లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర సంఘటన జరిగింది. లోయలోకి అదుపు తప్పి డీసీఎం (ట్రక్కు) దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన ఇటావా జిల్లా రవెనెలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం..
బద్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రవెనె ప్రాంతంలో 50 మందికి పైగా ప్రయాణికులను వేసుకుని వెళ్తోంది. అయితే సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి చక్కర్‌నగర్ రోడ్డులోని లోయ ప్రాంతంలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారని ఆ ప్రాంత అదనపు ఎస్పీ ప్రశాంత్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. మృతులందరూ పురుషులేనని చెప్పారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.
చదవండి: ‘మేం చచ్చిపోతున్నాం.. మా పార్ట్స్ నా భార్యకు ఇవ్వండి’
చదవండి: సముద్ర గర్భంలో భూకంపం: తప్పిన సునామీ ముప్పు
Comments
Please login to add a commentAdd a comment