
భోపాల్: ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు ప్రజల మీదకి దూసుకురావడంతో ఆరుగురు మృతి చెందగా, పదిమందికి పైగా గాయపడ్డారు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని బస్టాప్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రక్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంతం జరిగిందని పోలీసులు తెలిపారు.
రత్లామ్ జిల్లాలో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తుల గుంపుపైకి దూసుకొచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, పదిమంది దాక గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయని వెల్లడించారు. లారీ డ్రైవర్ పరారయ్యడని అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: హత్య చేసి తప్పించుకోవాలనుకుంది..తల్లిని పట్టించిన 13 ఏళ్ల కూతురు)
Comments
Please login to add a commentAdd a comment