YSRCP MP Vijaya Sai Reddy Slams Chandrababu and His Son - Sakshi
Sakshi News home page

తండ్రి కొడుకులకు తగిన బుద్ధి చెప్తాం.. విజయసాయిరెడ్డి హెచ్చరిక

Published Fri, Jun 10 2022 1:12 PM | Last Updated on Fri, Jun 10 2022 2:00 PM

YSRCP MP Vijaya Sai Reddy Slams Chandrababu and His Son - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోం శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తాన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు సంవత్సరం ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయన్నారు. పార్టీ ఆఫీస్‌ అంటే దేవాలయం లాంటిదని మా నమ్మకమన్నారు.

ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది. మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు. తండ్రి కొడుకులు బుద్ది మార్చుకోకపోతే మేము తగిన బుద్ది చెప్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.  

వాస్తవాలు తెలుసుకోండి
నిన్నటిది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరింతగా ఎదురుదాడి చేస్తాం. అందుకే ఇకనైనా పద్దతులు మార్చుకోండి. టెన్త్ ఫెయిల్ అవటానికి కారణాలు తెలుసుకోవాలేగానీ సీఎంని తిట్టాల్సిన పనేంటి?. కుసంస్కారంతో మా నాయకులను తిట్టించకుండా వాస్తవాలు తెలుసుకోండి. ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహరించండి. లోకేష్ సవాల్‌ని స్వీకరిస్తున్నాం. చర్చకు రావాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు వచ్చినా సరే చర్చకు మేము సిద్దం. జూమ్‌లో మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. 

చదవండి: (తిరుమల: మే నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం)

పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా?
ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వర్తించే కార్యక్రమాలు చేస్తోంది. అందుకే టీడీపీకి కడుపుమంట. కుప్పంలో కూడా ఓడిపోయినప్పుడే మాకు 175 గ్యారెంటీగా వస్తాయని నమ్మకం ఉంది. మీకు దమ్ముంటే ఆత్మకూరులో పొటీ చేసి రెఫరెండం కోరండి. అసలు పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా?. టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితేనే వంశీ, కొడాలి నాని, రజని ఎంటర్ అయ్యారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి?. ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉంటే వారింటికి వెళ్లి ఓదార్చాలి.

అంతేగానీ రాజకీయాలు చేయటం కరెక్టు కాదు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. మా కార్యకర్తలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఏ నాయకుడూ కార్యకర్తలను వదులుకోలేరు. కార్యకర్తలు, నాయకుల వలనే 2019లో అధికారంలోకి వచ్చామని విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గెలుపు కోసం పని చేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తానేటి వనిత అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రిగా జిల్లాలో గెలుపుకోసం నావంతు కృషి చేస్తానని అన్నారు. 

జిల్లా కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. కొత్తగా పార్టీ ఆఫీసు ప్రారంభం సంతోషించదగిన విషయం. నాయకులంతా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కార్యకర్తల సమస్యల కృషికి పనిచేస్తాం. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పని చేస్తాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో సమన్వయం చేసుకుంటామని మర్రి రాజశేఖర్‌ అన్నారు.

చదవండి: (AP TET Notification 2022: ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement