోవడం భారత ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతుందని హెచ్చరించారు. -
‘నేను స్మోక్ చేస్తాను.. డ్రింక్ చేస్తాను అంతమాత్రానా’
‘నేను సిగరెట్ తాగుతాను.. డ్రింక్ చేస్తాను. అంత మాత్రానా నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?’ అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి శ్వేతా సాల్వే. విషయమేంటంటే కొన్ని రోజుల క్రితం శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిగరెట్ తాగుతూ ఉన్న పోస్ట్ చేశారు. ఈ ఫోటో కాస్తా నెటిజన్లకు కోపం తెప్పించింది. దాంతో వారు ‘ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మంచి తల్లి కాదు. మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లు వస్తాయి’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై శ్వేత స్పందించారు. ‘అవును. నేను తాగుతాను, ధూమపానం కూడా చేస్తాను. కానీ నేను నిజాయతీగా ఉంటాను. కేవలం డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం వంటి వాటి వల్ల నేను మంచి తల్లిని కాకుండా పోతానా? అయిన నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా? పని పాటా లేకుండా ఖాళీగా గడపడం చూశారా? ఎప్పుడైనా నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా? నిత్యం నేను ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నేను నటిని, డ్యాన్సర్‌ను, పారిశ్రామికవేత్తని. ఇతరుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నేను ఎలాంటి ప్రశ్నలు వేయను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి’ అంటూ నెటిజన్లపై మండిపడ్డారు. అంతేకాక ‘నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. నా ఫాలోవర్ల గురించి.. నా పోస్ట్‌లకు చేసే లైక్‌ల గురించి నేను పట్టించుకోను. మీరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్‌ఫాలో అవ్వచ్చు’ అంటూ డ్రింక్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. View this post on Instagram A Day off Looks something like this .. . Yes I Drink and Smoke ... I am real , honest and basic like that. It has to be of no reason that anyone ever judge me for the person I am or the Mommy I am .. I don’t propagate it and neither do I question anyone else who does , so I would respect the same back . Today I got a few random DM’s by totally random people about my actions , and I usually let such things go pass me but for some reason today I felt like addressing it . How does this make me a bad person or a bad mom ?? Do you see me wasting my Life ? Do you see me sitting unemployed n jobless ? Do you see me neglecting my child ? I work , I work multiple jobs , I’m an actor , dancer , an entrepreneur . I successfully live in two major cities of our glorious country . I have beautiful friends whom I love and I know who love me back for the person I am . Risking the fact that I might sound aggressive , don’t ever question my abilities of being a bad example to my child !! So tell me does an honest sex worker who sells her body to feed her family , to maybe get an education or to provide a life for her children is a Bad Person ? A Bad Mother ? A stigma to society ? Who are you and I to Judge ?? My parents taught me well and exposed me to the good and evil of everything . They smoked and drank too but they did a mighty fine job of raising my brother and I . As children we knew that this was not something we could practice until a certain age . And that too if we ever wanted to.. a choice that we were allowed to take as adults ... Today I share a drink with them , and celebrate the fact that they gave me a fabulous childhood n Life and I aspire to do the same with my Baby . . . I don’t pay for likes and followers , you choose to follow me for who I am . And hence what you see is me being me and you always have the option to unfollow me :) . Live and Let Live ✌🏼.. this rant has gotten me all irked so I’m gonna go pour myself a red and light up .. #micdrop 👊🏼 . #bekindtooneanother #peaceout A post shared by ⓢⓗⓥⓔⓣⓐ ⓢⓐⓛⓥⓔ (@shveshve) on Oct 28, 2018 at 5:51am PDT -
రాఫెల్ రచ్చ: మోదీపై రహుల్ పైర్
-
బాబుకు దళిత రైతులంటే ఎందుకంత చులకనా..?
-
'మిడ్ డే మీల్స్' ప్రయివేటీకరణ చేయాలని బాబు ఆరాటం
-
బాబు ఎన్నికల ముందు ఓ మాట తర్వాత మరోమాట
-
తునిలో డంపింగ్ యార్డ్ లేక శ్మశానంలో చెత్త వేస్తున్నారు
-
అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్
పెద్దపల్లి టౌన్/గోదావరిఖని : ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కెసీఆర్ అసమర్థతతో అప్పుల రాష్ట్రంగా మారిందని తెలంగాణ ప్రజలపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. పెద్దపల్లి, గోదావరిఖనిలో శనివారం రైతు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద వైఖరితోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రభుత్వాలు ఎరువుల, పురుగు మందుల, నకిలీ విత్తనాల కంపెనీలతో లాలుచీ పడి రైతుల గోస పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వివిధ రాజకీయ పార్టీలు రైతు అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసుకొని నేతలకు పునరావాసం కల్పిస్తున్నారే తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ రైతులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మర్గామని అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాధామోహన్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకం పేరుతో బడాబాబులకు లబ్ధిచేకూర్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతును రైతుగా గుర్తించని కేసీఆర్ తాను ఒక రైతునని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కొంతమంది మంత్రులు, శాసస సభ్యులు, బ్యూరోక్రాట్లు వందల ఎకరాల భూములుండి రైతుబంధు కింద వచ్చిన డబ్బును తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నామని ప్రకటిస్తున్నారని, భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం అలాంటి భూస్వాములపై కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూశుద్ధీకరణతో ఏఒక్క రైతుకు లబ్ధి చేకూరలేదని.. రైతుబంధు పథకంలో తప్పులు దొర్లాయని గగ్గొలు పెడుతున్న, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల చేతుల్లో చావుదెబ్బ తప్పదన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకివస్తే రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా చట్టాలు రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కొంత మంది రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నెల 17న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రైతు సదస్సులో ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు. జిల్లాలోని రైతులందరు అధిక సంఖ్యలో హాజరై రైతు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర రైతు బాధ్యులు ఏసీ రెడ్డి, వసీంరాజా, గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో టి.సారయ్య, రామనర్సయ్య, రమేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీపై ఎల్లో మీడియా అవాస్తవాలు..
