Kandukuru
-
బాబుకే షాకిచ్చిన స్టూడెంటు
-
ఫ్యూచర్‌సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూములపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌సిటీ చుట్టూ ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములపై పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమ సన్నిహితుల ద్వారా ఆయా గ్రామాల్లోని వ్యవసాయ పట్టా భూముల ధరలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు పుష్కలంగా, ఎర్రటి నేలలున్న భూములను కొనుగోలు చేసి పెట్టాలని కోరుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ యాచారం–కందుకూరు మండలాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీని నెలకొల్పడానికి సంకల్పించడం తెలిసిందే. కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీకి 300 అడుగుల రోడ్డు, మెట్రోరైలు మార్గానికి పచ్చజెండా ఊపింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే భావనతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పెట్టుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో తమ సన్నిహితులతో కలిసి వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు. ఆ గ్రామాలపై ఫోకస్.. కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేట, ఆకులామైలారం, బెగరికంచె, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, దాసర్లపల్లి, లేముర్, గూడూర్, యాచారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల, తుక్కగూడ తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీకి సమీపంలోని యాచారం, కందుకూరు గ్రామాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు ఫాంహౌస్లపై ఆసక్తి యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. భూగర్భ జలాలకు ఢోకా లేదు. అందుకే ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఉంది. అత్యధికంగా 5 నుంచి 10 ఎకరాల్లోపే కొనుగోలు చేసేలా దృష్టి సారించారు. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో.. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలుకు కొంత మంది పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరైతే నేరుగా రైతులతోనే మాట్లాడుకుని వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రియల్ వ్యాపారి, హైదరాబాద్ -
ఉద్యమ స్ఫూర్తితో ఉపాధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నీళ్లు, నిధులు, నియామ కాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలి్పంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఒక్కరికీ గ్యారంటీగా ఉపాధి లభిస్తుందని హామీ ఇచ్చారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. తర్వాత నెట్ జీరో సిటీలో భాగంగా బేగరికంచె గ్రామ పరిధిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నాలుగో నగరంగా బేగరికంచె అభివృద్ధి ‘హైదరాబాద్‌ను నవాబులు, సికింద్రాబాద్‌ను బ్రిటిషర్లు, సైబరాబాద్‌ను చంద్రబాబు, వైఎస్సార్‌లు నిర్మిస్తే.. నాలుగో నగరంగా బేగరికంచెను మేము అభివృద్ధి చేయబోతున్నాం. నాలుగేళ్లలోనే న్యూయార్క్‌ను మించిన నగరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తాం. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కలి్పస్తాం. తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్యపై కొనసాగింది. అందులో యువత కీలక పాత్ర పోషించింది.ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటికి వస్తున్నా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెడుతూ అశోక్‌నగర్ చౌరస్తాలోని కోచింగ్ సెంటర్లలో చేరినా, సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలు దొరకడం లేదు. పీజీ, పీహెచ్డీ పట్టాలు పొంది కూడా నిరుద్యోగులుగా మిగులుతున్న యువతకు ఈ స్కిల్స్ యూనివర్సిటీలో డిప్లొమా, డిగ్రీ సరి్టఫికెట్ కోర్సులు అందించడంతో పాటు ఆయా సంస్థల్లో ఉపాధి కలి్పస్తాం. ఇక్కడ అడ్మిషన్ పొందితే చాలు.. జాబ్ గ్యారంటీ. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించి ఉపాధి కలి్పస్తాం..’అని సీఎం చెప్పారు. 3 నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు షురూ ‘రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకప్పుడు వేలల్లో ఉన్న భూముల ధరలు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రాకతో ప్రస్తుతం కోట్లకు చేరాయి. మరో మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులను ప్రారంభిస్తాం. నెట్ జీరో సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు 200 అడుగుల ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు సహా మెట్రో రైలు నిర్మాణానికి భూసేకరణ పనులు చేపడతాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా బేగరికంచె వరకు మెట్రో రైలును విస్తరింపజేస్తాం. కడ్తాల్ అడవుల్లో నైట్ సఫారీ కడ్తాల్, ఆమనగల్లు అడవుల్లో నైట్ సఫారీ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం. ఫార్మాసిటీ కోసం భూములు త్యాగం చేసిన రైతులు అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలను చదివించి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. విమానం కొనాలన్నా, ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అవకాశాలు ఉంటాయి.ఈ ప్రాంతానికి తాగునీరు సహా రోడ్లు, పార్కులు ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం..’అని రేవంత్ చెప్పారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, నీటి పారుదలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చొరవతోనే అనేక యూనివర్సిటీలు, ప్రాజెక్టులు వచ్చాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, భాక్రానంగల్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో రైతాంగానికి సాగు నీరు అందుతోంది..’అని అన్నారు. ప్రపంచానికే తలమానికం: డిప్యూటీ సీఎం భట్టి ‘స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా శంకుస్థాపన కూడా చేసుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ప్రపంచానికే తలమానికం కాబోతోంది. భూములు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో 600 ఎకరాల్లో అద్భుతమైన కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నాం. ప్లాట్లు పొందిన ప్రతి రైతు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటిì నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మాది చేతల ప్రభుత్వం: మంత్రి కోమటిరెడ్డి తమది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వందలకొద్దీ కాలుష్య కారక ఫార్మా కంపెనీలు ఒకే చోట వస్తున్నాయని తెలిసి అప్పట్లో ఎంపీగా ఆందోళన చెందానని అన్నారు. ఫార్మాను రైతులతో పాటు తాను కూడా వ్యతిరేకించానని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేసి దాని స్థానంలో ఫార్మా విలేజ్‌లు చేపట్టామని తెలిపారు. కొత్త ఆలోచన, కొత్త గమ్యం: మంత్రి శ్రీధర్‌బాబు కొత్త ఆలోచన, కొత్త గమ్యం, కొత్త నగరం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు చేసిన యువత కల నెరవేరబోతోందన్నారు. ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రంలో మిగిలిన మరో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచాలనే ఆలోచనతో స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. -
Watch Live : సీఎం జగన్ కందుకూరు బహిరంగ సభ
-
మహిళపై అఘాయిత్యానికి నేపాల్ యువకుల యత్నం
కందుకూరు: అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు అఘాయిత్యానికి విఫలయత్నం చేశారు. దిశ యాప్‌లో వచ్చి న ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నేపాల్‌కు చెందిన యువకులు కాగా, మరొకరు పట్టణానికి చెందిన యువకుడు. మంగళవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది. డీఎస్పీ రామచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనులపై పట్టణానికి వచ్చింది. అయితే ఆలస్యం కావడంతో రాత్రి 11 గంటల వరకు పట్టణంలోనే ఉండిపోయింది. ఆ సమయంలో తమ ఊరికి వెళ్లే బస్సు కోసం పామూరు బస్టాండ్‌లో వేచి చూస్తోంది. అదే సమయంలో కందుకూరు పట్టణంలోని గూర్ఖాలుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన యువకులు కరణ్, జ్యోషిలతో పాటు, పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ఫిరోజ్ ముగ్గురూ మహిళ వద్దకు వచ్చారు. ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని మాచవరం వైపు తీసుకెళుతున్నారు. ఎస్ఆర్ పెట్రోల్ బంకు సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. దీంతో పెట్రోల్ బంకులో పనిచేసే యువకుడు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు రక్షణ కల్పించి యువకుల కోసం గాలించారు. అయితే అప్పటికే వారు పారిపోవడంతో ఆటో ఆధారంగా బుధవారం నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
సెల్ఫీ తీసుకుంటుండగా కోబ్రా కాటేసింది
కందుకూరు: నాగుపాముతో సెల్ఫీకి ప్రయత్నించిన ఓ యువకుడు ఆ పాము కాటేయడంతో ప్రాణాలొదిలాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి (22) కందుకూరులోని జేఏ కాంప్లెక్స్‌లో షాపును అద్దెకు తీసుకుని జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు. ఆ పామును చూసి సంబరపడిన మణికంఠరెడ్డి పాముతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పామును మణికంఠరెడ్డి మెడలో వేసుకోగా.. ఆ పాము జారి కిందపడిపోయింది. దీంతో మణికంఠరెడ్డి పాము తోక పట్టుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాటేసింది. వెంటనే స్నేహితులు మణికంఠను ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మణికంఠ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోరలు లేవని చెప్పడం వల్లే.. పామును ఆడించే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని చెప్పాడు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని దానిని ఆడించే వ్యక్తి చెప్పాడు. అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని కందుకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై కిశోర్ పరిశీలించారు. పామును తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
కందుకూరు ఘటన: డ్రోన్ షాట్ల దారుణమే! ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం
సాక్షి, నెల్లూరు: డ్రోన్ షాట్ల కోసం ఇరుకు కూడలిలో టీడీపీ బహిరంగ సభను నిర్వహించడంతోపాటు భారీగా ఫ్లెక్సీలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్తో తోపులాట చోటు చేసుకుని తొక్కిసలాట జరిగినట్లు కందుకూరు ఘటనలో ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలు విచారణ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చాయి. గత నెల 28వ తేదీన ‘ఇదేం కర్మ’లో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు ఏర్పాటైన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలోని కమిషన్ శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పలువురి నుంచి వాంగ్మూలం సేకరించింది. తొక్కిసలాట ఎలా జరిగింది? ఆ సమయంలో ఎంత మంది ఉన్నారు? అనే అంశాలపై ఆరా తీసింది. వాహనం ఎక్కడ నిలిపారు? తొలుత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో అధికారుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం కమిషన్ ఎన్టీఆర్ సర్కిల్‌ను పరిశీలించింది. బహిరంగ సభకు ఎక్కడ అనుమతి ఇచ్చారు? చంద్రబాబు వాహనం ఎక్కడ నిలిపారు? అనే అంశాలతోపాటు ప్రమాదం జరిగిన గుండంకట్ట రోడ్డును క్షుణ్నంగా పరిశీలించింది. ఇరువైపులా ఉన్న రెండు డ్రైనేజీలను పరిశీలించింది. కందుకూరు టీడీపీ ఇన్చార్జి ప్రకటించిన పరిహారం అందలేదని బాధిత కుటుంబాలు కమిషన్ దృష్టికి తెచ్చాయి. దాదాపు 27 మంది నుంచి కమిషన్ వాంగ్మూలం నమోదు చేసింది. -
30 వేలమందికి టోకెన్లు ఇచ్చి కేవలం 2 వేలు మందికి సరుకులు ఇచ్చారు
-
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్
-
కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో విచారణ కమిటిని నియమించింది. చంద్రబాబు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. ఇందులో కందుకురులో 8 మంది, గుంటూరులో ముగ్గురు మృతి చెందారు. కాగా ఈ ఘటనలపై జస్టిస్ శేషశయన రెడ్డి కమిషన్ విచారించనుంది. -
గన్ షాట్: చంద్రబాబు మరణహోమానికి మద్దతిస్తున్నావా పవన్..?
-
పోలీసుల అదుపులో ఇంటూరి బ్రదర్స్.. బైక్‌లకు పెట్రోలు పోయించి మరీ..
సాక్షి, నెల్లూరు/కందుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన దర్ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులు ఇద్దరిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. గత నెల 28న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కందుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎనిమిదిమంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితుడు పిచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులుగా ఉన్న టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని కందుకూరు తీసుకొచ్చారు. లోతుగా దర్యాప్తు ఈ ఘటనపై పోలీసులు సీఆర్పీసీ 174 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. సభ జరిగిన ప్రాంతంలో డ్రోన్ ద్వారా షూట్ చేసిన వీడియో విజువల్స్ సేకరించారు. అనుమతిలేకుండా బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రోత్సహించి స్థానిక పెట్రోలు బంకు వద్ద బైక్‌లకు పెట్రోలు పోయించిన వివరాలు తీసుకున్నారు. సభకు జనాలను తరలించేందుకు వాహనాలు సమకూర్చి నగదు పంపిణీ చేసిన వివరాలు, సభకు వచ్చిన వారికి భోజనాలు, డీజే ఏర్పాటు చేసినవారి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్‌గా గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కందుకూరు ఘటనలో మృతిచెందిన వారిలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీలున్నారు. దీంతో పోలీసులు అదనంగా సెక్షన్ 304(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్లను కలిపారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. -
బీజేపీ వాయిస్ లో నాయిస్..!
-
పచ్చమీడియా పైత్యపురాతలు.. గంటల కొద్దీ ఆలస్యానికి ముందే ప్రణాళికలు
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారపిచ్చికి పేదప్రజలు నిలువునా ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న కందుకూరు, నిన్న గుంటూరు. కార్యక్రమం ఏదైనా సరే తను పాల్గొన్న వాటికి భారీఎత్తున ప్రజలు వచ్చారని చూపుకునేందుకు, ప్రచారం చేసుకునేందుకు గంటల కొద్దీ ఆలస్యం చేయడం బాబుకు షరా మామూలే. ఆదివారం గుంటూరులో చీరలు, సరుకులు పంచిపెడతామని చెప్పిన సమయానికి ప్రారంభించకపోగా మూడు గంటలు ఆలస్యంగా చంద్రబాబు వేదిక వద్దకు చేరుకున్నారు. గంటాపది నిమిషాలు ఉపన్యాసం చెప్పి నామమాత్రంగా పంపిణీ చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత తొక్కిసలాట జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయాలకు గురై ఆసుపత్రుల పాలైన సంగతి తెలిసిందే. చీరలు, వస్తువులు పంపిణీ చేస్తామని పేదలకు ఆశపెట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి సమీకరించారు. అసలే జనవరి ఒకటో తేదీ. పండుగ వాతావరణం. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో గడపాలని ఎవరైనా కోరుకుంటారు. ఉచితంగా వస్తాయన్న ఉద్దేశంతో అన్ని వయసుల పేద మహిళలు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన వారికి కనీసం మంచినీటి వసతి, ఇతరత్రా సరిపడా వసతులు, ఏర్పాట్లు చేసిన దాఖలాలే లేవని బాధితవర్గాలు ముక్తకంఠంతో వాపోయాయి. చంద్రబాబు వచ్చి ప్రసంగించి తిరిగి వెళ్లిపోయే వరకు వందలు, వేలాది మందిని నాలుగు గంటలకుపైగా కూర్చోపెట్టారు. బాబు వెనుతిరిగేప్పటికీ దాదాపు చీకటి పడుతోంది. గంటల కొద్దీ వేచి ఉన్న వారు ఇళ్లకు త్వరగా తిరిగి వెళ్లాలనే ఆతృతతో ముందుకు చొచ్చుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఏదైనా భారీ ఎత్తున పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పడు సమయం చూసుకోవడం నిర్వాహకుల కనీస బాధ్యత. తనది నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అక్కడి పరిస్థితులను కనీసమైనా అంచనా వేసుకోలేకపోయారా అనేది మొదటి ప్రశ్న. ఇదే ప్రశ్న ఇప్పుడు అన్నివైపుల నుంచి వస్తోంది. జనం కోసం జాప్యం చేయడం అలవాటే.. ఆలస్యం అమృతం విషం.. అంటారు పెద్దలు. ఆలస్యమయ్యే కొద్దీ అనర్థాలు అధికమనేది దీనర్థం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఇది పూర్తిగా భిన్నం. తను పాల్గొనే కార్యక్రమం ఎంత ఆలస్యమైతే అంత మంచిదనేది ఆయన నిశి్చతాభిప్రాయమనేది పరిశీలకుల మాట. అది పాదయాత్ర అయినా, రోడ్ షో, బహిరంగ సభ చివరకు పరామర్శ అయినా సరే లేట్ అంటే బాబుకు భలే మోజని ఉదహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు పాల్గొనే బహిరంగ సభలను ఆలస్యంగా నిర్వహించడానికి స్లీపర్‌సెల్స్‌గా ప్రత్యేక బృందాలూ ఏర్పాటై అంతర్లీనంగా పనిచేస్తుంటాయనేది పబ్లిక్టాక్. మరోవైపు లేట్ అయిపోతోంది, త్వరపడండనే సన్నాయినొక్కుల ‘హెచ్చరిక’లు మైకుల్లో ధ్వనిస్తుంటాయి. ఇవన్నీ పక్కా ప్లానింగ్‌తోనే అనేది పారీ్టలోని ఆయా జిల్లాల ముఖ్యులకు తెలియని రహస్యాలేమీ కావు. సమయం, సందర్భం ఏదని కూడా చూడకుండా, వాస్తవాలను వెల్లడించకుండా ప్రజలు అడగడుగునా బ్రహ్మరథం పట్టారనే పచ్చ మీడియా పైత్యపురాతలు పలుసార్లు వెగటు పుట్టిస్తుంటాయని టీడీపీ నాయకులే వాపోయి న సందర్భాలు లేకపోలేదు. ఇక టీడీపీ సోషల్ మీడి యా బృందాలు హైప్ సృష్టించడం పరాకాష్ట. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని కార్యక్రమాలను పరిశీలిస్తే.. ►బుధవారం కందుకూరు కార్యక్రమం 5.15 గంటల నుంచి రాత్రి ఏడు గంటల్లోగా ముగియాలి. కానీ సింగరాయకొండ సెంటర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని కందుకూరుకు చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టిందని పచ్చ మీడియా విశ్లేషించింది. సభ ముగించాల్సిన సమయానికన్నా మరో అరగంట ఆలస్యంగా ఇరుకు ప్రాంతంలోకి చేరుకోవడం, 8 మంది మృతికి కారణం కావడం చంద్రబాబుకే చెల్లింది. ►చంద్రబాబు కొవ్వూరులో డిసెంబరు ఒకటో తేదీ రాత్రి 8 గంటలకు జరగాల్సిన సభను 10.30 గంటలకు ప్రారంభించి 50 నిమిషాలపాటు ప్రసంగించారు. రెండో తేదీ నిడదవోలులో మధ్యాహ్నం మూడు గంటలకు బదులు సాయంత్రం 6.30 గంటలకు మొదలెట్టి 40 నిమిషాలు మాట్లాడారు. తాడేపల్లిగూడెంకు మూడన్నర గంటలు ఆలస్యంగా రాత్రి 9.30 గంటలకు చేరుకున్నారు. ►వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన పేరిట అక్టోబరు 19న పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాలకు చంద్రబాబు వెళ్లారు. గురజాల నుంచి సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లికి బయలుదేరతారని షెడ్యూల్ ప్రకటించగా రాత్రి 12.15 గంటలకు ఉపన్యాసం ముగించారు. రాత్రి 7–11 గంటల మధ్యలో రెండుచోట్ల పొలాలను సందర్శించడం చంద్రబాబుకే సాధ్యమైంది. ►నవంబరు 4వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం పేరిట నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఏడు గంటలకు జరగాల్సిన మీటింగ్ రాత్రి 11 గంటలకు జరగడం గమనార్హం. ►గోదావరి పుష్కరాలలో ప్రచారపిచ్చి పీక్కు చేరి 29 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో విశాఖలో తిషే్టసిన చంద్రబాబు ఫొటోలకు ఫోజులిచ్చే క్రమంలో తెల్లవారుజామున 3, 4 గంటలప్పుడు కూడా తెగతిరిగేశారు. బాబు ప్రచారపిచ్చితో తమను పనులు చేసుకోనివ్వకుండా ఆటంకం కలిగిస్తూ ప్రజలకు ఇబ్బందులు పెంచేస్తున్నారని అధికారులు, సిబ్బంది వాపోయిన సందర్భాలు అనేకం. అంతేనా తుపాన్లను సైతం అడ్డుకుంటానని వల్లెవేయడం బాబు ప్రచారానికి పరాకాష్టగా పరిశీలకులు గుర్తుచేస్తుంటారు. -
బాబు పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్
-
టీడీపీ ప్రచార ఆర్భాటానికి అమాయకుల ప్రాణాలు బలి : మల్లాది విష్ణు
-
బాబుపై వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు
-
ప్రజల భద్రత కోసమే ఈ జీవో : పేర్ని నాని
-
గన్ షాట్ : ప్రాణం ఖరీదు
-
సరికొత్త ఆలోచనతో జగన్.. డర్టీ పాలిటిక్స్ తో బాబు
-
కందుకూరు సభలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేత
-
మృతుడి కుమారుడి నుంచి చంద్రబాబు ఊహించని ప్రశ్న
-
చంద్రబాబు రోడ్ షోలో విషాద ఘటనపై కేసు నమోదు
-
అనుమతి లేని చోట సభ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/కందుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది మృతికి కారణమైన చంద్రబాబు నాయుడు రోడ్ షోలో నిబంధనలు ఉల్లంఘించారని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. గురువారం ఆయన నెల్లూరు ఎస్పీ విజయారావుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షించిన అనంతరం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. పోలీస్ శాఖ ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు వాహనం నిలిపి మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. కానీ వాహనం మాత్రం సర్కిల్ నుంచి దాదాపు 50 మీటర్లు ముందుకు వెళ్లడంతో వెనుక వైపు ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు కదిలారని తెలిపారు. వై ఆకారంలో ఉన్న ఆ ప్రాంతంలో రెండు వైపులా జనం ముందుకు చొచ్చుకు రావడంతో ఆ చిన్న ప్రదేశంలో అప్పటికే అక్కడ ఉన్న వారు ఎటూ వెళ్లలేక ప్రమాదంబారిన పడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండానే శింగరాయకొండ హైవే నుంచి చంద్రబాబు వాహనం ముందు 1,000 – 1,500 బైకులతో ర్యాలీ నిర్వహించారన్నారు. ఒకవైపు పట్టణ సీఐ బైకు ర్యాలీ వద్దని వారిస్తున్నా లెక్క చేయలేదని తెలిపారు. అనుమతి ఇవ్వకపోయినా క్రాకర్స్ కాల్చారన్నారు. 7.30 గంటలలోపు సభ ముగించాలని ముందుగా స్థానిక డీఎస్పీ సృష్టం చేసినప్పటికీ, పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇలా పలు నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి ఈ కేసు దర్యాప్తు చేస్తారని డీఐజీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు కందుకూరు ఘటనలో గాయపడిన స్థానికుడు పిచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఆర్పీసీ 174 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. పూర్తి విచారణ తర్వాత అన్ని అంశాలు చేరుస్తామని పట్టణ ఎస్ఐ కిశోర్ తెలిపారు. ఇదిలా ఉండగా, 8 మంది మృతదేహాలకు గురువారం ఉదయం రిమ్స్ నుంచి వచ్చిన వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి, సురేష్‌ల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఊపిరి ఆడక పోవడం వల్లే వారంతా మృతి చెందారని నిర్ధారించినట్లు సమాచారం. పంచనామా అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. -
డబ్బులు వద్దు.. మా నాన్న కావాలి; చంద్రబాబు ఊహించని ప్రశ్న
కందుకూరు రూరల్: కందుకూరులో బుధవారం తన సభలో ఒకరిపై ఒకరు పడిపోయి మృతి చెందిన ఓగూరు గ్రామానికి చెందిన గడ్డం మధుబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు మృతుడి కుమారుడి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. గురువారం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు చంద్రబాబు ఆ గ్రామంలోని వారి ఇంటికి వెళ్లారు. మృతదేహానికి నివాళులర్పించి.. తల్లి చినకొండమ్మ, భార్య మాధవి, పిల్లలు కార్తికేయ, లికిత, సుశాంత్‌లతో మాట్లాడారు. వారిని ఓదార్చుతున్న సమయంలో మధుబాబు కుమారుడు కార్తికేయ.. ‘మాకు డబ్బులు వద్దు.. నాన్నే కావాలి.. డబ్బులు ఎలాగోలా తెచ్చుకుంటాం.. నాకు నాన్న కావాలి’ అని అడిగాడు. ‘అది నా చేతుల్లో లేదు.. భగవంతుడు తీసుకెళ్లాడు. మిమ్మల్ని చదివిస్తాను. మీ బాగోగులను మేం చూసుకుంటాం’ అని చంద్రబాబు చెప్పారు. ‘చివరికి తెలుగుదేశంలో ఇలా కలిసిపోతావనుకోలేదు బిడ్డా’ అంటూ మృతదేహం వద్ద తల్లి బోరున విలపించింది. మృతుల్లో మరొకరైన కొండముడుసుపాలెంలోని కలవకూరి యానాది కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు. యానాది భార్య కాంతమ్మ, కుమారులను ఓదార్చి, తాము అండగా ఉంటామని చెప్పారు. (క్లిక్ చేయండి: కొంప ముంచిన చీప్ ట్రిక్స్.. ఈ ‘ఖర్మ’కు కర్త, క్రియ చంద్రబాబే!) -
కొంప ముంచిన చీప్ ట్రిక్స్.. ఈ ‘ఖర్మ’కు కర్త, క్రియ చంద్రబాబే!
చంద్రబాబు సభ వాస్తవంగా జరగాల్సిన కూడలి ప్రదేశం ఎన్టీఆర్ సర్కిల్. కానీ జనం పలుచగా ఉండడంతో డ్రోన్ కెమెరాలతో తీసే ఫొటోలలో బాగా కనిపించడానికి గాను అందరినీ ఎదురుగా ఇరుకుగా ఉన్న రోడ్డులోకి తరలించారు. రోడ్‌షో వాహనాన్నీ అటువైపు మళ్లించారు. ఉక్కిరిబిక్కిరైన జనంలో కొందరు ఆ వాహనాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. సిబ్బంది వారిని కిందకు తోసేశారు. ఆ గందరగోళంలో ఏం జరుగుతుందో తెలియని జనం హాహాకారాలు చేస్తూ ఒక్క సారిగా కిందకు పడిపోయారు. చంద్రబాబు ప్రచార కండూతి అలా 8 మంది ప్రాణాలు బలిగొనడానికి కారణమయ్యింది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచారార్భాటం మరోసారి సామాన్యుల ప్రాణాలు హరించింది. లేని ప్రజాదరణను ఉన్నట్టుగా కనికట్టు చేసేందుకు వేసిన చవకబారు ఎత్తుగడ అమాయకుల పాలిట యమపాశమైంది. చిన్నపాటి సభకు వచ్చిన జనాన్ని అంతకంటే ఎక్కువగా చూపించేందుకు చేసిన చీప్ ట్రిక్ 8 మందిని బలితీసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ బహిరంగ సభ నిర్వహించేందుకు తొలుత నిర్ణయించిన విశాలమైన ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబుకు అక్కడ జనం పలుచగా కనిపించారు. దీంతో డ్రోన్ కెమెరాల షూటింగ్లో జనం కిక్కిరిసినట్టు కనిపిస్తారన్న ఎత్తుగడతో బాబు వెంటనే తన వాహనాన్ని ఎదురుగా ఉన్న ఇరుకు ప్రదేశంలోకి పోనిచ్చారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్నవారిని కూడా ఆ ఇరుకు సందు వద్దకు తరలించారు. దీంతో అప్పటికే ఆ ఇరుకు రోడ్డులో ఉన్న వారు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. ఒకరి మీద ఒకరు పడిపోయి, అమాయక జనం హాహాకారాలు చేస్తుంటే.. చంద్రబాబు వాహనం ఉన్నట్లుండి కొంచెం వెనక్కి వెళ్లింది. అక్కడ మరింత గందరగోళం చోటుచేసుకుంది. ఏం జరుగుతుందో తెలియక ప్రాణ భయంతో ఎవరంతకు వారు అక్కడినుంచి బయట పడాలనే ఆతృతే 8మంది మృతికి కారణమైంది. ఎన్టీఆర్ సర్కిల్లో సభ ఎందుకు పెట్టలేదు? ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్లో బుధవారం రాత్రి చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించాలి. ఈ మేరకు చంద్రబాబు ప్రైవేటు కార్యదర్శి ఆర్.కృష్ణ కాపర్థి ముందుగా విడుదల చేసిన పర్యటన షెడ్యూల్లో స్పష్టంగా తెలిపారు. దాంతో పోలీసులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడ నాలుగు వైపులా కాస్త విశాలంగా ఉంటుంది. దాంతో బహిరంగ సభ నిర్వహణ సజావుగా సాగుతుందని అంతా భావించారు. కందుకూరులోని టీడీపీ శ్రేణులు ముందుగానే ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్నాయి. కానీ తన ప్రచార వాహనంలో బుధవారం రాత్రి 7.30 గంటలకు కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబు.. అక్కడ జనం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కందుకూరులో జనం ఎక్కువగా రారని టీడీపీకి ముందుగానే తెలుసు. అందుకే ఇతర ప్రాంతాల నుంచి తరలించిన జనం చంద్రబాబు వాహనాన్ని అనుసరిస్తూ వచ్చేలా చేశారు. ఎన్టీఆర్ సర్కిల్లో సభ నిర్వహిస్తే జనం తక్కువగా ఉన్నారనే విషయం వెల్లడవుతుందని చంద్రబాబు భావించారు. అక్కడకు 50 మీటర్ల దూరంలో రోడ్డు కాస్త ఇరుకుగా ఉన్నట్టు గమనించిన చంద్రబాబు.. తన వాహనాన్ని అక్కడకు తీసుకువెళ్లాలని చివరి నిమిషంలో డ్రైవర్‌ను ఆదేశించినట్టు సమాచారం. దాంతో ఎన్టీఆర్ సర్కిల్లో నిలపాల్సిన వాహనాన్ని డ్రైవర్ మరో 50 మీటర్లు ముందుకు తీసుకువెళ్లి ఇరుకుగా ఉన్న రోడ్డులో నిలిపారు. పూల మాల వేసేందుకు నిలిపినా సరిపోయేది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూల మాల వేసి నివాళి అర్పించాలి. విగ్రహం వద్ద వాహనం నిలిపి ఉంటే అక్కడ ఉన్న జనంతోపాటు వాహనం వెంట ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనం నలువైపులా సర్దుకునేందుకు అవకాశం ఉండేది. అనంతరం చంద్రబాబు వాహనాన్ని ఎదురుగా 50 మీటర్లు ముందుకు పోనిచ్చినా సరిపోయేది. అప్పటికే ఎక్కడికక్కడ సర్దుకున్న జనం.. ఉన్న చోటు నుంచే చంద్రబాబు ప్రసంగాన్ని వినేవారు. కానీ అలా చేస్తే వాహనం చుట్టూ జనం భారీగా ఉన్నట్టు కనిపించరని చంద్రబాబు భావించారు. అందుకే ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేయడాన్ని కూడా రద్దు చేసుకుని, తన వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. మిగిలింది 38 అడుగులే నిజానికి చంద్రబాబు వాహనం నిలిపింది 100 అడుగుల రోడ్డు. కానీ ఆయన పర్యటన కోసం టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలతో ఆ రోడ్డును ఆక్రమించేశారు. రోడ్డుకు అటూ 30 అడుగులు, ఇటు 30 అడుగుల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటితోపాటు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టారు. దాంతో రాకపోకలకు కేవలం 38 అడుగుల రోడ్డే మిగిలింది. (కందుకూరు మున్సిపల్ అధికారులు గురువారం ఆ రోడ్డులో కొలతలు కొలిచారు. ఫ్లెక్సీలు, సౌండ్ బాక్సులు పోగా మిగిలింది 38 అడుగుల రోడ్డే) అందులో కూడా టీడీపీ నేతలు అడ్డదిడ్డంగా బైకులు పార్క్ చేశారు. అలాంటి ప్రాంతంలోకి చంద్రబాబు వాహనం వచ్చి నిలుచొంది. చంద్రబాబు వాహనం ఎన్టీఆర్ సర్కిల్‌ను దాటి ఎదురుగా ప్రయాణించడంతో ఆ ప్రదేశంలో ఉన్న జనం వాహనంతోపాటు ముందుకు కదిలారు. అప్పటికే అక్కడ ఉన్న జనంతోపాటు వాహనాన్ని అనుసరించి వచ్చిన వారు, వెనుక ఉన్న వారితో ఆ ప్రాంతం ఇబ్బందికరంగా మారింది. ఘటన సమయంలో ప్రాణ భయంతో చంద్రబాబు వాహనం పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న జనం దుర్ఘటనకు దారితీసిందిలా.. కేవలం 38 అడుగుల రోడ్డులో చంద్రబాబు వాహనం నిలపడంతో అప్పటికే ఉన్న జనానికి వాహనంతో పాటు వచ్చిన వారు తోడయ్యారు. ఒక్కసారిగా జనం గుమిగూడటంతో ఊపిరి తీసుకునేందుకు కూడా సాధ్యం కాక హాహాకారాలు చేశారు. ప్రాణభయంతో అక్కడి నుంచి బయట పడటానికి ఎవరికివారు యత్నించారు. ఇందులో భాగంగా కొందరు చంద్రబాబు వాహనం ఎక్కేందుకు యత్నించగా, చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది అనుమతించలేదు. పరిస్థితిని గమనించి, చంద్రబాబు తక్షణమే స్పందించనూ లేదు. పైగా డ్రైవర్ వాహనాన్ని కొంచెం వెనక్కు జరపడంతో వెనుక ఉన్న వారు బెంబేలెత్తిపోయారు. ఏం జరుగుతుందో తెలీక భయంతో కేకలు వేశారు. కందుకూరులో చంద్రబాబు సభ నిర్వహించాల్సిన ఎన్టీఆర్ సర్కిల్(కింద) చివరి నిముషంలో 50 అడుగులు ముందుకు వెళ్ళి సభ నిర్వహించిన ప్రదేశం(పైన) ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కసారిగా వారూ వేగంగా వెనక్కి జరగడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. కొందరు ఆ ప్రదేశంలో పార్క్ చేసిన బైకులపై పడ్డారు. దీంతో జనం ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతూ సమీపంలోని గుండంకట్ట వీధిలోకి చేరారు. ఆ వీధి కేవలం 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. పక్కనే కాలువ ఉంది. చంద్రబాబు వాహనం చుట్టూ ఉన్న జనం అప్పటికే ఆ వీధిలోకి చొచ్చుకు రావడంతో పలువురు కాలువలో పడిపోయారు. మరికొందరు నలిగిపోయారు. దీంతో మొత్తంగా 8 మంది మృత్యువాత పడగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది దుర్మరణం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సమయంలోనూ అదే రీతిలో వ్యవహరించి 29 మంది మృతికి కారణమయ్యారు. తాను పుష్కర స్నానం చేస్తున్నప్పుడు చుట్టూ భారీగా జనం ఉన్నట్టుగా వీడియోలు చిత్రీకరించాలని ఆయన భావించారు. అందుకోసం సినీ దర్శకుడు బోయపాటి నేతృత్వంలో ఏకంగా సినిమా షూటింగ్ స్థాయిలో హడావుడి చేశారు. అంత భారీ స్థాయిలో జనం రావడం కష్టమని భావించి, పుష్కర ఘాట్ల గేట్లను కొన్ని గంటలపాటు మూసి వేశారు. దాంతో గేట్ల వద్దకు జనం భారీగా చేరుకోగానే, ఒక్కసారిగా గేట్లు తీశారు. వారంతా నీటిలో స్నానం చేయడానికి పరుగెత్తి వస్తుంటే.. తనను చూసేందుకే వారు అలా వస్తున్నారనేలా చిత్రీకరించాలన్నది బాబు ఎత్తుగడ. దాంతో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం చెందారు. -
బిగ్ క్వశ్చన్: ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత అలుసా..?
-
ప్లాన్ ప్రకారమే ఇరుకు రోడ్డులో సభ నిర్వహించారు : సజ్జల
-
బాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలయ్యారు : మంత్రి కొట్టు సత్యనారాయణ
-
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
నీ పబ్లిసిటీ పిచ్చితో 8 మందిని చంపేసావ్.. చంద్రబాబుపై మంత్రి తానేటి వనిత ఫైర్
-
కందుకూరు ఘటనపై కేఏ పాల్ ఫైర్
-
పేదల ప్రాణాలకు చంద్రబాబు వెల కడుతున్నారు
-
కందుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, అమరావతి: కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామన్నారు. గవర్నర్ దిగ్భ్రాంతి నెల్లూరు జిల్లా కందుకూరులో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చదవండి: ‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ.. -
కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతల నిర్వాకం వల్లే 8 మంది అమాయకులు బలి అయ్యారని మండిపడ్డారు. ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చిప్రేలాపణలు చేస్తే జనం బుద్ధి చెబుతారని మహీధర్‌రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు బాధ్యత వహించాలి: డిప్యూటీ సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. తక్కువ జనాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కందుకూరు ఘటన బాధాకరం: బాలినేని చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటనలో 8 మంది చనిపోవడం బాధాకరమైన విషయం అన్నారు. -
కందుకూరు ఘటనపై స్థానికుల ఆగ్రహం
-
‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ..
కందుకూరు(నెల్లూరు జిల్లా): కందుకూరులో తొక్కిసలాట సమయంలో బాబు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల వద్దకు వెంటనే వెళ్లాల్సిందిపోయి నాయకుల్ని పంపాను. విషయం తెలుసుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా.. ఎక్కడికీ వెళ్లొద్దని ఆయన చెప్పడంపై ప్రజలు మండి పడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రచార యావ చాలా ఎక్కువ. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో బుధవారం టీడీపీ నాయకులు నిర్వహించిన బహిరంగసభ కొందరి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా... బుధవారం మాత్రం కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చదవండి: బాబుదే పాపం.. ప్రాణాలు తీసిన ప్రచార యావ -
బాబుదే పాపం.. ప్రాణాలు తీసిన ప్రచార యావ
కందుకూరు(నెల్లూరు జిల్లా): ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రచార యావ చాలా ఎక్కువ. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో బుధవారం టీడీపీ నాయకులు నిర్వహించిన బహిరంగసభ కొందరి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. కందుకూరు రూరల్: కందుకూరు మండలం కొండముడుసుపాళేనికి చెందిన కలవకూరి యానాది తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఎప్పుడు ఎక్కడ టీడీపీ సమావేశాలు జరిగినా అక్కడ వాలిపోతుంటాడు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడు. కందుకూరులో చంద్రబాబునాయుడిని చూసేందుకు సమావేశం వద్దకు వచ్చాడు. అక్కడ ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందాడు. ఈయనకు భార్య కాంతమ్మ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. పిల్లలకు వివాహాలయ్యాయి. ఎస్సీ కాలనీలో కూడా టీడీపీ నాయకుడిగా నాయకత్వం వహిస్తుంటాడు. కందుకూరు మండలంలో ఓగూరు గ్రామానికి చెందిన గడ్డం మధుబాబు టీడీపీకి వీరాభిమాని. ఆ గ్రామ నాయకుడు చల్లా శ్రీనివాసరావు వద్దే పని చేస్తుంటాడు. శివమాల ధరించిన మధుబాబు టీడీపీ మీటింగ్‌కు వచ్చి తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు. మధుబాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. భార్య మాధవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేడు పోస్టుమార్టం తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను ప్రస్తుతం ఏరియా వైద్యశాలలోనే ఉంచారు. గురువారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రుల కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఏరియా హాస్పిటల్ ప్రాంగణం మార్మోగిపోయింది. చంద్రబాబు సభకు వచ్చి ప్రాణాలు కోల్పోవడం మా కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాపం వీళ్లు కందుకూరు అర్బన్: కందుకూరు పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో నివాసం ఉండే ఇదిమూడి రాజేశ్వరి అక్కడే టిఫిన్ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తోంది. భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుంటాడు. వారికి పిల్లలు లేరు. రాజేశ్వరి తమ్ముడు చిలకపాటి మధు టీడీపీ బీసీ సెల్ నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు మీటింగ్‌కు జన సమీకరణలో భాగంగా రాజేశ్వరి మీటింగ్‌కి వచ్చింది. గుండంకట్ట వైపున ఉండడంతో ఒక్కసారిగా తోపులాటలో కింద పడిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె వైద్యశాలకు తీసుకెళ్లగానే మృతిచెందింది. ఆమెను కొండపి మండలం పెట్లూరు గ్రామానికి చెంది వ్యక్తికి ఇచ్చి వివాహం చేయగా బతుకుదెరువు నిమిత్తం కందుకూరు వచ్చి నాంచారమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. రాజేశ్వరి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాళేనికి చెందిన కాకుమాని రాజా ఆర్టీసీ డిపో వద్ద కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తుంటాడు. టీడీపీపై ఉన్న అభిమానంతో చంద్రబాబును చూసేందుకు మీటింగ్ వద్దకు వచ్చాడు. గుండంకట్ట వద్ద నిలబడి ఉన్నాడు. అక్కడ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాలు నిలిపి ఉంచారు. ఈక్రమంలో తొక్కిసలాట జరిగి మృతిచెందాడు. ఈయనకు భార్య, కళ్యాణి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు ఇంజినీరింగ్, కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో పిల్లలు చదువులు ఎలా? అంటూ భార్య, కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కందుకూరు మండలం విక్కిరాలపేటకు చెందిన ఉన్నం ప్రభాకర్, గుడ్లూరు మండలం మోచర్లకు చెందిన గోచిపాతల రమేష్, తెట్టుకు చెందిన ఎస్కే మన్సూర్, గుండ్లపాళేనికి చెందిన మద్దులూరి రాగమ్మ, దప్పళంపాడు గ్రామానికి చెందిన చెరుకూరి మాల్యాద్రి, కందుకూరు మండలం శ్రీరంగరాజపురానికి చెందిన వంకదారి పిచ్చయ్య, వీవీపాళెం మండలం అమ్మపాలేనికి చెందిన డి.మస్తాన్, పోలినేని చెరువు గ్రామానికి చెందిన శనివరపు మణికంఠ అనే వారు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రుల్లో ఉన్నం ప్రభాకర్, గోచిపాతల రమేష్, ఎస్కే మన్సూర్, రాగమ్మలు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశం గందరగోళంగా మారిపోయింది. జనం ఎటువారు అటు పరుగులు పెట్టే హడావుడిలో చెప్పులు జారిపోయి, వస్తువులు పోగొట్టుకుని అవస్థలు పడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి.. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొందరు పోలీసులు, స్థానికులు, తోటి కార్యకర్తలు తక్షణం స్పందించడంతో ప్రమాద బాధితుల సంఖ్య పెరగకుండా ఆపగలిగారు. ఆస్పత్రిలో సైతం వైద్య సిబ్బంది సకాలంలో వైద్యసేవలు అందించడంతో మృతుల సంఖ్య తగ్గింది. రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రబాబు కాన్వాయ్ రావడంతో ఇరుకుగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్ ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. ప్రసంగం మొదలు పెట్టేందుకు బాబు సిద్ధమైన సమయంలోనే గుండంకట్ట రోడ్డులో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఎస్సై ఉన్నారు. నివారించడం ఆయన వల్ల కాలేదు. అప్పటికే పలువురు కింద పడిపోయారు. ఇది గమనించిన కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని కింద పడిన పలువురిని పక్కకి లాగిపడేశారు. చదవండి: ‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం పోలీసులతోపాటు పక్కను ఉన్నవారు స్పందించి కిందపడిపోయి ఉన్న 16 మందిని చేతులపై మోసుకుంటూ ఎన్టీఆర్ సర్కిల్లోనే ఉన్న ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బంది, డాక్టర్లు వెంటనే స్పందించి క్షతగాత్రులకు చికిత్స ప్రారంభించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారిని గుండెలపై గట్టిగా ఒత్తుతూ కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం జరుగుతుండగానే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం
(సాక్షి– నెల్లూరు): అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా... బుధవారం మాత్రం నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సర్కిల్ రోడ్లు కాస్త ఇరుగ్గా ఉండగా... సర్కిల్ నుంచి గుండంకట్ట వెళ్లే రోడ్డు అన్నిటికన్నా ఇరుగ్గా ఉంది. దాంట్లోనే అటూ ఇటూ ఫ్లెక్సీలు పెట్టడంతో చిన్న సందులా తయారయింది. అక్కడే మురికి కాలువ పక్కన వరసగా కొందరు బైక్‌లు పార్క్ చేయగా... ఓ తోపుడు బండి, టీవీ ప్రసారాల లైవ్ వెహికల్ కూడా ఉండటంతో... కొందరు లైవ్ వెహికల్ ఎక్కారు. మరికొందరు బైకులు పట్టుకుని నిల్చున్నారు. ఇంతలోనే చంద్రబాబు కాన్వాయ్ భారీ వాహన ర్యాలీతో వచ్చింది. ఒక్కసారిగా వాహనాలు రావడంతో ఎన్టీఆర్ సర్కిల్ మధ్య తన ప్రసంగ వాహనాన్ని నిలపాల్సిన చంద్రబాబునాయుడు కొంచెం ముందుకు బాగా ఇరుగ్గా ఉండే ప్రదేశంలో నిలిపారు. దాంతో ఈ నాలుగు రోడ్ల కూడలి కాస్త మరింత ఇరుగ్గా మారిపోయింది. చంద్రబాబు తన ప్రసంగం ప్రారంభించబోతూ.... గుండంకట్ట రోడ్డులో ఉన్న లైవ్ వెహికల్ ఎక్కిన వారిని దిగిపోవాలని అభ్యర్థించారు. ‘‘తమ్ముళ్లూ... మీరంతా దిగాలి’’ ‘ఏయ్ తమ్ముళ్లూ అందరూ దిగండి’ అంటూ పదే పదే కేకలు వేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త అలజడి నెలకొంది. అదే సమయంలో చంద్రబాబు ప్రసంగ వాహనానికి వెనుక వైపు ఉన్న వారు ఒక్కసారిగా ముందుకు చొచ్చుకురావడంతో మరింత గందరగోళం నెలకొంది. అంతా ముందుకు రావటంతో గుండంకట్ట రోడ్డులో తోపులాట మొదలై తోపుడు బండి తిరగబడిపోయింది. బైకులపై పడింది. బైకులన్నీ వరసగా కిందికి పడిపోవటంతో... వాటిని ఆనుకుని ఉన్న కొందరు జనం కూడా అదుపు తప్పి బైకుల కింద, పక్కనున్న కాలువలోను పడిపోయారు. ఈ హఠాత్పరిమాణంతో వారు భయపడి... గట్టిగా కేకలు వేస్తూ లేవటానికి ప్రయత్నించారు. అయితే ఆ అరుపులతో మరింత మంది కంగారుపడ్డారు. భయభ్రాంతులై ఏదో జరిగిపోతోందనుకుని పరుగులు పెట్టారు. అదే రోడ్లో నుంచి మరికొంత ముందుకు వెళ్లటానికి ప్రయత్నించారు. ఈ సంఘటనను దగ్గర్నుంచి చూస్తున్న పలువురు తెలుగుదేశం కార్యకర్తలు అరుస్తూ వారిని నిలువరించబోయారు. కానీ ఆ అరుపులతో వారంతా మరింత కంగారుపడి కింద పడ్డ వారిని పట్టించుకోకుండా తొక్కుకుంటూ వెళ్లిపోవటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మరింత మంది కిందపడ్డారు. అలా పడిన వారిలో చాలామంది ఊపిరాడక లేవలేకపోయారు. ఫలితంగా ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఎనిమిది మందికి సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సర్కిల్లో ఇదే తొలిసారి... కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్‌కు నాలుగువైపులా దక్షణం వైపు పామూరు రోడ్ , ఉత్తరం వైపు బైపాస్‌రోడ్, తూర్పు గుండంకట్ట రోడ్, పడమర ఇప్పగుంట రోడ్ ఉంటాయి. ఆ నాలుగు రోడ్లూ జంక్షన్ నుంచి కొంత ఇరుగ్గానే ఉంటాయి. కాకపోతే పామూరు రోడ్లో జంక్షన్ నుంచి ఓ 200 మీటర్లు వెళితే రోడ్డు వందడుగులతో విశాలంగా ఉంటుంది. గతంలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈ వందడుగుల రోడ్లోనే సభ ఏర్పాటు చేశారు. రోడ్డు విశాలంగా ఉండటంతో జనం భారీగా తరలివచ్చినా సాఫీగా సాగిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకు వచ్చినపుడు స్థానిక హైస్కూల్ గ్రౌండ్లో సభ నిర్వహించారు. దీంతో పాటు గతంలో దాదాపు 5 సార్లు కందుకూరుకు వచ్చిన చంద్రబాబు... ప్రతిసారీ స్థానిక అంకమ్మ దేవాలయం ప్రాంగణంలో సభను నిర్వహించారు. అది విశాలమైన ప్రాంగణం కావటంతో ఎంత మంది జనం వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ సారి ఇరుకు రోడ్లను ఎంచుకోవటంతో ఊహించని దారుణం జరిగిపోయిందని స్థానికులు వాపోతున్నారు. ప్రసంగం ప్రారంభించకముందే.... చంద్రబాబు సభలో ప్రసంగం ప్రారంభిస్తున్నపుడే ఈ ఘోరం చోటు చేసుకోవటంతో ఆయన ప్రసంగం నిలిపేశారు. జరిగిన ఘటన తెలసుకుని, బాధితులను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళాక, ఆయన కూడా ఆసుపత్రికి వెళ్లారు. పరామర్శించిన అనంతరం మళ్లీ ఎన్టీఆర్ సర్కిల్‌కు వచ్చి... ఈ సంఘటన దురదృష్టకరమంటూనే... అందరూ ఆవేశంతో ఉన్నారని వ్యాఖ్యానించటం గమనార్హం.విషాద సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10 లక్షల వంతున ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు . చంద్రబాబు రోడ్డు షోలో విషాద ఘటన జరిగిన ఇరుకు రోడ్డు, ఇరువైపులా ఉన్న మురుగు కాల్వలు చంద్రబాబు పర్యటన ఇలా.. చంద్రబాబు తొలుత సింగరాయకొండ పై్ల ఓవర్ నుంచి నేరుగా ఓగూరు మీదగా కందుకూరు వాసవీ నగర్ గుడికి వచ్చి పూజలు చేశారు. అనంతరం కోటారెడ్డి సెంటర్‌కు చేరుకుని డీవీ కొండయ్య చౌదరి విగ్రహనికి పూలమాల వేశారు. అక్కడ నుంచి పోస్టాపీస్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్‌కు వచ్చారు. షెడ్యూల్ కంటే గంట సేపు ఆలస్యంగా సభ మొదలుపెట్టబోయారు. కాగా శింగరాయకొండ జాతీయ రహదారిపై మల్లినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా చంద్రబాబు కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న స్కూటరిస్ట్‌ను చంద్రబాబు వాహనం డీకోనడంతో స్కూటరిస్ట్ కిందపడిపోయాడు. స్కూటర్ దెబ్బతింది. కూలి వస్తుందని ఆశపడి మీటింగ్‌కు... మీటింగ్‌కు వెళితే కూలి వస్తుందని ఆశపడిన ఆ మహిళ... చంద్రబాబు కందుకూరు పర్యటనకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఉలవపాడు వరిగచేను సంఘానికి చెందిన యాటగిరి విజయ (54) కూలి చేసుకుని జీవిస్తోంది. ఆమె భర్త శీనయ్యది నిజామాబాద్‌లో బేల్దారి పని. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పెద్దకుమార్తె తండ్రి వద్దే ప్రై వేటు కంపెనీలో పనిచేస్తుండగా, రెండో కుమార్తె శిరీష ఉలవపాడులోని ఓ షాపులో పనిచేస్తోంది. కుమారుడు శ్రీకర్ టెన్త్ క్లాస్. టీడీపీ నాయకులు చంద్రబాబు కార్యక్రమం కోసం ఈ సంఘం నుంచి ఆటోలు పెట్టి మహిళలకు కూలి ఏర్పాటు చేశారు. కూలి డబ్బులు వస్తాయి కదా అని మీటింగ్‌కు వెళ్లిన విజయ... అక్కడ కాల్వలో పడి ఊపిరాడక మృతి చెందింది. వీరు రెండేళ్ల క్రితం వరకు హైదరాబాద్ లో బేల్దారి పని చేసుకునేవారు. కరోనా తరువాత ఇక్కడకు వచ్చి ఆధార్, రేషన్ కార్డులు మార్పించుకుని ఇక్కడే ఉంటున్నారు. -
చంద్రబాబు కందుకూరు రోడ్ షో లో అపశృతి
-
ఆస్ట్రేలియాలో ఎమ్మెల్సీగా కందుకూరు యువకుడు
కందుకూరు: చిన్న వయసులోనే పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా యువకుడు విదేశీ చట్టసభలకు ప్రతినిధిగా ఎంపికయ్యాడు. తన సమాజ సేవతో మెప్పించి ఆస్ట్రేలియాలో యువత కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. నెల్లూరు జిల్లా తూర్పుకమ్మపాలేనికి చెందిన దివి రామకృష్ణ, ప్రత్యూషలు దంపతులు. రామకృష్ణ 12 ఏళ్ల క్రితమే ఉద్యోగ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ పిల్లలను అక్కడే చదివించుకున్నారు. రామకృష్ణ పెద్ద కుమారుడైన తనూజ్‌చౌదరి (15) అక్కడి కాలేజీలో ప్రస్తుతం ప్లస్ వన్ (ఇంటర్) చదువుతున్నాడు. సమాజ సేవా కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నాడు. అక్కడి చట్టాల ప్రకారం ఇలా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువత చట్టసభల్లో ఎంపికయ్యేందుకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని, ఈ క్రమంలో అన్ని అర్హతలను పరిశీలించిన తరువాత యువత కోటాలో తన కుమారుడిని ఎమ్మెల్సీగా అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసిందని రామకృష్ణ చెప్పారు. ప్రస్తుతం తన కుమారుడు అక్కడి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నాడని తెలిపారు. -
ఎంత పనిచేశావ్.. వెంకట్రావ్..! నమ్మించి..
సాక్షి, కందుకూరు: నమ్మినవాళ్లను నిలువునా ముంచాడు ఓ మున్సిపల్ ఉద్యోగి. అందినకాడికి అప్పు తీసుకొని అడ్రస్ లేకుండా పోయాడు. ఈ ప్రబుద్ధుడికి అప్పులిచ్చిన వాళ్లలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. గత నాలుగు నెలలుగా అతని ఆచూకీ లేకపోవడంతో అప్పు ఇచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. విధులకు ఎగనామం పెట్టిన ఉద్యోగిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీరాలకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో గత ఆరేళ్లుగా హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలో పరిచయాలు పెంచుకున్నాడు. సొంత అవసరాలు ఉన్నాయంటూ తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. కందుకూరు పట్టణంలో పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తుల వద్ద సుమారు రూ.25 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని అడిగిన వారికి సాకులు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే 4 నెలల నుంచి వెంకట్రావ్ అడ్రస్ లేకుండా పోయాడు. వెంకట్రావు కుటుంబం తూర్పుకమ్మపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండు రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కందుకూరు వచ్చి ఇంట్లో సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పులిచ్చినవాళ్లు అడ్డుకున్నారు. వివాదం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని అప్పులవాళ్లకి సర్దిచెప్పి పంపారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు. వెంకట్రావ్ ఆచూకీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అతనిపై చీటింగ్ కేసు పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వెంకట్రావ్‌పై ఇదే విధమైన కేసులు ఒంగోలులోనూ ఉన్నాయని, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు. చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం) నాలుగు నెలలుగా విధులకు డుమ్మా మున్సిపాలిటీ హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకట్రావ్ గత నాలుగు నెలల నుంచి విధులకు హాజరుకావడం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్ 23వ తేదీన రెండు రోజులు సీఎల్ పెట్టి వెళ్లారని, అప్పటి నుంచి విధులకు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి అడ్రస్‌కు పలుమార్లు నోటీసులు పంపామని, కానీ ఇల్లు లాక్ చేసి ఉండటంతో తిరిగి మున్సిపాలిటీకి వచ్చాయని వెల్లడించారు. ఈ విషయంపై మున్సిపల్ ఆర్డీకి ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ శ్రీనివాసన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఆ చెట్లను చూస్తే.. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిందే..
కందుకూరు రూరల్: కందుకూరు రెవెన్యూ కార్యాలయం ప్రాంతం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల జరిగిన మధ్య కాలంలో ఈ భవనాల నిర్మాణం, మొక్కలు నాటినట్లు పెద్దలు చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతలో నిర్మించిన భవనాలు కూలిపోయినా ఇక్కడ మాత్రం భవన అనవాళ్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయం ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ఆవరణం పెద్ద పెద్ద వేప చెట్లతో నిండి ఉంటుంది. చెట్లను చూస్తే చాలా చరిత్రను గుర్తు చేసుకోవాల్సిందే. బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ చెట్లు నాటబట్టే ఇప్పుడు ఇక్కడ ఇంత నీడ ఉందని ప్రజలు చెప్పుకుంటారు. (చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!) సహజంగా కార్యాలయానికి రావాలంటే ఏదో ఒక పని ఉంటేనే వస్తుంటారు. కాని కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎప్పుడు ప్రజలతో కళకళలాడుతుంది. దీనికి కారణంగా చల్లటి నీడనిచ్చే వేపచెట్లు ఉండటం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పట్టణంతో పనులు చూసుకొని కాసేపు స్వేద తీరాలంటే ఈ చెట్ల కిందకు రావాల్సిందే. పట్టణంలో ఏ కార్యాలయం ముందు ఇంత ఖాళీ స్థలం, చెట్లు లేవు. ప్రధాన ఓవీ రోడ్డులో పక్కనే పట్టణ నడిబొడ్డులో ఈ కార్యాలయం ఉండడం ప్రజలు ఎక్కువగా ఈ చెట్ల కిందే కనిపిస్తుంటారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరినప్పటికి రూపం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికి ఈ గదిలో పాత రెవెన్యూ రికార్డులు భద్రపరిచి ఉన్నాయి. దీంతో రెవెన్యూ కార్యాలయం ఆవరణం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది. -
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కుటుంబంలో విషాదం
కందుకూరు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి పెద్ద సోదరుడు యాదగిరిరెడ్డి (85) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మం డలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి కన్నుమూశారు. అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరగనున్నాయి. సోదరుడి మృతి వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని పలువురు బీజేపీ నాయకులు పరామర్శించారు. -
మైనర్‌తో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్
సాక్షి, కందుకూరు: మైనర్‌తో వ్యభిచారం చేయించిన కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు దిశ డీఎస్పీ ధనుంజయ తెలిపారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. జూలైలో కావలి ప్రాంతానికి చెందిన బాలికతో మాధవి అనే మహిళ కందుకూరు–సింగరాయకొండ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయించింది. ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు బాలికను రక్షించి నలుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిర్వాహకురాలు మాధవి విజయవాడలో కూడా వ్యభిచార గృహాలను నడుపుతున్నట్లు గుర్తించారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న బాధితురాలు మైనర్ కావడంతో దిశ చట్టం కింద పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. దీంతో సదరు బాలికతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని ప్రస్తుతం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. (ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య) విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న పోలీసు, ఐసీడీఎస్ అధికారులు పోన్‌కాల్స్, బ్యాంకు లావాదేవీలు, పోన్‌పే వంటి ఆధారాలను సేకరించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో పొన్నలూరు మండలం చౌటపాలేనికి చెందిన కాట్రగడ్డ శివకుమార్, ఉన్నం నవీన్, పొన్నలూరుకు చెందిన అరవింద్, కొండపి, కనిగిరి, సింగరాయకొండ, ఒంగోలుకు చెందిన సయ్యద్ సల్మాన్, కసిరెడ్డి బ్రహ్మారెడ్డి, దేవప్రకాశ్, కోమట్ల ఏడుకొండలు, కందుకూరు మండలం కొండముడుసుపాలేనికి చెందిన గొంది వంశీకృష్ణచౌదరి ఉన్నట్లు వివరించారు. వీరంతా బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్ పీడీ లక్ష్మీదేవి మాట్లాడుతూ వ్యభిచార కూపాల్లో చిక్కుకున్న బాలికలను బాలసదన్‌లో ఉంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి జీవితంపై భరోసా కల్పిస్తామని చెప్పారు. (ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. ఆస్తి కోసం) ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వెంటనే బాధితురాలికి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తారని, చార్జీషీట్ తర్వాత రూ.50 వేలు, కేసు పూర్తయితే రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తామని వివరించారు. కరోనా సమయంలో ఇటువంటి కేసులు ఎక్కువగా నమోదైనట్లు గుర్తించినట్లు పీడీ చెప్పారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు టి.రామాదేవి మాట్లాడుతూ దిశ కేసులో నిందితులను అరెస్టు చేయడం శుభపరిణామం అన్నారు. తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించి బాలికలను ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంచేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ విజయ్‌కుమార్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు పద్మావతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శేఖర్, రూరల్ ఎస్ఐ అంకమ్మ పాల్గొన్నారు. -
బాలు పూర్వీకులు ప్రకాశం జిల్లా వాసులు
ఒంగోలు మెట్రో/కందుకూరు రూరల్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన పూర్వీకులు ఇక్కడి కందుకూరు సమీపంలోని మాచవరం గ్రామానికి చెందినవారు. బాలు తండ్రి సాంబమూర్తి మాచవరం శివాలయంలో అర్చకత్వం చేస్తూ స్కందపురి మాధవ విలాస సభ సంస్థ ద్వారా హరికథలు చెబుతూ జీవనం సాగించినట్టు అక్కడి వారు పేర్కొంటున్నారు. బాల సుబ్రహ్మణ్యం పుట్టిన తర్వాత ఆ కుటుంబం నెల్లూరు జిల్లాకు వలస వెళ్లారని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు. కాగా బాలు మేనత్త జిల్లాలోని కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ఉండేవారు. ఈ క్రమంలో బాలు అనేకసార్లు ఈతముక్కల, కొత్తపట్నం గ్రామాలకు వచ్చేవారు. సాంబమూర్తి కుటుంబం మాచవరంలో ఇల్లు అమ్మి వలస వెళ్లిన తర్వాత అప్పుడప్పుడు ఊరు వస్తూ ఉండేవారు. 25వ ఏట బాలసుబ్రహ్మణ్యం ఈ గ్రామానికి వచ్చి శివాలయం ఉత్సవాల్లో పాటలు పాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన అనేక సాంస్కృతిక, కళాసంస్థలు పలుమార్లు బాలును సత్కరించాయి. -
తప్పుడు ప్రచారాలు చేస్తే ఖబడ్దార్!
సాక్షి, ప్రకాశం: తప్పుడు రాతల పై వైఎస్సార్సీపీ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, దిగజారుడు రాతలు రాస్తే ఆ పత్రికల యాజమాన్యాల సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఎల్లో మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చంచాగిరి చేసే వాళ్లు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసమ్మతి అంటూ తమ పార్టీ ఐక్యతను, విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం అన్నారు. అవసరమైతే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేస్తామని మహాధర్ రెడ్డి ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!) -
ప్రేమ పేరుతో మోసం.. మోజు తీరాక మరో పెళ్లి
సాక్షి, కందుకూరు : ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత వదిలేసి మరో వివాహం చేసుకున్నాడు. బాధిత బాలిక ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే బాలికతో డీఎస్పీ రవిచంద్రను కలిశారు. వివరాలలోకి వెళితే.. నెల్లూరు నావాబ్‌పేటకు చెందిన మైనర్ ఇంటర్మీడియేట్ చదువుతోంది. తన స్నేహితురాలు బంధువుల వివాహానికి వలేటివారిపాలెం మండలం శింగమనేనిపల్లి గ్రామానికి వచ్చింది. ఆదే గ్రామానికి చెందిన వెంకటసురేంద్రతో ఆమెకు పరిచయం ఏర్పాడి ప్రేమగా మారింది. దీంతో మూడేళ్ల క్రితం వెంకట సురేంద్ర చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి అక్కడకు తీసుకొని వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం కావలి, ఒంగోలు, కందుకూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా జన్మించిన బిడ్డ మృతి చెందింది. రెండవ సారి మరో బిడ్డకు జన్మనించింది. ఆ తర్వాత సురేంద్ర పెట్టే చిత్రహింసలు ప్రారంభమైయ్యాయి. వేధింపులు తాళలేక యువతి నెల్లూరులోని అమ్మమ్మ వద్ద ఉంటుంది. తాజాగా సురేంద్ర నాలుగు రోజుల క్రితం మరో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి మొదటి భార్య సురేంద్ర ఇంటికి వెళ్లి తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని కోరింది. సురేంద్ర, అతడి కుటుంబసభ్యులు బెదిరించడంతో ఆమె సోమవారం మహీధర్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే డీఎస్పీ రవిచంద్రను కలిసి సురేంద్రపై చట్టపరమైన చర్యలు తీసుకుని, బాధితురాలకి న్యాయం చేయాలని సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
నాకు న్యాయం చేయండి
సాక్షి, కందుకూరు : భర్తను తనకు కాకుండా చేస్తున్నారంటూ ఓ యువతి రోడ్డుపై ఆందోళనకు దిగింది. ఈ సంఘటన గురువారం స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద జరిగింది. బాధిత యువతి కథనం ప్రకారం... చీరాలకు చెందిన హేమకు కందుకూరు పట్టణానికి చెందిన శ్రీమన్నారాయణ అలియాస్ శివతో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే శివకు స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే భూలక్ష్మి అనే యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శివ తనను మోసం చేశాడంటూ హేమ కేసు కూడా పెట్టింది. ఈ కేసులో శివ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి మళ్లీ భూలక్ష్మితోనే సహజీవనం చేయడం ప్రారంభించాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న హేమను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. హేమ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తన భర్తను తనకు కాకుండా చేస్తోందంటూ ఆమె గురువారం స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకుకు వెళ్లి భూలక్ష్మితో వాదనకు దిగింది. అనంతరం బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టింది. తన భర్తను వలలో వేసుకుని ఇంటికి రాకుండా చేస్తోందని, పెళ్లి చేసుకోకుండా ఎలా కలిసి ఉంటారని నిలదీసింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతికి నచ్చజెప్పారు. పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే పిలిపించి మాట్లాడతామని సర్ది చెప్పారు. -
వ్యభిచారం గుట్టురట్టు
సాక్షి, కందుకూరు అర్బన్: కొంతకాలంగా కందుకూరు పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం గుట్టు ఎట్టకేలకు రట్టయింది. విచ్చలవిడిగా సాగుతున్న ఈ చీకటి బాగోతంపై గుర్తు తెలియని వ్యక్తుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఓ వ్యభిచార గృహంపై ఆకస్మికంగా దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వ్యాభిచార గృహం నిర్వాహకులు ధనవంతులు కావడంతో పట్టుబడిన వారిని గుట్టుచప్పుడు కాకుండా కోర్టుకు హాజరు పరిచారు. కొన్నేళ్లగా పట్టణంలో వ్యభిచారం మూడు పువ్వులు..ఆరుకాయలుగా సాగుతోంది. కొందరు బ్రోకర్లు ఒంగోలు, నెల్లూరు, గూడూరు, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పట్టణానికి చెందన కొందరి అండతో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్రోకర్లు రాత్రి సమయాల్లో ఆటోలు, బస్సుల్లో మైనర్లకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపి వ్యభిచారం రొంపిలోకి దించుతున్నారు. అందుకు పట్టణ శివారు ప్రాతాలను ఎంచుకున్నారు. కోవూరు రోడ్డు, విక్కిరాలపేట రోడ్డు, పామూరు రోడ్డు, పలుకూరు అడ్డ రోడ్డులోని జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని రాత్రి సమయంలో వ్యభిచారం సాగిస్తున్నారు. పోలీసుల రాత్రి సమయాల్లో పట్టణంలోని లాడ్జిలు, గెస్ట్హోసుల్లో తనిఖీలు చేయక పోవడంతో బ్రోకర్లు వ్యభిచారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం కోవూరు రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం సాగిస్తున్నారని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారు ధనవంతులు కావడంతో మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా కోర్టులో హాజరు పరిచారు. రాత్రి వేళల్లో దంపతులు తమ స్వగ్రామాలకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. రాత్రి 9 గంటలు దాటితే మందుబాబులు అమ్మాయిలను తీసుకొచ్చి రోడ్డు పక్కనే మద్యం తాగుతూ తమ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతోందోనని భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై పట్టణ ఎస్ఐ తిరుపతిరావును వివరణ కోరగా వ్యభిచార గృహంపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించినట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
టీడీపీ నేతల ‘దారి’ దోపిడీ!
