janapatham
-
డెబ్బై సంవత్సరాల తర్వాత వెలుగులు
-
జనపథం - శ్రీకాకుళం
-
జనపథం - విజయవాడ
-
జనపథం - కెకె కొట్టాల
-
జనపథం - చీమకుర్తి
-
జనపథం - తిరుపతి
-
జనపథం - దివిసీమ గ్రామాలు
-
జనపథం - విజయనగరం జిల్లా
-
జనపథం - నాగినాయని చెరువు తాండ
-
జనపథం - గోకవరం
-
జనపథం - విజినిగిరిపాలెం
-
జనపథం - తూర్పు గోదావరి
-
జనపథం - రుయా ఆస్పత్రి, తిరుపతి
-
జనపథం - ధర్మవరం
-
జనపథం - శ్రీకాకుళం
-
జనపథం -పాతనగరం విశాఖ జిల్లా
-
జనపథం - వంశధార నిర్వాసిత గ్రామం
-
జనపథం - పోలవరం ముంపు మండలాలు
-
జనపథం - కాగజ్ నగర్
-
జనపథం - విజయవాడ.
-
జనపథం -ఏలూరు
-
జనపథం - ఆల్వీన్ కాలనీ
-
జనపథం - పాండురంగాపురం
-
జనపథం 13th August 2017
-
జనపథం - నంద్యాల
-
జనపథం - సిద్దినగర్
-
జనపథం - నంద్యాల కర్నూలు జిల్లా
-
జనపథం - నంద్యాల నియోజకవర్గం
-
జనపథం - న్యూ కాలనీ , మియాపూర్
-
జనపథం - కర్నూలు జిల్లా
-
జనపథం - కాలాడేరా బస్తీ, మలక్ పేట్
-
జనపథం - పెనుమాక గ్రామం
-
జనపథం - అమరావతి రాజధాని ప్రాంతం
-
జనపథం - చిలకలూరి పేట బైపాస్ రోడ్
-
జనపథం - తుందుర్రు గ్రామం
-
జన పథం - నిడమర్రు
-
జనపథం - రాజమండ్రి
-
జనపథం - పైడిమాంబ కాలనీ
-
జనపథం - విశాఖపట్నం
-
జనపథం - కర్నూలు
-
జనపథం - విజయవాడ 29వ డివిజన్
-
జనపథం - వైఎస్సార్ కాలనీ
-
జన పథం - రాజేంద్రనగర్ ప్రభుత్వ బాలుర హాస్టల్
-
జన పథం - ఎం జీ బీ ఎస్ హైదరాబాద్
-
జన పథం - చందానగర్
-
జన పథం - మలక్ పేట్ మార్కెట్
-
జన పథం - జిడిమేట్ల పారిశ్రామిక వాడ
-
జన పథం - గుడిమల్కాపూర్ మార్కెట్
-
జన పథం - మల్కాజ్గిరి
-
జనపథం - మైలార్‌దేవర్‌పల్లి
-
జనపథం - రాజేంద్రనగర్
-
జనపథం - మేడ్చల్
-
జనపథం - మూసా పేట
-
జనపథం - నిజాం పేట్
-
జనపథం - జమ్మిగడ్డ
-
జనపథం - మల్లాపూర్ డివిజన్
-
జనపథం - కాకినాడ
-
జనపథం - వనస్థలిపురం
-
జనపథం - షేక్ పేట్
-
జనపథం - విజయవాడ
-
జనపథం - బోరబండ
-
జనపథం - ముషీరబాద్
-
జనపథం - హరిత హరం
-
జనపథం - ఎల్భీనగర్
-
జన పథం - విజయనగర్ కాలనీ
-
జన పథం - మెహిదీపట్నం డివిజన్
-
జన పథం - బాలయ్య నగర్
-
ఎన్టీఆర్ నగర్
-
జనపథం - ఉప్పల్ నియోజకవర్గం
-
జనపథం - వినాయకహిల్స్
-
జనపథం - బంజారాహిల్స్
-
జనపథం - సాయిరాంబస్తీ
-
జనపథం-చర్లపల్లి
-
జనపథం-బోజగుట్ట
-
జనపథం - గుడిమల్కాపూర్
-
జనపథం-మలక పేట్
-
జనపథం-శ్రీరాంనగర్ కాలనీ
-
జనపధం 18th October 2015
-
జనపథం-కంటీన్మెంట్,సికింద్రాబాద్
-
జనపథం-రోషన్దౌల
-
జనపథం- చందానగర్
-
జనపథం-కంటోన్మెంట్
-
జనపథం-చంద్రబాబు నాయుడు నగర్
-
జనపథం-శామీర్‌పేట
-
జనపథం 9th Aug 2015
-
జనపథం-దేవినగర్
-
జనపథం-మూసానగర్
-
జనపథం-గబ్బిలాలపేట
-
జనపథం@ సరూర్ నగర్
-
జనపథం : 'సీతారాంబాగ్' పార్ట్-2
-
’ఓటుకినోటు’పై జనపథం
-
జనపథం @ కేపీహెచ్‌బీ
-
జనపథం@ మణికొండ
-
జనపథం@ మీర్‌పేట
-
జనపథం @ బోడుప్పల్
-
పండుటాకులకు ఊతకర్ర
⇒సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ‘సాక్షి’ జనపథం ⇒ ఇబ్బందులను ఏకరువు పెట్టిన అనాజ్‌పూర్ గ్రామస్తులు ⇒అర్హత ఉండి కూడా పింఛన్ లిస్టులో పేరు లేదని బాధపడిన వృద్ధులు ⇒అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు 8 మంది పేర్లు చేర్పించిన సోలిపేట ⇒వారం రోజుల్లో మరో 10 మందికి కూడా పింఛన్ ఇప్పిస్తానని హామీ ⇒అర్హుల గుర్తింపునకు ఇది ఆరంభం మాత్రమే: రామలింగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గాజు కళ్లు... ముడుతలు పడిన ఒళ్లు.. 60 ఏళ్ల వయసులో ఆసరాకోసం అల్లాడుతున్న అవ్వాతాతలకు సోలిపేట రామలింగారెడ్డి భరోసా ఇచ్చారు. గతంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలో పింఛన్లు అందని పండుటాకులతో రాస్తారోకో చేయించి పాలకులను రోడ్డు మీదకు ఈడ్చిన ఆయన, ఇపుడు అధికారంలో ఉన్నా, అవ్వాతాతలవైపే మొగ్గు చూపారు. వారికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ‘సాక్షి’, సాక్షిటీవీ నిర్వహించిన జనపథం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పండుటాకులకు వచ్చేందంతా పండుగ రోజులేనని తెలిపారు. ప్రతి అవ్వకు, తాతకు, భర్తను కోల్పోయిన అక్కా చెళ్లెళ్లకు, అంగవైకల్యం ఉన్న అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆసరా’ అవుతారని భరోసా ఇచ్చారు. అవ్వా తాతలకు అన్యాయం జరిగితే రోడ్డెక్కటానికి వెనుకాడిది లేదన్నారు. పింఛన్జాబితాలో పేర్లు నమోదు మంగళవారం దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని మారుమూల పల్లె అనాజ్‌పూర్‌లో ‘సాక్షి’, సాక్షి టీవీ ఆధ్వర్యంలో ‘జనపథం’ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ అబ్బగౌని మంగమ్మ, జెడ్పీటీసీ సర్వుగారి వీరమణి ఎంపీడీఓ మచ్చేందర్, గ్రామ కార్యదర్శి రవి, గ్రామ నాయకులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సుమారు 450 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీతన్నలు, నేతన్నలు పాల్గొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఆసరా పథకంలో తమ పేర్లు ఉన్నాయో... తొలిగించారో... తెలియక ఆందోళన పడుతున్న వాళ్లకు ఈ వేదిక అనుమానాలన్నీ నివృత్తి చేసింది. అసరా లేక అల్లాడుతున్న పండుటాకులకు ‘సాక్షి’ జనపథం ఊతకర్ర అయ్యింది. సాంకేతిక సమస్యతో అర్హత లిస్టు నుంచి తొలగించిన 8 మంది వృద్ధుల పేర్లను, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అప్పటికప్పుడు స్థానిక ఎంపీడీఓ మచ్ఛేంద్రతో మాట్లాడి వారికి తొలి లిస్టులోనే నమోదు చేయించారు. నేటి నుంచి అమలు చేస్తున్న అసరా పథకంలో వాళ్లు రూ.1000 అందుకోనున్నారు. గతంలో కంటే ఎక్కువే గ్రామంలో మొత్తం 483 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరి పింఛన్ ఉంటే వారిలో ఒకరి పేరును ప్రభుత్వం తొలగించింది. ఏడున్నర ఎకరాలకు పైగా మెట్టభూమి ఉన్న వారిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం 349 మంది తొలి జాబితాకు అర్హత సాధించారు. వీళ్లలో 221 మంది వృద్ధులు, 99 మంది వితంతువులు, 29 మంది వికలాంగులు అర్హులుగా గుర్తించారు. అధికారుల ఇచ్చిన నివేదికల ప్రకారం గత పింఛన్లతో పోలిస్తే... కొత్త ప్రభుత్వం తొలి జాబితాలోనే 5 మందికి ఎక్కువగానే పింఛన్లు ఇచ్చిందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఈలెక్కన గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్కువ పింఛన్లు ఇస్తోందని, ఒక్క అనాజ్‌పూర్ గ్రామంలో మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా పింఛన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. అన్నీ కన్నీటిగాథలే... ‘అయ్యా...నిరుడు నా భర్త టక్కరై పోయిండు. ముగ్గురు పిల్లల తల్లిని, ముగ్గురికి ముగ్గురూ సిన్నపిల్లలే..ఎట్టా బతను సారూ’.. అంటూ మడిగె లక్ష్మి అనే మహిళ కన్నీళ్లు పెట్టింది. రామలింగారెడ్డి ఈమె పేరు వితంతవుల జాబితాలో ఉందా? లేదా? చూసి చెప్పాలని అధికారులను కోరారు. మడిగె లక్ష్మి పేరు అర్హుల జాబితాలో ఉందని వారు చెప్పడంతో లక్ష్మికి కొంత ఊరట లభించింది. పిల్లలను ఏదైనా సంక్షేమ హాస్టల్లో చేర్పించేందుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక సోమని లక్ష్మిది మరో బాధ... భర్త మహారాష్ట్రకు వలసపోయి అక్కడే చనిపోయాడు. మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అయితే అక్కడి మరణ ధ్రువీకరణ పత్రం ఇక్కడ చెల్లదంటే అధికారులు మెలికలు పెట్టారు. ఈ విషయాన్ని లక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన అక్కడే ఉన్న అధికారుతో మాట్లాడారు. అప్పటికే ఆమె వింతంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో ఎంపీడీఓతో మాట్లాడి అర్హుల జాబితాలో సోమని లక్ష్మి పేరు చేర్చారు. అంతేకాకుండా దౌల్తాబాద్ తహశీల్దార్‌తో అప్పటికప్పుడు సెల్ఫోన్లో మాట్లాడి దళితులకు ఇచ్చే మూడు ఎకరాల భూమి కూడాఇవ్వాలని సూచించారు. దీంతో లక్ష్మి వేదిక మీదున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది. మరో యువతి జయమ్మ భర్త గత ఏడాది రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఏం చెప్పిందంటే ‘ నాభర్తకు టక్కరై అగస్తంగ పోయిండు. ఆపతిబంధు పథకం కింద కాయితం పెట్టుకుంటే...ఎమ్మారో సారు నా కాయితం నాకు తిప్పి పంపిండు. భర్తలేని పింఛను కూడా కాయితం పెట్టుకున్న గాని వచ్చిందో.. రాలేదో తెల్వదు’ అని చెప్పింది. గ్రామ కార్యద ర్శి రవి జాబితాను పరిశీలించి అర్హత జాబితాలో ఆమె పేరు ఉన్నట్లు నిర్ధారించారు. ఇక ఆపద్భందు పథకం కోసం ప్రయత్నం చేస్తానని సోలిపేట రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. ఇలా సోమని రామసోమె... కర్రూరి నర్సయ్య.. ఆరే పోచమ్మ... మంజుల... ఎంకవ్వ.. రామవ్వ దాదాపు 450 మంది అనుమానాలను ఆందోళనలకు పరిష్కారం చేపే విధంగా జన పథం సాగింది. -
నేడు అనాజిపూర్‌లో సాక్షి ‘జన పథం’
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకెళ్తున్న ‘సాక్షి’ మరో వినూత్న కార్యక్రమంతో అధికారులనే ప్రజల వద్దకు తీసుకువస్తోంది.ప్రజల సాధక బాధకాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం అనాజిపూర్‌లో ‘జన పథం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితోపాటు స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్లు హాజరవుతున్నారు. ఈ ‘జన పథం’ కార్యక్రమంలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. -
గుజరాత్ వృద్ధి మిథ్యే
రూ.10 వేల లోపు అప్పు సైతం చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ప్రజల సొమ్ముల్ని రాయితీల రూపంలో కొట్టేస్తున్న బడా కార్పొరేట్లు అవకాశమిస్తే దేశాన్నే గుజరాత్‌లా చేస్తానంటున్నారు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. కానీ నిజానికి గుజరాత్లో జరిగింది ఎలాంటి అభివృద్ధి? ఎవరి అభివృద్ధి? వృద్ధి రేటు అద్భుతమంటూ ఊదరగొడుతున్న గుజరాత్లో వాస్తవ పరిస్థితేమిటో తెలుసా? అభివృద్ధి అంటే ఆత్మహత్యలు. అభివృద్ధి అంటే భయోత్పాతం. అభివృద్ధి అంటే కార్పొరేట్లకు ఎర్ర తివాచీలు. సగటు జీవికి మాత్రం నిత్యం ఆకలి కేకలు! ఇలాంటి వృద్ధినే దేశవ్యాప్తం చేస్తానంటూ మోడీ ఊరూవాడా ఎలుగెత్తి చాటుతున్నారు! అలాంటి మోడీ మోడల్‌కు చంద్రబాబు వంతపాడుతున్నారు. తానూ అలాంటి అభివృద్ధికే కంకణం కట్టుకున్నానంటున్నారు. మోడీ సారథ్యంలో గుజరాత్ సాధించిన ‘అభివృద్ధి’ ఎలాంటిదో చూడండి... హా సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం గుజరాత్లో 2003-2012 మధ్య 4,874 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మోడీ వూత్రం ఒకే ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడని బుకారుుస్తున్నారు. 1. 2011 నాటికి మోడీ విధానాల సంక్షోభం 16,000 మంది ఆత్మహత్యలకు కారణమైంది. గుజరాత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం - ఇందులో 9,829 మంది కార్మికులు. 919 మంది వ్యవసాయ కార్మికులు. మిగిలిన వాళ్లు రైతులు. 2. 2001-11 మధ్య గుజరాత్లో 3.5 లక్షల మంది రైతులు సాగు నుంచి తప్పుకున్నారు. వ్యవసాయ కార్మికులు 16.78 లక్షలకు పెరిగారు. ఎన్ఎస్ఎస్ సర్వే (2005) ప్రకారం - 40% రైతులు వేరే బతుకు తెరువు దొరికితే సాగును వదిలేం దుకు సిద్ధంగా ఉన్నారు. 