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..నిన్న(ఆదివారం) తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశం అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని ఎల్లోమీడియా ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను అణదొక్కుతున్నారని పార్ధసారధి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు వందకుపైగా హామీలిచ్చి ఇప్పుడు మిన్నకుండిపోయారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలలో ఇప్పటివరకూ ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. అధికారాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జస్టిస్ ఈశ్వరయ్య ఇచ్చిన స్టేట్మెంట్తో అది తేట తెల్లమైందన్నారు. తప్పుడు నివేదికలు ఎలా తయారు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. బలహీనవర్గాలు, దళితుల అవకాశాలను గండికొడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బలమైన పోస్టు ఏ ఒక్కటైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. తప్పుడు నివేదికలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
నల్లజెండాలతో పాదయాత్ర
విజయవాడ: ప్రజలను వంచించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి దీక్ష చేసే అర్హత లేదని, ఏప్రిల్ 30న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు పట్టుకుని, నల్లబాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తారని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏప్రిల్ 30న ఏపీకి జరిగిన అన్యాయాన్ని నల్లజెండాలతో పెద్ద ఎత్తున తెలియజేస్తామని వివరించారు. మరో వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు.హోదాకు వంచన చేసింది ముమ్మాటికీ చంద్రబాబేనని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీని వంచన దినంగా పాటిస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.విశాఖలో ఏప్రిల్ 30న వంచన దినాన్ని పెద్ద ఎత్తున జరుపుతామని వివరించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసన ద్వారా ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంలకు భయం పట్టుకుంది
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. వాళ్ల ఉనికి కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాక తెలుగు రాష్ట్రాల సీఎంలు వారి స్థాయి మరిచి ప్రధానమంత్రి మోదీపై బురద జల్లుతున్నారని ఎంపీ మండిపడ్డారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ కుటుంబంలో బంగారం మాయం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అప్పుడు ఐదు రాష్ట్రాలు.. ఇప్పుడు 21 రాష్ట్రాలు ‘మొదట్లో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. ఏ ప్రభుత్వం చేయని పనులు మా ప్రభుత్వం చేసింది. బీజేపీ విస్తరణ కొనసాగుతూ వస్తుంద’ని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. కేవలం మోదీని తిట్టడానికే ఈ సభలు ‘కమ్యూనిస్టులు కేవలం నరేంద్ర మోదీని తిట్టడానికే జాతీయ మహాసభలు పెట్టుకున్నారు. మోదీ చేతిలో త్రిపురలో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తిట్టడం ద్వారానే వారు ఆనందం పొంతున్నార’ని ఆయన అన్నారు. ఉనికి కోసం ఆరోపణలు.. తన ఉనికి కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ మోదీపై ఆరోపణలు చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.3 లక్షల కోట్లు ఇచ్చారు.. కానీ మా ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అంతేకాక 8 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు కరెంట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం 50 శాతం నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. ఏదైనా ఒక విషయం మాట్లాడేప్పడు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. పేద వారికి సాయం చేసే పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమే అని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తాం.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో భూ స్థాపితం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఓడిపోతామనే భయంతో వారు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు.. అందుకే ఫ్రంట్లతో పేరుతో ఊదరా గొడుతున్నారు.. ఎటువంటి ఫ్రంట్ వచ్చిన మోదీకి ప్రతిఘటన ఇవ్వలేవని రాజ్యసభ ఎంపీ ధీమా వ్యక్తం చేశాడు. 2019 ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది. తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలను చేస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని రాజ్యసభ ఎంపీ జీఎల్‌వీ నర్సింహారావు స్పష్టం చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పింది: కేవీపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో నగదు కొరత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన చంద్రబాబు..సమస్యల పరిష్కార కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్న సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పంచాయతీ స్థాయి నుంచి సీఎం పేషీ వరకు అవినీతి తాండవిస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల్ని విస్మరించి రాజకీయ, అధికారిక సమావేశాలు, సమీక్షలకే చంద్రబాబు పరిమితం కావడం సరికాదన్నారు. -
బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ కుట్రలు
-
అందుకే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ, వామపక్షాలు , ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన ఏపీ బంద్( ఏప్రిల్ 16న)కు ప్రజల నుంచి వస్తోన్న మద్ధుతును చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు జరిగే బంద్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు విజయవంతం చేస్తాయని తెలిపారు. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. బంద్‌లో పాల్గొంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని వెల్లడించారు. బంద్‌ను అన్నివిధాలా విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతారని విమర్శించారు. -
చందాల మోహన్ రెడ్డిగా అవతారమెత్తాడు
నెల్లూరు : ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిల్లర్ల దగ్గర చందాలు వసూలు చేసుకుంటూ చందాల మోహన్ రెడ్డిగా అవతారం ఎత్తి రైతాంగం సమస్యను విస్మరించారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని కాకాణి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘ అన్నం పెట్టే రైతన్న తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక కన్నీరు పెడుతున్నామంత్రి సోమి రెడ్డికి కనికరం లేదు. సోమిరెడ్డి ప్రకటనలతో మిల్లర్లకు ఆదాయం తప్ప, రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు’ అని మండిపడ్డారు. -
ఐదుగురి దీక్షను చూసి రాష్ట్రం గర్వపడుతోంది
-
ఏపీలో అవినీతి రాజ్యమేలుతోంది
సాక్షి, కడప: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేక హోదాపై చర్చించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి విలాసాలకు ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. అఖిల పక్షం పేరుతో అనుకూల సంఘాలతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారని విమర్శించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయనకు మద్దతు పలకడం లేదని చెప్పారు. ఈ నెల 11వ తేదీన విజయవాడలో సమావేశమవుతామని, ఆ రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. -
మోదీ ఒక పిరికిపంద: రఘువీరా
విశాఖపట్నం : ఎన్డీయే ప్రభుత్వం క్రూరమైన చర్యలను ఖండిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరా రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..ఇరవై పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినా, మోదీ పరుగెత్తిపోయాడని, మోదీ ఒక పిరికిపంద అంటూ తూర్పారబట్టారు. పార్లమెంటులో చర్చకు రాకుండా సమావేశాలను నిరవధిక వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక నేరస్తులు లలిత్ మోదీ, నీరవ్ మోదీలు పోలీసులకు, దొరక్కుండా ఎలా పారిపోయారో, ఆ రకంగా చట్టానికి, పార్లమెంటుకు దొరక్కుండా పోయిన నేరస్తుడు, క్రిమినల్ మోదీ అని తీవ్రంగా విమర్శించారు. ఈ నెల 11 న కాంగ్రెస్ పెద్దలతో నాలుగేళ్ల పోరాటాలపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. -
అపాయింట్మెంట్ కోసం అడుక్కుంటున్నాడు
వైఎస్సార్ జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ నాయకుల అపోయింట్మెంట్ కోసం అడుక్కుంటూ తిరుగుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషా, రవీంద్రనాధ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. కేవలం ఫోటో షూట్ కోసం ఢిల్లీ టూర్‌కి వెళ్లారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి జాతీయ పార్టీల నాయకులు నవ్వుకుంటున్నారని చెప్పారు. విజయ్ మాల్యాను కలిసారా లేదా అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరితే ఇంత వరకు దానిపై స్పందన లేదని మండిపడ్డారు. ముందుగా చెప్పిన విధంగా రేపు వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకి రాజీనామా చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాము ఉన్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. చంద్రబాబును చూసి జాతీయ నాయకులు, ప్రజలు పారిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు నాటకాలు ఆడటం మొదలెట్టాయని విమర్శించారు. అధికారం లోకి వచ్చాక ఒక్క హమీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి జిల్లాని హైదరాబాద్ చేస్తా అని చెప్పి..ఇంత వరకు కనీసం పట్నం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదని, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏపార్టీతో నైనా కలిసి పోరాడుతామని ఈ సందర్భంగా తెలిపారు. -
బీజేపీ తొత్తులు ఏం సమాధానం చెబుతారు..?
సాక్షి, అమరావతి : దేశ రక్షణ కోసం కొనుగోలు చేస్తున్న విమానాల్లోనూ అవకతవకలు జరిగాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.1650 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రాఫెల్ ఒప్పందంలో రూ. 28 వేల కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో బీజేపీ వాటా ఎంతని ప్రశ్నించారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘గుజరాత్ రాష్ట్రంలో జీఎస్పీఎల్ పెట్టి ఆ రాష్ట్రాన్ని మోసం చేయలేదా..? నష్టాల్లో ఉన్న జీఎస్పీఎల్ సంస్థను ఓఎన్జీసీకి ఎలా కట్టబెట్టారు..? జీఎస్పీఎల్ ఒప్పందంలో వచ్చిన డబ్బుతో గుజరాత్ ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నది వాస్తవం కాదా..? రాష్ట్రానికి చేసే న్యాయం చేయకపోగా టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తారా..? ఈ విషయాలపై స్థానిక బీజేపీ తొత్తులు ఏం సమాధానం చెబుతార’ని ప్రశ్నించారు. కనీస ఇంగితం లేకుండా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను బీజేపీ జేబులో నుంచి అడగడం లేదని, తన పబ్బం గడుపుకోవడం కోసం ప్రాంతీయ తత్వాన్ని బీజేపీ రెచ్చగొడుతోందని విమర్శించారు. అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేసి లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి బీజేపీ నేతల కళ్లకు కనపడడం లేదా..? అని ఎద్దేవా చేశారు. సెస్సుల ద్వారా వస్తోన్న డబ్బును సక్రమంగా వినియోగించడం లేదని ధ్వజమెత్తారు. రైతు రుణ మాఫీకి నిధులు ఇవ్వని మోదీ, బ్యాంకులను దోచుకుంటోన్న వారిని రక్షిస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. -
నిషేధం పేరుతో మైనార్టీలపై దాడులు..
హైదరాబాద్ : పశుమాంసం నిషేధం పేరుతో సాధారణ ప్రజలు, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..‘ ముస్లింలను భయభ్రాంతులకు గురిచేసి రెండవ తరగతి ప్రజలుగా ముద్రవేస్తున్నారు. యూనివర్శిటీల్లో దళిత విద్యార్థులు, వామపక్ష విద్యార్థులపై దాడులు పెరుగుతున్నాయి. ఒక్క ఏబీవీపీ తప్ప వేరే విద్యార్థి సంస్థ ఉండొద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రగతిశీల భావాలున్న విద్యార్థులను చదువుకు దూరం చేసేలా స్కాలర్షిప్లు రద్దు చేస్తున్నారు’ అని అన్నారు. ‘ వందలకోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్న బడా వ్యాపారులు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలు పారిపోతున్నారు. తెలిసినవారు కొందరే..ఇంకా తెలియని వారెందరో ఉన్నారు. మాల్యా రూ.9 వేల కోట్లు, నీరవ్ మోడీ రూ.12 వేల కోట్లు ముంచి పారిపోయారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి సుష్మ స్వరాజ్, వసుంధరారాజేతోపాటు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. విదేశాలకు పారిపోయిన లలిత్ మోదీకి మరో దేశానికి వెళ్లేందుకు సుష్మ స్వరాజ్ మనవతా దృక్పదంతో సహాయం చేశారు ’ అని తెలిపారు. బ్యాంకులను పంగనామాలు పెట్టిన వారే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలని కుట్రచేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులను దివాలా తీయించినవారే ప్రైవేట్ పరం కోసం ఒత్తిళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. పేదల నుంచి వసూలు కాని బాకీలు 7 శాతం మాత్రమేనని, బడా బాబులు ఎగ్గొట్టినవే 90 శాతం ఉన్నాయని వివరించారు. ఇవన్నీ ప్రజలకు తెలిసేలా వామపక్షాలు కృషిచేస్తోంటే అదంతా తప్పని ప్రధాని చెబుతున్నారని విమర్శించారు. -
‘కేసీఆర్ సమాజానికి శ్రేయస్కరం కాదు’
హైదరాబాద్ : కేసీఆర్ తెలంగాణ సీఎంగా కొనసాగడం సమాజానికి శ్రేయస్కరం కాదని టీపీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోల్కొండ హోటల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..కాగ్ నివేదిక పరిగణలోకి తీసుకుంటే సీఎం ఆయన స్థానంలో కూర్చునే అవకాశం ఉండదన్నారు. సీఎం అబద్దాలు చెబుతున్నారని, అప్పులను ఆదాయంగా చూపించి, మరిన్ని అప్పులు తీసుకొచ్చేందుకు, కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చేందుకు అంకెల మార్పు చేసి ఆర్థిక శాఖను సీఎం మోసగించారని ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో కాంగ్రెస్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని చూస్తోందని చెప్పారు. అప్పులు తీసుకునే దానికన్నా మించి అప్పులు తీసుకున్నారని తెలిపారు. భవిష్యత్ తరాల్ని నాశనం చేయాలనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించారు. దళితులకు ముడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వ్యవహారంలో పదివేల కోట్ల రూపాయలు అకారణంగా అదనంగా ఖర్చు పెట్టారని అన్నారు. ఇవన్నీ కాగ్ తప్పు బట్టిందని, వీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు కాంగ్రెస్‌పై మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రజా చైతన్య రెండోవిడత బస్సు యాత్ర ఆదివారం నుంచి మొదలవుతుందని, ఆదివారం సాయంత్రం 6 గంటలకు రామగుండం నియోజకవర్గంలో బహిరంగ సభ తెలిపారు. సోమవారం ఉదయం కోల్ మైన్ వర్కర్స్, ఆన్ ఎంప్లాయ్ మెంట్ యూత్‌తో సంప్రదింపుల వ్యవహారం ఉంటుందన్నారు. ఒకటి నుంచి పదవ తేదీ వరకు బస్సుయాత్ర ఉంటుందని, టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలన వైఫల్యాలు, టీఆర్ఎస్ హామీలు- వాటి అమలు, ఇది మా సర్కార్ మా జాగీరు తదీతర అంశాలపై టీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. డిసెంబర్లో ఎన్నికలొస్తాయని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ సెషన్లో శాసన సభలో సీఎం, స్పీకర్ ప్రవర్తించిన తీరు, ఇద్దరు సభ్యులను ఎక్ స్పెల్ చేయడం, మిగిలిన వారిని సస్పెండ్ చేయడం, ప్రధాన ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సెషన్ జరపడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ పాలనను ఎండగడతామని వివరించారు. -
అమెజాన్‌కు షాక్: ట్రంప్ టాక్స్ వార్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్‌పై మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్ల గక్కారు. పన్నులు చెల్లించకుండా భారీ ఆదాయాన్ని దండు కుంటోందంటూ తన తాజా ట్వీట్లో దాడి చేశారు. ఇటీవల మీడియా నివేదికలకు బలం చేకూరుస్తూ ట్రంప్ గురువారం మరో ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు అమెజాన్ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశా..పన్నులు చెల్లించకుండా.. పన్ను చెల్లిస్తున్న చిన్నవ్యాపారులకు తీరని నష్టం చేకూరుస్తోందంటూ అమెజాన్‌పై ఆయన ధ్వజమెత్తారు. ఇతరుల మాదిరిగా కాకుండా చాలా స్వల్పంగా లేదా అసలు పన్నులు చెల్లించకుండా వేలాదిమంది రీటైలర్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తోంది. తమ పోస్టల్ సిస్టంను అమెజాన్ డెలీవరీ బాయ్‌గా వాడుకుంటూ అమెరికాకు తీరని నష్టాన్ని కలిగిస్తోందంటూ ట్విటర్లో మండిపడ్డారు. మరోవైపు అధ్యక్షుడి ప్రకటనకు వైట్ హౌస్ ట్రంప్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ లిండ్సే వాల్టర్స్ మద్దతు పలికారు. అమెజాన్ చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో భారతదేశంతో సహా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అమెజాన్ వ్యాపారాన్ని దెబ్బతీసేలా పటిష్టమైన ఆంక్షల తీసుకోనుందనే సంకేతాలను అందించారు. ఈ వ్యాఖ్యలు మార్కెట్లో షేరు కదలికలపై మరింతగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా యాంటీ ట్రస్ట్ చట్టాన్ని ఉపయోగించేందుకు ముమ్మరంగా చర్చలు నిర్వహించారని యాక్సోస్ అనే వెబ్సైట్ నివేదించడంతో అమెజాన్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అమెజాన్ షేరు 5శాతం నష్టపోయి 30 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూని కోల్పోయిన సంగతి తెలిసిందే. I have stated my concerns with Amazon long before the Election. Unlike others, they pay little or no taxes to state & local governments, use our Postal System as their Delivery Boy (causing tremendous loss to the U.S.), and are putting many thousands of retailers out of business! — Donald J. Trump (@realDonaldTrump) March 29, 2018 -
కష్టాలు వింటే కంటనీరొస్తుంది
నెల్లూరు జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు వింటుంటే కంటనీరు వస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలు మండలం ధాన్యం కేంద్రంను కాకాణి శుక్రవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా మంత్రి సోమిరెడ్డి వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్ల దగ్గర మంత్రి సోమిరెడ్డి ముడుపులు తీసుకుని రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్నాడని ధ్వజమెత్తారు. రైతులు 6 లక్షల టన్నుల బీపీటీ ధాన్యం అమ్మేసిన తర్వాత మంత్రి సోమిరెడ్డి ధాన్యం ధర పెంపు అంటూ ప్రకటన చేయటం సిగ్గుచేటన్నారు. జిల్లా యంత్రాంగం సోమిరెడ్డి మాటలు విని మిల్లర్లపై చర్యలకు వెనుకాడిందని వ్యాఖ్యానించారు. రైతులను బాధించే సోమిరెడ్డిని, రైతు బాంధవుడంటారా అని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో సోమిరెడ్డి వైఫల్యం చెందాడని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ప్రకటించిన ధర కూడా రాకపోవడానికి సోమిరెడ్డి అవినీతే కారణమని ఆరోపించారు. సోమిరెడ్డి ప్రకటనలు చూస్తుంటే,దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేశారు. మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే అధికార యంత్రాంగం, చోద్యం చూస్తుందని విమర్శించారు. -
