SP leader
-
సైకిల్ పార్టీ కీలక నేతకు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఎమ్మెల్యే పదవికి ఎసరు!
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత ఆజాం ఖాన్‌కు షాక్ ఇచ్చింది కోర్టు. ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో దోషిగా తేల్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పుర్ కోర్టు ఆజాం ఖాన్‌కు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దాంతో పాటు రూ.25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, అప్పటి ఐఏఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆజాం ఖాన్‌పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. ఓ చీటింగ్ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఈ ఏడాది మే నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు ఆజాం ఖాన్. సుమారు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అయితే, మరోమారు ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలటం కీలకంగా మారింది. నేరం రుజువైన తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆజాం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆజాం ఖాన్‌పై అవినీత, దోపిడి వంటి 90 రకాల కేసులను నమోదు చేసింది. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
షాకింగ్.. ఎస్పీ నేత కారును ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లిన ట్రక్కు డ్రైవర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురిలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ కారును ఢీకొట్టాడు. అనంతరం దాన్ని 500 మీటర్లు ట్రక్కుతోపాటే ఈడ్చుకెళ్లాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #WATCH A truck dragged the car of SP District President Devendra Singh Yadav for about 500 meters in UP's Mainpuri pic.twitter.com/86qujRmENr — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022 కారును ఢీకొట్టిన అనంతరం ట్రక్కును ఆపాలని అక్కడున్న వారు వెంబడించినా డ్రైవర్ పట్టించుకోలేదు. వాహనాన్ని అలాగే వేగంగా పోనిచ్చాడు. 500 మీటర్ల దూరం వెళ్లాక ఆగాడు. ట్రక్కు డ్రైవర్‌ను యూపీలోని ఇటావాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు. చదవండి: బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్! -
ఎస్పీ నేత ఆజంఖాన్‌కు షాక్
లక్నో : ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ అసెంబ్లీకి ఆయన ఎన్నికను అలహాబాద్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. యూపీలోని రాంపూర్ జిల్లా సోర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అబ్దుల్లా ఆజం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ వయసు ధృవీకరణ పత్రాలను సమర్పించాడని పేర్కొంటూ ఆయన ఎన్నికను హైకోర్టు కొట్టివేసింది. 2017లో ఎన్నికలు నిర్వహించిన సమయంలో అబ్దుల్లా వయసు 25 సంవత్సరాల లోపేనని, నకిలీ పత్రాలతో ఆయన ఎన్నికల బరిలో దిగారని కోర్టు పేర్కొంది. ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. -
మావోయిస్టుల పంజా : ఎస్పీ నాయకుడి హత్య
చత్తీస్‌గఢ్ : మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. సమాజ్ వాదీ పార్టీ నేత సంతోష్ పూనెంను కాల్చి చంపారు. బీజాపూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు బుధవారం అందించిన సమాచారం ప్రకారం కాంట్రాక్టర్ , మరిముల్లాకు చెందిన సంతోష్ పూనెంను మంగళవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ సుధేరాజ్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు 15 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో ఈ ఘటన జరిగిట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించామని, వారి నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా సంతోస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పార్టీ తరపున బీజాపూర్‌నుంచి పోటీచేశారు.ప్రస్తుతం బస్తర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. -
ఎక్స్పోజింగ్ ఆపండి.. ఇంటర్నెట్ వద్దు