సాక్షి, ప్రకాశం : కందుకూరులో టీడీపీ నాయకులు ‘దారి’ దోపిడీకి తెగబడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతర్గత రోడ్ల నిర్మాణం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్ల నిర్మాణానికి బయట ప్రదేశం నుంచి గ్రావెల్ తోలాల్సి ఉండగా, పక్కనే పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో భారీ గోతులు తవ్వి ఆ మట్టిని తరలించారు.కందుకూరు పట్టణంలోని ఉప్పుచెరువు వద్ద ఎన్టీఆర్ నగర్ పేరుతో నిర్మిస్తున్న జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. అక్కడ నివాసం ఉండే పేదలకు మౌలిక వసతులతో పాటు అంతర్గత రోడ్లు నిర్మించాలి. అందుకోసం అప్పటి ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సింగరాయకొండ మండంలోని శానంపూడి గ్రామ వద్ద నుంచి గ్రావెల్ మట్టిని తోలి రోడ్ల నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ టీడీపీ నాయకులు అధికారం చేతిలో ఉంది కదా తాము ఏమిచేసినా చెల్లుతుందని ఇష్టానూసారంగా వ్యవహరించారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాల్సి ఉండగా మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో శానంపూడి నుంచి మట్టిని తొలకుండా జీప్లస్‌త్రీ భవనాల పక్కనే గతంలో మహీధర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేసిన భూముల్లో మట్టి తవ్వి అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. పేదలకు చెందిన 6 ఎకరాల భూమిలో 9 అడుగుల తోతున మట్టి తవ్వి.. జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద రోడ్లు వేసి నిధులు బొక్కేందుకు పథకం రచించారు. అయితే టీడీపీ ఘోర ఓటమి చెందడం.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం బయట పడింది. యథాస్థానానికి మట్టి తోలకం స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి గతంలో çపురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలకు పొజిషన్ చూపించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి స్థలాల పరిశీలన కోసం వెళ్లగా 9 అడుగుల లోతున గోతులు తవ్విన విషయం బయటపడింది. టీడీపీ నాయకులు యథేచ్ఛగా మట్టి తవ్వి జీప్లస్‌త్రీ నివాసాల వద్ద అంతర్గత రోడ్లు నిర్మిస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూశారు. టీడీపీ నాయకుల అక్రమాలు, అధికారుల ఉదాసీన వైఖరి బయట పడటంతో తప్పును చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కమిషనర్ వి.శ్రీనివాసరావు జీప్లస్‌త్రీ ఇళ్లు నిర్మిస్తున్న కంపెనీకి నోటీసులు జారీచేశారు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం రెండు రోజుల నుంచి జీప్లస్‌త్రీ ఇళ్ల వద్ద అంతర్గత రోడ్లకు తోలిన మట్టిని జేసీబీ సహాయంతో మరలా పేదలకు పంపిణీ చేసిన లే అవుట్లలోని గోతులను పూడ్చే పనిని ముమ్మరం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అధికారులను ఆ పార్టీ నాయకులు ప్రలోభపెట్టి బిల్లులు చేసుకుని జేబులు నింపుకొనే వారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జీప్లస్‌త్రీ ఇళ్లకు సంబంధించిన ఓ అధికారిని వివరణ కోరగా గత ప్రభుత్వంలో టెండర్లు పిలవకుండానే టీడీపీ నాయకులు మట్టిని తోలారని, అందువల్ల ప్రభుత్వ ఆదేశాలతో రోడ్లకు సంబంధించిన పనులు రద్దు చేసినట్లు తెలిపారు. -
ఐదేళ్లపాటు అభివృద్ధికి నోచుకోని కందుకూరు
సాక్షి, కందుకూరు (ప్రకాశం): ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ పాలనను ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ చూసినా అవినీతి, దోపిడి, దౌర్జాన్యాలే కనిపిస్తాయి. నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధుల పాలనకు బదులు బయట వ్యక్తుల పెత్తనం అధికం. ఉద్యోగులపై దాడులు, ఇసుక, మట్టి తవ్వకాల ద్వారా విచ్చలవిడిగా దోపిడీ ఇవే కనిపిస్తాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవగా ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దోచేశారు. 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ పాలన సాగిన తీరు ఇది. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన నిలిచి, అనేక ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా సాగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రభావంతో కొన్ని సమస్యలైనా ప్రభుత్వం పరిష్కరించింది. ఈ ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మేలును వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. టీడీపీ హయాం.. ఇన్‌చార్జ్‌లు తాము చెప్పినట్టే వినాలంటూ అధికారులపై ఒత్తిడి చేయడమే కాదు, దాడులకు తెగబడ్డారు. సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆర్ఐపై సుధాకర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 1. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఎన్నికల్లో ఓడిపోయిన దివి శివరాం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. దాదాపు రెండున్నరేళ్లపాటు ఆయనే నియోజకవర్గంలో పెత్తనం చేశారు. 2. ఈ రెండున్నరేళ్ల కాలంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. ప్రధానంగా నియోజవకర్గంలో ఉన్న ఇసుక రేవులను లక్ష్యంగా చేసుకుని వందల కోట్ల విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేని కారణంగానే కందుకూరు మండల తహశీల్దార్ రాజ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు అంటే ఏ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. 3. ఇక సబ్సిడీ బియ్యం దోపిడీకి విచ్చలవిడిగా పాల్పడ్డారు. ఏకంగా ఎంఎల్‌సి పాయింట్‌నే లక్ష్యంగా చేసుకుని అక్రమ పద్ధతిలో తరలించారు. 4. రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పెంపకం పేరుతో కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. 5. నీరు–చెట్టు పథకం కింద చెరువుల అభివృద్ధి, మట్టి తోలకం పేరుతో పనులు చేయకుండానే విచ్చలవిడిగా దోచుకున్నారు. 6.ఏ పని కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరిగే పరిస్థితి లేకుండా పోయింది. 7. రెండున్నరేళ్ల తరువాత ఎమ్మెల్యే పోతుల రామారావు వైఎస్సార్సీపీ నుంచి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. 8. ఇక్కడి నుంచి పాలన పూర్తిగా మారిపోయింది. ఎమ్మేల్యే తన అనుచరులను మండలలాల వారీగా ఇన్చార్జులుగా నియమించారు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధం లేని ఆయన బంధువులను, ఇతర వ్యక్తులను మండలాల ఇన్చార్జులుగా నియమించారు. దీంతో పాలన మొత్తం వారి కనుసన్నల్లోనే సాగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనికావాలన్న ప్రజలు ముందుగా ఈ ఇన్చార్జులను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 9. ఇక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలోను పూర్తిగా విఫలమైంది. 2014లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయపట్నం పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో రెండు నెలల క్రితమే హడావిడి శంకుస్థాపన చేశారు. 10. రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు అందించే సోమశిల ఉత్తర కాల్వ పనులను పూర్తి చేయడంలో విఫలమైయ్యారు. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. దీంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయింది. 11. రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధిపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఐదేళ్ల క్రితమే నిధులు మంజూరైనా ఇప్పటి వరకు ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులు మొదలు పెట్టలేని దుస్థితి నెలకొంది. 12. ఇక కందుకూరు పట్టనంలో ట్రాఫిక్ నివారణ కోసం పట్టణం వెలుపల నుంచి బైపాస్ రోడ్డు నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరైయ్యాయి. కాని ఎమ్మెల్యే పోతుల రామారావు అసలు బైపాస్‌రోడ్డు అనేదే లేదని చెప్పడం విడ్డూరంగా తోచింది. ఇప్పటికీ ఆ రోడ్డు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైయ్యాయి. అలాగే పట్టణంలో రూ 1.80 కోట్లతో చేపట్టిన పార్కు నిర్మాణం చేయకుండా వదిలేశారు. 13. ఉద్యానవన కళాశాల, పశువైద్యకళాశాల మంజూరు చేశామని చెప్పినా కాగితాలకే పరిమితమైయ్యాయి. ప్రజా సమస్యలపై పోరాటమే వైఎస్సార్సీపీ అజెండా.. ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాటమే వైఎస్సార్సీపీ అజెండాగా పెట్టుకుని పనిచేసింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాళ్లపాడు ప్రాజెక్టు సోమశిల నుంచి నీరు ఇవ్వడంతో పాటు, రామాయపట్నం పోర్టు నిర్మించి తీరుతానని హామీ ఇచ్చారు. జగన్ హామీతోనే దిగివచ్చిన ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు హడావిడి శంకుస్థాపన చేసింది. 1. ప్రధానంగా రైతుల సమస్యలపై వైఎస్సార్ సీపీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సోమశిల ఉత్తర కాల్వను పూర్తి చేయాలంటూ ఆందోళనకు దిగారు. కాల్వను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. 2. పట్టణంలో జీప్లస్ ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై విస్తృత పోరాటం చేసింది. అధిక వడ్డీలు, బ్యాంకు రుణాల పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లింది. 3. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేశారు. 4. రామాయపట్నం పోర్టు నిర్మించాలంటూ వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కావలి పట్టణం నుంచి రామాయపట్నం వరకు భారీ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. 5. గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో వారికి అండగా వైఎస్సార్ సీపీ నిలిచింది. వలేటివారిపాలెం మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను స్వయంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వారికి పరిహారం వచ్చేలా కృషి చేశారు. 6. ఇక ఏడాది కిత్రం నియోజవకర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలోని లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు మండలాల పరిధిలో మూడు రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యల సమస్యలను దగ్గర ఉండి తెలుసుకోవడంతో పాటు, దీర్ఘకాలిక సమస్యలపై పరిష్కారానికి హామీలిచ్చారు. -
మహీధరుడి సేవాభావం.. పోతుల స్వలాభం
సాక్షి, కందుకూరు (ప్రకాశం): ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అభ్యర్థిని ఎంచుకునే బాధ్యత కూడా ఓటర్లపై ఉంది. ఏ పార్టీ అయితే తమకు మేలు చేస్తుంది, ఎవరైతే తమకు అండగా ఉండి తమ సంక్షేమాన్ని, అభివృద్ధికి కృషి చేస్తారని భావిస్తారో వారిని ఎన్నుకోనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గుణగణాలు ఇలా... సుపరిచితం మానుగుంట చరితం ► నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ప్రజల మేలు కోసం కృషి చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ► దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయ అనుభవం. ► మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్‌రెడ్డి ఒకసారి మంత్రిగాను పనిచేశారు. ► నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, స్థానికుడు. ► అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు. ► రాజకీయాల్లో ఎంత ఎదిగినా సొంత ఊరిని వదిలని నేతగా గుర్తింపు, ఇప్పటికీ గ్రామంలో సామాన్యుడిగానే నివసిస్తున్నారు. ► సాదారణ రైతు మాదిరి తన వ్యవసాయం తానే చూసుకుంటారు. ► ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయగల నేర్పరి ► ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ► కందుకూరు పట్టణం తాగునీటి సమస్యను పరిష్కరించారే మంచి పేరు ► అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారనే భావన, నమ్మకం ఉన్న నేత. ► నియోజకవర్గంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో తనదైన ముద్ర వేశారు. ► సమస్యపై ఎవరి వెళ్లినా ముక్కుసూటిగా సమాధానం చెప్పడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ► ప్రజా సమస్యలపై పోరాడటంలో తెలివైన నేతగా, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో, అభివృద్ధి చేయడంలో బహు ప్రజ్ఞాశాలి ► సంఘ విద్రోహ శక్తులను దరి చేరనీయరు. ► పాలనలో పరాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా అవగాహన, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన నాయకుడు. రాజకీయ అందలం నుంచి పోతుల రామారావు ► సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ► సమీప నియోజకవర్గం కొండపి గ్రామానికి చెందిన నేత. స్థానికుడు కాదు ► రాజకీయాలను వ్యాపార దృక్పధంలోనే వినియోగిస్తారని ఉంది. ► ఎమ్మెల్యేగా నియోజకవర్గం కంటే వ్యాపారాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ► ముభావి, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించని నేతగా గుర్తింపు. ► అధికారంలో ఉన్నా ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేదు. ► విషయంలో చురుగ్గా ఉండరనే ముద్ర ► ఎమ్మెల్యేగా ఆయన అధికారంలో ఉన్నా పాలన అంతా ఆయన కుటుంబ సభ్యుల, అనుచరుల చేతుల్లోనే సాగుతుంది, ► సమస్యలపై వెళ్లే ప్రజలు ముందుగా కుటుంబ సభ్యుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి ► వ్యాపారాల నిమిత్తం ఎక్కువగా విదేశాల్లో ఉంటారు. -
అధికారం చేతిలో ఉంటే ఇంత దారుణమా...?
సాక్షి, కందుకూరు (ప్రకాశం): ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, అడ్డుకున్న వారిపై దాడులకు దిగుతున్నారు. శనివారం పట్టణంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. వార్డుల్లో సర్వే చేస్తున్న ఇద్దరు యువకులను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, వారిని ఆర్డీఓకు అప్పగించేందుకు తీసుకురావడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తలు పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. సాక్షాత్తు పోలీసుల సాక్షిగా టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పోతుల రామారావు తమ్ముడు ప్రసాద్ వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీపై దాడికి యత్నించాడు. చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. విషయం తెలిసి వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇదీ..జరిగింది టంగుటూరుకు చెందిన ఇద్దరు యువకులు శనివారం ఉదయం పట్టణంలోని 17వ వార్డు అజ్మల్ హుస్సేన్ హాస్పటల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీ తరఫున సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి పేర్లు సేకరించడంతో పాటు సమస్యలు అడగడం అలాగే పోస్టల్ బ్యాలెట్లు ఎవరు ఉన్నారు అనే తదితర సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సామాన్య ప్రజలతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి చేరుకుని యువకులను నిలదీశారు. సర్వేలు ఎందుకు చేస్తున్నారు.. ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం సర్వేలు చేయడం నిషిద్ధమని వారిని ఎన్నికల అధికారి అయిన ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆర్డీఓకి అప్పగించేందుకు ప్రయత్నించారు. ఈ లోపు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అక్కడికి చేరుకున్నారు. తమ కార్యకర్తలను ఎందుకు తీసుకొచ్చారంటూ వైఎస్సార్ సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సర్వే చేస్తుంటే తీసుకొచ్చామంటూ వైఎస్సార్ సీపీ నాయకులు సమాధానం చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీతో పాటు మరికొంత మంది కార్యకర్తలు అక్కడ ఉన్నారు. టీడీపీ వైపు నుంచి ఎమ్మెల్యే పోతుల రామారావు సోదరుడు పోతుల ప్రసాద్, ఉన్నం వీరాస్వామి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, కళ్యాణ్ తదితరులు తమ అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. చంపుతానంటూ రఫీకి బెదిరింపులు వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలు తీవ్ర బెదిరింపులకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే పోతుల రామారావు సోదరుడు పోతుల ప్రసాద్ వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీపైకి దూసుకెళ్లారు. వేలు చూపుతూ చంపుతానంటూ బెదిరింపులకు దిగాగు. ఇదే సమయంలో అక్కడ ఉన్న సీఐ, ఎస్ఐలు, పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఓ మైనార్టీ నాయకుడిని చంపుతానంటూ బెదిరింపుకు దిగడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నా పట్టించుకోవడం లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసుస్టేషన్‌కు చేరుకుని టీడీపీ నాయకుల బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. కందుకూరులో పాత రోజులు పునరావృతం అవుతున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయినప్పడు ఆ పార్టీ నేతలు వివిధ సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడిన విషయాన్ని ఇప్పటికి సామాన్యులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు చేయడం, తాయిలాలు ఎరవేయడం వంటి నీచమైన పనులకు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పక్క నియోజకవర్గం కొండపి, టంగుటూరు ప్రాంతాలకు చెందిన యువకులను ఇక్కడికి తీసుకొచ్చి సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతున్నారు. ఎటువంటి సర్వేలు చేసేందుకు వీల్లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నా ఉల్లంఘించి మరీ సర్వేలు చేస్తున్నారు. అయినా ఎన్నికల అధికారులు పట్టించుకుంటున్న పాపాన లేదు. ఇటువంటి గొడవలకు పరోక్షంగా వారే కారణం అవుతున్నారు. ఎమ్మెల్యేనే సర్వే చేయమన్నారు.. పట్టుబడిన ఇద్దరు యువకులు మాట్లాడారు. తాము తెలుగుదేశం పార్టీ తరఫున సర్వే చేస్తున్నామని అంగీకరించారు. టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పోతుల రామారావే సర్వే చేయమంటే చేస్తున్నామని ఒప్పుకున్నారు. వాళ్లు చెప్పిన ప్రకారం ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లో సమస్యలు అడగడంతో పాటు వారి ఫోన్ నంబర్లు తీసుకుంటున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఇళ్లు సర్వే చేసిన తర్వాత తమను పట్టుకుని ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చారని అందరి ముందు తలలు దించుకుని సమాధానం చెప్పారు. -
కందుకూరు చూపు.. మానుగుంట వైపు...
సాక్షి, కందుకూరు: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కందుకూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెండు కుటుంబాల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అయితే, 2014లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు కొనసాగుతున్న కుటుంబ రాజకీయాలను దాటి నియోజకవర్గంలో విజయ పతాకం ఎగురవేసింది. గడిచిన ఐదేళ్లలో ఫ్యాన్ గుర్తుకు కంచుకోటగా మారిన కందుకూరు నియోజకవర్గంలో ఈసారి ఆ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీ నుంచే పోటీచేస్తుండటంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. అంతేగాకుండా ఈ నియోజకవర్గంలో ఆది నుంచీ టీడీపీ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పాటు గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీచేసి గెలిచిన పోతుల రామారావు అనంతరం టీడీపీలోకి మారి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి అతనే బరిలో ఉన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పినప్పటికీ ఎలాంటి అభివృద్ధీ చేయకపోగా, తెలుగు తమ్ముళ్ల అవినీతి అక్రమాలకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిధులన్నింటినీ పచ్చ నేతలకే దోచిపెట్టారు. వీటన్నింటిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీపరంగా, అభ్యర్థిపరంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీదే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విజయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఓడిపోయిన టీడీపీ.. మానుగుంట కుటుంబానిదే ఆ ఎన్నికల్లో విజయం... కందుకూరు నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, తెలుగుదేశం పార్టీకి కేవలం రెండుసార్లు మాత్రమే విజయం దక్కిందంటే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో మొదటి నుంచి మానుగుంట–దివి కుటుంబాల మధ్యే రాజకీయం నడుస్తూ వచ్చింది. వారిలో దివి కుటుంబం ఈసారి పోటీలో లేకుండా పోయింది. 1957లో జరిగిన ఎన్నికల్లో దివి కుటుంబం మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి దివి కొండయ్యచౌదరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో మొదటిసారి మానుగుంట కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించగా, ఆ ఎన్నికల్లో మానుగుంట ఆదినారాయణరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి 2014 ముందు వరకు మానుగుంట కుటుంబం నియోజకవర్గ రాజకీయాల్లో చెరగని ముద్రవేసింది. 1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినా కందుకూరులో మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలే వీచింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మానుగుంట ఆదినారాయణరెడ్డి టీడీపీని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారి బరిలో దిగిన ఆదినారాయణరెడ్డి మరోసారి టీడీపీని ఓడించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తండ్రి వారసత్వంగా మొదటిసారి మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో జరిగిన ఎన్నికల్లో దివి కుటుంబం నుంచి తండ్రి కొండయ్యచౌదరి వారసత్వంగా దివి శివరాం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004, 2009 ఎన్నికల్లో మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కనుమరుగై ఆ ఎన్నికల్లో మహీధర్‌రెడ్డి పోటీకి దూరంగా ఉండగా, టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు... ఎన్నికల సంవత్సరం గెలిచిన అభ్యర్థి, పార్టీ ప్రత్యర్థి, పార్టీ 1952 (ద్విసభ్య) చెంచురామనాయుడు (కాంగ్రెస్) కె.షణ్ముఖం (కాంగ్రెస్) జీవీ సుబ్బయ్య (ఇండిపెండెంట్) సి.కత్తిలింగం (ఇండిపెండెంట్) 1957 దివి కొండయ్యచౌదరి (కాంగ్రెస్) ఆర్.వెంకయ్య (సీపీఐ) 1962 నలమోతు చెంచురామనాయుడు (కాంగ్రెస్) దివి కొండయ్యచౌదరి (ఇండిపెండెంట్) 1967 నలమోతు చెంచురామనాయుడు (కాంగ్రెస్) వీవై కోటారెడ్డి (ఇండిపెండెంట్) 1972 మానుగుంట ఆదినారాయణరెడ్డి (ఇండిపెండెంట్) చెంచురామనాయుడు (కాంగ్రెస్) 1978 దివి కొండయ్యచౌదరి (కాంగ్రెస్.ఐ) మానుగుంట ఆదినారాయణరెడ్డి (జనతా) 1983 మానుగుంట ఆదినారాయణరెడ్డి (ఇండిపెండెంట్) గుత్తా వెంకటసుబ్బయ్య (టీడీపీ) 1985 మానుగుంట ఆదినారాయణరెడ్డి (కాంగ్రెస్) గుత్తా వెంకటసుబ్బయ్య(టీడీపీ) 1989 మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) ఎం.మాలకొండయ్య(టీడీపీ) 1994 దివి శివరాం (టీడీపీ) మానుగుంట మహీధర్‌రెడ్డి (ఇండిపెండెంట్) 1999 దివి శివరాం (టీడీపీ) మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) 2004 మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) దివి శివరాం (టీడీపీ) 2009 మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) దివి శివరాం (టీడీపీ) 2014 పోతుల రామారావు (వైఎస్సార్ సీపీ) దివి శివరాం (టీడీపీ) మండలాల వారీగా ఓటర్లు... మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం ఓటర్లు కందుకూరు మున్సిపాలిటీ 21,316 22,072 19 43,388 కందుకూరు మండలం 14,129 14,171 00 28,300 వలేటివారిపాలెం మండలం 16,190 16,208 03 32,401 లింగసముద్రం మండలం 14,516 14,097 02 28,615 గుడ్లూరు మండలం 18,410 18,360 00 36,770 ఉలవపాడు మండలం 20,549 20,263 02 40,814 అంతర్గత పోరుతో టీడీపీ సతమతం... నియోజకవర్గంలో అంతర్గతపోరుతో టీడీపీ సతమతమవుతోంది. 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు అనంతరం టీడీపీలోకి మారడంతో అనాధిగా పార్టీలో కొనసాగుతున్న దివి శివరాం వర్గానికి కంటగింపుగా మారింది. ఈ రెండువర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ తర్వాత అధిష్టానం మాటకు దివి శివరాం తలొగ్గినా ద్వితీయశ్రేణి నాయకులు మాత్రం పోతుల వర్గంతో కలిసే పరిస్థితి లేకుండా పోయింది. శివరాం సోదరులైతే పూర్తిగా పోతుల వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దివి కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టిన పోతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సహకరించేది లేదని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే శివరాం సోదరుడు దివి లింగయ్యనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు పోతులతో విభేదించి ఏకంగా ఆ పార్టీకే గుడ్‌బై చెబుతున్నారు. దీంతో టీడీపీ డీలాపడగా, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆ పార్టీ అభ్యర్థి మహీధరరెడ్డి నేతృత్వంలో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలన్నీ వైఎస్సార్ సీపీ విజయాన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కందుకూరులో టీడీపీ ప్రలోభాల పర్వం
-
సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..!
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఎన్నికల కోడ్ వచ్చింది. గ్రామాల్లో ఎండలు పెరగడంతోపాటు రాజకీయ వేడి పెరిగింది. ఏ టీ దుకాణం వద్ద చూసినా, రచ్చబండ వద్ద అయినా ఎన్నికలకు సంబంధించిన చర్చే. కాగా రెండు రోజుల నుంచి గెలుపు, ఓటములు పార్టీ అభ్యర్థులపై ప్రజల మధ్య చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో లోకల్, నాన్‌లోకల్ సెంటిమెంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రామాల్లో చర్చలు చెబుతున్నాయి. కందుకూరు నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మానుగుంట మహీధరరెడ్డి స్వగ్రామం నియోజకవర్గ పరిధిలోని మాచవరం గ్రామం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతుల రామారావు స్వగ్రామం కొండపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు గ్రామం. వీరి స్వగ్రామాలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీశాయి. ఇటీవల వైఎస్సార్ సీపీలోకి భారీగా వలసలు చోటుచేసుకున్నాయి. పొరగు పెత్తనం ఇక్కడ ఎక్కువ అయిందనే భావన ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉంది. దీంతో వలసలు అధికమయ్యాయి. కందుకూరు... టంగుటూరు అయిందనే భావనా ? పేరుకు కందుకూరు నియోజకవర్గం అయినా గత మూడేళ్లుగా ఈ ప్రాంత నాయకులు అందరూ టంగుటూరుకు వెళ్లి పనులు చేయించుకునేవారు. సమావేశాలు, పింఛన్లు, లోన్ల ఎంపిక కూడా అక్కడ నుంచి జరిగింది. ఈ ప్రభావం ఇప్పుడు ఎన్నికల్లో భారీగా పడుతుందని అందుకే గ్రామాల్లో లోకల్, నాన్‌లోకల్ చర్చ ఎక్కువ నడుస్తోంది. ఇక్కడ స్థానికుడు, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం ఉన్నా కూడా కేవలం ఆర్థికంగా బలం ఉందని పోతుల రామారావుకు టికెట్ కేటాయించారని టీడీపీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది. నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో కూడా శివరాం అయితే లోకల్ కదా ఇక్కడే ఉంటాడు అనే భావన ఉంది. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బయట వ్యక్తుల పెత్తనం ఇక్కడ ఎందుకు అనే ఆలోచన పాత టీడీపీ కార్యకర్తల్లో ఉంది. కీలకం కానున్న సెంటిమెంట్.. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ తీవ్రంగా పనిచేసే అవకాశం ఉందని స్థానికుల అభిప్రాయం. మహీధర్‌రెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. పోతుల రామారావు నియోజకవర్గంలో కాకుండా టంగుటూరులో ఉంటారు. ఆయనని కలవాలంటే నాయకులు అక్కడికి వెళ్లి కలవాలి. ఎన్నికలు నెలలోపే ఉండడంతో ఈ చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి. -
పని చేయకపోయినా ‘కూలి’
సాక్షి, కందుకూరు రూరల్ (ప్రకాశం): మండలంలో టీడీపీకి ఓటు వేసే పనైనా పనులకు రావాల్సిన అవసరం లేదు. పనులకు వచ్చినా కనిపించి వెళ్తే చాలు.. మీరు ఎప్పుడు పనికి వచ్చినా ఫర్వాలేదు. మీకు రావాల్సిన పూర్తి కూలి వస్తుందంటూ బహిరంగంగానే చెబుతున్నారు. కూలీలు పని చేయకుండానే మస్టర్లు వేస్తుంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా అని వారిని అనుకూలంగా మార్చుకుంటున్నారు. పనికి రాకుండా ఉపాధి మస్టర్లు వేసి కూలీలను సైతం ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అంతా అనుకూలమైన వాళ్లే టీడీపీ 2014 ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వంలోకి రాగానే పాత ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి టీడీపీకి అనుకూలమైన సీనియర్ మేట్లు, టీడీపీ కార్యకర్తలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో వారి ప్రభావం చూపిస్తున్నారు. ఎలాగైనా కూలీలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకూ మస్టర్ల ద్వారా ఎర వేస్తున్నారు. దీనిపై అధికారులు కూడా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఫీల్డ్ అసిస్టెంట్ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అందరికీ వాటా... ఎన్నికల ప్రలోభాలతో పాటూ ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు వారి వాటా వారు పంచుకుంటున్నారు. పనికి రాక పోయినా ఫర్వాలేదు. రూ.180ల నుంచి రూ.200లు వరకు రోజుకొక కూలి వేసి మీకు వారానికి రూ.1000ల నుంచి రూ.1100ల వరకు కూలి వచ్చేలా చేస్తామంటున్నారు. ఒక కూలి వారికి రూ.100ల వరకు ఇస్తే చాలంటున్నారు. ఇలా మండలంలో 19 పంచాయతీలు ఉంటే సుమారు 3500 మంది పనులకు హాజరవుతున్నారు. వారికి వంద రూపాయిలు చొప్పున రూ.3.50 లక్షలు వసూళ్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సొమ్మును ప్రాజెక్టులోని ప్రతి అధికారికి చేరుతున్నట్లు సమాచారం. ఇలా మండలంలో కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతున్నా దానిని ఓట్ల ప్రలోభాలకు కూడా మార్చుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. -
మీడియాను చూసి నాలుక్కరుచుకున్న మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కందుకూరు: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికారపార్టీ కుట్రలు, కుతంత్రాలు, బరితెగింపు, బెదిరింపులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడబోమని నిరూపిస్తున్నారు. తాము అనుసరించబోయే అక్రమ కార్యకలాపాల వ్యూహమేంటో చెప్పకనే చెబుతున్నారు. ‘ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైతే రౌడీయిజం చేద్దాం. దాంట్లో తప్పేమి లేదంటూ బహిరంగంగానే ప్రకటించి’ తమ నైజాన్ని చాటుకున్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చేసిన వ్యాఖ్యలే.. వారి దుష్ట వ్యూహాలను బయటపెట్టాయి. ఎమ్మెల్యే పోతుల రామారావు సాక్షిగా..శివరాం చేసిన ఈ వ్యాఖ్యలపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నం.. కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి ప్రభంజనంలా వీస్తోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇప్పటికే వందల మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీకి గుడ్‌బై చెప్పి, మాజీ మంత్రి, కందుకూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహీధర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు పార్టీ ఫిరాయించి, టీడీపీలో చేరడంతో.. అప్పటి వరకు పెత్తనం చేసిన దివి శివరాం వర్గానికి మధ్య విబేధాలు తలెత్తాయి. పార్టీలో అసంతృప్తులు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఆ అసంతృప్తులు నేటికీ చల్లారడం లేదు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అటు పార్టీని కాపాడుకోవడంతోపాటు ఇటు ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఎన్నికల రోజు ఎలాగైనా అల్లర్లు సృష్టించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయాలనే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు శివరాం వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రౌడీయిజం చేసైనా ఎన్నికల్లో గెలుద్దామని బహిరంగంగా కార్యకర్తలకు చెబుతూ.. మీడియా ఉందని గమనించి నాలుక్కరుచుకున్నారు. దీంతో కందుకూరులో పాత రోజులు మళ్లీ పునరావృతమవుతాయా అంటూ చర్చలు మొదలయ్యాయి. -
నీ రేటు ఎంత..?
సాక్షి, కందుకూరు (ప్రకాశం): నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి.. నువ్వు ఎన్ని ఓట్లు వేయిస్తావు.. దాని ప్రతి ఫలంగా నీ రేటు ఎంతో చెప్పు.. ఇదీ ప్రస్తుతం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయం. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్లో ఉన్న సానుభూతిని అడ్డుకునేందుకు సానుకూలతను అడ్డుకునేందుకు అధికార పార్టీ భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. గ్రామాల వారీగా, పల్లెల వారీగా, నాయకుల వారీగా కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ నాయకుడి స్థాయిని బట్టి ప్యాకేజీ ఆఫర్ చేస్తూ తమవైపు తిప్పుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రలోభాలు, తాయిలాలకు అడ్డే లేకుండా పోతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికార పార్టీ నేతలు బరితెగించి మరీ ఇలా డబ్బులు పంపకం చేయడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతల డబ్బుల ప్రవాహాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ.. నియోజకవర్గంలో ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల ప్రకటన పూర్తి అయింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి బరిలో ఉంటే, తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యే పోతుల రామారావు బరిలో ఉన్నారు. దీంతో గెలుపుకోసం ఇరువురు తీవ్రస్థాయిలోనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉండడం, కచ్చితంగా విజయం సాధిస్తుందనే ప్రచారంతో అధికార పార్టీ అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. అదే సందర్భంలో అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, నాయకుల మధ్య కుమ్ములాలటు, అసంతృప్తులతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. అభ్యర్థి ప్రకటన పూర్తయితే, ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీలో నెలకొన్న పరిస్థితిలో మాత్రం మార్పురావడం లేదు. దీంతో నియోజకవర్గంలో ఎలాగైనా పట్టునిల్పుకునేందుకు అధికార పార్టీ ప్రలోభ రాజకీయాలకు తెరలేపింది. భారీగా డబ్బులు ఎరవేసి పార్టీలోని అసంతృప్తులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ తరహా రాజకీయాలు నియోజకవర్గంలో ఊపందుకున్నాయి. మొదట పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను గుర్తించి వారికి ఏం కావాలో అడడగం, వారి డిమాండ్ చేసిన మేరకు డబ్బులు ముట్టజెప్పడం చేస్తున్నట్లు సమాచారం. నాయకుడి స్థాయిని బట్టి.. తరువాత గ్రామాల్లో కాస్త ఓటర్లను ప్రభావితం చేసే నాయకులను గుర్తించి వారిని తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నాయకుడి స్థాయిని బట్టి రూ. 20వేల నుంచి రూ.50వేల వరకు ఒక్కొక్క నాయకుడికి ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సరే కొందరు నాయకులు ఈ డబ్బులు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నట్లు సమాచారం. గత ఐదు సంవత్సరాలుగా తమను పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో, ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా డబ్బులు ఆశ చూపడం ఎంతవరకు కరెక్టు అని ఆ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో గ్రామాల్లోను భారీగా ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు అధికార పార్టీ నాయకులు ప్రారంభించారు. గ్రామాలు, పల్లెల లెక్కన బేరాలు పెడుతూ మీకు ఎంత కావాలో చెప్పండి అనే తరహాలో విచ్చలవిడి ప్రలోభాలకు తెరలేపారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ ధర రాజకీయాలపైనే చర్చ జరుగుతుంది. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలు, ప్రకటిస్తున్న తాయిలాల గురించి ముచ్చటించుకుంటున్నారు. ఓటమి భయంతోనే... నియోజకవర్గంలో ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ ఇటువంటి తాయిలాలకు, ధన రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్సీపీ తరుపున గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే పోతుల రామారావు రెండు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో అప్పటి వరకు నియోజకవర్గంలో పెత్తనం చేసిన దివి శివరాం వర్గానికి, పోతుల వర్గానికి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇవి తారాస్థాయికి చేరి నియోజకవర్గంలో పార్టీ బలహీన పడేలా చేశాయి. కొందరు ముఖ్య నాయకులు సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందర పార్టీలోనే ఉన్న బహిరంగంగానే పోతుల రామారావుకు సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలా దివి శివరాంకు సొంత సొదరులైన మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్యనాయుడు, ప్రసాద్ వంటి వారు ఉన్నారు. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరక పార్టీలో అంతర్గత విబేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నియోజకవర్గంలో పార్టీలో గెలుపుపై ఆ పార్టీ కార్యకర్తలు, నాయకలు ఆశలు వదులుకున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు దీన్ని కప్పి పుచ్చుకునేందుకు భారీ స్థాయిలో తాయిలాలకు తెరలేపారు. ఉత్సాహంతో వైఎస్సార్సీపీ.... అదే సందర్బంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అత్యంత పటిష్టంగా ఉండడంతో ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అధికార పార్టీ ఎన్ని తాయిలాలు ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నారు. అలాగే అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీ బాట పట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అధికార పార్టీ నుంచి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలుపుపై ధీమాతో ముందుకు సాగుతోంది. -
ప్రకాశం జిల్లా కందుకూరులో భారీ అగ్నిప్రమాదం
-
నిషేధిత జాబితాలో కందుకూరు
కందుకూరు: రెవెన్యూ అధికారుల తప్పిదాలు, కాసుల కక్కుర్తి.. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా భూముల వ్యవహారంలో రెవెన్యూ లీలలు అన్నీ ఇన్నీ కావు. సొంత భూమిని ప్రభుత్వ భూమిగా, ప్రభుత్వ భూమిని సొంత భూములుగా రికార్డుల్లో నమోదు చేసి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కందుకూరు పట్టణంలో రెవెన్యూ శాఖ అధికారులు చేసిన తప్పిదాలే ఇందుకు నిదర్శనం. కందుకూరు పట్టణంలోని భూ రికార్డుల ఆన్లైన్లో వారు చేసిన పొరపాట్లే ప్రజలకు శాపాలుగా మారాయి. దీంతో తమ భూములకు సంబంధించి అన్ని హక్కులున్నా ఏ లావాదేవీలు నిర్వహించుకోలేని దుస్థితిని పట్టణ వాసులు ఎదురవుతోంది. కందుకూరు పట్టణం గ్రామీణ ప్రాంతం నుంచి పంచాయతీగా పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెంది దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ మధ్య కాలంలో పట్టణంలో భూములకు సంబంధించి ఎన్నో లావాదేవీలు జరిగాయి. వీటిలో ప్రభుత్వ భూములు, జనార్దనస్వామి మాన్యాలు, అసైన్మెంట్ భూములు ఇలా పలు రకాల భూములున్నాయి. వీటిలో కొందరికి పట్టాలు పుట్టించుకుంటే, కొందరు మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసుకుని హక్కులు సంపాదించిన వారు ఉన్నారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో భూములపై అన్ని హక్కులు ఉన్నా కొందరి భూములు ఇంకా ప్రభుత్వ జాబితాలోనే ఉన్నాయి. పైగా గడిచిన రెండు, మూడేళ్లలో రెవెన్యూ రికార్డులను పూర్తిగా ఆన్లైన్ చేశారు. ఏ సర్వే నంబర్లోని భూములు ఎవరి పేరుపై ఉన్నాయి, ఏ జాబితాలో ఉన్నాయి అనే వివరాలు పూర్తిగా ఆన్లైన్లో పెట్టారు. ప్రస్తుతం ‘మీ భూమి’ వెబ్సైట్ ఆధారంగా తమ భూముల వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే భూములను ఆన్లైన్ చేసేందుకు అధికారులను ఆర్ఎస్ఆర్ రికార్డును ప్రామాణికంగా చేసుకున్నారు. 1926లో తయారైన ఆర్ఎస్ఆర్ రికార్డు ఆధారంగానే భూములను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల్లో అనేక లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వమే కొందరికి పట్టాలు ఇవ్వడం లేదా మార్కెట్ ధర నిర్ణయించి విక్రయించడం లాంటివి చేశారు. కానీ ప్రస్తుతం జరిగిన ఆ లావాదేవీలు ఆన్లైన్లో నమోదు కాలేదు. ఉదాహరణకు పట్టణంలోని పామూరు బస్టాండ్ ప్రాంతం అభివృద్ధి చెందింది. సింహాద్రినగర్‌లోని 874 సర్వే నంబర్లో పోరంబోకు భూములకు సంబంధించి 9 పట్టాలు ఇచ్చారు. వీటిని వీరు 1970లోనే ప్రభుత్వానికి మార్కెట్ ధరను చెల్లించి సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి మున్సిపాలిటీకి ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు. అదే సందర్భంగా పదుల సంఖ్యలో ఈ భూముల చేతులు మారాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద అపార్టుమెంట్లు ఉన్నాయి. కానీ 2017లో ఈ సర్వే నంబర్ అధికారులు ఆన్లైన్ ప్రోహిబిటెడ్ జాబితాలో నమోదు చేశారు. ఆన్లైన్లో ఇవి ప్రభుత్వ భూములుగా చూయించారు. దీని వల్ల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అలాగే బ్యాంకు లోన్లు తీసుకుందామన్నా కుదరని పని. ఈ సమస్యపై ఆ ప్రాంతవాసులు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని ఆధారాలున్నా ఎలా నిషేధిత జాబితాలో పెడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పట్టణంలో దాదాపు 701 సర్వే నంబర్లు అధికారులు నిషేధిత జాబితాలో నమోదు చేశారు. దీని వల్ల అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సవరణలకు ప్రభుత్వం అనుమతి ప్రస్తుతం ఇలా పేర్కొన్న ఆస్తులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 22ఏ కింద ఇలా పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదై ఉంటే అధికారులకు దరఖాస్తు చేసుకుని తొలగించుకోవచ్చు. 22ఏ కింద అసైన్మెంట్ భూములు, 22బీ కింద ప్రభుత్వ భూములు, 22సీలో దేవాదాయశాఖ భూములు, 22డీలో ల్యాండ్ సీలింగ్ భూములు, 22ఈలో పై నాలుగు రకాలు కాకుండా ఇతర భూములు ఉన్నాయి. వ్యక్తిగత ఆధారాలు ఉండి, పైగా వాటి కింద నమోదై ఉంటే అధికారులకు దరఖాస్తు చేసుకుని నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవచ్చు. ఇందుకుగాను నేటి నుంచి జూలై 5వ తేదీ వరకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వీటిపై వచ్చిన అర్జీలను కూడా అధికారులు ఎటువంటి విచారణ లేకుండా తిరస్తారని ప్రజలు అనుమానిస్తున్నారు. అదే జరిగితే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. -
కొడుకు జాడకై తండ్రిపై ఎస్ఐ దాడి
కందుకూరు: తన కుమారుడి కేసు విషయంలో తనని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్ఐ అనవసరంగా దాడి చేసి గాయపరిచాడని కేసరిగుంట కాలనీకి చెందిన కొండయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండయ్య కుమారుడు మాలకొండయ్య ఇటీవల ఓ వివాహితను ఎటో తీసుకెళ్లాడు. ఆమె భర్త, బంధువులు స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. ఈ కేసు విషయమై నాలుగైదు రోజులుగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ ఎస్ఐ వేమన లేకపోవడంతో రూరల్ ఎస్ఐ ప్రభాకర్ కేసు విచారణ చేపట్టారు. మాలకొండయ్య ఆచూకీ తెలుసుకునేందుకు కొండయ్యను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. తనకు తెలియదని కొండయ్య చెప్పడంతో ఆవేశానికి గురైన ఎస్ఐ.. కొండయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో కొండయ్య కన్నుకు గాయమైంది. ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో కంటికి చికిత్స చేయించుకున్నాడు. ఈ కేసు విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేకున్నా ఎస్ఐ కావాలనే దాడి చేశాడని విచారం వ్యక్తం చేశాడు. సీపీఐ కార్యదర్శి మాలకొండయ్య, నాయకుడు పి.బాలకోటయ్య మాట్లాడుతూ ఎస్ఐ దురుసు ప్రవర్తన వల్లే కొండయ్యకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. కుమారుడిపై నమోదైన కేసులో ఎటువంటి సంబంధం లేని తండ్రిని తీసుకొచ్చి ఇష్టారీతిన ఎలా కొడతారని ప్రశ్నించారు. ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ మన్నం మాలకొండయ్యతో పాటు, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎస్ఐపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నాయకులు వలేటి రాఘవులు, బి.సురేష్ పాల్గొన్నారు. -
టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం కందుకూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురికావడమే అందుకు నిదర్శనమన్నారు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేసినా మంత్రి సునీత, ఆమె కుటుంబీకులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ ఆయన మండిపడ్డారు. సునీతపై కుటుంబీకులపై కేసు నమోదు చేయలేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యపై ఆయన కుటుంబీకులు ఫిర్యాదు చేయగా ప్రధాన నిందితుడు, టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, వారి సమీప బంధువులు మురళీ, మహేంద్ర అండతోనే హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నా.. వీరిపై మాత్రం కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. కాగా, ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని శుక్రవారం టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప నేతలు, కార్యకర్తల హత్యలకు పాల్పడటం దారుణమని తోపుదుర్తి పేర్కొన్నారు. -
అనంతలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
-
కందుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
-
వైఎస్సార్ సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డిని దారుణంగా చంపారు. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు. పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా చేసుకొని టీడీపీ కార్యకర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. కాగా మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శివారెడ్డి హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని అన్నారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సీఐ రాజేంద్రనాథ్ పట్టించుకోలేదని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
కుమారులూ.. తస్మాత్ జాగ్రత్త!
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోకుంటే ఇక కుదరదు. జీవించి ఉన్నంత కాలం వారి యోగక్షేమాలు చూడాల్సిందే. ఈ మేరకు భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ చట్టం–2007 అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని ముగ్గురికి కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున శనివారం తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వ్యవహరించే కుమారులను చట్టప్రకారం శిక్షిస్తామనీ స్పష్టం చేశారు. కందుకూరు: పట్టణానికి చెందిన సయ్యద్ నవాజ్ ఖయ్యూంకు ముజీబ్‌బాషా, ఖాదర్‌బాషా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిని తండ్రి పెంచి పెద్ద చేసి వివాహాలు చేశాడు. ప్రస్తుతం నవాజ్‌ఖయ్యూం వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. కొడుకులిద్దరూ తండ్రి ఆస్తులైదే పంచుకున్నారుగానీ ఆయన బాగోగులు గాలికొదిలేశారు. ముజీబ్‌బాషా నెల్లూరులో నివాసం ఉంటుండగా ఖాదర్‌బాషా సింగరాయకొండలో కాపురం పెట్టుకున్డాఉ. పోషణ భారమైన నవాజ్‌ఖయ్యూం తన కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల ఆర్డీఓ మల్లిఖార్జునకు ఫిర్యాదు చేశారు. విచారించిన ఆర్డీఓ సీనియర్ సిటిజన్స్ చట్టం–2007 ప్రకారం ఆయన కుమారులకు నోటీసులు జారీ చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు కుమారులను అరెస్టు చేయాలని తన కోర్టులో ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఖాదర్‌బాషాను అరెస్టు చేసి ఆర్డీఓ కోర్టుకు తెచ్చారు. ముజీబ్‌బాషా కూడా ఆర్డీఓ వద్ద లొంగిపోయాడు. ఖయ్యూం కుమారులను ఆర్డీఓ తీవ్రంగా హెచ్చరించారు. తల్లిదండ్రులను చూడకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరితో చర్చించి తండ్రి పోషణార్థం ప్రతి నెలా చరో రూ.3500 చొప్పున తండ్రి ఖాతాలో జమ చేసేలా ఆర్డీఓ తీర్పు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. మరో కేసులో కుమారుడికి గుణపాఠం ఇదే విధమైన మరో కేసులోను ఆర్డీఓ తీవ్రంగా స్పందించారు. లింగసముద్రం మండలం మొగిలిచర్లకు చెందిన పోతినేని నర్సమ్మ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఒకే ఒక కొడుకు శివన్నారాయణ ఆమె పోషణను పట్టించుకోవడం లేదు. పైగా సర్వే నంబర్ 137/3లో ఉన్న 1.60 ఎకరాలు, సర్వే నంబర్ 144లో ఉన్న 1.44 ఎకరాల భూమిని తల్లికి తెలియకుండా తన పేరుపై మార్చుకున్నాడు. ఆ భూములకు పాస్ పుస్తకాలు తెచ్చుకుని అనుభవిస్తూ తల్లి పోషణను మాత్రం గాలికొదిలేశాడు. ఆమె కూడా ఆర్డీఓ మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీఓ విచారణ చేపట్టి చట్టంలోని నిబంధనల మేరకు శివన్నారాయణ పేరుపై ఉన్న పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ శనివారం తీర్పు చెప్పారు. ఆ పొలాలను నర్సమ్మ పేరుపై మార్చుతున్నట్లు స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్స్ యాక్టు–2007 చట్టంలో తల్లిదండ్రులను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవచ్చని భారత ప్రభుత్వం పేర్కొందని ఆర్డీఓ పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులపై కఠిన చర్యలు తీసుకునే ఇటువంటి చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. -
వీడిన హత్య కేసు మిస్టరీ?
ప్రకాశం జిల్లా / కందుకూరు: పట్టణంలో సంచలనం రేపిన వృద్ధురాలు సోమేపల్లి లక్ష్మమ్మ (55) హత్య వెనుక దాగి ఉన్న మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇంట్లోనే అత్యంత దారుణంగా లక్ష్మమ్మను చంపిన అసలు నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగల కోసమే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు వలేటివారిపాలెం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నగలకు సంబంధించిన సమాచారంతో పాటు, మరికొన్ని ఇతర వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. నేడో, రేపో నిందితుడికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు మరో హత్య కేసులో కూడా అతడే నిందితుడిగా తేలింది. మరితం లోతుగా వెళ్తే.. పట్టణంలోని గుర్రంవారిపాలేనికి చెందిన సోమేపల్లి లక్ష్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. గత నెల 18వ తేదీ రాత్రి ఇంట్లోనే ఆమె అత్యంత దారుణ హత్యకు గురైంది. మరుసటి రోజు ఉదయం పక్క ఇంటి యువకుడు వచ్చి చూసే వరకు విషయం వెలుగులోకి రాలేదు. లక్ష్మమ్మను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? తెలిసిన వారు చేసిన పనా లేక దోపిడీ దొంగలు చేసిన హత్యా..వంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ హత్యకు ముందు నాలుగైదు రోజుల నుంచి లక్ష్మమ్మ ఇంటికి పెయింటింగ్ వేయిస్తోంది. పెయింటింగ్ పని చేసేందుకు వచ్చిన వారు ఆమె ఒంటిపై ఉన్న నగల కోసం దారుణానికి పాల్పడి ఉంటారని తొలుత భావించారు. మొదట్లో పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పనిచేసిన పెయింటర్లతో పాటు, పట్టణంలోని పలువురు పెయింటర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు దారుణానికి పాల్పడింది వారు కాదని విచారణలో తెలింది. మరో కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు అసలు దీనికి కారణం ఎవరనేది గుర్తించగలిగారు. వలేటివారిపాలెం మండలం నలదలపూరుకు చెందిన వ్యక్తి హత్యకు పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లక్ష్మమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే హత్యకు పాల్పడినట్టు విచారణలో తేలినట్లు సమాచారం. నిందితుడు దొరికినా పోయిన నగలు ఇంకా రికవరీ కాకపోవడంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఒంటరి మహిళలే టార్గెట్ నిందితుడు తెలివిగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్య చేసి బంగారం దోచుకున్నట్లు తేలింది. మొదట నారాయణమ్మను హత్య చేసి ఆమె నగలు దోచుకున్నాడు. అది పోలీసుల వరకు వెళ్లకపోవడంతో ఎవరూ కనిపెట్టలేదు. ఈ ధైర్యంతోనే నలదలపూర్లో ఉండే చెల్లెలు ఇంటికి లక్ష్మమ్మ తరుచూ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో లక్ష్మమ్మను గమనించిన నిందితుడు ఆమెను లక్ష్యంగా చేసుకుని హత్య చేసి బంగారం దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ హత్య వెనుకా అతడేనా? లక్ష్మమ్మ హత్యకు మూడు నెలల ముందు పట్టణంలో మరో ఒంటరి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని సంహాద్రినగర్లో కొల్లా నారాయణమ్మ అనే మహిళ ఇంట్లోనే నిర్జీవంగా పడి ఉంది. ఒంటిపై ఉన్న నగలు కూడా మాయమయ్యాయి. ఆమె బంధువులు ఇది సాధారణ మరణంగానే భావించి అంత్యక్రియలు చేశారు. ఇద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండటం, ఒకే రీతిలో మరణం, నగలు మాయం వంటి సంఘటనతో నారాయణమ్మ కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు దొరికిన లక్ష్మమ్మ హంతకుడే నారాయణమ్మను కూడా హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. సెల్‌ఫోన్ పట్టించిందా.. అత్యంత చాకచక్యంగా హత్యలకు పాల్పడిన నిందితుడు చేసిన పొరపాటే పోలీసులకు పట్టుబడేలా చేసింది. లక్ష్మమ్మ హత్యలో చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. నారాయణమ్మ హత్యపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో నారాయణమ్మ హత్య జరిగి మూడు నెలలైనా ఇటీవల ఆమె ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఇంట్లో ఓ ఫోన్ బాక్స్ దొరికింది. ఆ ఫోన్ బాక్స్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఆ ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించగలిగారు. ఆ ఫోన్ నలదలపూరులో ఉన్నట్లు తేల్చి నిందితుడిని గుర్తించినట్లు సమాచారం. నిందితుడు చేసిన ఆ చిన్న పొరపాటే పోలీసులకు చిక్కేలా చేసింది. మొత్తానికి ఓ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపడితే మరో హత్య కేసు నిందితుడిని కూడా గుర్తించగలిగారు. -
వీపు వాతలు తేలేలా.. యూకేజీ పిల్లాడిపై టీచర్ కర్కశత్వం!
సాక్షి, కందుకూరు: చేతి రాత బాగా లేదని ఐదేళ్ల చిన్నారిని చితకబాదిందొక టీచర్. టీచర్ కొట్టిందని బిడ్డ చెప్పడంతో ఆవేదన చెందిన చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్లో చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. కందుకూరు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన తల్లపనేని మాధవరావు కుమారుడు మనోభిరామ్ కందుకూరులోని శ్రీచైతన్య స్కూలు క్యాంపస్-2లో యూకేజీ చదువుతున్నాడు. సోమవారం స్కూలుకు వెళ్లగా రైటింగ్ బాగా లేదంటూ అభిరామ్‌ను క్లాస్ టీచర్ స్వర్ణ బెత్తంతో తీవ్రంగా కొట్టింది. వీపు వాతలు తేలేలా కర్కశత్వం ప్రదర్శించింది. ఇంటికి వెళ్లిన మనోభిరామ్కు స్నానం చేయిస్తున్న సమయంలో వీపంతా వాతలు ఉండడాన్ని తల్లి గమనించింది. ఎలా జరిగిందని అడగగా స్కూల్లో టీచర్ కొట్టిందని చెప్పాడు. టీచర్ ప్రవర్తనపై ఽచిన్నారి తండ్రి మాధవరావు మంగళవారం ఉదయాన్నే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఇన్చార్జి ఎస్సై ప్రభాకర్ దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కలపై చెట్టంత నిర్లక్ష్యం
జిల్లాను హరితవనంగా మారుస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో మొక్కల పెంపకం పేరుతో భారీఎత్తున నిధులు ఖర్చు చేశారు. రోడ్లకు ఇరువైపులా, అటవీప్రాంతాలు, పాఠశాలల ప్రాంగణాలు...ఇలా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎటుచూసినా పచ్చదనమే కన్పిస్తుందని గొప్పలు చెప్పారు. వాస్తవానికి చాలా మొక్కలు నర్సరీల్లోనే ఎండిపోయాయి. నాటిన మొక్కల పరిస్థితీ అంతే. అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామం వద్దనున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) నర్సరీలో మొక్కలు ఎండిన దృశ్యాలివీ. నీళ్లు లేకపోవడంతో వీటిని ఎండబెట్టాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్లతోనైనా సరఫరా చేసి సంరక్షించాలన్న స్పృహ వారికి లేకపోయింది. - జి.వీరేశ్, సాక్షి ఫొటోగ్రాఫర్ -
సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
అనంతపురం రూరల్: అమరావతి ఎక్స్‌ప్రెస్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను సోమవారం కందుకూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ కందుకూరు పంచాయతీ పరిధిలో రైతులు దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా కోల్పోవాల్సి వస్తోందన్నారు. 44, 205వ జాతీయ రహదారి కూడలిలో మెగా జంక్షన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న తెలిసిందన్నారు. ఒక్కొక్క జంక్షన్‌కు దాదాపు 500 ఎకరాల చొప్పున దాదాపు వెయ్యి ఎకరాలు సేకరించాలనే ప్రణాళికను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ఇప్పటికే ఎఫ్‌సీఐ గోదాములకు, రైల్వే జంక్షన్, ఎస్కేయూకు దాదాపు వందల ఎకరాల భూములను రైతులు వదులుకున్నారని గుర్తుచేశారు. అమరావతి రోడ్డుకు ఎకరా భూమి కూడా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. మండల సర్వేయర్ శరత్‌తోపాటు అధికారులను వారు వెనక్కు పంపి వేశారు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడు గోవింద్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు మల్లికార్జున, నాగరాజు, చంద్రశేఖర్, రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ ఓబిలేసు, రైతులు వెంకటనారాయణ, లక్ష్మీనారాయణమ్మ, ఉజ్జినమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ విశ్వశాంతికి గ్లోబల్ పీస్ అవార్డు
కందుకూరు : మండల వైద్యాధికారిణి డాక్టర్ విశ్వశాంతి గ్లోబల్ పీస్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం అమెరికా చికాగోకు చెందిన అమీర్ అలీఖాన్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ వామనరావు చేతుల మీదుగా అంతర్జాతీయ గ్లోబల్ పీస్ 2016 అవార్డును ఆమెకు బహూకరించారు. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు సేవలందిస్తూ, జిల్లాలోనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడంలో మూడో స్థానంలో పీహెచ్‌సీని నిలిపడంలో ఆమె విశేష కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఆమె చేస్తున్న సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఫారూఖ్ అలీఖాన్, సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు చిన్నారులను మింగిన కుంట
కందుకూరు: భారీ వర్షాలతో జలకళ సంతరించుకున్న కుంటను చూసేం దుకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ అనుబంధ గ్రామం మహ్మద్ నగర్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుత్పల భిక్షపతి, యాదమ్మ దంపతులకు గణేశ్, శివ, కుమార్తె శిల్ప ఉన్నారు. గణేశ్ డిగ్రీ చదువుతుండగా, శిల్ప(14), శివ (13) కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 9, 7 తరగతులు చదువుతున్నారు. వీరి తండ్రి భిక్షపతి ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లే కూలీనాలీ చేస్తూ పిల్లల్ని పోషించుకుంటోంది. భిక్షపతి చిన్నాన్న లక్ష్మయ్య కూతురు సుశీల, ఈశ్వర్ దంపతులకు సృజన్ (13), మదన్ కుమార్ అలియాస్ బన్నీ(10) ఉన్నారు. కందుకూరు చౌరస్తాలోని ఎస్‌వీవీఆర్ స్కూల్లో వీరు 7, 6 తరగతులు చదువుతున్నారు. ఈశ్వర్ భార్యాపిల్లలను వదిలేసి చాలా ఏళ్ల క్రితమే ఎటో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సుశీల పుట్టింట్లోనే ఉంటూ కూలిపనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. గురువారం మధ్యాహ్నం శిల్ప, శివ, సృజన్ , మదన్ కుమార్‌తోపాటు గ్రామానికి చెందిన దశరథ కుమార్తెలు సంధ్య, సబిత, జంగయ్య కుమారుడు వంశీ కలసి గ్రామ సమీపంలో ఉన్న పోరుడోని కుంటలోకి వర్షానికి చేరిన నీటిని చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలో మట్టి అంటడంతో కాళ్లు కడుక్కుందామని కుంట వద్దకు వెళ్లగా.. ఇంటర్ చదివే సంధ్య వారిని వారించి పైకి రావాలని చెప్పింది. దీంతో ఆమె చెల్లెలు సబిత, వంశీ కట్టపైకి వచ్చారు. మిగతా నలుగురు శిల్ప, శివ, సృజన్ , మదన్ కుమార్ కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. దీంతో పైన ఉన్న ముగ్గురు గ్రామంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం తెలిపారు. అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో చిన్నారులను గాలించి బయటికి తీయగా అప్పటికే అందరూ విగతజీవులుగా కనిపించారు. -
కొనసాగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక
కందుకూరు : మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద 2015 సెప్టెంబర్ నెల నుంచి మే 31, 2016 వరకు జరిగిన 1982 పనులకు గాను అయిన రూ.6.50 కోట్ల ఖర్చుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ప్రజావేదిక ద్వారా సామాజిక తనఖీ నిర్వహించారు. డ్వామా అదనపు పీడీ జాన్సన్, జిల్లా విజిలెన్స్ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో గ్రామాల వారీగా చేపట్టిన ఉపాధి పనులను సమీక్షించారు. మేట్లు హాజరు పట్టికలో కూలీల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం పట్ల బాధ్యులుగా క్షేత్ర సహాయకుల్ని చేస్తూ వారికి జరిమానా విధించారు. రైతుల పొలాల్లో నిర్ణయించిన దాని కంటే అధికంగా పనులు చేపట్టడం, కొంత మంది పొలాల్లో తక్కువగా పనులు చేయించడం, కొలతల్లో వ్యత్యాసాలను గుర్తించారు. మార్చి నెలలోపు వంద రోజుల కంటే అదనంగా పని దినాలు చేసిన కుటుంబాలకు ఏప్రిల్‌లో మిగతా డబ్బు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారుల్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏపీడీ తిరుపతయ్య, ఎంపీడీఓ అనూరాధ, డీఆర్డీఏ ఏపీడీ ఉమాదేవి, ఏపీఓ రవీందర్‌రెడ్డి, సోషల్ ఆడిట్ టీం హెడ్ రజిత, ఎస్ఆర్పీలు రాజు, వెంకటేష్, టీఏలు, ఉపాధి సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు. -
గ్రామాల్లో బోనాల వైభోగం
కందుకూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గుమ్మడవెల్లి, కొత్తగూడ, పులిమామిడి, దాసర్లపల్లి, సాయిరెడ్డిగూడ, మీర్ఖాన్పేట, మాలగూడ, రాచులూరు, చీమలవానికుంట, గూడూరు, అగర్మియాగూడ, బేగంపేట, అన్నోజిగూడ, తిమ్మాయిపల్లి, ఊట్లపల్లి తదితర గ్రామాల్లో పోచమ్మ, మార్కమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, కాటమయ్య బోనాలు వైభవంగా జరిగాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళలు, చిన్నారులు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఆరుగురు పేకాట రాయుళ్ల రిమాండ్
కందుకూరు (రంగారెడ్డి) : ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లికార్జున్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని నేదునూరు గ్రామ శివార్లలో శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,220 స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. -
లారీ,ఆటో ఢీ: ఒకరు మృతి
కందుకూరు (రంగారెడ్డి జిల్లా) : కందుకూరు మండలకేంద్రానికి సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వాగులో పసికందు
కందుకూరు అర్బన్ (ప్రకాశం) : అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వాగులో పడేసి వెళ్లారు. రోడ్డు మీద వెళ్తున్నవారికి పాప ఏడుపు వినిపించడంతో.. వాళ్లు పాపను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని ఎర్రవాగు వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కాగా.. ఆస్పత్రి వర్గాలు మాత్రం శనివారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దంపతులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.