పరాకాష్టకు చేరుకున్న టీడీపీ ఎంపీల డ్రామా
కర్నూలు జిల్లా: ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేస్తున్న డ్రామాలు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య ఎద్దేవా చేశారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ..సరికొత్త డ్రామాలకు తెరలేపిందని వ్యాఖ్యానించారు. బీజేపీ తో జత కట్టి మోసం చేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అఖిల పక్ష భేటి పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెటు నిరవధిక వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని వెల్లడించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు జైలు కెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. కాంట్రాక్టర్ల, బ్యాంకుల నుంచి టీడీపీ నేతలు దోచుకుంటున్నారని, టీడీపీ తెలుగు దొంగల పార్టీ అని ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మాట తప్పని నేత జగన్ మోహన్ రెడ్డి అని, నాలుగేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో గానీ చంద్రబాబు ప్రధాన ముద్దాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ దొందు దొందేనని అన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధమేనని సవాల్ విసిరారు. -
అవిశ్వాసం వేళ ‘అఖిలపక్షం’ డ్రామా
సాక్షి, హైదరాబాద్: మొదటి నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమైందనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ పుట్టి మునగకుండా కాపాడుకోవడం కోసమే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ధర్మాన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార టీడీపీ దారుణంగా విఫలమైందన్నారు. చంద్రబాబు సాగిస్తున్న అఖిలపక్ష చర్చల డ్రామాలతో సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, మళ్లీ ప్రజా తీర్పు కోరుతామని స్పష్టం చేశారు. సీఎంకు హోదా ఇప్పుడే గుర్తొచ్చిందా? ‘‘రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీని అంగీకరించిన రోజే చంద్రబాబు ప్రజల పక్షాన నాయకత్వం వహించే అర్హత కోల్పోయారు. ఇంతకాలం ప్యాకేజీ అద్భుతమంటూ పాట పాడిన చంద్రబాబుకు ఇప్పుడే హోదా గుర్తొచ్చిందా? లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు వచ్చే సమయంలో చంద్రబాబు ఇక్కడ అఖిలపక్షం అంటున్నారు. రాజధాని విషయంలో ఒక్కరోజైనా ప్రతిపక్షాన్ని సంప్రదించారా? ప్రజాసంఘాలతో చర్చించారా? రాజధానిని చంద్రబాబు తన కుటుంబ వ్యవహారంగానే చూశారు. పోలవరం విషయంలో ఏనాడైనా అఖిలపక్షాన్ని సంప్రదించారా?’’ అని ధర్మాన నిలదీశారు. రాష్ట్రం చెడిపోవడానికి బాబే కారణం ‘‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. సింగపూర్ తరహాలో ప్రతిపక్షం ఉండకూడదన్నదనే తన ఆకాంక్ష అని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. పాలకుల తప్పులను, అవినీతిని బహిర్గతం చేస్తున్న ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బు, పదవులు ఎరవేసి కొనుగోలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకుని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజాగ్రహానికి తట్టుకోలేకే టీడీపీ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పాలక పక్షం విఫలం కావడం వల్లే ఆ బాధ్యతను ప్రతిపక్ష వెఎస్సార్సీపీ భుజానకెత్తుకుంది. ఇప్పుడు కావాల్సింది అఖిలపక్షం భేటీ కాదు, టీడీపీ ఎంపీల రాజీనామా. రాష్ట్రం చెడిపోవడానికి, అవినీతి పెరగడానికి చంద్రబాబే కారణం. ఇలాంటి వ్యక్తితో కలిసి చర్చించడంలో అర్థం ఉందా?’’ అని ధర్మాన ప్రశ్నించారు. -
అదంతా ప్లాఫ్ హీరో ఊహాజనిత కథ
సాక్షి, అమరావతి: ఆపరేషన్ గరుడ, ద్రవిడ అవాస్తవాలు..అదంతా ఒక ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బీజేపీ అధికార ప్రతినిథి సుధీశ్ రాంబొట్ల వ్యాఖ్యానించారు. కారెం శివాజీ మాదిరిగా హీరో శివాజీకి కూడా ఏదో పదవి వచ్చేవరకూ ఇలాగే చేస్తుంటాడని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. బీజేపీని తిడతారనుకుని టీడీపీ నేతలే పవన్ మీటింగ్‌కు జనాన్ని తరలించారని, కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ పవన్‌తో ఆడిస్తుంది.. జగన్‌తో కుమ్మక్కైంది అనే అవాస్తవాలు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి పొడిగించలేదని స్పష్టం చేశారు. కేవలం ఆ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు విడుదల మాత్రమే చేశారని వివరించారు. అదికూడా నీతి ఆయోగ్ ప్రతిపాదనలతోనే ఇచ్చారని తెలిపారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. చంద్రబాబును కూడా ఉండాలని కోరినా తిరస్కరించారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నాం కానీ అప్పుడు చంద్రబాబు ఏపీకి ఏం కావాలో కోరుకోలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ ఇచ్చామన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిధులు ఎక్కువ ఇస్తున్నామనేది అవాస్తవమని చెప్పారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్నది చంద్రబాబు కాదు.. బీజేపీ అని టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వలేదనేది అవాస్తవమని.. పట్టిసీమ ప్రాజెక్టు మంచిదే, కానీ అవినీతి జరిగిందనేది వాస్తవమని పేర్కొన్నారు. -
‘ఆ డబ్బులేవో పవన్ నే తీసుకోమనండి’
అమరావతి: వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తానేదో నియోజకవర్గానికి పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్దం చేశానని పవన్ కళ్యాణ్ అన్నారని విన్నాను..ఆ డబ్బులేవో ఉంటే ఆయన్నే తీసుకోమని చెబుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..‘అవినీతి లేకుండా ఉండటానికే పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పాను. ఇప్పుడు రెండువేల నోట్లు కూడా రద్దు చేయమని అడుగుతున్నా. అప్పుడు ఎన్నికల సమయంలో నోట్లు పంచే అవకాశం ఉండదు. విజయసాయి రెడ్డి ఇప్పటికీ తాను ప్రధాన మంత్రిని కలుస్తానని చెబుతున్నాడు. విజయసాయి రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో వాళ్లు లెక్కలు చెప్పాలి. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని చెప్పమనండి. ఈశాన్య రాష్ట్రాలకి పొడిగించారు’ అని అన్నారు. ‘అన్నింటిపైనా సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా బీజేపీ నేతలు. నిన్నటి వరకూ మాతో బాగానే ఉన్నారు. ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పోలవరం మీదా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయం వేరు అభివృద్ది వేరు. పోలవరం విషయంలో ట్రాన్స్ట్రాయ్ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నానని తనపై దుష్ప్రచారం చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వమే నవయుగ కంపెనీని ఒప్పించింది. నవయుగ కంపెనీ కూడా మాకు మంచి పేరొస్తుందని పాత రేట్లకే ప్రాజెక్ట్ కట్టేందుకు ముందుకొచ్చారు’ అని వివరించారు. పోలవరం ప్రాజెక్టును ఆపివేసేందుకు కుట్ర జరుగుతోందని, పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన మొత్తం తాను ఒప్పుకున్నానుని పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని వేల కోట్లు తాను చెల్లిస్తానని ఎలా చెబుతానని ప్రశ్నించారు. పదహారు ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం బ్రహ్మాండంగా నిధులు ఇస్తోందని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ నిజానికి ఏ ప్రాజెక్టుకు ఇంతవరకూ కేంద్రం నిధులు ఇవ్వలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. -
బీజేపీ, టీడీపీ నాటకాలు
అనంతపురం: ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనకు చేస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం పార్లమెంటులో చర్చకు రానున్న నేపథ్యంలో ఎంపీలకు సంఘీభావంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజా సంకల్ప మానవహారం’ చేపట్టనున్నట్లు తెలిపారు. హోదా కోసం పోరాడుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువజన సంఘాలు, నిరుద్యోగులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా అంశాన్ని నాలుగేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చిన బీజేపీ, టీడీపీలు ఈ రోజు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా టీడీపీ చేసిన తప్పిదాలను ఇతరులపై నెట్టేందుకు కుటిలయత్నం చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్ధతిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఉదయానికే మాట మార్చి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉగాది శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు అనంత వెంకటరామిరెడ్డి విళంబి నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. -
ప్రత్యేక హోదాపై చంద్రబాబు దొంగ కన్నీళ్లు
-
నాలుగేళ్లలో ఏం చేశారు?
మిర్యాలగూడ : టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించారా? ఒక్క పరిశ్రమ కట్టారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదని, వారికి ఇతర పార్టీల నాయకుల గురించి అపహాస్యంగా మాట్లాడటమే తెలుసని అన్నారు. నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మిస్తే కాలువకు నీళ్లిచ్చి గతంలో ఎన్నడూ నీళ్లు రానట్లుగా తామే ఇచ్చామనేవిధంగా గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాలుగేళ్లలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో తమ హయాంలో నిధులు మంజూరు చేసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించి తాము నిర్మించినట్లు చెబుతున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికైనా కొత్తగా మంచినీటి సదుపాయం కల్పించారా? పట్టణంలోని ఆడిటోరియం నిర్మించారా? అని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు కరీం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేష్, కార్యదర్శి బండారు కుశలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముజ్జు రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
'కౌంటింగ్ జరుగుతుంటే రాహుల్ అలా వెళ్లొచ్చా?'
సాక్షి, పట్నా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శల వర్షం కురిపించారు. ఓపక్క ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశాలకు వెళ్లారని సెటైర్ వేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ ఎక్కడా విజయం సాధించదని రాహుల్‌గాంధీకి ముందే తెలుసు. రాజకీయాలంటే అసలు రాహుల్‌కు సీరియస్‌నెస్ లేదు. ఇలాంటి కీలకమైన సమయంలో ఒక పార్టీ చీఫ్ ఎవరైనా పార్టీని, కార్యకర్తలను, నాయకులను ఇలా ఒంటరిగా వదిలేసి వెళతారా. ఇలాంటి సమయంలో కనీసం కార్యకర్త కూడా ఎక్కడికీ వెళ్లడు. పార్టీ అధ్యక్షుడిగా అసలు రాహుల్ గాంధీకి ఏమాత్రం ఆసక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు' అంటూ ఆయన తీవ్రంగా విమర్శిచారు. హోలీ సందర్భంగా తాను తన అమ్మమ్మ (93) దగ్గరకు ఆశ్యర్యంలో ముంచెత్తేందుకు వెళుతున్నట్లు రాహుల్‌గాంధీ తన ట్విట్టర్ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గిరిరాజ్ సింగ్ విమర్శలు చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ తోడుదొంగలు
మిర్యాలగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లు అధికారం పోతుందనే భయంతో మితిమీరి మాట్లాడుతున్నారని, వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్న దోపిడీ దొంగలుగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభివర్ణించారు. గురువారం మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సుయాత్రను జానా దొంగల బండిగా వర్ణించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధానిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని నోటికొచ్చిన పదజాలంతో విమర్శిస్తే, కేటీఆర్ జానారెడ్డిని కాంగ్రెస్ నాయకులను విమర్శించడం తగదన్నారు. కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ప్రాజెక్టులతో పాటు మిషన్ భగీరథ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించి 10 శాతం కమీషన్లు తీసుకున్నారని అన్నారు. దోచుకున్న సొమ్ముతో బెంగుళూరు, హైదరాబాద్‌లలో ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. 500 కోట్ల రూపాయలతో పూర్తి చేసే ఫైబర్ కేబుల్ వైరుకు కేటీఆర్ బా వమరిది పేరుతో కాంట్రాక్టు ఇప్పించి రూ. ఐదు వే ల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. భూముల కుంభకోణంపై ఆధారాలతో సహా బయటపెడుతాం హైదరాబాద్‌లో జరిగిన జిడీమెట్ల, మియాపూర్ భూముల కుంభకోణాలను రాబోయే అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కేటీఆర్ ఒక బ్రోకర్లా మాట్లాడుతున్నాడని, మున్సిపల్ మంత్రికి కనీసం మున్సిపాలిటీలపై అవగాహన కూడా లేదని, విదేశాలు తిరగడం తప్పా ఆయన ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు. నాగారం హత్య కేసులలో నిందితులుగా ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంతో కలిసి కేటీఆర్ భోజనం చేస్తూ జానారెడ్డిని, కాంగ్రెస్ నాయకులను విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గతంలో నకిలీనోట్ల కేసు, దొంగపాస్ పోర్టు కేసులున్నాయని, ఆయనకు గతంలో బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముకున్న చరిత్ర కూడా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి ఆస్తులపై విచారణ జరిపించి, అవినీతిపై ఈడీ కేసులు పెడతామని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్, పీసీసీ సభ్యులు స్కైలాబ్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, గడ్డం వేణుగోపాల్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, నాయకులు సంపత్‌రెడ్డి, రామకృష్ణ, కోడిరెక్క శౌరి, మామిడాల ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలి: బీజేపీ
విజయవాడ: కమెడియన్ శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో విష్ణువర్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సినీ నటుడు శివాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రచారం కోసమే శివాజీ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది తమ స్వార్థం కోసం దేశాన్ని విడగొట్టాలని మాట్లాడుతున్నారని..అలాగే కొంతమంది ఎంపీలు ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ నాయకులకు ఇచ్చిన నిధులపై అనుమానం ఉంటే సమాధానం చెబుతామని తెలిపారు. కొంతమంది మేధావులు హైదరాబాద్‌లో ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపు రాయలసీమ బీజేపీ ముఖ్య నాయకులంతా కర్నూలులో సమావేశమవుతున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి రేపు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. -
పద్మావత్‌తో అసలేం చెప్పదల్చుకున్నావ్?
సాక్షి, సినిమా : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై విలక్షణ నటి స్వర భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్మావత్ చిత్రం ద్వారా ప్రజలకు అసలేం సందేశం ఇవ్వదల్చుకున్నావంటూ భన్సాలీని ఆమె ఏకీపడేశారు. ఈ మేరకు ఆమె రాసిన ఓ బహిరంగ లేఖను ది వైర్ శనివారం ప్రచురించింది. ‘‘అత్యాచార బాధితులు, వితంతువులు, చిన్న, పెద్దా, ముసలి, గర్భవతి... ఇలా మహిళలకు ఈ సమాజంలో బతికే హక్కు ఉంటుంది. మరి అలాంటప్పుడు పద్మావత్ ద్వారా మీరు సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారు?. చిత్రం చివరలో దీపిక చేసిన పద్మావతి పాత్ర అగ్ని ప్రవేశం చేసి ఆత్మాహుతి చేసుకుంటుందని చూపించారు. అయ్యా భన్సాలీగారు... ఇది 13వ శతాబ్దం కాదు.. 21వ శతాబ్ధం. మహిళలకు మాన-ప్రాణాల మీద అవగాహన,ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలు ఉన్నాయి. వారిలో రాను రాను మనోధైర్యం కూడా చాలా పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో పద్మావత్ ద్వారా మీరు అసలు ఏం చెప్పదల్చుకున్నారు?. సతీ సహగమనం, జౌహర్(ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించటాన్ని జౌహర్ అంటారు) వంటి దురాచారాలకు ఏనాడో కాలం చెల్లిపోయింది. మరి గ్రాండియర్ పేరిట పద్మావత్‌తో ఎలాంటి సందేశం ఇచ్చారో మీ ఆత్మ సాక్షిని ఓ సారి ప్రశ్నించుకోండి?’’ అంటూ స్వర భాస్కర్ 8 పేరాల లేఖలో భన్సాలీకి ప్రశ్నల వర్షంతో చురకలు అంటించారు. అయితే భన్సాలీ మాత్రం ఆమె విమర్శలపై స్పందించేందుకు నిరాకరించారు. గతంలో కూడా స్వర భాస్కర్ భన్సాలీ చిత్రాలపై తరచూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తను వెడ్స్ మను, రాంఝ్నా, తను వెడ్స్ మను రిటర్న్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి కమర్షియల్ చిత్రాలతోపాటు నీల్ బటే సన్నాటా, అనార్కలీ ఆఫ్ ఆరా వంటి ప్రయోగాత్మక చిత్రాలతో స్వర భాస్కర్ మంచి గుర్తింపు పొందారు. -
ప్రకటన వింటే పిల్లలు కూడా నవ్వుతారు
-
మూడు విడతల్లో రూ.60కోట్లు పంచారు
-
మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్ ఆలమూరు (కొత్తపేట) : ఇటీవల దళితులను ఉద్దేశించి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి సీహెచ్ ఆదినారాయణరెడ్డి అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని బహిరంగ క్షమాపణ తెలపాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని పెదపళ్లలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ రిజర్వేషన్లు ఉద్దేశించి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేశామని చెబుతున్న సీఎం చంద్రబాబు మళ్లీ స్టీరింగ్ కమిటీల నియామకం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికలోను, కాకినాడ నగరపాలక సంస్థలోను వైఎస్సార్సీపీ విజయం సాధింస్తుందని దీమా వ్యక్తంచేశారు. ఫ్రోటోకాల్ ఉల్లంఘనలతో అప్రతిష్ట జిల్లాలో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు ఉన్నచోట తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘనలతో పాల్పడుతూ టీడీపీ తన నైజాన్ని బయటపెట్టుకుంటుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరును ఒక్కోసారి రెండు, మరోసారి ఏడో నంబరులో పొందు పర్చుతున్నారన్నారు. ప్రోటోకాల్ నిబంధనలపై తరచూ మాట్లాడుతున్న రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శిలాఫలకంలో మూడో చోట స్థానే ఆరో చోట ఉంచిన విషయంపై ఆ పార్టీ నేతలు ఏమి సమాధానం చెబుతారన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నెక్కంటి వెంకట్రాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఏడిద మెహెర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోట్లు ఖర్చు పెట్టి నవనిర్మాణ దీక్ష చేశారు
-
మూడేళ్లలో సాధించిందేమీలేదు
-
పబ్లిసిటీ కోసమే నవనిర్మాణ దీక్ష
-
ఎన్నిసార్లు తీర్మానం చేస్తారు..?
-
రాష్ట్రానికి దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్
-
ఫిరాయింపులను స్పీకర్ అడ్డుకోవడంలేదు
-
టీడీపీ డైరెక్షన్,స్పీకర్ యాక్షన్..
-
ప్రజలు టీడీపీ చెంప చెల్లుమనిపించారు
-
రెండో డ్రైవర్ పారిపోయాడా, తప్పించారా?
-
పేరు గొప్ప ఊరు దిబ్బలా ఏపీ సర్కార్ తీరు
-
జగన్ పేరు వింటేనే బాబు తట్టుకోలేకపోతున్నారు
-
సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి
-
రోజాను నిర్బంధించడం అమానుషం
-
మోదీ అన్ని అబద్దపు హామీలు ఇస్తారు
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబుకు గుణపాఠం చెప్పాలి
-
ఏపీలో రౌడీ పాలన సాగుతోంది
-
హోదా ఊసుండదు..ప్యాకేజీ ఉండదు
-
ఒకరినొకరు పొగుడుకోవడమే సరిపోయింది
-
డీమానిటైజేషన్: ఫోర్బ్స్ సంచలన వ్యాఖ్యలు
-
డీమానిటైజేషన్: ఫోర్బ్స్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ డీమానిటైజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అనైతికమని, ప్రజల సొత్తును దోచుకోవడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న దిగ్భ్రాంతికర చర్య ప్రజల ఆస్తులనుభారీగా దొంగిలించడంగా పేర్కొన్న ఫోర్బ్స్.. 1975-77 లో ఎమర్జన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమంతో (ఫోర్స్డ్-స్టెరిలైజేషన్ డ్రైవ్) పోల్చింది. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారతదేశం ఆర్థికవ్యవస్థను, భవిష్య పెట్టుబడులను దెబ్బతీసిందని ఫోర్బ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ పేర్కొన్నారు.కరెన్సీ రద్దు చేయడం అంటే సామాన్యుడి గోప్యతపై దాడిచేయడమన్నారు. ప్రభుత్వం చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా కోట్లాదిమంది పేదల్ని మరింత భయాందోళల్లోకి నెట్టివేసిందనీ,ఇది అనైతికమని పేర్కొన్నారు. అంతేకాదు కరెన్సీ రద్దు చేసినంత మాత్రాన టెర్రరరిస్టులు తమ దుర్మార్గపు పనులను వదిలి పెట్టరని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా మార్కెట్లకు అనుమతి ఉంటేనే డిజిటైజేషన్ సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 85 శాతం చలామణీలో ఉన్న నోట్లను రద్దు చేసి, సామాన్య ప్రజానీకాన్ని అత్యంత ఇబ్బందుల్లోకి నెట్టివేసిందన్నారు. తాజా కఠినమైన నిర్ణయాలు, పన్నుల విధానంపై కూడా పత్రిక మండిపడింది. చట్టబద్దమైన వ్యాపారాన్ని సులువు చేసి వ్యాపార అవకాశాలను మరింత అందుబాటులోకి తేవాలన్నారు. మొత్తం పన్నుల విధానం సరళీకృతం చేయాలని ఆదాయ,వ్యాపార పన్నులను మరింత తగ్గించాలని మాగజీన్ సూచించింది. పన్నుల ఎగవేతకు పరిష్కారంగా ఎంత తక్కువ పన్ను రేటు ఉంటే అంతమంచిదని తెలిపింది. దేశీయ కరెన్సీ మరింత బలోపేతం చేయాలని కోరింది. -
అది టీడీపీకి సంప్రదాయంగా మారింది: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ ఉపఎన్నికలో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు బాటలోనే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు బేరసారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సంప్రదాయంగా మారిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మంత్రి దేవినేని ఉమ పై వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మీ ఇంటి పేరు దేవినేని కాదు అవినీతి. మంత్రి పదవిలో ఉండి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. పోలవరంపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దు' అన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే పోలవరం అంచనాలను అమాంతంగా పెంచారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును.. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఫర్వాలేదు మాకు పోలవరం ఇస్తే చాలని తీసుకున్నారని ఆమె విమర్శించారు. -
‘కేసీఆర్‌కు అనుభవం లేదని రుజువైంది’
-
‘కేసీఆర్‌కు అనుభవం లేదని రుజువైంది’
హైదరాబాద్‌సిటీ: కేసీఆర్‌కు పాలనా అనుభవం లేదని రెండున్నరేళ్ల పాలనతో రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ.. హామీలు గాలికొదిలేసి.. పిట్టల దొరల మాటలతో పాలన గడిపేస్తున్నారని అన్నారు. అబద్ధాలు ధైర్యంగా, అందంగా చెప్పడంలో కేసీఆర్ పాస్ అయ్యారని చెప్పారు. అయితే.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మాత్రం కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాస్తా చీకట్ల తెలంగాణాగా మారిపోయిందన్నారు. -
కేసీఆర్‌కు కాంగ్రెస్ సవాల్
-
నోట్ల రద్దుపై కాంగ్రెస్ గరం గరం
-
సీఎం చంద్రబాబు దళిత ద్రోహి : మేరుగ
-
బాబు తన తప్పును అంగీకరించక తప్పదు
-
భవిష్యత్తులో గెలవరని అర్దమైపోయింది