వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవ్వాలి | ys Can be sealed the heart of constitutional loves | Sakshi
Sakshi News home page

వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవ్వాలి

Published Mon, Apr 21 2014 1:13 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవ్వాలి - Sakshi

వైఎస్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవ్వాలి

ఫ్యాను గుర్తుపై ఓటేసి జగన్‌ను సీఎం చేయాలి  విశాఖ జనభేరిలో విజయమ్మ
 
 విశాఖపట్నం: ‘‘అన్ని పార్టీలు మనల్ని టార్గెట్ చేస్తున్నాయి. జగన్‌బాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయి. రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవ్వాలి. పోలింగ్ బూతులోకి వెళ్లేటపుడు ఒక్కసారి దివంగత మహానేతను, ఆయన సంక్షేమ పాలన ను గుర్తు చేసుకోండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి. జగన్‌బాబును సీఎంగా చేసి రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం...’’

అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రజల కు పిలుపునిచ్చారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం విశాఖపట్నంలో వైఎస్సార్ జనభేరి రోడ్‌షో ల్లో ప్రసంగించారు. మండుటెండలు, తీవ్ర ఉక్కపోత వాతావరణంలోనూ ప్రజలు గంటల తరబడి రోడ్లమీద నిరీక్షించి ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. రాజన్న సతీమణికి మహిళలు మంగళహారతులు పట్టారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement