ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో ఢిల్లీ హైవేపై ఈరోజు (సోమవారం) ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు మృతిచెందారు. వందమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
మిలాక్‌లోని భైరవ బాబా ఆలయం సమీపంలో సాహిబాబాద్ డిపో బస్సు, వోల్వో బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తెల్లవారుజామున 4.15 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్ జోగేంద్ర సింగ్, పోలీసు సూపరింటెండెంట్ విద్యాసాగర్ మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ తెలిపిన వివరాల ప్రకారం మృతులలో రోడ్డువేస్ బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.
గాయపడిన వారి సంఖ్య 49కి చేరిందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. తొమ్మదిమంది పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. సాహిబాబాద్ డిపోకు చెందిన జనరత్ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తోంది. ప్రైవేట్ వోల్వో బస్సు హరిద్వార్ నుంచి శ్రీబస్తీకి వెళ్తోంది. ప్రైవేట్ బస్సు రాంగ్ సైడ్‌లో వచ్చిన కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నదని ప్రాథమికంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment