కందుకూరు (ప్రకాశం) : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరులోని పోస్టాఫీస్ చౌరస్తాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన శ్రీలక్ష్మీ(50) అనే మహిళ ఉదయం గుడికి వెళ్తుండగా.. చీరాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి చీరాల వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న శ్రీలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.