samineni udayabhanu
-
చంద్రబాబు హయాంలో రైతులు కరవుతో ఇబ్బందులు పడ్డారు : ఉదయభాను
-
మాపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు
-
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భూభాగం గుండా టీఎస్ పోలీసులు అనుమతించకపోవటంతో కృష్ణా జిల్లా ముత్యాల నుండి గుంటూరు జిల్లా మాదిపాడుకు కృష్ణా నదిలో పడవ ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు సామినేని చేరుకున్నారు. అడ్డుకోవడం దారుణం... పులిచింతల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని.. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవకుండా విద్యుదుత్పత్తి వల్ల నీరు వృథా అవుతోందన్నారు. విభజన హామీలను తెలంగాణ తుంగలో తొక్కుతోందని.. బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఉదయభాను అన్నారు. ‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారు. తెలంగాణలోనే వైఎస్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. తెలంగాణ మంత్రులు నేతలు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. వైఎస్ గురించి మాట్లాడిన మాటలు సబబు కాదు. కేసీఆర్ కూడా ఈ అంశంపై పునరాలోచించాలి. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీ వృధా చేశారు. ఒక టీఎంసీ పదివేల సాగుకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 75 టీఎంసీలు వృధా చేశారు. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. దేవుడు చెప్పినా వినం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని’’ సామినేని హితవు పలికారు. -
నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని
సాక్షి, కృష్ణా జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏకపక్ష ధోరణి సరికాదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన దుయ్యబట్టారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’ రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కరోనా ప్రారంభ దశలో ఎన్నికలు నిలిపివేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో చర్చించాలని, ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థన పరిగణనలోకి తీసుకుని ఎన్నికలపై పునరాలోచించాలని సామినేని ఉదయభాను కోరారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్) -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 30మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారందరినీ పడినవారిని చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ...క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై డ్రైవర్ దగ్గర కనీసం సమాచారం కూడా లేదన్నారు. ప్రయాణికుల పేర్లు, వివరాలు...కనీసం ఫోన్ నెంబర్లు కూడా లేవని అన్నారు. తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నియమ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. -
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నాని
సాక్షి, కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో ఈనెల 21న సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవిలత, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపడుతోంది. బ్రిటిష్ కాలంలో ఉన్న సర్వేలతోనే నేటి వరకు రికార్డులు ఉన్నాయి. రైతుల మధ్య సరిహద్దు గొడవలు ఉండటం, కోర్టులు చుట్టూ తిరిగి సమయం వృధా, ధనం వృధా అవుతోంది. వీటి శాశ్వత పరిష్కారం కోసం అత్యాధునిక పరికరాలతో శాటిలైట్ ద్వారా ఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నాము. వివాదాలు లేకుండా చేసి ఆస్తిపై యజమానులకు హక్కు కల్పించే దిశగా ఈ సర్వే జరుగుతుంది' అని మంత్రి నాని వెల్లడించారు. ప్రభుత్వవిప్ ఉదయభాను మాట్లాడుతూ.. ప్రతి రైతుకు భూమిపై హక్కు కల్పించే విధంగా సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు సీఎం నిర్ణయించారు. ప్రతీ ఇంటిని కూడా సర్వే నిర్వహించి శాశ్వత హక్కు కల్పించే విధంగా కార్డులు జారీ చేయడం జరుగుతుంది' అని ఉదయభాను తెలిపారు. -
'మహిళలను జీవితాలను మార్చడానికే ఆ పథకం'
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 60, 62వ డివిజన్లలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిధిగా హాజరై వైఎస్సార్ ఆసరా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీరో వడ్డీ, ఆసరా, చేయూత వంటి పథకాలతో సీఎం జగన్ పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచారు. సెంట్రల్ నియోజక వర్గంలో ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో 130 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు ఇవ్వనున్నారు. మొదటి విడతలో రూ.28 కోట్లు జమచేశారు. మహిళల జీవన స్థితిగతులను మెరుగు పరచాలని సీఎం ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అభివృద్ధి పథంలో పాలన చేస్తుంటే ప్రతిపక్షాలు ఆటంకాలు సృష్టిస్తున్నాయి. వ్యవస్థలను