
కారును ఢీకొట్టిన అనంతరం ట్రక్కును ఆపాలని అక్కడున్న వారు వెంబడించినా డ్రైవర్ పట్టించుకోలేదు. వాహనాన్ని అలాగే వేగంగా పోనిచ్చాడు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురిలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ కారును ఢీకొట్టాడు. అనంతరం దాన్ని 500 మీటర్లు ట్రక్కుతోపాటే ఈడ్చుకెళ్లాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
#WATCH A truck dragged the car of SP District President Devendra Singh Yadav for about 500 meters in UP's Mainpuri pic.twitter.com/86qujRmENr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022
కారును ఢీకొట్టిన అనంతరం ట్రక్కును ఆపాలని అక్కడున్న వారు వెంబడించినా డ్రైవర్ పట్టించుకోలేదు. వాహనాన్ని అలాగే వేగంగా పోనిచ్చాడు. 500 మీటర్ల దూరం వెళ్లాక ఆగాడు. ట్రక్కు డ్రైవర్‌ను యూపీలోని ఇటావాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
చదవండి: బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!