
కందుకూరులో జనసునామీ
కందూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారయాత్ర ‘ వైఎస్సార్ జనభేరి’కి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా రాజన్న తనయుడికి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.
ప్రకాశం జిల్లా కందూరులో సోమవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్సందన లభించింది. కనీవినీ ఎరగని రీతిలో జనం హాజరయ్యారు. యువనేత చూసేందుకు వచ్చిన జనంతో కందూరు కిక్కిరిసింది. ఎటు చూసినా జనమే కనిపించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో కందుకూరులో జనసునామీ వచ్చిందా అనిపించింది.
జగన్ కాన్వాయ్ వెంట వేలాది సంఖ్యలో జనం తరలివచ్చారు. తన కోసం ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రజలకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. తనపట్ల చూపుతున్న ప్రేమాదరణకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు.