
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు , ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన ఏపీ బంద్( ఏప్రిల్ 16న)కు ప్రజల నుంచి వస్తోన్న మద్ధుతును చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు జరిగే బంద్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజయవంతం చేస్తాయని తెలిపారు.
బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. బంద్‌లో పాల్గొంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని వెల్లడించారు. బంద్‌ను అన్నివిధాలా విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment