
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. లక్ష కోట్ల ప్రజల సొమ్ముతో ఆ ప్రాజెక్టును ఎందుకు కట్టినట్టు అని నిలదీశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు.
ఇబ్రహీంపట్నంకు చెందిన మాజీ ఎమ్మార్వో రవికుమార్, నారాయణపేట్ జిల్లాకి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మదివల కృష్ణ, ముషీరాబాద్ టీఆర్‌ఎస్ నాయకుడు మహ్మద్ ముజాహిద్, నాగసముద్రంకు చెందిన ఎల్లప్ప తమ అనుచరులతో కలసి షర్మిల సమక్షంలో పార్టీ కండు వా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార పార్టీ నిరంకుశ పాలనతో విసిగిపోతున్న టీఆర్‌ఎస్ నాయకులు సైతం వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరేందు కు ముందుకొస్తున్నారన్నారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌టీపీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment