truck accident
-
లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు దుర్మరణం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోవడంతో నలుగురు సైనికులు మృతి చెందారు. ఇద్దరు సైనికులు ప్రమాదం జరిగిన కాసేపటికే చికిత్స పొందుతూ కన్నుమూయగా, చికిత్స పొందుతున్న మరో ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. దాంతో చనిపోయిన సైనికుల సంఖ్య 4కు చేరింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. శనివారం ఉదయం బాందీపుర(Bandipore) జిల్లా సదర్ కూట్ పయెన్ ప్రాంతంలో సైనికులతో ఓ ట్రక్కు వెళ్తోంది. అయితే ఒక్కసారిగా అదుపు తప్పి దొర్లుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మొత్తంగా నలుగురు సైనికులు చనిపోయినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.#WATCH | Bandipora, Jammu and Kashmir: Dr Masarat Iqbal Wani, Medical Superintendent of District Hospital Bandipora says, "5 injured were brought here, out of which 2 were brought dead, 3 injured who were in critical condition have been referred to Srinagar for further… https://t.co/8RBwynIEvt pic.twitter.com/UVYr8vTiVk— ANI (@ANI) January 4, 2025ఇదిలా ఉంటే.. జమ్ము కశ్మీర్లో ఈ తరహా ప్రమాదాలు కొత్తేం కాదు. గతేడాది డిసెంబర్లో ఫూంచ్ జిల్లాలో ఇదే తరహాలో ఆర్మీ వాహనం పడిపోయి ఐదుగురు సైనికులు మృతి చెందారు. అంతకు ముందు.. నవంబర్ నెల 4వ తేదీన రాజౌరీ(Rajaouri)లో జరిగిన యాక్సిడెంట్లో ఓ జవాన్ చనిపోయాడు. అదే నెల 2వ తేదీన ఓ కారు రెయిసి జిల్లాలో లోయలో పడిపోయి నెలల పసికందు, తల్లి సహా ముగ్గురు మృతిచెందారు. -
భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి
పాట్నా: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్న ట్రక్కు కన్వరియాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు భక్తులు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. బీహార్‌లోని బంకా జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కన్వరియాలు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కన్వరియాలు సుల్తాన్‌గంజ్ నుంచి జస్త్ గౌర్ నాథ్ మహదేవ్ ఆలయానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. స్థానికుల రాళ్లదాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. స్థానికులు అంబులెన్స్‌పై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. ఘటనా స్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొన్న సంఘటన బుధవారం పుణె ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి.గ్రౌండ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొట్టింది. విమానం ముందు భాగంతోపాటు ట్రక్ దిబ్బతింది. ఫ్లైట్ కిందిభాగం ట్రక్కు తగలడంతో ల్యాండింగ్ గేర్ వద్ద టైర్ పాడయ్యింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. భూమిపై విమానాన్ని నడిపేందుకు టగ్ ట్రక్ టాక్సీని ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదికఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులను ప్రమాదం జరిగిన విమానంలో నుంచి దింపేసి వారి గమ్యస్థానాలు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. -
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధులే జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి నాలుగు వాహనాలు ఢీకొట్టి దాబాలోకి (హోటల్) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పది గంటలకు పలాస్నర్ గ్రామ సమీపంలోని ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ధులేకు వెళ్తుండగా.. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. దీంతో ముందుగా హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న రెండు బైక్‌లు, ఒక కారు, మరొక కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కకు ఎగిరిపడింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న దాబాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. భాదితుల్లో బస్టాప్‌లో వేచిచూస్తున్న ప్రయాణికులు సైతం ఉన్నారని, క్షతగాత్రులను ధులే, సిర్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టినట్లు చెప్పారు. చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట.. -
51 మందిని బలి తీసుకున్న మృత్యు శకటం
నైరోబీ: మృత్యు శకటంలా మారిన ఓ ట్రక్కు 51 నిండు ప్రాణాలను కబళించింది. కెన్యాలోని లొండియాని పట్టణంలో శుక్రవారం సాయంత్రం హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం రహదారి పక్కనే ఉన్న మార్కెట్లో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొత్తం 51 మంది మృతి చెందారు. మరో 32 మంది క్షతగాత్రులయ్యారు. మరికొందరు వాహనాల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. 🔔 — A road accident in Londiani, western Kenya has claimed at least 48 lives after a lorry carrying a shipping container veered off the road and collided with multiple vehicles. pic.twitter.com/FLOf3dJjGf — OFF-AIR ™ 🔔 (@OffAirNewsRoom) July 1, 2023 ఇది కూడా చదవండి: అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం -
షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు
లక్నో: ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్ బాందాలో స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆమెను మూడు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లింది. బాందా జిల్లాలోని మవాయ్ బుజర్గ్ గ్రామంలో బుధవారం ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహం చిక్కుకోవడంతో రాపిడికి ట్రక్కు కింద నుంచి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో అగ్నిమాపక యంత్రాలు వెళ్లి మంటలను ఆర్పాయి. పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీసేందుకు శ్రమించారు. చదవండి: భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా? -
బస్టాప్‌లో ఉన్న ప్రజలపైకి దూసుకొచ్చిన ట్రక్కు...ఆరుగురు మృతి
భోపాల్: ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు ప్రజల మీదకి దూసుకురావడంతో ఆరుగురు మృతి చెందగా, పదిమందికి పైగా గాయపడ్డారు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని బస్టాప్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రక్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంతం జరిగిందని పోలీసులు తెలిపారు. రత్లామ్ జిల్లాలో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తుల గుంపుపైకి దూసుకొచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, పదిమంది దాక గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయని వెల్లడించారు. లారీ డ్రైవర్ పరారయ్యడని అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: హత్య చేసి తప్పించుకోవాలనుకుంది..తల్లిని పట్టించిన 13 ఏళ్ల కూతురు) -
డివైడర్‌పై నిద్రించటమే వారికి శాపంగా మారింది.. ట్రక్కు దూసుకెళ్లి..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలువ నీడలేని కొందరు రోడ్డు మధ్యలోని డివైడర్‌పై నిద్రించటమే వారికి శాపంగా మారింది. సీమాపురి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ట్రక్కు అతవేగంతో డివైడర్‌పై పడుకున్న వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) బస్ డిపోకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు.. కరీం(52), ఛోటే ఖాన్(25), షా అలాం(38), రాహు(45)లుగా గుర్తించారు. మరో ఇద్దరు మనీశ్(16), ప్రదీప్(30)లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆగకుండా ట్రక్కుతో సహా పారిపోయాడు డ్రైవర్. నిందితుడుని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి! -
షాకింగ్.. ఎస్పీ నేత కారును ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లిన ట్రక్కు డ్రైవర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురిలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ కారును ఢీకొట్టాడు. అనంతరం దాన్ని 500 మీటర్లు ట్రక్కుతోపాటే ఈడ్చుకెళ్లాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #WATCH A truck dragged the car of SP District President Devendra Singh Yadav for about 500 meters in UP's Mainpuri pic.twitter.com/86qujRmENr — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022 కారును ఢీకొట్టిన అనంతరం ట్రక్కును ఆపాలని అక్కడున్న వారు వెంబడించినా డ్రైవర్ పట్టించుకోలేదు. వాహనాన్ని అలాగే వేగంగా పోనిచ్చాడు. 500 మీటర్ల దూరం వెళ్లాక ఆగాడు. ట్రక్కు డ్రైవర్‌ను యూపీలోని ఇటావాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు. చదవండి: బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్! -
పెళ్లికి వెళ్తుండగా మృత్యుపంజా
బనశంకరి: పెళ్లికి వెళ్తున్న వారిపై మృత్యువు పంజా విసిరి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకుంది. ఈఘటన బెళగావి జిల్లా నిప్పాణి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతులను నిప్పాణికి చెందిన అదగొండ బాబుపాటిల్(60), భార్య ఛాయా అదగొండపాటిల్(55), ఛాయా తల్లి మగదమ్ (80), మహేశ్దేవగోండపాటిల్(23)గా గుర్తించారు. బెళగావిలో జరిగే వివాహానికి వీరు కారులో శుక్రవారం కొల్లాపుర నుంచి వెళ్తుండగా నిప్పాణి శివారులో ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. నిప్పాణి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చేరుకుని మృతదేహాలను కారులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నిప్పాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపమైందా?) -
రెండు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం
మోపిదేవి (అవనిగడ్డ)/మదనపల్లె టౌన్: రాష్ట్రంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి బృందంతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడి కృష్ణా జిల్లాలో ఐదుగురు దుర్మరణం పాలవగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన మరో ఘటనలో నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పి చెరువులో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలులో జరుగుతున్న శుభకార్యానికి సుమారు 30 మందితో చల్లపల్లి మండలం చింతలమడ నుంచి ట్రక్కు బయలుదేరింది. డ్రైవర్ బత్తు రామకృష్ణ అతి వేగంతో ట్రక్కు నడపడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కోన వెంకటేష్(70), భూరేపల్లి కోటేశ్వరమ్మ(55), భూరేపల్లి రమణ(45)లు అక్కడికక్కడే మృతిచెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మాధవరావు, గుర్రం విజయ (48) చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇద్దరు పిల్లలతో సహా భార్యభర్తల దుర్మరణం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగిరెడ్డి.. పలమనేరులో బుధవారం సాయంత్రం జరిగిన వివాహానికి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యాడు. సోదరి ఇంట జరిగే గృహ ప్రవేశానికి హాజరవ్వాలన్న ఆత్రుతతో గురువారం వేకువ జామునే కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరాడు. మదనపల్లెకు మరో 5 నిమిషాల్లో చేరుకుంటాడనగా 150వ మైలు వద్ద మెరవపల్లె చెరువు కల్వర్టును కారు ఢీకొట్టి చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గంగిరెడ్డి(40)తో పాటు అతడి భార్య మధుప్రియ(28), కుమార్తె ఖుషితారెడ్డి(5), కుమారుడు దేవాన్స్‌రెడ్డి(3)లు దుర్మరణం పాలయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతితో రెడ్డివారిపల్లె కన్నీటి సంద్రమైంది. -
గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8మంది దుర్మరణం
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. క్రేన్‌ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు అదుపుతప్సి గుడిసెలోకి దూసుకెళ్లిట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో గుడిసెలో పది మంది నిద్రిస్తున్నారని, వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఎనిమిది మంది చనిపోయారని, మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారని అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్‌రాయ్ తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పెర్కోన్నారు. -
ఘోర ప్రమాదం: లారీ, బస్సు ఢీ 41 మంది దుర్మరణం
బమాకో: ఆఫ్రికాదేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ మధ్య మాలి, సెగో పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మంగళవారం లారీ బస్సు ఢీకొన్న ఘటనలో 41 మంది మరణించారు. మరో 33 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదుపు తప్పిన ట్రక్కు బస్సు మీదికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యాయి. వస్తువులు మార్కెట్ కార్మికులతో వెళ్తున్న ట్రక్కు, ప్యాసింజర్ బస్సును ఢీకొట్టినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు మీదికి దూసుకెళ్లిందని తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఆఫ్రికాలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి లక్ష మంది జనాభాకు 26 మరణాలు నమోదవుతున్నాయి. -
లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు: 11 మంది దుర్మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర సంఘటన జరిగింది. లోయలోకి అదుపు తప్పి డీసీఎం (ట్రక్కు) దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన ఇటావా జిల్లా రవెనెలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం.. బద్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రవెనె ప్రాంతంలో 50 మందికి పైగా ప్రయాణికులను వేసుకుని వెళ్తోంది. అయితే సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి చక్కర్‌నగర్ రోడ్డులోని లోయ ప్రాంతంలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారని ఆ ప్రాంత అదనపు ఎస్పీ ప్రశాంత్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. మృతులందరూ పురుషులేనని చెప్పారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. చదవండి: ‘మేం చచ్చిపోతున్నాం.. మా పార్ట్స్ నా భార్యకు ఇవ్వండి’ చదవండి: సముద్ర గర్భంలో భూకంపం: తప్పిన సునామీ ముప్పు -
విషాదం : టోల్‌ప్లాజాను తొందరగా దాటాలనే ప్రయత్నంలో
నోయిడా : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా టోల్‌ప్లాజా వద్ద శనివారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. అందరికంటే ముందు టోల్ కట్టాలన్న ట్రక్కు డ్రైవర్ తాపత్రయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొంది. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో నోయిడా టోల్‌ప్లాజా వద్దకు రెండు ట్రక్కులు ఏకకాలంలో వచ్చాయి. అయితే ఎవరి ట్రక్కు ముందు వెళ్లాలనే విషయంపై ఇరు డ్రైవర్ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీయడానికి ప్రయత్నించగా మరో ట్రక్కు డ్రైవర్ దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇది పట్టించుకోకుండా సదరు ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని అలాగే ముందుకు తీయడంతో మరో డ్రైవర్ పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడిక్కడే మరణించాడు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవిలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సీసీటీవి ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మరణించిన ట్రక్కు డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో 11 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ధూలే జిల్లా నీమ్గల్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలుచేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధూలే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
కామారెడ్డి వాసి మృతదేహం తరలింపుకు తొలగిన అడ్డంకి
సాక్షి, కామారెడ్డి : ఈ నెల 2న బహరాస్‌లో జరిగిన ప్రమాదంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు(37) మృతి చెందాడు. రంజాన్ సెలవులు ఉండటంతో మృతదేహాన్ని భారత్‌కు పంపే ప్రక్రియలో జాప్యం జరిగింది. దాంతో మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపించాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఇండియన్ ఎంబసీకి, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్య శాఖకు ‘మదద్’ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన బహరాస్ ఎంబసీ ప్రభుత్వం నుంచి డెత్ సర్టిఫికెట్ అందాల్సి ఉందని.. అది రాగానే మృత దేహాన్ని భారత్‌కు పంపడానికి తగిన చర్యలు తీసుకుంటామాని భీం రెడ్డికి ఈ మెయిల్ ద్వారా తెలిపింది. పని నిమిత్తం బహరాస్ వెళ్లిన రాజు ఈ నెల 2 యాక్సిడెంట్‌కు గురయ్యాడు. డ్రైవర్ చూసుకోకుండా ట్రక్కును నడపడం వలన వెనక టైరు కింద పడ్డ రాజు తల నుజ్జు నుజ్జు అయింది. దాంతో రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు రాజుకు భార్య లావణ్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. ప్రవాసీ బీమాకు దూరం ఈసీఆర్(ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్) పాస్‌పోర్టు కలిగిన రాజు.. చట్టబద్దమైన ఇ-మైగ్రేట్ సిస్టం ద్వారా కాకుండా అక్రమ పద్దతిలో పుషింగ్ ద్వారా బహరాస్‌కు వెళ్లాడు. ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 10 లక్షలు విలువ చేసే ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’(పీబీబీవై) ప్రయోజానికి అనర్హుడు కావడంతో బీమా ప్రయోజనం పొందలేకపోతున్నాడు. మూడున్నర నెలల క్రితం ‘జాస్కో’ కంపెనీలో ఉద్యోగంలో చేరిన రాజు.. ఇలా అనూహ్యంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రైతుబంధులాగా ప్రవాసీలను ఆదుకోవాలి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రూ. 5 లక్షల రైతు బీమా ఇచ్చినట్లుగానే గల్ఫ్ ప్రవాసీ కార్మికులకు కూడా రూ. 5 లక్షల బీమా లేదా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ సురేందర్ సింగ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో తెలంగాణకు చెందిన సుమారు వెయ్యి మంది ప్రవాసీలు గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ధన సహాయం అందలేదని పేర్కొన్నారు.ఇబ్బందుల్లో ఉన్న గల్ప్ కార్మికులు తన ఫోరం హెల్ప్ లైన్ నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు. హెల్ప్‌లైన్ నంబర్ - 93912 03187 మంద భీంరెడ్డి - 98494 22622 -
ట్రక్కు బోల్తా..బీరంతా వరదలా పారింది
-
టోల్‌ప్లాజా వద్ద ట్రక్కు బోల్తా : బీరు నేలపాలు
జైపూర్ : రాజస్తాన్‌లో ఓ ట్రక్కు బోల్తా పడింది. విచిత్రంగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత, నెమ్మది చేసుకోవాల్సి ఆ వాహనం టోల్‌ప్లాజా సిబ్బంది మీదకు దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో ఊహించని టోల్‌ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టోల్‌ప్లాజా వద్ద బోల్తా పడిన ఆ ట్రక్కు, బీరు బాటిళ్ల లోడుతో అటుగా వెళ్తోంది. ట్రక్కు బోల్తా పడటంతో, బీరు సీసాలన్నీ నేలపాలయ్యాయి. బీరంతా వరదలా పారింది. రాజస్తాన్‌లోని కిసాన్‌ఘడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. -
ఆ శిశువు మృత్యుంజయురాలు.. తల్లి గర్భంలో నుంచి..
బ్రెసిలియా : ఓ ప్రమాదంలో గర్భవతి కడుపులోనుంచి బయటకు ఎగిరిపడ్డ ఓ పసికందు ప్రాణాలతో మిగిలింది. తల్లి ప్రమాదంలో చనిపోయినా ఆమెకు కొద్దిమీటర్ల దూరంలో గడ్డిలో ఎగిరిపడ్డ ఆ పసికందుకు ఏ చిన్నగాయం కాకపోవటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన ఓ ట్రక్కు చెక్క ముక్కలతో ప్రయాణిస్తూ.. కొద్ది దూరం తర్వాత ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఆ సమయంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఓ గర్భవతి కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ట్రక్కులో ఉన్న చెక్కముక్కలు ఆమెపై పడ్డాయి. మహిళ కడుపుపై ఒత్తిడి పడటంతో గర్భంలో ఉన్న శిశువు కడుపులో నుంచి ఎగిరి కొద్ది మీటర్ల దూరంగా గడ్డిలో పడింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించినప్పటికి శిశువు మృత్యుంజయురాలిగా మిగిలింది. ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్న కొద్దిమందికి శిశువు ఏడుపు వినపడింది. మహిళ మృతదేహానికి కొద్ది దూరంలో ఓ ఆడ శిశువును గుర్తించిన వారు పసికందును ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ మహిళకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. -
ట్రక్కు బోల్తా.. 19 మంది దుర్మరణం
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోరం చోటుచేసుకుంది. భావ్‌నగర్ జిల్లాలోని పిపవావ్ పోర్టు నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న ట్రక్కు ధోలేరా నగరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున బోల్తా కొట్టడంతో 19 మంది ప్రాణాలుకోల్పోయారు. ప్రమాద సమయంలో ట్రక్కులో 25 మంది కార్మికులు ప్రయాణిస్తున్నట్లు అహ్మదాబాద్ ఎస్పీ అసారి తెలిపారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో సిమెంట్ బస్తాల కింద నలిగిపోయి 19 మంది ప్రాణాలు విడిచారని ఆయన పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో పాటు 12 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడనీ, అతని కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
టొరంటొలో ఉన్మాది ఘాతుకం
-
కెనడాలో పాదచారులపై దూసుకెళ్లిన ట్రక్కు
టొరంటో: కెనడాలోని సెంట్రల్ టొరంటోలో ఓ తెలుపు రంగు ట్రక్కు సోమవారం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. పాదచారుల్ని ఢీకొట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడన్నారు. చివరికి ట్రక్కుతో పారిపోతున్న నిందితుడ్ని అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇక్కడి సబ్వే ను మూసివేసిన పోలీసులు.. ఘటనాస్థలికి రావొద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పలువురు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
సాక్షి, ముంబయి: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన మరవకముందే మహారాష్ట్రలోనూ మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఖండాలలోని పూణె-సతరా జాతీయ రహదారిపై ఓ ట్రక్ అదుపు తప్పి బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందారు. మరో 15మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా హిమాచల్ ప్రదేశ్ల కంగ్రా జిల్లా నూర్పూర్ ప్రాంతంలో నిన్న (సోమవారం) ఓ స్కూల్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా 10ఏళ్ల లోపు చిన్నారులే. -
వంతెన పైనుంచి పడ్డ ట్రక్కు
భావ్‌నగర్: పెళ్లి వేడుకలకు వెళ్తున్న ట్రక్కును మృత్యువు వెంటాడింది. అప్పటివరకు పెళ్లి కబుర్లతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. రక్తసిక్తమైన మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు బ్రిడ్జి నుంచి కిందికి పడిపోయింది. దీంతో 30 మందికిపైగా చనిపోయారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. 26 మంది ఘటనా స్థలిలోనే చనిపోయారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా తెలిపారు. ఉదయం 7:30–7:45 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, జిల్లా అధికారులు, స్థానిక గ్రామాల ప్రజలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు.‘బోతాడ్ జిల్లాలోని టోటమ్ గ్రామంలో పెళ్లికి హాజరయ్యేందుకు దాదాపు 60 మందితో అనిదా గ్రామం నుంచి ట్రక్కు బయలుదేరింది. భావ్‌నగర్–రాజ్‌కోట్ రహదారిపై రంగోలా వద్ద బ్రిడ్జిపై ముందు వెళ్తున్న వాహనాన్ని దాటబోయి.. అదుపుతప్పి కింద పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’ అని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ ఐఎం సయ్యద్ తెలిపారు. మరోవైపు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.