రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం | Bus Collides With Car In Rajasthan | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం

Published Thu, Feb 6 2025 7:27 PM | Last Updated on Thu, Feb 6 2025 7:32 PM

Bus Collides With Car In Rajasthan

జైపూర్‌:  రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఓ బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో భారీ సంఖ్యలోప్రాణనష్టం వాటిల్లింది. రాజస్థాన్‌లోని దుడు రీజియన్‌లజజైపూర్‌-అజ్మీర్‌ హైవేపై మౌంఖపూరాకు అతి దగ్గర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయ్యాలయ్యాయి.

బస్సు ముందు టైర్‌ పేలిపోవడంతో అది కాస్తా అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సును కంట్రోల్‌ చేయడానికి యత్నించిన డ్రైవర్‌  ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. దాంతో  కారులో ఉన్న వారు పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement