నేడు జిల్లాకు విజయమ్మ
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో శనివారం నుంచి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన వివరాలను జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం శుక్రవారం ప్రకటించారు. విజయవాడనుంచి రోడ్డుమార్గం గుండా శనివారం గుంటూరు జిల్లాలోకి వై.ఎస్.విజయమ్మ అడుగుపెడతారు.
తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే పర్యటన గుడివాడ, కోపల్లె, అంగలకుదురు మీదుగా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు నుంచి అమృతలూరు మండలంలో ప్రవేశిస్తారు. మోపర్రు, తురిమెళ్ళ, అమృతలూరు, గోవాడ, యలవర్రు, ఇంటూరు గ్రామాల మీదుగా బాపట్ల నియోజకవర్గంలోకి చేరుకుంటారు.
పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే వైఎస్సార్ జనభేరి సభలో విజయమ్మ ప్రసంగిస్తారు. 13వ తేదీన పత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో జరిగే వైఎస్సార్ జనభేరి సభలో విజయమ్మ పాల్గొంటారు.