3. ప్లానింగ్ కమిషన్ నియమించిన సురేష్ పి టెండూల్కర్ కమిటీ ప్రకారం - గుజరాత్ ప్రజల్లో 31.8% మంది పేదలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర 7 రాష్ట్రాల కంటే ఎక్కువ పేదరికం ఇక్కడ నమోదైంది. 4. 2008 రాష్ట్రాల ఆకలి సూచిలో ఈ ‘ధనిక’ రాష్ట్రం ఒడిశా కంటే వెనుకబడింది. మొత్తం 17 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉంది. 5. గత పదేళ్లలో గుజరాత్లో 60,000 చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. కుటీరపరిశ్రమల ద్వారా ఉపాధి పొందే వారి సంఖ్య 85,683 మేరకు క్షీణించింది. 6. 2001లో 18.86 లక్షలున్న మహిళా రైతుల సంఖ్య 2011 నాటికి 12.03 లక్షలకు పడిపోయింది. 7. గుజరాత్‌లోని మొత్తం కార్మికుల్లో మహిళా కార్మికులు 2.89% మాత్రమే.(జాతీయ సగటు 12.5%). 8. 2004-05, 2009-10 మధ్య ఉపాధి వృద్ధిరేటు 1.3% 9. అత్యధిక పెట్టుబడులున్న తయారీరంగంలో 2011-12 మధ్య ఉద్యోగుల సంఖ్య 0.68% మేర క్షీణించింది. 2001-08 మధ్య ఎలాంటి సాంఘిక భద్రతా లేని కాంట్రాక్టు కార్మికులు 19 నుంచి 34 శాతానికి పెరిగారు. వీరికి చెల్లిస్తున్న వేతనాలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. 10. గుజరాత్‌లోని ఫ్యాక్టరీ కార్మికులు జార్ఖండ్, మహారాష్ట్రల కన్నా 30% నుంచి 40% తక్కువ వేతనాలు పొందుతున్నారు. వేతనాలపరంగా గుజరాత్ క్యాజు వల్ కార్మికులు దేశంలోనే చివరన ఉన్నారు. 11. 1990 దశకంలో 3.7 శాతంగా ఉన్న వేతనాల వృద్ధిరేటు 2000 దశకంలో 1.48కి పడిపోయింది. 2011 ఆర్థిక సర్వే ప్రకారం గుజరాత్లో జరిగినన్ని సమ్మెలు మరే రాష్ట్రంలోనూ జరగలేదు. (ఇవన్నీ గుజరాత్ చేపట్టిన కార్పొరేటీకరణ దుష్పరిణామాలే) అభివృద్ధి సూచీల్లో నానాటికీ వెనక్కి జాతీయ మానవాభివృద్ధి సూచిలో గుజరాత్ ర్యాంకు తొమ్మిది. 1999-2000 నుంచి ఇదే స్థితి! ఇక అక్షరాస్యత రేటులో 12వ ర్యాంకు. 1-10 తరగతుల మధ్య బడి మానేస్తున్న వారు 58% (జాతీయ సగటు 49%). 2013 నాటికి ప్రాథమిక విద్యారంగంలో 12 నుంచి 28వ స్థానానికి, ప్రాథమికోన్నత విద్యారంగంలో 8 నుంచి 14కు దిగజారింది. ప్రాథమిక విద్యారంగంలో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి వెనకబడిన రాష్ట్రాలు కూడా గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. విద్యారంగ పెట్టుబడుల్లో గుజరాత్ స్థానం 14. విద్యారంగంలో సామాజిక అసమానతలు కూడా అక్కడ చాలా ఎక్కువ. ముస్లిం పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లే లభించడం లేదు! మౌలిక ఆరోగ్య సూచికల్లోనూ గుజరాత్ వెనుకబడింది. ఆర్యోగ రంగంలో 17 పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ స్థానం 16! ఇక మాతృ మరణాల రేటు ప్రతి లక్ష మందికి 148. ఈ విషయంలో తమిళనాడు (97), మహారాష్ట్ర (104) చాలా మెరుగ్గా ఉన్నాయి. శిశు మరణాల రేటు గుజరాత్లో ప్రతి 1,000 మందికి 41 కాగా మహారాష్ట్రలో 25, తమిళనాడులో 22. ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు గుజరాత్లో 61 (ప్రతి వెయ్యిమందికి). మహారాష్ట్రలో 28. తమిళనాడులో 25. తమిళనాట 1992-93 మధ్య 90 పాయింట్లు ఉన్న షెడ్యూల్ట్ కులాల శిశు మరణాల రేటు 2005-06 నాటికి 37 పాయింట్లకు తగ్గింది. గుజరాత్లో ఇది 5 పాయింట్లకు మించి తగ్గలేదు. గుజరాత్లో 2005-06 నాటికి ఎస్టీల్లో శిశు మరణాల రేటు జాతీయ సగటు (62) కంటే చాలా ఎక్కువ(86). రాష్ట్ర పేదల్లో సగంమంది సబ్సిడీ ధాన్యాలు పొందలేకపోతున్నారు. సమగ్ర శిశు సంక్షేమ పథకం, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరిచే రాష్ట్రాల్లో గుజరాత్ లేదు. గుజరాత్ నమూనా అంటే.. బడా పెట్టుబడుదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం. సామాన్యుల్ని, ప్రత్యేకించి బడుగుల్ని విస్మరించడం. మోడీ నాయకత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వమే గనుక ఏర్పడితే పెట్టుబడుదారులు సుస్థిర లాభాలకు బాటలేసుకోవచ్చు. సామాన్యుల జీవన భద్రత మాత్రం కల్ల. తగ్గిన సామాజిక వ్యయం 2013-14 గుజరాత్ బడ్జెట్ వ్యయంలో సామాజిక రంగానికి కేటాయించింది 39.1% (జీఎస్డీపీలో 5.5%). ఈ అంశంలో - మొత్తం 17 రాష్ట్రాల వరసలో గుజరాత్‌ది 16వ స్థానం. ప్రభుత్వ ఖజానాలోని ప్రజల సొమ్ము భారీగా కార్పొరేట్ సంస్థల పరమవ్వడం, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం వల్ల సావూజికరంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. కార్పొరేట్ సంస్థలకు భారీ రారుుతీలు ఇవ్వడంపై గతంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేట్ సంస్థలకు కోర్టు నోటీసులిచ్చింది. -
మీకెంతో రుణపడి ఉన్నాం
మీ రుణం తీర్చుకునే అవకాశం జగనన్నకు ఇవ్వండి విశాఖ వైఎస్సార్ జనభేరి సభల్లో షర్మిల వైఎస్ మరణం తర్వాత మాకు అండగా నిలిచారు రాజన్న రాజ్యం కోసం ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి చంద్రబాబు ఓ సైకో! బాలకృష్ణ చచ్చిన పాము! ఈ రోజుతో పవన్‌కల్యాణ్ చాప్టర్ క్లోజ్ మనం ఈ పరీక్షలోడిస్టింక్షన్లో పాసవ్వాలి! భారీ మెజారిటీతో గెలిపించాలని వినతి విజయమ్మతో కలసి షర్మిల ప్రచారం సాక్షి, విశాఖపట్నం: ‘‘మా కుటుంబం మీ అందరికీ రుణపడి ఉంది. మనసున్న మారాజు రాజశేఖరరెడ్డి చనిపోతే ఆ బాధ తట్టుకోలేక గుండె పగిలి రాష్ట్రంలో కొన్ని వందలమంది ప్రాణాలు వదిలేశారు. వైఎస్ చనిపోయి అయిదేళ్లవుతున్నా మీ అందరి గుండెల్లో ఆయన బతికే ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత మా ప్రతి కష్టంలోనూ మీరంతా మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. మా ప్రతి పోరాటంలోనూ అండగా నిలిచారు. జగనన్నపై కక్షగట్టిన సోనియాగాంధీ టీడీపీ నేతలతో కుట్రపన్ని జైలు పాలుచేస్తే తెలుగు ప్రజలు జగన్ కోసం పరితపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా మీ అండతో ధైర్యంగా ముందడుగు వేయగలిగాం. అందుకు వైఎస్ కుటుంబం మీ అందరికీ రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే వైఎస్ సంక్షేమ పథకాలన్నింటినీ సమర్థంగా అమలుచేస్తారు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జనభేరి చివరి రోజైన సోమవారం షర్మిల, పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి విజయమ్మతో కలసి విశాఖలో ప్రచారం నిర్వహించారు. ‘‘మీరంతా జగనన్న వదిలిన బాణాలు. మనం పరీక్ష రాసే సమయం వచ్చింది. 75 శాతం ఓటింగ్ వైఎస్సార్సీపీకి పడేలా ఉండాలి. డిస్టింక్షన్లో పాసవ్వాలి. విజయం సాధించి వైఎస్సార్‌కి కానుకగా ఇవ్వాలి’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘లెక్కలేనంత తిక్క ఉందని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నాడు. అలాంటి మనిషి గురించి ప్రత్యేకంగా నేనేం మాట్లాడతాను. అయిపోయింది.. ఈ రోజుతో పవన్ కల్యాణ్ చాప్టర్ క్లోజ్. బాలకృష్ణా.. ఆయనొక చచ్చిన పాము. వదిలేద్దాంలే.. పాపం పోనీ..!’’అంటూ చురకలు వేశారు. షర్మిల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. చంద్రబాబు సైకో! చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. తన గత పాలనను తిరిగి తెస్తాననే ధైర్యం ఆయనకు ఉందా? రాజశేఖరరెడ్డి ఏ పథకాలు అమలు చేశారో వాటినే తానుకూడా అమలు చేస్తానని బాబు చెబుతున్నారు. వైఎస్ రుణమాఫీ చేస్తే తాను కూడా రుణమాఫీ చేస్తానంటున్నారు. కానీ తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు రుణమాఫీ చేయాలని ఎందుకు గుర్తుకు రాలేదు? పోనీ రుణాలపై వడ్డీ మాఫీ చేశారా? నిజానికి బాబు దృష్టిలో రైతులు పురుగులకన్నా హీనం. సీఎంగా కూర్చుని వ్యవసాయం దండగ అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నదరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తెలివి సామాన్యమైనది కాదు. సొంతమామను వెన్నుపోటు పొడిచాడు. ఆయన పార్టీని, అధికారాన్నీ లాక్కుని, ఆయన్నే పార్టీ నుంచి వెలేశాడు. ఆయన బతికున్నపుడు చెప్పులు వేయించిన చంద్రబాబు ఇపుడు ఓట్లు కోసం ఆయన ఫొటోకు దండలు వేస్తున్నారు. బాబు సీఎంగా ఉన్న రోజుల్లో విద్యార్థులు స్కాలర్ షిప్‌లు కావాలని అడిగితే.. మెస్ చార్జీలు కూడా ఇవ్వలేదు. అంగన్వాడీలు జీతాలు పెంచాలని అడిగితే.. మహిళలని చూడకుండా గుర్రాలతో తొక్కించారు. ఆయన సైకో కాక మరేంటి? ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందేది పేదలే. అలాంటివారికి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ఉచిత వైద్యం అందించకపోగా.. వారి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆలోచించారు. ఓ మహిళ తన భర్త చనిపోయాడు.. పెన్షన్ ఇప్పించండి బాబూ అని అడిగితే.. మీ ఊళ్లో ఎవరైనా చనిపోతే ఇస్తానన్నారు. ఒకరికి పెన్షన్ రావాలంటే మరొకరు చనిపోవాలని కోరుకునేవాడు సైకో కాక మరేంటి? వ్యవసాయం, వ్యవసాయానికి సబ్సిడీ దండగన్న చంద్రబాబు.. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాడంటే నమ్మగలమా? తన పాలనలో ఎనిమిదిసార్లు కరెంట్ చార్జీలు పెంచిన చంద్రబాబు ఇపుడు ఉచిత విద్యుత్ ఇవ్వగలడా? లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్ని పప్పుబెల్లాల్లా తన బినామీలకు అప్పగించిన ఈయన కొత్తగా పరిశ్రమలు తెస్తాడా? ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వడం, డీఏ, పీఆర్సీ పెంపు దండగన్నవాడు ఇపుడు ప్రభుత్వ ఉద్యోగాలిస్తాడా? తన సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాలిటీగా చేసుకోలేని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియా, జపాన్ చేసేస్తాడంటే నమ్మగలమా? ఈయన చెప్పే సొల్లు వినడానికి మనమేమైనా చెవుల్లో పువ్వులు పెట్టుకున్నామా? రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం రాజశేఖరరెడ్డి పాలనలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతులకు నీళ్లిచ్చారు. 7 గంటలు కరెంటు ఇచ్చారు. మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఇంకా రైతులకు రుణమాఫీ చేశారు. చంద్రబాబు రైతులకు, మహిళలకు రూపాయి వడ్డీకి రుణాలిస్తే వైఎస్ పావలా వడ్డీకే రుణాలిచ్చారు. మహిళలు వైఎస్ పుణ్యాన ఆర్థికంగా స్థిరపడగలిగారు. చంద్రబాబు తన పాలనలో 16 లక్షల పింఛన్లు ఇస్తే వైఎస్ 71 లక్షల పింఛన్లు ఇచ్చారు. అయిదేళ్లలో కేంద్రప్రభుత్వం దేశం మొత్తంమీద పేదలకోసం 47 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే వైఎస్ మన రాష్ట్రంలో 48 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు. చంద్రబాబు కిలో బియ్యాన్ని రూ.5.25 చేస్తే... వైఎస్ మార్కెట్లో రూ.25 పలికే కేజీ బియ్యాన్ని పేదలకు రూ.2కే అందించారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదలకు ఖరీదైన వైద్యం చేయించారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకు 108 వచ్చేది. వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ఒక్క పన్ను, ఒక్క చార్జీ పెంచలేదు. విత్తనాలు, ఆర్టీసీ చార్జీలు, ధరలు పెంచలేదు. గ్యాస్ ధర వైఎస్ సీఎం కాకముందు ఎంత ఉందో ఆయన చనిపోయేవరకు అదే ధర ఉంది. చంద్రబాబు ఎనిమిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారు. వైఎస్ మరణించాక సీల్డ్ కవర్లో ఊడిపడ్డ కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్ ప్రతి పథకానికి తూట్లు పొడిచారు. అయిదుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. రూ.32 వేల కోట్లు విద్యుత్ చార్జీలు, సర్‌చార్జీలు అంటూ పెంచేశారు. ఇన్ని అరాచకాలు జరిగితే అయిదేళ్లలో చంద్రబాబు ఏ ఒక్కసారైనా ప్రధాన ప్రతిపక్షం హోదాలో నిలదీశారా? తన అవినీతి ఆరోపణల నుంచి బయటపడ్డం కోసం ప్రతిపక్షం పాలకపక్షంతో కుమ్మక్కైంది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించాలని ప్రయత్నిస్తే బాబు కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా నిలిచారు. సోనియా తన కొడుకును ప్రధాని చేయాలన్న ఆశతో రాష్ట్రాన్ని విభజిస్తే దానికి సహకరించింది చంద్రబాబే. ఈ ఐదేళ్లలో రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల కోసం ఎవరైనా పోరాటం చేశారంటే అది జగనన్న మాత్రమే. వారంపాటు మెతుకు ముట్టకుండా రైతులు, చేనేతల కోసం, పెం చిన చార్జీలు తగ్గించడం కోసం నిరాహార దీక్షలు చేసింది జగనన్న ఒక్కరే. మన రాష్ట్రాన్ని ముక్కలు చే యవద్దని నిరాహార దీక్షలు చేసింది జగనన్న మాత్రమే. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీని గెలిపించండి. జగనన్న మీ సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. వైఎస్సార్ బతికున్నంత వరకు రాజకీయాల్లో కనీస జోక్యంలేని విజయమ్మ, తమ కుటుంబాన్ని నమ్ముకుని వెంట నిలిచిన వారి విజయం కోసమే తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి, విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి విజయమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కడప ఉప ఎన్నికలో పార్టీ అధ్యక్షుడు జగనన్నకు వచ్చిన 5.40 లక్షల ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో పట్టంకట్టాలి. -
జన ఉప్పెన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కావలి పట్టణం జనసంద్రంగా మారింది. నియోజకవర్గం నలుమాలల నుంచి జగన్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన సభ దాదాపు 5 గంటలు ఆలస్యమైనా జనం జగ న్ కోసం ఎదురుచూశారు. సాయంత్రం 4:30 గంటలకు జగన్ హెలికాప్టర్లో కావలికి చేరుకున్నారు. అప్పటికే కావలి వీధులతో పాటు మిద్దెలు, మేడలు జనంతో కిక్కిరిశాయి. మండుటెండను సైతం లెక్కచేయక వృద్ధులు, మహిళలు, యువకులు , చిన్నారులతో పాటు అన్ని వర్గాల వారు జన నేత జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనను చూడగానే జనం కేరింతలు కొట్టారు. పూలతో ఘనస్వాగతం పలికారు. సాక్షి, నెల్లూరు: జగనన్న జిందాబాద్, ముఖ్యమంత్రి జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో కావలి పట్టణాన్ని హోరెత్తించారు. కిక్కిరిసిన జనాన్ని చూసిన జగన్ హెలిప్యాడ్ నుంచి సభ జరిగే కూడలి వరకూ కాన్వాయ్‌లో వస్తూ అడుగడుగునా అందరినీ బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేయాలని విన్నవించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో జగన్ ప్రసంగించారు. జగన్ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజపూరితంగా సాగింది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై జగన్ విమర్శల దాడి జనాన్ని ఆలోచింపజేయడంతో పాటు ఉర్రూత లూగించింది. తనను ముఖ్యమంత్రిని చేస్తే అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఇవన్నీ ఎందుకు చేయలేదంటూ జగన్ ప్రశ్నలు సంధించారు. బాబు హయాంలో ఉన్నత విద్య, వైద్యం పేదలకు ఖరీదుగా మారాయన్నారు. ఆనాడు ఆయన ఎందుకు పట్టించుకోలేదని జగన్ వేసిన ప్రశ్న జనాన్ని ఆలోచింప చేసింది. కిలో రెండురూపాయల బియ్యాన్ని రూ.5కు పెంచిన ఘనత చంద్రబాబుది కాదా అని జగన్ జనాన్ని ప్రశ్నించారు. అలాగే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా బెల్టుషాపులు పెట్టి మహిళల ఉసురుపోసుకున్న వ్యక్తి టీడీపీ అధినేత కాదా అంటూ జగన్ ప్రశ్నలు కురిపించి జనంతోనే సమాధానాలు చెప్పించారు. పేదలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని జగన్ ధ్వజమెత్తారు. ఇవాళ అధికారం కోసం సెల్ఫోన్లు, టీవీలు, లక్షా 27కోట్ల రుణమాఫీ, 20 వేల కోట్ల డ్వాక్రా రుణాల రద్దు, ఇంటికొక ఉద్యోగమంటూ అమలుకాని హామీలను గుప్పిస్తున్నాడని, తొమ్మిదేళ్ల పాలనలో ఇవన్నీ బాబుకు ఎందుకు గుర్తురాలేదని జగన్ ప్రశ్నించగా ‘బాబు రాష్ట్రాన్ని నాశనం చేశాడు’ అని అంటూ జనం ఈలలు, కేకలతో స్పందించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు ఆడనని, విశ్వసనీయతలేని రాజకీయాలు చేయనంటూ జగన్ చెప్పారు. ఎన్నికల తర్వాత బాబు ఉండడు, ఆ పార్టీ ఉండదంటూ పేర్కొనడంతో సభకు వచ్చిన జనం పెద్ద ఎత్తున స్పందించారు. తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రమాణ స్వీకారం రోజే ఐదు సంతకాలు, ఆరు పనులు కలిపి మొత్తం 11 పనులను చేస్తానని చెప్పడంతో జనం ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీకి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని, మనం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ఓటేయాలని జగన్ పిలుపునిచ్చారు. 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి ప్రధాని కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిద్దామని జగన్ పేర్కొనడం జనంలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అలాగే చేస్తాం.. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామంటూ జనం స్పందించారు. అరగంటపాటు సాగిన జగన్ ప్రసంగం జనాన్ని మరింత ఉత్తేజితులను చేసింది. సభ ముగిసినా జనం మాత్రం కదలకపోవడం విశేషం. మొత్తంగా కావలి ఎన్నికల ప్రచారసభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్థానిక నేతలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేకపాటి తండ్రి సమానుడిగా నాకు అండగా నిలిచారు నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. తాను తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రాజమోహన్‌రెడ్డి తండ్రి సమానుడిలా తన వెన్నంటి నడిచారని జగన్ పేర్కొన్నారు. కావలి వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంచి వ్యక్తి, ప్రజలకు మంచి చేస్తాడన్న నమ్మకం తనకుందన్నారు. రామిరెడ్డిని సైతం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు. జగన్ ఫ్యాన్ గుర్తు ప్రచారం ‘అవ్వా మన గుర్తు ఫ్యాన్, తల్లీ మన గుర్తు ఫ్యాన్, అన్నా మన గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ గుర్తును మరవద్దన్నా’ అంటూ కావలి సభలో జగన్ ఫ్యాన్చేత బట్టి అందరినీ ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ‘బిల్డింగ్‌పై ఉన్న తాతా మన గుర్తు ఫ్యాన్, గోడపైనున్న అన్నా మన గుర్తు ఫ్యాన్, మిద్దెపైనున్న అక్కయ్యలు మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నయ్యా’ అంటూ జగన్ చేసిన ప్రచారం అందరినీ మరింతగా ఆకట్టుకుంది. కావలి కెనాల్ పూర్తి చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల పరిధిలోని కావలికెనాల్ను పూర్తిచేసి ఈ ప్రాంత వాసులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. కావలి ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే కావలి కెనాల్‌తో పాటు మిగిలిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవు తాయన్నారు. జగన్ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి : ఎంపీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆయన పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కావలిలో ఆదివారం జరిగిన జగన్ ఎన్నికల ప్రచార సభలో మేకపాటి ప్రసంగించారు. రాష్ట్రాన్ని పాలించే నేతలు సద్గుణం కలిగి ఉండాలన్నారు. అలాగే ధీరోదాత్తుడిగా, ఆరోగ్యవంతుడిగా ఉండాలని, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని మేకపాటి అన్నారు. చంద్రబాబుకు సద్గుణం లేదు, ధీరోదాత్తుడు కాదు, ఆరోగ్యవంతుడు కాదన్నారు. అందుకే బాబుకు పాలించే అర్హత లేదని మేకపాటి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి అందరి మన్ననలు పొందిన మహానేత వైఎస్ తనయుడిగా జగన్‌కు అన్ని అర్హతలతో పాటు ప్రజాభిమానం మెండుగా ఉందన్నారు. -
నేడు జననేత జగన్ జనభేరి
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం (నేడు) జిల్లాకు రానున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సభ ముగించుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్లో ఆయన మడకశిర చేరుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు హిందూపురం చేరుకుని అంబేద్కర్ సర్కిల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు తాడిపత్రి బహిరంగ సభలో పాల్గొంటారని ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. ఉరకలేస్తున్న ఉత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానుండడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, షర్మిల నిర్వహించిన ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. పైగా ప్రచార పర్వంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దూసుకెళ్తుండడంతో టీడీపీ అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు ప్రచారాలకు వెళ్తే కనీసం ఇళ్లలో ఉన్న వారు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో వారు ప్రలోభాలకే పరిమితమైపోయారు. గత నెల 30న అనంతపురంలో జరిగిన బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినా జనం మాత్రం కరువయ్యారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు వైఎస్ జగన్ జిల్లాకు వస్తుండడంతో టీడీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పిలుపునిచ్చారు. వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. -
జయం మనదే
‘నమస్తే అక్కా.. నమస్తే అన్నా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే అవ్వా..తాతా రాష్ట్రాన్ని కమ్మేసిన చీకట్లు తొలగిపోయేందుకు ఎంతో సమయంలేదు. గత కాలపు వైభవం తిరిగి వచ్చేందుకు ఎన్నో రోజులు పట్టవు. నవ్య సీమాంధ్ర నిర్మాణం కోసం అడుగులు ముందుకేసేందుకు మరెన్నో గంటలు అవసరంలేదు. రాష్ట్రాన్ని విభజించిన కర్కశులను శాశ్వతంగా ఇంటికి పరిమితం చేసేందుకు.. పేదలు.. దీనులతో ఆటలాడుకున్న దుర్మార్గులను తరిమికొట్టేందుకు.. ద్వంద్వ విధానాలను సమూలంగా పెకిలించేందుకు.. సుదీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సిన అవసరం లేదు.. ఐదు సంతకాలు మీ జీవితాల్లో నూతన వెలుగులు ప్రసరింపజేస్తాయి ప్రతి ఇంటిలో ఆనందాలు వెల్లివిరుస్తాయి...’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజలకు ఆదివారం భరోసా ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ‘మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండ మండిపోతున్నా ఖాతరు చేయడం లేదు. అనుకున్న దానికన్నా, దాదాపు మూడు నాలుగు గంటలు ఆలస్యంగా జరుగుతోంది. అయినా ఏ ఒక్కరి ముఖంలోను చికాకు కనిపించడం లేదు. ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతున్నా, ఎండ ఇంత తీక్షణంగా ఉన్నా, ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కారణాలు వెతుక్కోలేదు. వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను కనబరుస్తున్నారు. ఇంతటి ప్రేమానురాగాలను చూపిస్తున్నారు. మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితునికి మీ ఆప్యాయతలకు చేతులు జోడించి, పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కనిగిరివాసులనుద్దేశించి మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించగానే వేలాది మంది ఉదయం పది గంటలకే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 12 నుంచి 2 గంటల వరకు తీవ్రంగా ఎండకాసింది. అయినా జనం కాలు కదపకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక కోసం నిరీక్షించారు. దాదాపు 2.30 గంటలకు కనిగిరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్బన్ కాలనీ ప్రాంతంలో జగన్మోహన్రెడ్డి వస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అప్పటి వరకు దూరంగా ఉన్న అభిమానులు హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, వారిని దూరంగా పంపించారు. జగన్‌కు ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థి వైవీ.సుబ్బారెడ్డి, జిల్లా కన్వీనరు డాక్టర్ నూకసాని బాలాజీ, కనిగిరి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, కన్వీనర్లు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ, విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత రత్తయ్య, జిల్లా మైనారిటీ విభాగం నాయకుడు సయ్యద్ ఖాజా తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఓపెన్ టాప్ బస్సులో బయలుదేరిన జగన్ దారి పొడవునా నిల్చున్న వారిని పలకరిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బస్సుపై నుంచే ఆయన వేలాది మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆల్‌ఫ్రీ హామీలపై విరుచుకుపడ్డారు. విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం సీట్ల కోసం సోనియా గాంధీ, బీజేపీ నాయకులు, చంద్రబాబు నాయుడు కలసి బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని దుయ్యబట్టారు. చివరగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తానని, అది పూర్తి చేసి, మళ్లీ మీ దగ్గరకు వస్తానని హామీఇచ్చారు. అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞాపన: ‘నా పక్కన మదుసూదన్ యాదవ్ ఉన్నాడు. మంచివాడు.. యువకుడు.. ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. మనస్ఫూర్తిగా దీవించండని సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా కుడి పక్కన సుబ్బారెడ్డి ఉన్నారు. వరుసకు నాకు చిన్నాన్న అవుతారు. మంచివారు మీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ చల్లటి ఆశీస్సులు ఇవ్వండి.. ఆదరించండి. ఆప్యాయతలు చూపించాల్సిందిగా పేరు పేరునా చేతులు జోడించి కోరుతున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాను గుర్తుకు ఓటేసే వారు చేతులెత్తమని అడగడంతో, అక్కడున్న వారందరూ చేతులెత్తారు. తిరిగి అక్కడ నుంచి బస్సులోనే హెలిప్యాడ్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో బస్సుదిగి, కారులోకి మారి, హెలిప్యాడ్ చేరుకున్నారు. అక్కడ నుంచి కావలికి ఆయన బయలుదేరారు. చీరాలలో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి వరికూటి అమృతపాణి, చీరాల అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీలను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు రెహమాన్ ఖాన్‌తోపాటు జిల్లా సేవాదళ్ నాయకుడు ఆవుల చంద్రశేఖర్ రెడ్డి, చిన్న పరిశ్రమల విభాగం కన్వీనరు ఉడుముల లక్ష్మీ నారాయణరెడ్డి, ఎస్సీసెల్ నాయకుడు నల్లా సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
పేదవాడి కష్టాల చూసి మ్యానిఫెస్టో రాశా:జగన్
ప్రకాశం: తాను రాసిన మ్యానిఫెస్టో ఏసీ రూముల్లో కూర్చొని రాసింది కాదని.. పేదవాడి కష్టాల చూసి రాసిందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దివంగత మహానేత వైఎస్సార్ వెళుతూ వెళుతూ తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకునే ఓదార్పు యాత్ర కార్యక్రమం చేపట్టానన్నారు. ఈ రోజు జిల్లాలోని చీరాలలో జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశిస్తూ జగన్ ప్రసంగించారు. ప్రజలకు అవసరాలను తీర్చే మ్యానిఫెస్టోను తాను ఏసీ గదుల్లో కూర్చుని రాసింది కాదన్నారు. ఆ పేదవాడి కష్టాలను చూసి మాత్రమే తాను మ్యానిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. అక్కచెల్లెమ్మల కోసం అమ్మ ఒడి పథకంపై మొదటి సంతకం చేస్తానన్నారు. అంతే కాకుండా ప్రతీ స్కూలును ఇంగ్లీష్ మీడియం స్కూళ్లగా మార్చుతానన్నారు. వృద్ధులకు ప్రస్తుతం ఇచ్చే రెండొందల రూపాయల పెన్షన్ ను ఏడొందలు చేస్తూ రెండో సంతకం చేస్తానని జగన్ తెలిపారు. చేనేతలకు చెందిన అవ్వాతాతలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తానని హామీ ఇచ్చారు. మూడు వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ రైతన్నల కోసం మూడో సంతకం చేస్తానన్నారు. అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేస్తానని, అడిగిన వారికి 24 గంటల్లో ఏ కార్డైనా ఇచ్చేలా ప్రతి గ్రామంలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఐదో సంతకం చేస్తానని జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుని తలరాతను మార్చుకుందామన్నారు. వైఎస్ జగన్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జగన్ ప్రసంగిస్తుండగా ప్రత్యర్థులు పవర్ కట్ చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో వైఎస్ జగన్ సంయమనంతో ఉండాలంటూ కార్యకర్తలను కోరారు. ఓటుతో బుద్ది చెప్పాలంటూ పిలుపునిచ్చారు. -
వట్లూరు జనభేరిలో జగన్ ప్రసంగం
-
'ఆ క్షణం జగన్‌ను చూసి గర్వ పడ్డా'
-
మమ్మల్ని కాపు కాచింది మీరే
వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శృంగవరపుకోట (విజయనగరం), న్యూస్‌లైన్: ‘‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక నాలుగున్నరేళ్లలో ఎన్నో అకృత్యాలు, అరాచకాలు భరించాం.. అవమానాలు సహించాం. నేనూ, నాబిడ్డ కాంగ్రెస్ నుంచి బయటికి వస్తే రాజన్నవల్ల దగ్గర ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధిపొందిన రాజకీయ నేతలెవ్వరూ మా వెంట నిలవలేదు. మీరు మా వెంట నిలిచారు... మమ్మల్ని కాపు కాచారు. మీ వల్లే ఈ రోజు మేము మీ ముందు నిలవగలిగాం. నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ మీ ప్రేమ మరిచిపోను. మీరు చూపే ఆత్మీయత, ఆదరాభిమానాలు మరిచిపోలేనివి. మీ గుండెల్లో రాజన్నను చూసుకుంటున్నా’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి విజయమ్మ చెప్పారు. శనివారం ఆమె విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో పర్యటించారు. వేపాడ మండలంలో ఓబలయ్యపాలెం, ముకుందపురం, జగ్గయ్యపేట, లక్కవరపుకోట మండలంలో గొల్జాం, లక్కవరపుకోట, చందులూరు రేగ, లచ్చింపేట గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఎస్.కోటలో బాబాగుడి జంక్షన్‌తోపాటు పలు గ్రామాల్లో విజయమ్మ ప్రసంగించారు. ‘‘మూడేళ్లుగా అకాల వర్షాలు, తుపానులతో రైతాంగం అవస్థలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాలు వడ్డీలులేని రుణాలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సరిగా చెల్లించలేదు. ఈ పరిస్థితులు తొలగాలంటే మనసున్న నేతను, మంచి నాయకుణ్ని, మీ గుండెచప్పుడు వినే నేతను ఎన్నుకోవాలి. కులమతాలకు అతీతంగా అందరి బాధలు వినే నేత ను ఎన్నుకోవాలి. నాలుగేళ్లుగా జగన్‌బాబు మీతోనే ఉన్నాడు, మీ బాధలు విన్నాడు. రాజన్న సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ అందిస్తాడు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. -
తండ్రి మాటే బాటగా.. ఆశయ సాధనే లక్ష్యంగా..
-
ఎర్రటి ఎండలో.. ఆలస్యమైనా కూడా.. అంతే ఆప్యాయంగా..
-
'చందమామ కథలు వినడానికి ప్రజలు అమాయకులు కాదు'
-
'చందమామ కథలు వినడానికి ప్రజలు అమాయకులు కాదు'
ప.గో:నరేంద్ర మోడీ చెప్పే చందమామ కథలు వినడానికి ఇక్కడి ప్రజలు అమాయకులు కాదని వైఎస్సార్ సీపీ నేత షర్మిల విమర్శించారు. అసలు మోడీకి కుటుంబ విలువలు ఉన్నాయో లేదో తనకు తెలియదని, ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రం ఆ విలువలు బాగా తెలుసని షర్మిల తెలిపారు. జిల్లాలోని కొయ్యలగూడెం ఎన్నికల ప్రచార సభలో హాజరైన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిల.. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ ఏవో చందమామ కథలు చెబుతున్నాడని, వాటిని వినడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఏమీ అమాయకులు కాదని షర్మిల విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగిన సంగతిని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి ఊడిపడ్డ సీల్డ్ కవర్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారన్నారు. కాంగ్రెస్ అన్యాయంగా పరిపాలిస్తుంటే అధికార పక్షాన్ని నిలదీయకుండా బాబు కూడా కుమ్మక్కయ్యారన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించమన్న రైతన్నలపై చంద్రబాబు కాల్పులు జరిగినట్లు మోడీ తెలుసా?అని షర్మిల ప్రశ్నించారు. బాబు సైకో అన్న సంగతి, స్కామ్ ల సంగతి, వేల కోట్ల ఆస్తుల సంగతి అసలు మోడీకి తెలుసో?లేదో అని షర్మిల నిలదీశారు. స్కామ్ ల గురించి మోడీ మాట్లాడుతున్నారు.. అసలు చంద్రబాబు ఐఎంజీ అనే బోగస్ సంస్థకు తక్కువ ధరకే 850 ఎకరాల భూముల కట్టబెట్టారన్నారు. 2009 ఎన్నికలప్పుడు టీడీపీని విమర్శించిన పవన్.. 2014 లో ఆయనతోనే కలిసి పనిచేయడం దేనికి నిదర్శనమన్నారు. టీడీపీకి ప్రచారం చేపట్టిన పవన్ కు విశ్వసనీయతకు అర్థం తెలుసా?అని షర్మిల ప్రశ్నించారు. టీడీపీ-బీజేపీ కూటమికి ఎంతకు అమ్ముడుబోయావో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించుకుని తిరిగి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రేపు 4 జిల్లాల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం
కృష్ణా:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీమాంధ్ర ఎన్నికల ప్రచారం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పటికే సీమాంధ్రలో జిల్లాల్లో ప్రచారంలో దూసుకుపోతున్న జగన్.. శనివారం నాలుగు జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు రేపటి వైఎస్సార్ సీపీ ప్రచార షెడ్యూల్ ను ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం విడుదల చేశారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా రేపు ఉదయం 9.30 గం.లకు జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసే జనభేరీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించే సభలో పాల్గొంటారు. తరువాత తూర్పుగోదావారి జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసే జనభేరీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి విశాఖ చేరుకుని సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. -
'బాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే..'