మ్యానేజ్ చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు' అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. (దమ్ముంటే విచారణ చేయండి అన్నారు) ►కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణం నకాశి బజార్లో 12, 13 వార్డు సచివాలయాల్లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలో 740 స్వయం సహాయక సంఘాలకు 6 కోట్ల రూపాయల చెక్కును పంపిణీ ప్రభుత్వ విప్ ఉదయభాను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సామినేని వెంకట కృష్ణ ప్రసాద్, తన్నీరు నాగేశ్వరరావు, ముత్యాల వెంకటాచలం, తుమ్మల ప్రభాకర్, కటారి హరిబాబు పాల్గొన్నారు. ►పెనమలూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా మహిళలు... సీఎం వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాము అని తెలిపారు. -
‘తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదు’
సాక్షి, విజయవాడ: కుల రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదన్నారు.‘‘ ప్రమాదం జరిగినప్పుడు బాధితులను పరామర్శించాల్సిన చంద్రబాబు హైదరాబాద్‌లో దాగున్నాడు. చంద్రబాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎందుకు ఉంటుంది. ఆయనకు అందరూ సమానమే. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే 10 మంది ప్రాణాలు కోల్పోయారని’’ జోగి రమేష్ ధ్వజమెత్తారు. (చదవండి: ఆయన ‘ఎల్జీమర్’తో బాధపడుతున్నారు) చంద్రబాబుది ద్వంద్వ విధానం: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాన్ని పాటిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో యాజమాన్యాన్ని అరెస్ట్ చేయమని డిమాండ్‌చేసిన చంద్రబాబు.. రమేష్ ఆసుపత్రి ప్రమాదంలో యాజమాన్యాన్ని వెనకేసుకువస్తున్నారని విమర్శించారు. ఆయన పార్టీ నాయకుడు కాబట్టే డాక్టర్ రమేష్‌ను చంద్రబాబు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ముఖ్యమంత్రి చేయనంత సాయాన్ని ఎల్జీ పాలిమర్స్, స్వర్ణప్యాలెస్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ చేశారని ఎమ్మెల్యే సామినేని తెలిపారు. -
'నా ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు'
సాక్షి, కృష్ణా: కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తనకు జూలై 26వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రజలు ఎవరూ కూడా తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పద్నాలుగు రోజుల హోం ఐసొలేషన్ తర్వాత కరోనా పరీక్ష చేయించడంతో నెగిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా పరీక్షలు చేసుకున్న వ్యక్తులు రిపోర్టులు వచ్చేంత వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వ్యక్తులు వారి ప్లాస్మాని మరొకరికి దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి) -
అందుకు ఈ రహస్య భేటీ నిదర్శనం: ఉదయభాను
సాక్షి, కృష్ణా: ముగ్గురు చౌదరీల రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల రహస్య భేటీ వెనక కుట్రకోణం ఉందన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటపడటంతో నిమ్మగడ్డ బండారం బట్టబయలైందన్నారు. చంద్రబాబు చేతుల్లో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారాడన్న అనుమానం నిజమని తేలిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌పై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. (నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్) ఇక సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నిపుణుడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనుషులను వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారనేందుకు రహస్య భేటీ ఓ నిదర్శనమని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు వినే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను అనైతికంగా వాయిదా వేశారని మరోసారి ప్రస్తావించారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) -
ఎల్లో మీడియాది తప్పుడు ప్రచారం : శ్రీదేవి
సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుర్తుచేశారు. వైఎస్సార్సీసీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రయోజనాలు కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని ఉపయోగించాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చేరువయ్యేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం తలెత్తుకునేలా చేశారని అన్నారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రుల వచ్చారు.. వెళ్లారు.. కానీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ప్రీ కరెంట్ వంటి పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే బాటలో ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తృతం చేయడమే కాకుండా.. చికిత్స తర్వాత కూడా విశ్రాంతి తీసుకుంటున్నవారికి భృతి