మైహార్: మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు రోడ్డు పక్కనే నిలిపివుంచిన ఉన్న హైవా వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా తొమ్మదిమింది మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని మైహర్, అమర్పతన్, సత్నా జిల్లా ఆసుపత్రులకు తరలించారు. 30వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు ప్రయాగ్‌రాజ్ నుంచి రేవా మీదుగా నాగ్‌పూర్ వెళుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా వెళుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 53 సీట్లున్న ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే, నాదన్, మైహార్ పోలీసులు ఎస్‌డిఎం వికాస్ సింగ్, తహసీల్దార్ జితేంద్ర సింగ్ పటేల్, ఎస్పీ సుధీర్ కుమార్ అగర్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీ, గ్యాస్ కట్టర్ సహాయంతో బస్సు డోర్ కట్ చేసి, ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ప్రయాణికుల్లోని కొందరు కిటికీలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం
Comments
Please login to add a commentAdd a comment