వైఎస్సార్‌సీపీ జిల్లా, సిటీ అధ్యక్షులుగాభాను, జలీల్‌ఖాన్ | ysrcp District, City Chiefs Bhanu, jalilkhan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జిల్లా, సిటీ అధ్యక్షులుగాభాను, జలీల్‌ఖాన్

Published Mon, Feb 3 2014 1:05 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

వైఎస్సార్‌సీపీ జిల్లా, సిటీ అధ్యక్షులుగాభాను, జలీల్‌ఖాన్ - Sakshi

వైఎస్సార్‌సీపీ జిల్లా, సిటీ అధ్యక్షులుగాభాను, జలీల్‌ఖాన్

సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడిగా జలీల్‌ఖాన్ ఎంపికయ్యారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆ పార్టీ రెండో ప్లీనరీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు వారు ఆ స్థానాల్లో కన్వీనర్లుగా వ్యవహరించారు. ఇకపై వీరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

ఉదయభాను, జలీల్‌ఖాన్‌లు కన్వీనర్లుగా నియమితులైనప్పటి నుంచి ఇప్పటివరకు విజయవాడ సహా జిల్లాలో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఇచ్చిన పిలుపులన్నింటినీ జయప్రదం చేశారు. సమైక్యాంధ్ర కోసం జరిగిన పోరాటాల్లో విరివిగా పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను జయప్రదం చేయడంలో కృషిచేశారు. అధ్యక్షులుగా ఎంపికైన సందర్భంగా వారు జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల కైవసానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement