సాక్షి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మంగళవారం జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార జనభేరి నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం..ఉదయం గం.10.30కు యర్రగొండపాలెం నియోజకవర్గంలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.3.30కు దర్శిలో పర్యటిస్తారు. అక్కడ బహిరంగ సభ అనంతరం సాయంత్రం గం.5.20కు పర్చూరు నియోజకవర్గం చేరుకుంటారు. మార్టూరులో బహిరంగ సభ ముగించుకుని ఆమె గుంటూరు జిల్లా వెళ్తారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌షోలు, బహిరంగ సభలకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రానున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు.
మహిళా లోకం ఉత్సాహం:
ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్ సోదరి షర్మిల జిల్లాకొస్తున్నారని తెలిసి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చూడాలని..కలిసి కరచాలనం చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. బహిరంగ సభల్లో షర్మిల ప్రసంగాల తీరు.. ప్రజలకు అభివాదం చేసే విధానం మహిళలను కట్టిపడేస్తాయి. జిల్లా పర్యటన సందర్భంగా షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేశారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాలపర్తి డేవిడ్‌రాజు, దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పర్చూరు అభ్యర్థి గొట్టిపాటి భరత్ ఆధ్వర్యంలో షర్మిలకు భారీ స్వాగతం పలికేందుకు పార్టీ కేడర్‌ను సమాయత్తపరిచారు. యర్రగొండపాలెం, దర్శిలో జరిగే బహిరంగ సభల్లో ఆయా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి, పర్చూరులో గొట్టిపాటి భరత్‌తో పాటు బాపట్ల లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ వరికూటి అమృతపాణి పాల్గొననున్నారు.
షర్మిల రాక నేడు
Published Tue, Apr 29 2014 2:19 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement