marri raja sekhar
-
లోకేష్ సవాల్‌ని స్వీకరిస్తున్నాం.. ఎవరొచ్చినా సరే: విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోం శాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తాన్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు సంవత్సరం ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయన్నారు. పార్టీ ఆఫీస్ అంటే దేవాలయం లాంటిదని మా నమ్మకమన్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది. మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి. అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు. తండ్రి కొడుకులు బుద్ది మార్చుకోకపోతే మేము తగిన బుద్ది చెప్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోండి నిన్నటిది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరింతగా ఎదురుదాడి చేస్తాం. అందుకే ఇకనైనా పద్దతులు మార్చుకోండి. టెన్త్ ఫెయిల్ అవటానికి కారణాలు తెలుసుకోవాలేగానీ సీఎంని తిట్టాల్సిన పనేంటి?. కుసంస్కారంతో మా నాయకులను తిట్టించకుండా వాస్తవాలు తెలుసుకోండి. ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహరించండి. లోకేష్ సవాల్‌ని స్వీకరిస్తున్నాం. చర్చకు రావాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు వచ్చినా సరే చర్చకు మేము సిద్దం. జూమ్‌లో మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. చదవండి: (తిరుమల: మే నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం) పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా? ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వర్తించే కార్యక్రమాలు చేస్తోంది. అందుకే టీడీపీకి కడుపుమంట. కుప్పంలో కూడా ఓడిపోయినప్పుడే మాకు 175 గ్యారెంటీగా వస్తాయని నమ్మకం ఉంది. మీకు దమ్ముంటే ఆత్మకూరులో పొటీ చేసి రెఫరెండం కోరండి. అసలు పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా?. టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితేనే వంశీ, కొడాలి నాని, రజని ఎంటర్ అయ్యారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి?. ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉంటే వారింటికి వెళ్లి ఓదార్చాలి. అంతేగానీ రాజకీయాలు చేయటం కరెక్టు కాదు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. మా కార్యకర్తలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఏ నాయకుడూ కార్యకర్తలను వదులుకోలేరు. కార్యకర్తలు, నాయకుల వలనే 2019లో అధికారంలోకి వచ్చామని విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గెలుపు కోసం పని చేస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తానేటి వనిత అన్నారు. ఇన్‌ఛార్జి మంత్రిగా జిల్లాలో గెలుపుకోసం నావంతు కృషి చేస్తానని అన్నారు. జిల్లా కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. కొత్తగా పార్టీ ఆఫీసు ప్రారంభం సంతోషించదగిన విషయం. నాయకులంతా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కార్యకర్తల సమస్యల కృషికి పనిచేస్తాం. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పని చేస్తాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో సమన్వయం చేసుకుంటామని మర్రి రాజశేఖర్ అన్నారు. చదవండి: (AP TET Notification 2022: ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల) -
అభివృద్ధికి చిరునామా వైఎస్సార్
జయంతి వేడుకలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి పట్నంబజారు(గుంటూరు) : అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరునామాగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. మహానేత వైఎస్సార్ 66వ జయంతిని పురస్కరించుకుని బుధవారం గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలు చరిత్ర పుటల్లో నిలిచిపోయాయన్నారు. రాష్ట్రం లో ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ఉన్నాననే ధైర్యం కల్పించిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండేవే కాదన్నారు. రైతుల ఆత్మహత్యలు లేకుండా, మహిళల కన్నీరు తుడిచిన మహ నీయుడని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గుండె మహానేత పాలన కావాలని కోరుకుంటోందని చెప్పారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో యువతకు పెద్దపీట వేశారన్నారు. లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పేద వర్గాలకు బాసటగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్ అని కొనియాడారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద మహిళను లక్షాధికారిగా చూడాలని ఆశపడిన మహనీయుడని చెప్పారు. బీసీ, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు కోవూరి సునీల్, బండారు సాయిబాబు మాట్లాడుతూ దళిత, బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు పంచిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, అత్తోట జోసఫ్. ఎం దేవరాజు, కోటా పిచ్చిరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, పెదాల బాబు, సుంకర రామాంజనేయులు, మేళం ఆనందభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌పై విమర్శలు చేస్తే ప్రతిఘటన తప్పదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు (గుంటూరు) : ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మధ్య నడుస్తున్న వివాదంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రతిఘటన తప్పదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ హెచ్చరించారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పరకాల ప్రభాకర్ అది చంద్రబాబు గొంతు కాదని ఒకసారి, ట్యాపింగ్ చేశారని మరోసారి అంతుపట్టని విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జగన్ గురించి మాట్లాడటం గురివింద గింజ సామెతను తలపిస్తోందని, ఆయన పుండాకోరు మాటలు మానుకోవాలని హితవు పలికారు. మంత్రి దేవినేని ఉమా తాటతీస్తామని వ్యాఖ్యలు చేశారని, ప్రస్తుతం వారి తాట తీసే పనిలో ఏసీబీ, తెలంగాణ ప్రభుత్వం ఉన్నాయని చెప్పారు. దేవినేని ఉమా సంస్కారం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు మొదటి నుండి వంకరటింకరగా మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీలో కనపడ్డ కేంద్రనేతల కాళ్లు చంద్రబాబు పట్టుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఎంత నీతి, నిజాయితీ పరుడో ప్రజలకు అర్ధమైందని, విచారణకు వెళ్లే దమ్ము లేక ఫోన్ ట్యాపింగ్‌లంటూ కాకమ్మ కథలు చెబుతున్నారన్నారు. మంత్రులు అవాకులుచవాకులు పేలితే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పదవికి, ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మరణశాసనం రాసుకున్నారని, న్యాయస్థానం, ప్రజల ముందు నేరస్తుడిగా నిలబడటం తథ్యమన్నారు. నేతలు కొత్తా చిన్నపరెడ్డి, బండారు సాయిబాబు, ఉప్పుటూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ అరాచకాలపై వైఎస్సార్ సీపీ కన్నెర్ర
గుంటూరులో వైఎస్సార్ సీపీ కార్యకర్తల బైక్‌ర్యాలీ సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ గుంటూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని హిందూ కళాశాల నుంచి ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ గుండాగిరీని నిరసించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సత్తెనపల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక కేడర్‌లో మనోధైర్యం నింపేందుకు పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ ముఖ్య నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జ్యోతుల నెహ్రూ, జలీల్‌ఖాన్‌లను గుంటూరుకు పంపారు. ఈ ప్రతినిధి బృందం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సోమవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని, ముప్పాళ్ల ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం సోమవారం ట్రైనీ కలెక్టర్ శివశంకర్, అర్బన్ ఎస్పీ జెట్టీ గోపీనాథ్, రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణను కలిసి టీడీపీ దౌర్జన్య కాండను వివరించింది. -
మంత్రి ప్రోద్బలంతోనే కిడ్నాప్!
చిలకలూరిపేట: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతోనే ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. బుధవారం ఆయన, పార్టీ నాయకులతో కలిసి రూరల్ సీఐ సంజీవ్‌కుమార్‌ను కలిశారు. మంగళవారం కిడ్నాప్ అయిన ఎంపీటీసీల కేసు దర్యాప్తు విషయంపై ప్రశ్నించారు. మంగళవారం రాత్రి చిలకలూరిపేట మండలం యడవల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుంటుపల్లి శ్రీనివాసరావును కొంతమంది కిడ్నాప్ చేయటం, మురికిపూడి2 వైఎస్సార్సీపీ ఎంపీటీసీ జమ్మలమడల కృష్ణను ఊరి నుంచి కొంతమంది బలవంతంగా తీసుకెళ్లారని గ్రామస్తులు చెప్పిన వివరాలపై కేసులు నమోదైన విషయం విదితమే. త్వరితగతిన కేసును ఛేదించాలని, కిడ్నాప్‌లకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మర్రి కోరారు. అనంతరం పోలీస్‌స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీపీకి తగిన బలం ఉందని, కానీ దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకొనేందుకు టీడీపీ వర్గీయులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సహాయసహకారాలతోనే ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని, ఇందుకు మంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నెలరోజుల పరిపాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు పెచ్చుపెరిగాయని, ప్రశాంతంగా ఉండే నియోజవర్గంలో చిచ్చుపెడుతున్నారన్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేట, నాదెండ్ల పార్టీ కన్వీనర్లు ఏవీఎం సుభానీ, కాట్రగడ్డ మస్తాన్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ అబ్దుల్ రౌఫ్, షేక్ సైదావలి, న్యాయవాదులు తోట శ్రీనివాసరావు, విడదల హరనాథ్‌బాబు, పార్టీ నాయకులు బైరావెంకటకృష్ణ, చిరుమామిళ్ల కోటిరెడ్డి, బైరింగ్ మౌలాలి, సాతులూరి కోటి, గుంజి వీరాంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు విజయమ్మ
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో శనివారం నుంచి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన వివరాలను జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం శుక్రవారం ప్రకటించారు. విజయవాడనుంచి రోడ్డుమార్గం గుండా శనివారం గుంటూరు జిల్లాలోకి వై.ఎస్.విజయమ్మ అడుగుపెడతారు. తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే పర్యటన గుడివాడ, కోపల్లె, అంగలకుదురు మీదుగా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు నుంచి అమృతలూరు మండలంలో ప్రవేశిస్తారు. మోపర్రు, తురిమెళ్ళ, అమృతలూరు, గోవాడ, యలవర్రు, ఇంటూరు గ్రామాల మీదుగా బాపట్ల నియోజకవర్గంలోకి చేరుకుంటారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే వైఎస్సార్ జనభేరి సభలో విజయమ్మ ప్రసంగిస్తారు. 13వ తేదీన పత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో జరిగే వైఎస్సార్ జనభేరి సభలో విజయమ్మ పాల్గొంటారు. -
వైఎస్సార్ సీపీ విజయానికి కృషిచేస్తా
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల విజయం కోసం క్రియాశీలకంగా కృషిచేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాదు (రాము) చెప్పారు. ఈనెల 27న హైదరాబాద్‌లో జననేత వైఎస్జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం రామిరెడ్డిపేటలోని పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గృహంలో రాము విలేకరులతో మాట్లాడారు. జనభేరి సమయంలో తన కుటుంబంపై గౌరవంతో వైఎస్ జగన్మోహనరెడ్డిని తమ ఇంటికి తీసుకొచ్చినందుకు మర్రి రాజశేఖర్, డాక్టర్ శ్రీనివాసరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. జగన్ మాట ఇస్తే తప్పడనే విశ్వాసం తనకు ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ నల్లపాటి రామచంద్రప్రసాదు చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం ఖాయమని, రాముతోపాటు అందరినీ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్లపాటి కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర గజ్జల బ్రహ్మారెడ్డి, కపలవాయి విజయకుమార్, లాం కోటేశ్వరరావు, మేడికొండ నరసింహారావుచౌదరి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ విజయకేతనం ఖాయం
ఫ్యాన్ గుర్తును ప్రతి గడపకూ పరిచయం చేయండి పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సమన్వయకర్తల సమావేశంలో ప్రణాళిక రూపకల్పన విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ నాలుగేళ్లుగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుట్రలు పన్ని నిలిపి వేసిన స్థానిక ఎన్నికలను ఎట్టకేలకు సుప్రీంకోర్టు మొట్టికాయలతో ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఆదివారం అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయకర్తలు, కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 17 నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశంలో పాల్గొని రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు ఏవిధంగా కృషిచేయాలో ప్రణాళికను రూపొందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల నగారా మోగినందున తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ కేవలం ప్రజాసేవ, ప్రజల సంక్షేమం దిశగా ఎన్నికల బరిలోకి దిగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేయటం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన ఉప ఎన్నికలలో మాచర్ల, ప్రత్తిపాడుల్లో వచ్చిన భారీ మెజారిటీ నేడు రానున్న ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వస్తుందన్నారు. పార్టీ సింబల్ ఫ్యాను గుర్తుపైనే ఎన్నికలు జరుగనున్నాయన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళిక సిద్ధమైందని , కారకర్తలు నాయకులు పార్టీ గుర్తు ఫ్యాను సింబల్‌ను ప్రతి ఓటరుకు పరిచయం చేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మాట్లాడుతూ నాలుగేళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు భయపడ్డ ప్రభుత్వం గత్యంతరంలేక కేవలం రెండు నెలల వ్యవధిలోనే మూడు రకాల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కేవలం కాంగ్రెస్, టీడీపీ కుట్రల వల్లే ఈవిధంగా జరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల నీచమైన కుట్రలను ప్రజలు గమనించారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని తెలిపారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. రాజన్న కుమారుడు జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు రావి వెంకటరమణ, మేరుగ నాగార్జున, కోన రఘుపతి, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, జంగా కృష్ణమూర్తి, నన్నపనేని సుధ, బొల్లా బ్రహ్మనాయుడు, కత్తెర సురేష్‌కుమార్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నసీర్ అహ్మద్, షౌకత్, పార్టీ నాయకులు గోగినేని శ్రీనివాసరెడ్డి, గుదిబండ చిన వెంకటరెడ్డి, ముస్తఫా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
జగన్‌కోసం...
గుంటూరు వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన ఖరారు కావడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. జైలునుంచి విడుదలయ్యాక తొలిసారిగా జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ నెల ఆరో తేదీన నరసరావుపేటలో నిర్వహించే జనభేరి సభలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, వారి అనుచరులతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు. 7, 8 తేదీల్లో మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మృతిని తట్టుకోలేక అశువులు బాసినవారి కుటుంబాలను జగన్ ఓదార్చుతారు. జైలునుంచి విడుదలయ్యాక తొలిసారిగా... 2012 మే 24వ తేదీన మాచర్ల నియోజకవర్గం కారంపూడి బహిరంగ సభలో ప్రసంగించి ఠమొదటిపేజీ తరువాయి సీబీఐ విచారణకు జగన్ హాజరయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ కుటిల యత్నాల కారణంగా 16 నెలలు జైలు జీవితం గడపడంతో ప్రజలకు, పార్టీ కేడర్‌కు దూరయ్యారు. ఆ లోటును భర్తీ చేసేందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జననేత సోదరి షర్మిల పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ అండగా ఉన్నామనే భరోసా అటు ప్రజలకు, పార్టీ కేడర్‌కు కలిగించారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు, జననేత జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలసంక్షేమం కోసం ‘సమరదీక్ష’ను చేపట్టారు. సమైక్యాంధ్రకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని గత ఏడాది ఆగస్టులో ఈ దీక్షను చేపట్టారు. ఆ తరువాత డిసెంబరులో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభించిందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా ఒక రోజు దీక్ష చేపట్టారు. అంతకు ముందు(గత ఏడాది ఫిబ్రవరిలో) జగన్ వదిలిన బాణం షర్మిల జిల్లాలో 33 రోజులపాటు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రను నిర్వహించి ప్రజలకు బాసటగా నిలిచారు. సరైన ఆధారాలను సీబీఐ చూపించలేకపోవడంతో ప్రత్యేక కోర్టు జగన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచే జగన్మోహన్రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీ పటిష్టతపై దృష్టి సారించి రానున్న ఎన్నికలకు శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలవారీగా జనభేరిని నిర్వహిస్తున్నారు. జనభేరి పోస్టర్ విడుదల జిల్లాలోని నరసరావుపేటలో ఈ నెల ఆరున జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న జనభేరికి సంబంధించిన పోస్టర్‌ను చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వారిద్దరూ మాట్లాడుతూ జగన్పాలనలోనే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అందగలవని తెలిపారు. జిల్లాలోని నాయకులంతా ఆ నాటి సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
యుద్ధానికి సిద్ధం
ఎన్నికలకు వైఎస్సార్ సీపీ టీమ్ రెడీ.. సమష్టి కృషితో ఘన విజయం సాధిస్తాం ఆ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వెల్లడి చిలకలూరిపేట, న్యూస్‌లైన్: రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీమ్ సిద్ధమైందనీ. నాయకులు, కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేసి ఘనవిజయం సాధిస్తామని ఆ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వెల్లడించారు. చిలకలూరిపేటలో శుక్రవారం జరిగిన మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. తన కుటుంబంలో ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు గతంలోనే తెలిపామని, పూర్తి వివరాలను ఈ నెల 13న వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. సిటింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తిరిగి నరసరావుపేట నుంచే పోటీ చేస్తామని వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా అది ఆయన వ్యక్తిగత విషయమని, రాజకీయాలు, బంధుత్వం వేరని అయోధ్య పేర్కొన్నారు. తనది రాజకీయ కుటుంబమని, ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నరసరావుపేట లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో విభేదాలు లేవన్నారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అవి సర్దుకుంటాయన్నారు.