కల్పిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాడానికి సంకల్పించారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్నా భోజనం అందుతుదని పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడితో నిజమైన రాష్ట్ర ప్రజలకు ముందుగానే సంక్రాంతి పండగ వచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ విద్యా దీవెన, విద్యా వసతితో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు వరంగా మారాయని చెప్పారు. భావితరాలకు అమ్మ ఒడి పథకం ఎంతో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబుకు ఎమ్మెల్యే రజనీ చురకలు ‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’ హీనమైన చరిత్ర టీడీపీది: సీఎం జగన్ టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా -
ఆ భయంతోనే బాబు దాడులు చేయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు పిన్నెల్లి కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడాన్ని సర్వత్రా నాయకులు, ప్రజలు ఖండిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు. రైతుల ముసుగులో తెలుగుదేశం గూండాలే ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయన్న భయంతోనే చంద్రబాబు తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని, అమరావతిలో భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ముందుకువెళ్తుంటే.. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై దాడులకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ దాడి కచ్చితంగా టీడీపీ గూండాల పనేనని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు నీచరాజకీయాలు చేస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేవిధంగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలతో చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకొంటుందన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి పందల చర్య అని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన పేర్కొన్నారు. -
వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం : మంత్రి
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ శాసనసభ మూడోరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ సమాధానమిచ్చారు. కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్‌తో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాటసాని కోరగా.. కర్నులు జిల్లాలోని శకునాల గ్రామంలో సోలార్ పార్క్ కోసం భూసేకరణ పూర్తయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని చెప్పారు. క్లీనింగ్‌కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై చర్చించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. మంత్రుల కమిటీని నియమించాం.. ఎయిడెడ్ కాలేజీల్లోపనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. వారికి కనీసం రూ.20 వేల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే విషయమై ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని నియమించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్టూడెంట్స్, టీచర్స్ నిష్పత్తి కారణంగా నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయని అన్నారు. త్వరలోనే వీటన్నింటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరుస్తామని మంత్రి చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. -
‘మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి ’
సాక్షి, కృష్ణా: జగ్గయ్యపేట పట్టణంలో ప్రభత్వవిప్ సామినేని ఉదయభానుతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధాన్ని విధించి మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని గుర్తు చేశారు. ఉదయభాను మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పరిపాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామినేని ప్రశాంత్ బాబు, తన్నీరు నాగేశ్వరావు, జాన్ వెస్లీ, వేల్పుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జగ్గయ్యపేట ముంపు గ్రామాల్లో సామినేని పర్యటన
సాక్షి, కృష్ణా: కృష్ణా నది వరదల నేపథ్యంలో జగ్గయ్యపేట మండలంలో ముంపుకు గురైన రావిరాల, వేదాద్రి, ముక్త్యాల గ్రామాలలో ప్రభుత్వ విప్ సామనేని ఉదయభాను శనివారం పర్యటించారు. రావిరాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ముంపుకు గురైన వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలను పరిశీలించారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేoద్రాలను, మెడికల్ క్యాంప్‌లను సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఉదయభాను తన సొంత ఖర్చుతో వరద బాధితులకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన కుమారులు వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబులు సైతం ముంపు గ్రామాలను సందర్శించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ వరదల వల్ల ఇళ్ళు కోల్పోయిన వారిని ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులతో విచారణ చేయించి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తామని ఉదయ భాను అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం జరిగిందని, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే వైయస్సార్ సీపీ పార్టీ శ్రేణులు వరద ముంపుకు గురైన గ్రామాలలోని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఉదయభాను పిలుపునిచ్చారు. రావిరాలలో వరద ముంపు బాధితులకు వైఎస్సార్సీపీ శ్రేణులు పులిహోర పొట్లాలు పంపిణీ చేశాయి. -
‘భూమిపై అన్నిరకాల హక్కులు రైతులకే’
సాక్షి, అమరావతి : భూమిపై అన్నిరకాల హక్కులు యజమానికే ఉంటాయని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పంటమీద మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందని చెప్పారు. కౌలు రైతుల రక్షణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లును ప్రవేశపట్టిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... భూ యనమానుల హక్కులకు నష్టం కలగకుండా కౌలు రైతులకు రక్షణ కల్పించేలా చట్టం రుపొందించామని తెలిపారు. భూ యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ఈ బిల్లుతో ప్రయోజనం ఉంటుందన్నారు. గతంలోని కౌలుదారి చట్టం వలన భూ యజమానులకు అభద్రతాభావం ఏర్పడిందని, అందుకే కౌలు రైతులను యజమానులు నమ్మలేదన్నారు. తాము తెచ్చిన నూతన చట్టం వలన ఇద్దరికి మేలు చేస్తుందన్నారు. భూ రికార్టుల్లో ఎక్కడా కూడా కౌలు రైతు పేరు ఉండదన్నారు. పంటరుణం తప్ప మిగిన రుణాలన్ని భూ యజమాని తీసుకోవచ్చని తెలిపారు. రైతు భరోసా, పంట రుణాలు సాగుదారులకే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమై చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుతుంది : ధర్మాన పంటసాగుదారుల రక్షణ చట్టం తేవడం మంచి పరిణామమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ చట్టం ద్వారా అన్ని సబ్సిడీలు కౌలు రైతుకు అందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందజేసే సహాయం నిజమైన రైతులకు అందేలా చట్టం తీసుకొచ్చారని ప్రశంసించారు. సమాజంలో కలిసిపోయిన నాయకుడే ఇలాంటి చట్టాలు తీసుకురాగలరని అన్నారు. పీవోటీ యాక్ట్ పరిధిలోని భూములను సాగుచేస్తున్న రైతులు కూడా లాభపడేలా ఈ చట్టంలో సవరణ తీసుకురావాలని కోరారు. రైతులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ : సామినేని పంటసాగుదారుల రక్షణ చట్టంతో యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను అన్నారు. కౌలు రైతులకు కార్డులే కాకుండా హక్కులు కూడా కల్పించడం శుభపరిణామమన్నారు. ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులకు అందేలా చట్టబద్ధత కల్పించామన్నారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ సీఎం జగన్ రైతుకు అండగా నిలిచారని ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. -
జగ్గయ్యపేటలో పేట్రేగిపోతున్న ఇసుకమాఫియా
-
బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ కుట్రలు
-
అందుకే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ, వామపక్షాలు , ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన ఏపీ బంద్( ఏప్రిల్ 16న)కు ప్రజల నుంచి వస్తోన్న మద్ధుతును చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు జరిగే బంద్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు విజయవంతం చేస్తాయని తెలిపారు. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. బంద్‌లో పాల్గొంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని వెల్లడించారు. బంద్‌ను అన్నివిధాలా విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతారని విమర్శించారు. -
న్యాయమే గెలిచింది: సామినేని
సాక్షి, కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందని వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయబాను అన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చాలా కుట్రలు చేసిందని తెలిపారు. తమ పార్టీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్‌లో మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. -
సామినేని ఉదయభానుకు వైఎస్ జగన్ పరామర్శ
జగ్గయ్యపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభానును పరామర్శించారు. సామినేని ఉదయభాను తండ్రి సామినేని విశ్వనాథం అస్వస్థతతో ఇవాళ ఉదయం మృతి చెందారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పంచాయతీ కి సామినేని విశ్వనాధం ఇరవై రెండు సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేశారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. జగ్గయ్యపేట కు ఆయన హయాంలోనే రక్షిత మంచినీటి పథకం, విద్యా, వైద్యశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో విశ్వనాధంకు అత్యంత సాన్నిహిత్యం వుంది. ఆయన అకాల మరణ వార్త తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ హుటాహుటిన జగ్గయ్యపేటకు చేరుకుని ఉదయభాను కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాధం మృతదేహానికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే రక్షణనిధి, జోగి రమేష్, సింహాద్రి రమేష్, గౌతం రెడ్డి, తోట శ్రీనివాస్, ఉప్పాల రాము తదితరులు విశ్వనాథం మృతదేహానికి నివాళి అర్పించారు. -
డీజీపీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
విజయవాడ: వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేశ్, సామినేని ఉదయభాను, అరుణ్ కుమార్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావును కలిశారు. నందిగామ పర్యటన సందర్భంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డీజీపీని కోరారు. అకారణంగా తమ పార్టీ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించారని డీజీపీకి వివరించారు. -
‘ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారు’
విజయవాడ: క్విట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం పేరుతో చంద్రబాబు నాయుడును త్వరలోనే తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనే విద్యార్థులను జైల్లో పెడతాననడం అమానుషమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. టీడీపీ శాసనసభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సామినేని ఉదయభాను విమర్శించారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోడెల శివప్రసాదరావు తనయుడు ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రత్యేకహోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యునిగా చంద్రశేఖర్
♦ ప్రధాన కార్యదర్శిగా సామినేని ♦ యువజన విభాగం అధ్యక్షునిగా జక్కంపూడి రాజా నియామకం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యునిగా గుంటూరు జిల్లాకు చెందిన గుబ్బా చంద్రశేఖర్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రశేఖర్ గతంలో ఏపీపీఎస్సీ సభ్యునిగా పనిచేశారు. కాగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానును రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి రాజాను రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా, విజయవాడ వెస్ట్‌కు చెందిన పైలా సోమినాయుడును రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా జగన్మోహన్రెడ్డి నియమించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. విజయవాడ సిటీ అధ్యక్షునిగా రాధా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర విభాగం అధ్యక్షునిగా వంగవీటి రాధాకృష్ణను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు పార్టీ కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అధికార పార్టీ ఆదేశాలతోనే అరెస్టులు
వైఎస్సార్ సీపీ నాయకుడు సామినేని జగ్గయ్యపేట అర్బన్ : వైఎస్సార్ సీపీకి చె ందిన సానుభూతి పరుల వ్యాపారం అనే దుగ్ధతతోనే అధికారపార్టీ వారు పోలీసులతో అక్రమంగా కేసులు నమోదు చేయిస్తూ అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉదయభాను విలేకరులతో మాట్లాడుతూ చైర్మన్ తన్నీరు అక్రమ అరెస్ట్ అప్రజాస్వామ్యమన్నారు. అధికార పార్టీ నేతలు రెండేళ్లుగా నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం సిటీ కేబుల్ తెలుగుదేశం వారికి సంబంధించింది కావడంతో తమ పార్టీవారి ప్రకటనలు తీసుకోవడంలేదని, దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులైన కొందరికి ఉపాధికోసం కోటి రూపాయల వ్యయంతో ఆరు నెలల క్రితం సిటీకేబుల్ ప్రసారాలను ప్రారంభించామన్నారు. దీనిని సహించని అధికార పక్షం వారు తమ కేబుల్ వైర్లు కత్తిరించడం, ప్రసారాలకు ఆటంకం కలిగిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. సాంకేతిక పరంగా టౌన్ వరకే పెట్టామని, హైదరాబాద్ స్టేట్ కేబుల్ వారి మౌఖిక ఆదేశాలతో వారం క్రితం దేచుపాలెం, మంగొల్లు, తొర్రగుంటపాలెం, బలుసుపాడు గ్రామాలలో కనెక్షన్లు ఇచ్చామని, ఇది సహించలేక రూరల్‌లో కూడా ప్రసారం చేస్తున్నారని జెమినీ వారితో ఫిర్యాదు చేయించారన్నారు. దీంతో 24 గంటలలోనే కనెక్షన్లు తొలగించామని, ఇది చెప్పకోతగ్గ ఆర్థిక, పైరసీ వంటి నేరం కానప్పటికీ, ఫిర్యాదుదారుడు ఫిర్యాదు వెనక్కు తీసుకుంటామని చెప్పినప్పటికీ 420 కింద అరెస్ట్ చేయడం దారుణమన్నారు. డీఎస్పీపై ఫిర్యాదు చేస్తాం నందిగామలో డీఎస్పీ రాధేష్‌మురళి వంటి అధికారిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. న్యాయాన్ని,ధర్మాన్ని కాపాడవలసిన అధికారి టీడీపి నాయకుడిగా వ్యవహరిస్తూ తమ పార్టీని అణగదొక్కాలని చూడటం విచారకరమన్నారు. టీడీపీ నేతల ఇసుక మాఫియా వారిని పట్టించినప్పటికి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. డీఎస్పీ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.