-
'బీజేపీ, టీడీపీలు ఊసరవెల్లి పార్టీలు'
-
ఆ 48 గంటలు
-
గుంటూరు జిల్లా గురజాలలో షర్మిల జనభేరి
-
ప్రజా చైతన్యం
సాక్షి, ఒంగోలు: ‘మీ రాజన్న కూతుర్ని.. జగనన్న చెల్లెల్ని.. మీ ముందుకు వచ్చాను. మీకు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుతున్నాను. రాష్ట్రం దశాదిశ మారే ఎన్నికల పోలింగ్ రోజు మరి కొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం మన తలరాతలు మార్చేస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి.. జగనన్న జీవితాంతం మీ సేవకి అంకితమౌతాడు.’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన షర్మిల రోడ్‌షోలు, బహిరంగ సభలకు భారీ స్పందన లభించింది. ప్రజా చైతన్యం ప్రస్ఫుటమైంది. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సెంటర్ బహిరంగ సభకు జనం పోటెత్తగా ..దర్శి గడియార స్తంభం సెంటర్ నాలుగు రోడ్ల కూడలి జనసంద్రమైంది. పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో బహిరంగ సభ విజయవంతం అయింది. జనభేరి ఆద్యంతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రచార రథంపై ఆయా నియోజకవర్గాల లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, డాక్టర్ వరికూటి అమృతపాణి, పాలపర్తి డేవిడ్‌రాజు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి భరత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు ప్రసంగించారు. షర్మిల ప్రసంగిస్తూ విశ్వసనీయతకు మారు పేరైన వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మైనార్టీల స్వాగతోత్సాహం.. ‘అమ్మా.. మీ నాయన మాకెంతో మేలు చేశాడమ్మా.. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ తెచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కడవరకు దేవుడుగా కొలుస్తామమ్మా...’అంటూ యర్రగొండపాలెంలో ముస్లిం మైనారిటీ మహిళలు షర్మిలతో మాట్లాడారు. నియోజకవర్గంలోని కొమరోలులో బస కేంద్రం నుంచి బయలుదేరిన షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారు. బేస్తవారిపేట, కంభం, మార్కాపురం బైపాస్ రోడ్డు, తోకపల్లి జంక్షన్, కుంట, గురిజేపల్లి, గ్రామాల మీదుగా రోడ్‌షో జరిగింది. యర్రగొండపాలెం సెంటర్లో బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. ప్రధానంగా షర్మిల ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగటం.. ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అనంతరం కొత్తగోళ్ల విడిపి, అయ్యబొట్లపల్లి, త్రిపురాంతకం, రామసముద్రం, మిట్టపాలెం, మేడపి, వినుకొండ అడ్డరోడ్డు మీదుగా కురిచేడు చేరుకుని అక్కడ నుంచి దర్శికి వచ్చారు. పల్లె పల్లెన ప్రజలు రోడ్ల వెంట నిలుచుని షర్మిలకు చేతులెత్తి జై కొట్టగా.. ఆమె చిరునవ్వుతో అభివాదం చేశారు. -
షర్మిల రాక నేడు
సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మంగళవారం జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార జనభేరి నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం..ఉదయం గం.10.30కు యర్రగొండపాలెం నియోజకవర్గంలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.3.30కు దర్శిలో పర్యటిస్తారు. అక్కడ బహిరంగ సభ అనంతరం సాయంత్రం గం.5.20కు పర్చూరు నియోజకవర్గం చేరుకుంటారు. మార్టూరులో బహిరంగ సభ ముగించుకుని ఆమె గుంటూరు జిల్లా వెళ్తారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌షోలు, బహిరంగ సభలకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రానున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. మహిళా లోకం ఉత్సాహం: ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్ సోదరి షర్మిల జిల్లాకొస్తున్నారని తెలిసి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చూడాలని..కలిసి కరచాలనం చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. బహిరంగ సభల్లో షర్మిల ప్రసంగాల తీరు.. ప్రజలకు అభివాదం చేసే విధానం మహిళలను కట్టిపడేస్తాయి. జిల్లా పర్యటన సందర్భంగా షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేశారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాలపర్తి డేవిడ్‌రాజు, దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పర్చూరు అభ్యర్థి గొట్టిపాటి భరత్ ఆధ్వర్యంలో షర్మిలకు భారీ స్వాగతం పలికేందుకు పార్టీ కేడర్‌ను సమాయత్తపరిచారు. యర్రగొండపాలెం, దర్శిలో జరిగే బహిరంగ సభల్లో ఆయా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి, పర్చూరులో గొట్టిపాటి భరత్‌తో పాటు బాపట్ల లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ వరికూటి అమృతపాణి పాల్గొననున్నారు. -
జనం కోసం జగన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జగన్ కోసం జనం... జనం కోసం జగన్. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఈ దృశ్యం సాక్షాత్కరించింది. యువనేత రాక కోసం ఐదు గంటలపాటు వేచిచూసి జనం జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటారు. ప్రచార గడువు ముగుస్తున్నా.. పోలీసులు వెళ్లమని ఆదేశించినా అక్కడి నుంచి కదలని ప్రజానీకం... ఆయనొచ్చేవరకు నిరీక్షించారు. తన కోసం వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారని, తాను అక్కడికి చేరేవరకు ప్రచార గడువు ముగిస్తుందేమోనన్న సందేహం కలిగినా.. జనాన్ని కలిసేందుకు వైఎస్ జగన్ వచ్చారు. తన కోసం ఎదురుచూసేవారిని నిరాశపరచరని నిరూపించారు. తరలివచ్చిన ఆశేష జనవాహిని.. జననేత జగన్ మోహన్‌రెడ్డి కోసం అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గంటల తరబడి నిరీక్షించారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు ఎంతో ఓపికగా ఎదురుచూశారు. వైఎస్సార్సీపీ నిర్వహించదలచిన బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగర శివార్లలోని కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్లలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇబ్రహీంపట్నం చేరుకునేందుకు కాస్త ఆలస్యమైంది. ఈలోగా ప్రచారగడువు మించిపోయిందని, సభా వేదిక, ప్రాంగణం ఖాళీ చేసి వెళ్లాలని భారీ ఎత్తున హాజరైన ప్రజానీకాన్ని పోలీసులు ఆదేశించారు. దీంతో వారంతా వెనుదిరిగేందుకు రహదారిపైకి వస్తుండగా అంతలోనే జగన్ వాహనం అక్కడికి చేరుకుంది. యువనేత రాకతో ఉత్సాహం ఉరకలెత్తిన కార్యకర్తలు ఆయనతో కరచాలనం కోసం పోటీపడ్డారు. వాహనం నుంచి బయటకు వచ్చిన జగన్ ..రహదారి వెంట బారులు తీరిన అశేష జనానికి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గంటల తరబడి వేచిచూసినప్పటికీ, జగన్‌ను చూడలేకపోయామని దిగాలుగా వెనుదిరిగిన ఉన్న వృద్ధులు, మహిళలు రోడ్డు పక్కన నిల్చొని రాజన్న బిడ్డను చూసి ఆనంద పరవశులయ్యారు. పోలీసులు అత్యుత్సాహం జగన్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రచార గడువు కంటే కొన్ని నిమిషాల ముందే మైకులను నిలిపివేసిన పోలీసులు...సభా వేదిక నుంచి నేతలు దిగాలని ఒత్తిడి చేశారు. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న జగన్‌తో కరచాలనం చేస్తున్న ప్రజలను అడ్డుకున్నారు. జగన్‌ను ముందుకె ళ్లకుండా వెనుదిరగాలని స్థానిక ఏసీపీ సురేందర్‌రెడ్డి సూచించారు. ‘తానేమీ మాట్లాడడంలేదు కదా... నమస్కరించేందుకు అభ్యంతరం ఎందుకు చెబుతున్నారు?’ అని జగన్ ప్రశ్నించారు. ఇంతలోనే అభిమాననేతను చూసేందుకు, కరచాలనం కోసం వెల్లువెత్తిన అభిమానులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అభిమానులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. దీంతో జగన్‌ను సమీపం నుంచి చూసేందుకు వచ్చిన కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. -
వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
-
రేపు జిల్లాకు షర్మిల
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. షర్మిల మంగళవారం ఉదయం పది గంటలకు యర్రగొండపాలెంలో, మధ్యాహ్నం 3 గంటలకు దర్శి నియోజకవర్గంలో, సాయంత్రం 6 గంటలకు పర్చూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ఆమె ప్రసంగిస్తారు. షర్మిలకు భారీగా స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు, పార్టీ అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున ఓటర్లు తరలి రావాలని, పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలకాలని నూకసాని బాలాజీ కోరారు. -
వైఎస్సార్ పథకాలకు జీవం పోస్తాం:షర్మిల
చిత్తూరు:ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు తిరిగి జీవం పోస్తామని వైఎస్సార్ సీపీ నేత షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టి జగనన్న సీఎం అయిన తరువాత ఆ పథకాలను మళ్లీ బతికించుకుందామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ ఐదేళ్లలో ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని ఆమె తెలిపారు. ఈరోజు జిల్లాలోని తంబళ్లపల్లి ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన షర్మిల.. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే సంక్షేమం కోసం జగనన్న తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. జగన్ కు ప్రజల ముఖాల్లో చిరునవ్వులే ముఖ్యమని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలపై కక్ష కట్టి రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. పన్నులు, చార్జీలు పెంచిన కాంగ్రెస్‌ను చంద్రబాబు ఒక్కసారి కూడా నిలదీయలేదన్నారు. అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే విప్ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడరన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. -
'ఈ ఐదేళ్ళలో ప్రజల కోసం పోరాడింది జగనన్నే'
అనంత:ఈ ఐదేళ్లలో ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని వైఎస్సార్ సీపీ నేత షర్మిల పునరుద్ఘాటించారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా జిల్లాలోని మడకశిరలో ప్రసంగించిన షర్మిల.. ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పు చేపట్టిన సంగతిని గుర్తు చేశారు. జగనన్న పదవుల వదులుకుని జైలుకు వెళ్లాడని ఆమె తెలిపారు. అక్కడ కూడా అన్న ప్రజల పక్షానే నిలిచాడని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రం, దేశంలో రెండు సార్లు కాంగ్రెస్‌కు రెండు సార్లు అధికారం కట్టబెట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కే దక్కుతుందన్నారు. అలాంటి వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి కాంగ్రెస్ కు కుట్రలకు పాల్పడిందన్నారు. వైఎస్సార్ కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా తెలుగు ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఆ పార్టీ తెలుగు ప్రజలపై కక్ష కట్టి రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. అంతటి అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న చంద్రబాబు కనీసం నిలదీయకుండా కుతంత్ర రాజకీయాలు చేశారని షర్మిల మండిపడ్డారు. జగనన్న సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ ప్రతి పథకానికి జీ వం పోస్తారని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. -
బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా?:షర్మిల
అనంత: మానసిక స్థితి సరిగాలేని బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? అని షర్మిల నిలదీశారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే..ఆ కేసు నుంచి బయట పడేందుకు మానసిక స్థిమితం లేదంటూ బాలకృష్ణ ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతిని షర్మిల గుర్తు చేశారు. జిల్లాలోని హిందూపురంలో ప్రసంగించిన ఆమె.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలపై మండిపడ్డారు. పిచ్చివాళ్లకు ఓటు వేస్తే ప్రజలను పిచ్చోళ్లను చేస్తారన్నారు. మంచి కొడుకు అనిపించుకోలేని బాలకృష్ణ నటుడు కావొచ్చేమో కాని...మంచి రాజకీయ వేత్త కాలేరని షర్మిల అభిప్రాయపడ్డారు. మంచి నేత అంటే మీసాలు తిప్పడమో, తొడ గొట్టడమే కాదని..ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడమన్నారు. చంద్రబాబు ప్రజల కోసం ఏనాడు పోరాడ లేదని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేయడానికే ఆయనకు సమయం సరిపోయిందని షర్మిల తెలిపారు. ప్రజా సమస్యలపై అవిశ్వాసం పెడితే ఆయన విప్ జారీ చేసి కాంగ్రెస్‌ను కాపాడారన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి..ఆయనపై చెప్పులు వేయిస్తే బాలకృష్ణ మాత్రం ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నారు. కొడుకు అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆయనకు జగన్నను విమర్శించే స్థాయి ఉందా? అంటూ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కోసం మరణించిన కుటుంబాలను కొడుకుగా జగన్ ఓదార్చి.. చెయ్యని నేరాలకు జైలుకు వెళ్లారన్నారు. అసలు బాలయ్యకు.. జగనన్నకు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. రైతులు, చేనేతలు, విద్యార్థుల పక్షాన నిలబడి దీక్షలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనని ఆమె గుర్తు చేశారు. చివరకు ఓదార్పు కోసం జగన్ పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక భరోసా అని వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. పేదవాడి మనసెరిగి పరిపాలించిన ఆ మహానేతకు ఇప్పటికీ ప్రజల గుండెల్లో స్థానం పదిలంగానే ఉందన్నారు. జిల్లాలోని ఎన్నికల రోడ్ షోలో భాగంగా హిందూపురంలో పర్యటించిన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రాజన్న సువర్ణ యుగాన్ని తెచ్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆనాటి వైఎస్సార్ పాలనలో పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ప్రతీ పేద విద్యార్థి డాక్టర్, ఇంజనీర్ కావడమే లక్ష్యంగా పని చేసిన వైఎస్సార్ ప్రతీ ఒక్కరిగా భరోసా కల్పించారని షర్మిల తెలిపారు. ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం పేదవాడు వైద్యం చేయించుకోవడాని ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ముస్లిం మైనార్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లను వైఎస్సార్ కల్పించారన్నారు. ఆయన హయాంలో ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని షర్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
జగన్ సభలకు ముమ్మర ఏర్పాట్లు
హుజూర్నగర్/కోదాడ టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిం చాలని కోరుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హుజూర్‌నగర్‌లోని సాయిబాబా థియేటర్ పక్కనున్న నగర పంచాయతీ స్థలం లో సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వేలా దిమంది ప్రజలు ఎంతో అభిమానంతో ఎదురుచూస్తున్నారు. గతంలో రెండుసార్లు ఓదార్పుయాత్ర తేదీలు ఖరారైనా అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. హుజూర్‌నగర్‌లో వైఎస్సార్సీపీ ఇప్పటికే బలమైన పార్టీగా ఉంది. వైఎస్సార్సీపీ ఏర్పడ్డాక నియోజకవర్గంలో మొదటిసారిగా జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నారు. వైఎస్.జగన్ పర్యటనతో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అంతేగాక సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో సభాప్రాంగణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. కోదాడలో... జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కోదాడలో నిర్వహించే బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గున్నం నాగిరెడ్డి, కోదాడ అసెంబ్లీ అభ్యర్థి ఎర్నేని బాబులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వేలాదిమంది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు సభకు తరలివచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. పట్టణ పరిధిలోని బైపాస్‌రోడ్డు వద్ద ెహ లిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఆయన సభాస్థలికి చేరుకుంటారు. శనివారం సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయించడంతో పాటు వేదిక ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు పట్టణ నాయకులు తుమ్మలపల్లి భాస్కర్, పెంట్యాల పాపారావు, నెమ్మాది భాస్కర్, తోట ఆదిత్య, కర్ల సుందర్‌బాబు, జమీల్, లైటింగ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. సభలను జయప్రదం చేయాలి గట్టు శ్రీకాంత్‌రెడ్డి హుజూర్నగర్, కోదాడలలో జరిగే వైఎస్సార్ జనభేరి సభలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సాయిబాబా థియేటర్ సమీపంలోని సభ నిర్వహణ స్థలంలో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భా వం తర్వాత మొదటిసారిగా నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు భారీగా స్వాగ తం పలకనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, సానుభూతిపరులు, అనుబంధసంఘాల కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
జగన్.. జనభేరి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. వైఎస్సార్ జనభేరి పేర కోదాడ, హుజూర్‌నగర్‌లలో నిర్వహిస్తున్న ఎన్నికల బహిరంగసభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. జిల్లాలో వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర జరగాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో పర్యటన జరగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని జగన్ కోసం ఎదురుచూశాయి. ఈలోగా జగన్ సోదరి షర్మిల జిల్లాలో రెండు పర్యాయాలు పర్యటించారు. గత ఏడాది ఫిబ్రవరిలో మరో ప్రజాప్రస్థానం పేర ఐదు నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ తేదీన కూడా హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేటల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో షర్మిల పాల్గొన్నారు. అనూహ్యంగా, స్వచ్ఛందంగా కదిలివచ్చిన జనంతో ఆమె ఎన్నికల ప్రచారం సభలు విజ యవంతమయ్యాయి. రెండో విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో శనివారం పాల్గొననున్నారు. తొలుత కోదాడలో ఉదయం 10 గంటలకు, తర్వాత హుజూర్‌నగర్‌లో 11.30గంటలకు ఈ సభల్లో ప్రసంగిస్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి, సంక్షేమానికి చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలకు ఇంకా మరిచిపోలే దు. నాగార్జునసాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందేలా, ప్రపంచబ్యాంకు నిధులతో పాటు, సగం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించి చేపట్టిన సాగర్ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిందే వైఎస్సార్. పస్తుతం ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరైనా, ఆయన తర్వాత నిధుల విడుదల మందగించింది. అంతేకాకుండా టేలాండ్ భూముల కోసం పదుల సంఖ్యలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఎత్తిపోతల పథకా లు సైతం ఆయన టైమ్‌లోనే మంజూ రయ్యాయి. పులిచింతల ప్రాజెక్టు ముంపుతో నష్టపోతున్న ముంపువాసులకు రాష్ట్రంలోనే అత్యం త మెరుగైన ప్యాకేజీకి అనుమతి ఇచ్చింది కూడా వైఎస్సార్ కావడంతో ఆయన పట్ల ఇక్కడి ప్రజల్లో అభిమానం మెండుగా ఉంది. ఈ కారణంగానే సహకార, పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. ఫలితాలు వెలువడలేదు కానీ, మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికల్లోనూ వైఎస్సా ర్సీపీ అభ్యర్థులు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఎనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరి గెలుపు కోసం ఒక తడవ షర్మిల పర్యటించి వెళ్లగా, ఇప్పుడు ఆ పార్టీ అధినేత స్వయంగా ప్రచారానికి వస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. -
జనహోరు..
