బుండి: రాజస్థాన్‌లోని బుండిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎకో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ నేషనల్ హైవేలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైవేపై ఉన్న కెమెరాలు, టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన గురించి బుండి ఏఎస్పీ ఉమా శర్మ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. కాగా రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఓ కారు రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ఘటనలో కూడా ఆరుగురు మృతి చెందారు.
ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి
Comments
Please login to add a commentAdd a comment