లక్నో: అత్యాచారాలపై యూపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యువతులు సరైన దుస్తులు వేసుకోకపోవటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రామ్‌శంకర్ విద్యార్థి వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత రామ్‌శంకర్ విద్యార్థి సోమవారం బల్లియాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ హాజరైన స్టూడెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ‘అమ్మాయిలు మీ బట్టల విషయంలో శ్రద్ధ తీసుకోండి. అందుకే మీపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్స్పోజింగ్ చేయటం ఆపండి. నిండైన దుస్తులు ధరించండి. మైనర్లకు సెల్ఫోన్లు ఎందుకో అర్థం కావటం లేదు. తల్లిదండ్రులు వారి నుంచి ఫోన్లను లాక్కోండి. నన్ను అడిగితే సెల్ఫోన్లు మొత్తానికే బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరతా. ఎందుకంటే ఫోన్ల ద్వారానే పోర్న్‌కు జనాలు అలవాటు పడిపోతున్నారు. ఆ ఉద్వేగంలో అత్యాచారాలకు పాల్పడుతున్నారు’ అని విద్యార్థి ప్రసంగించారు. అశ్లీలత తగ్గాలంటే అమ్మాయిల పట్ల అబ్బాయిలకు గౌరవ భావం పెరగాలి. అంటే వారి బంధాలు పవిత్రంగా ఉండాలి. అందుకే వారి మధ్య అన్నచెల్లెల బంధం నెలకొనాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తర్వాత ఆయన మీడియాకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. కాగా, అత్యాచారాలపై గతంలోనూ మరికొందరు నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలయ్యారు. ఉన్నావ్ అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌కు మద్ధతు ఇచ్చే కమ్రంలో మరో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలు పెరగిపోవటానికి తల్లిదండ్రలే కారణమని, పిల్లలను పట్టించుకోకపోవటం మూలంగానే ఇష్టమొచ్చినట్లు గాలికి తిరుగుతున్నారని సురేంద్ర వ్యాఖ్యానించారు. అమ్మాయిలను కాకుండా, పిల్లల తల్లులను ఎవరైనా రేప్ చేస్తారా? అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు. గతేడాది కర్ణాటక హోం మంత్రిగా ఉన్న కేజీ జార్జి గ్యాంగ్ రేప్‌కు సరికొత్త భాష్యం చెప్పారు. ఇద్దరు కలిసి చేస్తే అది సామూహిక అత్యాచారం అవదని, కనీసం నలుగురైదుగురు చేస్తేనే అది గ్యాంగ్ రేప్ కిందకు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక ఛండీగఢ్ లైంగిక వేధింపుల ఘటనపై స్పందించిన బీజేపీ డిప్యూటీ చీఫ్ రామ్‌వీర్ భట్టి.. అర్ధరాత్రిలో అమ్మాయిలకు రోడ్ల మీద ఏం పని? ఇంట్లో మూస్కోని కూర్చోకుండా.. అందుకే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు. -
అశ్లీలత తగ్గాలంటే అమ్మాయిల పట్ల గౌరవం పెరగాలి
-
బీజేపీ కుల రాజకీయాలు చేస్తోంది
-
మెమన్ భార్యకు సీటిమ్మన్నాడని వేటు
ముంబై: మహారాష్ట్రలోసమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ ఘోసి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు పార్టీ ఘూటుగా స్పందించింది. ముంబై బాంబు పేలుళ్లు నిందితుడు యాకుబ్ మెమన్‌కి గురువారమే ఉరి శిక్షను అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెమన్ భార్య రహీన్‌కు రాజ్యసభకు నామినేట్ చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు ఫరూక్ లేఖ రాశారు. ఫరూక్ వ్యాఖ్యలకి దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో పార్టీ నుంచి వెంటనే అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 'దేశంలోని ముస్లింల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలను పెద్దల సభలో వినిపించేందుకు ఓ గొంతు కావాలి.... ఈ నేపథ్యంలో రహీన్‌కు ఈ అవకాశం ఇస్తే... వారి కోసం ఆమె పోరాడుతుంది' అని ఘోసి లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై మహారాష్ట్రలోని పలు పార్టీలు నిప్పులు చెరిగాయి. మెమన్‌కు ఉరిశిక్షపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. దీన్ని రాజకీయం చేయొవద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఎస్పీ నాయకులకు హితవు పలికారు. అయినా ఈ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. దానికి మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందంటూ బీజేపీ నాయకుడు మాదవ్ బండార్ సమాజ్ వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు. అయితే ఈ విషయంపై ఎస్పీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అసిం అజ్మీ స్పందించారు. ఇది ఫరూక్ వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఈ అంశంపై ఆయన పార్టీని ఎప్పుడు సంప్రదించలేదన్నారు.