
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
తుమకూరు: గాయకులతో వెళ్తున్న ప్రైవేట్ చానల్ వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరో 15 మంది గాయకులు గాయపడ్డారు. ఈ ఘటన తుమకూరు జిల్లా శిరా సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఓ కన్నడ చానల్‌కు చెందిన గాయకుల బృందం టీటీ వాహనంలో వెళ్తుండగా శిరా సమీపంలో ఎస్.పి.డాబా వద్ద ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో బొలెరో డ్రైవర్ కుమార్(27) మృతి చెందగా చానల్‌లో వాహనంలోని 15 మంది గాయకులు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను శిరా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.