
సాక్షి, తాడేపల్లి: టీడీపీపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, టీడీపీ అడాన్ కంపెనీపై దుష్ర్పచారం చేస్తున్నారు. మా కుటుంబానికి అడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. ఆయనకు చెందిన ఇతర కంపెనీల్లో అవినీతి జరిగింది.
హెరిటేజ్ ఫుడ్స్‌లో వడ్లమూడి నాగరాజు డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి కూడా ఆ కంపెనీలతో సంబంధం ఉన్నట్టేనా?. రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనవసరంగా అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోము. పరిధి దాటవద్దని చంద్రబాబు, లోకేష్‌కు వార్నింగ్ ఇస్తున్నాను. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారు. మా పార్టీపై బురద జల్లడం మానుకోవాలి. కార్పొరేట్ రంగంలో చంద్రబాబుకు ఉన్న చర్రిత మరెవరికీ లేదు. వరసకు చంద్రబాబు నాకు అన్న అవుతారు. నా భార్య బంధువును తారకరత్న పెళ్లి చేసుకున్నారు. అలా అయితే చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా?.
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు. ఆకాశంపై ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది చంద్రబాబు. ముత్తురాజు విజయకుమార్‌కు సత్యం కంపెనీతో సంబంధం ఉంది. ముత్తురాజుకు మీ కంపెనీలతో సంబంధం ఉంది. అలాంటప్పుడు మీకు సత్యం కంపెనీతో సంబంధం ఉన్నట్టేనా?. ఏదో ఒక రకంగా బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మానుకోవాలి’’ అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: గోదావరి వరదలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
Comments
Please login to add a commentAdd a comment