- జననేతకు నీరాజనం పలికిన జిల్లా ప్రజలు - మండుటెండలోనూ తరగని అభిమానం - వైఎస్ జగన్ మూడురోజుల పర్యటన విజయవంతం - పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత పర్యటన - ఫ్యాన్ ప్రభంజనాన్ని చాటిన జనభేరి ప్రచారం నిరంతరం తమ సంక్షేమం కోసం పరితపించే నాయకుడెవరో.. తమ కలలు సాకారం చేయగల సమర్థుడెవరో ప్రజలకు బాగా తెలుసు.. అందుకే జననేతపై అభిమానం చాటుకున్నారు. భానుడు నిప్పులు చెరుగుతున్నా వెరవలేదు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఎర్రటి ఎండలోనూ గంటలకొద్దీ నిరీక్షించారు. ఆత్మీయానురాగాలు పంచారు. వారందరిలో ఒకటే ఆశ.. రాజన్న బిడ్డను చూడాలని, ఆ అభిమాన నేత పలుకులు వినాలని. జనభేరి రథంపై చిరునవ్వులు చిందిస్తూ తమ ముందుకు వచ్చిన జగనన్నను చూడగానే వారి ముఖాల్లో వెలిగిపోయాయి. వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. ఆయన పర్యటన ఫ్యాన్ ప్రభంజనానికి అద్దం పట్టింది. జగన్ ఉద్వేగపూరిత ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని నింపాయి. సాక్షిప్రతినిధి, గుంటూరు, వైఎస్సార్ జనభేరికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన జననేతకు ప్రతి పల్లెలోనూ అఖండ స్వాగతం లభించింది. ఈ నెల 21వ తేదీ సోమవారం రాత్రి తెనాలి నియోజకవర్గం కొల్లిపర చేరుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి నివాసంలో బస చేశారు. మంగళవారం ఉదయం 10.45 నిమిషాలకు మాతృ వియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. డెల్టాలో అపూర్వ స్వాగతం.. జిల్లాలో ఎన్నికల పర్యటనకు వచ్చిన జగన్‌కు డెల్టా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 11.05 నిముషాలకు కొల్లిపర నుంచి జగన్రోడ్షో ప్రారంభించారు. రోడ్ల వెంట బారులు తీరిన అశేష జనవాహిని, ప్రజలు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు అభిమానం కురిపించారు. కొల్లిపర నుంచి బయలుదేరిన ఆయనకు తూములూరు వద్ద ఇటుకబట్టీ కార్మికులు, మహిళలు, మొక్కజొన్న రైతులు స్వాగతం పలికి వారి సమస్యలను వివరించారు. త్వరలోనే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ వారికి జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి శిరిపురం అడ్డరోడ్డుకు చేరగానే ప్రజలు జగన్‌పై పూలవాన కురిపించారు. అనంతరం అత్తోట చేరుకున్న జగన్‌కు రైతులు, రైతుకూలీలు వారి సమస్యలను వివరించారు. మీరు ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు తీరుతాయంటూ తెలిపారు. నంబూరు, కాజా గ్రామాల మీదుగా మంగళగిరిలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఆయన చెప్పే ప్రతి మాటకు హర్షధ్వానాలు చేశారు. మంగళగిరి నుంచి దుగ్గిరాల మీదుగా తెనాలి చేరుకున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అప్పటికే ప్రచార సమయం ముగియడంతో ఆయన ప్రసంగించకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలసంఖ్యలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనను అనుసరించారు. అక్కడి నుంచి ఆయన రాత్రి వినుకొండలోని బాలాజీ ఎస్టేట్స్‌కు చేరుకొని బస చేశారు.విను‘కొండంత’ అభిమానం... బాలాజీ ఎస్టేట్స్ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు ప్రచారానికి బయలుదేరిన జగన్‌కు వేలసంఖ్యలో ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలతో కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. నారపురెడ్డి పల్లె వద్ద బీఈడీ కళాశాల విద్యార్థులను, మార్గంమధ్యలో రైతులు, మహిళలను పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. వినుకొండ పట్టణానికి చేరుకొనే సరికి సమయం సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలైంది. సుమారు గంటసేపు మండుటెండలో ఆయన ప్రసంగించారు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బహిరంగసభ నుంచి వెళ్లలేదు. అనంతరం వినుకొండ నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన ఆయన నరసరావుపేట మండలం లక్ష్మీపురం, పిట్లూరివారిపాలెం మీదగా చిలకలూరిపేట బహిరంగసభకు హాజరయ్యారు. అన్నిగ్రామాల్లోనూ ప్రజల ఎదురేగి ఘనస్వాగతం పలికారు. చిలకలూరిపేటలో బహిరంగసభ అనంతరం పొన్నూరుకు చేరుకొని రాత్రి బసచేశారు. గురువారం ఉదయం పొన్నూరులో రోడ్‌షో అనంతరం అక్కడ జరిగిన బహిరంగసభలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. శోభమ్మ అక్కలాంటింది..:జగన్ పొన్నూరు బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ‘మీ అందరికో విజ్ఞప్తి ... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం నాకు తెలిసింది. శోభమ్మ కారు ప్రమాదంలో గాయపడటం నా మనసును తీవ్రంగా కలచివేసింది. శోభమ్మ నాకు అక్కలాంటిది. నా కోసం ఆమె ఎంతో చేశారు. నా ప్రతి అడుగులోనూ అడుగై నడిచారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమెను పరామర్శించేందుకు వెళ్తున్నా.. మండుటెండలో మేమంతా వేచి ఉంటే జగన్ మాట్లాడకుండా వెళుతున్నారని ఏమీ అనుకోవద్దు.. జగన్ మీ మనిషి... మీరు కాకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు..ఒక్క విషయం చెప్పదలచుకున్నా పొన్నూరు నియోజకవర్గ పార్టీ అభ్యర్తి రమణను, గుంటూరు ఎంపీ అభ్యర్థి బాలశౌరిలను గెలిపించండి’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్ పర్యటనతో జిల్లా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. పార్టీలో చేరిన ప్రముఖులు.. జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ సమక్షంలో పలువురు రాజకీయ ప్రముఖులు పార్టీలో చేరారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే చల్లా నారపరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షేక్ సుభాని, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దాసరి కిరణ్‌కుమార్, టీడీపీ నేత ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు చేరినవారిలో ఉన్నారు. -
రేపు జిల్లాకు జననేత
ఒక రోజు ఆలస్యంగా రానున్న జగన్ కోదాడ, హుజూర్‌నగర్‌లలో సభలు సాక్షిప్రతినిధి, నల్లగొండ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయడానికి జగన్మోహన్రెడ్డి 25న కోదాడ, హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ సీపీలో కీలకనేత, అసెంబ్లీ డిప్యూటీ లీడర్ అయిన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు వెళుతున్నారు. దీంతో జిల్లాలో పర్యటన ఒకరోజు వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం 25వ తేదీన కాకుండా 26వ తేదీన ఆయన కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొనను న్నారు. 26వ తేదీన కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో జరిగే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
జనాభిమానం
అభిమానం పెల్లుబికింది. ఆప్యాయత ఉప్పొంగింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. జననేత ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ రోడ్‌షో జగన్నినాదంతో మార్మోగింది. సాక్షి, ఒంగోలు, అద్దంకి జనం అదరగొట్టారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు అడ్డరోడ్డులో జనగర్జన హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ‘వైఎస్సార్ జనభేరి’ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోకు భారీ స్పందన లభించింది. ఐదు మండలాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఎడ్లబండ్లు, బస్సులు పెట్టుకుని మరీ స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు ఒకటీ..రెండు కాదు, ఏకబిగిన ఎనిమిది గంటల పాటు జగన్ కోసం నిలువెల్లా కనులై ఎదురుచూశారు. మిహ ళలు, వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు.. రైతులు, రైతు కూలీలు మండుటెండను సైతం లెక్కచేయకుండా జగన్‌పై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోడ్‌షో ఉదయం 12 గంటలకు జరగాల్సి ఉండగా... సాయంత్రం ఆరు గంటలకు జగన్ ప్రచారరథం అక్కడకు చేరింది. ఉదయం 10 గంటల నుంచే అద్దంకి నియోజకవర్గ గ్రామాల నుంచి ప్రజలు బండ్లు కట్టుకుని ఒక్కొక్కరుగా చేరుకున్నారు. వాహనాలకు పార్టీ జెండాలు పెట్టుకుని, తలలకు జెండాలతో పాగాలు చుట్టుకుని సంతమాగులూరు అడ్డరోడ్డులో సందడి చేశారు. గ్రామాల నుంచి వచ్చేప్పుడు భోజనం క్యారేజీలు సైతం తెచ్చుకుని.. పండగ తిరునాళ్లలో దేవుని దర్శనం కోసం వేచిఉండే చందంగా వాతావరణం కనిపించింది. హైవే జంక్షన్ జామ్ చేసిన జనాభిమానం.. నాయకుడిని ఎంచుకుని..అతన్నే ఎన్నుకోవడానికి అభిమాని ఎన్నికష్టాలైనా ఓరుస్తాడనేది బుధవారం జగన్ రోడ్‌షోకు గంటల తరబడి వేచిఉన్న జనాన్ని చూస్తే నిరూపితమైంది. అద్దంకి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ అమృతపాణి కలిసివచ్చి ఉదయం 11 గంటలకు సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద కనిపించగానే.. సామాన్య మధ్యతరగతి జనం వారిని అప్యాయంగా పలకరించారు. అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, జె.పంగులూరు, సంతమాగులూరు మండలాలతో పాటు పర్చూరు నియోజకవర్గం పరిధిలోని మార్టూరు మండల జనం కూడా బృందాలుగా వచ్చి జగన్ రోడ్‌షోను విజయవంతం చేశారు. పదేళ్లపాటు అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడా గొడవలకు తావులేకుండా.. ప్రశాంతంగా అభివృద్ధి జరగడమే ...ఇంతటి ప్రజాదరణకు కారణమని అక్కడకొచ్చిన జనం చెప్పడం విశేషం. - చిన్నారులు వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకుని ఎండకు మండుతున్న హైవేరోడ్డుపై తల్లులతో కలిసి చిరునవ్వులు చిందించడం రాజకీయ పరిశీలకులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. - పాతమాగులూరుకు చెందిన పేరం వీరమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు జగన్ వచ్చేదాకా తాను ఇంటికెళ్లనంటూ.. తనకు పింఛన్ రావడం లేదని చెబుతానంటూ వేచి ఉంది. - మిన్నేకల్లు గ్రామానికి చెందిన రైతు సాంబశివరావు కూడా ఇంటివద్ద నుంచి తెచ్చుకున్న సద్దిమూటను స్థానిక పెట్రోలు బంకు వద్ద కూర్చొని తింటూ.. జగన్‌ను చూసిన తర్వాతే ఇంటికెళ్తానని చిరునవ్వుతో చెప్పాడు. బైక్ ర్యాలీలతో జనభేరికి ఘనస్వాగతం.. గుంటూరు జిల్లా వినుకొండలో బహిరంగ సభ ముగించుకుని బయల్దేరిన జగన్‌కు ప్రకాశం జిల్లా సరిహద్దులోని వెల్లలచెరువు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బాపట్ల లోక్‌సభ, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థులు డాక్టర్ అమృతపాణి, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు జాగర్లమూడి రాఘవరావు, డాక్టర్ బాచినేని చెంచుగరటయ్య, ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైస్‌చైర్మన్ కోయి అంకారావు, అద్దంకి పట్టణ పార్టీ కన్వీనర్ కాకాని రాధాకృష్ణమూర్తి. మండల కన్వీనర్లు జ్యోతి హనుమంతరావు, జజ్జర ఆనందరావు, మలినేని గోవిందరావు, స్వయంపు హనుమంతరావు, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సందిరెడ్డి రమేష్, కరి పరమేష్, జిల్లాఎస్సీసెల్ నాయకుడు రంపతోటి సాంబయ్య, సంతమాగులూరు నేతలు ఓరుగంటి కోటిరెడ్డి, అట్ల చినవెంకటరెడ్డి. యమహా రాజు, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బైక్‌లతో ర్యాలీగా వెళ్లి స్వాగతం పలికారు. యువత వంటికి వైఎస్ఆర్ సీపీ జెండాలు చుట్టుకుని, రంగులు పూసుకుని బైక్‌లపై రకరకాల విన్యాసాలు చేయడం ఉత్సాహం కలిగించింది. -
తూర్పు గోదావరి జిల్లాలో విజయమ్మ జనపథం
-
కర్నూలు జిల్లాలో షర్మిలా జనపథం
-
అభిమాన గోదారి
ఎండ మండిపడే వేళ.. ఎవరైనా చల్లనిమాను నీడన చేరతారే తప్ప- ‘మబ్బు నీడ ఎక్కడా?’ అని ఓరకంట కూడా వెతుక్కోరు. దాహార్తులు చలివేంద్రాన్ని ఆశ్రయిస్తారే తప్ప-ఎండమావి దిక్కుకు అడుగు వేయరు. మనసావాచా కర్మణా తమ క్షేమాన్ని కాంక్షించే వారెవరో, తమ కలలను సాకారం చేయగలవారెవరో ప్రజలకు తెలుసు. విశ్వసనీయత ఏదో, విశ్వాసఘాతుకత్వం ఏదో.. పసిగట్టగల దిట్టలు వారు. అందుకే జిల్లాలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటన దిగ్విజయమైంది. ఆమెపై జనాభిమానం గోదావరి వరదనే చిన్నబుచ్చింది. జననేతపై గురి జేజేలుగా మార్మోగింది. సాక్షి, రాజమండ్రి : పుష్కరాలకు రాజమండ్రి నగరం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడిపోతుంది. అలాంటి రాజమండ్రి సహా జిల్లాలో పలు పట్టణాలు, గ్రామాలు.. ‘వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలు అప్పుడే వచ్చేశాయేమో!’ అనిపించేంతగా జనసంద్రాలయ్యాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, జననేత జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడురోజులు జరిపిన పర్యటనవిజయవంతమైంది. ఆమె అడుగిడిన ప్రతి చోటా మహిళలు అడుగడుగునా పూలజల్లులు, హారతులతో ఆత్మీయ స్వాగతం పలికారు. సోమవారం తునిలో విజయమ్మ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బుధవారం రాజమండ్రి సిటీ నియోజకవర్గంతో పర్యటన ముగించారు. బుధవారం ఉదయం మండపేట నుంచి బయలుదేరిన విజయమ్మ 10.20 గంట లకు అనపర్తి నియోజకవర్గంలోని పెడపర్తికి చేరుకున్నారు. అక్కడ అశేషంగా హాజరైన ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఫ్యాను గుర్తు కు ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలి పించాల్సిందిగా కోరారు. అనంతరం 12.00 గంటలకు అనపర్తి చేరుకుని దేవీచౌక్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. రాజన్న సువర్ణయుగం జగన్‌బాబుతోనే సాధ్యమని నొక్కిచెప్పారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి, అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డిలను గెలిపించాల్సిందిగా కోరారు. 12.30 గంటలకు బయలుదేరి జేగురుపాడు వద్ద ఆడదానిరేవు సమీపంలోని రామదాసు పేపర్‌మిల్స్ వద్ద భోజనానికి ఆగారు. అంతకుముందు విజయమ్మ పర్యటన పెరపర్తి, కుతుకులూరు, రామవరం, పొలమూరు గ్రామాల గుండా సాగింది. రూరల్‌లో ప్రభంజనం.. భోజన విరామానంతరం విజయమ్మ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండల గ్రామాల్లో పర్యటించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్, అసెంబ్లీ అభ్యర్థి ఆకుల వీర్రాజు ఆమెకు ఘన స్వాగతం పలికారు. 4.10 గంటలకు ప్రారంభమైన పర్యటన జేగురుపాడు, మాధవరాయుడుపాలెం సెంటర్, కడియపు సావరం మీదుగా 5.10 గంటలకు కడియం బొబ్బిలిబ్రిడ్జిపైకి చేరుకుంది. ‘మీ కష్టాలు తీరాలంటే జగన్‌ను అధికారంలోకి తీసుకురావా’లని ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపూ రాష్ట్రానికి రూ.వంద కోట్లు విలువచేసే ప్రాజెక్టు కూడా తేలేక పోయారని ధ్వజమెత్తారు. కేంద్రంలో చక్రం తిప్పానన్న ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. అక్కడినుంచి ప్రారంభమైన యాత్ర 5.55 గంటలకు ధవళేశ్వరం చేరుకుంది. ప్రాణమున్నంత వరకూ పదిలం మీ అభిమానం ధవళేశ్వరం బస్టాండు సెంటర్లో జరిగిన సభలో కిక్కిరిసిన జనం మధ్య విజయమ్మ ప్రసంగిస్తూ ‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ మీ అభిమానాన్ని మర్చిపోలే’నంటూ ఉద్వేగానికి గురయ్యారు. ప్రజల అభిమానాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా నన్నారు. మహానేత రాజశేఖరరెడ్డిలో ఉన్న రాజసం, తెగువ, ధైర్యం జగన్ బాబులో ఉన్నాయని, అక్కున చేర్చుకోవాలంటూ ప్రజల్ని కోరారు. అక్కడినుంచి 6.20 గంటలకు బయలుదేరిన పర్యటన స్వరాజ్‌నగర్, రాజమండ్రి రైల్వేస్టేషన్, కోటిపల్లి బస్టాండు, మెయిన్‌రోడ్, కందకంరోడ్డు, లక్ష్మివారపుపేట, దేవీచౌక్, తుమ్మలావ, ఆర్యాపురం, లింగంపేట, ఆదెమ్మదిబ్బ, కంబాలచెరువు సెంటర్ల మీదుగా ఆజాద్‌చౌక్‌కు చేరుకుంది. అయిదు చేవ్రాళ్లు.. అయిదు వరాలు అంతకు ముందు ఆమెకు కోటిపల్లి బస్టాండు వద్ద పార్టీ కోఆర్డినేటర్, సిటీ నియోజకవర్గ అభ్యర్థి బొమ్మన రాజ్‌కుమార్, ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా తన కోసం వేచి ఉన్న వేలాది మంది ప్రజల అభిమానంతో విజయమ్మ ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆజాద్ చౌక్‌లో సభాస్థలానికి చేరుకున్న వెంటనే మైనార్టీలు, ఇతర వర్గాల ప్రజలు వేలాదిగా ఎదురొచ్చి స్వాగతం పలకడం చూసి విచలితులయ్యారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘రాజశేఖరరెడ్డి లేని లోటు నాకు ఈ జన్మలో తీరేది కాదు. కానీ ప్రజలకు రాజన్నలేని లోటును జగన్‌బాబు తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు. జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవితాలను మార్చే పథకాలపై ఐదు సంతకాలు చేస్తారని, ఆ రోజునుంచే అవి అమల్లోకి వస్తాయని జగన్ తరపున విజయమ్మ హామీ ఇచ్చారు. పర్యటించిన ప్రతి చోటా ఈ మాట చెపుతున్నప్పుడు సభాప్రాంగణాలు కరతాళ ధ్వనులతో మారుమోగాయి. పార్టీ శ్రేణుల్లో పరవళ్లు తొక్కిన సమరోత్సాహం మూడు రోజులు సాగిన విజయమ్మ పర్యటనతో పార్టీ శ్రేణుల సమరోత్సాహం పదిరెట్లయింది. ఆమె కొన్ని నియోజకవర్గాల్లోనే పర్యటించినా.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ నేతలు, కార్యకర్తలు జనభేరి సభలకు పోటెత్తారు. ఆమెకు అడుగడుగునా లభించిన జనాదరణతో అభ్యర్థుల్లో విజయం పట్ల విశ్వాసం ద్విగుణీకృతమైంది. ప్రత్యర్థుల గుండెలలో రైళ్లు పరిగెత్తాయి. -
గుంటూరు జిల్లాలో జగన్ జనపథం
-
రంగారెడ్డి జిల్లాలో షర్మిలా జనపథం
-
జనభేరి సక్సెస్
-
నెల్లూరు జిల్లాలో జగన్ జనపథం
-
గుంటూరు జిల్లాలో జగన్ జనపథం
-
తూర్పు గోదావరి జిల్లాలో విజయమ్మ జనపథం
-
'రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం'
గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ కుమ్మక్కై న చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించాడని విమర్శించారు. జిల్లాలోని మంగళగిరి ఎన్నికల రోడ్ షోకు హాజరైన వైఎస్ జగన్.. చంద్రబాబు -కాంగ్రెస్ కలిసి ఆడిన డ్రామాలను ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కాపాడితే.. ఆయన కేసులపై విచారణ జరగకుండా కాంగ్రెస్ కాపాడిందని జగన్ మరోమారు పునరుద్ఘాటించారు. ఆయన కేసులపై కనీసం సీబీఐ విచారణ జరపదని, విచారణ చేపట్టడానికి తగిన సిబ్బందే లేరని సీబీఐ ఏవో కారణాలు చూపుతుందన్నారు. తన ఎంపీలతో ఓటు వేయించి రాష్ట్ర విభజనకు బాబు సహకరించిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓట్లు - సీట్లు కోసం దొంగ కేసులు పెట్టించి జైల్లో పెట్టడానికి వారి మనస్సాక్షి అడ్డు రావడం లేదన్నారు. ఇలాంటి రాజకీయ చదరంగం నేడు జరుగుతోందన్నారు.'ఆయనలా అబద్ధాలు ఆడటం తనకు చేతకాదు. ఆయన మాదిరి నిజాయితీలేని రాజకీయాలు చేయలేను.ఆయన మాదిరి విశ్వసనీయతలేని రాజకీయాలు చేయలేను. నాకు వారసత్వంగా వచ్చింది వైఎస్సార్ నుంచి వచ్చిన విశ్వసనీయతే'అని జగన్ తెలిపారు. ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందామని జగన్ ప్రజలకు సూచించారు. ఏ నాయకుడు అయితే ప్రతి పేదవాడి మనసు ఎరుగుతాడో అటువంటి వారికే ఎన్నికల్లో గెలిపించాలన్నారు. ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు ముందు బాబు పాలన భయానకంగా సాగిందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విశ్వసనీయత కల్గిన వైఎస్సార్ సీపీ పట్టం కట్టాలని ప్రజలకు విజ్క్షప్తి చేశారు. -
'రాష్టానికి పట్టిన పీడకల..చంద్రబాబు పాలన'
తూ.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ఆయన పాలన రాష్ట్రానికి పట్టిన పీడకలగా మిగిలిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా తాళ్లరేవులో ప్రసంగించిన విజయమ్మ ..ఆనాటి టీడీపీ పాలనను కడిగిపారేశారు. చంద్రబాబు పాలనలో ఏదీ సక్రమంగా అమలు జరగలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనంతా కుంభకోణాలమయంగా ఆమె అభివర్ణించారు. సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పేరు చెప్పే అర్హత లేదన్నారు. సమైక్యాంధ్ర ముసుగేసుకుని కిరణ్ సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. పీఆర్పీని స్థాపించి ఆ తరువాత కాంగ్రెస్ విలీనమైన చిరంజీవి చరిత్రను ఎవరూ మరిచిపోరన్నారు. ఆయనది అభిమానులను తాకట్టుపెట్టిన చరిత్రని విజయమ్మ మండిపడ్డారు. ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెబుతున్న వీరి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితే లేదన్నారు. ప్రజా అభివృద్ధిని సక్రమైన మార్గంలో చేసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉందని, ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ గెలిపించుకుని చరిత్ర సృష్టిద్దామని విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఓటేసే ముందు ఒక్కసారి వైఎస్సార్ గుర్తు చేసుకుని పార్టీని అఖండ మెజారిటీ గెలిపించాలన్నారు. -
చంద్రబాబుకివే చివరి ఎన్నికలు
ఎన్నికలయ్యాక టీడీపీ కనుమరుగు కాకతప్పదు ప్రకాశం జిల్లా వైఎస్సార్ జనభేరి సభల్లో జగన్ అందుకే బాబు అడ్డగోలు హామీలిస్తున్నారు ఆయనలా తప్పుడు హామీలివ్వను, ఇవ్వలేను ఇచ్చిన హామీని నిలుపుకొనేందుకు ఎందాకైనా వెళతా దివంగత నేత పథకాలను మరింత మెరుగుపరుస్తా ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశ మారుస్తా సమర్థ పాలన అందిస్తా...రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ తెస్తా కందుకూరు/సింగరాయకొండ (ప్రకాశం జిల్లా): ‘‘65 ఏళ్ల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఈ ఎన్నికల అనంతరం తన పార్టీ టీడీపీ కనుమరుగుకాక తప్పదని ఆయనకు తెలుసు. అందుకే ఎన్ని అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. వ్యవసాయ రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగమంటూ ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో బాబు మీ ముందుకొచ్చినప్పుడు... తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఏం చేశారని నిలదీయండి. కరెం టు చార్జీలు తగ్గించమన్న రైతులపై బషీర్‌బాగ్‌లో తుపాకి గుళ్లు కురిపించిందెవరని ప్రశ్నించండి. అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిందెవరని అడగండి. 65 ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి 26 వేలమందిని రోడ్లపాలు చేసిందెవరని నిలదీయండి’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ కేంద్రంలో, కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో మాట్లాడారు. ‘‘నాలుగున్నరేళ్లుగా నేను ఎంత కష్టపడుతున్నానో మీ అందరికీ తెలుసు. భార్యాబిడ్డలను వదిలి... ఎండనక వాననక.. పగలనక రేయనక మీ మధ్యనే ఉన్నా.. మీ కోసమే పనిచేశా. చంద్రబాబు కన్నా నేను 25 సంవత్సరాలు చిన్నవాణ్ణి. మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉండేవాణ్ణి. దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వంగా ‘విశ్వసనీయత’ను పుణికిపుచ్చుకున్నవాణ్ణి. చంద్రబాబులా తప్పుడు హామీలివ్వను. ఇచ్చిన హామీలను నిలుపుకొనేందుకు ఎందాకైనా వెళతా. నేను యువతరం ప్రతినిధిని. సమర్థమైన పాలన అందిస్తా. రాజశేఖరుని సువర్ణయుగాన్ని మళ్లీ తెస్తా. మన తలరాతలు మార్చే సార్వత్రిక ఎన్నికలు మరో 16 రోజుల్లో రానున్నాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుళ్లు, కుట్రల రాజకీయాలకు చరమగీతం పాడండి. వైఎస్సార్ అందించిన విశ్వసనీయతకు పట్టం కట్టం డి. పేదవాడి గుండెచప్పుడు వినే.. ప్రజల మనసెరిగే నడుచుకునే నాయకుడిని సీఎంగా ఎన్నుకోండి. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే... ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశ మారుస్తా వైఎస్ నుంచి వారసత్వంగా వచ్చిన విశ్వసనీయత సాక్షిగా చెపుతున్నా. నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసే వేదికపైనే చేయబోయే ఐదు సంతకాలు రాష్ట్ర దశ, దిశను మారుస్తాయి. అక్కాచెల్లెళ్లు ఆరు, ఏడు తరగతి చదువుతోన్న పిల్లలను చదివించే స్థోమత లేక కూలి పనులకు తీసుకెళ్తున్నారు. అక్కాచెల్లెళ్లను ఆ కష్టాలకడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం చేయబోతున్నా. ఇద్దరు పిల్లలను బడికి పంపితే అక్కాచెల్లెళ్ల ఖాతాలో ప్రతి నెలా రూ.వెయ్యి జమ చేస్తా. నా అవ్వాతాతలకు ఓ మనవడిగా భరోసా ఇస్తున్నా. నెలకు రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా రెండో సంతకం చేయబోతున్నా. రైతన్నల కోసం మూడో సంతకం చేయబోతున్నా. రైతులకు మద్దతుధర, గిట్టుబాటు ధర కల్పించడం కోసం రూ.మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. కరువు, వరద వచ్చినప్పుడు వెంటనే ఆదుకోవడానికి ఏటా రూ.2 వేల కోట్లతో సహాయ నిధి ఏర్పాటుచేస్తా. నా అక్కాచెల్లెళ్ల కోసం నాలుగో సంతకం చేయబోతున్నా. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.రేషన్‌కార్డు, పెన్షన్‌కార్డు, మరే కార్డు కావాలన్నా మీ ఊర్లో, మీవార్డులోనే 24 గంటల్లోగా ఇప్పించేలా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయించేలా ఐదోసంతకం చేస్తా. మూడు రకాల అంబులెన్స్‌లు ప్రవేశపెడతా... మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది. 108, 104 సర్వీసులకు నిధులివ్వకుండా మూలనపడేసింది. నేను అధికారంలోకి రాగానే రాజన్న పథకాలన్నింటినీ సమర్థంగా అమలుచేస్తా. అనారోగ్యంతో ఉన్న వారు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో ఇంటి వద్దకు వచ్చేలా 108 సర్వీసులను మెరుగుపరుస్తాం. రైతన్నకు తన పొలంలో భూసారం ఎంతుందో? ఏ ఎరువులు ఏ మోతాదుల్లో వాడాలో? ఏ పైరు వేసుకోవాలో తెలిపేందుకు 103ని ప్రవేశ పెడతాం. రైతు 103కి ఫోన్ చేయగానే శాస్త్రవేత్తలు ఆ రైతు పొలం వద్దకు వెళ్లి భూసార పరీక్షలు చేసి సలహాలు ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తాం.పాడి పశువులు జబ్బుపడితే 102కు ఫోన్ చేస్తే చాలు.. 20 నిమిషాల్లో పశువైద్యులు వచ్చి ఆ పశువుకు వైద్యం చేసేలా వినూత్న పథకాన్ని అమలు చేస్తాం. 2019 నాటికి ఏ గ్రామానికైనా వెళ్లి ఇళ్లులేని వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నిస్తే ఒక్క చేయి కూడా పైకి లేవకుండా చేస్తా. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో 47 లక్షలు ఇళ్లు నిర్మిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు నిర్మించారు. ఆయన స్ఫూర్తితో ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. లక్ష వ్యయంతో ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాదు.. ఆ ఇంటి పట్టాలు అక్కా చెల్లెళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తా. వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నమైన ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నీరుగార్చింది. 133 రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించారు. నేను ముఖ్యమంత్రినయ్యాక వీటన్నిటినీ చేర్చి ఆరోగ్యశ్రీని మరింత బాగా అమలు చేస్తా. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందినవారు డాక్టర్ సూచన మేరకు వారు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే.. అన్ని రోజులు నెలకు రూ.మూడు వేల చొప్పున సహాయంగా అందిస్తా. ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి ఇప్పుడు బిల్లు రూ.550 వరకూ వస్తోంది. ఆ బిల్లులు కట్టలేని దుస్థితిలో పేదలు ఉంటే.. కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. దొంగ కనెక్షన్ తీసుకుని పేదలు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. నేను ముఖ్యమంత్రినయ్యాక ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి అవసరమైన 150 యూనిట్లు రూ.100కే ఇస్తా.వ్యవసాయానికి పగటి పూట ఏడుగంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా 2019 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నా. ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన పిల్లలు బెల్ట్‌షాపుల వల్ల దారితప్పుతున్నారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక బెల్ట్‌షాపులను మూసివేయిస్తా. బెల్ట్‌షాపులు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి పదిమంది మహిళా పోలీసులను నియమిస్తా. ప్రతి నియోజకవర్గానికి ఒక చోటే మద్యం దుకాణం ఉంటుంది. ఆ షాపును కూడా ప్రభుత్వమే నడుపుతుంది. మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా ఉంటాయి. చంద్రబాబు తరహాలో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. సొంత తమ్ముడు, చెల్లెమ్మకు ఉద్యోగం కోసం ఎంత కష్టపడతానో అదే రీతిలో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తా. -
రంగారెడ్డి జిల్లాలో షర్మిలా జనపథం
-
ఒంగోలు జిల్లాలో జగన్ జనపథానికి ఎగసిపడిన జన సంద్రం
-
తూర్పు గోదావరి జిల్లాలో విజయమ్మ జనపథం
-
'చంద్రబాబు పాలనలో ప్రజలు వలసపోయారు'
తూ.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. ఆయన పాలనలో ప్రజలు వలస వెళ్లిపోయారని ఆమె విమర్శించారు. ఈ రోజు జిల్లాలోని ప్రత్తిపాడు ఎన్నికల రోడ్ షోకు హాజరైన ఆమె జన నీరాజనాలు అందుకున్నారు. అక్కడకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన విజయమ్మ.. చంద్రబాబు పాలనలో ప్రజలు వలసబాట పట్టారన్నారు. టీడీపీ ఏ పథకాల మీద అధికారంలోకి వచ్చిందో.. ఆ తర్వాత వాటిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరిచిపోయారన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు రాకపోవడం కారణం చంద్రబాబేనన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్ట్‌లను ఆయన ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ సింగపూర్ తిరిగి.. ఆంధ్రప్రదేశ్‌ను శ్మశానంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విజయమ్మ తెలిపారు. రైతులు, మహిళలు, పేదలకు భరోసా ఇచ్చిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డేనని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. ఆయనలో తెగువ, తపన జగన్ లో ఉన్నాయని విజయమ్మ తెలిపారు. సుపరిపాలన అవసరమనుకుంటే మంచి నేతనే ఎన్నుకోవాలన్నారు. -
చంద్రబాబును నిలదీయండి:వైఎస్ జగన్
ప్రకాశం:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.ఆనాటి చంద్రబాబు పాలనంతా విశ్వసనీయతకే అర్ధం తెలీకుండా సాగిందని జగన్ విమర్శించారు. జిల్లాలోని సింగరాయకొండ ఎన్నికల రోడ్ షోకు హాజరైన ఆయన.. ఓటుతో తలరాతను మార్చుకుందామని హితవు పలికారు. ఇవాళ ఏ ఒక్క నేతకు విశ్వసనీయతకు అర్ధం తెలీకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాజకీయాల్ని దిగజార్చరన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు సాధ్యం కాని హామీలను ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఇప్పుడిచ్చే హామీలను ఎందుకు అమలు చేయలేదనిన జగన్ ప్రశ్నించారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో కనీసం చంద్రబాబు తెలుసుకుని ప్రయత్నం చేయలేదన్నారు. మద్యపానాన్నినిషేధిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అనంతరం ఆ విషయాన్నిపక్కకు పెట్టారన్నారు. ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు అదే అంశంపై నిలదీయమని ప్రజలకు జగన్ సూచించారు. -
చెప్పేదే చేస్తా... చేసేదే చెప్తా
-
కందుకూరులో జనసునామీ
-
చెప్పేదే చేస్తా... చేసేదే చెప్తా
కందుకూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా తాను విశ్వసనీయ లేని రాజకీయాలు చేయలేనని వైఎస్సార్ సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ జనభేరి యాత్రలో భాగంగా జగన్ సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు బహిరంగ సభలో ప్రసంగించారు. 'దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు చాలామంది ముఖ్యమంత్రులున్నారు. ఆయన హఠాన్మరణం తర్వాత కొందరు ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పింది వైఎస్సార్ ఒక్కరే. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఆయనొక్కరే. అందుకే ఆయన మరణిస్తే వందలాది గుండెలు ఆగిపోయాయి. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు. అందుకే ఆ మహానేత ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే... ప్రజల చేయి నేరుగా వారి గుండెల మీదకు వెళ్తుంది. రాజన్న మా గుండెల్లో జీవించి ఉన్నారని వారు నినదిస్తారు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వారసత్వంగా ఏదైనా వచ్చిందీ అంటే అది ఒక్క విశ్వసనీయతే. అందుకే నేను చంద్రబాబులా అబద్ధాల హామీలు ఇవ్వను. చెప్పేదే చేస్తా... చేసేదే చెప్తా’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఓటు వేసే ముందు ఒకసారి ప్రశ్నించుకోవాలని, ఎలాంటి నాయకుడు కావాలి, ఎటువంటి ముఖ్యమంత్రి కావాలో ప్రశ్నించుకోవాలని జగన్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఏ నాయకుడు అయితే ప్రజల గుండెల్లో నిలుస్తాడో వారినే సీఎంగా తెచ్చుకోవాలన్నారు. అప్పుడే వారి తలరాతలను మారతాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. -
కందుకూరులో జనసునామీ
కందూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘ వైఎస్సార్ జనభేరి’కి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా రాజన్న తనయుడికి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రకాశం జిల్లా కందూరులో సోమవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్సందన లభించింది. కనీవినీ ఎరగని రీతిలో జనం హాజరయ్యారు. యువనేత చూసేందుకు వచ్చిన జనంతో కందూరు కిక్కిరిసింది. ఎటు చూసినా జనమే కనిపించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో కందుకూరులో జనసునామీ వచ్చిందా అనిపించింది. జగన్ కాన్వాయ్ వెంట వేలాది సంఖ్యలో జనం తరలివచ్చారు. తన కోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రజలకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. తనపట్ల చూపుతున్న ప్రేమాదరణకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. -
సోమశిల ఉత్తరకాలువ పూర్తి చేస్తా
సాక్షి, నెల్లూరు : సోమశిల ఉత్తర కాలువను పూర్తిచేసి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆత్మకూరు సభలో జగన్ మాట్లాడారు. మహానేత వైఎస్సార్ హయాంలో సోమశిల ఉత్తరకాలువ నిర్మాణానికి రూ.177 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారన్నారు. వైఎస్సార్ హయాంలో దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. తొలుత 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో పనులు జరిగాయన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర కాలువ పనులను పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఉత్తర కాలువకు సంబంధించిన అన్ని అనుమతులు పొంది వెంటనే కాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు ప్రాజెక్ట్ వరకు నీటిని నడిపి ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి ఇబ్బందులు సైతం తీరుస్తామని జగన్ హామీ ఇచ్చారు. మేకపాటికి కేంద్రమంత్రి వర్గంలో చోటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆత్మకూరు ప్రచారసభలో జగన్ ప్రసంగిస్తూ గతంలో లాగా మేకపాటికి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీని ఇవ్వాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకొని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గౌతమ్‌రెడ్డిని ఆశీర్వదించండి వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు.